29, నవంబర్ 2011, మంగళవారం

ప్రత్యేక తెలంగాణ నినాదం ఆత్మహత్యా సదృశమైనది : జే.వీ.నర్సింగరావు(15.08.1969)

ఈ మధ్యకాలంలో వేర్పాటువాదులు తమ అబద్ధాల విషపత్రికలో, వారి మద్దతుదారులు కొంతమంది అంతర్జాలంలో చరిత్రను తిరగ రాసేస్తున్నారు. ఈ క్రమంలో 1956 లో  సీమాంధ్ర నాయకులు తెలంగాణ జిల్లాలను బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిపివేసుకొన్నారు అనే కథ ప్రచారం చేస్తున్నారు. పనిలోపని గా నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించాలని సకల జనులకు హుకం జారీ చేసారు. అయితే పాపం వీరి పిలుపుకి అటుకుడివైపు భాజపా నుండిగాని  ఇటుఎడమ వైపు సీపీఐ-ఎంఎల్ నుంచి గాని, తెరాస మినహా ప్రధాన రాజకీయ పక్షాల నుండి అంత స్పందన రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న సీపీఐ-ఎంఎల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే తాము నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించమని , తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని 1956లో వ్యక్తమైన ఆకాంక్షను విద్రోహంగా చూడడం చారిత్రక తప్పిదమవుతుందని బహిరంగంగానే ప్రకటించారు.

ఇప్పటికే ఈ బ్లాగ్లో వేర్పాటువాదుల చెప్పే అనేక అబద్ధాలను ఎండగట్టడం జరిగింది. వేర్పాటువాదులు తమ వాదనకు సాక్షాలుగా ప్రచారం చేసుకొనే వాటిలో 1955 లో హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండిన శ్రీ జే.వీ.నర్సింగరావు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమైనవి. ఇండియన్ ఎక్ప్రెస్ లో వచ్చిన ఈ న్యూస్ రిపోర్ట్ లో ఆయన కాంగ్రెస్ అధినాయకత్వం విశాలాంధ్రను బలవంతంగా ఎవరిపైనా రుద్దదనీ , తనకు రక్షణలపై (Safeguards for Telangana) నమ్మకం లేదనీ, హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయానికి తెలంగాణ ప్రజల మద్దతు లేదనీ, తొంభై శాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనీ సెలవిచ్చారు. అయితే ఆయన లెక్కలకు ఆధారాలు మాత్రం చూపలేదు.ప్రజలు ఎన్నుకొన్న శాసనసభ సభ్యులు విశాలాంధ్ర విషయంపై ఎన్నికలలో పోటీ చేయలేదు కాబట్టి వారి అభిప్రాయాలు చెల్లవని కూడా సెలవిచ్చారు.

అదలా ఉంచితే, పాపం మన నవయుగ వేర్పాటువాదులకు జే.వీ.నర్సింగరావు గారు తదనంతర కాలంలో వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలియదు. తెలిసినా దానిని బహిరంగ పరచరు.జే.వీ.నర్సింగరావు వ్యాఖ్యలను వేదవాక్కులుగా భావించే వారు ఈ క్రిందివాక్కులను కూడా బాగా అరిగించుకొంటారని ఆశిస్తున్నాను. 

మొదటగా 1969 ఏప్రిల్ 20 న హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసిన ప్రసంగంలో ఆయన శ్రీ పీ.వీ.నరసింహారావు తో పోటాపోటీగా సమైక్యవాదాన్ని సమర్ధించి ప్రత్యేక రాష్ట్రవాదానికి స్వస్తి చెప్పాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేసారు.

ఆంధ్ర జనత, ఏప్రిల్ 21,1969


అదే సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవాన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో అనేక పత్రికలకు విడుదల చేసిన సందేశంలో ప్రత్యేక తెలంగాణ నినాదం  ఆత్మహత్యా సదృశమైనదిగా పేర్కొన్నారు.త్వరలో ఆయన పూర్తి సందేశ పాఠాన్ని బ్లాగ్లో పోస్ట్ చేస్తాం.

ఆంధ్రజనత, ఆగష్టు 15,1969


విభజన పరిష్కారం కాదు !

ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ: నైజాం రాజ్యాన్ని అప్పటి కేంద్ర మంత్రి సర్దార్‌పటేల్ సైనిక చర్యతో పాకిస్థాన్‌లో కలవకుండా విమోచనం చేసి భారత్‌లో విలీనం చేసిన తర్వాత భాషా రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. నైజాంలోని మరాఠా మాట్లాడే ప్రాంతాలను కన్నడం మాట్లాడే ప్రాంతాలను విడదీసి, మహారాష్టల్రోను, కర్నాటకలోను కలిపారు. మిగిలిన తెలుగు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధప్రదేశ్ ఏర్పరిచారు. దానికి అప్పటి హైదరాబాద్ అసెంబ్లీలోని మెజారిటి తీర్మానంతోనే చేశారు. దాన్ని ‘టీరనీ ఆఫ్ మెజారిటి’అనో కుట్ర, మోసం అనో అప్పుడెవరూ గోల చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అధికారం, పదవులకోసం కొందరు రాజకీయవాదులు, తెలంగాణకు అన్యాయం జరిగిందని, వెనుకబడి అభివృద్ధి చెందలేదని తెలంగాణను వేరే రాష్ట్రంగా విడగొట్టాలని ఉద్యమం లేవదీశారు. దానిమీద శ్రీకృష్ణ కమిటీని వేస్తే, రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా తెలంగాణకు వేరే ప్రాంతీయ సంఘంతో కొంత ఆర్థిక ప్యాకేజి ఇచ్చి అభివృద్ధిచేయాలని నివేదిక ఇవ్వగా దాన్ని తెలంగాణవాదులు అంగీకరించలేదు. ఇపుడు ఆ వేర్పాటువాదులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1వ తేదీని విద్రోహ దినమని నల్లజెండాలు ఎగురవేశారు.

సీమాంధ్ర ధనికవర్గాలు తెలంగాణాను కొల్లగొడుతూ, తెలంగాణను విడిపోనివ్వరని కొందరి వాదన. తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అందుకు గతంలో వివిధ పదవులు పొందిన తెలంగాణ వారు కూడా కారణమే. మరి తెలంగాణలోని ధనిక వర్గాలు దోపిడి చేయనట్టుగా మాట్లాడ్డం విడ్డూరం. తెలంగాణ ప్రజా ఉద్యమమని, సమైక్యవాదం పెట్టుబడిదారుల డబ్బుతో నడిచే ఉద్యమమని తెలంగాణ వాదులు చిత్రిస్తున్నారు. ఉదారవాదులు కొందరు ఎందుకీ గోల తెలంగాణ ఇచ్చేస్తే పోలా అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ఇచ్చినా పదవుల పేచీతో అందులో కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయని ఫలానా జిల్లాలవారు తమకు అన్యాయం చేస్తున్నారని విడిపోవాలంటే చిన్న రాష్టవ్రాదులు ఒప్పుకొని మళ్లా విడగొడతారా? ఈమధ్యనే నెల రోజులు పైగా చేసిన సకల జనుల సమ్మెలో మద్యం దుకాణాలను, సినిమాలను మినహాయించడం, రైలు రోకోను మార్పుచేయడం విమర్శలకు తావిచ్చాయి. బలవంతపు బంద్‌లు సమ్మెలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, దిన కూలీలకు ఉపాధి లేకుండా చేయడం, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా శిక్షలొద్దనడం, పనిచేయకపోయినా జీతాలివ్వాలనడం ఈ ఉద్యమాలు నడిపే వారికే చెల్లింది! ఈ ఉద్యమ నేపథ్యంలో సాగదీయడం కేవలం ఈ రెండు ప్రాంతాల్లో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ లక్ష్యమని కొందరంటున్నారు. ఇక బిజెపి రాజకీయ ప్రయోజనాలకోసం తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తుండగా, పెద్ద రాష్ట్రాలకంటె చిన్న రాష్ట్రాల్లో పోలీసు బలగాలు తక్కువగా ఉంటాయి కనుక వారిని సులభంగా ఎదుర్కోవచ్చని మావోయిస్టులు చిన్న రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాన్ని బలపరుస్తున్నారని కొందరి అభిప్రాయం.

1969 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎందుకు తిరస్కరించారో గమనించాలి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో రాజధాని, సచివాలయం, శాసనసభా మందిరాలు, హైకోర్టు, ఉద్యోగులు వారికి ఇళ్లు, నదీ జలాలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి వుంటుంది. తెలంగాణ ఒక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్‌ను మూడు నాలుగు ముక్కలు చేయడం, ఇతర రాష్ట్రాల్లో కూడ చిన్న రాష్ట్రాల సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. దానికి బదులు రాష్ట్రాలను విడదీయడానికయ్యే పైన చెప్పిన ఖర్చులతో ఆ వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లను, ఆసుపత్రులను, త్రాగునీరు- సాగునీరు, రోడ్లు మొదలైన వాటిని సమకూరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణ లాయర్లు డిమాండ్ చేసినట్టు 42 శాతం పదవులు/ ఉద్యోగాలు తెలంగాణ వారికిచ్చి వాటిని అమలుచేయడానికి- ముఖ్యమంత్రి ఇతర మంత్రి పదవులను తెలంగాణలోని దళిత, ముస్లిం, బి.సి, స్ర్తి పురుషులకు ఇవ్వడం ద్వారా- మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించనియ్యాలి. దీనివల్ల వేర్పాటువాదం, విభజన సమస్యలు లేకుండా సామాజిక న్యాయం కూడ కలసి వస్తుంది. పశ్చిమ బెంగాల్లో ‘గూర్ఖా ల్యాండ్’ సమస్య పరిష్కార పద్ధతిని గురించి తెలుసుకోవాలి.

 - పాలంకి అంబరీషుడు

విఫల సమ్మె చాటిన జన మనోరథం

ఆంధ్రజ్యోతి జనవాక్యం: 'వేరు తెలంగాణ' తెలంగాణ ప్రాంతంలోని సకల జనుల మనోరథం కాదని ఇటీవలి 'సకల జనుల సమ్మె ఘోర వైఫల్యం' సువ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఈ 55 ఏళ్లలో ముఖ్యంగా ఒక దశాబ్దంగా 'చిచ్చు బుడ్డి' వలే పొంగి చల్లారుతున్న ఉద్యమం కేవలం అసంతృప్తులు, ఆత్మన్యూనతా వంచితులు, అధికార స్వార్థ వాంఛా పరులు కాలక్షేపానికి నడుపుతోన్నదేనని తిరుగు లేకుండా తేలిపోయింది. రావి నారాయణ రెడ్డి, రామానంద తీర్థ, రామకృష్ణ రావు తరాలవారూ, ఎంఎస్ రాజలింగం, పాగ పుల్లారెడ్డి తరాలవారూ, నర్రా మాధవరావు, ఎన్.రాజేశం, నాగేందర్, జనార్ధన్‌రెడ్డి, ముఖేష్ ప్రభృత తరాల వారూ ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండాలని అభిలషించేవారూ తెలంగాణ అంతటా ఎందరో వున్నారు.

దూషణ తిరస్కారాలకూ దౌర్జన్య హింసాకాండలకూ వెరచి వారు నోరుతెరవలేకున్నారు. 'ఆకాశిక్' రాజేశం వంటి వారు వెరపులేక రాస్తూనే ఉన్నారు. అది నిష్ఠుర నిజం. సాటి తోటి ఇతర ప్రాంతీయులను దుష్టులు, దుర్మార్గులు, దొంగలు, దోపిడీదారులు అని దుర్భాషలాడేవారికి ఈ 55 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిన వారిలో తెలంగాణ ప్రముఖులు ఎందరో వున్నారని తెలుసా, తెలియదా? వారంతా 'ఆత్మ గౌరవం' లేని 'చవటలూ, దద్దమ్మలే' అని వీరి ఉద్దేశమా? మరీ పదేళ్లుగా, కొత్తగా కొమ్ము లు వచ్చిన కోడెలు వలే చెలరేగుతున్నవారు అడ్డూ, అదుపూ లేకుండా నోరు పారవేసుకుంటూ వుండటాన్ని అసహ్యించుకుంటున్న వారు తెలంగాణ అంతటా ఎందరో వున్నారు.

ఏమంటే ఏమి తలనొప్పో అనే భీతితో ఉదాసీనంగా ఉంటున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వారు తమ అభిమానం వెల్లడిస్తూ వుండటమే ఇందుకు తార్కాణం. ఎన్నికల ఫలితాలను ఒక్కసారి పరకాయించి చూస్తే 'కుహనా' తెలంగాణవాదుల 'స్థితిగతులు' ఏమిటో సుస్పష్టం. 90 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ వారివలెనే వీరికీ 'పరాలంబనం' అనివార్యం అనేది కనపడేదే! నిన్న మొన్నటి ఉప ఎన్నిక కూడా, ఎంత ఉద్రేక ఆవేశాల మధ్య జరిగినా ఈ సంగతినే ధ్రువపరిచింది కదా! సకల జనులూ 'వేరు తెలంగాణ' కోరేవారైతే అట్లా ఎందుకు జరుగుతోంది? అన్ని ఆగాలనూ, ఆగడాలనూ సహిస్తూ ఉన్న వారు సమయం వచ్చినప్పుడు తమ మనోరథం, నిజాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లే కదా. మొన్నటి సకల జనుల సమ్మె కాలసర్పం వలె, 'ఆంధ్రజ్యోతి' సంపాదకుడు వివేకంతో సరిగ్గా సందర్భోచితంగా ఊహించినట్లు 'వైకుంఠపాళిలోని పెద్ద పామై' కాటు వేయటంతో కృత్రిమ ఉద్యమం కుదేలై కూలబడింది.

సకల ఆంధ్ర జనులకూ సత్యమైన 'పరమ పథం' ఏమిటో అందుకు అవసరమైన 'సోపానా'లేవో సావధానంగా ఆలోచించుకునే అవకాశం మరోసారి అందుకే లభించింది. అందుకే నర్రా మాధవరావూ, 'ఆకాశిక్' పత్రికా సంపాదక నిర్వాహకుడు ఎన్. రాజేశం ప్రభృతులే కాక కొండంత మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు కూడా 'సద్భావన'తో 'సన్మార్గ' అన్వేషణకు నడుం కట్టారు. 'తెలంగాణ అన్యాయానికి గురైంది. వలస వచ్చిన వారు దోచుకుపోతున్నారు. సహజ సంపద అంతా అన్యాక్రాంతం అయిపోతుంది' అనే అంగలార్పు ఎంత సబబో సమంజసమో చర్చలు, సమాలోచనల ద్వారా తేల్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. కొంచెం ఆలస్యమైనా ఇది వాంఛనీయ పరిణామం.

దీనికి ఆటంకాలు కలిగించటం, దౌర్జన్యానికి పాల్పడటం, సభలు కూడా జరుపుకోనివ్వక పోవడం అవివేకం అవుతుంది. ఆక్రోశంతో, ఆవేశకావేశాలతో 'ఉడికి'పోతున్నవారు ఇకనైనా తిట్లు, శాపనార్థాలు, అఘాయిత్యాలు, దౌర్జన్య హింసాకాండలు కట్టిపెట్టి శాంతియుత పరిష్కారానికి కలిసిరావటం అత్యవసరం.....ఆంధ్రప్రదేశ్‌లో సకల జనులు ఇతోధిక శాంతి, సౌభాగ్యాలు, అభ్యుదయం సాధించి, సమకూర్చుకోవచ్చు. ఇళ్లు పడగొట్టడం కష్టం కాకపోవచ్చు. కాని కట్టుకోవటం ఎంత కష్టమో గ్రహించాలి. జై సకలాంధ్ర జనులకూ జై. 

- మద్దాలి సత్యనారాయణ శర్మ, హైదరాబాద్

27, నవంబర్ 2011, ఆదివారం

మానవ హక్కుల సంఘాల నాయకులకు ప్రవాసాంధ్రుని మరో బహిరంగ లేఖ


నేను మొదట రాసిన ఉత్తరము కు మన మానవ హక్కుల వారు వెంటనే స్పందిస్తారని ఏమి ఆశించలేదు. ఎందుకంటే వారు కసాయి కర్కోటకులకు మాత్రమే మనవ హక్కులు వున్నాయని గుర్తించి వారి తరపున పోరాడి పోరాడి మన మానవ హక్కుల వారి హృదయాలు కూడా కొంచెము ఖఠినమైన మాట వాస్తవము. ఆ మధ్య ఒక మిత్రుడు నమస్తే పోలవరము లో వంట “చెరకు” ను కాపాడుకోవాలి అన్నట్లుగా వ్యాసము రాసినట్లు గుర్తు. అదే వ్యాసము లో పెనము వేడి ఎక్కింది అని రొట్టె ముక్క కోసము ప్రజలు ఎదురు చూస్తున్నారు అని కూడా రాయటము జరిగింది. మా మిత్రుడు కి తెలియనిది కాదు రొట్టె ముక్క పోలవరము రూపం లో వచ్చింది అని, కానీ అదే గోడ పత్రిక లో అలా రాస్తే బాగుండదు అని అనుకున్నాడేమో, వంట “చెరకు” పైన బాగా ద్రుష్టి పెట్టినట్లుంది.


ఈ వంట “చెరకు” ఉద్యమము పేరు చెప్పి రహదారి మీద వచ్చే పోయే వాహనాల మీద రాళ్ళు వేస్తాడు, ఎవ్వరిని ఎమైన అంటాడు ఎందుకంటే మన మానవ హక్కుల వారు తప్పకుండ కాపాడతారని తెల్సు కదా, మరి చదువుకున్నది వైద్య వృత్తి కదా ఆ మాత్రము తెలియకుండ వుంటుంది అని అనుకోను. ఈ “చెరకు” ఆంధ్ర వారి మీద మాత్రమే దాడి చెయ్యలేదు చివరికి ఖమ్మం జిల్లా నుండి వస్తున్న ప్రజల పైన కూడా దాడి చేసాడు. ఒక తల్లి తన మనుమరాలిని స్కూల్ లో చేర్పించుట కొరకు ఖమ్మం నుండి కారు లో వస్తుంటే వారి మీద దాడి చేస్తాడు. ఉద్యమము ముసుగు లో ఏదైనా చెయ్యవచ్చు కదా అందులో ఎలాగైన మన జేబు సంస్థ లు మానవ హక్కుల వారు ఉన్నారన్న విషయము “చెరకు” కు బాగానే తెల్సు కదా. అదే “చెరకు” కూతురి పెళ్లి కి మాత్రము కరుణించాలి అని కన్విన్సు చేయ్యబోతారు మన హక్కుల సోదరులు. కానీ, మనుమరాలి చదువు కోసము ఎక్కడి రెజిస్త్రేషనో తెలియక ఏదో కారును అద్దెకి తీసుకుని వస్తున్నందులకు వారి పైన ఏ మాత్రము జాలి చూపించనవసరము లేదని వారి చేతులు కాళ్ళు విరగ్గోట్టాల్సిందే అని అంటుంటే చూస్తూ ఊరుకుంటారు మన మానవ హక్కుల పేరు చెప్పుకునే వాళ్ళు. మన టీవీ లు ఏమో కొన్ని విషాద గీతాలు ఆయన మొఖము ను దగ్గిర గా చూపిస్తూ “చెరకు” మనసు ఎంత తియ్యనో, కూతురి పెండ్లి కోసము ఎంత విషాదాన్ని అనుబవిస్తున్నాడో అని పాడతారు. వైద్య వృత్తి చేస్తూ ప్రజలు గాయపడితే కట్లు కట్టాల్సిన వ్యక్తి అదే ప్రజల కాళ్ళు చేతులు విరగ్గోడతా వుంటే చూస్తూ ఉండాల్సిందే అని కూడా మన హక్కుల సోదరులు సెలవిస్తున్నారు

ఈ ప్రజాస్వామ్య వనము లో మనము వర్షాల కోసమో, వంట “చెరకు” కోసమో చెట్ల ను కాపాడుకోవాల్సిందే కానీ కలుపు చెట్టు కూడా వంట “చెరకు” అని పోజులు కొడుతుంటే ఈ కలుపు మొక్క ను తీసి మంచి మొక్క వెయ్యాల్సిందే అన్న విషయము వ్యవసాయ ఆదారిత దేశము లో జీవిస్తున్న మనకు తెలియంది కాదు. అయినా సరే నేను మన మానవ హక్కుల వారు చెప్పే మాటలే నమ్ముతాను కాబట్టి తప్పకుండ అది వంట చెరకు అయినా కలుపు మొక్క అయినా కాపాడుకోవాల్సిందే  ఎందుకంటే ఆ కలుపు మొక్క మనకు తెలియకుండా ఎదైనా వైద్యానికి వ్యాది మందుగా పనికి వస్తుందేమో పరిశోధన చెయ్యాలి కదా అందుకని మన రక్షణ వ్యవస్థ ఆ పనిలో వుందని అనుకుంటున్నాను.

పైన చెప్పిన వంట “చెరకు” కే మానవ హక్కులు వున్నప్పుడు లండన్ స్కూల్ అఫ్ ఎకానామిక్స్ లో PhD చేసిన Dr పరకాల కు మాత్రము హక్కులు లేవు అని అంటున్నారు.  ప్రతి పౌరుడు ను రక్షించుకోవాలి అని చట్టము చెప్తుంది కాబట్టి పేపర్ల లోనో , నమస్తే పోలవరము ల లాంటి గోడ పత్రికల ల లోనో వ్యాసాల లో రాయించుకునే “చెరకు” లాంటి వారితో పాటు అందరి హక్కులు కాపాడుకోటానికి మన మానవ హక్కుల వారు ఇప్పటికైన కృషి చేస్తారని ఆశిస్తాను. బావ ప్రకటన స్వేఛ్చ కొరకు ఎటువంటి ఆటంకాలు కలగకుండ మన హక్కుల సోదరులు పాటు పడాలి అని ప్రాధేయ పడుతున్నాను. ఇప్పటికైన మన మానవ హక్కుల హృదయాలు కరుగుతాయో లేక కలుపు మొక్క లను మాత్రమే కాపాడాలని చెప్తారో వారి ఆలోచన కే వదిలేద్దాము.

మనము ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడకుండా అశ్వథామ హతా హత: అనుకుంటూ వుంటే రేపు తెలంగాణా లో కాని ఆంధ్ర ప్రదేశ్ లో కాని ఏర్పడే రాజ్యాలు మన మానవ హక్కులని కాపాడి మనల్ని అందలము ఎక్కించి సింహాసనము పైన కూర్చొండబెడతారు అనుకోటము అంత అవివివేకము ఇంకొకటి లేదు అని చెప్పదలచుకున్నాను. ఈ రోజున మమత దీది ని చూస్తూనే వున్నాము అన్న సంగతి తెలియంది కాదు అలాగే మన చెన్నారెడ్డి, రాజ శేఖర్ రెడ్డి ప్రబుత్వాల లో కూడా మనకు బాగానే అవగతమైంది కదా. అలాగే జలగం వెంగల రావు గారి ప్రబుత్వం లో జరిగిన ఘోరాలు మనసున్న మానవుడు ఎవ్వరు మర్చిపోరు అనే అనుకుంటున్నాను. ఇప్పటికైన మన మానవ హక్కుల సోదరులు మేల్కొని సమాజము లోని ప్రతి పౌరుని మానవ హక్కులను కాపాడటానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను.
 నేను ఇంతవరకు, అంటే ఇలాంటి దాడులు చెయ్యకముందు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని పాకులకు విజ్ఞప్తి. నేను మన ప్రాంతీయ వాడిని కాబట్టి నాకు కొద్దో గొప్పో ప్రేమ ఈ ఉద్యమము మీద వుండేది అని చెప్పటానికి ఏ మాత్రము సందేహించను. కానీ, నేను మానవ హక్కుల ను హరించి వేసి ఎవరి మీదనో దండయాత్ర చేసి ఏదో సాదిద్దాము అన్న సిద్దాంతానికి వ్యతిరేకము అని మరి ఒక్కసారి తెలియ చేసుకుంటున్నాను. మానవ హక్కుల విఘాతము గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి ఆ కోణము లో మాత్రమే విజ్ఞులు అర్ధము చేసుకుని మానవ హక్కులకి భంగము కలగకుండా Dr పరకాల హక్కులని కాపాడవలసిందిగా మరొక్కసారి నా మిత్రులని కోరుకుంటున్నాను.


Vemsani Ramana

Portsmouth, Ohio,
USA

26, నవంబర్ 2011, శనివారం

రాష్ట్ర విచ్ఛిత్తి మంచిది కాదు : పీ.వీ.నరసింహారావు (20.04.1969)

 ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమావేశం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏప్రిల్ 20 ,1969 న జరిగింది. పీ వీ నరసింహారావు గారి ప్రసంగం ప్రారంభం కావడానికి ముందు కొంత మంది గందరగోళం సృష్టించతలపెట్టినా ఆయన  తొణకక,బెణకక తన వాణిని వినిపించారు.

ఆంధ్రపత్రిక, ఏప్రిల్ 21,1969: ఆంధ్ర దేశంలో ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ విచ్ఛిత్తి మంచిది కాదు, విశాల దృక్పథం కలిగి దేశంలో వెనుకబడిన ప్రాంతాల ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మనం రూపొందించుకొని అమలు చేయవలసి వుంది అని విద్యా మంత్రి శ్రీ పీ.వీ.నరసింహారావు నేడు గాంధీ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోని  తెలంగాణ సభ్యుల సమావేశంలో గంటకు పైగా చేసిన గంభీర ప్రసంగం లో ఉద్భోదించారు.

ప్రజాప్రతినిధులైన వారు ఉభయప్రాంతాలలో పర్యటించి, ఒకరి కష్టసుఖాలు ఒకరు గ్రహించి, సంస్కృతీ సమైక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో జరగవలసినంతగా ఈ పని జరుగలేదని విద్యా మంత్రి ఉద్గాటించారు.ఉద్యోగాల గూర్చి, అన్యాయాల గూర్చి  పరీక్షించి చూస్తే ఆరోపణలు అతిశయోక్తులని తేలిపోగలదని అన్నారు



ఆంధ్ర పత్రిక April 21,1969


ఆంధ్ర జనత, 21  ఏప్రిల్,1969 : 
 ప్రసంగపాఠం: ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతంలో ఉత్పన్నమైన సమస్య ఒక్క ఈ రాష్ట్రానికే పరిమితమైనది కాదు.యావత్ భారత దృష్టి నుండి దీనిని పరిశీలించ వలసివున్నది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఈ సమస్య దేశవ్యాప్తంగా వుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పట్ల అనేక దశాబ్దాల క్రిందటి నుంచీ కాంగ్రెస్ విశ్వాసంగా వుంటూవచ్చింది.1905 లో బెంగాల్ విభజన నాటినుంచీ కూడా భాషా ప్రాతిపదికను కాంగ్రెస్ స్వీకరిస్తూ, ప్రచారం చేస్తూ వచ్చింది.

భాషాప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రంలో జనసామాన్యాన్ని సమీకరించి,సంఘటిత మొనర్చి , సంఘీభావాన్ని సాధించి, వారి ఆదర్శాలు,ఆశయాలు,కోరికలు గ్రహించి నెరవేర్చడానికి మార్గం ........ఉంటుందని భారత జాతీయ కాంగ్రెస్ పదే పదే చెప్తూ వచ్చింది.

ఆ తర్వాతకూడా కేవలం ఒక్క భాషా ప్రాతిపదికమీదన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా...ఆర్ధిక పరిపాలన సౌలభ్యాది అంశాలను కూడా పరిగణించాలా అని ఆలోచించడం,ఈ ఇతర అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని భాషా రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించాలని భావించడం జరిగింది.ప్రాతిపదిక మాత్రం భాషే ఉంటుందన్న మౌలిక సిద్ధాంతం మాత్రం మారలేదు

ఆంధ్రప్రదేశ్ అవతరణ

1953 లో అఖిల భారత స్థాయిలో భాషారాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రాతిపదికనను పరిశీలించడానికి కేంద్రం ఒక కమిషన్ను నియమించింది. భాషా ప్రాతిపదికను 1953 లోజరిగిన హైదరాబాద్ మహాసభలో కూడా ఆమోదించడం జరిగింది.

ఆ కమిషన్ హైదరాబాద్ వచ్చింది.తెలంగాణలోను మిగత హైదరాబాదు రాష్ట్రంలోని  ఇతర ప్రాంతాలలో కూడా పర్యటించి సాక్ష్యాలు సేకరించింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉన్నదిఉన్నట్లుగానే ఉంచాలని చెప్పినవారు చాలా కొద్దిమంది. తెలుగు, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని హెచ్చుమంది సూచించారు.తెలుగు ప్రాంతాన్ని(తెలంగాణ ను )వేరుగా వుంచాలా, ఆంధ్ర రాష్ట్రంలో విలీనం  చేయాలా అన్న సమస్యపై కూడా కాంగ్రెస్ వాదులు తమ సాక్షాల్నిచ్చారు.ఆనాడు విలీనీకరణపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. అయితే చివరకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ సిద్ధాంతాన్ని అంగీకరించి,..హిందీ రాష్ట్రాలను అలాగే వుంచి మిగతా దేశాన్ని ఆయా భాషల ప్రాతిపదికపై భాషా రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. 1956 లో సమగ్ర ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది.

తిరిగి ఉద్భవించిన సమస్య

ఆ సమస్యే మళ్ళీ మనముందుకు వచ్చింది. రెండు విధాలవాదనలో మార్పు లేదు అయితే ఈ సమస్యను అఖిల భారత స్థాయిలో మాత్రమే జాతీయ దృష్టితో మాత్రమే  పరిశీలించి నిర్ణయం తీసుకోవలసివున్నది. ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితంగా నిర్ణయించే వీలులేదు.

యావద్భారతదేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్నా అది మాత్రం కుదిరేదికాదన్న నిర్ణయాన్ని ఇదివరకే సకల అంశాలు పరిశీలించి తీసుకోవడం జరిగింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ను రెండు మూడు ముక్కలు చేయాలా వద్దా అన్నది ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని చర్చించి తీసుకోవలసిన నిర్ణయం కాదు. అది అఖిల భారత స్థాయిలో జరుగవలసిన చర్చ. చరిత్రకందని కాలంలో ఎన్నడో అంగ,వంగ, కళింగ..ఇలా 56 రాష్ట్రాలు, రాజ్యాలు భారతదేశంలో ఉండేవి.ఇవాళ మళ్ళీ అన్ని రాష్ట్రాలు కావాలంటే అఖిల భారత స్థాయిలోనే చర్చ జరగాలి.

అయితే ఈ నిర్ణయం జరిగిపోయింది.విశాలమైన రాష్ట్రంలో నైసర్గిక సంపదను ఇతర సౌకర్యాలను గరిష్ట స్థాయిలో హెచ్చు ప్రయోజనం సాధించుకోవడానికి వినియోగించుకొని గొప్ప అభివృద్ధిని సాధించుకోవచ్చునని,ప్రజలకు అవకాశాలు బాగా వుంటాయని భావించడం జరిగింది.అందువల్ల దేశం యాభైఆరో, అరవయ్యో ముక్కలైతే తప్ప ఆంధ్ర ప్రదేశ్ ముక్కలై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదు, వచ్చినా అప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం వస్తుందో రెండు ముక్కలుగా రెండు తెలంగాణ రాష్ట్రాలు వస్తాయో చెప్పలేము

పన్నెండేళ్ళ చరిత్ర

గత పన్నెండేళ్లలో మనకు అన్యాయం జరిగిందని అభిప్రాయం వచ్చింది. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి వుంది. సమైక్యత అన్నది విలీనం అన్నది ఒక కాగితంపై సంతకం చేసినంతమాత్రం చేత యాదృచ్చికంగా , మానవ కృషి అవసరం లేకుండా రాదు. ప్రజల సమైక్యతకు ఇరు ప్రాంతాల ప్రజల విలీనీకరణ, ఏకీకరణకు ఉద్దేశపూర్వక చర్యలు తీసుకొన్నట్లు లేవు.ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఇది జరుగలేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వుండిన శ్రీ యు యెన్ దేబార్ గారిని నేను ఇటీవల కలుసుకొన్నప్పుడు వారు కూడా ఇదే చెప్పారు.విలీనీకరణ అయిపోయిందన్న ఉదాసీన వైఖరితో వారున్నారు,ప్రజల విలీనీకరణ చట్టాల ద్వారా రాదు,చాలా చర్యలు తీసుకోవలసి వుంది,మీరు చర్యలు తీసుకోండి,తెలంగాణ ఉద్యమం ఆందోళన కలిగిస్తున్నది అని వారు చెప్పారు.

నేడు మనం మొత్తం చరిత్రనంతా సింహావలోకనం చేస్తే, ఈ చర్యల అవసరం మనకు స్పష్టమవుతుంది.
స్కాట్లాండ్ ఇంగ్లాండ్ విలీనమై 250 ఏళ్ళు గడిచినా ఇంకా ప్రజలలో సమైక్యతా భావం రాలేదు.కావున దీనిపై మనం తొందరపడడం మంచిది కాదు. నిర్ణయాన్ని మార్చుకొనరాదు.స్కాట్లాండ్ ఇంగ్లాండ్ విలీనీకరణ జరిగిన అర్థరాత్రి జరిగిన సభలో స్కాట్లాండ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఈ విలీనీకరణ వల్ల ఉత్పన్నం కానున్న అనేక సమస్యల గురించి ముందే హెచ్చరించడం జరిగింది.అప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని మాట్లాడుతూ సంవత్సరంలోపల ఈ సమస్యలను పరిష్కరించి పార్లమెంట్ సభ్యుడిని సంతృప్తి పరచి, మొత్తం స్కాట్లాండ్ ప్రజలను సంతృప్తి పరచడానికి చర్యలు తీసుకొంటానని వాగ్దానం చేసారట.

అందువల్ల సానుభూతితో చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించుకోవలసి వుంది. అంతేకాని,కేవలం 12 సంవత్సరాల అనుభవంతో, ఆవేశంతో నిరాశ చెంది మళ్ళీ విడిపోదామనుకోవడం తొందరపాటు అవుతుంది. అందుకు జరుగుతున్న ఉద్యమాన్నితమకు  నైవేద్యం పెట్టుకొని, మనల్ని అనుకరించమని చెప్పడం కూడా సమంజసం కాదు

సాంస్కృతిక ప్రాతిపదిక పై నాకు అచంచలమైన విశ్వాసం వుంది. సాంస్కృతికంగా ఆంధ్ర -తెలంగాణ ప్రాంతాలను సమైక్యం చేయడానికి విలీనం చేయడానికి ప్రయత్నం జరగలేదు.దేశంలో అనేక విచ్చిన్నకర ధోరణులకు కూడా ఇదే కారణం. మన పార్లమెంట్ సభ్యులు ఉభయప్రాంతాలవారూ పార్లమెంట్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురించి, పోచంపాడు ప్రాజెక్టు గురించి అడుగుతారు కాని దేశం గురించి అడగరు.మన శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలు గురించి అడుగుతారు.వారి ఆలోచనలు వారి వారి నియోజకవర్గాలకు పరిమితమయిపోయాయి.జిల్లా పరిషత్ సభ్యుల ఆలోచనలు వారి వారి బ్లాకులకు పరిమితమైపోయాయి. విశాల దృక్పథం లేకపోవడమే నేటి దేశ పరిస్థితికి కారణం.ఇందులో మన బాధ్యత కూడా ఎంతవుంది అని మనమందరం ఆత్మ పరిశీలన చేసుకోవలసివుంది. సాంస్కృతికంగా చూసినా,ఆర్థికంగా చూసినా ఇది అభివృద్ధికి అవరోధం,అసంతృప్తికి దారి తీస్తుంది.

స్వార్థ ప్రయోజనాలు

మనకీ నేడు స్వార్థ ప్రయోజనాలు తయారయ్యాయి. వెనుకబడిన ప్రాంతంఅని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.వెనుకబడిన ప్రాంతాల సమస్యలు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే అనే చైతన్యం రాలేదు. రాయలసీమ,కల్యాణదుర్గం,పొదిరి(నెల్లూరు జిల్లా )వంటి ప్రాంతాలు వెళ్లి చూస్తే మన తెలంగాణాయే మేలనిపిస్తుంది.

పెద్దమనుషుల ఒప్పందం

1956 లో పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.ఆ ఒప్పందం ఎంతవరకూ అమలు జరిగిందో చూడాలి.ఆ ఒప్పందం యొక్క భావము,లక్ష్యము ముఖ్యం. అన్ని సమస్యలకు ఆ ఒప్పందం పరిష్కారం కాదు.అది ఒక ప్రాథమిక పత్రమే , తుది పత్రమనుకోవడం పొరబాటు. 1956 లో ఊహించగలిగినంత మేరకు ఊహించి ఆ సూత్రాలను ఆ ఒప్పందంలో చేర్చారు.భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు ఆ ఒప్పందం పరిష్కారం కాదు. అందువల్ల భావం ముఖ్యం గాని అందులోని భౌతిక అర్థం ముఖ్యం కాదు. భావం వుంటే ఒప్పందమే అనవసరం. ఈ ఒప్పందానొక తుది పత్రంగా, దానికొక జటిలత్వాన్ని ఇచ్చి అర్థం చేసుకోలేకపోయాం.భావబలం వుంటే అక్షరాలా ఏముందన్నదాన్ని పట్టించుకోనవసరం వుండదు. ఆ భావాన్ని ఆచరణలో పెట్టడంలో లోపాలు గురించి ఆ వైపునా, ఈ వైపునా ఎంతైనా చెప్పవచ్చు. జనవరి 19 వ తేదీ అఖిలపక్ష ఒప్పందంలో ప్రభుత్వం ఈ లోపాలను స్వయంగా ఒప్పుకున్నది. ఇదొక పెద్ద కన్సెషన్ అయినప్పటికీ పర్యవసానం తద్విరుద్ధంగా వచ్చింది.పొరపాటును ఒప్పుకుంటే, ప్రజలు సంతృప్తి పడి భవిష్యత్తు గురించిన విశ్వాసం ఏర్పడుతుందనుకొన్నాము. కాని ప్రజాహృదయాల్ని సక్రమంగా అవగాహన చేసుకోనలేకపోయారేమోనన్నదే ప్రశ్న.

ముల్కి నిబంధనలు

హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ముల్కి నిబంధనలు ఉండేవి కాని ఆ రోజుల్లో ముల్కి సర్టిఫికేట్ ఇచ్చేవారే నాన్ ముల్కీలు. అందువల్ల న్యాయం జరుగలేదు.పెద్ద మనుషుల ఒప్పందంవల్ల 1956 లో రక్షణలు వచ్చాయి. వెనుకబడినతనం వల్ల రాలేదు.వెనుకబడినతనం వల్లనే వస్తే మనకన్నా వెనుకబడివున్న ప్రాంతాలకూ వచ్చేవి.మైసూర్ లో విలీనమైన కర్ణాటక ప్రాంతానికి రాలేదు, మహారాష్ట్రలో విలీనమైన మరాట్వాడా ప్రాంతానికి రాలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతానికి రాలేదు.పెద్ద మనుషుల ఒప్పందం నుంచి మనకు మాత్రమే వచ్చింది.ఆ ఒప్పందాన్ని కేంద్రం గౌరవించడం వల్లనే వచ్చింది. ఈ ఒప్పందం భగ్నమైతే రక్షణలు వుండవు. పన్నెండు సంవత్సరాల కాలంలో జరిగిన లోపాల పరిమాణాన్ని అంచనా వేయాలి.దాని ఫలితాన్ని అంచనా వేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల సంఘం నివేదికలలో లోపాలే కనిపిస్తాయి.లోపాలు చూపించడమే వాటి పని, అందుకనే అన్నీ లోపాలే వున్నాయనలేము కదా.అలాగే ప్రాంతీయ సంఘం నివేదికలలో లోపాలు గురించే వుంటుంది. ఎందుచేతనంటే  వున్న లోపాలను చూపించడమే కమిటీ పని. అంత మాత్రాన అన్ని లోపాలే జరిగాయనుకోరాదు.

తెలంగాణకు చెందిన శ్రీ విటల్ రావు గారు జిల్లాల్లో తిరిగి అంకెల వివరాలు సేకరించారు.నాన్ ముల్కీల సంఖ్య నిచ్చారు. దాదాపు 5200 మంది నాన్ ముల్కీలు ముల్కీలకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో వున్నట్లు తేలింది. ఇందులో 1600 మంది ఉపాధ్యాయులు ,1800  మంది నర్సులు,ఆగ్జిలరీ నర్సులు, మిడ్ వైఫ్లు, 400 మంది స్టెనోగ్రాఫర్లు, 300  మంది ప్యూన్లు మిగిలినవారు ఇతరులు.లోపం యొక్క పరిమాణాన్ని ఆలోచించక తప్పదు. ఈ 1600 మంది ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ వారే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు లభించకపోవడం వల్లనే చేర్చుకొన్నారు. 1956 తర్వాత శిక్షణ అవకాశాలను ఎంతో అభివృద్ధి చేసుకొన్నాము.మరో రెండు శిక్షణ కళాశాలలు ఈ మే నుంచి ప్రారంభమవుతున్నాయి.భవిష్యత్తులో ఈ లోపం జరుగదు. నర్సులున్నారంటే దేశమంతా కేరళ నర్సులున్నారు. స్థానికంగా మహిళలు లభించక కేరళవారిని నియమించుకోవలసి వచ్చింది . ఇప్పుడు ప్రభుత్వము, ఆంధ్రమహిళాసభ నర్సుల శిక్షణా సౌకర్యాలను పెంపొందిస్తున్నాయి.అయినా ఎక్కువమంది ఈ సౌకర్యాల్ని ఉపయోగించుకోవడం లేదు.స్టెనోగ్రాఫర్లు ఆనాడు ఇక్కడ లభించలేదు. సౌకర్యాలను ఉపయోగపరచుకొనే చైతన్యాన్ని కూడా వెనుకబడిన ప్రాంతాల్లో కలిగించవలసివుంటుంది.

ఇవన్నీ తీసేస్తే ఇక 1200 మంది మేరకు ముల్కీలకు రావలసిన ఉద్యోగాలు రాలేదని తేలుతుంది. తెలంగాణ ప్రాంతంలో లక్షాఏడు వేల ముల్కీ ఉద్యోగాలలో ఈ 1200 ఎంత అని ఆలోచించాలి.

మిగులు నిధులను ఉన్నతాధికారుల సంఘం నిర్ణయించనున్నది కనుక ఇప్పుడు చర్చించడం సమంజసం కాదనుకొంటాను.

లోపాలు ఎందుకు జరిగాయని ఆలోచిద్దాం. పరిపాలన రంగంలో లోపాలు సర్వత్రా వుంటాయి.రక్షణల అమలును అధికారులకు అప్పగించాము.అందువల్ల లోపాలు అమలు జరిగాయి. సమీక్షాయంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసుకొంటున్నాము కనుక, అవకాశం ఇచ్చి చూడడం మన ధర్మం 






వాదన కాని వాదం పలాయనవాదం

విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులతో చర్చకు సిద్ధం అని బహిరంగ లేఖ రాసిన TNF మనసు మార్చుకున్నట్లుంది. వారి లేఖకు విశాలాంధ్రమహాసభ తరపున పరకాల ప్రభాకర్ గారు బదులు ఇచ్చిన సంగతి విదితమే ( http://visalandhra.blogspot.com/2011/11/blog-post_22.html ) ఇప్పుడేమో వారు విశాలాంధ్రను కోరుకొనే వాళ్ళు తెలంగాణాలో ఎవరు ఉన్నారో చూపమని అభ్యంతరకరమైన పదజాలంతో ప్రభాకర్ గారి  పేస్ బుక్ వాల్ పై ఒక ప్రత్యుత్తరాన్ని  పోస్ట్ చేసారు. దానిని  చదివిన తర్వాత అసలు వారికి  ఏ విధమైన నిర్మాణాత్మకమైన చర్చలోనూ పాల్గొనే ఉద్దేశంలేదని అనిపిస్తుంది. మీరే చదివి చూడండి

మీ అభినందలకు, మా ప్రతి అభివందనాలు..

సమైక్య వాదం అన్ని ప్రాంతాలలోనూ వున్నది అని చెప్పి, తెలంగాణా ప్రాంతం వాళ్ళు కూడా సమైక్యంద్ర కోరుకుంటున్నారు అని చెప్పడంలో, మీ అర్థం ఏంటి, మీ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నమే కదా..?

సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళు తెలంగాణా లో వున్నారు అనేది పచ్చి అబద్ధమే అని మేము భావిస్తున్నాం, ఇంత వరకు మేము చూడలేదు, వినలేదు. దానికి మీ దగ్గర ఆధారాలు, వెక్తుల పేర్లు వుంటే బయట పెట్టండి. తెలంగాణా ప్రాంత ప్రజల్లో సమైక్యంద్ర వాదులంటే, మీ తెలుగు రూట్స్ చక్రవర్తి గురించేనా మీరు మాట్లడేది, ముందు వాడి రూట్స్ ఎక్కడివో చెప్పమనండి. సమైక్య వాదం అన్ని ప్రాంతాల్లో వుంది అని, మా తెలంగాణా ప్రజలని మబ్బే పెట్టడం కోసమే కదా మీరు ఈలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.

సమైక్యంద్ర వాదులు అన్ని ప్రాంతాల్లో వున్నారో లేదో మీరే నిరూపించాలి, కాని విభజన వాదులు ఆంధ్ర లో, తెలంగాణా లో వున్నారు అని మీరు గ్రహించాలి, అది మా సొంత అభిప్రాయం కాదు, ఆంధ్ర జే.ఏ.సి. చేసిన ఇటివల చేసిన వాక్యలు, మద్దతు చుడండి “రాష్ట్ర విభజన ప్రజాస్వామ్య ఆకాంక్ష”. ఆంధ్ర జే.ఏ.సి. వారికి మా తెలంగాణా ప్రాంత ప్రజల నుండి కృతజ్ఞతలు.

మా మట్టుకు అయితే రాష్ట్ర విభజన అనేది ఆత్మ గౌరవ పోరాటం., మా ఉనికి కోసం పోరాటం, మా స్వపరిపాలన కోసం పోరాటం.

సమైక్యంద్ర పాలనలో మేము గ్రహించింది ఏమిటి అంటే, మీలాంటి ఆంధ్ర మేధావులతో, ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి, చెప్పి , ఆ అబద్ధాన్ని నిజం చేసి, తెలంగాణా ప్రజల మీద రుద్దే తత్వం ఎప్పటి నుండో అనుసరిస్తున్న పాత సూత్రం.

దానికి నిదర్శనం మీ రాతలు చూస్తే అర్థం కూడా అయ్యింది, విశాలాంద్ర వాదాలు, 1956 లో, 1969 లో, మరియు 1972 లో విన పడ్డాయి అని.. ఇప్పుడు 2011 లో కూడా వినిపిస్తున్నాయి (మీతో).. 1972 జై ఆంధ్ర ఉద్యమం ప్రత్యేక వాదమని అని గుర్తించాలి, మీరు సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసిన, ప్రత్యేక వాదం కోసం ఉద్యమం చేసిన మా తెలంగాణా రాష్ట్ర సాధనకు అడ్డ పుల్ల వేసేందుకే అని గత చరిత్ర చెప్పుతుంది.. బిన్న అభిప్రాయాలూ ఆంధ్ర ప్రాంతం లో వున్నాయి అని గ్రహించండి. అంతెందుకు ఇదువరకు మీకున్న అభిప్రాయాలకు, ఇప్పటి అభిప్రాయాల్లో తేడా వుందో లేదో గ్రహించాలి, సొంత ఇంట్లో ఎకబిప్రాయం తెచ్చుకోండి, విభజన వాదమా? విశాలాంద్ర వాదమా? మా తెలంగాణా ప్రాంతలో అప్పటికి ఇప్పటికి ఒకటే మాట, ఒకే బాట.. తెలంగాణా రాష్ట్ర సాధన. ఇట్లాంటి అబద్ధాలను చెప్పి నమ్మిచ్చే ప్రయత్నాలు మానుకోవాలి.

సమైక్యంద్ర బ్రోకర్లు ఇంతకు మించి చెప్పేది ఏముంది, రాష్ట్రం సమైక్యంగా వుండాలి, తెలంగాణాను ఇంతకు ఇంత దోచుకోవాలి, ఇక్కడ వున్న వరనులను, నీళ్ళను, ఉద్యోగ అవకాశాల మీద దోపిడీకి అలవాటు పడ్డ ప్రానమాయే ,ఇప్పటికి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు ఏమయిపోవాలి, తెలంగాణా బంగారు బాతును ఎందుకు వదలాలి?ఇక్కడ వనరులను, విద్య , ఉద్యోగ అవకాశాలను కొల్ల గొట్టడమే కదా సమైక్యాంధ్ర ఏకైక అజెండా, మీ వ్యాపారాలకు, మీ పెట్టుబడుల లావా దేవిలకే కదా మీకు ఈ తెలంగాణా ప్రజలు, వాళ్ళకున్న వనరులు.

ఇదంతా సుత్తి అనసవరం, మీ అజెండా మీకుంది , మా అజెండా మాకు వుంది, పాయింట్ కి వద్దాం, “మీరు అన్నట్టు విశాలాంద్ర కోరుకునే వారు తెలంగాణా లోను వున్నారు”.. ఆ తెలంగాణా వాసులేవ్వరో బయటికి రమ్మనండి, వాళ్ళ రూట్స్ ఎక్కడివో చెప్పమను, జనం లోకి రమ్మను, అంతెందుకు నేటిజేన్స్ ముందుకు రమ్మనండి… విశాలాంద్ర కు జై కొట్టే తెలంగాణా ప్రాంతం వాళ్ళ ఉనికిని నిరుపించుకోమనండి.

జై తెలంగాణా
తెలంగాణా నేటిజేన్స్ ఫోరం
TNF – Telangana Netizens Forum

23, నవంబర్ 2011, బుధవారం

రైలు, రాస్తారోకోలపై సుప్రీం కన్నెర్ర

 విశాలాంధ్ర దినపత్రిక : రైలు/రోడ్డు దిగ్బంధనాలపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసింది. రైలు, రోడ్డుపై రాకపోకలను అడ్డుకునేందుకు ప్రయత్నించే ఆందోళనకారులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. రైలు, రోడ్డు రాకపోకలను అడ్డుకోవటం ద్వారా సాధారణ పౌరుల కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారని, ఫలితంగా ప్రజలు చెప్పలేని ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ జి.ఎస్‌. సంఘ్వీ, జస్టిస్‌ ఎస్‌.డి. ముఖోపా ధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని ఎదుర్కొనేందుకు పటిష్ట వంతమైన సలహాలు యిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మూడు వారాల గడువు యిచ్చింది. ఈ విధంగా చేయటంలో విఫలమైతే ఆందోళన కారులను క్రిమినల్‌ నేరం క్రింద శిక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిం ది. ''రైలు, రాస్తారోకో ఆందోళనకు పిలుపు యిచ్చే వారిని తప్పనిసరిగా శిక్షించవలసిందిగా మేయు ఆదేశాలు జారీ చేయాల్సి వుంటుంది. వారికి వ్యతిరేకంగా పెట్టే కేసులను మూడు మాసాలలో పరిష్కరించాలి. ఇందు కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని మేము భావిస్తున్నాం'' అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

విభజనుల బోషాణాల గుట్టు

ఆంధ్ర ప్రభ: ఇంతకాలంగా, తెలిసీ తెలియకుండా నిర్లిప్తంగా ఉండిపోయినందుకు మనందరం విస్తుపోయేలా విచారించేలా సిగ్గుపడేలా ఇటీవలి కాలంలో ఆధారాలతో సహా మనదేశంలోని, రాష్ట్రంలోని 'ఘనుల' నేతల అక్రమార్జన అధికార దుర్వినియోగ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి! లక్షల కోట్ల కుంభకోణాలు 2జి, కెజి బేసిన్‌ వంటి వాటితో బాటు ఎన్నో అక్రమాల అస్తిపంజరాలు ఒక్కోటీ రాజకీయ రక్షణ రహస్య బీరువాల నుంచి తొంగిచూస్తూ మనల్ని వెక్కిరిస్తున్నాయి. (మన రాష్ట్రానికే పరిమితమైనవి తెలుగులోనే వెక్కిరిస్తున్నాయి!) స్విస్‌, ఇతర విదేశీ బ్యాంకుల గోప్యతా లాకర్లలోని అపార ధనరాసుల, సిరుల గుట్లు మొత్తమంతా కాకపోయినా, బిట్లు బిట్లుగా, బహిర్గతమవుతున్నాయి.

ఇక్కడి అవినీతి, అధికార దుర్వినియోగ నల్లధనం తక్కువేం కాదు. దొంగ కంపెనీల ఓడలలో విదేశీయానం చేసి, అక్రమాల భూమి కూడా గుండ్రంగా ఉంటుందని నిరూపించే చందాన తిరిగి తిరిగి మన తీరానికే చేరుకుని, రంగు మార్చుకుని, దేశీ పారిశ్రామిక రాజకీయ చక్రవర్తుల కుటుంబ కర్మాగారాలకు, దురాశా కోశాగారాలకు ఈ ధనం చేరుకుంటున్న చోద్యాలూ చూస్తున్నాం -'హవాలా' తో దేశాన్ని దివాలా తీయించడానికి సంకోచించని సుగుణాభిరాముల లీలల్నీ వింటున్నాం -అలాంటి వాళ్లలో 'మనోళ్లూ' (పి.వి.గారి భావంలో 'తెలుగోళ్లు') ఉన్నారని తెలిసి సిగ్గుపడుతున్నాం -ఐతే, ఇదంతా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీల చర్యల వలన ఇప్పుడు కూడా మొద్దు నిద్రలోనే ఉండిపోతే కుదరదులే అనే అభిప్రాయంతోనో లేదా జడి విమర్శల దాడి గోలకు కొంచెం మెలకువ తెచ్చుకొన్న రాజ్యాంగ, నిఘా, పరిశోధనా దర్యాప్తు వ్యవస్థలు చేపట్టిన చర్యల వల్లనో సాధ్యమైంది. మన అదృష్టం కొద్దీ వైరి రాజకీయ వర్గాలు ఒకరిగుట్టు నొకరు రట్టు చేసుకోవటం వలన కూడా ఇది కొంతవరకు సుసాధ్యమైందని చెప్పవచ్చు -ఏమైతేనేం, మనం సంతోషించదగ్గ పరిణామాలు కొన్నైనా సంభవించాయి. కిలాడీ 'కల్మాడీ ఆటకట్టింది -'2జి రాజా' జైల్లో ఏడుపు బాజా వాయించుకుంటున్నాడు -కనిమొళి కటకటాలపాలైంది. రెండు రాష్ట్రాల్లో అక్రమాల గాలి స్తంభించింది. కొందరు ఐఏఎస్‌ అధికారులకూ, శ్రీకృష్ణ జన్మస్థాన ప్రవేశం ప్రాప్తించింది. మన హైకోర్టు పుణ్యాన మరుగున పడిపోతాయనుకున్న ఘనత వహించిన తెలుగునేతల ఘనకార్యాలు కొన్ని సిబిఐ విచారణ అరుగెక్కాయి. వీరి బండారం త్వరలో పబ్లిక్‌ రోడ్డున పడటం ఖాయంగా కనిపిస్తోంది.

సుఖ్‌రామ్‌కి శిక్ష వేశారు. అంబానీల చమురు వదలబోతోంది. ఈ నేపథ్యంలో విభజనోద్యమ తీరుతెన్నులను, ఈ ప్రాంతపు రాజకీయ ఉద్యోగవర్గాల నేతల అసలు ధ్యేయాల్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న తెలంగాణ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరముంది. ఏమాత్రం అనుమానం లేదు. భారతీయ ప్రజలందరి లానే 'మనోళ్లు' కూడా అందరు అక్రమార్కుల భరతం పట్టాలన్న అభిప్రాయంతోనే ఉన్నారు. ఐతే దేశంలోని రాష్ట్రంలోని, అన్ని కుంభకోణాలతో బాటు ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం పేరిట జరిగిన అక్రమార్జనల గుట్టు కూడా రట్టుకావాలని కోరుకుంటున్నారు. వీటిపైన కూడా మీడియా, న్యాయవ్యవస్థ, పరిశోధనా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని, నిజానిజాల నిగ్గు తేల్చాలని అభిలషిస్తున్నారు. నిజానికి ఉద్యమ క్రమంలో జరిగిన బలవంతపు చందాల దందాలు, ముడుపుల సొంతమూటలు, కుటుంబ సంపద విస్తరణల గురించి ప్రజలతోబాటు ప్రభుత్వ వ్యవస్థలకూ ఎంతోకొంత గత కొంతకాలంగా తెలుసు. ఈ విషయాలేవో కేవలం సమైక్య వాదులో లేక ఇతర ఉద్యమ వ్యతిరేకులో అక్కసుతో చేసిన ఉత్తుత్తి అభాండాలు కానేకావు. ఇతర గుడారాలలో వేరు కుంపట్లు పెట్టుకుని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీ కన్న ఎక్కువ క్రియాశీలంగా పాల్గొంటున్న విభజనవాదులే విశ్వసించి చేస్తున్న ఆరోపణలు. అధిక సంఖ్యాకులు నిజాలుగా భావిస్తున్న విమర్శలు.

ఆ మాటకొస్తే ప్రస్తుతానికి ఎందుకనో నిష్క్రియాయోగాన్ని ఆశ్రయించి ఉన్న ప్రభుత్వ నిఘా పరిశోధనా దర్యాప్తు సంస్థల వద్ద ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలిప్పటికే సమృద్ధిగా ఉన్నాయి -అందుకే ఈ అస్తిపంజరాలన్నిటినీ ప్రజలకు పారదర్శకంగా సంపూర్ణంగా చూపించాల్సిన అవసరముంది. ఆ విధమైన సమగ్ర పరిశోధనానంతర ప్రదర్శనార్హ అస్తిపంజరాలేమిటో, అంశాలేమిటో క్లుప్తంగా క్రోడీకరించి చెప్పుకుందామా -

(1) ఒక రాజకీయ పార్టీ 2004, 2009 ఎన్నికలలో వేర్వేరు పార్టీలతో జతకట్టి అందుకు మూల్యంగా కొన్ని వందల కోట్ల నగదు, లగ్జరీ వాహనాలు తీసుకున్నదని, కాని ఉద్దేశించబడిన అంటే పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి కొంతమేరకైనా ఈయకుండా, ఆ సొమ్మంతా కుటుంబ సంపదగా పరిగణించి అంతర్జాతీయ నౌకా వ్యాపారానికి సొంత పెట్టుబడిగా వాడారన్నది రాష్ట్రంలో చాలామందికి తెలిసిన రహస్యం! ఆ ఎన్నికలలో కుటుంబ సభ్యులు మినహా, ఇతర పార్టీ అభ్యర్థులు టిక్కెట్ల కొనుక్కోవటంతో బాటు ఎన్నికల ఖర్చులు స్వయంగా పెట్టుకోవాల్సి వచ్చిందని అందుకనే చాలామంది ఓడిపోయారని పార్టీ వాళ్లే చెపుతున్న సమాచారం.
(2) అమాయక ప్రజల నుండి ఓ మోస్తరుగా వచ్చిన స్వచ్ఛంద విరాళాలతో బాటు ఒక మీడియా మొఘల్‌, భూకబ్జాదారులు, తమ అక్రమాల రక్షణ కోసం సమకూర్చిన భారీ 'గుడ్‌విల్‌ మొత్తాలు', పారిశ్రామిక సినిమారంగాల నుండి బెదిరింపు దందాల ద్వారా వచ్చిన సొమ్ములు, బడుల రాబడులు, అన్ని కుటుంబ కోశాగారానికే చేరుకున్నాయన్నది మరో బహిరంగ రహస్యం.
(3) ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిపొంది, అక్కడ నిర్మించిన పార్టీ కార్యాలయ భవనం యాజమాన్యం ఎవరి పేరున ఉందో చెప్పనే చెప్పరు. 'ఎమ్మార్‌' దందాలో ముట్టిన అవినీతి సొమ్ములో కొంత ఆ భవన నిర్మాణానికి ఉపయోగించినందున ఆ పాపం దోషం పార్టీకి తాకిందని చాలామంది పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
(4) సొంత మీడియా ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన వందలాది కోట్లు ఎవరి నుండి ఏ దారిలో వచ్చాయా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తలచుకుంటే నిర్ధారించలేని విషయం కాదు, అలాగే పోలవరం ఇతర టెండర్ల వండర్ల గుట్లు తెలుసుకోవటం కూడా అసాధ్యం కాదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.
(5) రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో అందుకున్న సొమ్ముల గురించి కూడా దర్యాప్తు చేపట్టాలో లేక అదేదో ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా వదిలేయాలో ప్రభుత్వ సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలి.
(6) ఐతే విచారణ, పరిశోధన, అంతా ఒక కుటుంబానికే పరిమితం చేయటం కూడా న్యాయం కాదు. అక్రమార్కుల శేషం ఉండకూడదు కాబట్టి పలు ఐకాసలు కూడా ఎంత చెట్టుకంత గాలి అనే రీతిలో దండుకున్న ముడుపుల రహస్యముడులూ విప్పాలి -
(7) అలాగే ఉభయ ప్రాంతాల ఉద్యోగ సంఘాల నేతలు సందట్లో సడేమియా రీతిలో ఉద్యమ ఉద్వేగ కవచాల సాయంతో ఇప్పటికే నిర్ధారణౖన ఎసిబి కేసులను కాచుకోగల్గుతున్నారు. అక్రమంగా పొందిన ప్లాట్లనూ నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రం భవిష్యత్తుతో సంబంధం లేకుండా అక్రమార్కులందరిపైనా సత్వరం ఉన్న చట్టాలు, పాలనా నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, రాజకీయ ధ్యేయాలకోసం నిరంతరం పనిచేస్తూ ఉద్యోగ విధులను సంపూర్ణంగా త్యాగం చేస్తున్న వారినింకా విస్మరించకూడదు.
(8) విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పడానికి బదులు ప్రాంతీయ విద్వేషాలు నూరిపోస్తున్న ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులపై కూడా ఉన్న నిబంధనల కనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలి.
(9) అమాయకులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పిన వారిపైనా తగిన చర్యలుండాలి.
(10) చట్టాలు తెలిసిన లాయర్లు గాని, ఇంకెవరైనా గాని చట్టవ్యతిరేక పనులు చేసిన వారిని గుర్తించి చట్ట బద్ధ చర్యలు తీసుకోవాలి / అశ్లీల తవికలు రాసి ప్రచురించిన కవిశ్రేష్టులపై కూడా తగు చర్యలుండాలి. ఇందుకు కొత్త చట్టాలు చేయనవసరం లేదు. మొత్తానికి రాష్ట్రం కలిసుండాలా, విడిపోవాలా అన్నది వేరే సంగతి కాని చట్టాల్ని ఉల్లంఘించిన వారి నెవరినీ ఉపేక్షించరాదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అక్రమార్కుల అస్తిపంజరాలన్నీ వెలికితీయాలి. అక్రమార్జనలన్నీ స్వాధీనం చేసుకుని ప్రజలకోసం ఉపయోగించాలి.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి

22, నవంబర్ 2011, మంగళవారం

స్నేహపూరితమైన వాతావరణంలో ఎవరితోనైనా మేము చర్చకు సిద్ధం : విశాలాంధ్రమహాసభ

'ప్రచురణార్థం'  అంటూ ఎవరో  'తెలంగాణ నెటిజెన్స్ ఫోరం' పేరుతో నున్న ఈ  క్రింది లేఖను విశాలాంధ్రమహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ గారి ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేయడం జరిగింది.

 


దీనిని TNF నుండి చర్చకు రమ్మని అందిన ఆహ్వానంగా విశాలాంధ్రమహాసభ భావిస్తుంది.వారి లేఖకు మా ప్రత్యుత్తరాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము


తెలంగాణా నెటిజెన్స్ ఫోరం వారికి,

పరకాల ప్రభాకర్ వినమ్ర నమస్కారములు.

మీ బహిరంగ లేఖ చూసాను. చాల సంతోషం.


విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాలు, మా ప్రసంగాలు, రచనలూ, పత్రికా ప్రకటనలూ, మేము నిర్వహిస్తున్న సదస్సులను మీరు ఆసక్తితో గమనిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.


మేము ఎప్పుడూ ఎక్కడా తెలంగాణా ప్రజలకు, ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అటువంటి భావన మీకు కలిగి ఉంటే అది సరిఅయినది కాదు అని నేను స్పష్టంగా చెప్పగలను.


ఆ మాటకొస్తే మేము ఏ ప్రాంతానికి, ఏ ప్రాంత ప్రజలకీ వ్యతిరేకం కాదు. మేము విశాలాంధ్ర కొనసాగాలనే అభిమతం కలవాళ్ళం. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి చెప్పాలంటే మేము విభజన కోరే వారికి కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. మా వ్యతిరేకత కేవలం విభజన వాదం పట్ల మాత్రమే. విభజన వాదుల పట్ల ఏమాత్రం కాదు.


విభజన వాదం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్నదని మా అభిప్రాయం. విభజన వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు. అలాగే సమైక్య వాదం అన్ని ప్రాంతాలలోనూ ఉంది. సమైక్య వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు.


మేము సమైక్య వాదాన్ని బలపరిచే వాళ్ళం. విభజన వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళం. మాకు విభజన వాదుల పట్ల కించిత్తైనా అగౌరవం లేదు. వారి వాదన వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో, స్వార్ధ ప్రయోజనాలో ఉన్నాయని మేము అనుమానించడం లేదు. వారి వాదనతో మేము ఏకీభవించలేకపోతున్నాము.


అంతే.


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి గురించి మా దృక్పథం క్లుప్తం గా మీ ముందు ఉంచుతాను. రాష్ట్రం కలిసి ఉండాలా లేక విభజన జరగాలా అన్నదాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ రెండు వాదాలు వినపడ్డాయి. అంతకు ముందూ వినపడ్డాయి. 1956 లో ఉన్నాయి. 1969 లో ఉన్నాయి. 1972 లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఒకో సారి ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమయ్యింది. కాని అక్కడే దానికి వ్యతిరేకమైన భావన, అభిప్రాయం లేకపోలేదు. ఒకో సారి ఒకో ప్రాంతంలో ఉద్రేకాలు ఎక్కువగా మరో ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. గత అరవై సంవత్సరాల చరిత్ర మనకు తెలియ చేసేది అదే.


జరిగిన ఆందోళనలు ప్రాంతాల మధ్య జరిగిన వివాదాలు గా కాకుండా విభజన-సమైక్య వాదాల మధ్య జరిగిన, జరుగుతున్న భావజాల సంఘర్షణ గా చూడడం సరైనదని మా భావన.


ఈరోజు కూడా పరిస్థితి అదే. కోస్తా రాయల సీమలలో విభజనకు మద్దతు పలికే వారున్నారు. తెలంగాణలో ఉన్నారు. అలాగే ఆ రెండు ప్రాంతాలలో కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. తెలంగాణా లో కూడా కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక సారి ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమయ్యింది. మరొక సారి మరొక ప్రాంతంలో మరొక భావన బలంగా వ్యక్తమయ్యింది.


మా విశాలాంధ్ర మహాసభ లోనే అనేక మంది సభ్యులు తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వారితో పరిచయమయ్యే అవకాశం మీకు తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.


వారు గాని, నేను గాని పదే పదే చేసుకునే విజ్ఞప్తి ఏమిటంటే, ఐక్యం గా ఉండడానికి మా దగ్గర ఉన్న వాదన ఏమిటి, విడిపోవడానికి ఇవాళ వినిపిస్తున్న వాదన మాకు ఎందుకు అంగీకార యోగ్యం కాదు అనే మాట బహిరంగంగా పది మందికీ చెప్పుకునే అవకాశం మాకు కావాలని. మా మాటలు చెప్పుకోకుండా మమ్మల్ని అడ్డుకోవద్దని. మా అభిప్రాయాలతో మీరు ఏకీభవించక పోయినా మా మాటలు చెప్పుకునే హక్కును మమ్మల్ని అనుభవించనివ్వండి అని.


మా భావాలను ఎవరి మీద రుద్దే ఉదేశ్యం మాకు లేదు. ఎవరూ ఎవరి మీద తమ అభిప్రాయలు రుద్ద లేరు. అలా జరగ కూడదు కూడా. మా అభిప్రాయాలు వెల్లడి చేసిన తరువాత ఎవరి నిర్ణయాలు వారు చేసుకో వచ్చు. ఎవరి అభిప్రాయలు వారు ఏర్పరుచుకోవచ్చు. కాని మేము మా వాదన, అభిప్రాయం చెప్పడానికే వల్లకాదంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మా అభిప్రాయం.


మేము చేసేది అభ్యర్ధన. ఒక విజ్ఞప్తి. దానిని అలాగే చూడండి. అభిప్రాయాలను వ్యతిరేకించినా అవి వెల్లడి చేసుకునే స్వేచ్ఛను మీరు వ్యతిరేకించరనే విశ్వాసం మాకుంది.


మా అభిప్రాయాలు చెప్పుకునే వేదిక మాకు కల్పించడానికి మీరు ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీరు తీసుకున్న చొరవ మీలో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి కి అద్దం పడుతోంది.


మన సమావేశం ఎలా జరగాలి, సమావేశానికి ఎవరు సమన్వయకర్తగా వ్యవహరించాలి, దాని విధివిధానాలు ఎలా ఉండాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో జరగాలి అనే విషయాల మీద మనం మాట్లాడుకుని నిర్ణయించుకోవచ్చు.


ఈ విషయంలో మీరు మా విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ నలమోతు చక్రవర్తి గారితో సంప్రదింపులు జరిపితే ఉచితంగా ఉంటుందని నా భావన. వారు కూడా మీతో సంప్రతింపులు జరపడానికి చాల ఇష్ట పడతారు. వారికి మీరు contact@visalandhra.org ద్వారా వర్తమానం పంపవచ్చు.


మనం త్వరలోనే, ఇరువురికి సదుపాయంగా ఉండే చోట, రోజు, సమయానికి కలుసుకుని చక్కటి నాగరిక, స్నేహపూరితమైన వాతావరణం లో మన ఆలోచనలను పంచుకోవచ్చు.


ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను.



ఇట్లు,
భవదీయుడు,
పరకాల ప్రభాకర్

Bapuji’s Nellore Meet : Parakala Prabhakar

Parakala.org : Sri Konda Laxman Bapuji’s Sadbhavana Meet on Sunday, 20th November went off peacefully in Nellore. He was able to put forth his views on the division of the state without any disturbance. He not only argued for the need to create a separate Telangana State, but also said that the state should be divided into three. He batted for separate Rayalaseema also. He said he was in favour of smaller states, no matter how many.

Speakers in the meet expressed their views unhindered. Nobody barged into the meet. Nobody shouted slogans outside the venue. Nobody hurled abuses. Nobody tried to manhandle anybody.

Some prominent leaders who are for Visalandhra went to the venue, met Bapuji and other speakers. They greeted him, conveyed their respects to him, felicitated him with a shawl and left the venue.

Some of the speeches at the meet were less than dignified, if you go by the newspaper reports. 

Uncharacteristically, even Bapuji crossed his familiar line of argument. He said that only capitalists opposed the division of the state. Never mind. That’s what he wanted to say, and he said it. It was his wisdom. So be it.

The group that invited Bapuji and his companions is a pretty smallish one. It’s presence in Nellore is insignificant. The organisers were unfamiliar to the public life of Nellore. The strong and powerful players in the political and social scene of Nellore are strong integrationists. There were integrationists even during the 1972 Jai Andhra agitation. It is well known that during that phase Nellore was a hot bed of separatism. 

Separatism, however, is a very faint voice in Nellore now.

Notwithstanding the strong integrationist opinion, notwithstanding the anonymity of the organisers of the separatist meet, Bapuji’s meet went off peacefully.

What does this indicate?

It clearly shows that Visalandhra Vaadana is self-confident and secure. It is not afraid of anyone organising a meet to propagate a contrary view. It’s self-confidence is revealed by the fact that staunch integrationists met the visitors and showed their respect. It indicates that the integrationists are not against separatists as individuals but are only against separatism as an idea. They only disagree with the separatists on their vision of the future of Andhra Pradesh. Integrationists have shown that one can disagree without being disrespectful and undemocratic or disruptive.

Voices of integration are not loud and shrill. They are dignified. But they are clear.

Voices of separatism are loud, shrill, abusive and disruptive. They are a cacophony.

Nellore meet brought out this contrast into bold relief. The meet revealed the petty mindedness of separatists everywhere – in the Coastal area, in Rayalaseema and in the Telangana.

If Bapuji’s mission is Sadbhavana as he claims it is, it would have earned him respect if he had invited an integrationist to speak at his meeting. If he had given a public commitment that he would take an integrationist along with him and provide a platform for airing the argument, Bapuji would have lived up to the expectations of people who value spirit of tolerance in public life.

Has separatist pettiness polluted Bapuji’s Sadbhavana too?

21, నవంబర్ 2011, సోమవారం

ప్రత్యేకరాష్ట్ర నినాదం తెలంగాణా ప్రయోజనాలకు మంచిది కాదు : మాడపాటి

ఆంధ్రజనత దినపత్రిక, మార్చి 22,1969: వేర్పాటు ఆలోచనలకు స్వస్తి చెప్పి తెలంగాణ ప్రగతికై ఆంధ్రప్రాంత సోదరులతో కలిసి మెలిసి కృషిచేయవలసిందని తెలంగాణా ప్రజలకు తెలంగాణాలో విద్యాభివృద్ధికి, తెలుగు భాష,సంస్కృతిల పునర్జీవనానికి, మహిళల ప్రగతికి నిర్విరామంగా కృషి చేసిన తెలుగు పెద్ద ఆంధ్ర పితామహ శ్రీ మాడపాటి హనుమంతరావు పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శాసనమండలి మాజీ అధ్యక్షుడైన శ్రీ హనుమంతరావు తమ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు:

"తెలంగాణాలో ఇటీవల కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘటనలు నాకు చాలా బాధను , ఆందోళనను కలిగిస్తున్నవి. ప్రత్యేక తెలంగాణ  నినాదం తెలంగాణ ప్రజలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని నేను త్రికరణశుద్ధిగా విశ్వసిస్తున్నాను. తెలంగాణను విశాలాంధ్రలోని అంతర్భాగంగా భావించుకొని, చిరకాలంగా మనం మురిసిపోతూ వచ్చాము. మనం నిజాం పరిపాలనా కాలంలో కూడా సమస్త రాజకీయ, సాంఘిక, విద్య మహోద్యమాలను 'ఆంధ్ర పతాక' క్రిందనే నడుపుకుంటూ వచ్చాము. మనకు ఆంధ్రమహాసభ ఉన్నది.మన విద్య, సంస్కృతి సంస్థలన్నీ ఆంధ్రనామ శబ్దాంకితములు. ఆంధ్రతో కలిసిమెలిసి చేదోడువాదోడుగా వ్యవహరించడంలోనే తెలంగాణ శ్రేయస్సు గర్భితమై యున్నది. ఈ దశ లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రయోజనకరం కాదు. గిట్టుబాటు కాదు. రాజ్యాంగచట్టాన్ని సవరించకుండా 'ప్రత్యేక తెలంగాణాను' ఏర్పాటు చేయడం సైతం అసంభవమే. రాజ్యాంగ చట్టసవరణ అనేసరికి ఎన్నో క్రొత్త చిక్కులను ఎదుర్కోవలసి వస్తుంది.దీని ప్రభావం ఇతర ప్రాంతాలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ వాదం జాతీయ సమైక్యత సాధనకు ఏ మాత్రం దోహదం చేయజాలదు"


ఓ తెలుగోడి ఆవేదన .....

ఓ వైపు!..........
సలాం సలాం అని
గులాం గులాం చేస్తే
మారో మారో అని తెలుగోడి ప్రాణాలను హరిస్తే
పోరు బాటే మార్గమని
పోరు జెండా నెత్తుకుంటే
వల్లభుడె దిగి వచ్చి
నిజాం అంతు చూస్తే!.........


మరో వైపు!............
తెలుగు అన్నలందరిఫై
తెగబడి ఎగబడి
మద్రాసోడు మారణహోమం చేస్తుంటే
సహించలేక భరించలేక
మన పొట్టి అన్న
పట్టు బట్టి సాదించి తెలుగు అన్నలందరిని ఏకం చేస్తే!...


కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
కదం తొక్కి విత్తువేసి
ఆఫ్రికా ఖండము నుండి అమెరికా ఖండము వరకు
అలుపెరగకుండా లంగరు వేసి
ప్రపంచములో ప్రచండ వేగముతో దూసుకెళ్తున్న
తెలుగోడిని చూసి చీడపురుగు చిదంబరానికి కన్ను కుట్టింది
చిలవలు పలవలుగా మన మద్య చిచ్చు పెట్టింది ...


తమిళము, మళయాళము, గుజరాతూ బేషరతు గా కలిసుంటే
మన తెలుగు అన్నలెందుకు తగవు లాడుకోడము
ఆ చిదంబరానికి బుద్ధి చెబుదాము!!
మన తెలుగోడి సత్తా చూపెడదాము!!!


వేంసాని రమణ
ఖమ్మం జిల్లా(స్వస్థలం)
పోర్ట్స్మౌత్, ఒహిఒ అమెరికా నిస్తలం

మానవహక్కుల సంఘాల నేతలకు ఒక ప్రవాసాంధ్రుని బహిరంగ లేఖ

An open letter to human right activists
by Ramana Vemsani 



నేను తెలంగాణా లోని ఒక కుగ్రామము లో జన్మించాను, విద్యార్ధి దశ నుండి మన మానవ హక్కుల వారు చెప్పే మాటలకు ప్రభావితమయ్యానని చెప్పుకోటానికి సంతోషిస్తాను వారి ఆదర్శాలు, చెప్పే మాటలు చూసి నా చుట్టూ వున్నా పరిసర ప్రాంతాలలో మానవ హక్కులకి విఘాతము కలగ కుండా చూసేవాడిని అని చెప్పుకోటానికి గర్వ పడతాను. మన తెలంగాణా లో కుల భావము ఎక్కువే అన్న సంగతి మన తెలంగాణా లోని సోదరులు అందరికి తెల్సు అనే అనుకుంటున్నాను. మా ఇంట్లో అప్పటి వరకు వున్నా రెండు గ్లాస్ ల సిద్దాంతాన్ని వ్యతిరేకించి మా అమ్మ ను నాన్న ను ఒప్పించి వాళ్ళలో మార్పును తీసుకు రాగలిగాను మా తాత గారు కట్టించిన గుడి లో కి అందరికి ప్రవేశము కల్పించగలిగాను అలాగే మా వూర్లో వెనక బడిన వర్గ సోదరులు కాని దళిత సోదరులు కాని రాజకీయాలలో ముందు ఉండేలాగా ప్రోత్స హించ గలిగాను గ్రామములో స్కూల్ రావటము కొరకు మా నాన్న గారి చేత ౩ ఎకరములు భూమి ఇప్పించగాలిగాను అంటే ఈ మానవ హక్కుల ప్రభావము నా మీద ఎంత పనిచేసిందో మీకు అర్ధమైంది అనుకుంటాను.

M A ఉస్మానియా లో చేస్తున్నప్పుడు నా సోదరి వివాహము కొరకు బందు మిత్రులని ఆహ్వానించటానికి గుంటూరు దగ్గిర లోని గ్రామము కు ఒక రాత్రి వెళ్తుండగా ఒక్క కుదుపున మా బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి ప్రయాణికుల అందర్నీ నిద్ర లేపి అప్రమత్తము చెయ్యటము జరిగింది ఏమిటా అని బస్సు దిగితే మా ఎదురుగ ఒక బస్సు మంటల్లో కాలి పోవటము గమనించాను ఆ బస్సు లో ప్రయాణికులు అందరు ఆ జ్వాలల్లో కాలిపోతుంటే అది చూస్తున్న ప్రతి ఒక్క పౌరుడి దుఖాన్ని ఆపుకోలేక అలా తగులబెట్టిన వారిని కూడా మంటల్లో వేసి చంపాలని అంటున్న మాటలు విన్నాను. కాని మన మానవ హక్కుల సోదరులు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుందని చెప్పిన వాదనని కూడా కాదనలేకపోయాను. ఆ తర్వాత మన తెలంగాణా లోని కాకతీయ దుర్ఘటన జరిగినప్పుడు కూడా మన మానవ హక్కుల సోదరులు ఏదో తెలియక చేసిన పొరపాటు గా చెప్తే కూడా అంగీకరించాను .

కాని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో p hD చేసిన Dr పరకాల, ఈ సమాజము లో వేర్పాటు వాదము వద్దు అని, అంది వచ్చిన తన రాజకీయ బవిష్యత్తు కు విఘాతము కలగవచ్చేమో అన్న సందేహము కూడా లేకుండా మన ప్రజలకి తన వాదన లోని నిజాలు తెలియ చెయ్యటానికి ముందుకు వస్తే అతని మీద దాడి చెయ్యటము చూస్తే ఈ సమాజములో మానవ హక్కుల గురించి చర్చ జరగాల్సిన అవసరము ఎంత అయినా వున్నది అన్న విషయము మన మేధావులు అందరు గమనించాలని వేడుకుంటున్నాను. అతని విశాలాంధ్ర వాదన ను చూసి ఇంత మంది తెలంగాణా మేధావులు పారిపోవటము చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది. కొందరి ఆలోచనలు మనకు రుచించినా, రుచించక పోయినా అతనికి రక్షణ కల్పించ అవసరము కానీ, వాదనకు అవకాశము కానీ మనము దగ్గిర వుండి కల్పించాల్సిన ఆవశ్యకత మన మానవ హక్కుల సోదరులు అందరికీ ఉన్నదనే అనుకుంటున్నాను. మానవ హక్కుల కార్యకర్తలు ఎంత నిబద్దతతో పని చేస్తారో కూడా నిరూపించాల్సిన ఆవశ్యకత వచ్చింది, ఈ విషయము లో మన అమర్ చూపించిన మార్గము ఎంతైన అభినందనీయము మా సంధ్య అక్క కాని, మా విమల అక్క కాని, నా పాత P D S U మిత్రులు కాని, నా మిత్రుడు చక్రపాణి కాని ఈ విషయము లో స్పందిస్తే చూసి ఛాలా సంతోషిస్తాను అనటములో ఏ మాత్రమూ సందేహ పడను. ప్రతి ఒక్క పౌరుడు కు జీవించే హక్కు మరియు తమ అభిప్రాయాన్ని తెలియ చెప్పే హక్కు ఉంటుందని చెప్తూ వస్తున్న మన మానవ హక్కుల సోదరులు అవి ఒక్క బస్సు లలోని ప్రజలని, రైళ్లలోని ప్రజలని కాల్చి చంపే వారికి మాత్రమే అన్న విషయాన్ని అయినా స్పష్టము చేస్తే ఇంకా మరి సంతోషిస్తాను.

రమణ వేంసాని
ఖమ్మం జిల్లా (స్వస్థలం)
పోర్ట్స్మౌత్, ఒహిఒ అమెరికా నిస్తలం




20, నవంబర్ 2011, ఆదివారం

సద్భావన యాత్రకి సంఘీభావం.విశాలాంధ్రవాదాన్ని కూడా వినిపించనివ్వండి : VMS PressMeet (19.11.2011)

ఆంధ్రజ్యోతి: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచాలా లేక విభజించాలా అనే అంశంపై స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్ బాపూజీ నిర్వహించ తలపెట్టిన సద్భావన యాత్రకు పరకాల సంఘీభావం ప్రకటించారు.

అయితే, సద్భావన వేదిక నుంచి తమ వాదాన్ని వినిపించడానికి అవకాశం కల్పించాలని కోరారు. " రెండు విభిన్న వాదాల మధ్య సద్భావన ఉండాలి. విభజన, సమైక్యతా సమస్యను మేము ప్రాంతాల మధ్య వివాదంగా చూడటం లేదు. భావజాలాల మధ్య సంఘర్షణగానే పరిగణిస్తున్నాం'' అని వివరించారు.

సమైక్యవాదాన్ని వినిపించేవారికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. దీనిపై పౌరహక్కుల ఉద్యమకారులు ఎందుకు స్పందించరంటూ నిలదీశారు. తాను బతికున్నంత వరకు రాష్ట్రాన్ని చీల్చలేరని స్వాతంత్య్రసమరయోధుల సంస్థ అధ్యక్షుడు నర్రామాధవరావు స్పష్టం చేశారు.

1969లోనూ, ఇప్పుడు విభజనవాదం ఓడిపోవడానికి స్వార్థ ప్రయోజనాలు, ఐక్యత లేకపోవడమే కారణమని పాత్రికేయుడు రామజోగయ్య అన్నారు. తెలంగాణవాదం అభూతకల్పనలతో, అసత్యాలతో ముడిపడి ఉందన్నారు. సమైక్యవాదం వినిపించడమే నేరంగా మారిందని మరో ప్రతినిధి కుమార్‌చౌదరి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనపై మాట్లాడేముందు పాలమూరులో అమల్లో ఉన్న రెండుగ్లాసుల విధానంపై నోరువిప్పాలని న్యాయవాది రవితేజ నిలదీశారు.

ఈనాడు 20.11.2011

 సూర్య: విభజన వాదానికే కానీ విభజనవాదులకు తాము వ్యతిరేకం కాదని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేపడతానన్న సద్భావన యాత్ర కేవలం రెండు ప్రాంతాల మధ్యే కాకుండా రెండు విభిన్న వాదాల మధ్య కూడా ఉండాలని ఆయన సూచించారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో ఆంధ్రా ఉద్య మం మాదిరిగానే ఈ సారికూడా విభజన కోరుకున్న చోటే సమైక్యానికి మద్దతు ఉందన్న విషయం నేతలు గమనించాలన్నారు. తనపై జరిగినదాడిపై పౌరహ క్కుల రక్షణ ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

19, నవంబర్ 2011, శనివారం

వేర్పాటువాదుల సమైక్య వాక్కులు

  • జై తెలంగాణా నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రి గారు తక్షణ చర్యలు చేపట్టాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కే.సి.ఆర్ ( 26.02.1997)   
"ఎవరి ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో , రాయలసీమ లో ఉద్యమాల కోసం ఏదో సమితి అనేది పెడుతున్నారు. రాయలసీమ లో రాయలసీమ విమోచన సమితి, రాయలసీమ పోరాట సమితి, తెలంగాణ ప్రజా సమితి ఈ విధంగా అనేక పేర్లతో సమితి నాయకత్వాన ఉద్యమం చేపట్టే ఉద్యమకారుడు ఏదైనా ఉద్యోగం లభించినట్లయితే ఆ ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు కాని వారికి హోదా వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించరు. పలు నినాదాలు వస్తున్నాయి. ఇందాక హౌస్ లో దామోదరరెడ్డి గారు స్లోగన్ తో సహా జైతెలంగాణ అని కూర్చున్నారు. ఈ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రిగారు తక్షణ చర్యలు చేపట్టాలి."

    • జోనల్ సిస్టం రద్దు చేయాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కే.సి.ఆర్ ( 18.07.1996)
    " ఈ ఉద్యోగులుకు సంబంధించి అధ్యక్ష్యా! సిక్స్ పాయింట్ ఫార్ములాలు, తర్వాత జోనల్ సిస్టం లు పెట్టుకొని మనం కొంచెం దెబ్బతింటున్నాము అధ్యక్ష్యా! ఎక్కడైనా ప్రాజెక్టు కింద స్టాఫ్ మిగిలిపోతే వారిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసలుబాటు ఉండాలి అధ్యక్ష్యా! కానీ అటువంటి విధానం లేదు. కొన్ని మనకుగా మనం విధించుకున్న ఆంక్షల వల్ల, నిబంధనలవల్ల, జోనల్ సిస్టం వల్ల, సిక్స్ పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతున్నాము.........ప్రభుత్వం డైనమిక్ గా మువ్ కావాలని చెప్పి అవసరమైనప్పుడు నాయకులతో, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోగాని, ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ జోనల్ సిస్టం లను, మనకి అవరోధంగా ఉన్న విషయాలను తొలిగించుకొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్బంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష్యా!"


    • ఒకప్పుడు తెలంగాణవాదిని -ఇప్పుడు సమైక్యవాదిని : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నాగం జనార్ధనరెడ్డి (22.08.1988)
    "ఆనాడు దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ నాయకులు ఈ ఉద్యమంలో చేరి దాదాపు 350 మందిని పొట్టన పెట్టుకొని సాధించింది ఏమిటంటే ఈ సుధాకరరావుగారు కాని, లేక కీర్తిశేషులు రాజారాం గారు కాని,మదన్ మోహన్ గారు గానీ మంత్రులయ్యారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.కాని మేము మాత్రం రెండున్నర సంవత్సరాలు విద్యను పోగొట్టుకొని జైలుకు వెళ్లాం.లాఠీ దెబ్బలు తిన్నాం.దాని తర్వాత కూడా ఈ రోజు తెలంగాణ గురించి ఈ రకంగా చర్చ రావడం బాధాకరంగా ఉంది.....ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ప్రగతి ఉంటుందని విశ్వసిస్తున్నాను."

    • కోస్తా మహానుభావులే మాకు చదువు నేర్పారు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దేవేందర్ గౌడ్(17.05.2005)
    "మా పరిస్థితి ఎలా ఉండేదంటే మాకు చదువు నేర్పేవారే లేకుండా పోయారు. నిజానికి నేను చెబుతున్నాను. నిజమైన హృదయంతో చెబుతున్నాను. కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన మహానుభావులే మాకు చదువు నేర్పారు. నాకు తెలిసిన ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయనకు పాదాభివందనం చేయాలి. రెండు పూటలా తిండిలేకుండా ఉపాధ్యాయులు ఎక్కడినుంచో కాకినాడ, గుంటూరునుంచి ఇక్కడికి వచ్చి మాకు చదువులు నేర్పారు.ఇక్కడ ఉండే మహానుభావులు మాకు చదువు నేర్పలేదు. ఆ రోజు రాజకీయ నాయకత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళకు చదువు చెప్పాలని ఏనాడైనా మానవత్వంతో ఆలోచన చేసారా?అని అడుగుతున్నాను.కోస్టల్ ఏరియాకి వెళితే అక్కడ ఊరికిగాని కొన్ని ఊర్లకు కలిపిగాని మెమోరియల్ స్కూల్స్ ఉండటం మనకు అక్కడక్కడ కనపడతాయి. వాళ్ళ పెద్దల పేరుతో స్కూల్స్ పెట్టి అక్కడి ప్రజలకు చదువు నేర్పాలనే తపన అక్కడి రాజకీయ నాయకత్వానికి ఉంది. ఇక్కడి రాజకీయ నాయకత్వానికి ఏమి రోగం అధ్యక్షా?.."


    • ముసలివాళ్ళకి విడాకులు ఇప్పిస్తారా?: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కడియం శ్రీహరి(29.03.2005)
     నెహ్రూ చెప్పి ఉంటారు. నాకు తెలియదు ....1956 లో పెళ్లి జరిగితే అప్పుడున్న అత్త ఎవరు అధ్యక్షా? ఇప్పుడు 2003 లో ఉన్నాము . దాదాపు 47 సంవత్సరాలు జరిగిపోయింది. వాళ్ళే కదా అధ్యక్షా అత్తలు. 1956 లో నవదంపతులైనవారికి పిల్లలు పుట్టారు. మనవలూ పుట్టారు.ఇప్పుడు సమస్యలు విడాకులు అని వారు అంటున్నారు.కాంగ్రెస్స్ పార్టీ పాలసి ఏమిటి అధ్యక్షా? ముసలివారికి విడాకులు ఇప్పిస్తారా? ఆ ముసలివారికి రాజశేఖర రెడ్డి మామగా ఉంటారా?ఇది ఏమిటి అధ్యక్షా?