11, మే 2011, బుధవారం

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై మహాత్మా గాంధీ

భారతదేశానికి  స్వాతంత్ర్యం రాక ముందే ఎన్నోఏళ్ల పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై చర్చ జరిగింది. ముఖ్యంగా సైమన్ కమీషన్ నియామకం, ఒరిస్సా రాష్ట్ర ఏర్పాటు, మద్రాస్ ప్రెసిడెన్సి లోని తెలుగువారి డిమాండ్ తదీతర అంశాలు ఆ చర్చను ముందుకు నడిపించాయి. కాకపోతే  పరాయి పాలనలో ఉన్న దేశంలో రాష్ట్రాల పునర్విభజన అంశం అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు.స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన భారత జాతీయ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, జాతిపిత మహాత్మా గాంధీ అనేక సందర్భాలలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించారు. ఆయన కృషితోనే  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది.

దురదృష్టం కొద్దీ హైదరాబాద్ సంస్థాన విమోచన, భారత దేశంలో విలీన సమయానికి  మహాత్మా గాంధీ జీవించి లేరు. జీవించి ఉంటే ఆయన విశాలాంధ్ర ఏర్పాటును గట్టిగా సమర్థించి ఉండేవారు. 

సర్వేపల్లి రాధాకృష్ణన్ కు  మహాత్మాగాంధీ వ్రాసిన ఈ లేఖ చదవండి
LETTER TO S. RADHAKRISHNAN
SEGAON, WARDHA,
December 23, 1938


DEAR SIR RADHAKRISHNAN,
As you know I have always aimed at a redistribution of Provinces on a linguistic basis. The cue was taken from the Andhra movement. I should therefore be more than glad if Andhra could have its status as a Province recognized even now.
Yours sincerely,
M. K. GANDHI

ఒక సందర్భంలో విజయనగర మహారాజు కుమార్ విజయానంద్ గారు ఆంధ్ర రాష్ట్రం పై తన అభిప్రాయాన్ని తెలుపమని మహాత్మా గాంధీకి లేఖ వ్రాయగా, దానికి జవాబునిస్తూ గాంధీ ఇలా అన్నారు, " I was principally instrumental in securing from the Congress the recognition of the redistribution of the Provinces for Congress purposes on a linguistic basis. I have always agitated for the acceptance by the Government of such redistribution. I have indeed advised Tamil Nad, when such advice was needed, not to resist the Andhra demand" ( Harijan, March 29-1942)

ఇంకొక సందర్భంలో హరిజన్ పత్రిక కోసం 19th April,1942 న వ్రాసిన నోటు 'Linguistic basis' లో మహాత్మా గాంధీ ఇలా అన్నారు , "I believe that the linguistic basis is the correct basis for demarcating provinces. I should not mind two provinces speaking the same language, if they are not contiguous. If Kerala and Kashmir were speaking the same language, I would treat them as two distinct provinces" (From the Collected Works of Mahatma Gandhi Vol 82 http://www.gandhiserve.org/cwmg/VOL082.PDF )

10, మే 2011, మంగళవారం

'కాస్త మా గోడు వినండి'

ఈనాటి ఆంధ్రజ్యోతి నుండి: "తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎస్సై పరీక్ష అభ్యర్థులు సీఎంను కలిశారు. పరీక్షకు ఎంపికైన 18వేల మంది అభ్యర్థుల్లో 11 వేల మంది తెలంగాణకు చెందిన వారే. పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగితే మాకు నష్టం జరుగుతుంది. ఒక్కో అభ్యర్థి రాత పరీక్ష శిక్షణ కోసం నెలకు రూ.5 వేల చొప్పున ఇప్పటికి రూ.2లక్షలు ఖర్చు చేశారు. పరీక్ష మరింత ఆలస్యమైతే ఆర్థికంగా బాగా నష్టపోతాం అని ముఖ్యమంత్రికి వివరించారు."

పోటీ పరీక్షలకు చదివి హాజరైయ్యే అభ్యర్థుల గోడు మన మీడియాకు వినిపించదా? అదే పరీక్షల పేరుతో తుచ్ఛ రాజకీయం చేసేవారి వాణి మాత్రం అందరూ తప్పనిసరిగా భరించాలి. లేకపోతే మరి మీడియానే బ్లాకౌట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే ఘనులు తయారైయ్యారు.

ఇప్పుడు ఇక చూడండి. కేసిఆర్ ఎంతగానో ప్రేమించే లగడపాటి పేరును  పై రిపోర్ట్ లో చూసేసి,  అసలు విషయాన్ని వదిలేసి, మరి అదేదో జీవిలా ఒక రంకె వేసి .. లగడపాటి...జగడపాటి...సీమాంధ్ర పెట్టుబడిదారులు..దోపిడీదారులు..కుట్ర...అని బుసలు కొడుతూ పనికిమాలిన వ్యాఖ్యలు చేయడానికి  చాలామంది అందుబాటు లోకి వస్తారు.


6, మే 2011, శుక్రవారం

కాసేపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమాన్ని ఆంగ్లభాష లో స్తుతిద్దాం

In Praise of ‘T’ Agitation

- పరకాల ప్రభాకర్, విశాలాంధ్ర మహాసభ సభ్యులు   
Communication manufactures perceptions. Effective communication manufactures perceptions that are far more biting than reality. In their most potent form they can, in fact, replace reality and obfuscate one’s reasoning faculty. The ongoing Telangana agitation offers a formidable example of effective use of political communication. It is in the deployment of a well-designed communication strategy that the present agitation differs from the earlier one. It is the sophisticated use of communication that gave depth to the present stir.

Earlier agitation in 1969 was superficial. It was a mere venting of grievances centred mainly on sharing of political offices and government jobs. The present agitation began its journey by raising issues of economic backwardness, exploitation, and discrimination. Eventually, its communication strategy put a spin on the region’s history, culture, language, and even cuisine in terms of ‘us’ and ‘they’. Telangana is portrayed as not only an underdog but also as a distinct linguistic, cultural and historical entity different from the other two regions in the state of Andhra Pradesh. This was indeed a very competent attempt at deepening the agitation. That the strategy is working is evident.  When the statues of the icons of Telugu culture were desecrated and demolished, the outrage against it was muted.

It is improbable that no one from the region is opposed to the agitation. Yet one hardly hears dissenting voices in public forums. That is the power of the communication strategy. It is successful in casting a spell: That anyone who is not in favour of a separate statehood for Telangana is an enemy of Telangana. The biggest success of the communication strategy is that the popular mind is unable to decouple demand for separate statehood and love for Telangana.

The agitation’s communication strategy went on to circulate that it was the most backward region in the state. Voluminous authentic data to the contrary is still unable to dispel the myth. There is another interesting spin. Left-wing poets and popular balladeers of the region wrote heart-rending lyrics narrating the inhuman treatment of the common people by the landlords of Telangana. Every ill in the Telangana region was blamed on the class enemy. But now, all of a sudden, these litterateurs want everyone to believe that the misery was because of the exploitation by people from the other two regions of the state. The spin is working. It is powerful enough.

Communication can give new meaning and unexpected connotation to centuries old words. ‘Andhra’ was always used as a word indicating the language, and the people who spoke the language. Telugu and Andhra were until recently used interchangeably. Under the Nizam ‘Andhra Mahasabha’ fought for the protection of Telugu language and the people who spoke it. In the erstwhile Hyderabad state, Telugu people were treated as second class citizens because they did not speak Urdu. Hyderabad state had Kannada, Marathi and Telugu speaking areas. The area where Telugu was spoken came to be known as ‘Telangana’ (literally meaning ‘a land where Telugu is spoken’). The anti-Nizam struggle was spearheaded by Andhra Mahasabha. In the former Hyderabad state Srikrishnadeva Raya Andhra Bhasha Nilayam was established as the repository of telugu culture and literature. Madapati Huanumantha Rao who was one of the pioneers of this cultural and political movement was lionized as ‘Andhra Pitamaha’. Potana, who hailed from this region wrote ‘Srimad Andhra Mahabhagavatam’. But today the agitation’s powerful propaganda has succeeded in showing ‘Andhra’ and ‘Telangana’ as not just two terms describing telugu cultural and linguistic identity, but as representing two inimical regional-cultural groups. The idiom and accent Telugu gained in the erstwhile Nizam region due to strong influence of Urdu is now shown as a linguistic distinction that separates the people of the region. This spin is accomplished in a very short time by the agitators.

Historically Telugu people have lived under single political authority for centuries. Sometimes they were scattered across different political units but only to quickly come together. The recent such episode was under the Nizam. He ruled over what are now the Coastal and Rayalasema regions till the end of eighteenth century. He then lost them to the British. The formation of Andhra Pradesh in the mid twentieth century was only a reunification of Telugu people who, for a brief spell of less than two centuries, were under the British and the Nizam. But the agitation’s compelling propaganda has successfully created an impression that Telangana has historically nothing to do with the rest of the Telugu speaking areas and people.

A spin’s life is short.  Any competent communication strategist knows it. Therefore, a new one should come out before an old one expires. Continuously.  Without a gap. When the spin on economy to show backwardness and exploitation wore out, another spin on history, then on language and culture were ready. And as these are tapering off, another one on self-rule is readied. Notwithstanding thousands of Sarpanches, over a hundred MLAs, more than a dozen MPs elected by the people of Telangana, and as many Ministers from the region, through their communication strategy the agitators are trying to make people believe that somebody else is ruling them. This is in Telangana which gave the country one of its finest rulers of India in P V Narasimha Rao.

A communication strategy is successful if it achieves the goal before the spell it casts is broken. The jury is still out on the Telangana agitation’s communication strategy. But there can be no two opinions on its strength and competence. It is, indeed, an interesting case study.
http://parakala.org/2011/05/02/in-praise-of-t-agitation/

4, మే 2011, బుధవారం

లై బోలో తెలంగాణ


మనకు శంకరనే ఒక దర్శకుడున్నాడంట. దర్శకుడు శంకరంటే 'జంటిల్మెన్' శంకరనే అనుకుంటూండేవాణ్ణి నేను. కానీ ఇతడు ఆ తమిళ శంకరు కాదనీ.. తెలుగు శంకరేనని తరవాత తెలిసింది. అయితే అతడు తనను తెలంగాణ శంకరని పిలుచుకుంటన్నాడు. ఇదివరకు పెద్దగా కనబడేవాడు కాదుగానీ, ఈమధ్య మాత్రం హఠాత్తుగా ఎక్కడబడితే అక్కడ తెగ కనబడిపోతున్నాడు, వినబడిపోతున్నాడు.ఔను మరి ఇది తెలంగాణ సీజను కదా!

తాను తెలంగాణ శంకరని చెప్పుకుంటన్నాడు కాబట్టి బాగా వార్తల్లో పడ్డాడు. ఈమధ్య తెలంగాణ ఉద్యమాన్ని తన సినిమా కోసం బాగానే వాడుకున్నాడు. సినిమా వాళ్ళు ఒకపక్క సమ్మె చేసుకుంటూ ఉంటే, ఈయన తన సినిమాను (దాని పేరు జై బోలో తెలంగాణ) ఈ సమ్మె నుంచి మినహాయింపించుకున్నాడు. తెలంగాణ సినిమా జాక్ అనేది కూడా ఒకటుందంట కూడా -ఈయనే పెట్టేసుంటాడు. జాకా మజాకా!

 టీవీ9లో ఒక ఫోనాఫోనీలో పాల్గొన్నాడీయన. అమెరికా యూరప్పుల నుంచి మనవాళ్ళు ఫోను చేసి ప్రశ్నలేస్తే ఈయన సమాధానాలిస్తాడన్నమాట. వెంకట్ అనే ఒకాయన అడిగిన ప్రశ్న.. "ఉస్మానియాలో ఉద్యమం పేరుతో డబ్బులు ఎలా వసూలు చేసారో మీ సినిమాలో చూపిస్తున్నారా" అని. దానికి ఈయనిచ్చిన సమాధాన మేంటంటే.. ఉద్యమం అన్నాక, కొన్ని లంపెన్ ఎలిమెంట్లు ఎక్కడైనా ఉంటాయండీ. వాటికి అంత ప్రాధాన్యత నివ్వకూడదు. ఉద్యమం పూర్తి స్వభావాన్ని చూడాలి కానీ ఇలాంటి చిన్నచిన్న విషయాలను పట్టించుకోకూడదు. పైగా మీరే అంటున్నారు అది పుకారని. దానికి విలువ ఎలా ఇస్తామండీ? నిరూపణ కానిదాన్ని చూపించడంట. అద్భుతమైన విలువలు కదా! మరి ఈయన గారి మిగతా విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.. (సినిమావాడికి విలువలేంటయా అంటారా.. నిజమేననుకోండి!)

 ఆ సినిమాలో కేసీయారు రాసిన ఒక పాటను టీవీలో చూపించా రీ మధ్య. అందులో సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని వర్ణించారు. కేసీయారు ఇన్నాళ్ళుగా చేస్తున్న ఆరోపణే అది; ఎక్కడా రుజువు లేని, నిరాధారమైన ఆరోపణ. దాన్ని పాటలో పెట్టెయ్యడం ఈ దర్శకుడికి అనుచితమనిపించలేదు మరి. ఆంధ్రుల మీద వచ్చే పుకార్లను ఎడాపెడా నమ్మేసి సినిమాలో యథేచ్ఛగా పెట్టేస్తాడా?  తెలంగాణ ఉద్యమం గురించి వచ్చిన పుకార్లను సినిమాలో పెట్టడం మాత్రం అనుచితమా? ఇంతోటి సన్నాసితనానికి ఉద్యమం, దాని స్వభావం అంటూ పోసుకోలు కబుర్లు చెప్పడం ఎందుకూ? ఏదో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టేసుకుని, ఒక సినిమా తీసేసుకుని, కాసిని డబ్బులు చేసేసుకుందామని అనుకుంటన్నాను అని చెబితే పట్టించుకోకపోదుం గదా!

కాబట్టి నీతి ఏంటన్నమాటా.. ఉద్యమాన్ని ఎట్టాగూ అబద్ధాలతోనే గదా నిర్మించారు, ఇక దాన్ని వాడుకుని తీసే సినిమా దానికి భిన్నంగా ఉంటదని అనుకోకూడదు. ఉద్యమం లాగే ఈ సినిమా కూడా .. జై బోలో  కాదు,  లై బోలో తెలంగాణ!  లై బోలో  తెవాదీ అంటే మరింత బాగుంటాది.
http://chaduvari.blogspot.com/2011/01/blog-post_20.html

ప్రత్యేక తెలంగాణ పిడివాదుల మొండి వాదనలు


కాంగ్రెసు, తెదేపా, ప్రజారాజ్యమూ, .. 'ఇలా ఈ పార్టీలన్నీ గతంలో తెలంగాణకు అనుకూలమని చెప్పి ఇప్పుడు తీరా తెలంగాణ ప్రకటించేసాక, మాట మార్చాయి/లేదా ఆయా పార్టీల కోస్తా సీమ నాయకులు మాటమార్చారు. ఎవడికి వాడు రాజీనామా చేసి సమైక్యవాదమంటూ దీక్షలు మొదలెట్టారు, ఊసరవెల్లులు, గోడమీద పిల్లులు ' అంటూ తెలంగాణావాదులు, టీవీల్లో కనబడే ఘంటా చక్రపాణీ తిట్టడం చూస్తూంటాం. సరే వాళ్ళు మాటమార్చారు నిజమే! కానీ ఇలా తిట్టేవాళ్ళు, తిట్టేసి సేద తీరేటపుడు కొన్ని సంగతులు ఆలోచించాలి..

  • రాష్ట్రవిభజన తెలంగాణవాదులకు రాజకీయ పార్టీలకూ సంబంధించిన సంగతి మాత్రమేనా? ఈ గొడవతో కోస్తా సీమ ప్రజలకేమీ సంబంధం లేదా?
  • వాళ్ళెన్నుకున్న నాయకులు వాళ్ళ మనోభావాలను ప్రతిబింబించాల్సిన అవసరం లేదా? అక్కడి నేతలు కూడా తెలంగాణవాదుల నినాదాలకు జైకొట్టాలా? తెలంగాణవాదాన్ని సమర్ధంగా వినిపించిన తెలంగాణ నాయకులను నెత్తికెత్తుకుని, సరిగ్గా వినిపించని వాళ్ళను ఎత్తి కుదెయ్యలేదా, ఈ తెలంగాణవాదులు? ఏఁ, ఆ మాత్రపు స్వాభిమానం, నాయకులమీద ఆ మాత్రపు హక్కు ఇతరులకుండదా?
  • తమ నాయకులు తమ అభిప్రాయాలను వినిపించనపుడు ఉద్యమాలు చేసి, సదరు నాయకులు తమ వాణిని వినిపించేలా చెయ్యకూడదా?
  • ఈ పనులు చేసే హక్కు తెలంగాణ వాదులకు మాత్రమే ఉందా? వీళ్ళు చేస్తే ఆత్మగౌరవమూను, వాళ్ళు చేస్తే అణగదొక్కడమూనా?
తాము చేసే పనినే కోస్తా సీమ వాసులు కూడా చేస్తే ఎందుకో వాళ్లకీ కడుపుమంట!!
..............................

మీ నుంచి మేం విడిపోతామని ఎవరైనా అంటే అవతలివాడికి ఇబ్బందేమీ ఉండకూడదు, ఉండదు కూడా! కానీ, వెళ్తూ వెళ్తూ 'మనందరం కలిసి కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులని (హైదరాబాదును) మేం మాత్రమే పట్టుకుపోతాం' అనడం మాత్రం అతితెలివి! 'మేమలా పట్టుకుపోతుంటే నువ్వుమాత్రం నోరు మెదపకూడదు' అని అనడం కంత్రీతనం!! ఓపక్కన ఈ రకంగా వాదిస్తూ, మరోపక్క అన్నల్దమ్ముల్లాగా విడిపోదామనడం జగత్కంత్రీతనం!!!
..............................

దేశంలో చాలా రాష్ట్రాలు విడిపోయినై.. తెలంగాణ విడిపోడానికేంటి ఇబ్బంది అంటూ ఆవేశపడిపోతూ, ఆవేదన చెందుతూ ఉంటారు, తెలంగాణావాదులు. ఆయా రాష్ట్రాల్లో విడిపోయినవాళ్ళు తాము విడిపోయారు, విడిపోయి తమ రాజధాన్ని తాము ఏర్పాటు చేసుకున్నారు. అంతేగానీ రాజధాన్ని మేం పట్టుకుపోతాం మీరు వేరే రాజధాన్ని చూసుకోండి అని అనలా! ఆ మాటే గనక అని ఉంటే ఆ రాష్ట్రాలు విడిపోయేవి కావు. అంతేకాదు, బహుశా బీహార్లో రక్తపాతం జరిగుండేది. ఎంచేతంటే, అవి కోస్తా, తెలంగాణా, సీమలంత ప్రశాంతసీమలు కావు.

---------------------

తమిళనాడులోని హోసూరుకు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నది, గోపీనాథ్ అనే తెలుగువాడు. తెలుగు పట్ల ఎంతో అభిమానం ఉన్నవాడు. ఇప్పుడాయన రాష్ట్రాన్ని చీల్చాలనే మన గొడవగురించి ఆవేదన చెందుతూ 'మనలో మనం గొడవ పెట్టేసుకుంటున్నామే..' అని బాధపడ్డాడంట! పాపం మన ఆత్మగౌరవం, మనాళ్ళ సెంటిమెంట్లు ఎక్కడున్నాయో ఆయనకు తెలిసినట్టు లేదు. తెలుగు, ఆంధ్రం వేరువేరనే మన ఆత్మగౌరవ రవాల గురించి, అమ్మను పూజించడంలో కాదు, తిట్టిపోయడంలో ఉన్న మన సెంటిమెంటు గురించీ పాపమాయనకు తెలిసుండదు.
http://chaduvari.blogspot.com/2010/01/blog-post_07.html

మే..ధావుల ’వర్గవివక్ష’


తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు 'వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 


ఓ పాత్రికేయ మేధావీ.. మీ తెలంగాణ పక్షపాతం చూపించుకోడానికి పదాల అర్థాలను కూడా మార్చేస్తారా? ఇదిగో, బ్రౌణ్యం ఏం చెబుతోందో చూడండి.. వేర్పాటు అంటే ప్రత్యేకపడటమే! దేశం నుంచి విడిపోతారా, రాష్ట్రం నుంచి విడిపోతారా, తండ్రి ఆస్తిని విడగొట్టుకుంటారా,.. అనేవి ఆ పదానికి అనవసరం, దానికి వివక్షలేమీ లేవు. అంచేత, మీ తె.వాద పక్షపాతాన్ని చూపించుకోడానికి మరో పద్ధతిని - మరే పద్ధతినైనా - ఎంచుకోండి. భాషకు కొత్తర్థాలు చెప్పకండి.

’అన్నల్దమ్ముల్లాగా విడిపోదాం’ అనే మాట వినని ఆంధ్రుడున్నాడా ఇవ్వాళ?  ఇది తె.వాదుల ఊతపదం కాబట్టి, దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడతారు కాబట్టి ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు కూడా ఈ మాట బారిన పడకుండా తప్పించుకోలేడు. అన్నల్దమ్ములు విడిపోయి ఆస్తులు అప్పులూ పంచుకోడాన్ని ఏర్లు పడటం / వేర్లు పడటం / వేరు పడటం అనే అంటారు.వేరు పడటం అనే మాట తప్పేమీ కాదు, గౌరవహీనమైనదేమీ కాదు. కాకపోతే వేరుపడటం అనే పని ఏమంత ఉదాత్తమైనదేమీ కాదు, అంచేత ఆ మాట ఈ పాత్రికేయుడికి తప్పుగా అనిపించి ఉండొచ్చు.
 
ప్రత్యేకరాష్ట్రం కావాలని అడగడం వేర్పాటే. అలా అడిగేవాడు వేర్పాటువాదే! తె.వాదుల కోసం దాన్ని మార్చనక్కర్లేదు. ఈ మేధావులు తమ నూత్న తె.వాద మహా విజ్ఞానంతో టీవీ కెమెరాల ముందుకొచ్చి నిష్పాక్షికులమంటూ పోజు కొడుతూ అబద్ధాలు చెప్పుకుపోతూంటారు. మనకు జ్ఞానదానం చేసేద్దామని చూసేస్తుంటారు. పాత్రికేయుడు, ప్రొఫెసరు, ఆచార్యుడు,.. అంటూ తమకో ట్యాగు తగిలించుకు తిరుగుతూంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ, టీవీల లంగర్లు కొందరు పళ్ళికిలించి ఆహా ఓహో అని అంటూంటారు.

ఈ కార్యక్రమంలో ఆ లంగరు ’అదేంటండీ ఆ మాట తప్పెలా అవుతుంది’ అని అడగలేదు. లంగరు పని వాళ్ళ చేత వాగించడం వరకేను, సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు అని అంటారా.. అది నిజమే, లంగరు వాళ్ళ చేత వాగించాలిగానీ తాను వాళ్ళ అభిప్రాయాలను ఖండించడం లాంటివి చెయ్యకూడదు. మరి అదే లంగరు ఓ పక్కన తిరపతి నుండి ఒక ప్రొఫెసరు గారితో కూడా మాటలు కలిపాడు. మాటల్లో ఆయనేదో చెప్పబోగా, ఈయన కలిగించుకోని ఆయన అభిప్రాయాలను తోసిపుచ్చాడు. ఈ లంగరుకెందుకంత పక్షపాతం?
................
 
నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ ’వక్రవాణి’ వినిపించే ప్రొఫెసర్లు మనకు కొంతమంది ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే, ఈ పాత్రికేయ మేధావులు చాలా నయం. మీరు ఏ టైములోనైనా టీవీ పెట్టండి.. ఏదో ఒక చానల్లో మొహం గంటు పెట్టుకునో, ఎవడో ఒకణ్ణి తిడుతూనో కనిపిస్తారీ వక్రవాణులు. అసలు వీళ్ళు కాలేజీలకి పోయి పిల్లలకు పాఠాలెప్పుడు చెబుతారో అర్థం కాదు. ఇక్కడ మాత్రం లంగర్లకు, తోటి విశ్లేషకులకు క్లాసులు పీకుతూంటారు.

ఈమధ్య ఐన్యూస్ లో ఒక చర్చ చూసాను. లంగరు పేరు అంకం రవి. ప్రభాకరు అనే తెరాస నాయకుడు, చక్రపాణి అనే ప్రొఫెసరు :) , ఈమధ్య కాలంలో ఉస్మానియా ఐకాసలో నాయకుడై ఆ తరవాత టీవీల్లో విశ్లేషకుడైన ఒక విద్యార్థి -ఈ ముగ్గురూ చర్చించేవారు.

తెరాస నాయకులు రాజీనామాలు చెయ్యగా ఏర్పడిన ఖాళీల్లోఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళ కుటుంబీకుల్ని నిలబెట్టాలని ఆ కుర్రాడు (విద్యార్థి) అంటున్నాడు.  ప్రభాకరు, చక్రపాణీ కలిసి అతగాడి నోరు మూయిస్తున్నారు. ప్రభాకరు చాలా నయం.. నువ్వు అలా మాట్టాడ్డం తప్పు, ఇలా మాట్టాడ్డం తెలంగాణ ఉద్యమానికి చేటు అంటూ మాట్టాడుతున్నాడు. చక్రపాణి మాత్రం ఆ కుర్రాడి నోరు బలవంతానా నొక్కెయ్యాలనే చూసాడు (ఈయనలో తెలంగాణ పట్ల నిష్పాక్షికత ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ ఉంటుంది). ఇలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అంటూ లంగరు మీద ఆవేశపడి, ఆయాసపడి పోయాడు. ’ఇతణ్ణి మాట్టాడకుండా ఆపుతారా నన్ను వెళ్ళిపొమంటారా’ అని లంగరును బెదిరించాడు.

చక్రపాణి, ప్రభాకరు ఆ కుర్రాణ్ణి నానామాటలూ అన్నారు. మరో విద్యార్థి నాయకుడు ఫోనులో చెప్పిన మాటలను పట్టుకుని, నువ్వసలు ఉద్యమంలో పాల్గొననేలేదు, నువ్వు సమైక్యవాదుల తొత్తువు అనే అర్థం వచ్చేలా చిన్నబుచ్చబోయారు. ఇవన్నీ నేరుగా అతణ్ణి అనలేదు, తెలివిగా ఆ ఆర్థం వచ్చేలా మాట్టాడారు. నువ్వసలు తెలంగాణ వాడివే కాదు, ఖమ్మం జిల్లా సరిహద్దుకు చెందిన కృష్ణా జిల్లా వాడివి అనీ అన్నారు.

పాపం అతడు సమాధానం చెప్పుకోబోతే మధ్యలోనే అడ్డుపడి నోరు మూయించారు. నేను ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయాను, చంద్రబాబు ఇంటిదగ్గర ధర్నా చేసి అరెస్టయ్యాను. అంటూ తన ఉద్యమ నేపథ్యాన్ని చెప్పుకోబోతే చక్రపాణి అరిచేసి నోరు మూయించాడు. ఏంమాట్టాడుతున్నావు నువ్వు అంటూ ఆ కుర్రాణ్ణి బెదిరించబోయాడు. ఆ కుర్రాడు చక్రపాణిని ఎదిరించేందుకు ప్రయత్నించాడు. అయితే చక్రపాణికి దీటుగా రౌడీతనం చెయ్యలేకపోయాడు పాపం! అంకం రవి ప్రేక్షకుడే అయ్యాడు.  ఇదే చక్రపాణి గతంలో ఒక కోస్తా ప్రాంతపు విద్యార్థిపై కూడా జులుం చేసాడు. అప్పుడు నే రాసిన టపా చూడండి.

ఇదే చక్రపాణి, నెల్లూరులో హెచ్చెమ్ టీవీ వాళ్ళ దశ దిశ కార్యక్రమంలో కూడా ఇలాంటి 'నిష్పాక్షిక' వ్యాఖ్యలే చేసాడు.. తెలంగాణ రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు అని వచ్చిన ఆరోపణను ప్రస్తావిస్తూ... ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని చెప్పుకుపోయాడు. కానీ, అదే లెక్క కోస్తా సీమల్లో వచ్చిన ఉద్యమానికి వర్తింపజేయడాయన. కోస్తా సీమల ఉద్యమం, కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదని టీవీల్లో చెబుతూంటాడిదే వ్యక్తి!

నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ, టీవీల ముందు దొంగ కబుర్లు చెబుతూ, వక్రవాణి వినిపించే నిష్పాక్షికుల నోరు మూయించే రోజు ఎప్పుడొస్తుందో! ఈ మే..ధావుల వర్గవివక్ష నుండి సామాన్యులకు ఎప్పటికి విముక్తి కలుగుతుందో!!
http://chaduvari.blogspot.com/2010/04/blog-post.html

2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు!


తెలంగాణ ఉద్యమంలో 2010 జనవరి 18 న హఠాత్తుగా కులం ప్రసక్తి తలెత్తింది. ఉద్యమ నేతల కులాలను ఎత్తిచూపి, ఎందుకు వాళ్లకింత ప్రాముఖ్యత, దళిత బహుజనులకు ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటూ కంచె అయిలయ్య ప్రశ్నిస్తూంటే చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు, విశ్లేషక శేఖరులూ కొండొకచో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.

అయిలయ్యవి సూటిప్రశ్నలు.., తెలంగాణ రాజకీయ జేయేసీకి కోదండరామిరెడ్డి నాయకుడు. తెదేపా తరపున నాగం జనార్దనరెడ్డి, కాంగ్రెసు తరపున జానారెడ్డి, రామిరెడ్డి దామోదరరెడ్డి,.. అంతా వీళ్ళేనా? ఏఁ, జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి కాకుండా మంద కృష్ణ మాదిగను ఎందుకు పెట్టలేదు? మంద కృష్ణను జేయేసీ నాయకుడిగా చేసి, తెలంగాణ ఏర్పడ్డాక ఆయన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించండి అని అన్నాడు. మొన్నమొన్నటిదాకా సిద్ధాంతకర్త జయశంకర్ ఉండేవాడు, ఇప్పుడసలు కనబడ్డమే లేదు. ఎందుకు ఆయన్ను పక్కనబెట్టారు? -ఇదీ వరస!

జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులను, స్థానిక ప్రజా ప్రతినిధులను తమ పదవులకు రాజీనామాలు చెయ్యమని అడుగుతున్నాడు. అసలు ముందు ఆయన రాజీనామా చెయ్యాలి. ఆయన చెయ్యకుండా ఇతరులను చెయ్యమనడం ఏంటి? అని అయిలయ్య ప్రశ్నించాడు. ఉద్యమం జరుగుతున్న కాలంలో ఒకరోజున హరీష్ రావు పెట్రోలు పోసుకుని అంటించుకుంటానన్నాడు. కానీ అందరూ ఆపారు. ఆ తరవాత పదుల సంఖ్యలో దళిత బహుజన పిల్లలు పెట్రోలు పోసుకుని కాల్చుకుని చనిపోయారు. ఇప్పుడు జేయేసీ నాయకుడు మీరు రాజీనామాలు చేసెయ్యండి అని అంటున్నాడుగానీ తాను మాత్రం రాజీనామా చెయ్యడం లేదు అని పాయింటు లాగాడు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అత్యంత నిష్పాక్షిక (నిష్పాక్షికత = తెలంగాణ వాదం) రాజకీయ విశ్లేషకుడైన ఘంటా చక్రపాణి తన మామూలు ధోరణిలోనే - కోస్తా విద్యార్థి నాయకులను గౌరవించినట్టుగానే- అయిలయ్యనూ గౌరవించబోయాడు. 'ఆయా రాజకీయ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చెయ్యడానికీ కోదండరామ్ రాజీనామా చెయ్యడానికీ సంబంధం ఏంటి? ఆ పదవుల్లో ఉన్నవాళ్లకు ఆ పదవే జీవనాధారం అంటే వాళ్లను అవమానించడమే' అని అన్నాడు. 'ఏదో బీసీలు బీసీలూ అని అంటున్నారే.. ఇంత ఉద్యమం జరుగుతూంటే బీసీలు ఎందుకు పాలుపంచుకోడం లేదండి?' అని అడిగాడు.  వెంటనే అయిలయ్య బీసీలను అవమానిస్తున్నారు అంటూ అనబోయాడు. నిష్పాక్షిక విశ్లేషకుడు వెంటనే సర్దుకుని, 'మీరెందుకు ఉద్యమంలో పాలుపంచుకోవడంలేదు?' అని అడిగాడు. 'మనలాగా స్టూడియోలకొచ్చి విమర్శించడం కాదండీ గొప్ప, ఉద్యమంలో చేరి, ప్రత్యక్ష కార్యాచరణలో పాలుపంచుకోవాలి' అనీ అన్నాడు. 'యూనివర్సిటీలో అంత ఉద్యమం జరుగుతూంటే కనీసం అటు తొంగైనా చూళ్ళేదు గానీ నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం గారిని రాజీనామా చెయ్యమని అడగడమేంటండి' అంటూ ఈసడించాడు.

చర్చలో 'ఇప్పటిదాకా ఆయన్ను కోదండరామ్‌గానే ప్రజలెరుగుదురు. ఇప్పుడు మీరు రెడ్డి అంటూ కులం పేరుతో పిలిచి కులాన్ని మధ్యలోకి లాగుతున్నారు' అనే విమర్శ తలెత్తినపుడు, అయిలయ్య 'నేనేమీ కొత్తగా పిలవడం లేదు. యూనివర్సిటీలో ఆయన్ను కోదండరామిరెడ్డిగానే అందరూ పిలుస్తారు. ఇక్కడ కోదండరామ్ అని పిలుస్తున్న సంగతి నాకు తెలవదు' అని అన్నాడు.

అయిలయ్య కమ్యూనిస్టులను విమర్శిస్తూ, 'ఒక్క పుచ్చలపల్లి సుందరయ్య తప్పించి కమ్యూనిస్టుల్లో సరైన నాయకుడంటూ లేడు. అందరూ అగ్రకులాలకు చెందినవాళ్ళే. బెంగాల్లో కూడా అంతే.. బసులు, బెనర్జీలు, ముఖర్జీలు, .. అందరూ అగ్రకులాలవాళ్ళే', అంటూ విమర్శించాడు. చర్చలో మంద కృష్ణ పాల్గొంటూ, 'దళిత బహుజనులకు జేయేసీలో ప్రాముఖ్యత లేద'ని అయిలయ్యతో ఏకీభవించాడు. కడియం శ్రీహరి దళితులకు ప్రాధాన్యత లేదని అంగికరిస్తూనే, ప్రస్తుతం ఉద్యమమున్న పరిస్థితిలో ఏ కులాలను పట్టించుకోకూడదనీ, పక్కనబెట్టాలనీ అన్నాడు.

అయిలయ్యది దళిత బహుజనవాదం. ఈ వాదాన్ని ముందుకు తీసుకురావడానికి ఇది సందర్భమా కాదా అనేది ఆయనకు అనవసరం. తెలంగాణ ఏర్పడటం కంటే, దళిత బహుజనులు అధికారంలోకి రావడమే ఆయనకు ముఖ్యం. చర్చలో అయిలయ్య సమైక్యవాద నాయకులకు కూడా ఒక ప్రతిపాదన చేసాడు.. ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ధర్మాన ప్రసాదరావును, ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ నుండి దామోదర్ రాజనర్సింహను పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నడిపిద్దాం రండి, నేనూ సమర్ధిస్తాను అని అన్నాడు. అదీ సంగతి!
http://chaduvari.blogspot.com/2010/01/2010-18.html

తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం


అభివృద్ధిలో వెనకబడి పోయామని, మాకు అన్యాయం జరిగిందనీ, జరుగుతోందనీ చెబుతూ ప్రత్యేక రాష్ట్రం ఉంటే తప్ప లాభంలేదని తె.వాదులు డిమాండు చేస్తూ వచ్చారు. తరవాత్తరవాత వీళ్ళ గొంతు కాస్త మారి, 'ఆంద్రోళ్ళు' మమ్మల్ని అణగదొక్కారంటూ రాష్ట్ర విభజన భజన చేసేవారు. ఇప్పుడవన్నీ పక్కకు నెట్టి ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ అంటూ కొత్త కారణాలు చెబుతున్నారు. ఈ కారణాల్లో న్యాయం ఉందా లేదా చెప్పండి అంటూ తెలివితక్కువ వాదనలు చేస్తున్నారు. అభివృద్ధి లేదన్న మాట మాత్రం ఇప్పుడు వీళ్ళ నాలుకల మీద కనబడదు.
ఆ వాదనలో పసలేదని తేలిపోయింది. తె.వాదులు చెప్పే అభివృద్ధిలో-మేం-వెనకబడ్డాం-ఆంద్రోళ్ళు-ముందుబడ్డారు అనే వాదన శుద్ధ తప్పని తేలిపోయింది కాబట్టి, వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కాకిలెక్కలని తేలిపోయింది కాబట్టి వాళ్ళకు వాదన మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంచేత మార్చారు. అయితే ఈ అబద్ధాలను ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్న తె.వాదులు కొందరు అక్కడక్కడ లేకపోలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న మరో పాత అబద్ధం గురించి మాట్టాడుకుందాం.

1956 లో హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలను కలిపెయ్యక ముందు హై. రాష్ట్రం బడ్జెట్టు మిగుల్లో ఉండేది. ఆ డబ్బుల్ని కొట్టేద్దామని దురుద్దేశంతో, ఆంద్రోళ్ళు కుట్ర చేసి, రెండు రాష్ట్రాలనూ కలిపేసారు. ఆ మీదట మా ప్రాంతపు మిగులునంతా ఆంధ్ర ప్రాంతానికి వాడేసారు అంటూ తె.వాదులు ఆరోపణలు చేస్తూంటారు. కోస్తా సీమల జనం మాత్రం దానికి ఎక్కడా సమాధానం చెప్పలేదు. పాపం, మరి కుట్రలు చెయ్యడం తప్పే గదా అని నోరు మూసుకుని ఉంటారు. నేనైతే అందుకే నోరు మూసుకుని ఉన్నాను. అయితే సత్యం కుంభకోణంలో లాగా తె.వాదుల అబద్ధాలు ఒకటొక్కటే బయటకు రావడం మొదలయ్యాక, ప్రచారంలో ఉన్నవాటిలో ఇంకా ఎన్నెన్ని అబద్ధాలున్నాయో తెలుసుకుందామని వెతికితే, ఓ నాల్రోల కిందట కొత్త సంగతి బైటపడింది. నాకిది కొత్తదేగానీ మీలో కొందరికి తెలిసే ఉండొచ్చు. ఆ నిజమిది..

1956 నాటికి హైదరాబాదు రాష్ట్రం లోటు బడ్జెట్టులో ఉంది. ఆ ఏడాదే కాదు, 1952-53 నుండి ఆ రాష్ట్రం లోటు బడ్జెట్టులోనే ఉంది. 1951-52 లో 92 లక్షల మిగులులో ఉన్న బడ్జెట్టు, 1955-56 నాటికి 5 కోట్ల 32 లక్షల లోటు చూపించింది.



1955-56 లో ఆ రాష్ట్ర నికరాదాయం ఎంత ఉందో చూసారా? 21 కోట్ల 62 లక్షలు. ఖర్చు 26 కోట్ల 94 లక్షలు. తె.వాదులూ ఏమిటి దీనర్థం? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగేనాటికి హై. రాష్ట్రాన్ని పతనం బాటలో నడిపిస్తోంది అప్పటి ప్రభుత్వం. మరొక్క గమనిక.. ఈ నిర్వాకం ప్రజా ప్రభుత్వం హయాంలో జరిగింది. సైనిక పాలనలోనో, అధికారి పాలనలోనో కాదు.

సరే, ఇప్పుడిక ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటో చూద్దాం..



1955-56 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. 10 కోట్ల 73 లక్షల లోటు బడ్జెట్టుతో ఉంది. ఇక్కడో సంగతి.. ఆంధ్ర రాష్ట్రం అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడింది. మౌలిక వసతుల కోసమే ఎంతో ఖర్చు పెట్టాల్సిన సమయం. పైగా, సరిగ్గా అదే సమయంలో (1952లో) విజయవాడ దగ్గర కృష్ణానదిమీద బ్యారేజీ కొట్టుకుపోయింది. కొత్త బ్యారేజీని (ఇప్పటి ప్రకాశం బ్యారేజీ) కట్టాల్సొచ్చింది. అది 1954 లో మొదలై, 1957లో పూర్తయింది. ఆకాలంలో జరిగిన పంట నష్టం, కొత్త బ్యారేజీ కట్టడానికి జరిగిన ఖర్చు - ఇదంతా కొత్త రాష్ట్రం బడ్జెట్టు తూకాన్ని కొంతవరకైనా దెబ్బతీసి ఉంటుంది. బడ్జెట్టును పరిశీలించేటపుడు మనం వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ లెక్కలను బట్టి చూస్తే తెలుస్తోందేంటయ్యా అంటే రెండు రాష్ట్రాలు కూడా ఆర్థిక పరంగా ఒకే రకంగా ఉన్నాయి. మేం అద్భుతంగా ఉన్నాం అంటూ తె.వాదులు చెప్పుకునే గొప్పతనాలేవీ ఈ లెక్కల్లో కనబడవు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర విపత్కర పరిస్థితిని లెక్కలోకి తీసుకుంటే, హైదరాబాదు రాష్ట్రంలో ఇప్పటి తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా కలిసి ఉండేదన్న సంగతిని గమనంలో ఉంచుకుని చూస్తే బహుశా తెలంగాణ కంటే ఆంధ్రే మెరుగ్గా ఉండి ఉండొచ్చు కూడా.

సరే, ఈ లెక్కలను ఒకసారి పోల్చి చూద్దాం..
1955-56 నాటికి హై. రాష్ట్రం ఆదాయం: 21 కోట్లు. ఆంధ్ర రాష్ట్రం ఆదాయం: 17 కోట్లు
మొత్తం ఆదాయంలో హై. వాటా: 55% (హైదరాబాదు రాష్ట్రమంటే, తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా. ఆ ప్రాంతం నుండి వచ్చినఆదాయం కూడా ఇందులో కలిసుందని మనం గుర్తుంచుకోవాలి.)
ఆంధ్ర వాటా: 45%
ప్రస్తుతం ఈ వాటాల అంతరం ఇంకా పెరిగి ఉంటుంది.

మా మిగులును వాడేసుకున్నారు బాబో యంటూ అబద్ధాలు చెప్పెయ్యడమే కాదు, తమ అబద్ధాలను నిజమని మనల్ని నమ్మించడానికి 'హైదరాబాదు ఆదాయాన్ని మీ అభివ్రుద్ధికి ఉపయోగించడంతో పాటు హైదరాబాదును రాజధాని అవసరాలకు వాడుకున్నందుకు కూడా పరిహారం ఇవ్వాలి.' అని అడుగుతున్నారు.

తె.వాదులూ.. కోస్తా సీమలు వాడేసుకోడానికి, ఆనాటి హై. రాష్ట్రబడ్జెట్టులో పెద్ద బొక్క తప్ప, ఇక్కడేమీ లేదు. వాళ్ళంటూ ఏదన్నా వాడుకుని ఉంటే అది మీ బడ్జెట్టు లోటునే అయ్యుండాలి. వాళ్లకున్న బడ్జెట్టు లోటు చాలదన్నట్టు మీ లోటును కూడా, కుట్ర చేసి మరీ, ఎత్తుకుపోయారంటారా? ఇహనాపండి మీ అసంబద్ధ, అబద్ధ వాదనలు.
http://chaduvari.blogspot.com/2010/01/blog-post_11.html

చవకబారున్నర విశ్లేషకుడు

ఆ మధ్య హై.లో సినిమా షూటింగుల మీదబడి ధ్వంసం చేసారు ముష్కరులు. మనోజ్ సినిమా షూటింగు సంఘటన పట్ల స్పందనగా మోహన్‌బాబు ఘాటుగానే మాట్టాడాడు. ఆ తరవాత అల్లు అర్జున్ సినిమా షూటింగు మీద కూడా దాడి జరిగింది.

మన టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు. దాడి విషయమ్మీద ఓ టీవీలో మాట్టాడుతూ -
'మోహన్ బాబు మాట్టాడినదానిపై ఎవ్వరూ ఖండించలేదేంటి' అని వాపోయాడు. వెనువెంటనే, అల్లు అర్జున్ సినిమాపై జరిగిన దాడి గురించి మీరేమంటారు అని అడిగితే, అందుకు సమాధానంగా, అదెవరో ఏబీవీపీ వాళ్ళు చేసినది అని తేల్చెయ్యబోయాడు ముందు. మళ్ళీ తిప్పుకుని, దాడిని సమర్ధిస్తూ మాట్టాడాడు. అతగాడి దృష్టిలో ముష్కరులు చేసిన దాడి సమర్ధనీయము, దాన్ని ఎదుర్కొన్నవాళ్ళ బాధ మాత్రం ఖండనీయము! రెండు నాలుకల విశ్లేషకుడు!

ఇవ్వాళ మహాటీవీలో అతడి ప్రవర్తన మరీ నేలబారుగా ఉంది. చర్చలో అతడితోపాటు ఒక సమైక్యాంధ్ర ఉద్యమ విద్యార్థి కూడా పాల్గొన్నాడు. ఆ కుర్రాడి వయసు ఇతగాడి వయసులో సగం కూడా ఉండదు. ఆ కుర్రవాణ్ణి ఇష్టమొచ్చినట్టుగా చీదరించుకున్నాడు, కసిరేసాడు. ఆ కుర్రాడు కేసీయారు గురించి మాట్టాడుతూ అతడి తాగుబోతుతనం గురించి మాట్టాడబోగా వ్యక్తిగత విషయాలు మాట్టడవద్దని చెబుతూ, "ఇక్కడ పిచ్చివాగుడు వాగకు" అని అన్నాడు. పోనీ ఘంటా ఏమన్నా సరిగ్గా మాట్టాడాడా.. విజయవాడలో ఒక ఎంపీ యొక్క ఇద్దరు భార్యల వ్యవహారం గురించి మాట్టాడాడు. అది ఆ ఎంపీ వ్యక్తిగత వ్యవహారమన్న ఇంగితం లేకుండా పోయింది అతడికి.  ఇదీ అతగాడి దిగజారుడు వ్యక్తిత్వం.

ఆ కుర్రాడు లగడపాటి గురించి మాట్టాడబోగా, మాకు అలాంటివాళ్ళ సంగతి అనవసరంలెండి అంటూ తీసేసాడు. అప్పుడా కుర్రవాడు అదేంటండీ ఆయన ఎంపీ, రేపు పార్లమెంటులో ఓటు వెయ్యాల్సి ఉంది మరి అని అన్నాడు. అందుకు ఘంటా చక్రపాణి ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం. "ఓటెయ్యకపోతే దొబ్బెయ్యమనండి, అతడి ఓటు మాకేం అక్కర్లేదు". ఖచ్చితంగా ఇవేమాటలుకాదుగానీ దాదాపుగా ఇవేముక్కలన్నాడు. ఒక చర్చలో ఇలా మాట్టాడే ఇతగాడొక ప్రొఫెసరంట! కనకపు సింహాసనమున.. గుర్తొచ్చింది నాకు.

అలా సాగిన ఆ చర్చలో ఆ కుర్రాడి గురించి, ఒకసారి ఇలా అన్నాడు..
"మీ ఉద్రేకాలు చూపించాలనుకుంటే మీ ప్రాంతంలో చూపించుకోండి, చానళ్ళలో కాదు." అంటే కోస్తా సీమల వాళ్ళు తమ ఉద్రేకాలను తమ ప్రాంతాల్లో చూపించాలి, ఈయన మాత్రం తన ఉద్రేకాన్ని చానళ్ళలో చూపిస్తాడు కాబోలు.

ఈ చర్చలో ఘంటా ప్రవర్తన ఏ క్షణంలో కూడా ఒక ప్రొఫెసరు స్థాయికి తగినట్టుగా లేదు. నిష్పాక్షిక విశ్లేషకుడు కాదుగదా.. కనీసం ఒక చవకబారు విశ్లేషకుడు లాగా కూడా ప్రవర్తించలేదాతడు. ఉద్యమం పేరిట బస్సుల్ని తగలబెట్టే ఏదో ముఠాలో నుండి మార్పుకోసం నేరుగా స్టూడియోకి వచ్చిన బాపతులాగా అనిపించాడు.

టీవీలవాళ్ళూ, సమస్యకు సామరస్య పరిష్కారం కావాలంటే ఈ రకం మనుషులను మాత్రం దూరంగా ఉంచాలి.
http://chaduvari.blogspot.com/2009/12/blog-post_553.html

తెలంగాణవాదుల దొంగ లెక్కలు


ఎప్పుడో ఐదారు దశాబ్దాల కిందట.. పోలీసు చర్య తరవాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. ఆ తరవాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రెండు రాష్ట్రాలూ కలిసి ఒకే రాష్త్రంగా ఏర్పడాలని పెద్దలు కోరుకున్నారు. హైదరాబాదు రాష్ట్ర శాసనసభ మెజారిటీతో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఆ విధంగా ఏకమయ్యాక, తెలంగాణకు అనేక అన్యాయాలు జరిగాయనే ఉద్దేశంతో, విడిపోవాలనే ఉద్యమం మొదలెట్టారు, తెలంగాణవాదులు. 1969లో పెద్ద ఉద్యమమే చేసారు. అప్పటికి ఆ ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరవాత, ఈ నలభై యేళ్ళలోనూ అనేక మార్పులొచ్చాయి, అభివృద్ధి జరిగింది. అయితే విడిపోవాలనే తెలంగాణవాది కోరిక అలాగే ఉండిపోయింది. తెలంగాణవాదుల కసి ('ఆంద్రోళ్ళు' అభివృద్ధి చెందారు, మేం చెందలేదు అనే కసి), కాంక్ష (పదవీ కాంక్ష) అలాగే ఉండిపోయాయి. కానీ ఈ కారణాలను బైటకు చెప్పుకోలేరు. అంచేత అభివృద్ధి జరగలేదని చెబుతూ రకరకాలుగా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. చేస్తూ, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం చేస్తున్నారు.


 ఈ మధ్య ఒక వెబ్‌సైటులో ప్రభుత్వోద్యోగుల గురించిన ఒక దొంగ లెక్క చూసాను. అందులో ఇలా రాసారు..


మొత్తం ప్రభుత్వోద్యోగులు – కోస్తా+సీమ (13 జిల్లాలు) 9 లక్షలు, తెలంగాణ (10 జిల్లాలు) 3 లక్షలు. తెలంగాణలోని ప్రభుత్వోద్యోగుల సంఖ్య కోస్తా సీమలతో పోలిస్తే మూడోవంతు మాత్రమే ఉన్నారంట! అబద్ధాలు చెప్పినా కాస్తో కూస్తో నమ్మేట్టుండాలి. ఈ లెక్కలను చిన్నపిల్లలు కూడా నమ్మరు. ఇలాంటి దొంగ లెక్కలు చెప్పి సానుభూతి కొట్టెయ్యాలని చూస్తూంటారీ తెలంగాణవాదులు. అసలు లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది: సీమ+కోస్తాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య:684083 తెలంగాణలో:614971. చూసారా తేడా ఎంతలా ఉందో! ఇవి 2006 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కలు.

ఈ అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు ఒక టెక్నిక్ వాడుతూంటారు.. అదేంటంటే, తమకు అనుకూలంగా ఉందనుకుంటే హైదరాబాదును లెక్కలోకి వేసుకుంటారు లేదంటే తీసేస్తారు. తెలంగాణ పది జిల్లాలోను గణాంకాలు ఇలా ఉన్నాయి అని అంటారు. పది జిల్లాల గురించి మాట్టాడుతున్నారుగదా, హైదరాబాదును కూడా కలిపే ఉంటార్లే అని అనుకుంటాం మనం. కానీ అబద్ధాలు చెప్పడంలో చెయ్యి తిరిగిన తెలంగాణావాది సామాన్యుడనుకుంటున్నారా? ఉదాహరణకు ప్రభుత్వ గ్రంథాలయాల గురించిన లెక్క ఇలా చెబుతారు:
ప్రభుత్వ గ్రంథాలయాల సంఖ్య – కోస్తా (9 జిల్లాలు) 630, రాయలసీమ (4 జిల్లాలు) 243, తెలంగాణ (10 జిల్లాలు) 450.
తెలంగాణ 10 జిల్లాల్లోని గ్రంథాలయాల లెక్క అంటే.., హైదరాబాదును కూడా కలిపేసి ఉంటారు లెమ్మనుకుంటాం. కానీ పైలెక్కలో హై.లోని గ్రంథాలయాల లెక్క కలపలేదు. అది కలిపితే తెలంగాణ గ్రంథాలయాల సంఖ్య 562 అవుతుంది. మొత్తం గ్రంథాలయాల సంఖ్యలో 61 శాతం కోస్తా సీమల్లో ఉంటే 39 శాతం తెలంగాణలో ఉన్నాయి. ఈ గణాంకాలు కేవలం శాఖా గ్రంథాలయాల లెక్క మాత్రమే. అన్ని రకాల గ్రంథాలయాలను లెక్కలోకి తీసుకుంటే 60శాతం కోస్తా సీమల్లో ఉంటే, 40 శాతం తెలంగాణలో ఉన్నాయి. రెండు ప్రాంతాల భౌగోళిక నిష్పత్తితో సమానం.

ఇక జిల్లాల వెనకబాటుతనం చూద్దాం: తెలంగాణలోని మహబూబ్‌నగరు, నల్గొండ జిల్లాలు తప్పించి ఇతర జిల్లాలను పోల్చి చూడండి. మిగతా ప్రాంతంలోని అభివృద్ధి చెందిన జిల్లాలతో పోల్చదగిన అభివృద్ధి ఈ జిల్లాల్లో జరిగిందనేది వాస్తవం. రెండు ప్రాంతాల్లోని వరి ఉత్పత్తి గణాంకాల సంగతే చూడండి:
రాష్ట్రంలో జరిగే మొత్తం వరి ఉత్పత్తిలో కోస్తా+సీమల శాతం: 62
తెలంగాణ శాతం: 38. ఇది భౌగోళిక విస్తీర్ణాల ఉత్పత్తికి సమానం. (హైదరాబాదు జిల్లాలో వరి ఉత్పత్తి సున్నా అని గుర్తుంచుకోవాలి.

కింది పట్టికలో తెలంగాణ జిల్లాల్లోని వరి ఉత్పత్తిని, కోస్తా సీమ ప్రాంతాల్లోని వెనకబడ్డ జిల్లాల ఉత్పత్తితో పోల్చి చూపించాను.
2005-06లో కోస్తా, సీమల్లోని కొన్ని జిల్లాల్లో వరి ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
  1. శ్రీకాకుళం; 281,000
  2. విజయనగరం: 141,000
  3. విశాఖపట్నం: 132,000
  4. అనంతపురం: 125,000
  5. కడప: 142,000
  6. చిత్తూరు: 231,000
పై జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా కూడా తెలంగాణ జిల్లాల వరి ఉత్పత్తికి సరిరాదు!

కేవలం ఉభయగోదావరులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నెల్లూరు, కర్నూలు జిల్లాలు మాత్రమే తెలంగాణ జిల్లాల్లో ఏదో ఒకదానికంటే ముందంజలో ఉన్నాయి.

తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
  1. నిజామాబాదు: 506,000
  2. కరీంనగరు: 913,000
  3. మెదక్: 248,000
  4. వరంగల్లు: 646,000
  5. ఖమ్మం: 531,000
  6. మహబూబ్‌నగరు: 320,000
  7. నల్లగొండ: 939,000
హైదరాబాదు జిల్లా పూర్తిగాను, రంగారెడ్డి జిల్లా చాలావరకు పట్టణీకరణం చెందిందని అక్కడ వ్యవసాయం దాదాపుగా లేదన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి.

"ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యంత వెనకబడ్డ మహబూబ్‌నగరు జిల్లాలో 4% తెల్ల కార్డులిచ్చారు. అన్నిటికంటే అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 7% కార్డులిచ్చారు" అని తెలంగాణవాదులు తమ వెబ్‌సైటులో చెప్పుకున్నారు. అదెంత నిజమో చూద్దాం. 2005-06 లో ప్రభుత్వం పంచిన రేషను బియ్యం వివరాలు ఇలా ఉన్నాయి: మహబూబ్ నగరు: 1,33,796.505 టన్నులు. పశ్చిమ గోదావరి: 1,26,160.655 టన్నులు.అనంతపురం తరవాత మహబూబ్‌నగర్లోనే ఎక్కువ బియ్యాన్ని పంచారు. కార్డుల శాతాల్లో తెలంగాణవాదులు చెప్పిన తేడా నిజంగా ఉంటే, బియ్యం పంపిణీలో ఈ తేడా ఎలా వస్తుంది? ఈ లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినవి. తెలంగాణవాదులు తమ దొంగలెక్కలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలవదు మరి.

తెలంగాణ ముఖ్యమంత్రుల మొత్తం పదవీకాలం ఆరేళ్ళని రాసారు. కానీ అది దాదాపు తొమ్మిదేళ్ళు. చేతకానివాడు ఆరేళ్ళున్నా తొమ్మిదేళ్ళున్నా ఒకటేననుకోండి. తమ ప్రజాప్రతినిధుల చేతకానితనానికి తమను తాము నిందించుకోక, 'ఆంద్రోళ్ళ'ను నిందించడం తెలంగాణవాదులకు సహజనైజంగా మారింది.

లేనిపోని కట్టుకథలు చెప్పి, వాటన్నిటికీ కారణం 'ఆంద్రోళ్ళే' నని చెప్పడం తెలంగాణ వాదులకు అలవాటైపోయింది. కాబట్టి తెలంగాణవాదులు చెప్పే అంకెల్లోని నిజాలను గమనిస్తూ ఉండాలి.
----------------------------------------

తాజాకలం: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల కోసం ఈ లింకు చూడండి.
  • 610 GO: http://go610.ap.gov.in/
  • 6 సూత్రాల ఒప్పందం: http://www.aponline.gov.in/Apportal/HomePageLinks/PresidentialOrder/Presidential_Order.pdf
  • జలాశయాల వివరాలు: http://irrigation.cgg.gov.in/reservoirssms/
  • నీటిపారుదల ప్రాజెక్టులు: http://www.irrigation.ap.gov.in/ దీని ప్రకారం కొత్త ఆయకట్టు వివరాలు:
    • ఆంధ్ర: 477646
    • తెలంగాణ: 476479
    • రాయలసీమ: 57768
  • జలయజ్ఞం: http://www.irrigation.ap.gov.in/
http://chaduvari.blogspot.com/2009/12/blog-post_27.html

    'ఆంద్రోళ్ళు' దురాక్రమణవాదులా?


    తెలంగాణ ఎందుకు అని అడిగితే నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అని సమాధానం వస్తుంది. ఇంకోటి కూడా వినవస్తుంది.. దాడి, దోపిడీ, దురాక్రమణలను ఎదుర్కొనేందుకు అని. సంస్కృతి మీద దాడి, నిధుల దోపిడీ, ఆస్తుల దురాక్రమణలను ను ఎదుర్కొనేందుకు అని వీటికర్థం. ఈ రెండో సెట్టు సరిగ్గా ఇదే కాకపోవచ్చు, నేను పొరపాటు పడి ఉండవచ్చు. కాస్త అటూ ఇటూగా ఇలాగే ఉంటది.


    తెలంగాణ ప్రాంతానికి వచ్చి, 'ఆంద్రోళ్ళు' పెద్దాళ్ళై పోయారు, మా భూముల్ని ఆక్రమించారు అనే వాదన వినిపిస్తారు తెలంగాణవాదులు.  దాని వెంటనే మరో ముక్క చెబుతారు.. పొట్ట చేతపట్టుకొచ్చిన వాళ్ల గురించి మాకేం ఇబ్బంది లేదు, మా ఆస్తులని అక్రమంగా ఆక్రమించుకున్నవాళ్ల గురించే మా వ్యతిరేకతంతా అని అంటారు. ఎవరో కొందరు రావుల గురించో, కొందరు రెడ్డిల గురించో, కొందరు చౌదర్ల గురించో వీళ్ళ ఫిర్యాదు! వాళ్ళెవరో అక్రమంగా ఆస్తుల్ని సంపాదించుకుంటే యావజ్జాతీ తప్పు చేసినట్టా? ఆ కొందరి కారణంగా కోస్తా సీమల వాసులంతా దురాక్రమణదారులెలా అయ్యారు? 'అందరూ దురాక్రమణ దారులే అని మేమెక్కడన్నాం? కొందరే దురాక్రమణదారులు' అని అంటారు వెంటనే! మరి, ఎవరో కొందరి కారణంగా రాష్ట్రాన్ని ఎందుకు విడదీద్దామనుకుంటున్నారు?  అటువంటి కబ్జాలే చేసిన తెలంగాణ వాళ్ళ సంగతేంటి? వాళ్ళ గురించేమీ మాట్టాడరేఁ? వాళ్ళ కోసం తెలంగాణను మళ్ళీ చీలుస్తారా?

    సరే.., ఎవరో కొందరి కోసం రాష్ట్రాన్ని చీలుస్తారు, బానే ఉంది. జరిగిపోయిన దురాక్రమణలను ఎలా సరిదిద్దుతారు? ఆయా భూములను తిరిగి లాక్కుంటారా? అది సాధ్యమయ్యే పనేనా? చట్టపరమైన చిక్కులెన్ని? అసలు చట్టంతో చుట్టరికం నెరపి చట్టవిరుద్ధమైన పనులు చేసే రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండరా? వాళ్ళు డబ్బుకు గడ్డి తినరా? ఇప్పటి ఉద్యమ నాయకుల సారథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా సరే..,  ఇప్పటిదాకా తమ బద్ధవిరోధి అయిన ఫలానా వారి లాంకో కొండలను స్వయంగా ప్రభుత్వమే లోపాయికారీగా రక్షిస్తుందనే విషయంలో ఎవరికైనా సందేహాలున్నాయా? సందేహాలున్నవారు 2004 కు ముందు పేపర్లనిండా పరుచుకున్న సవాళ్ళను, 2004 తరవాత జరిగిన వాస్తవాలనూ బేరీజు వేసి చూడాలి. చరిత్రను మళ్ళీ ఒకసారి చదూకోవాలి. ఐ.ఎమ్.జి భారత తప్ప మిగతా ఆరోపణలు, సవాళ్ళకేమయినా అయిందా అనే సంగతిని ఆరా తీయాలి.

    కాబట్టి, తెలంగాణ ఏర్పడినంత మాత్రాన తెలంగాణవాదులు చెబుతున్న దురాక్రమణల విషయంలో అద్భుతాలేమీ జరగవు. అప్పుడు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఆ దురాక్రమణలు అప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ తిట్టడానికి 'ఆంద్రోడుం'డడు. అప్పుడెవరితో పోరాడతారు? పాలమూరు జిల్లావాళ్ళు, కరీంనగరంతోటి, నల్లగొండ వాళ్ళు నిజామాబాదుతోటీ పోట్టాడతారా? పోరాటాల పురిటిగడ్డ కదా!

    పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని అంటూంటారు, నిజమే. నిజాముతో పోరాడారు, చారిత్రాత్మకమైన విముక్తి పోరాటం చేసారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేమిటి.. శత్రువెవరో తెలుసుకోకుండా పోరాటం చేస్తున్నారు -కాదు చేయిస్తున్నారు. లక్ష్యం ఒకదాన్ని పెట్టుకున్నారు -ప్రత్యేకరాష్ట్రం.. అంతే! అది సాధించడం కోసం శత్రువుగా ఎవర్ని ఎంచుకుంటే బాగుంటుందో చూసుకుని, 'ఆంద్రోళ్ళ'ను ఎంచుకున్నారు. ఇక ప్రచారం మొదలుపెట్టి ప్రజల మనసులను కలుషితం చేసి, పోరాటం చేయిస్తున్నారు. నిజమైన శత్రువెవరో గుర్తించలేక కాదు, గుర్తిస్తే, ఆ శత్రువు నెదిరించడానికీ, రాష్ట్ర విభజనకూ సంబంధమేంటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానం లేదు కాబట్టి 'ఆంద్రోళ్ళం'దరినీ శత్రువుగా చూపించారు. పోరాట సంప్రదాయాన్నే కొనసాగించాలనే తలంపుతో ఎవరితో పోరాడాలో చెప్పకుండా ఒక దిశలేని పోరాటం చేయిస్తున్నారు.

    అంచేత, 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ వాదం అనేది కూడా అబద్ధమే! కేవలం జనాల్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టి ఉంచడం కోసం, కొత్త తరానికి ఆ వాదాన్ని తలకెక్కించడం కోసం, కోస్తా, సీమల వ్యతిరేక భావోద్వేగాన్ని నిలబెట్టి ఉంచడం కోసం తెలంగాణ వాదుల చేతిలో ఉన్న మరో ఆయుధం 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ అనే అబద్ధం. అంతేకాదు ఈ వాదనను నిరంతరం నిలబెడుతూ ప్రజల్లో సమైక్య భావన అనేది పాదుకొనకుండా పాటుబడుతున్నారు ఈ తెలంగాణ వాదులు.
    అక్రమంగా ఆస్తులను సంపాదించుకున్న కొందరు తెలంగాణేతరులపై ఉన్న కోపాన్ని మొత్తం తెలంగాణేతరులపై మళ్ళిస్తున్నారు. అలా చూపెట్టి రాష్ట్రాన్ని విడగొట్టమంటున్నారు. 


    ---------------------------------------

    ఇవ్వాళొకాయన టీవీలో ఓ అబద్ధం చెప్పాడు. ఆయన చెప్పినదాని ప్రకారం..  తెలంగాణలో సహజవనరులు సమృద్ధిగా ఉన్నాయి. రాయలసీమలో ఏవో కాసిని గ్రానైటు లాంటివున్నాయిగానీ, కోస్తాలోనైతే అసలేమీ లేవు. విడిపోతే తమ మనుగడ ప్రశ్నార్థకమౌతుందని వాళ్లకు తెలుసు. అంచేతే సమైక్య వాదాన్ని ముందుకు తెచ్చారు.  (తన వాదనకు నిరూపణగా అన్నట్టు, తెలంగాణలో బొగ్గు ఉంది, కోస్తాలో లేదని కూడా అన్నాడు) ఎలాంటి అబద్ధాలు, అసంబద్ధాలు చెప్పుకుపోతున్నారో చూడండి.

    ఒకవేళ ఆ మాట నిజమే అయితే, రాష్ట్రాన్ని విడగొట్టడం తప్పే కాదు, దేశద్రోహ నేరం కూడా!
    http://chaduvari.blogspot.com/2009/12/blog-post_16.html

    అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు


    నాగార్జునసాగరుకు అడ్డంగా గోడ కడతారట. అబద్ధాల గోడలు కట్టారు, ప్రజలను చీలుస్తూ గోడలు కట్టారు, ఇక సాగరును చీలుస్తారట. కోస్తా రాయలసీమ వాసుల పట్ల వీళ్ళ దౌష్ట్యం ఇదే మొదటిది కాదు, గతంలో కొన్ని వందల సార్లు అనేకమంది నాయకులు అన్నమాటలే ఇవి. ఏడుపుగొట్టు పిల్లకాయలు మారాం చేసినట్లు ఉంది వీళ్ళ గోల.

    • పులిచింతల కడితే తెలంగాణకు నష్టం లేదు, అయినా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
    • ఆంధ్రా అధికారులు దొంగలన్నారు.
    • ఆంధ్రా వాళ్ళు హైదరాబాదు కాలుష్యానికి కారణం అన్నారు.
    • ఆలమట్టి కడితేనే మంచిది అంటూ అడ్డగోలుగా మాట్లాడారు.
    • మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని, మా ఆస్తులను, భూములను దోచుకున్నారన్నారు.
    • మమ్మల్ని గేలి చేసారు, మా యాసను ఎగతాళి చేసారన్నారు.
    • హైదరాబాదు మా చెమటతో కట్టుకున్నది, దాన్ని వీళ్ళు దురాక్రమణ చేసారు. ఇక్కడ భూములు కొనీ, వ్యాపారాలు పెట్టీ అభివృద్ధి చెందారు. మేం వెనకబడిపోయాం అని అన్నారు
    • తెలంగాణ వాళ్ళకు అవకాశమే లేకుండా బళ్ళూ, కాలేజీలు కూడా వాళ్ళే పెట్టేస్తున్నారు.
    • ఇక్కడ మా హోటళ్ళు లేవు అన్నీ ఆంధ్రా హోటళ్ళే! అని అన్నారు
    • సినిమా పరిశ్రమ యావత్తూ ఆంధ్ర మయమే, తెలంగాణ వాళ్ళు లేరు అని అన్నారు
    • సినిమాల్లో వాడే భాష ఆంధ్ర మాండలికమే, విలన్లకు, ఆసిగాళ్ళకు మాత్రం తెలంగాణ మాండలికం వాడుతారు.
    • తెలుగుతల్లి అనే భావనను తూలనాడారు
    • తెలుగు అనే మాటను దొంగతనం చేసారన్నారు
    • ఇలా ఎన్నో.. ఇదుగో, ఇప్పుడు సాగరుకు అడ్డంగా గోడ కడతారట.
    నల్లగొండ ఫ్లోరైడు సమస్య విషయంలో జరుగుతున్నది అమానుషమనేది నిర్వివాదాంశం. సాగునీటి కంటే తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలనేది సహజ న్యాయం. ఫ్లోరైడు సమస్యను పరిష్కరించకపోవడం పట్ల నిరసన తెలియజేస్తూ ఒకప్పుడు ఎన్నికలలో నాలుగైదు వందల మంది నామినేషను వేసి దేశవ్యాప్తంగా ఈ సమస్యను వెలుగులోకి తెచ్చారు నల్లగొండ వాసులు. అయినా జరిగిందేమీ లేదు. హైదరాబాదుకు తాగునీరు తెచ్చే గొట్టాలు తమ ఇళ్ళ ముందు నుండే వెళ్తూ ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి వారిది. ఒకరు కాదు, అన్ని ప్రభుత్వాలు, పార్టీలూ దోషులే ఈ విషయంలో! గోడలు కట్టే వీరులూ అందుకు మినహాయింపేమీ కాదు.

    వెనకబాటుతనం అనేది అన్నిచోట్లా ఉన్నదే అని ఆలోచించరు. ఊరికే అరిస్తే ఉపయోగమేమిటి? కేవలం భావోద్వేగం పని సాధిస్తుందా? అందరి మీదా ఇలా అరిచీ, కరిచీ తెలంగాణ వ్యతిరేకతను పెంచడం తప్ప ఉపయోగమేమిటి? ప్రతీదానికీ ఆంధ్రులే కారణమని ఇలా అన్ని రకాల తిట్లూ తిట్టి, ఆ మీదట అదే జనం అన్నదమ్ముల్లా విడిపోదామని సన్నాయి నొక్కులు నొక్కుతారు! సోదర భావం అంటే ఇలా తిట్టుకోవడమా? ఇది కేవలం తెరాస నాయకులకే పరిమితం కాదు పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో చూసాం, కొండొకచో బ్లాగుల్లోనూ చూసాం. ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారంటే, వ్యతిరేకించరూ మరి!?
    http://chaduvari.blogspot.com/2007/04/blog-post_08.html

    రాష్ట్ర విభజనతో ఏం జరుగుతుంది?


    రాష్ట్ర విభజన విషయమైఈ జాబు రాస్తున్నాను. తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా అనే విషయం జోలికి పోవడం లేదు. రాష్ట్రం విడిపోవాలా లేదా అనే విషయం జోలికీ పోవడం లేదు. అవన్నీ అధికారం కోసం ఆవురావురంటున్న వారు, తహతహలాడుతున్నవారు చెప్పాలి, మనం వినాలి. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడితే వీళ్ళు చెప్పేవన్నీ జరుగుతాయా అనేది ఆలోచిస్తున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పడే పక్షంలో ఏం జరుగుతుంది అనే నా ఊహకు రూపమే ఈ వ్యాసం. (కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్ర అనడం రివాజుగా వస్తూంది. అది అంత సబబు కాకున్నా నేనూ ఇక్కడ అలాగే వాడుతున్నాను.)

    తెలంగాణ ఎందుకు కావాలంటే.. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం అని తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ అంటున్నారు. ఇది నిజాయితీతో కూడిన కోరిక. కేసీయార్ దాన్ని కాస్త విస్తరిస్తూ, తెలంగాణ కేవలం అభివృద్ధి కోసమే కాదు.., ఆత్మ గౌరవం కోసం, స్వయంపాలన కోసం అని కూడా అన్నారు. ఆమధ్య టీవీ9 వాళ్ళ ఆదివారం ఫోనాఫోనీ కార్యక్రమం లో కూడా ఇదేమాట చెప్పారాయన. నిధులూ, నీళ్ళు, నియామకాల సంగతి చూస్తే, ప్రత్యేకరాష్ట్రంలో ఈ మూడు 'న'కారాలూ నకారం కాబోతున్నాయి. ముందుగా నిధుల సంగతి చూద్దాం.


    రాష్ట్ర విభజన అంటే ఏమిటి? తెలంగాణ ఏర్పడడమా? కాదు! తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలు ఏర్పడడం. రెండు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి ఏ గొడవలూ లేనట్లే! మొట్ట మొదటి గొడవ రాజధాని విషయంలోనే! హైదరాబాదు ఇద్దరికీ కావాల్సిందే అని ఆంధ్ర నాయకులు అడుగుతారు. కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడంలేదు. కేవలం తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే అలా ఉండొచ్చు. (ఎవరి రాజధాని వాళ్ళకు ఉంటేనే దీర్ఘకాలంలో మంచిది. విభజన సమయంలో బేరసారాలకు ఒక ఆయుధంగా ఆంధ్ర నాయకులు హైదరాబాదును వాడుకుంటారు.) తెలంగాణ రాజధాని ఉన్నచోటే ఉంటుంది. ఆంధ్రకు మాత్రం కొత్తగా ఓ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాష్ట్రానికి మౌలికంగా ఏం కావాలి? శాసనసభ కావాలి, సచివాలయం కావాలి, హైకోర్టు కావాలి, రాష్ట్ర స్థాయి పరిపాలనా యంత్రాంగం కావాలి. డైరెక్టరేట్లు కావాలి, కేంద్ర పోలీసు వ్యవస్థ కావాలి. మొత్తమ్మీద ఓ పరిపాలనా వ్యవస్థతో కూడిన రాజధాని కావాలి. తెలంగాణకు హైదరాబాదు ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. లేనిదల్లా ఆంధ్రకే! ఆంధ్రకు ఓ కొత్త రాజధాని నిర్మాణం కావాలి. దానికి నిధులు కావాలి. ఇప్పుడు చెప్పండి.. రాష్ట్ర విభజన జరిగితే నిధులెవరికి కావాలి? ఇప్పటికే ఇవన్నీ ఉన్న తెలంగాణకా? అసలేమీ లేని ఆంధ్రకా? ఆంధ్రకే!

    పైగా అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చెందిన హైదరాబాదును వదులుకున్నందుకు, అక్కడి నుండి వస్తున్న ఆదాయాన్ని వదులుకున్నందుకు బదులుగా, సాపేక్షికంగా తమ నగరాలను అభివృద్ధి చేసుకునేందుకు కూడా కోస్తా, రాయలసీమలు నిధులు అడుగుతాయి. ఇదంతా కొత్త ఖర్చే కదా. విభజన జరక్కపోతే ఆ నిధులను ఇతరేతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టొచ్చు. కాబట్టి ఆ దామాషాలో తెలంగాణకు వచ్చే నిధులు తగ్గినట్లే!

    పైగా కొత్త రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేస్తే రాయలసీమవాళ్ళు, రాయలసీమలో ఏర్పాటు చేస్తే కోస్తా వాళ్ళు తగు రక్షణలు కోరుతారు. రక్షణలంటే మరోటేమీ కాదు.., నిధులు, మౌలిక వసతులు! నిజానికి ఇది అవసరం కూడా.. ఎందుకంటే మళ్ళీ మరో విభజన జరిగి, ఇప్పుడు హైదరాబాదును వదిలి పోవాల్సి వచ్చినట్లే రేపు ఒక ప్రాంతం వాళ్ళు రాజధానిని వదులుకోవాల్సి వస్తే ఇప్పటి వ్యథ మళ్ళీ లేకుండా ఉండేందుకు. దురాశాపరులైన రాజకీయులు అన్నికాలాల్లోను, అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు.

    ఇక్కడొక విషయం గమనించాలి.. తెలంగాణ అభివృద్ధిని ఆంధ్రతో పోల్చి చూసేటపుడు తెలంగాణ నాయకులు హైదరాబాదును పరిగణనలోకి తీసుకోరు. 'హైదరాబాదు అందరిదీ, దాన్ని వదలి, మిగతా తెలంగాణలో అభివృద్ధిని చూడండి' అని అంటూంటారు. మరి రాష్ట్ర విభజన జరిగాక, హైదరాబాదు పూర్తిగా తెలంగాణకే చెందాక, అప్పుడు అభివృద్ధిని పోల్చి చూస్తే..! ఇప్పటి తేడా అప్పుడు ఉండదు, పోలిక తిరగబడొచ్చు కూడా! కోస్తా రాయలసీమలకు మరిన్ని నిధులివ్వాల్సింది అందుకు కూడా!

    కాబట్టి రాష్ట్ర విభజన జరిగితే నిధులు కావలసింది ఆంధ్రకే గాని, తెలంగాణకు కాదు. తెలంగాణకు అదనపు నిధులు దొరకడం కష్టం! హైదరాబాదు నుండి వచ్చే ఆదాయం మాత్రం పూర్తిగా తెలంగాణకే చెందుతుంది కనుక, ఆ మేరకు తెలంగాణకు అదనపు నిధులు వచ్చినట్లే! ఆంధ్రకు ఆ మేరకు నష్టం జరిగినట్లే!
    http://chaduvari.blogspot.com/2006/09/blog-post_20.html

    హై.లో మతకలహాలు ఏనాటివి?


    ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాదులో మతసామరస్యం వెల్లివిరిసేదంట. ఎప్పుడైతే ’ఆంద్రోళ్ళు’ ఇక్కడికి చేరుకున్నారో.. అప్పుడే ఇక్కడ మతకలహాలు మొదలయ్యాయని చెబుతున్నారు ఘనతవహించిన తె.వాదులు! చరిత్రను చాప కిందకు తోసేసి, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట ఓ టీవీలో ఘనత వహించిన విశ్లేషకుడొకరు, వెంటనే శనివారం నాడు కేసియారూ ఈ అబద్ధాన్ని చెప్పారు. 

    వీళ్లు చెప్పుకుంటున్న మత సామరస్యం హైదరాబాదులో లేదు. ఇవ్వాళ కాదు, ఎప్పటినుండో లేదు. ఎప్పుడో ఇరవయ్యో శతాబ్దపు రెండవ మూడవ దశకాల నుండీ కూడా ఇక్కడ మతగొడవలు జరుగుతున్నాయి. ఒకర్నొకరు చంపుకున్నారు. జావీద్ ఆలమ్ అనే ప్రొఫెసరు, 19 వ శతాబ్దంలో మాత్రం ఇక్కడ హిందూ ముస్లిముల మధ్య గొడవలేమీ జరగలేదని అంటూ, అయితే "వాళ్ళు పక్కపక్కనే నివసించేవాళ్ళు, కానీ వాళ్ళ మధ్య అంత సామరస్యమేమీ ఉండేది కాదు" అని చెప్పారని ఒక వెబ్‍సైటులో చదివాను. రెందు మతాల ప్రజల మధ్య సామరస్యం ఇలా ఉందని ఓ ప్రొఫెసరు చెబుతోంటే ఇంకో వక్రవాణి ప్రొఫెసరు ’మేమూ చదువుకున్నామండీ..’ అంటూ కెమెరా ముందు చేరి, అబద్ధపు కథలు అల్లాడు. ఆయన చెప్పిన "హైదరాబాదులో మతకలహాలు సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాకే మొదలయ్యాయి" అనే ముక్క ఎంత అబద్ధమో, అయనది వక్రవాణి ఎందుకయిందో చూద్దాం..


    హైదరాబాదు నగరంలో మతకలహాలు 1938 లోనే జరిగాయి. 1938 ఏప్రిల్ 5న మొదలైన మతకలహాలు ఏప్రిల్ 9 దాకా కొనసాగాయి. ముస్లిములు తలపెట్టిన ఒక ఊరేగింపుపై హిందూ ’లోథా’లు దాడి చేస్తారనే అనుమానంతో పదివేల మంది ముస్లిములు కత్తులతో సహా ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. అనుకున్నట్టుగానే గొడవలు జరిగి నలుగురు చనిపోయారు. నాలుగైదు రోజుల పాటు ఏడెనిమిది ప్రాంతాల్లో గొడవలు జరిగాయి.

    ఈ గొడవలు జరిగాయి సరే, దానికంటే దారుణమైనది.. ప్రజల మధ్య ఎంత హార్మొనీ ఉందో తెలియచెప్పే సంగతి ఒకటుంది.. ఆ గొడవల తరవాత పద్మజా నాయుడు గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో ’..హిందూ ముస్లిము మేధావులలోని పరస్పర అపనమ్మకాన్ని, ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుమానాలనూ చూసి నేను దిమ్మెరపోయాను’ అని రాసింది.

    "From autocracy to integration: political developments in Hyderabad State" (By Lucien D. Benichou) పుస్తకంలో ఈ సంగతులను చదవొచ్చు.

    అసలు దీనికంటే ముందే - 1923 లోనే- హై.లో ఆర్యసమాజ్ ఏర్పడి, ముస్లిములను పునర్మతాంతరీకరణ చెయ్యబూనినపుడే హైదరాబాదు సంస్థానంలో మతకలహాలు జరిగాయి. ఇదిగో, ఈ వ్యాసం కూడా అదే ముక్క చెబుతోంది. హైదరాబాదు సంస్థానంలో గిరిజనులను, దళితులను ఇస్లాములోకి మార్చే ధ్యేయంతో బహదూర్ యార్ జంగ్ అనేవాడు ఒక సంస్థను స్థాపించాడు. అలా మారినవాళ్ళను తిరిగి హిందూమతంలోకి మార్చే లక్ష్యంతో ఆర్యసమాజ్ ఏర్పడింది. ఒక్క హైదరాబాదులోనే ఆర్యసమాజ్ కు 20 శాఖలుండేవట. ఇదంతా 1938 నాటి లెక్కలు.

    ఓ మూడేళ్ళ కిందట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో వరవరరావు ఇలా రాసాడు: "..కాబట్టి మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తాను స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాలనో లేదా పాకిస్తాన్‌లో కలపాలనో అనుకున్నప్పుడు ఒక రజాకారు సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయబుల్లాఖాన్ వంటి ఉత్తమ సంపాదకుణ్ని బర్కత్‌పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు". రజాకార్లు మతవిద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాము వాళ్ళను పెంచి పోషించాడన్నదీ స్పష్టం. రజాకార్లు ఎప్పటివారు? ఈ ఆంధ్రప్రదేశు, ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రమూ ఇవేవీ ఏర్పడటానికి ముందే.. మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో ఏర్పరచిన సేన అది. ఇప్పుడు పాతబస్తీలో ఉన్న మతతత్వ పార్టీల వారసత్వం ఎక్కడిది? - ఆ రజాకార్లదే! రజాకార్ పార్టీ అసలు పేరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్!

    మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో సేన ఏర్పాటు, మెజారిటీ మతస్తుల మతమార్పిడి కోసం ఒక సంస్థ, వాళ్ళను తిరిగి వెనక్కి తెచ్చేందుకు మరో సంస్థ -మతసామరస్యం ఎంత గొప్పగా ఏడిచిందో చెప్పేందుకు ఇది చాలు. తె.వాదులు చూపిస్తున్న హార్మనీ అనే మేడిపండును విప్పిచూస్తే కనబడ్ద పురుగులివి!

    -----------------------------------

    ఈ తె.వాద ప్రొఫెసర్లు బళ్ళలో ఏం పాఠాలు చెబుతున్నారో ఏమోగానీ టీవీల వేదికలెక్కి మాత్రం ఇలా అబద్ధాలను అల్లేస్తూ ప్రచారంలో పెడుతూ ఉంటారు. మతకలహాల పట్ల అబద్ధాలు గుప్పించబడిన ఈ చర్చలో కూడా ప్రొఫెసరుగారు ఘంట కొట్టినట్టుగా వక్రవాణి వినిపించారు. (పక్కనే ఉన్న కోడెల శివప్రసాదరావు ప్రొఫెసరుగారి వక్రవాణిని అడ్డుకోలేదు.) దేరీజె మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్‍నెస్ అని అంటూంటారు. (మ్యాడ్‍నెస్సులో మెథడున్నా లేకున్నా మెదడు మాత్రం ఉండదనుకోండి.) ఈ వక్రవాది అబద్ధపు ప్రచారాల్లో కూడా మెథడేదో ఉన్నట్టుంది. 

    టీవీ కెమెరాల ముందు చేరి లేనిపోని అబద్ధాలను వ్యాప్తి చేసే ఈ మేధావులు ఏ చరిత్రను చదువుకున్నారోగానీ, ప్రొఫెసర్లుగా బళ్ళో కుర్రాళ్ళకు కూడా ఇలాంటి అబద్ధపు చదువులే చెబుతున్నారేమో!
    http://chaduvari.blogspot.com/2010/04/blog-post_26.html

    స్వపరిపాలన కోసం తెలంగాణ


    నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ అనేది తెలంగాణ కోరుతున్నవారి వాదన. అయితే "తెలంగాణ కావలసింది అభివృద్ధి కోసం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం, స్వపరిపాలన కోసం" అని కేసీయార్ అంటున్నారు.

    తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఇతరులు కించపరుస్తున్నారు, మాండలికాన్ని హేళన చేస్తున్నారు అనే వాదన ఉంది. బతుకమ్మ, బోనాలు మొదలైన తెలంగాణ పండుగలకు ప్రస్తుతం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నది ఈ వాదనలోని భాగం. తరాలు మారే దశలో, సాంప్రదాయాలు క్రమేణా కనుమరుగు అవుతూ ఉండడం సహజం. దానికి ఇతరులను నిందించడం సరికాదు. ఇప్పటి ప్రభుత్వాలు సంస్కృతీ సాంప్రదాయాలను గాలికి వదిలేసాయి. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విషయంపై శ్రద్ధ వహిస్తే అంతకంటే కావలసిందేమీ లేదు. ఇక మాండలికానికి సంబంధించినంత వరకు ఇది కొంత సహేతుకంగానే కనిపిస్తుంది. తెలంగాణ మాండలికానికి అధికారిక హోదానిచ్చి, గట్టిగా అమలు చేస్తే, కొత్త రాష్ట్రం వలన కలిగే గొప్ప ప్రయోజనం అవుతుందది. తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది. కానీ నిజంగా అది చేస్తారా?


    ఇక స్వపరిపాలన .. ఏమిటి స్వపరిపాలన అంటే.. ఇప్పటిది కాదా? ప్రస్తుత పాలన పరాయి పాలన ఎలా అవుతుంది? ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి కాకపోతే అది పరాయి పాలనేనా? అయితే పులివెందుల తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? గత ముఖ్యమంత్రి పాలనలో నారావారిపల్లె తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? లేక.. కేసీయార్ పాలిస్తే స్వపరిపాలన, లేకుంటే పరాయి పాలన అని అంతరార్థమా?
    "ఆంధ్ర ప్రాంతం నుండి తరలివచ్చిన వారు ఇక్కడి పొలాలు కొని బాగుపడ్డారు, ఇక్కడ వ్యాపారాలు చేసి సంపాదించారు, మా ఉద్యోగాలు కొట్టేసి స్థిరపడ్డారు" అని ఈ తెలంగాణవాదులు అంటారు. తెలంగాణ ఏర్పడ్డాక వాళ్ళందరి అస్తులనీ, పొలాలనూ, ఉద్యోగాలను లాక్కుని తరిమేయలేరు కదా! మరి తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడికి ఎలా న్యాయం చేయబోతున్నారు? ఈ విషయమై తాము ఏమేం చెయ్యబోతున్నారో వీళ్ళింతవరకు చెప్పలేదు.
    ఏమొచ్చినా రాకున్నా కొత్త రాష్ట్రంలో తప్పనిసరిగా వచ్చేవి కొన్నున్నాయి.. ఓ ముఖ్యమంత్రి, ఓ ఇరవై మంది మంత్రులు, ఓ రెండొందల కొత్త అయ్యేయెస్సులు, ఐపీఎస్సులు, ఓ రెండువేల కొత్త ఉద్యోగాలు.


    నికరంగా తేలేదొకటే.. తెలంగాణ వస్తే బాగుపడేది రాజకీయులే. సామాన్యుడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సామాన్యుడికి కొత్తగా ఒరిగేదేమీ ఉండక పోవచ్చు, కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగావకాశాలు తప్ప. తక్షణ రాజకీయ ప్రయోజనం ఆశించే వారికి మాత్రం ఉపయోగమే!
    http://chaduvari.blogspot.com/2006/09/blog-post_25.html

    విగ్రహాలను కూలుస్తున్న ముష్కరులెవరు?


    విగ్రహాలను కూల్చింది ఎవరో మాకు తెలవదు అన్నారు. అదంతా సీమాంధ్రుల కుట్ర అని చెప్పారు. ఆ విగ్రహాల స్థానంలో తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్లు చేసారు. మార్చికి అనుమతినిచ్చి ఉంటే ఈ విధ్వంసం జరిగి ఉండేది కాదంటూ చెప్పుకొచ్చారు. తెవాద నాయకులు ఎలా మాట్టాడ్డానికైనా సమర్ధులే! ఇవ్వాళ టీవీ 9 లో వచ్చిన వార్త చూసాక వీళ్ళు ఏం చెయ్యడానికైనా సమర్ధులేనని తెల్లమైంది.



    మూడు రోజుల కిందట మెదక్ జిల్లా దౌలతాబాదు వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాల్చి పడేసారు ఎవరో దుండగులు. ఆ పాపాన్ని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మీదకు నెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఆ మధ్య ఎవరో ఆమె భర్త విగ్రహాన్ని విరగ్గొట్టారంట. అందుకు ప్రతీకారంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తగలబెట్టాం అని రాసిన కాగితాన్ని అక్కడ పెట్టి నేరాన్ని ఆమె మీదకు తోసారు. నాకే పాపం తెలీదని ఆమె చెప్పుకున్నారు. అయితే ఇవ్వాళ అసలు విషయం బయట పడింది. పోలీసులు దుండగులను పట్టుకున్నారు. వాళ్ళను టీవీ కెమెరాల ముందు పెట్టి నిజాన్ని వాళ్ళచేతే చెప్పించారు. సంగతేంటయ్యా అంటే వాళ్ళు తెరాస కార్యకర్తలు! తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాల్చింది తెరాస కార్యకర్తలే! కాల్చేసి ఆ నేరాన్ని మంత్రి మీదకు నెట్టారు. ఇప్పుడు దొరికిపోయారు. ఏకంగా తల్లినే అవమానించారు వాళ్ళు. ఇదీ ఈ ఉద్యమకారుల సంస్కృతి.

    ట్యాంకు బండ్ మీది విగ్రహాలు ధ్వంసమయ్యాక ఏం చెబుతున్నారు వీళ్ళు? ప్రజల మనోభావాలు ఎంతలా దెబ్బతినకపోతే విగ్రహాలను ధ్వంసం చేస్తారు? వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి అని మాట్టాడారు. తల్లి విగ్రహాన్నే కాల్చేసిన వాళ్ళ చిత్తవృత్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

    ట్యాంకుబండ్ మీది సీమాంధ్రుల విగ్రహాలు కూలిపోతాయ్ అని కొన్ని నెలల కిందట చెప్పారు తెరాస నాయకులు. ఇప్పుడు అవి ధ్వంసం అయి పోయాయి కూడా.  విగ్రహాలను ధ్వంసం చేసిన వారెవరో,  చేయించిన వారెవరో తేలాలి. వాళ్ళను పట్టుకుని కెమెరాల ముందు నిలబెట్టి, ప్రజలకు ఆ మొహాలను చూపించాలి. మా సంస్కృతి ఇదీ అంటూ దేశమంతా చాటింపు వేసిన దుండగులెవరో తేల్చాలి. మన చారిత్రిక వ్యక్తుల విగ్రహాలను అవమానించిన చరిత్రహీనులను బోనెక్కించాలి.
    http://chaduvari.blogspot.com/2011/03/blog-post_12.html

    చౌకబారయ్యాం - మసకబారిపోయాం - మసిపట్టిపోయాం.........................

    పెద్దమనిషి ఇటీవల రాసిన రాతలు కనిపించాయి. తెలుగువాళ్ళని అపహాస్యం చేస్తున్నాడాయన."తామేదో పెద్ద మహాజాతి అని చెప్పుకుంటారీ తెలుగువాళ్ళు. వాళ్ళ బొంద ! ఒకడంటే ఒకడికి పడిచావదు. ఉదాహరణకి తెలంగాణా గొడవ చూడండి. రేపో మాపో పొడుచుకుని చచ్చేట్టున్నారు. మేమే నయం."అన్నట్లున్న శైలిలో రాసుకొచ్చాడు. ఆ మాటల్ని యథాతథంగా ఇక్కడ ఉటంకిస్తే నాలాగే మీరూ బాధపడతారు కనుక నేను ఉటంకించదల్చుకోలేదు. అందుకనే చదివి వదిలేశాను. నేను ఆ రాతలమీద వ్యాఖ్య కూడా ఏమీ రాయదల్చుకోలేదు. ఆ పెద్దమనిషి మనమీద ద్వేషంతో అన్నప్పటికీ ఆ మాటల్లో నిజం ఉంది కనుక.

    గత 7 ఏళ్ళ ప్రత్యేక తెలంగాణా నినాదం ఒక జాతిగా మనకూ మన ప్రతిష్ఠకూ ఇంటా బయటా చాలా చెఱుపు చేస్తోందనడానికి ఇదొక నిదర్శనం. ప్రత్యేక తెలంగాణా సాధించడం ప్రాంతీయవాదులకు అంతిమంగా సాధ్యపడదు. కాని వాళ్ళు ఇలా మన జాతిని బట్టలువిప్పి అంతర్జాతీయవేదికలముందు నిలబెట్టడంలో మాత్రం సఫలీకృతులయ్యారు. వాళ్ళు మన పరువు నిట్టనిలువునా తీసేశారు. సోదరుణ్ణి బద్నామ్ చేస్తే తామూ అతనితో సమానంగా బద్నామ్ అవుతామనే సత్యాన్ని వాళ్ళ తమ ప్రాంతీయ-ఉన్మాదంలో పడి కొట్టుకుపోతూ విస్మరించారు. వాళ్లు తమ నోళ్ళకు కాకుండా తమ మెదళ్ళకెప్పుడు పనిచెప్పడం మొదలుపెడతారు ?

    పరిస్థితులెప్పుడూ ఇలాగే ఉండవు. మన జాతికీ మంచిరోజులొస్తాయి. అందుకు ముందుగా జరగాల్సింది - నిజాం కాలంలో పుట్టిన ముసలాళ్ళందరూ నిశ్శేషంగా చావడం. వీళ్ళు అడపా దడపా తమ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత జన్మించిన యువతరాల్ని ప్రాంతీయంగా రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు మన జాతి కొట్టుకు చావడానికి కావాల్సిన బీజాల్ని సజీవంగా సచేతనంగా ఉంచుతున్నారు. మనల్ని మానసికంగా క్రీ.శ.1930 లో ఉంచుతున్నారు. ముందుకు చూడనివ్వడంలేదు.

    పైగా ఈ స్తంభితాలోచనలకు ఆత్మగౌరవమని ఒక పెద్ద పేరు. తెలుగు జాతీయత అనే మొక్క వటవృక్షంలా ఎదక్కుండా మధ్యలోనే తినేసే ఆకుతొల్చు పురుగులు వీళ్ళు. మన జాతికి పట్టిన కేన్సర్లు వీళ్ళు. యావత్తు తెలుగు జాతి యొక్క విశాలహితం గుఱించి ఆలోచించిన పూర్వకాలపు Statesmen ప్రస్తుతం లేకపోవడంతో ఆ రాజకీయశూన్యాన్ని ఇలా అక్రమంగా ఆక్రమించుకున్నారు. సమైక్యాన్ని బూతుమాట చేశారు. ప్రాంతీయవాదాన్ని పవిత్రవేదంగా మార్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి గల వేర్పాటేతర మార్గాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా మూసెయ్యడానికీ ఆంధ్ర-తెలంగాణా ప్రజల మధ్య ఒక రకం ఇండియా-పాకిస్తాన్ లేదా బ్రిటిష్-ఇండియా తరహా శాత్రవ సంబంధాన్ని సృష్టి చెయ్యాలని తహతహలాడుతున్నారు.

    సర్వసాధారణంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో సర్వత్రా ఉండే ప్రజాసమస్యలకు ఒక ప్రాంతీయ రంగు మేళవించి ఆ ప్రాతిపదికన ఒక జనాభా మీదికి ఇంకొక జనాభాని ఉసిగొల్పుతున్నారు. మన తెలుగునౌకకు సరైన తండేలు (captain) లేకపోవడంతో చిన్నా పొన్న సరంగులు తమ లైఫ్‌బోట్లనే నిజమైన ఓడలుగా ప్రచారం చేస్తూ అసలైన ఓడని ముంచెయ్యడానికి సమకడుతున్నారు. కానీ తెలుగుజాతికి వ్యతిరేకంగా తాము తీస్తున్న ఈ గోతుల్లో ఏదో ఒకరోజున తామే పడతారు. జర్మనీ మనకంటే అనైక్యంగా ఉండేదొకప్పుడు. మనకొక్క నిజామే కాని వాళ్ళకు అలాంటివాళ్ళు చాలామంది ఉండేవారు. శేషప్రశ్నల్లా ఆ శుభదినం ఎంత తొందఱగా వస్తుందనేదే !
    http://naasaahityam.blogspot.com/2008/03/blog-post_17.html

    3, మే 2011, మంగళవారం

    మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..............

    మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..
    అయ్యా మీకో దండం...

    మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..
    మా బతుకులు మాకు ఈయండి..

    మీ రాజకీయాలకో దండం.. మీ ఉద్యమాలకో దండం..
    ఇక మా కడుపు కాస్త నిండనివ్వండి..

    మూటలెత్తే మల్లేశన్న ముద్దదిని పక్షం అయ్యింది..
    బందంటారు.. సమ్మె అంటార్..
    ఆకలికి ఆంధ్ర .. తెలంగాన తేడా తెలీదయ్య..

    టీకొట్టు సింహాచలం.. కొడుకు సచ్చి బండయ్యాడు..
    ఎవని కడుపు మంట ఆపుతారయ్య.. ఊళ్ళు కాల్చి..

    అమాయకుడి రక్తం ఏరులయ్యింది..
    అమ్మ కడుపుకోత కన్నీటి వరదలైంది..
    ఆ నెత్తుటిదీ.. ఈ ఏడుపుదీ ఏ రాష్ట్రమయ్యా ?

    మేధావులూ. విధ్యార్ధులూ.. మీకూ ఓ పెద్ద దండం..

    కలిసి వున్నా.. ముక్కలై మురిసిన..
    మాకు రెక్కాడితే గానీ దినం గడవదు..

    మీ కొలువు మీకుంటది.. మీ ఇలువ మీకుంటది.
    మా పొట్టకొట్టకండి సారూ.

    కలిసి వుండిపోతే కరువు ఆగుద్దా ?
    ముక్కలైపోతే బీడు పండుద్దా ?

    అయ్యా.. ఎంపీలూ ఎమ్మెల్యేలూ.. దండం...
    మంత్రులకు ఇంకా పెద్ద దండం..

    మీ రాజీనామాలు విదిల్చకండయ్యా.. ఎంగిలాకుల్లాగ..
    వొందకో ఓటు అమ్ముకోడానికి సిగ్గెస్తాది మళ్ళీ..

    మీకే సత్తువుంటె.. మీ బిజినెస్సులకి చెయ్యండి రాజీనామా..
    బామ్మర్ది పేరిన వేసిన టెండర్లు చించండి..
    కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. మీరు బాగుంటరు..

    మీ పెళ్ళికాళ్ళొస్తరు.. ఆళ్ళింట సావుకు మీరు తోడెల్తరు..
    కానీ మాకు చావే పెళ్ళాయె సారు..

    ఓ నాలుగు దినాలు మమ్మల్నీ బతికి చావనివ్వండి..

    సార్లూ.. కొట్టుకోడంలో బాగా కలిసిపోయారు..
    సానా సంతోషం... థాంక్సూ..

    మీ జెండా కర్రలెత్తుకుని కలిసి వూర్లో వూరేగండి..
    చూడ ముచ్చటగా వుంటది..
    కానీ మా కడుపుల్లోకి దించకండి సార్లూ..

    ( ఎవరు రైటో.. ఎవరు రాంగో కానీ.. మధ్యలో నలిగిపోతున్నది సామాన్యుడే.
    తొందర్లోనే ఈ రావణ కాష్టానికి ముగింపు పడుతుందని ఆశిస్తూ... )
    http://naaharivillu.blogspot.com/2009/12/blog-post_24.html

    2, మే 2011, సోమవారం

    తెలంగాణా విద్యార్థుల పాలిట శాపంగా మారనున్న ప్రత్యేకోద్యమం?

    తామేపాపం చేయకపోయినా అనేకమంది ఓయూ విద్యార్థులు ఈ వేసవిలో సెలవలనేవి లేకుండా విద్యాసంవత్సరం పూర్తిచేద్దాం అని  ఎన్నో తిప్పలు పడుతున్నారు. అదలా ఉండగా  పులివెందుల ,కడప ఉపఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రత్యేక తెలంగాణవాదులు మరోసారి రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలని యోచన చేస్తున్నారా?  గత కొన్ని రోజులుగా పని లేకనో మీడియా ప్రచారం లేకనో కుతకుత లాడుతున్న నాయకులు ఒకవైపు, చదువుసంధ్య లేకుండా ఏళ్ళ పాటు నిర్లజ్జగా ప్రభుత్వ సబ్సిడీలతో నడిచే హాస్టల్ లలో తిష్ట వేసి రీసెర్చ్ స్కాలర్లమని చెప్పుకుంటూ పార్టీ జెండాలు మోస్తున్న కొద్దిమంది మరోవైపు, కలిసికట్టుగా తామెందుకూ కొరగాకపోతే పోయాం ఇతరులెవ్వరూ చదువుకొని బాగుపడకూడదు లేదా ప్రశాంతంగా జీవిస్తూ జీవనోపాధి పొందకూడదు అని కంకణం కట్టుకున్నారా? వారి మాటలు విన్నా, వారియొక్క  పనికిమాలిన యోచనల గురించి  చదివినా అలాగే అనిపిస్తుంది. వీరు తెలంగాణ ప్రజల బాగు కోరేవారంటే నమ్మే బుద్ధిహీనులు ఎవరైనా ఉన్నారా? వుంటే చెప్పండి. జూన్ కల్లా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అటువంటి సమయంలో కేజీ నుండి పీజీ వరకూ అన్ని స్థాయిలలో తెలంగాణా అంతటా విద్యాసంవత్సరం బహిష్కరించమని పిలుపు ఇవ్వడానికి వీరు నిజంగానే సంసిద్ధులవుతున్నరా?పిలుపు ఇచ్చి ఊరుకుంటారా లేక కిరాయి మనుషులు పెట్టి దానిని పాటించని వారిపై భౌతికదాడులకు కూడా పాల్పడుతారా?

    1, మే 2011, ఆదివారం

    నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమానికి నాంది

     ఎం.వి.ఆర్. శాస్త్రి గారిచే ఆంధ్రభూమిలో ప్రచురింపబడుతున్న 'ఆంధ్రుల కథ' నుండి:  1921 నవంబర్ 21 సాయంత్రం. హైదరాబాదులోని వివేకవర్ధని థియేటరులో సంఘ సంస్కార సభ సీరియస్‌గా నడుస్తున్నది. నగర  ప్రముఖులందరూ అక్కడే ఉన్నారు. సామాన్య జనమూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అటువంటి సభ హైదరాబాదులో జరగటమే విశేషం. ముఖ్యఅతిథి ధోండే కేశవకార్వే ఇంకా పెద్ద ఆకర్షణ. ఆయన జగమెరిగిన పండితుడు- గొప్ప విద్యావేత్త. ఆయన పూనాలో తన పేరిట ఏకంగా ఒక మహిళ విశ్వవిద్యాలయానే్న స్థాపించాడు.

    రెండురోజుల సంఘ సంస్కార మహాసభలో తొలిదినం సమావేశాలకు కార్వే పండితుడే అధ్యక్షత వహించాడు. చాలా భాగం మరాఠీలోనూ కొంత ఇంగ్లిషులోనూ ఆయన ప్రసంగించాడు. అది సభలోని ఆంధ్రులకు నచ్చలేదు. అయినా ఎవరూ నోరు మెదపలేదు. మలిరోజు ముగింపు సభకు శ్రీమతి సరళాదేవి చౌధురాణి అధ్యక్షురాలు. అనేక తీర్మానాలు ప్రతిపాదించాక వాటిపైన ఇంగ్లీషులోనూ, మరాఠీలోనూ, ఉర్దూలోనూ ఉపన్యాసాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం నైజాం స్టేటునుంచి ప్రతినిధులు వచ్చారు. వక్తలు మరాఠీ, కన్నడ, తెలుగు భాషల్లో మాట్లాడవచ్చునని విషయ నిర్ణయ సంఘంలో ముందే నిర్ణయించారు. అంతవరకూ బాగానే ఉంది.


    ఆంధ్రుల పక్షాన సభా నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన పెద్దలు కూడా వేదిక మీద ఆశీనులయ్యారు. మాట్లాడటానికి తమ వంతుకోసం వేచి ఉన్నారు. ముందు మాడపాటి హనుమంతరావుగారిని పిలిచారు. ఆయన లేచి తెలుగులో ఉపన్యాసం మొదలెట్టగానే కలకలం లేచింది. సభికుల్లో ఎక్కువ మంది మహారాష్ట్రులున్నారు. వారిలో ఎక్కువ మంది యువకులు. వారికి భాషా దురహంకారం జాస్తి. హైదరాబాద్ జనాభాలో అత్యధికులు తెలుగువారైనా అన్ని రంగాల్లో మహారాష్ట్రులదే హవా. విద్యాసంస్థలు నడిపేదీ వారే. సభల్లో, సమావేశాల్లో, గణపతి ఉత్సవాల్లాంటి వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే.వారికి తెలుగంటే మహా చులకన. అందుకే
     ‘‘మాడపాటి హనుమంతరావుగారు తెలుగులో ఉపన్యాసం ఆరంభించగానే వారు అల్లరి ఆరంభించినారు. అయినా పంతులుగారి వ్యక్తిత్వ ప్రభావంవల్ల అంత వికటంగా ప్రవర్తించలేదు. కాని అల్లంపల్లి వెంకట రామారావు (హైకోర్టు వకీలు)గారు ఒక తీర్మానముపై తెలుగులో ప్రసంగించటానికి ఉపక్రమించగానే మహారాష్ట్ర యువకులు అల్లరి ప్రారంభించినారు. ఈలలు, చప్పట్లు, చివరకు వేదికవైపు వెన్ను తిప్పి కూర్చుండుట జరిగింది. తత్ఫలితంగా వెంకట రామారావుగారు తమ ఉపన్యాసం నిలిపివేయవలసి వచ్చింది... అల్లంపల్లివారు తమ ఉపన్యాసాన్ని అర్ధాంతరంగా ఆపి నిష్క్రమించగానే వేదిక మీద కూర్చున్న మాడపాటి హనుమంతరావుగారు వేదిక నుండి క్రిందికి దిగినారు. వెంటనే మందుముల నర్సింగరావు, మందుముల రామచంద్రరావు, మిట్టా లక్ష్మీనరసయ్య, టేకుమాల రంగారావు, బూర్గుల రామకృష్ణారావు మొదలైన పెద్దలు వారిని అనుసరించినారు. సభలో పాల్గొంటున్న తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దలననుసరిస్తూ సభను విడిచి తమ తీవ్రమైన అసమ్మతిని ప్రకటించినారు" (హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పే.104-105 )

    అలా నిరసన తెలిపి సభనుంచి నిష్క్రమించిన పెథ్దలు పదకొండు మంది వివేకవర్థనీ థియేటరు వెనకనే ఉన్న ట్రూపుబజారులో వకీలు టేకుమాల రంగారావుగారింటికి ఎకాఎకి వెళ్లారు. ఆంధ్రులు బహుళ సంఖ్యాకులుగా ఉన్న రాజధాని నగరంలో ఆంధ్ర భాషలో ఉపన్యసించటానికే వీలులేకుండా పోయి, మాట్లాడుతున్న వాడిని కేకలు వేసి కూచోపెట్టే దుస్థితి పట్టినందుకు వారు చాలా బాధపడ్డారు. విచారించి ప్రయోజనం లేదు. వెంటనే ఏదో ఒకటి గట్టిగా చెయ్యాలనుకున్నారు. తర్జనభర్జనల తరవాత ఆ రాత్రే అక్కడే ‘‘ఆంధ్ర మహాజన సంఘం’’ స్థాపించారు. తెలంగాణలో ఆంధ్రోద్యమానికి, నిజాం స్టేటులో రాజకీయోద్యమానికి అదే నాంది.

    పరాయి భాషవాళ్ల చేతుల్లో తమ గడ్డమీద తమకు జరిగిన అవమానం పదేళ్ల కింద గుంటూరు న్యాయవాదులగుండెలను, మండిచినట్టే తెలంగాణ ఆంధ్ర ప్రముఖులనూ కదిలించి కార్యరంగానికి నెట్టింది. 1921లో కోస్తా ప్రాంతాన పడకేసిన ఆంధ్రోద్యమం కృత్రిమ సరిహద్దులను దాటి తెలంగాణలో అదే సంవత్సరం చరిత్రాత్మకంగా మొదలైంది.  1921 నవంబరు 12 రాత్రి 8 గంటలకు ‘‘ఆంధ్ర జన సంఘము’’ను పదకొండుమంది పెద్దలు కలిసి స్థాపించినప్పుడు నాలుగు తాత్కాలిక నియమాలు పెట్టుకున్నారు. అవేమిటంటే- పుట్టుక వల్లగాని స్థిర నివాసమువల్లగాని హైదరాబాదు స్టేటులో ఉన్న 18 ఏళ్ల పైబడిన ఆంధ్రులందరు ఈ సభలో చేరవచ్చు. (తర్వాత ఇది మారింది). సభ్యత్వ రుసుము సంవత్సరానికి కనీసం రూపాయి. తగినంతమంది సభ్యులు చేరాక అందరితో ఆలోచించి నియమావళిని రూపొందాలి.  సభ్యుల్ని చేర్చటానికి ఆట్టే కష్టపడాల్సిన పనిలేకపోయింది.  వివేకవర్ధని థియేటరులో ఆంధ్ర భాషకు జరిగిన అవమానాన్ని... దానికి బాధపడ్డవారు ఆంధ్ర జన సంఘాన్ని స్థాపించదలచిన వైనాన్ని మందుముల సోదరుల పత్రికా వ్యాసాల ద్వారా తెలుసుకోగానే చాలామంది ఆంధ్రులు తామే ముందుకొచ్చి సభ్యత్వం తీసుకున్నారు. నెల రోజుల లోపలే నూరుగురు సభ్యులయ్యారు. 1922 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన రెడ్డి హాస్టల్లో మూడుసార్లు అందరూ కలిసి మల్లగుల్లాలు పడ్డాక నియమావళి ఖరారైంది. కార్యనిర్వాహక వర్గమూ ఎన్నికైంది. ఆర్.రాజగోపాలరెడ్డి అధ్యక్షుడు. మాడపాటి హనుమంతరావు కార్యదర్శి. మందుముల నర్సింగరావు సహాయ కార్యదర్శి. కొండా వెంకట రంగారెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, టేకుమాల్ రంగారావు, ఇంకో ముగ్గురు కార్యవర్గ సభ్యులు.

    కొత్త సంఘానికి ఖరారైన ప్రధాన నియమాలివి:
    ‘1. ఈ సంఘమునకు నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘము’అని పేరు.
    2. నిజాం రాష్టమ్రునందలి ఆంధ్రులయందు పరస్పర సహానుభూతి కలిగించి వారియభివృద్ధికై ప్రయత్నించుట ఈ సంఘముయొక్క ఉద్దేశము.
    3. ఈ రాజ్యములోని ఆంధ్రుల కొరకు, సంఘములను, సంస్థలను స్థాపించుట, ఉన్నవానికి సహాయము చేయుట, ఉపన్యాస సభలను సమావేశపరచుట మున్నగు కార్యముల వలన పై ఉద్దేశము నెరవేర్చబడును.
    4. ఈ రాజ్యములోని ప్రతి ఆంధ్ర వ్యక్తియు, పదునెనిమిది సంవత్సరముల కంటే మించిన వయస్సు కలిగి, చదువను, వ్రాయను నేర్చియున్నచో, ఈ సంఘమున సభాసదుడు కావచ్చును.

    సర్కారు జిల్లాల్లో ‘ఆంధ్ర మహాసభ’ 1913 మొదలుకుని ఏటేటా కాంగ్రెసు పందిట్లో సైడ్‌షోగా సభ చేయటమే తప్ప తనకంటూ నియమావళిని ముందుగా రూపొందించుకోలేదు... లో... మహాసభ నాటికి గానీ దానికి నియమావళి, సంస్థాగత స్వరూపం ఏర్పడలేదు. దీనికి భిన్నంగా నైజాం ఆంధ్ర మహాసభ మొదటినుంచే క్రమపద్ధతిన ముందుకు సాగటం విశేషం.