8, నవంబర్ 2011, మంగళవారం

కుహనా మేధావుల తప్పుడు రాతలు

ప్రజల ఆకాంక్షల పేరుతో వల్లించే దుర్మార్గపు సిధ్ధాంతాలని, ప్రజా ఉద్యమాల పేరుతో జరిగే అవాంఛనీయ సంఘటనలని గంపగుత్తగా సమర్థించడం ద్వారా గుర్తింపు పొందాలనుకునే కుహనా మేధావుల కోవలోనే జ్వాలా నరసింహారావు ధోరణి ఉంది.

ఆయన వ్యాసంలోని (ఆంధ్ర జ్యోతి నవంబరు 8) డొల్లతనాన్ని బయటపెట్టడానికి రెండే రెండు ఉదాహరణలు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణా అని ఆయన ఆవేశపడ్డారు. పౌర హక్కుల గురించి పెద్ద మాటలు మాట్లాడిన ఈయనకు, కనీసం తెలంగాణ ప్రాంత పౌరుల సంఖ్య ఎంతో కూడా తెలియదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్త్ర జనాభా 8.46 కోట్లు. అందులో కోస్తా ఆంధ్రలో 3.41 కోట్ల మంది, రాయలసీమలో 1.51 కోట్ల మంది, తెలంగాణాలో 3.52 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కోస్తా, రాయలసీమ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డవారి సంఖ్య చాలానే ఉంటుందనే విషయం అందరికి తెలుసు. అయినా జ్వాల గారు ఇంత నిస్సంకోచంగా సగటు తెలంగాణ రాజకీయ నాయకుడు మల్లే నాలుగున్నర కోట్ల ప్రజలని యధాలాపంగా ఎలా అంటారో సామాన్య పాఠకులకు వివరించాలి.

ఇక రెండోది. టి ఆర్ ఎస్ మినహా మరే ఇతర పార్టీకి తెలంగాణాపై స్పష్టత లేదట. ఇంత గొప్ప సత్యం కనిపెట్టిన రాజకీయ విశ్లేషకుడుకి తెరాస వారు సన్మానం చేయాల్సిందే. ఇదెలా ఉందంటే ఈ దేశంలో ముస్లింలకు సంబంధించి మజ్లిస్ కీ, ముస్లిం లీగ్ కీ తప్ప, హిందువులకి సంబంధించి ఆర్ఎస్ఎస్ కీ, విశ్వ హిందూ పరిషత్ కీ తప్ప ఎవరికీ అవగాహన లేదని తీర్మానించడం లాంటిది. ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకొనే తెరాస నిజానికి మతతత్వ వాద పార్టీలకంటే ప్రజల మధ్య ఎక్కువ విషాన్ని చిమ్మింది. ఇది కూడా పౌర హక్కుల హననం కిందికి వస్తుందని ఇంత పెద్ద మేధావికి తెలియకపోవడం దురదృష్టం.

7, నవంబర్ 2011, సోమవారం

బూర్గుల విద్ర్రోహానికి హైదరాబాద్ నగర కాంగ్రెస్ చేయూత?

విశాలాంధ్ర ఏర్పడాలని హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం

రెండు రాష్ట్రాలయితే అభివృద్ధి దెబ్బతింటుందని, హైదరాబాద్ నగరం తన ప్రాధాన్యత కోల్పోతుందని, ఆరేళ్ళ దాక  విషయం తేల్చకుండా ఉంచవద్దని, వెంటనే విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ కార్యవర్గం అక్టోబర్ 27, 1955 న ఏకగ్రీవంగా తీర్మానించింది.

వారి మాటలలోనే  
 "ఇప్పటి సంస్థానంలో కన్నడ,మరాఠి ప్రాంతాలు విడిపోయిన తరువాత చిన్న తెలంగాణ రాష్ట్రానికే ముఖ్య పట్టణంగా ఉంటే, హైదరాబాద్ నగరం ప్రతిపత్తి ప్రాముఖ్యం తగ్గడం మాత్రమేగాక, పౌరుల ఆర్థిక జీవనం బాగా దెబ్బతింటుంది. కాబట్టి, విశాలాంధ్ర సమస్యను ఆరేళ్ళ వరకూ తేల్చకుండా ఉంచక హైదరాబాద్ నగరాన్ని రాజధానికి, హైకోర్టుకు కేంద్రంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను ఇప్పుడే ఏకం చేయడానికి నిర్ణయించాలని ఈ కార్యవర్గంవారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు"



ఆంధ్ర పత్రిక, అక్టోబర్ 29,1955






6, నవంబర్ 2011, ఆదివారం

'నేను మొదటినుంచీ విశాలాంధ్ర ఏర్పాటును కోరుకున్నాను' : బూర్గుల

ఇంతకుముందే ఫజల్ అలీ నేతృత్వంలోని ఎస్సార్సీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన  తర్వాత  రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు 'విశాలాంధ్ర' ఏర్పాటు పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చదివాము ( http://visalandhra.blogspot.com/2011/11/blog-post_02.html )

ఆ దిశలోనే హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు  అక్టోబర్ 28,1955న ఒక  ప్రకటనలో విశాలాంధ్ర తక్షణం ఏర్పడాలని, ఎస్సార్సీ సూచించినట్లుగా ఐదేళ్ళ వ్యవధి అనవసరమని అభిప్రాయపడ్డారు. 

తాను మొదటినుండి విశాలాంధ్ర ఏర్పాటునే కాంక్షించానని చెబుతూ " హైదరాబాద్ను విడగొట్టిన తర్వాత తెలుగు ప్రాంతమంతా ఉండాలనే 1946 నుంచీ కూడా తాము అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు"

ఆంధ్రపత్రిక, అక్టోబర్ ౩౦,1955

'మా మంచి నిజాం, మా నేత కేసీఆర్'


నమస్తే తెలంగాణా దిన పత్రిక 6/11/2011 లోని సంపాదకీయ కాలం లో డాక్టర్ ఎ పీ విఠల్ గారి నిజాం నవాబుని ప్రస్తుతించిన తీరు,శ్రీ కే సీఆర్ గారి పట్ల వారి యొక్క స్వామీ భక్తి చదివి,చూసి తరించండి.

కలిసి నడవాల్సిన సమయం..
ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ నిజాం నవాబును ప్రస్తుతించడంపై టీవీ ఛానళ్లలో విశ్లేషణలు విశేషంగా చూశాము. నిజానికి ఇదేమీ పునః సమీక్షకు అవసరమైనంతటి నూతనమైన, ప్రధానమైన అంశం కాదు. గతంలోనూ కేసీఆర్ అలా ప్రస్తావించారు. దానిపై ఖండనలు, మండనలు జరిగాయి. సరే పాపం! ఇక పార్టీల ప్రతినిధులు విశ్లేషణలలో పాల్గొంటే తొండైనా, మొండైనా, తండమైనా వితండమైనా ఆయా పార్టీల దృక్పథాన్నే ప్రతిబింబించాల్సిందే కదా! అలాగే విశ్లేషించేందుకు సైతం అందుబాటులో కొందరు ఆస్థాన విశ్లేషకులు ఉంటారు. వారిలో కొందరు కాస్తో కూస్తో విషయంపై వెలుగు ప్రసారిస్తే, మరికొందరు శబ్దం, మరింత శబ్దం చేస్తూ ఉంటారు. కనుక వాటి సంగతి అటుంచి కేసీఆర్ నిజాం నవాబు పాలనపై చేసిన ప్రశంశాత్మక అంశాలను పరిశీలిద్దాం.

‘నిజాం ప్రభువు నిజాంసాగర్ డ్యాం కట్టించి లక్షల ఎకరాలకు నీళ్లు మళ్లించి, వ్యవసాయదారులకు ఎంతో మేలు చేశాడు. అలాగే ఉస్మానియా ఆస్పత్రి వంటి అధునాతన వైద్యశాలలు నిర్మించి ప్రజలకు వైద్యం అందించాడు. నేడున్న హైకో ర్టు, అసెంబ్లీ ఇత్యాది గొప్ప భవనాలను నిర్మించాడు. మంచి రహదారులను నిర్మించాడు. తద్వారా హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఎంతగా అంటే దేశంలోనే ఐదవ గొప్ప నగరంగా! ఇదీ స్థూలంగా కేసీఆర్ ప్రసంగం. ఇందులో అసత్యం ఏమైనా ఉన్నదా? లేదు.అయితే ‘అర్థ సత్యమే’ ఇది. ఇంకా చెప్పాలంటే నిజాం నిరంకుశ ప్రభువులు చేసిన అకృత్యాలు, ప్రత్యేకించి వీర తెలంగాణ విప్లవ పోరాటాన్ని అణచివేయాలని వందలాది రైతాంగాన్ని బలిగొన్నాడు. (నెహ్రూ సైన్యాలు అంతకంటే ఎక్కువమందిని బలిగొన్నాయి) తన విలాసాల కోసం కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఇది కేసీఆర్ నిజాం ప్రభువుపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఆయనను ‘దోషి’గా నిందించేవారి ప్రధాన వాదన. వాదన కోసం ఈ విశ్లేషణలు కూడా నిజాం నవాబులోని చెడు పార్వ్శాన్ని చూపి, మంచి పార్శ్వాన్ని మరుగునపరిచి, అర్థ సత్యం చెప్పినట్లే కదా! పోనీ కేసీఆర్ చెప్పిన పార్శ్వం చాలా తక్కువ స్థాయిగా ఈ విశ్లేషకులు భావించినా అది అబద్ధం అని అనజాలము కదా! ‘నిజాం పాలనలో మీరు (తెలంగాణ ప్రజలు) విద్యా, వైద్య సౌకర్యాలు లేక వ్యవసాయం చేయరాక, చేయదలచినా వసతులు లేక విజ్ఞానానికి దూరంగా, నీ బాంచన్ దొర అంటూ అనాగరికంగా కునారిల్లారు. మేము వచ్చి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మేము వచ్చి మీకు వ్యవసాయం నేర్పి, వైద్యశాలలు, రహదార్లు ఇత్యాదివి కల్పించాము. అని తమ వల్లనే వారి నాగరికపు పొద్దు మొలిపించినట్టు సీమాంవూధులు గొప్పలు చెప్తున్నారు. హైదరాబాద్ నగరం తమదేననో ఉమ్మడిదనో, తెలంగాణ వారిది మాత్రం కాదనో సీమాంవూధులు వాదిస్తున్న సందర్భంగా కేసీఆర్ అన్నమాట.

నిజాం ఒక ఫ్యూడల్ రాచరిక వ్యవస్థకు ప్రతినిధి! ఆ మాటకొస్తే మన పిల్లల పాఠ్యపుస్తకాలలో మనం ప్రస్తుతించే అశోకుడు, శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ప్రాంతంలోని ‘కాకతీయ కళా వైభవమ్ము’ అంటూ కీర్తించే రాణిరువూదమ వీరందరూ ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ ప్రతినిధులే. వీరి రాజ్యాలలో ప్రధానంగా సాగింది భూస్వామ్య పాలన అంటే రైతాంగంపై, ప్రజలపై నిరంకుశ దోపిడీ, అణచివేత దుర్మార్గాలు సాగాయి! వీరి పాలనలో కనీసం అష్టవంకరులతో భ్రష్టుపడుతున్న నేటి ప్రజాస్వామ్యమైనా లేదు. చట్టమూ లేదు. ఇక చట్టబద్ధ పాలన ఎక్కడది ఆ రాచరిక పాలనలో. పైపై మెరుగులుగా మంచి కనపడినా, మౌలికంగా అదే క్రూరమైన పాలనే. అయినా ఆ రాజులలో లేదా చక్రవర్తులలో కొందరు కొన్ని ప్రజాహిత కార్యక్షికమాలు చేయకపోలేదు. ఎన్నో యుద్ధాలు చేసి, వేలాదిమందిని బలిగొన్న ‘అశోకునికి కళింగ యుద్ధానంతరం జ్ఞానోదమయి, బౌద్ధమతాన్ని స్వీకరించి, శాంతికాముకుడైనాడు. ఆయన చేసిన మంచి పనులను ప్రస్తుతిస్తూ పుస్తకాలు రాసినవారు, ప్రచురించిన వారు వాటిని పాఠ్యాంశాలుగా నిర్ణయించిన పాలకులు వాటిని బోధించే ఉపాధ్యాయులూ వీరందరిని ఏమనాలి? అలాగే కాకతీయ ప్రభువులు వారిలోని రాణిరువూదమ. వారి పాలనా అంతే. రామప్ప చెరువు తవ్వించినా, వేయి స్తంభాల గుడి కట్టించినా, సామాన్య ప్రజానీకంపై, రైతులపై నిరంకుశ దోపిడీ పాలనే ఇది చారివూతక సత్యం. అదే సమయంలో నేటికీ తెలంగాణ ప్రజానీకం, అత్యంత ఉత్సాహంగా ఆట పాటలతో సమ్మక్క-సారక్క జాతరలు జరుపుకుంటారు.

ఎవరీ సమ్మక్క సారక్కలు? ఆ కాకతీయుల పాలననెదిరించి, కత్తి పట్టుకు పోరాడిన యోధులు! ఎందుకు, ఆరాచక వ్యవస్థ దుర్మార్గాన్ని ఎత్తి చూపడంలేదు అంటే అశోకులు, కృష్ణదేవరాయలు, కాకతి రుద్రమ్మలు వారి పాల న ముగిసి చాలా కాలమైంది. నాటి రాచరిక పాలన దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని అనుభవించిన తరం, తర్వాత తరం పూర్తిగా అంతరించింది. కానీ వారు చేసిన కళా పోషణ, ప్రజాహిత కార్యక్షికమాలు మిగిలిపోయాయి. వారిని గానంచేసే వారున్నారు. నిజాం ప్రభువు పాలన అంత పురాతనమైనది కాదు. ఇటీవలనే అనిపించేటట్టు ఆయన పాలన అనుభవించిన తరం మిగిలినా, ఆ తర్వాత తరం మిగిలే ఉన్నది. ఆ దుర్మార్గ నిరంకశత్వం నిన్నటి మాటగా గుర్తుంది. అదే సమయంలో, నిజాంసాగర్ డ్యాం, ఉస్మానియా ఆస్పత్రి తదితర ఆస్పవూతులు హైదరాబాద్ నగరంలోని అసెంబ్లీ, హైకోర్టు ఇత్యాది భవనాలు ప్రజలకు జ్ఞాపకం ఉన్నాయి. బహుశా ఇంకో రెండు మూడు శతాబ్దాలుగా గడిస్తే నిజాం నవాబు కూడా అశోకుడు, కృష్ణదేవరాయలు, కాకతీయ పాలకుల సరసన జనం చేర్చినా చేర్చవచ్చు.

కేసీఆర్ ప్రజావూపతినిధి. ఆయన పార్లమెంటు సభ్యులు. సాధారణ ప్రజల వలే ఆలోచించడం వారి వలే మాట్లాడడం, వారిలో ఒకనిగా నిలువగలడం వంటివి ఆయన అనుకూలాంశాలు కూడా. కనుకనే నిజాం నవాబు ప్రజాహిత కార్యక్షికమాలను ప్రస్తుతించాడు. అదే రాచరిక వ్యవస్థపై గురిపెట్టి వీరోచితంగా పోరాడిన కొమురంభీంను అంతకంటే ఎక్కువగానే ప్రశంసించారు. ఒక్క కొమురం భీం విగ్రహం ట్యాంకుబండ్ మీద ఉన్నట్లయితే అక్కడ విగ్రహ విధ్వంసం జరిగి ఉండేది కాదని కొమురం భీం ప్రత్యేకత ప్రస్తావించారు. కనుక కేసీఆర్‌ను నిజాం పాలనను కీర్తించిన వ్యక్తి అనలేము. దానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని సైతం అంతకంటే అదనంగా కీర్తించారు. మీరు ఇంత వాదిస్తున్నారు గానీ.. కేసీఆర్ ఏవర్గానికి చెందినవారు? భూస్వామ్య వర్గానికి చెందినవాడు అవునా? కాదా? సాయుధ తెలంగాణ పోరాటంలో ప్రముఖులైన రావినారాయణడ్డి, భీమ్‌డ్డి నర్సింహాడ్డి, జన్మతః భూస్వాములు. కానీ ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. అదీ గమనించాలి. కేసీఆర్ తన కుటుంబ సభ్యులనే రాజకీయ రంగంలో ముందు కు తెస్తున్నాడని నిదర్శనంగా చూపి ‘వారసత్వ రాజకీయాలు’ అని తమ వాదనా పటిమను ప్రదర్శించగలరు. అయ్యా నేటికీ మనదేశంలో భూస్వామ్య వ్యవస్థ నిలి చే ఉన్నది. సాంస్కృతికంగా అయితేనేటికీ ఆ భూస్వామ్య ఆలోచనా ధోరణి అధికంగానే ఉన్నది. అందులో భాగమే వారసత్వం. ఇంతెందుకు సీమాం ధ్ర ప్రాంతం బాగా అభివృద్ధిచెందిన ప్రాంతం -తెలంగాణ వెనుకబడిన అనాగరిక ప్రాంతం కాదుమరి! దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌డ్డి తనయుడు జగన్‌మోహన్‌డ్డి వివిధ జిల్లాల్లో ఓదార్పు యాత్ర కొన్ని నెలలపాటు పల్లెపప్లూకూ తిరుగుతూ సాగిస్తున్నారు. ఆయన యాత్రకు ప్రజా స్పందన అపూర్వం! అదంతా డబ్బులిచ్చి తెచ్చిన జనం అని పాపం, కాంగ్రెస్, టీడీపీ వర్గాలు ఎంతమొత్తుకున్నా అదే కారణమనగలిగిన స్థితిలేదు.

కాంగ్రెస్, టీడీపీ వారిలా ఎప్పటికప్పుడు మాట మారు స్తూ, రంగులు మార్చే ఊసర వెల్లి కాదని ప్రజల అభివూపాయం. అయినా నెహ్రూ, ఇందిర, రాజీవ్ ,సోనియా , రాహుల్‌గాంధీ వారి అత్యున్నత నాయకత్వం కదా? ఈ అంశం మందుకు తెచ్చి తద్వారా తమ దిగజారుతున్న రాజకీయ పలుకుబడిని నిలబెట్టుకుందామని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అయ్యా! ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో లేటుగా జేరి అదే టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, ఓడిపోయి, మామ కదా ఆదరించండి అంటూ చేరినదెవరు? ఇటీవల జరిగిన తెలుగుదేశం మహానాడు ప్రాంగణంలో నూ, చుట్టుపక్కల లోకేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు విపరీతంగా కానవచ్చినవట. ఆ లోకేష్ ఎవరు? అసలు ఆ లోకేష్ ఫ్లెక్సీ ల పట్ల కినుక వహించింది ఎవరు? హరిక్షికిష్ణ. అదిసరే.. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అందుకు కారణం గా ఎవర్ని చూపుతారు? శ్రీమతి లక్ష్మి పార్వతిని. కాంగ్రెస్‌లో ఎదుగుతున్న నాయకురాలు పురందేశ్వరి ఎవరు? ఇదంతా ఎందుకు? నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో అది జనరల్ నియోజకవర్గంగా ఉన్న చివరిసారి తప్ప అన్ని పర్యాయాలు భీమ్‌డ్డి నర్సింహాడ్డి, అయన సొదరి మల్లు స్వరాజ్యం, ఆమె భర్త మల్లు వెంకటనర్సింహాడ్డి వీరంతా సీపీఎం తరఫున (తెలుగుదేశం తరఫున పోటీచేసిన కుశలవడ్డి బీఎన్ సోదరుడే )అభ్యర్థులుగా పోటీచేశారు. ఈ కుటుంబమేనా? ఇంకెవరూ వేరే వారు పనికి రారా? అని కాంగ్రెస్ వారు హేళన చేసే వారు. అప్పుడు నేను చెప్పేవాడిని, 1946లో వారందరూ వీర తెలంగాణ విప్లవ పోరాటంలో ప్రాణాలకు తెగించి దుమికినప్పుడు, మీరేనా పోరాడేది. ప్రజాపోరాటంలో ముందుండేది? అని ఈ కాంగ్రెస్‌లో ఉన్నవావరైనా అడిగారా? వీరిలో అనర్హుపూవరో చెప్పండి? అని బహిరంగంగా ప్రజలలోనే ప్రశ్నించే వాడిని.

అలాగే ప్రత్యేక తెలంగాణ సాధన కొరకు ప్రజా పోరాటంలో హరీష్‌రావు, కేటీఆర్, కవిత అనర్హులా చెప్పండి? అనర్హులను కేసీఆర్ ప్రోత్సహిస్తే స్వార్థం. అంతేగానీ తెరాస, కేసీఆర్‌లతో పోటీ పడలేక చచ్చు పుచ్చు వాదనలతో కాల క్షేపం వద్దు. తెరాసలో, కేసీఆర్‌లో అసలు తప్పులు లేవని కాదు. కానీ నేడు తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదంగా మారింది తెరాస. దాని నేతనే కేసీఆర్. ఇది కఠోర వాస్తవం. తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర నాయకుల్ని విడిచిపెట్టి ధైర్యంగా తెలంగాణ సాధించేందుకు సిద్ధపడండి! కువిమర్శలు మానండి!


-డాక్టర్ ఏపీ విఠల్

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కేసీఆర్ కుటుంబమే చేస్తోందన్న ఈయనకి స్వీయ వ్యక్తిత్వం అంటూ ఉందా అనే అనుమానం వస్తోంది.

Break the Spell : Keep the State United

Parakala.org : Most Telangana leaders, it is now clear, had realised that the arguments the Telangana ideologues had advanced in support of the demand for a separate Telangana State did not square with facts. But these leaders would find it difficult to retrace their stand. They would not like to be seen as the ones who had ‘let down’ the cause of Telangana.

There should be a cogently constructed postulate with the help of which they can slowly jettison their Separate Telangana demand honourably and without losing their political constituency. We know that for the last several months almost all the leaders from Telangana region, cutting across party lines, have jumped onto the separate T-state bandwagon to build their political constituency; or at any rate not to let their political constituency slip out of their hold.

What complicated the issue?

There is a strong sense of resentment among a section of the Telangana elites towards the Coastal and Rayalaseema elites. It is necessary to acknowledge that it is not confined to only the political class. It has seeped into the minds of some sections (not all, by any means) of government employees, school teachers, students, advocates, litterateurs, media persons, and even High Court judges. Bandwagon effect played a large part in the agitation gathering some strength.

That the resentment is not justified is a different matter. The fact is, it exists.

Telangana agitators have assiduously worked to redefine and reposition the region’s life style, culture and festivals, its distinct accent, diction and idiom, and even cuisine. Then they worked to bring about a close identification between the people and these cultural and linguistic symbols. They positioned them in contradistinction to what they mischievously categorized as the Andhra symbols in these spheres.

In this drive, the nuances across Telangana as well as the nuances across Coastal and Rayalaseema are deliberately papered over. Categorizations about both the regions were arbitrary. No heed was paid to the extant variety and differences within each area, district, and among different castes in all the regions of the state. A simplified Telangana versus ‘Seema-Andhra’ was set up and used as a tool for mass political mobilization.

To thrive, hate needs simplifications. Telangana agitators succeeded in simplifying enough to engender hate.
 
A perceived insult to a way of life and linguistic expression engenders ‘identity’ assertions as a reaction. This holds true in any part of the world. When a Scotsman feels that his way of speech is sneered at by puritans with ‘BBC-accent’ from the mainland England, he will try to speak with more and not less Scottish accent. So will an Irishman speak with more Irish accent and not less. That perceived slight would arrest the much needed homogenization and standardization of speech, culture and life style.

Using perceived slight to Telangana culture by the ‘Seema-Andhra’ elites, the various streams in the Telangana agitation have succeeded in engendering an aggressive assertion of Telangana identity. They have also encouraged aggressive expression of love for Telangana.

This is the Trick

And here comes the cleverest conceptual manoeuvre of the Agitators. The biggest Agit-prop Trick. The wiliest of the spins.

This gave the most crucial turn to the agitation.

Love for Telangana and Demand for Separate Telangana State are shown to be one and the same.

If you love Telangana that should necessarily and logically make you a votary of a Separate Telangana State.

And if you are a votary of a Separate Telangana State you are necessarily a well-wisher and lover of Telangana.

Pro-Telangana means favouring the creation of separate telangana state.
Anti-Telangana means opposing the creation of separate telangana state.

Telangana nu preminchadamante Pratyeka Telangana Rashtraanni Koradame;
Pratyeka Telangana Raashtraanni korevare Telangananu preminchevaaru.

Conceptually two different, causally unrelated, and independent things are shown to be one and implicitly as extensions of one another. They are made out to be two sides of the same coin. And as though, they cannot be different.

Love for Telangana means support to the Demand for a Separate Telangana State.

And demanding Separate Telangana State alone is a mark that one is a bona fide well-wisher of Telangana.

And logically, therefore, those who are not in favour of the demand for Separate Telangana State do not love Telangana.

They are not well wishers of Telangana.

They are anti-Telangana.

In fact, they are enemies of Telangana.

It is a clever attempt to appropriate the ‘well-wisher of Telangana’ space by the protagonists of Separate Telangana State.

It is like the age old and time tested propaganda technique:
Lifebuoy ekkada undo aarogyam akkada undi
Lifebuoy yellido allide aarogya
Lifebuoy jaha ho tandurushti waha ho.

The truth is Lifebuoy and Good Health are independent of each other.


One may use Lifebuoy and still be unhealthy. And one may not use Lifebuoy but still be healthy.

But the propagandist wants the public to believe that Lifebuoy and good health are inextricably linked. Good health comes only from Lifebuoy and only Lifebuoy can give you good health. Without Lifebuoy there cannot be good health.

This link, however, is false. It is a trick. It is a spell.


This is the kind of spell that is cast on the Telangana public mind. At present it is swaying the public mind. That is why, although the protagonists are not in a majority, their impact in the public domain seems very large. Actually, it is quite disproportionate to their numbers.


However, in spite of this gigantic propaganda effort by the separatists, large numbers of people – indeed, lakhs and lakhs of them – are in favour of a united state. They do not endorse the separatist agenda.


What should be done?


The task is to rescue the discourse on Telangana agitation from this Spell. We need to expose this trick. We need to reclaim ‘well-wisher of Telangana’ space for votaries of United Andhra Pradesh from the Telangana region as well as from the Coastal and Rayalaseema regions. The voices of votaries of unity in the Nizam region need to be specially strengthened.


It is not easy. But it is possible. And it has to be done.


The task is to delink Love for Telangana from the Demand for Separate Telangana State. It is to show that they are not one and the same.


That they are not only different from each other, but in reality, they are independent of each other.  To show that one need not be the logical outcome of the other, nor does one entail the other.


One can love Telangana, be an uncompromising champion of Telangana but still be not in favour of a division of Andhra Pradesh, or a separate Telangana State. We need to show that there is no contradiction between being a champion of Telangana interests and at the same time be a staunch supporter of a United Andhra Pradesh.


If not immediately, surely sooner than later and an appropriate stage this logic needs to be extended to assert that in fact love for Telangana and demand for Separate Telangana State are contradictory.


We need to show that staunch champions of Telangana interests have also been staunch integrationists. In fact, they are staunch integrationists only because they are staunch champions of Telangana interests.


And more importantly, we need to show that all votaries of Separate Telangana State are not necessarily champions of Telangana interests or well-wishers of Telangana people.


I can give one compelling example from my personal observation. I have known Sri PV Narasimha Rao for many years since my childhood. I am yet to see a more ardent lover of Telangana than Sri Rao. Its culture, its folklore, its idiom, its cuisine, and its lifestyle were very dear to him. He championed its interests. He was uncompromising in his advocacy of Telangana Asmita. But at the same time he steadfastly stood for a United Andhra Pradesh during both the tumultuous agitations for separation of the State: the 1969 Telangana agitation and the 1972 Jai Andhra agitation.


Sri Ravi Narayana Redddy said: ‘Veera Telangana Naadi, Veru Telangana Kaadu’. Naranyana Reddy’s credentials as a champion of the cause of the common man of Telangana are unimpeachable. He was a staunch integrationist. In fact, he led the movement for unity of Telugu people and led the Andhra Mahasabha movement in the Nizam region. I am sure, one can give many more such examples.


I do not have to give examples for the other category. We can identify several leaders whose love for Telangana is dubious. And yet they are in the forefront of the present agitation for a Separate Telangana State. Many names will come to your mind without much effort, I am sure.


This shift in the discourse will give an honourable way to the leaders to retrace their steps and leave the separatist position they adopted in order to protect their political constituency.  They can come out of the clutches of the separatist ideologues.


Much more importantly, exposing the trick and the spell would help the common people to re-examine the agitation. A trick excites an onlooker only as long as he does not know how it is performed. During that period his logic is suspended. Excitement takes over. Emotion rules. But once it is known how the trick is performed, the excitement dies down. Logic rules.


A significantly large number of people of Telangana are hectored into believing that love for Telangana means demanding a separate state. With this clarity and delinking, they will question the premises of the agitation.
When an agitation’s premises are questioned, it is unnerved. An unnerved agitation is weakened.  And a weakened agitation is sure to die down.


A suppressed agitation may rear its head again in future.


But an agitation the postulates of which are questioned, exposed, and shown to be utterly false can never return.


This is a sure way to despatch Separate Telangana Agitation to the dustbin of history.

5, నవంబర్ 2011, శనివారం

మావోయిస్టు మేధావుల అరణ్యరోదన

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: హరగోపాల్ వ్యాసంలోని మావోయిస్టు సిద్ధాంత పోకడలను నేను బయటపెట్టినందుకు ప్రతిగా మరో మావోయిస్టు వివరణను 'లోకే అరణ్య' రాశారు. రాష్ట్ర విభజనకు ప్రాతిపదికలను చివరి పేరాలో పరోక్షంగా చెప్పారట! ఏమిటవి? "పెట్టుబడులు, స్వార్థప్రయోజనా లు, వ్యవస్ధీకృత దోపిడీలు లేకపోవడం, రాజకీయాలు, ఆర్ధిక సంయోజనాలు వేరుపడడం, సామాజిక సంబంధాలు ఉన్నతీకరించబడడం'' విభజనకు ప్రాతిపదికలని ఆచార్యుల వారు స్పష్టంగా రాశారని అర ణ్య పేర్కొంటున్నారు.

రాష్ట్ర విభజనకు ఇవీ ప్రాతిపదికలని హరగోపాల్ తన వ్యాసంలో ఎక్కడా పేర్కొనలేదు. అయినా 'అరణ్య'కు ఆ యన వ్రాసింది అలా అర్థమయ్యింది. సాయుధ పోరాటాలు జరుపుతూ సోషలిస్టు సమాజం ఏర్పడాలని కోరుకొనే మావోయిస్టులు కూడా కోరేది ఇదే! రాష్ట్ర విభజనకై జరిగే ఉద్యమం, మావోయిస్టు విప్ల వ ఆశయాల కోసమే జరుగుతున్నదని ఆచార్యులవారు భ్రమలలో చిక్కుకుంటే ఆయనను చూసి జాలి పడడంకంటే చేసేదేముంది?

'స్వయం పాలన అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే స్వయం పాలన' అని నేను రాసిన దానిని తప్పు పడుతూ 'అరణ్య' పూర్తిగా హరగోపాల్ శైలిలో 'పాలకులెవరైనా, నిర్ణయాలు ఎవరికి అనుకూలంగా ఉంటున్నాయి అనే దానిపైనే స్వయంపాలన ఉందా, లేదా? అనేది ఆధారపడి వుంటుంది.' అని తెలియజేశారు. ఇది అసలు సిసలు మావోయిస్టు వాదన. మనదేశంలో వున్నది ప్రజాస్వామ్య పాలన అని వారు అంగీకరించరు. ఇది బూటకపు ప్రజాస్వామ్యమని, పాలకవర్గాలు పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలని వారు సిద్ధాంతీకరిస్తారు.

అందుకే వారి నిర్ణయాలు ఎవరికి అనుకూలంగా వుంటున్నాయని మావోయిస్టులలాగ ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత ఈ బూటకపు ప్రజాస్వామ్యంలో పెట్టుబడిదారుల దోపిడీ నిరంతరాయంగా సాగుతుందని, పాలకవర్గాలు వారికి కొమ్ముకాస్తుంటారని మావోయిస్టులు సూత్రీకరిస్తారు. ఈ దోపిడీ వర్గాలను నిర్మూలించి విప్లవం తెచ్చి సోషలిస్టు సమాజాన్ని ఏర్పరచిన తరువాత మాత్రమే కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడుతుందని, దానిని మాత్రమే 'స్వయంపాలన'గా గుర్తించగలమని మావోయిస్టులు చెప్పే విషయాలనే హరగోపాల్, అరణ్య వంటి వారు అందరికీ అర్ధమయ్యేలా మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు.

అచ్చం హరగోపాల్ లానే అరణ్య కూడా రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక వివరించడంలో పూర్తి గందరగోళంలో పడ్డారు. "అరవై ఏళ్ళుగా భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు కలవలేకపోయినా, ఆత్మగౌరవం, స్వయంపాలన భావనతో ప్రత్యేక జీవనాన్ని కోరుకుంటే తప్పేమిటి?'' అని ప్రశ్నించారు. తమ వాదనలు బలపరచుకోవడానికి, అమాయక ప్రజలను గందరగోళంలో పడవేయడానికి మావోయిస్టు మేధావులు కూడా ఒక్కోసారి ఫాసిస్టు ధోరణిని ఆశ్రయిస్తుంటారు.

ఏక భాష, ఏక సంస్కృతి, ఒకే జీవనవిధానం, ఒకే మత సంప్రదాయాలకోసం తెలంగాణ ఉద్యమం సాగుతోందా? అంటే నూతన రాష్ట్రంలో ఉర్దూ, తమిళం, మరాఠీ వంటి భాషలు మాట్లాడే అవకాశం వుండదా? ఎవరూ భిన్న ఆచారాలు పాటించే ఆస్కారం వుండదా? అన్ని కులాలవారు ఒకే కులపు సాంప్రదాయాలు పాటించవలసిందేనా? ఈ ఆధునిక కాలంలో ఇటువంటి ఫాసిస్టు ధోరణులు దేశద్రోహకరమైనవి కావా? ఇవి రాష్ట్ర విభజనకు తగిన వాదనలు కావు. దేశ విచ్ఛిత్తికి దోహదం చేసే నినాదాలు.

ప్రజాస్వామిక వ్యవస్థపట్ల ఏమాత్రం విశ్వాసంలేని మావోయిస్టులకు, రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల సహజంగానే గౌరవం వుండదు. పత్రికలు పెట్టుబడిదారుల బాకాలంటారు. న్యాయస్థానాలు దోపిడీదారుల ప్రయోజనాలు కాపాడడానికే వున్నాయంటారు. 'అరణ్య' కూడా అచ్చం హరగోపాల్ లాగానే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలం గాణలోని కోట్లాది ప్రజల ప్రయోజనాలు నెరవేరుతున్నాయా? రాజ్యాంగ సంస్థలు నిష్పక్షపాతంగా తెలంగాణకు న్యాయం చేస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గర సిద్ధంగా వున్న మావోయి స్టు వాదనలలో 'పేద ప్రజలు' అనే పదం బదులు 'తెలంగాణ ప్రజ లు' అని కొద్దిపాటి మార్పుచేస్తే చాలు. ప్రత్యేకరాష్ట్ర సిద్ధాంతం రెడీ!

చిట్టచివరగా కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తున్నా నీటివసతిలేక మహబూబ్‌నగర్ జిల్లా రైతులు అల్లల్లాడిపోతున్నారని హరగోపాల్ పేర్కొంటే, దానికి సమాధానంగా ఆ జిల్లా రైతులు 22 లక్షల ఎకరాలు సాగుచేస్తున్నారని నేను వివరించాను. బోరు బావులద్వారా 76 శాతం పొలం సాగవుతుందేగాని కృష్ణానది నీటి వలన కాదని 'అరణ్య' వితండవాదం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా కృష్ణానది నీరు సాగు పొలాలలోకి ఎలా ప్రవహిస్తుంది? సముద్ర మట్టానికి 1634 అడుగుల ఎత్తులోవున్న ఆ జిల్లా ఎత్తును 800 అడుగులు తగ్గిస్తారా? లేదా కృష్ణానది ఎత్తును పెంచుతారా? కాలం చెల్లిన, వికృత మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రాంతీయ విద్వేషాన్ని కలగలిపి, విభజన వాదంతో అమాయక ప్రజలను ఎంతకాలం మోసగిస్తారు?

- అడుసుమిల్లి జయప్రకాష్
మాజీ శాసనసభ్యులు

పోచారం 'settler' వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి విశాలాంధ్రమహాసభ ఫిర్యాదు

Visalandhra.org: A lot of verbal and physical actions of the separatists which violate the fundamental rights of the people have been going unchallenged in our state. This is basically because the affected do not want to further drive any wedge among people which the separatists revel in on a daily basis. However, it is important to isolate those who have made a career out of making totally unacceptable statements in the name of separate state.

It is with this view that Visalandhra Mahasabha has filed a petition with the Election Commission of India against recently elected Banswada MLA Pocharam Srinvias Reddy, who made objectionable remarks against people who settled in his constituency from other parts of the state.

We are reproducing the contents of the petition here:

The Chief Election Commissioner
Nirvachan Sadan
Ashoka Road
New Delhi – 110 001
                                                                                                    27 October 2011

Ref:  Press Statement of Shri Pocharam Srinivas Reddy, MLA -  Banswada in Nizamabad District of Andhra Pradesh –Regarding

We wish to make this representation to you on behalf of Vishalandhra Mahasabha, a non-political organistion committed to the cause of integrity of Andhra Pradesh in the face of agitations in Telangana, Rayalaseema and Coastal districts for the vivisection of the State in the name of sub-regional sentiments. We have no political affiliations of any kind.

Shri Pocharam Srinivas Reddy, MLA – Banswada who was earlier in Telugu Desam Party resigned from the party some time ago and joined the Telangana Rashtra Samiti (TRS). In the bye-election caused by his resignation, he contested on behalf of the TRS and won the election on —- with an impressive margin of some 49000 votes. His Congress rival secured about 33000 votes when the TRS was expecting him to lose his deposit. On the 20th October2011, Shri Reddy addressed a press conference celebrating his victory in which he said:

“Settlers claim they support the Telangana cause, but did not vote for it. They live on Telangana soil, but did not vote for us. They have to rethink about their attitude or face consequences,”

This is perhaps the first time a TRS MLA has openly attacked the attitude of people who have settled in Telangana and held out a threat on the ground they have not voted for him. By settlers, he meant the people from coastal districts of the State who settled in Nizamabad district about 70 years ago.  Holding out threats of this kind is punishable under Section 125 of Representation of People’s Act which reads as follows:

125. Promoting enmity between classes in connection with election.—Any person who in connection with an election under thisAct promotes or attempts to promote on grounds of religion, race, caste, community or language, feelings of enmity or hatred, between different classes of the citizens of India shall be punishable, with imprisonment for a term which may extend to three years, or with fine, or with both.

Apart from the Representation of People’s Act, this is a cognizable offence u/s 153A of Indian Penal Code which reads as follows:

Whoever by words, either spoken or written, or by signs or by visible representations or otherwise, promotes or attempts to promote, on grounds or religion, race, place of birth, residence, language, caste or community or any other ground whatsoever disharmony or feelings of enmity, hatred or ill-will between different religions, racial, language or regional groups or castes or communities and which disturbs or is likely to disturb the public tranquility, shall be punished with imprisonment which may extend to three years or with fine or with both.

In view of the culpable conduct of the MLA, we request you to order an enquiry by a senior officer of the Commission and initiate appropriate action against the MLA.

Thanking you.

C. Anjaneya Reddy, IPS
Visalandhra మహాసభ



ఆంధ్రజ్యోతి:"సెటిలర్లు తెలంగాణకు మద్ధతిచ్చారు, కానీ ఓట్లు వేయలేదు. వారు తెలంగాణ గడ్డమీద నివసిస్తున్నా మీకు ఓటు వేయలేదు. వారి వైఖరిపై పునరాలోచించుకోవాలి, లేకపోతే పర్యవసానం అనుభవిస్తారు'' అంటూ పోచారం శ్రీనివాసులరెడ్డి బాన్సువాడ ఉప ఎన్నికల అనంతరం అక్టోబర్ 20న చేసిన ప్రకటనను విశాలాంధ్ర మహాసభ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది.

తెలంగాణ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న కొందరు సెటిలర్స్‌ను బెదిరిస్తూ ప్రకటన చేసిన ఎమ్మెల్యేపై ' రెప్రజింటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ' లో సెక్షన్ 125, ఐపీసీ 153ఏ ఐపీసీ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారితో విచారణ జరిపించి పోచారంపై చర్యలు తీసుకోవాలని విశాలాంధ్ర మహాసభ నాయకులు సి.ఆంజనేయరెడ్డి కోరారు.

4, నవంబర్ 2011, శుక్రవారం

పాపం ఆనపకాయ!

"ఆంధ్రా వాళ్ళు సొరకాయ అంటారు, తెలంగాణా వాళ్ళు ఆనపకాయ అంటారు." - KCR

ఆంధ్రప్రభ : భారతీయ యోగాగురు బాబా రామ్‌దేవ్‌, ఓ దొరవారి పుణ్యాన ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మరింత అధికంగా మన రాష్ట్రంలో ఆనపకాయ వివాదాల్లో చిక్కుకుంది! ఏమైనా ఆనపకాయకి ఇంతవరకు అంటే బాబా రామ్‌దేవ్‌ మనదొరవారు, పూనుకునే వరకు ఎక్కువ ప్రాధాన్యత రాలేదు. లేత గరికగడ్డితో, బీరకాయతొక్కతో మంచిపచ్చడి చేయవచ్చు. ఆనపకాయకికా యోగ్యతాలేదు. వంకాయకి క్వీన్‌ ఆఫ్‌ వెజిటబుల్స్‌ (కూరగాయల్లో రాణి) అన్న హోదా ఉంది. బెండకాయకి లేడీస్‌ ఫింగర్‌ అన్న నాజూకు నామం ఉంది. గోంగూర (శాకంబరి) తోటకూర, గుమ్మడి, చిక్కుడు ఇవన్నీ సినిమా పాటలకి ఎక్కేయి -కందసామెతల్లోకి పోయింది (సొరకాయ కోతలన్న నానుడి దీనికీ దక్కిందిలే) అలా కూరగాయలన్నీ ఏదో ఒక హోదా దక్కించుకున్నాయి. ఆనపకాయ ఏ రకమైన రచనా ప్రక్రియలోనూ స్థానం సంపాదించుకోలేదు. పద్యం, గద్యం కవిత, తవిక, నాటకం, నానీలు ఎందులోనూ లేదు. అంటే సబ్బుబిళ్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల పాటి చేయలేకపోయిందన్నమాటేగా!

ఇక జాతీయ స్థాయిలో ఆనపకాయకింత అకస్మాత్తుగా అంతప్రాధాన్యత లేదా వివాదం ఎందుకొచ్చిందో ముందుగా చెప్పుకుందాం. ఈ వ్యాసకర్తకు రామ్‌దేవ్‌ బాబా పట్ల అగౌరవంలేదు. యోగాకి సంబంధించినంతవరకు మా ఆవిడ వేల రూపాయల టిక్కెట్లు కొనుక్కొని ఆయన యోగా కేంపులలో ముందువరసలో కూర్చోడానికి వెళ్ళడాన్నీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఐతే ఆయన దాదాపు ఒక సంవత్సరంన్నర క్రితం ఆనపకాయను రసం తీసుకుని గ్లాసుడు కాదు -బోలెడు పొద్దున్నే గటగటా తాగేస్తే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని, బిపి షుగర్‌లను బ్రహ్మాండంగా నియంత్రిస్తుందని, అంతేకాదు -గుమ్మడికాయలా ఉన్నవాళ్లని గమ్మున పొట్లకాయలలా గమ్మత్తుగా చేయగల్గే మహత్తు దానికుందని ప్రచారం చేశారు. దాన్ని సామాన్యులు, పామరులేగాక పండితులు, శాస్త్రవేత్తలు కూడా గుడ్డిగా పాటించేరు. పొలోమంటూ ఈ చిట్కాని అతిగా పాటించిన సుశీల్‌ శర్మ అనే 59 ఏళ్ల, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (ఐసిఐఆర్‌) లో డిప్యూటి డైరెక్టర్‌గా పనిచేస్తున్నాయన దుర్మరణం పాలయ్యాడు. దానికి కారణం ఆనపకాయ రసం అతిగా సేవించడమేనని నిర్ధారణౖంది. ఇంకా ఎంతమందో ఎన్నో దుష్ప్రభావాలకు లోనయ్యారన్న వార్తలూ వచ్చేయి. దేశమంతటా గగ్గోలు ప్రారంభమైనందున ప్రభుత్వం ఆనపకాయ రసం యొక్క వైద్య గుణాలు పరిశోధించాలన్న ఆదేశాలు జారీ చేసింది.

ఆ పరిశోధనను ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో వైద్య విభాగాధిపతి ఎస్‌.కె.శర్మ నేతృత్వంలో ఒక వైద్యుల బృందం ఒక సంవత్సరం పాటు చేపట్టింది -వారి పరిశోధనా ఫలితాలు ఈ వారంలోనే వెల్లడయ్యాయి. అవేమంటే (1) ఆనపకాయ రసానికి రోగనివారణ గుణాలు లేనే లేవు (2) పైగా దీని జ్యూస్‌లో విషతుల్యమైన ఏసిడ్‌ (ఆవ్లుం) ఉంది. దానిపేరు టెట్రాసైక్లిక్‌ ట్రిటార్‌ పెనాయిడ్‌ క్యూకర్బేటినస్‌ (3) దీన్ని అతిగా సేవిస్తే అరుచి, వాంతులు, తలతిరగటం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావటమే కాదు -మరణం కూడా సంభవించవచ్చు (4) ఆనపకాయ రసాన్ని ఏ ఇతర కూరగాయలు లేదా పళ్లరసాలతో కలిపి సేవిస్తే దుష్పరిణామాలు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. (5) విడిగా సేవించాలనుకున్నా ఒక ముక్కకొరికి, అది ఏమాత్రం చేదుగా ఉన్నా రసం తీయటం -సేవించటం మానేయాలి. (6) సేవించిన తర్వాత ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా ప్రాథమిక చికిత్సగా ఎక్కువ నీళ్లు తాగి వెంటనే వైద్యసహాయం పొందాలి. అయ్యా ఈ ఆరు సూత్రాలను బట్టి ఏం తెలుస్తోంది ఆనపకాయను పచ్చిగా కాదు ఉడకబెట్టి ఏదో కూర అప్పుడప్పుడు వండుకోండి గాని దాని జ్యూస్‌ తాగొద్దనే కదా. ఐనా, బాబాగారు తన చిట్కానే కరెక్టంటున్నారు.

ఇప్పటికీ ఇక దొరవారి చిట్కా సంగతి -ఆనపకాయ అనేటోళ్లంతా మనోళ్లు అంటే తెలంగాణీయులు సొరకాయ అనేటోళ్లు ఆంధ్రోళ్లు అనేది -ఇది ఎర్రచీరకట్టుకున్నోళ్లంతా -అన్నట్లు లేదా ఐనా అనుయాయులు వారు చెప్పే ఇతర సూక్తులతోబాటు (ఆంధ్రోళ్లు రాక్షస సంతతి వంటివి) దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదెంత అసంబద్ధమైన సూత్రీకరణో మళ్లీ మళ్లీ వివరించవలసిన పని లేదు గాని, సొరకాయ ఆనపకాయలకు, జంతికలు, మురుకులకు, గోంగూర -పుంటికూరలకు, పులిహోర -చిత్రాన్నంలకు, గారెలు -వడలకు, సాంబారు పప్పుచారులకు అవి ఒకటే ఐనా వేర్వేరు రాష్ట్రాలివ్వటం సాధ్యమా అని ప్రశ్నించాలి. దొరవారికి రాజకీయ, ఆర్థిక కుటుంబ ప్రయోజనాల రక్షణ ప్యాకేజీ కుదిరే వరకు వేర్వేరే అంటూనే ఉంటారు కాబోలు -ప్రస్తుతానికి ఆనపకాయ కొచ్చిన అగచాట్లకు జాలిపడి దాన్నైనా వదిలివేస్తే బాగుంటుంది -లేకపోతే ఆయనకి మన ఆనపకాయ బాబాగా బిరుదునివ్వాల్సి ఉంటుంది.

అంతకుముందు ఇంకే కూరగాయ, మంచి ఆకుకూర లేకపోతేనే ద్వితీయ ప్రాధాన్యంగా వండుకునేది మాత్రం గానే ఆనపకాయ ఉండేది, ఇప్పుడేమో ఇంత వివాదాస్పదమై పోయిందిగాని! నిజానికిది ముల్కీ కూరగాయ కానేకాదు. గుమ్మడి, కొబ్బరికాయల్లా దేశీయం కూడా కాదు. అందుకే వాటికి కూష్మాండం, నారికేళం అని పేర్లున్నట్లు దీనికి సంస్కృత భాషలో ఏ పేరూ లేదు. పూజా పునస్కారాలకు, లేదా దిష్టి తీయడానికి వాటినుపయోగిస్తాం గాని ఆనపకాయకా హోదాలేదు. ఆనపకాయ మొదట్లో ఆఫ్రికాలో పుట్టి లేదా పండి, కాలక్రమేణా అన్ని దేశాలకు పాకిన పాదు. అంటే, టమాటా క్యారెట్‌, క్యాబేజీ, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌, కేప్సికమ్‌ లాంటి వలస కూరగాయే ఇదన్నమాట -దీని శాస్త్రీయ నామం స్పానిష్‌ భాషలో ఃకేపబుజాః ప్రపంచ వ్యాప్తంగా వృక్షశాస్త్ర (బోటనీ) గ్రంథాల్లో వాడబడుతున్నపేరు లాజనారియా సైసేరేరియా. ఆంగ్లంలో బాటిల్‌ గార్డ్‌ అంటారు. కొన్ని గుండ్రంగా పొట్టిగా ఉన్నా, కొన్ని లావుపాటి పొట్లకాయలలా పొడుగ్గా ఉన్నా, మొత్తానికి సీసా షేపుతో పోల్చవచ్చునని కాబోలు. ఇంకో కారణం ఎండబెట్టిన ఈ కాయను చిల్లుచేసి, డొల్లచేసి నీళ్లపాత్రగా కూడా ఉపయోగించే అలవాటు చాలాదేశాల్లో పూర్వం నుండి ఉంది. ఆనపకాయను హిందీలో ఃలౌకీః, మరాఠీలో ఃదూదీ బోసాలః, కన్నడంలో ఃసొరకాయిః, అస్సామీలో ఃజాతీలాలోః, బెంగాలీలో ఃలావ్‌ః, గుజరాతీలో ఃదీధీయాః, మళయాళంలో ఃచురక్కః అంటారు.

తెల్గూ ఈజ్‌ ది ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని గొప్పగా చెప్పుకుంటాము గదా (మనలో మనం ఎంత కొట్టుకు చస్తున్నా!) ఆ ఇటాలియన్‌లో కుబుజ్జా అంటారు. ఇక తెలుగులో ఆనపకాయ, సొరకాయ అని రెండు పదాలూ ఉన్నాయి. ఏ ప్రాంతంవాడైనా సమయానికి ఏ పేరు నోటికొస్తే అది పలుకుతాడేగాని దొరవారు వాక్రుచ్చినట్లు ఒక ప్రాంతం వాళ్లు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఆనపకాయ అని ఇతర ప్రాంతాలవారందరూ సొరకాయ అని అనరు. అలా సూత్రీకరించటం ఒకరకమైన ఉన్మాదం. అన్ని ప్రాంతాల్లోనూ రెండు పేర్లూ సమానస్థాయి వ్యవహారంలో ఉన్నాయి గాబట్టి ఈ రకమైన సూత్రీకరణ తప్పు.

మనజాతి నీతి, రీతి, సంస్కృతి, వేషభాషలు, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, ఆఖరికి దేవుళ్లు దేవతలు అంతా పూర్తిగా వేరు అని పదేళ్లుగా నిస్సంకోచంగా గడగడా చెబుతున్న దొరవారు చేసింది కాబట్టి పట్టించుకోవద్దు అనుకున్నా ఈ పచ్చి అబద్దాల్నే గుడ్డిగా నిస్సిగ్గుగా విభజన వాదులంతా గోబెల్స్‌ మాదిరి ప్రచారం చేస్తూండటం మాత్రం బహు విచారకరం -ఃవలస కూరగాయః, ఆనపకాయ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. దానికిప్పుడొచ్చిపడిన వివాదాలు అగచాట్లు గురించి వివరించేముందు ఇది ఆఫ్రికా నుంచి అన్ని దేశాలకు పాకిన పాదు అని చెప్పుకున్నాం గదా. ఇప్పుడన్ని రాష్ట్రాలలో, ప్రాంతాల్లో, ఉపప్రాంతాల్లో పండుతోంది. ఎక్కువ వర్షపాతం, భూసారం, ఎరువులు సంరక్షణ వగైరా అవసరం లేదు.

రంగు రుచి వాసన ఉపయోగాలు ఎక్కడ కాసినా, అంటే దొరగారి దొడ్లోనైనా, దళితుని పూరిగుడిసె పై నుంచి తెంపినా, ఒకటేగా ఉంటాయి. ముందే చెప్పినట్లు గృహిణి ద్వితీయ ప్రాధాన్యంగానే, వంటింట్లో ఉపయోగిస్తుంది. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో రకరకాల వంటలు, కూరలు చేస్తారు. తెలుగువాళ్లైతే ఆనపకాయతో కూర, వేపుడు, పులుసు, దప్పళం కుర్మా, పెరుగుతో, తెలగపిండితో ఇంకేదైనా పప్పుతో ఆకుకూరతో కలగలుపు వంటలు చేస్తారు. శనగపిండి కలిపి బజ్జీలూ చేస్తారు. నిల్వ పచ్చడికి పనికిరాదు. ముదురితే అంతే సంగతులు -ఏమైనా ఆనపకాయతో వంటకాలు అంతగా లొట్టలు వేసుకుని తినేలా ఉండవన్నది ఈ వ్యాసకర్త అభిప్రాయం.

ఐతే, దీంతో ఎవరైనా విభేదించవచ్చు, లోకోభిన్న: రుచిగదా. పైగా నాకు నా సిద్ధాంతంతో విభేదించేవారి నాలుకలు కోస్తాననే సంస్కారం, సాహసం లేవు, విభజన వాదులలా. ఇంక ఆనపకాయ ఇతర ఉపయోగాల గురించి చెప్పాలంటే ఇతర దేశాలలో ఇప్పటికీ దీన్ని ఎండబెట్టి నీళ్లు నిల్వచేసుకునే పాత్రలుగా చిన్నవైతే టీకప్పులుగా, అంతేకాదు ప్లూట్‌ (మురళి), ఫిడేల్‌ వంటి సంగీత పరికరాలను తయారు చేసుకునే అలవాటుంది -షెర్లాక్‌హోమ్స్‌ (ఆంగ్లంలో అపరాధ పరిశోధనా గ్రంథాల రచయిత) ఆనపకాయ డొల్లనే పొగాకు పీల్చే పైపుగా వాడేవాడట! ఈ విధానాన్ని మన మొఘల్‌ ప్రభువులు కొందరు హిమాలయాల్లోని సాధువులూ, పాటించారట (గంజాయి పీల్చడానికి). దొరవారు కీర్తించే నైజాం నవాబు సంగతి తెలియదు.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు


3, నవంబర్ 2011, గురువారం

ఎవరికి వారే, మూసీ తీరే!

సూర్య దినపత్రిక సంపాదకీయ పేజి :తెలంగాణ రాష్ట్ర సాధన తన వల్ల మాత్రమే సాధ్యమని చెప్పుకుంటున్న తెరాస అధిపతి కెసిఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా జరుపుకుంటున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో నల్ల జెండా ఎగురవేయకుండా ఆ బాధ్యతను నాయనికి ఇచ్చి మాయమైపోయారు. కెసిఆర్‌ ఈ వానిషింగ్‌ ట్రిక్‌ కొత్తదేం కాదు కానీ కాంగ్రెస్‌ పార్టీలోంచి వచ్చిన శాసనసభ్యులకు ఆహ్వానం పలికిన పార్టీకి అధిపతిగా, నరనరానా తెలంగాణ వాదం జీర్ణించుకుపోయిన వ్యక్తిగా తన నిరసనను ప్రకటించకపోవడమే ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. పోనీ తెలంగాణ జాక్‌ నేతలతో కలిసి ఢిల్లీలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ దీక్షకు ఏమైనా వెళ్ళారా అంటే అదీ లేదు. అసలు ఇలా ఎవరికి వారు కాకుండా అన్ని పార్టీల తెలంగాణ నేతలు ఒకచోట చేరి విద్రోహ దినోత్సవాన్ని జరిపారా అంటే అదీ లేదు. ఆయన ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారుట. బహుశ ఇదంతా అందులో భాగమే కాబోలు. ఉద్యమం నడుస్తున్న తీరే విచిత్రంగా ఉన్నది.

ఎవరికి వారే. ఎవరి అస్తిత్వ పోరాటం వారిదే. తమ తమ అస్తిత్వాలకు భంగం వాటిల్లకుండా, ఐకమత్యం లేకుండా తెలంగాణను సాధించేందుకు పోరాడుతున్నామనే భ్రమ కల్పించేందుకు నాయకులు పడుతున్న తాపత్రాయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో జాక్‌ నాయకులతో కలిసి వెళ్లిన కెసిఆర్‌ ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత సకల జనుల సమ్మె అటకెక్కింది. ఆయన ఢిల్లీలో పెద్దలతో ఏదో ఒప్పందం కుదుర్చుకువచ్చి ఉద్యమాన్ని నీరు గార్చారనే ఆరోపణలు, విమర్శలకు పరిమితం కావడం మినహా ఇతర పార్టీలలోని తెలంగాణ నాయకులందరూ కలిసి కట్టుగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మెను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేయలేకపోయారు.

ఇలా ఒక సందర్భమేమిటి? అనేకానేక సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీల్లోని నేతలు తమ మధ్య ఉన్న అనైక్యతను బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి లేదు. నిన్నటి వరకూ ఇతర రాజకీయ పార్టీలను దుమ్మెత్తి పోసిన కెసిఆర్‌ పై నేడు ఇతర పార్టీల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఒకరిపై ఒకరు బురద జల్లుకుని తమకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నామనుకుంటున్నారే తప్ప ప్రజలలో విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనే భయం ఎవరికీ ఉన్నట్టుగా కనుపించడం లేదు. ఈ తెలంగాణ రాజకీయ క్రీడలో సామాన్యులు పావులుగా మిగిలిపోతున్నారు.

ఇప్పటికే బాన్సువాడ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని తేల్చివేశాయి. ఉద్యమ తీవ్రత లేదా ఆకాంక్ష నాయకులు చెప్తున్నంత, టివిలలో చూపుతున్నంత తీవ్రంగా లేవనే సంగతిని ఈ ఫలితాలు బయటపెట్టాయి. ఎందుకంటే గతానుభవంతో డిపాజిట్‌ కూడా దక్కదనే భయంతో, పరువు నిలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ అసలు అభ్యర్ధినే నిలబెట్టలేదు. ఆ విషయాన్ని మసిబూసి మారేడు కాయ చేయాలనుకున్నా వాస్తవమదే. కానీ ధైర్యం చేసి నిలబడిన కాంగ్రెస్‌ అభ్యర్ధి అనూహ్యంగా ఓట్లు చీల్చారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి తరుఫున ప్రచారం చేసేందుకు ఎవరూ పోకపోయినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీ మీద ఉన్న ప్రేమతో కాసిని ఓట్లు వేసేశారు. దీనితో క్లీన్‌ స్వీప్‌ చేస్తామనుకున్న టిఆర్‌ఎస్‌ బిత్తరపోవలసి వచ్చింది. ఉద్యమం ప్రారంభమైన మొదట్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ ప్రజలు తెరాస అభ్యర్ధులకు మినహా మరే పార్టీకి డిపాజిట్లు కూడా దక్కనివ్వని పరిస్థితి ఉన్నది. ఆ స్థితి నుంచి ఓట్లు చీల్చుకునే స్థితికి రావడం ఉద్యమంలో వస్తున్న మార్పును సూచిస్తోంది.

పోనీ ఒకే పార్టీలో ఉన్న టి నేతల మధ్య ఏమైనా సఖ్యత ఉన్నదా అంటే అదీ నేడు కనుపించడం లేదు. ముఖ్యంగా టి కాంగ్రెస్‌లో లుకలుకలు అయితే బహిరంగంగా బయటపడ్డాయి. తెలంగాణ మీద అపరిమితమైన ప్రేమను కనబర్చడంలో ముందున్న జానారెడ్డి సకల జనుల సమ్మెను విరమించమని ఉద్యోగులకు పిలుపివ్వడం మిగిలిన వారిని భగ్గుమనిపించింది. అందుకే మధుయాష్కీ గౌడ్‌ టివిలకెక్కి జానారెడ్డిని తన స్టైల్లో తీవ్రంగా విమర్శించి, నిందించారు. ప్రస్తుతం కెకె, యాష్కీ, పొన్నం ప్రభాకర్‌ వంటి నాయకులంతా తమ పరువు పోకుండా ఉండేందుకు ప్రకటనలు చేస్తున్నా వాటి పదును కనీసం గాటు పెట్టేలా కూడా ఉండడం లేదు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ నుంచి తెరాసకు ముగ్గురు శాసనసభ్యులు వలస వెడితే వెళ్ళి ఉండవచ్చు.

లగడపాటి లెక్కల ప్రకారం మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడా వెళితే వెళ్ళవచ్చు. అయితే ఇదంతా తెలంగాణ మీద ప్రేమ కన్నా ముఖ్యమంత్రి మీద ఉన్న అసహనం కావచ్చు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాత్రం పార్టీ నుంచి వెళ్ళకుండా తనదైన స్టైల్లో నవంబర్‌ 1న దీక్షకు కూర్చున్నారు.వాస్తవానికి కిరణ్‌ మీద ఉన్న ఆగ్రహమే ఆయన అలా ప్రవర్తిస్తున్నందుకు కారణమని అనేవారు లేకపోలేదు. తెలంగాణ దెబ్బ నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్టు కనుపిస్తోంది. అందుకే వారు ఉద్యమానికి ప్రాధాన్యతనివ్వడం కన్నా కెసిఆర్‌ను టార్గెట్‌ చేసుకోవడానికే ప్రాధన్యతనిస్తున్నారు. బాన్స్‌వాడ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పార్టీ అధినేత, ఇతర నాయకులు కూడా నాలుక కరుచుకున్నట్టు కనుపిస్తోంది.

ఆ ఫలితాల ధోరణి చూసిన తర్వాత వచ్చిన ఆత్మవిశ్వాసంతో ఈసారి అన్ని చోట్ల నుండి పోటీ చేస్తామంటూ బాబు ప్రకటించుకున్నారు. తమ కేడర్‌ను దక్కించుకునే ప్రయత్నంలో తెలంగాణ పై పోరాటం కన్నా టిఆర్‌ఎస్‌ అధినేతను లక్ష్యంగా చేసుకొని లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ముమ్మరంగా ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో కెసిఆర్‌ లబ్ధి పొందారంటూ బురద జల్లుడు ప్రచారాన్ని తెలుగుదేశం నాయకులు చాలా తీవ్రంగానే ప్రారంభించారు. ఎన్డీయే హయాంలో తెలంగాణ అంశం అడుగకుండానే ప్రస్తావనకు వచ్చినా నో అని బాబు ఖండితంగా చెప్పినప్పుడు ఈ నాయకులంతా మౌన ప్రేక్షక పాత్ర ఎందుకు వహించారో, ఇప్పుడు మాత్రమే వారికి తెలంగాణ పై పట్టరాని ప్రేమ ఎందుకు వచ్చిందో తెలిసిన విషయమే.

నాడే పట్టుబట్టి వారే ఉద్యమం చేసి ఉంటే ఈపాటికి తెలంగాణను సాధించి ఉండేవారేమో! ఆ ఘనత, కీర్తి వారికి దక్కేవేమో! కానీ అప్పుడు వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అం దుకే ఎవ్వరూ నోరెత్త లేదు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో తెలంగాణపై బాహాటంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఆ పార్టీలో కూడా ఒకరితో ఒకరికి పొసుగుతున్న దాఖలాలు కనుపించడం లేదు. నాగం జనార్దన రెడ్డి పార్టీని వీడిపోయారు. ఆయన సొంత కుంపటితో తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం విద్రోహ దినం కాని రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈసారి తెదేపా నాయకులకు అలా కనిపించడం ఆశ్చర్యమే కదూ? అధికారంలో ఉండి మంత్రులుగా కొనసాగినంత కాలం బుద్ధిగా జెండాలు ఎగరేసిన వీరిలో ఎక్కువ మంది మంగళవారం నాడు ఢిల్లీలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ దీక్షకు మద్దతుగా అక్కడ చేరడం ఒక వింత.

ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందింది ఎక్కువగా తెరాస మాత్రమే. తనకున్న క్యాడర్‌ను స్థిరీకరించుకుంది. ఇతర పార్టీల నాయకుల మధ్య చిచ్చు రేపడానికి కారణమైంది. కొన్ని పార్టీల నుంచి నేతలను ఆకర్షించింది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నిర్వీర్యం చేసినంత పని చేసింది. మొత్తం మీద తెరాస తెలంగాణలో బలపడింది కానీ సమస్యకు పరిష్కారాన్ని మాత్రం కనుగొనలేకపోయింది. నానా హడావిడీ చేసి ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలను రగల్చడం మినహా అది సాధించిందేం లేదు. అవసరమైతే కెసిఆర్‌ మరోసారి ఆమరణ దీక్ష చేస్తారు అంటూ తెరాస నాయకులు ప్రకటించారు కానీ దానికి ముహూర్తం కుదిరినట్టులేదు.

ఈ రకంగా ఎవరి స్టైల్లో వారు తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్న రీతిలో బిల్డప్‌లు ఇచ్చుకుంటున్నారు. తప్పితే మూల సమస్యను ఎలా పరిష్కరించాలన్న విషయంపై ఒక చోట కూడి ఆలోచనలు చేయడం లేదు. 1969, 1972 నాటి ఉద్యమాలలో అన్ని పార్టీల వారూ కలిసి కట్టుగా, ఒకే తాటిపై నిలిచి ఉద్యమించారు. అయినా వారు లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు మరొక పార్టీ నాయకుడితో కలవకుండా ఎదుటివారిని విమర్శిస్తూ లక్ష్యసాధన కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. తాజాగా దీక్షకు కూర్చున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్ని పార్టీల వారు తమ జెండాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలంటూ పిలుపిచ్చారు. ఇలాంటి పిలుపులు ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి అన్ని కోణాల నుంచి వందలాదిసార్లు వచ్చి ఉంటాయి. కానీ జరిగింది శూన్యం. నాలుగు సిగలు కలవలేవంటారు కానీ ఇక్కడ నాలుగు క్రాఫులు కూడా కలిసే పరిస్థితి లేదని తేటతెల్లమైపోయింది. మరి తెలంగాణ కేంద్రం ఇచ్చినప్పుడే తీసుకోవాలి ఇంక.
- డి. అరుణ

వర్క్‌షాప్‌నకు జూబ్లీహాల్ ఇవ్వాలని ఆదేశించండి : విశాలాంధ్ర మహాసభ

వర్క్‌షాప్‌నకు జూబ్లీహాల్ ఇవ్వాలని ఆదేశించండి: మీడియా వర్క్‌షాప్ నిర్వహణకు జూబ్లీహాల్‌ను కేటాయించేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎన్.చక్రవర్తి హైకోర్టును కోరారు. ఈ నెల 22, 23 తేదీల్లో జూబ్లీహాల్లో మీడియా వర్క్‌షాప్, ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలని నిర్ణయించి, ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, అయితే అధికారులు అనుమతి నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నవంబర్ 5, 6 తేదీల్లో మీడియా వర్క్‌షాప్, ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నామని అందుకు జూబ్లీహాల్‌ను కేటాయించేలా సర్కారును ఆదేశించాలని కోర్టును కోరారు.
 'విశాలాంధ్ర' పిటిషన్‌పై విచారణ వాయిదా : హైదరాబాద్, నవంబర్ 2 : విశాలాంధ్ర మహాసభ 5, 6 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రెండు రోజుల మీడియా వర్క్‌షాపు సందిగ్ధంలో పడింది. ఈ వర్క్‌షాపు నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో,నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని విచారించిన హైకోర్టు, ప్రభుత్వ వివరణ కోరింది. బక్రీదు పండుగ ఉందని, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని బందోబస్తు కోసం పోలీసు బలగాలను భారీగా కేంద్రీకరించాల్సి వస్తోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విశాలాంధ్ర మహాసభ తరఫున దాఖలైన పిటిషన్ విచారణ నవంబర్ 8కి వాయిదా పడింది.
 

2, నవంబర్ 2011, బుధవారం

విద్రోహానికి నాంది పలికిన బూర్గుల?

ఢిల్లీ ముఖ్యమంత్రుల సదస్సు ( 22,23 అక్టోబర్,1955)లో విశాలాంధ్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు.
Andhra Patrika, Oct 24,1955



AndhraPrabha Oct 24,1955 


తేదీ/సంతకం లేని ఉత్తరాన్ని ప్రచారం చేస్తున్న కేచరా మానస పుత్రిక, తాను ద్వేషించే రెండున్నర జిల్లాల తెలుగుబాషలోనే వెలువడుతున్న నమస్తే తెలంగాణ విషపత్రిక ఈ నిజాలను చూసి ఏమంటుందో!  


1, నవంబర్ 2011, మంగళవారం

రాష్ట్రావతరణ దినోత్సవాన విశాలాంధ్ర మహాసభచే స్వాతంత్య్రసమరయోధులకు సన్మానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవంనాడు  'విశాలాంధ్ర మహాసభ' ఆధ్వర్యంలో తెలుగు తల్లి పాదాలచెంత జరిగిన  కార్యక్రమం విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు స్వాతంత్య్రసమరయోధులను సన్మానించారు.సచివాలయం చెంతనున్న 'మన తెలుగు తల్లి' విగ్రహానికి పూలమాలలు అర్పించిన సమరయోధులు, రాష్ట్రంలో కొనసాగుతున్న వేర్పాటువాద ధోరణులను ఖండించి తెలుగువారందరూ ఐక్యంగా ఉండాలని అభిలాషించారు. 

వయస్సు పై బడి ఆరోగ్యం సహకరించకపోయినా మా కోరికను మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన దేశభక్తులకు పేరు పేరునా మా వందనాలు.సన్మానింపబడిన వారు -
శ్రీ నర్రా మాధవరావు
శ్రీమతి సుగుణమ్మ 
శ్రీ కే.ఎస్.మెహబూబ్ 
శ్రీ అల్లాడి నాగన్న 
శ్రీ పి. రామస్వామి  
-విశాలాంధ్ర మహాసభ 



సూర్య దినపత్రిక: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు సర్వ శక్తులూ ఒడ్డుతామని, అన్ని శక్తులను సమీకరిస్తామని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరగాలని ఆందోళనలు చేస్తున్న వారు అసత్య ప్రచా రాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రావతరణ సందర్భంగా మంగళవారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసేందుకు మరికొందరు విశాలాంధ్ర నేతలతో కలసి వచ్చిన పరకాలను కొందరు తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు తెలంగాణ వాదులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించటంతో స్వల్ప ఉద్రిక్త వాతా వరణం ఏర్పడింది. తెలంగాణ వాదులు వెళ్ళిపోయిన అనంతరం విశాలాంధ్ర మహాసభ నేతలు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత కొందరు స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?
తెలంగాణ వాదులు తమపట్ల వ్యవహరించిన తీరుపై ఆ తర్వాత పరకాల అసంతృప్తి వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించటం దారుణం అన్నారు. తెలంగాణ వాదులు తమ వాదాన్ని వినిపిస్తు న్నట్టే తాము సమైక్య వాదాన్ని వినిపిస్తున్నామన్నారు. రాష్ట్ర విభనపై తెలంగాణ వాదులు చెబుతున్న మాట లు, చూపిస్తున్న ఆధారాలలో వాస్తవం లేదని, సమైక్యం గా ఉంచాలన్న వాదనతో కూడిన ఆధారాలు తమ వద్ద సైతం ఉన్నాయని పరకాల స్పష్టం చేశారు.


My Telugu Roots : Visalandhra Mahasabha, on November 1st 2011, felicitated freedom fighters at the Telugu Thalli statue near Secretariat. Freedom fighters have put garlands at Telugu Thalli’s feet. They were later felicitated by the representatives of Visalandhra Mahasabha. Five freedom fighters have participated in the event. All of them are from the Nizam Telangana region. They have unequivocally and vociferously spoke against the division of our state. Andhra Pradesh Freedom Fighter’s Association President Sri Narra Madhav Rao was felicitated by former DGP Sri Anjaneya Reddy, Smt. Sugunamma by Dr. Parakala Prabhakar, Sri K.S. Mehabub by Sri Chegonti Ramajogaiah, Sri Alladi Naganna by Sri Sunkara Venkateswara Rao, and Sri P. Ramaswamy by Sri Kumar Chowdhary Yadav.
Speaking at the event, Sri Narra Madhav Rao garu recollected his memories from his time fighting the Razakars. He said he and his fellow fighters have made enormous sacrifices during their lifetime. He said that he is saddened and outraged with the way politicians are ruining Telugu unity that has been won over after a long-fought battle. He ridiculed the separatist politicians as little kids who were not even born when they were fighting for Telugu unity. He said that the politicians know nothing about what Telugu people had endured prior to 1956.
Smt. Sugunamma said she is a proud native of udhyamala gadda Nalgonda. She recollected her battles with Razakars and how she was a gun-toting fighter in those days. Though she had a bit of difficulty in walking, her energy kept her going. Her energy was a source of inspiration to people around her. She urged the media to take her message of Telugu unity to the people of our State.
Sri K.S. Mehbub spoke eloquently about Visalandhralo Prajarajyam. He said politicians are running amok with our state. He said there are many daunting social issues that need to be tackled including corruption, caste discrimination, and income inequality, unfortunately our leaders have taken up the ill-conceived separatist movement. He expressed anguish at the way hatred being spread among people of different regions.
Freedom fighters, despite their old age, gave loud slogans non-stop for nearly five minutes- “Varthillali Varthillai, Visalandhra Varthillali”, “Jai Samaikyandhra, Jai Jai Samaikyandhra”. It was an unforgettable moment.
We are grateful to our venerable freedom fighters for their uncompromising belief in Telugu unity. They are our inspiration and Visalandhra Mahasabha will continue to fight to ensure that their sacrifices don’t go in vain.
Save Andhra Pradesh!
Nalamotu Chakravarthy


ఆ పాత జ్ఞాపకాలు - శ్రీ కొండాలక్ష్మణ్ గారి సమైక్యతా సందేశం

ఆంధ్ర జనత , జనవరి 23,1969



 'ఆంధ్రజనత' 20వ రిపబ్లిక్ దినోత్సవ సంచిక నుండి 

కలిపి వేయుము తెలుగు తల్లి మూడు కోట్లనొకేముడి బిగించి   
వందల సంవత్సరాలు తెలుగువారు కన్న బంగారు కలలకు రూపంగా, పెద్దల త్యాగాల ఫలంగా ఏకమైన తెలుగు జాతి 'నొకే ముడిన' ఉండిపోవాలని, ఎక్కడ ఉన్నా 'తెలుగువాడి' అభివృద్దే  ఆంధ్రప్రదేశ్ ప్రజల లక్ష్యం కావాలని రాష్ట్ర మంత్రులు 20వ  రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశాలలో అభిభాషించారు

ఆంధ్ర జనత, జనవరి 26, 1969