28, డిసెంబర్ 2013, శనివారం

రాష్ట్ర విభజన ప్రక్రియ – సమాఖ్య స్ఫూర్తి


విశాలాంధ్ర మహాసభ డిసెంబర్ 28 2013న “రాష్ట్ర విభజన ప్రక్రియ – సమాఖ్య స్ఫూర్తి” అన్న అంశంపై సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు కి సమతా పార్టీ జాతీయ అధ్యక్షులు వి వి కృష్ణా రావు అధ్యక్షత వహించారు.ఈ సదస్సులో పాల్గొన్నవారు: డా. జయప్రకాష్ నారాయణ్ (లోక్ సత్తా), జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, సి. ఆంజనేయ రెడ్డి (మాజీ డిజిపీ), సతీష్ గల్లా (సుప్రీం కోర్టు న్యాయవాది), ఏ.బి.కే. ప్రసాద్ (పాత్రికేయులు), చందా లింగయ్య దొర (గిరిజన నాయకులు), ఎన్. తులసి రెడ్డి (కాంగ్రెస్), డా. ఎమ్.వి. మైసూరా రెడ్డి (వైకాపా), సయద్ జాఫ్రి (ఎంఐఎం), ఆచార్య ఏ. మురళి, కే. రవీంద్ర (న్యాయవాది), కే. నారాయణ రావు (తేదేప), ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (తేదేప).





సదస్సులో పాల్గొన్న వక్తలు, మేధావులు అందరూ, దిగువ ఉన్న అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసారు.
  • భారతదేశ చరిత్రలో కొత్త రాష్ట్రాల ఆవిర్భావం మాతృ రాష్ట్రాల అంగీకారం లేకుండా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్న విభజన ప్రక్రియ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుంది (డా. జే.పీ. నారాయణ)
  • రాష్ట్ర అసెంబ్లీ విభజనను వ్యతిరేకిస్తే, రాష్ట్రపతి విభజనను ఆపవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది (డా. జే.పీ. నారాయణ)
  • రాజ్యాంగ సభలో మాట్లాడుతూ డా. అంబేద్కర్ స్పష్టంగా రాష్ట్రాల పునర్విభజన విషయంలో ఆర్టికల్ 3ని కేంద్ర ప్రభుత్వం అనివార్య, అత్యవసర పరిస్తితులలో మాత్రమే వినియోగించాలని చెప్పారు. ఆ స్పూర్తికి విరుద్ధంగా నేడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
  • భారత దేశంలో మూడు దశల ప్రభుత్వ యంత్రాగం ఉన్నది: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతి రాజ్. సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా పంచాయతి రాజ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చెయ్యటం మూలంగా ఈ రోజు విభజనోద్యమం తెర మీదకి వచ్చింది (సి. ఆంజనేయ రెడ్డి)
  • గతంలో జరిగిన రాష్ట్ర విభజనలలో పాటించబడిన విధానాలను, సాంప్రదాయాలను విస్మరిస్తోంది.
  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకం కావున దీనిని సవరించటం దేశ సమగ్రతకు అవసరం. మాతృ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కాకుండా ఆమోదం అవసరమయ్యే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలి. (ఏ. బి. కే. ప్రసాద్)
  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాసన సభ్యులను సామ, దాన, దండోపాయాల ద్వారా బిల్లుకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది (డా. మైసూరా రెడ్డి)
  • రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుపై వోటింగ్ జరగాలి (డా. మైసూరా రెడ్డి)
  • రాష్ట్ర శాసనసభలోగాని, పార్లమెంట్ లో గాని కనీసం మూడింట రెండొంతుల ఆధిక్యత తోనే రాష్ట్రాల పునర్విభజనలు జరిగే విధంగా రాజ్యాంగ సవరణ చెయ్యాలి. (జస్టిస్ లక్ష్మన్ రెడ్డి)
  • ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ దాదాపు లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు. అయితే విభజన జరిగితే 60% బడ్జెట్ కోస్త-రాయలసీమకు ఉండే అవకాశం లేదు. (సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి)
  • కేంద్ర ప్రభుత్వం రాజకీయావసరాలకోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగిస్తోంది (జస్టిస్ లక్ష్మన్ రెడ్డి)
  • ముసాయిదా బిల్లులో ఆబ్జెక్ట్ స్ అండ్ రీసన్స్ లేకపోవటం చాలా తప్పు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మొదలవ్వాలి. ఈ సంప్రదాయాన్ని విస్మరించటం దేశ సమగ్రతకు నష్టదాయకం (జస్టిస్ లక్ష్మన్ రెడ్డి)
  • ఈ రోజు ముసాయిదా బిల్లుని అసెంబ్లీలో ఓడిస్తే, రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయినట్లే. అసెంబ్లీ వ్యతిరేకించే బిల్లుని రాష్ట్రపతి పార్లమెంట్ కు పంపించే అవకాశం లేదు (తులసి రెడ్డి)
  • ఎం.ఐ.ఎం. ముసాయిదా బిల్లుని అసెంబ్లీలో, పార్లమెంట్ లో వ్యతిరేకిస్తుంది. (సయద్ జాఫ్రి)
  • ఉమ్మడి రాజధాని, గవర్నర్ కి ఇచ్చిన ప్రత్యెక శక్తులు, 371-D ని ముసాయిదా బిల్లు సవరించే పధ్ధతి రాజ్యాంగ విరుద్ధం. ఈ మొత్తం బిల్లుని తిరిగి రాయాల్సిన అవసరం ఉంది (సయద్ జాఫ్రి)
  • హైదరాబాద్ నగర శాంతి భద్రత అధికారాలు గవర్నర్ కి ఏ రాజ్యాంగ అధికరణ ద్వారా లభించాయి?
  • కేంద్ర ప్రభుత్వం చట్టాల ద్వారా ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి విద్యుత్ కొనుగోలు చెయ్యాలని నిర్బందిచంగలదా?
  • పది కోట్ల గిరిజనులు ఉన్నారు భారత దేశంలో. గిరిజనులకు వారి స్వంత భాష ఉంది. కాబట్టి వారికి మన్నే సీమ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది (చందా లింగయ్య దొర)
  • కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లు తీసుకువచ్చే ముందు 18,000 వేల ఈమెయిలు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు? (కే. రవీంద్ర)
  • ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య వచ్చే నదీ జలాల వివాదాలను అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచాలని బిల్లులో ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. నదీ జలాల వివాదం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ ద్వారానే పరిష్కరించ వచ్చు (కే. రవీంద్ర)
ఈ సదస్సులో విశాలాంధ్ర మహాసభ నాయకులు కే. శ్రీనివాస్ రెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, కే. జగదీష్, పదిరి రవితేజ, భాగ్యలక్ష్మి, కరుణాకర్, పాల్గొన్నారు.