31, జులై 2011, ఆదివారం

ఆహా! అలాగా?

ఈ ఫోటోలోని శాల్తీలు చూసారూ


వీళ్ళని పాపం ఎవరో ఉన్మాది బెదిరించాడట . ఆ మొహాలను,పెర్సనాలిటీలను , చేతుల కదలికలను చూస్తే వారి దీనస్థితి అర్థంకావడం లేదూ?ఎంతగా బెదిరిపోయారో పాపం వాళ్ళు ఇలా దీనంగా కెమెరాల వంక చూస్తూ హాథ్‌వే’ ప్రసారాలు బంద్ చేస్తామని సౌమ్యంగా మర్యాదగా చెప్పారట!
అవ్వతోడు 'నమస్తే తెలంగాణా' చెప్పింది నేటి నుంచి ‘హాథ్‌వే’ ప్రసారాలు బంద్ అని
 "వద్దని చెప్పినా టీవీ-9 చానల్‌ను ప్రసారం చేస్తున్నందుకు గాను ‘హాథ్‌వే’ కేబుల్ టీవీ ప్రసారాలను హైదరాబాద్ సహా తెలంగాణ అన్ని జిల్లాల్లో ఆదివారం నుంచి నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ చైర్మన్ సతీష్ ముదిరాజ్ ప్రకటించారు. హాథ్‌వే మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ ప్రజల మనోభావాలను అగౌరవిస్తూ, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందునే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. హాథ్‌వే ఎం.డి. బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారని, ఆ బెదిరింపు చర్యలకు భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరని తేల్చిచెప్పారు.వైఖరి మార్చుకొని తెలంగాణ ఉద్యమానికి సహకరించాలని, లేకుంటే తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని జేఏసీ కార్యాలయంలో శనివారం సతీష్ ముదిరాజ్ తన సహచర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తున్నందుకు గాను వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో టీవీ-9 చానల్‌ను నిలివేయాలని తాము పిలుపునిచ్చామని, అయితే హాథ్‌వే మాత్రం ఈ పిలుపునకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హాథ్‌వే యాజమాన్యానికి తాము చెప్పినా ఫలితం కనిపించలేదన్నారు. పద్ధతి మార్చుకోకుండా హాథ్‌వే ఎం.డి. తమను బెదిరించేందుకు, రౌడీలతో దాడులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని సతీష్ ముదిరాజ్ ఆరోపించారు.తెలంగాణ ప్రజలతో వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్న హాథ్‌వే ఎం.డి. తెలంగాణ ప్రజల మనోభావాలను మాత్రం గౌరవించడం లేదని ఆయన మండిపడ్డారు. అందుకే హైదరాబాద్ సహా తెలంగాణ అన్ని జిల్లాల్లో హాథ్‌వే కేబుల్ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వమని, అందరూ సహకరించాలని కోరారు."
పనిలోపని T న్యూస్ తప్ప అన్ని మీడియా చానళ్ళ ప్రసారాలు ఆపేస్తే పోలే. ముల్లా ఒమర్ జమానాలోని ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం మీడియా చానల్స్  ఉండేవా?వారి నుండి వేర్పాటువాదులు నేర్చుకున్నది ఇంతేనా? ఒక నెల పాటు మీడియా మొత్తాన్ని బాయ్ కాట్ చేసి పడేస్తే ఉద్యమం తారాస్థాయికి చేరుకొని జాక్ (JAC) లన్ని బోర్డులు తిప్పేసుకొని, బానర్లు చిన్చేసుకొని పనికిమాలిన సభ్యులంతా ఎప్పటిలాగానే డబ్బింగ్ అరవ సీరియల్స్ చూస్తూ సేదదీరుతారు

30, జులై 2011, శనివారం

సమ్మెలో పాల్గొంటే జీతాలు లేనట్లే!

సూర్య దినపత్రిక: ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మె బాట పట్టి... విధులకు ఎగనామం పెడితే ఇక జీతాలు లేనట్లేనన్న సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల తెలంగాణా ఉద్య మంలో పాల్గొని విధులకు గైర్హాజరవుతూ వచ్చిన ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యంలో ఇక సమ్మె కాలానికి జీతాలు వస్తాయా...రావా అన్న చర్చ జోరందుకున్నది. సమ్మెలో పాల్గొని విధు లకు హాజరుకాని ఉద్యోగులకు జీత భత్యాలు ఎంత చెల్లించారు, ఏ విధంగా చెల్లించారు, అందుకు అనుసరించిన మార్గదర్శకాలు ఏమిటి అన్న వివరాలను సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని తాజాగా ఆదేశించింది.

జీవో 177ను అమలు చేయకుండా ఎందుకు నిలిపివేశారన్న విషయాన్ని కూడా ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ కక్రూ, జస్టిస్‌ విలాస్‌, వి.అఫ్జల్‌ కుర్‌కర్‌లతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ విచారణను జరిపింది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్‌డౌన్‌, చాక్‌డౌన్‌, టూల్‌డౌన్‌ వంటి కార్యక్రమాలతో సమ్మెలు చేస్తే వారి జీతభత్యాల చెల్లింపులో కోత విధించే విధంగా నో వర్క్‌ -నో పే విధానాన్ని అమలు చేసేందుకు గత ఏప్రిల్‌ 13న ప్రభుత్వం 177 జీవోను తెరపైకి తీసుకువచ్చింది.

సమ్మె పేరుతో విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగుల ప్రవర్తనను నియంత్రించే అధికారం ఉన్న ఈ జీవోను ఎందుకు ఉపసంహరించారో తెలపాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి హైకోర్టు వేసిన కొన్ని ప్రశ్నలతో తలబొప్పి కట్టినట్లయిందంటున్నారు. పూర్తి వివరాలతో రికార్డులు సమర్పించాలని ఆదేశించడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతోంది. ఇకపై సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సర్కారు వర్గాలు పేర్కొంటున్నాయి

భౌతిక దాడులకు తెగబడతామని వేర్పాటువాదుల హెచ్చరిక!

ఆంధ్రజ్యోతి : తెలంగాణ విద్యార్థి జేఏసీ సమర శంఖం పూరించింది. సమ్మె సమయంలో విధులకు హాజరయ్యే సీమాంధ్ర ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించింది. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కాకుంటే.. రాళ్ల దాడులు తప్పవని పేర్కొంది. సకల జనుల సమ్మెను చివరి పోరాటంగా విద్యార్థి జేఏసీ అభివర్ణించింది. దీంతోనే తెలంగాణ సాధించుకోవాలని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది. సకల జనుల సమ్మెను కేంద్రం.. విద్యార్థి నేతలు తాజా కార్యాచరణను ప్రకటించారు.

శుక్రవారం ఇక్కడ బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌లో తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్ కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె సందర్భంగా ఆంధ్రా ఉద్యోగులు ఎవరైనా విధులకు హాజరైతే.. వారిపై తాము భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నప్పుడు, ఆంధ్రా ఉద్యోగులతో పాలన సాగించాలని ప్రభుత్వం చూస్తే.. హైదరాబాద్‌లోని 250 శాఖాధిపతుల కార్యాలయాల పైనా దాడులకు దిగుతామని చెప్పారు. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఆగస్టులో జరిగే సకల జనుల సమ్మెకు విద్యార్థులు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తారన్నారు. ఆగస్టు 5 నుంచి 11 వరకు 'గో టూ కాలేజ్' కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆయా తేదీల్లో జిల్లా, తాలూకా కేంద్రాల్లో ప్రచార సదస్సులు నిర్వహిస్తామన్నారు.

అలాగే 12న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో సైకిల్ ర్యాలీలు, హైదరాబాద్‌లో బైక్ ర్యాలీలు చేపడతామని తెలిపారు. 13న జరిగే.. ఎస్సై రాత పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని, 14న జరిగే డిగ్రీ కళాశాలల లెక్చరర్ల నియామక పరీక్షను అడ్డుకుంటామని చెప్పారు. 16న కలెక్టరేట్ల ముట్టడిని భారీ ఎత్తున చేపడతామని చెప్పారు. ఉద్యోగుల సమ్మె ప్రారంభమయ్యే 17న తరగతుల బహిష్కరణ ఉంటుందన్నారు. అక్కడి నుంచి ఉద్యమంలో విద్యార్థులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారని తెలిపారు

విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ, సకల జనుల సమ్మెలో పాల్గొనే ఉద్యోగులకు తాము ఉక్కు కవచంగా ఉంటామన్నారు. ఈ క్రమంలో అవసరమైతే భౌతిక దాడులకూ తాము దిగుతామన్నారు. ఈసారి జాతీయ రహదారులు, రైలు మార్గాల దిగ్బంధం కూడా ఉంటాయని చెప్పారు. గుజ్జర్ల తరహా పోరాటం చేస్తామన్నారు. ఈ క్రమంలో జైళ్లకు వెళ్లటానికి, నిర్బంధాన్ని ఎదుర్కోవటానికీ సిద్ధమేనని చెప్పారు.

విద్యార్థి జేఏసీ కన్వీనర్ గ్యాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ, తాము చెప్పి చేసేవి కొన్ని అయితే.. చెప్పకుండా చేసేవి చాలా ఉంటాయన్నారు. సకల జనుల సమ్మె కాలంలో.. తెరిచి ఉన్న అధికారుల కార్యాలయాలకు తాళాలు వేస్తామని చెప్పారు. సీమాంధ్రకు చెందిన సచివాలయ ఉద్యోగులు వనస్థలిపురం నుంచి 20 బస్సుల్లో వస్తారని, వారు విధులకు హాజరుకాకుండా అడ్డుకుంటామన్నారు. వారిపై దాడులకు దిగుతామని.. బస్సులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కాకుంటే, వారిపై రాళ్లతో దాడి చేసి.. తన్ని తరిమేస్తామని చెప్పారు. ఉద్యోగుల సమ్మె ప్రారంభమయ్యే ఆగస్టు 17 నుంచి నిరవధిక బంద్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రతినిధులు చర్చలను పక్కన పెట్టి, ఉద్యమంలోకి రావాలని కోరారు. పదవులకు ఆశపడవద్దని, ఢిల్లీని వదిలి.. గల్లీలకు రావాలని వారికి హితవు పలికారు. విద్యార్థి జేఏసీ అధికార ప్రతినిధులు పున్నా కైలాస్ నేత, బాలరాజు విలేకరులతో మాట్లాడారు. ఓయూ, కేయూ జేఏసీ నేతలు మర్రి అనిల్‌కుమార్, వాసుదేవరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు


29, జులై 2011, శుక్రవారం

తెలుగునేలంతా తెలంగాణమే!

మూడువేల సంవత్సరాల లిపి, నాణేల, శాసనాల, చారిత్రక, సాహిత్య, సారస్వతాది ఆధారాలుగల తెలు గుజాతి మూలాలను గుర్తించలేని మూఢమతులకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ కొదవలేదు. రాజ కీయ ముసుగుల్లో ఉన్న పదవీ కాంక్షాపరులు రాష్ట్ర ప్రజాబాహుళ్యం ఆవేదనను అర్థం చేసుకోలేని దుస్థి తిలో ఉన్నందున, ప్రజలే వీళ్లను కనిపెట్టి ‘ముగు దాళ్లు’ కట్టి దారికి తెచ్చుకోవలసిన సమయం ఆసన్న మైంది. మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు. ‘‘అన్ని ప్రాంతాల ప్రజల కోరికలూ అర్థవంతమైనవే.

కాని కొందరు వినాయకుల ప్రకటనలూ, వ్యాఖ్యానాలే అర్థవంతమైనవి కావు’’ అని! ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు వేరు, నాయకుల అసలు ఆశలు వేరు! నాయకుల ‘ఆశలు’ ప్రజల ఆకాంక్షలకు ఎల్లవేళలా, అన్ని కాలాల్లోనూ ప్రతిబింబాలు కావు, కాజాలవు. పదవీ కాంక్షాపరులకు, ‘మాకు పనులు కావాల’ని ఘోషిస్తున్న ప్రజలకూ మధ్య పూడ్చలేనంతగా గండి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు అందరి బుద్ధులూ పెడమార్గాలు తొక్కుతాయి! ఇలాంటి పెడ మార్గాల్లో ఒకటి- 1956లో అవతరించిన సమైక్య రాష్ట్రానికి ‘ఆంధ్రప్రదేశ్’ అన్న దుష్ట సమాసంతో ఉన్న పేరును తెలుగువారు ఎంపిక చేసుకోవలసి రావటం! కర్ణాటక, తమిళ నాడు, కేరళ, మహారాష్ట్రలకు లేని ఇబ్బందిని తెలుగు రాజకీయ నాయకులు కొరివితో తలగోక్కున్నట్టుగా ఇలా ఎందుకు కొనితెచ్చుకున్నట్టు? మన రాష్ట్రానికి ‘తెలుగునాడు’ అనో, ‘తెలంగాణం’ అనో పేరును నికరం చేసు కుని ముందుకు సాగాల్సిందిపోయి ‘ఆంధ్రప్రదేశ్’ అనే ఒక వైరి సమాసాన్ని ఎం దుకు ఆశ్రయించారు? కేంద్ర ప్రభుత్వాన్ని అధిష్టించిన వారిలో హెచ్చు మంది హిందీ రాష్ట్రాల వారు కాబట్టి, వారికి అనువైన ‘ప్రదేశ్’ అనే ఒక తోక పదాన్ని రాష్ర్ట నామానికి తోడు చేసుకున్నారు. 

ఎందుకంటే, హిందీ ప్రాంతాల వారికి ‘రాష్ట్రం’ అంటే భారతదేశమనేగాని ‘ప్రదేశ్’ అనే ప్రాంతం కాదు! కాగా, మనకు లేదా దక్షిణాది వారికి ‘రాష్ట్రం’ అంటే తమ భౌగోళిక పరిధుల్లో ఉంటున్న ప్రాం తం మాత్రమే. అందుకనే ఉత్తరాది హిందీ ప్రాంతాల వారు తమ నివాస ప్రదేశాలకు ‘ప్రదేశ్’ పదాన్ని తగిలించుకున్నారు. దాని ఫలితమే హిందీ రాష్ట్రా లను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌గా పిలుచు కోవటం! వాళ్ల ఉద్దేశంలో ‘రాష్ట్ర భాష’ అంటే దేశభాష, కానీ అదే మన దక్షిణాది రాష్ట్రాలలో ‘రాష్ట్ర భాష’ అంటే ప్రాంతీయ మాతృభాష. భాష వాడకంలో ఉన్న ఈ వ్యత్యాసం జాతీయస్థాయిలో ఉన్న తెలుగు (ఆంధ్ర) నాయకులకు తెలియక పోదు. కాని జాతీయ సమైక్యతా దృక్కోణం నుంచి హిందీ రాష్ట్రాల ‘ప్రదేశ్’ పదం వాడకాన్ని ఆంధ్రకు చేర్చి ‘ఆంధ్రప్రదేశ్’గా దుష్ట సమాసంతో నామ కరణం చేయడానికి వారు ఆనాడు ఆమోదం తెలిపి ఉంటారు.

అలాగే బహుశా ‘ఆంధ్ర’లోని తొలి అక్షరంగా ‘ఆ’ ఉన్నందున, అకారాదిక్రమంలో ‘ఆంధ్ర ప్రదేశ్’ తొలి వరుసలో నిలుస్తుందన్న భావనతో కూడా రాష్ట్రానికి ఆ పేరును ఖాయపరచీ ఉండవచ్చు. నిజానికి మన పిచ్చిగాని అకారాదిక్రమంలో ఒక రాష్ట్రం పేరు ముందున్నంత మాత్రాన అభివృద్ధిక్రమంలో, మానవ వికాసంలో ఆ రాష్ట్రం ప్రథమస్థాయిలో ఉంటుందని ఎక్కడా రాసిపెట్టి ఉండదు! ఆ మాట కొస్తే, ‘వడ్డించే వాడు మన వాడైతే కడపంక్తిని కూర్చున్నా అన్నీ సమకూర తాయ’న్నట్టుగా అకారాదిక్రమంలో ఆఖరి స్థానంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రాల ఉనికీ, ఉసురూ, సగటు బతుకూ చెడిపోదు గదా! ఈ వాస్తవిక దృష్టితో ఆలోచ నలు సాగనందునే రాష్ట్రానికి నామకరణంలో రాజకీయ నాయకులు దూర దృష్టికి దూరమై హిందీ రాష్ట్రాల పేర్ల బాటపట్టారు. అంతేగాదు, పరాయి పాల కుల కింద (నైజాం, బ్రిటిష్) శతాబ్దాలపాటు అణగారిపోయి పుట్టకొకరు చెట్టు కొకరుగా చెల్లాచెదురైపోయిన తెలుగు ప్రజలు తిరిగి ఒక్క గొడుగు కింద విశా లాంధ్ర ఉద్యమం ద్వారా ఐక్యం కావలసివచ్చింది. ఈ ఐక్యత అంత తేలిగ్గా రాలేదు.

ఇటు నిజాం నిరంకుశ పాలనకు, అటు కోస్తాంధ్రలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి నడిచిన ప్రజా పోరాటాలు కాలక్రమంలో పరాయి పాలనల నుంచి జనాలను రాజకీయంగా విముక్తి చేయగలిగాయి. ఈ పోరాటాల వెనక ప్రజల మహోన్నత త్యాగాలున్నాయి. మరీ ముఖ్యంగా ఉభయ ప్రాంతాలలోని రైతాంగ - వ్యవసాయ కార్మికోద్యమాలు సమరశీలంగా ముందుకు సాగాయి. ఈ పూర్వ రంగంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఆరేళ్లపాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగి చరిత్ర సృష్టించింది. ఈ సాయుధ పోరాటంలో మూడు తెలుగు ప్రాంతాలకు చెందిన బిడ్డలూ పాల్గొన్నారు. మొత్తం నాలుగు వేల మంది నేలకొరిగారు. అది దొరల, దేశ్‌ముఖ్‌ల, పటేల్, పట్వారీల దోపిడీ విధానానికి వ్యతిరేకంగా, వారి అండతో రాజ్యమేలుతూ వచ్చిన నిజాం నిరంకుశపాలనపై సాగిన భీకర సమరం. అందు వల్ల ‘ఆంధ్రప్రదేశ్’ అనే దుష్ట సమాస భూయిష్టమైన పేరుకు బదులు యావత్తు తెలుగుదేశానికీ (మూడు ప్రాంతాలు ముప్పేటగా) ‘తెలంగాణం’’ (లేదా ‘తెలంగాణ’) అనే పేరును స్థిరపరుస్తూ రాజ్యాంగ సవరణకు ఉద్యమించడం తెలుగుజాతి సమైక్యతకు అత్యవసరం.

‘తెలంగాణ’ శబ్దోత్పత్తి

మన తెలుగు పాలకులకన్నా మొగలాయి పాలకులే ఎక్కువ తెలివి గలవాళ్లని పిస్తుంది. ఎందుకంటే, విజయనగర సామ్రాజ్యం పతనమయిన తరువాత 15-16 శతాబ్దాల కాలంలో అటు తెలుగుల (ఆంధ్ర) కోస్తా ప్రాంతం నుంచి ఇటు దక్కన్ భూభాగం వరకూ, నేడు తెలంగాణ వరకూ మొగలాయిల (ముస్లిముల) పాలనలోనే ఉంది. ఆ కాలంలో ఏ తెలుగు పండితుడు, లేదా ఏ తెలుగు విజ్ఞాని సూచించాడో గాని తెలుగు వారున్న ప్రాంతాలకు ‘తెలంగాణం’ అన్న పేరును ముస్లిం పాలకులు సహృదయంతో స్వీకరించి, ఆ నాటి భారతదేశ పటంలోకి ఆ పదాన్ని ఎక్కించారు. ఈ చారిత్రక నేపథ్యంలో అటు కోస్తా నుంచి ఈ కొసదాకా ఉన్న యావదాంధ్ర దేశమూ తెలంగాణమే అవుతుం దని మరచిపోరాదు. తెలుగు వారికి ఆణెము ‘తెలంగాణము’. ఆణియము / ఆణెము అంటే ‘దేశము’, ‘ఆణియ’ రూపాంతరం ‘ఆణెము’. ‘ఆణము’ అంటే దేశమనేగాక, చోటు, నివాసం, స్థిరనివాసం అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే తెలుగు వారుండే యావదాంధ్ర దేశమూ లేదా తెలుగు దేశమే తెలంగాణమని అక్షరసత్యంగా నిరూపణ.

ఈ పదానికి ఇప్పటికి 90 సంవత్స రాల క్రితమే అంటే కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలన్నీ పరాయి పాలనలో మగ్గుతున్న రోజులలోనే 1921లోనే, అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు మద్రాసు నుంచి తెలుగుదేశ ‘వాఙ్మయ’ పత్రికను నడుపుతూండేవాడు. ఆ సమయంలో ఆయన అప్పట్లో ఉనికిలో ఉన్న ‘తెలుగుదేశపు వాఙ్మయ సమితి’ని ‘తెలంగాణ లిటరేచర్ అసోసియేషన్’ అని ఇంగ్లిష్‌లో సమానార్థకంగా ప్రతిపా దించడం చూస్తే ‘మొత్తం తెలుగునాడునే ఆయన తెలంగాణగా భావించడం స్పష్టమవుతుంద’ని పండిత - పాత్రికేయ తరానికి చెందిన తిరుమల రామ చంద్ర ఏనాడో పేర్కొన్నారు! తెలుగుజాతిని రెండుగా చీల్చే ప్రయత్నంలో ఉన్న ప్రబుద్ధులు (మూడు ప్రాంతాలలోని మూఢమతులు) ‘తెలంగాణ’ పదానికున్న విస్తృతార్థాన్ని విశాలమైన దృక్పథంతో గుర్తించి, రాష్ట్రాల పేర్లను మార్చుకోడా నికి భారత రాజ్యాంగం 3వ అధికరణం ద్వారా (3(ఇ)క్లాజు) కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకుని యావత్తు తెలుగుదేశాన్ని ‘ఆంధ్రప్రదేశ్’ స్థానే ‘తెలంగాణ’ రాష్ట్రంగా ప్రకటింపచేయడం సముచితంగా ఉంటుంది.

3వ అధికరణంలోని మొదటి నాలుగు క్లాజుల (ఎ/బి/సి/డి) వల్ల రాష్ట్రాల పునర్వి భజన ద్వారా వివిధ భాగాలతో కొత్త రాష్ట్రాలను ఏర్పరచడంలో గతంలో ఎదు రైన సమస్యలలో రాష్ట్రం పేరు నిర్ణయం కూడా ఒకటి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ ‘విశాలాంధ్ర’ నినాదానికి తెలంగాణలోని సాంస్కృతికోద్యమ పితామహులయిన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి లాంటి ఉద్దండులతో కలిసి నిర్మించిన ‘ఆంధ్ర మహాసభ’లే స్ఫూర్తినిచ్చాయి. అయితే నాటి కాంగ్రెస్ ‘పెద్దల’కు వచ్చిన పెద్ద చిక్కల్లా కమ్యూనిస్టులు ‘విశాలాంధ్ర’ పదాన్ని నినాదంగా మార్చి విశాలాంధ్రోద్యమాన్ని అఖండంగా నిర్మించడమే! ‘విశాలాంధ్ర’ పదం కమ్యూ నిస్టుల హక్కు భుక్తమని భావించిన ‘పెద్ద మనుషులు’ కమ్యూనిస్టు వ్యతిరేక తతో రాష్ట్రాన్ని అటు ‘విశాలాంధ్ర’గానో, ‘తెలుగునాడు’గానో, ‘తెలంగాణ’ గానో నామకరణం చేయకుండా ‘ఆంధ్రప్రదేశ్’ అనే మనది కాని మాటను తగిలించేశారు.

తెలుగువారు నివసించే అన్ని ప్రాంతాలతో కలిసి దీపించేదే తెలంగాణ అయినప్పుడు యావదాంధ్రులకు అది శిరోధార్యం కావాలి. ఈ విషయంలో ముక్కు చిట్లింపులకు, మూతి తిప్పుళ్లకూ, ముఖాలు మాడ్చుకోడానికి ఎవరికీ ఎలాంటి అవకాశం ఉండదు! పైగా మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతంలోని వారికీ ఇది వ్యతిరేకమూ కాదు.

మొత్తం ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని ‘తెలంగాణ’గా ప్రకటించాలని కోరుతూ నిజంగా తాము ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామ నుకునే లెజిస్లేటర్లు (అన్ని పార్టీల వారూ) అందరూ ఏకవాక్య తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు. ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానించవచ్చు. లెజిస్లేటర్లు ఈ వైపుగా బుర్రలు ఉపయోగించగలిగితే తెలుగు ప్రజల విశాల ప్రయోజనాలకు, ఐక్యతకూ ఎనలేని సేవ చేసిన వారవుతారు. ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నం ద్వారా ఇంటాబయటా బజారు పాలైన తెలుగు జాతి పరువును కాపాడిన వారవుతారు. ‘చూస్తూ ఉంటే మేస్తూ పోయింద’న్న సామెతను తిరగేసి సామాన్య ప్రజల మూలుగల్ని పీల్చుతున్న వారిని మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాష్ట్రం పేరును ‘తెలంగాణ’గా మారుస్తూ రాష్ట్ర శాసనసభతో పాటు పార్లమెంటులో కూడా ఆమోదింపజేసుకోవడం తేలిక. అందుకు తగిన రాజ్యాంగ సవరణా సుగమమవుతుంది. ఈ ప్రతిపాదనకు విముఖులైన వారు చరిత్ర హీనులవుతారు!  


- ఏ బీ కే ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు 
సాక్షి దినపత్రికలో ప్రచురింపబడింది


తెర పైకి ఇంకెన్ని డిమాండ్లు రాబోతున్నాయో!


 ఆంధ్రజ్యోతి: తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతుండగా.. మరో ప్రత్యేకరాష్ట్ర డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ నుంచి విజయనగరం వరకు ఉన్న ఏజెన్సీని 'మన్యసీమ'గా ఏర్పాటు చేయాలని కోరుతూ మన్యసీమ ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధుల ఫోరం తరఫున ఆదివాసీ గిరిజన ప్రజా ప్రతినిధులు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ఆయన్ను కలిసి మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించనున్నారు. ఈ ఫోరానికి ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బాలరాజ కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రతినిధి బృందంలో వీరితో పాటు ఎమ్మెల్యేలు రాజన్నదొర, సుగ్రీవులు, మిత్రసేన, ఆత్రం సక్కు, సత్యనారాయణరెడ్డి, సోమా, మాజీ ఎమ్మెల్యేలు కుంజా భిక్షం, తాటి వెంకటేశ్వర్లు తదితరులు ఉంటారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్, ఎంపీ బలరాం నాయక్ కూడా వీరితోపాటు ఆజాద్‌ను కలవనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సీతక్క, నగేష్ కూడా వెళ్లాల్సి ఉన్నా.. చివరి క్షణంలో ఆగారు. మన్యసీమ ప్రతినిధి బృందం ఆగస్టు 1న రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలవనుంది. ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు వివరించాల్సిన అంశాలపైన ఇక్కడి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఫోరం ప్రతినిధులు సమావేశమై కసరత్తు చేశారు.
 

మన్యసీమ డిమాండ్‌కు కారణాలను ఫోరం నేతలు వివరించారు. బ్రిటిష్ హయాంలోనే జల్, జంగ్, జమీన్ పేరుతో ప్రత్యేక పరిపాలన ఉద్యమం జరిగిందని, అప్పుడు హెలెన్‌డ్రాప్ అనే అధికారితో అధ్యయనం చేయించి 1917లో తమ ప్రాంతాన్ని ట్రైబల్ ఏరియాగా నాటి ప్రభుత్వం డిక్లేర్ చేసిందని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చాక.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో ఏజెన్సీ ప్రాంతాన్ని చేర్చి ఆదివాసీలకు కొన్ని హక్కులు కల్పించారని, అది అమలుకాకుంటే స్వయంపాలనా ఏర్పాటు చేయవచ్చునంటూ ఆరో షెడ్యూల్‌లో పేర్కొన్నారని వెల్లడించారు.

యేటా ఆదివాసీలు లక్షల సంఖ్యలో మలేరియా, డయేరియాలతో మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మైదాన ప్రాంతంతో పోలిస్తే.. ఆదివాసీల జీవితం 20 ఏళ్లు తక్కువని డబ్ల్యుహెచ్ఓ 2010లో ప్రకటించిన సంగతి గుర్తు చేస్తున్నారు. తమకు దక్కాల్సిన వనరులు దక్కకపోవడంతో ఏం చేయాలనేదానిపైన 2006లో భద్రాచలంలో ఆదివాసీ మేధావులు, ప్రతినిధులతో సమావేశం జరిగిందని, భద్రాచలం రాజధానిగా మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని అందులో నిర్ణయం జరిగిందని వెల్లడించారు. 


కదలిన మన్యం
 సూర్య దినపత్రిక: తెలంగాణ- సమైక్యాంధ్ర ఉద్యమాలకు పోటీగా మహా మన్యసీమ రాష్ట్ర సాధన ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ ఉద్యమ తీవ్రత శుక్రవారం ఢిల్లీని తాకనుంది. మహా మన్యసీమ కోసం మడ మ తిప్పని ఆదివాసీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీలకు ‘స్వయం ప రిపాలన’ ఎంత అవసరమో విస్పష్టం తెలియ జేయడానికి శుక్రవారం హస్తినలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్నారు. స్వయంగా ఆజాదే వారిని పిలిపిం చడం గమనార్హం.

రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిశోర్‌చంద్ర దేవ్‌ ఈ ఉద్యమం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నా రు. తెలంగాణ కంటే ముందు నుంచీ అంటే 1917 నుంచీ మన్యసీమ డిమాండ్‌ ఉందని ఆయ న ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఢిల్లీకి వెళ్లనున్న ఈ బృందం వచ్చేనెల 1న రాష్ట్ర పతి, హోం మంత్రిని కలిసి వినతిపత్రం అందజే యనున్నారు. హస్తినలోనే మకాం వేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకు న్న గిరిజన నేతలతో నూ లాబీయింగ్‌ నిర్వహించ బోతున్నారు. స్వయం పరిపాలన కోసం కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఆదివాసీ ఎమ్మెల్యేలు మన్యసీమ ఆదివాసి గిరి జన ప్రజా ప్రతినిధులు ఫోరంగా ఏర్పడ్డారు.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా లను కలిపి మన్యసీమ రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. చెంచుల ప్రాబల్యం అధికంగా ఉన్న శ్రీశైలంను జిల్లా కేంద్రంగా చేసుకుని కర్నూలు, మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను ఏకఛత్రం కిందికి తేవాలనే డిమాండ్‌ తీవ్రతరమైంది.జల వనరులు, అటవీ, ఖనిజ సంపద పుష్క లంగా ఉన్న ఈ ప్రాంతాలన్నీ ఒక రాష్ట్రంగా ఏర్ప డాలన్న ఉద్యమం ఏడాదిన్నర కాలంగా విస్తృతం గా కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్ర, గ్రేటర్‌ రాయలసీమ డిమాండ్లు వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు గ్రేటర్‌ మన్యసీమ కూడా ‘ప్రత్యేక జాబి తా’లో చేరడం విశేషం. ఇది రాజకీయ పార్టీలకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త అంశాన్ని ఇచ్చినట్టయింది.

మన్యసీమ మొనగాళ్లు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల పోరాట స్ఫూర్తే ఈ ఉద్య మానికి ఊపిరి పోసింది. ఖమ్మంజిల్లా భద్రాచలంలో కొన్నేళ్ల కిందటే పురుడు పోసుకున్న ఈ ఉద్యమం..ఇక మరింత ఉధృతం కానుంది. అదే క్రమంలో...నల్లమల అడవులు వ్యాపించిన ప్రాంతాలను కూడా ఆదివాసీల ‘స్వయం పాలిత కేంద్రం’గా ప్రకటించాలనే డిమాండ్‌ ఉంది. అపారమైన అటవీ సంపద ఈ జిల్లాల సొంతం. ఆదివాసీల బలం అటవీ సంపదే. గోదావరిని ఆసరాగా చేసుకుని గిరిజనులు జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళంజిల్లాలోనూ మహానది, వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి.

కొన్ని జిల్లాల్లో గిరిజనుల ప్రాబల్యమే ఎక్కువ. ఒక్క ఖమ్మం జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉండగా..వాటిల్లో సగానికి పైగా అంటే-29 మండలాలు ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తింపు పొందడం గమనార్హం.
ఆదివాసీలు ప్రత్యక్ష దైవాలుగా భావించే అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల హయాంలోనే ప్రత్యేక ‘మన్యసీమ’కు బీజం పడిందనే వాదనలు ఉన్నాయి. వారి హయాంలోనే ‘జంగల్‌’, ‘జమీన్‌’, ‘పానీ’ నినాదంతో అప్పట్లోనే ఆదివాసీలు స్వయం పాలన కోసం పోరాడినట్లు సమాచారం ఉంది. ‘మీ రాజ్యం మీదే’ అంటూ స్వాతంత్య్రానికి ముందే బ్రిటిష్‌ ప్రభుత్వం చట్టాలు సైతం చేసిందని గణాంకాలు చెబుతున్నాయి.

1/70 చట్టం, అటవీ హక్కులు, 15వ క్రమబద్ధీకరణ..వంటి చట్టాలు ఆదివాసీల సంక్షేమం కోసమే రూపుదిద్దుకున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం మార్పులు జరుగుతున్న కొద్దీ ఆదివాసీల చట్టాలు అటకెక్కుతూ వస్తున్నాయని గిరిజన సంఘాల ఆరోపణ. క్రమంగా వలసలు పెరగడం, అటవీ సంపద దోపిడీకి గురవడం జరుగుతోంది. సమాజం ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ ఆదివాసీలు వెనుకబాటుతనానికీ, దోపిడీకి గురవుతున్నారు.

కనీస వైద్యం పొందలేని దయనీయ స్థితిలో ఆదివాసీలు బతుకీడుస్తున్నారని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు సైతం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..ఆదివాసీలు స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అటవీ విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో వారు క్రమంగా మైదాన ప్రాంతాల వైపు తరలి రావాల్సి వస్తోంది. చేతివృత్తులు, కులవృత్తులంటూ ఏవీ లేకపోవడంతో పట్టణాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవించాల్సిన దుస్థితిలో ఉన్నారు. అడవి తల్లిని నమ్ముకుని తేనె, ఉసిరి, విస్తరాకులు వంటి అటవీ ఉత్పత్తులను విక్రయించుకుంటూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న వారు క్రమంగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సంస్థల నివేదికలు సైతం ఉటంకిస్తున్నాయి.

ఆదివాసీలకు స్వయం పాలన హక్కు ఉందని, ఈ విషయాన్ని రాజ్యాంగంలోనూ ఉటంకించారని నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5, షెడ్యూల్‌ 6 దీన్నే పేర్కొంటోందని అంటున్నారు. ఈ షెడ్యూల్‌ను అమలు చేసే విశేష హక్కులు గవర్నర్‌కు ఉన్నాయనేది వారి వాదన. గిరిజన ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, దీనిపై నిర్ణయం షెడ్యూల్‌ 5, షెడ్యూల్‌ 6ను అమలు చేసే హక్కు గవర్నర్‌కు ఉందని చెబుతున్నారు.

శ్రీకృష్ణ కమిటీ దృష్టికీ డిమాండ్‌
మన్యసీమ డిమాండ్‌ను జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ దృష్టికీ వెళ్లింది. గతంలో మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కన్వీనర్‌ చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షంల నేతృత్వంలో 30 మంది ప్రతినిధులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌జిల్లాలకు చెందిన ఇన్‌ఛార్జీలు ఈ బృందంలో ఉన్నారు. చెంచు, కోయ, కోయ రెడ్లు ఇలా 30 గిరిజన జాతుల నాయకులు కలిసి శ్రీకృష్ణ కమిటీకి తమ గళాన్ని వినిపించారు.

ఉద్యమం ఉధృతం చేస్తాంః చందా లింగయ్య
మన్యసీమ రాష్ట్రం కోసం గతంలో చేపట్టిన ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు మన్యసీమ సాధన సమితి కన్వీనర్‌ చందా లింగయ్య స్పష్టం చేశారు. ఉద్యమ స్వరూపాన్ని వివరించారు. ‘ఈ డిమాండ్‌, ఈ ఉద్యమం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. తెల్లదొరల కాలం నుంచే ఈ డిమాండ్‌ ఉంది. మన్యసీమ రాష్ట్రం కోసం 2006లోనే భద్రాచలంలో జాతీయ స్థాయి సదస్సును కూడా నిర్వహించాం..’ అని ఆయన చెప్పారు.

కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ..ఆదివాసీలు కనీస ప్రగతి సాధించ లేదని అన్నారు. నిధుల మళ్లింపు, వనరుల దోపిడీ దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. బొగ్గు గనులు, కృష్ణా గోదావరి చమురు నిక్షేపాలు, ఖనిజ సంపద, గనులు..ఇవన్నీ ఆదివాసీల ప్రాంతాలకు చెందినవేనని అన్నారు. వాటి ద్వారా వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నప్పటికీ..ఆదివాసీలను పట్టించుకున్న నాధుడే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము రాజ్యాంగ బద్ధంగానే స్వయం పాలన కోరుతున్నామని అన్నారు.

భద్రాచలం రాజధానిగా..
ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు తొమ్మిది జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను ప్రత్యేక మన్యసీమ రాష్ట్రంగా ప్రకటిస్తే దీనికి భద్రాచలాన్ని రాజధానిగా చేయాలని సూచన ఉంది. అలాగే..ఉట్నూరు, మంచిర్యాల (ఆదిలాబాద్‌), మంథని (కరీంనగర్‌), మేడారం, మహబూబాబాద్‌ (వరంగల్‌), భద్రాచలం, కొత్తగూడెం (ఖమ్మం), రంప చోడవరం (తూర్పు గోదావరి), పోలవరం (పశ్చిమ గోదావరి), పాడేరు, నర్సీపట్నం (విశాఖ), పార్వతీపురం (విజయనగరం), సీతంపేట, పాతపట్నం (శ్రీకాకుళం)లను జిల్లా కేంద్రాలుగా చేస్తే అనువుగా ఉంటుందని సమితి భావిస్తోంది.

7 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలు
భౌగోళికంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏడు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 2 నుంచి రెండున్నర లక్షల మంది గిరిజన జనాభా ఉండటం గమనార్హం.

ఢిల్లీ వెళ్లే ఎమ్మెల్యేలు వీరే..
పి బాలరాజు (పోలవరం), కెవి సత్యనారాయణ రెడ్డి (రంపచోడవరం), రాజన్నదొర (సాలూరు), సుగ్రీవులు (పాలకొండ), రేగ కాంతారావు (పినపాక), కుంజా సత్యవతి (భద్రాచలం), మిత్రసేన (అశ్వారావు పేట), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), జి నగేష్‌ (బోధ్‌).


28, జులై 2011, గురువారం

ఈ లేఖను మరచితిరా అద్వానీజీ?

ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 25 మంది పార్టీ ప్రతినిధుల బృందంతో భాజపా సీనియర్ నేత ఎల్. కే. అద్వానీ తెలంగాణా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందనినీ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర బిల్లు ప్రవేశపెడితే బలపరుస్తామనినీ,వచ్చే సార్వత్రిక ఎన్నికల్ల తర్వాత భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే తప్పనిసరిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాను ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు నిన్నటి 'ది హిందూ' దినపత్రికలో వార్త వచ్చింది.  
 
BJP senior leader L.K. Advani reportedly told a 25-member delegation of party leaders from Andhra Pradesh on Tuesday that the Congress had deceived the people by giving a false assurance on forming a separate Telangana State. The BJP would support a Bill on Telangana if it was introduced in the ensuing Parliament session. “Otherwise, when the BJP comes to power at the Centre after the next poll, definitely we will form Telangana at the earliest,” Mr. Advani told the delegation . లింక్

 ఇదివరకే తెలంగాణాపై భాజపా మార్కు అవకాశవాద రాజకీయాల పై ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు మూలంగానే తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేకపోయామని అద్వానీ అంటున్నారు.మరి చంద్రబాబు డిక్టేట్ చేయగానే ఈ క్రింది లేఖను  ఆయన కేంద్ర హోం మంత్రి హోదాలోనరేంద్రకు రాయడం జరిగిందా?  






27, జులై 2011, బుధవారం

ప్రాంతీయతత్వం కన్నా మానవత్వం మిన్న

తోటి తెలుగువాడి కోసం పరితపించిన చిత్తూరు వాసి

(ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్, గల్ఫ్ ప్రతినిధి) తెలంగాణ, సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకున్న నేపథ్యం.. విద్యాధికులైన ప్రవాసీయులు ప్రాంతీయ విద్వేషాలతో ఇంటర్నెట్ వేదికలపై పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న తరుణం.. అయినా అవేవీ పట్టనట్టుగా ఈ చిత్తూరు వాసి తోటి తెలుగువాడి కోసం పరితపించాడు. ఎడారి గ్రామంలో దిక్కూ మొక్కూ లేకుండా మరణించిన నిజామాబాద్ జిల్లా వాసి కోసం తెలంగాణవాదులెవరూ ముందుకు రాకపోయినా సలీం నడుం బిగించాడు.

నానా తంటాలు పడి అతడి మృతదేహాన్ని స్వదేశానికి పంపించాడు. సౌదీ అరేబియాలోని రియాద్‌కు 200కిలో మీటర్ల దూరంలో హోతా అనే ఏడారిలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బొమ్మకొండ స్వామి గౌడ్ గుండెపోటుతో జూలై 5న మరణించాడు. స్వామిగౌడ్ తన వద్ద పని చేయడం లేదని అతని మృతదేహం ఖర్చును తాను భరించనని అరబ్బు యజమాని చేతులెత్తేసాడు. కనీసం రెండు నెలల పెండింగ్, స్పాన్సర్ లేని కేసులలో మాత్రమే భారతీయ ఎంబసీ మృతదేహం తరలింపునకు నిధులు చెల్లిస్తుంది. మృతదేహాన్ని తెప్పించాల్సిందిగా మృతుడి కుటుంబం స్థానిక ఎంపీ మధుయాష్కీని కోరగా ఆయన హామీనిచ్చినప్పటికీ అది అమలు కాలేదు.

ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో సైకిల్ దుకాణం నడుపుకొంటున్న చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సలీం వారం రోజులపాటు తిరిగి అధికారిక లాంఛనాలు పూర్తి చేసి భారతీయుల నుంచి విరాళాలు సేకరించి మృతదేహాన్ని స్వదేశానికి పంపించాడు. సిరిసిల్ల నియోజకవర్గంలోని కోనరావుపేట మండలానికి చెందిన బాష రాజయ్య ఒమన్‌లో మరణించగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లూరి హరిబాబు మృతదేహాన్ని మస్కట్‌కు తీసుకొచ్చి హైదరాబాద్ పంపించాడు.

విశాలాంధ్ర మహాసభ ఢిల్లీ మీడియా వర్క్ షాప్ లో సంజయ్ బారు


26, జులై 2011, మంగళవారం

ఎవరిని తప్పుదారి పట్టించవచ్చారు?

తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్ను కలిసి కాంగ్రెస్ పార్టీ ఏయే సందర్భాలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందో వివరించినట్లు వార్తలొచ్చాయి. ప్రత్యక్ష ఎన్నికలకు ఆమడ దూరంలో ఉండే వి.హన్మంతరావు మరికొందరు నాయకులు ఈ మధ్య మాటి మాటికీ 'కాంగ్రెస్ 2004 లో తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పుడు సీమాంధ్ర నాయకులు ఎందుకు నిశబ్దం పాటించారు' అని మీడియా ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీరు సూటిగా ఒక్క ప్రశ్నకు నిజాయితీ గా జవాబు చెప్పగలరా?  2004 వరకూ పోనవసరం లేదు, 2009 డిసెంబర్ లో   కేసీఆర్ తన దీక్షను విరమించి దొంగచాటుగా నిమ్మకాయ రసం పుచ్చుకునప్పుడు గాని, ఆ తర్వాత నిమ్స్ లో  ఐవీ ఫ్లూయిడ్స్ పుచ్చుకుంటూ వెరైటీ దీక్ష చేసినప్పుడు కాని, కేంద్ర హోం మంత్రి చిదంబరం 'తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ' అంటూ డిసెంబర్ 9 న అర్థరాత్రి ఒక ప్రకటన జారి చేసేవరకూ మీలో ఏ ఒక్కడైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది అని నమ్మారా? అసలు ఏకపక్షంగా తెలంగాణా ఏర్పాటు చేసేస్తాం అని ఎవరు ఎప్పుడు హామీ ఇచ్చారు? ఆఖరికి చిదంబరం అత్యుత్సాహంతో రాత్రికి రాత్రి హడావుడిగా చేసిన ప్రకటనలో కూడా ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయని కాని, రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లేకుండా రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని గాని చెప్పలేదు. 2004 లో కాంగ్రెస్ స్వరాజకీయ ప్రయోజనాలకు తెరాసతో చేతులు కలిపింది. అప్పుడు కాంగ్రెస్ కేవలం రెండవ ఎస్సార్సీ కి కట్టుబడి ఉంటామని చెప్పింది. ఎన్నికల్ల తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాం లో కూడా అదే మాట చెప్పింది.ఎల్లప్పుడూ 'CONSENSUS'  అన్న మాటకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణా ఏర్పాటు గురించి అందరితో కలిసి ఆలోచిస్తామని చెప్పింది కాని ఏకపక్షంగా, ఇతరుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా రాష్ట్రవిభజన గావిస్తామని చెప్పలేదు. వైఎస్సార్ సమైక్యవాదని తెలిసికూడా  అతని నాయకత్వాన్ని మీరందరూ ఆమోదించలేదా ? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో 'CONSENSUS' లేదా 'ఏకాభిప్రాయం' అని గొంతెత్తి చాటినపుడు మీరెందుకు మిన్నకుండిపోయారు?

కాంగ్రెస్ సంగతి ఇలా వుంటే అసలు తెరాస నాయకుల మాటేమిటి? వారు దేనిని నమ్మి కాంగ్రెస్, ఆ తర్వాత మహాకూటమి చెంత చేరారు? ఎంతసేపూ తమ ఉనికిని కాపాడుకోవాలని చూశారు తప్ప ప్రత్యేక రాష్ట్రం వచ్చేస్తుందని వారు మాత్రం నమ్మారా? 2004 లో తెరాస తరపున కేసీఆర్ ఆమోదించి పంపిన ఏ.నరేంద్ర రెండవ ఎస్సార్సీ కి ఒప్పుకుంటూ సంతకాలు చేయలేదా? 





ఆ తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాం లో ఉన్నట్లుగా రెండవ ఎస్సార్సీకి, CONSENSUS అన్న పదానికి తమ ఆమోదం తెలిపి యూపీఏ ప్రభుత్వంలో  చేరలేదా?

Extract from Common Minimum Programme: "The UPA government will consider the demand for the formation of a Telangana state at an appropriate time after due consultations and consensus"


ఇప్పుడు ఎవరిని తప్పుదారి పట్టించాలని?

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పై అసెంబ్లీ లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్


25, జులై 2011, సోమవారం

విశాలాంధ్ర మహాసభ ఢిల్లీ మీడియా వర్క్ షాప్ లో నలమోతు చక్రవర్తి



సుప్రీం కోర్టుకు వెళతారా?

ఏ ముహూర్తాన ఓయూలో తన్నులు తిన్నాడో గాని తర్వాతి కాలంలో నాగం జనార్ధనరెడ్డి కరడుగట్టిన తెలంగాణావాదిగా అవతారం మార్చాడు. దేనికో ఆయనకే తెలియాలి. చిన్న రాష్ట్రాలు తన కార్యక్రమాలకు అనువుగా ఉంటాయని నాగం నమ్ముతున్నాడేమో! ఇప్పుడు సుప్రీంకోర్ట్కు వెళతాము , స్పీకర్ను తొలిగించాలి అంటూ మీడియా ముందు వెధవ నాటకాలు ఆడకపోతే నిజంగానే వెళ్ళొచ్చుగా? ఆయనను ఆపేదెవరు? చంద్రబాబు నాయుడా? సుప్రీం కోర్ట్ ఆయనకు బియ్యానికి బదులు గడ్డి పెడుతుందేమో. ఏదైతే ఏంటి కడుపు నిండదానికి?

24, జులై 2011, ఆదివారం

ఉద్యమాల సెగ.. ఉద్యోగాలకు పొగ

(సూర్య దినపత్రిక,జనరల్‌ బ్యూరో): రాజకీయ పార్టీలు రెచ్చగొట్టాయి.విద్యార్థులు రెచ్చిపోయారు. నేతలు ఉసిగొల్పారు. విద్యార్థులు తెలియని ఉత్సాహంలో విధ్వంసాలకు దిగారు.మీడియాలో వారి హీరోయిజం పతాకశీర్షికలకెక్కింది. ఉద్యమస్ఫూర్తితో పోలీసుస్టేషన్లకు వెళ్లారు.నేతలు వచ్చి పరామర్శించారు. వారికి మద్దతుగా బైఠాయించారు. కానీ.. ఆ ఫలితాన్ని ఆ అమాయక విద్యార్థులు ఇప్పుడు మరొక రూపంలో అనుభవిస్తున్నారు. అది వారి భవిష్యత్తును, జీవనభృతికి పెనుశాపంలా పరిణమించింది. జాతీయ- అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలపై గంపెడాశలు పెట్టుకున్న విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లేలా.. ఉద్యమాల్లో ఉస్మానియా విద్యార్థులు పాల్గొంటున్నం దున వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలు నిరాకరిస్తు న్నాయి.

పోలీసు కేసులుంటే మాకొద్దంటున్నాయి. దీనితో.. ఆరుగాలం కష్టపడి తమ వారసులను చదివిస్తున్న తలిదండ్రుల గుండెల్లో గునపాలు గుచ్చుకు న్నట్టయింది. ఇది ఒక్క ఉస్మానియాకే పరిమితం కావడం లేదు. సీమాంధ్రలోని యూనివర్శిటీ విద్యార్థులకూ విస్తరించనుంది. ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిని, కేసులు ఉన్న విద్యార్ధులను ఉద్యోగాల్లోకి తీసుకోకూడదని కార్పొరేట్‌ కంపెనీలన్నీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లు బాహాటంగానే చెబుతున్నారు. రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మారుతున్న అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఇదో కనువిప్పు. గుణపాఠం. ఉద్యమాల వల్ల తెలంగాణలో స్థాపించాలని గతంలో భావించిన కంపెనీలు ఇప్పుడు మనసు మార్చుకున్నాయి. సీమాంధ్ర, పరాయి రాష్ట్రాల వైపు దృష్టి సారిస్తున్నాయి.

ఇది మొత్తంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు శరా ఘాతం. అటు తమను రెక్కలుముక్కలు చేసి చదివించిన తలిదండ్రులకు న్యాయం చేయలేక, ఇటు తాము చదివిన ఉన్నత చదువుల వల్ల తగిన ఉద్యోగా లు రాక మానసికంగా నలిగిపోతున్న దయనీయ స్థితి. వరుస ఉద్యమాలతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయు) రావణకాష్టంగా మారడంతో, ఓయు పరిధిలో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్‌, ఇతర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో కార్పొరేట్‌ ఐటీ కంపెనీలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నాయి. పోరాటాల్లో పాల్గొంటున్న తెలంగాణ, సీమాం ధ్ర విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటే వారి తిరుగుబాటు ధోరణి ప్రభావం తమ కంపెనీలపై ఎక్కడ పడుతుందోనన్న భయాందోళనే దానికి కారణం.

గడిచిన మూడేళ్లుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరుతో విద్యార్థుల పోరాటాలు రోజురోజుకీ తీవ్రతరం కావడంతో.. ఓయూ, జెఎన్‌టియు పరిధిలో డిగ్రీ, పీజీలు చేసిన విద్యార్థులకు ఉన్నత స్థాయి ఐటీ ఉపాధి అవకాశాలు అందని ద్రాక్షగా మారాయి. అదే సందర్భంలో గతంతో పోల్చుకుంటే గడిచిన మూడేళ్లలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ అవకాశాలు కూడా గణనీయంగా తగ్గినట్లు యూనివర్సీటీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి

దీంతో ఇంజనీరింగ్‌, ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏ, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో డిగ్రీ, పీజులు పూర్తి చేసిన విద్యార్థులు సరైన ఉపాధి అవకాశాలు లభించక గత మూడేళ్లుగా అదనపు కంప్యూటర్‌ కోర్సులు చేస్తూ కాలం క్షేపం చేస్తున్నట్లు అమీర్‌పేటకు చెందిన ప్రముఖ మానవ వనరుల శిక్షణ సంస్థ పేర్కొన్నది. తాజాగా ఓయూ, జెఎన్‌టియు విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా కార్పొరేట్‌ కంపెనీలు వ్యవహారిస్తున్న తీరు, వారికి ఉద్యోగాలు నిరాకరిస్తున్న వైనంపై బెంగుళూరుకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ నిపుణుడిని ప్రశ్నించగా.. ఆందోళనలు, పోరాటాల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ వారి మానసిక స్థితి కంపెనీలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ఉద్యోగాలపై కొన్ని నియంత్రణలు రూపొందించినమాట నిజమేన ని అంగీకరించారు.

గత మూడేళ్లలో ఎంతమందిని రిక్రూట్‌ చేశారని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాచారం చెప్పకుండా ఆయన జారుకోవడం గమనార్హం. గత మూడేళ్లలో ఓయూ, జెఎన్‌టియు పరిధిలో అరకొర క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలు, క్యాంపస్‌ జాబ్‌ ఫెయిర్స్‌ ఉద్యోగ మేళాలు నిర్వహించడమే తాజా పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయని మరో హెచ్‌ ఆర్‌ నిపుణుడు వాపోయారు.

తరలుతున్న బీపీఓ కంపెనీలు...!
రాష్ట్రంలో గత మూడేళ్లలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీపీఓ, ఐటీ కంపెనీలు తమ ఆపరేషన్స్‌ను బెంగుళూరు, నోయిడా వంటి ప్రత్యామ్నాయ ప్రాంతాలకు తరలించాయి. కొత్తగా కొన్ని వైజాగ్‌లో స్థాపించాయి. ఈ కంపెనీలు శాశ్వత పద్ధతిలో తమ సొంత కార్పొరేట్‌ కార్యాలయాలను ఇక్కడ నెలకొల్పడానికి గతంలో ఏపీఐఐసీ నుంచి భూములు పొందినప్పటికీ.. తాజాగా హైదరాబాద్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సదరు కంపెనీలు ప్రస్తుతం తమ ప్రణాళికలు మార్చుకున్నట్లు విశ్వసనీయ అధికార వర్గాల తెలిపాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ఐటీ, బీపీఓ కంపెనీలు తమ తదుపరి విస్తరణ ప్రణాళికలను కూడా బెంగుళూరు, నోయిడా, ముంబాయి, పూణే వంటి ప్రధాన భారతీయ నగరాలకు ఇప్పటికే తరలించాయి.

ఎంబసీల్లోనూ అదే పరిస్థితి...!
అమెరికా, ఇతర విదేశీ ఎంబసీలు కూడా స్థానిక ఓయూ, జెఎన్‌టియు పరిధిలోని విద్యార్థులకు వీసాలు జారీ చేసే విషయంలోనూ తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా ప్రత్యేక రాష్ట్రం కోరూతూ ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఇంజనీరింగ్‌, ఎమ్‌సిఏ, ఎమ్‌బిఏ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మబలిదానాలకు పాల్పడడంతో... తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమ దేశాల్లో విద్యా, ఉపాధి అవకాశాల నిమిత్తం విద్యార్థులు, యువత అక్కడికి వెళ్లిన తర్వాత ప్రత్యేక రాష్ర్టం కోసం ఆత్మ బలిదానాలకు పాల్పడితే .. తమకు కూడా అంతర్జాతీయంగా చిక్కులు తప్పవని విదేశీ ఎంబసీలు కలవరం వ్యక్తం చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థులను మరింత లోతుగా స్క్రీనింగ్‌ చేయడానికి మానసిక నిపుణులనుసైతం నియమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

సర్కార్‌ ఉద్యోగానికి చుక్కెదురే..!
చివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులకు చుక్కెదురవుతోంది. ఇప్పటికే విద్యార్థులపై బనాయించిన కేసులతో వారు కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు రాష్ర్ట ప్రభుత్వం వారిపై గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని కేసులను ఎత్తివేయలేదు. దీనితో విచారణకు వచ్చిన పోలీసులు వారిపై కేసులు ఉండటంతో అదే నివేదిక అందిస్తున్నారు. చివరకు పోలీసు ఉద్యోగాల్లో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదన పడుతున్నారు.

సీమాంధ్ర విద్యార్థులకూ అదే పరిస్థితి
ఇదిలాఉండగా, ఉద్యమాల్లో పాల్గొంటున్న సీమాంధ్ర విద్యార్థులకూ ఇలాంటి పరిస్థితి ఎదురుకానుంది. ప్రస్తుతం అక్కడ తెలంగాణ స్థాయిలో ఉద్యమాలు లేకపోయినా, విశాఖ, విజయవాడ, గుంటూరు, అనంతపురం వంటి నగరాల్లో విద్యార్థులు ఉధృతంగా ఉద్యమిస్తున్నారు. ఫలితంగా చాలామందిపై కేసులు నమోదయ్యాయి. అక్కడ నిర్వహించే క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో సైతం కార్పొరేట్‌ కంపెనీలు ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయా కంపెనీల మానవ వనరుల విభాగం అధికారుల మాటలు స్పష్టం చేస్తున్నాయి.

కేంద్రానిదే బాధ్యత

ఆంధ్రజ్యోతి ముఖాముఖం: ఆంధ్రప్రదేశ్ అవతరణపై సాధికారతతో మాట్లాడగలిగిన కొద్ది మంది మేధావుల్లో - ప్రొఫెసర్ కె.వి. నారాయణరావు ఒకరు. ఆయన పరిశోథనా గ్రంథాలు 'ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' (1973), 'తెలంగాణా - ఏ స్టడీ ఇన్ ద రీజినల్ కమిటీస్ ఇన్ ఇండియా' (1972) - అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాయి. తెలంగాణాపై ఆయన రాసిన పుస్తకాన్ని లండన్‌కు చెందిన 'టైమ్స్' పత్రిక ప్రశంసించింది. తెలంగాణ ఉద్యమంపైన.. మన రాష్ట్రంలోని స్థితిగతులపైన విస్పష్టమైన అభిప్రాయాలున్న నారాయణరావుతో ఈ వారం ముఖాముఖి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
స్వాతంత్య్రం తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌లను పరిశీలించింది. బెంగాల్‌ను బీహార్‌ను కలపాలని.. కర్ణాటకను, ఆంధ్రను కలపాలని.. ఇలా అనేక రకాల డిమాండ్‌లు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకొనే ముందు కొంత చర్చ జరిగింది. కేరళలో మలబారు వంటి కొన్ని ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలనే డిమాండ్‌పై ఈ చర్చ జరిగింది. కేరళను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే - కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగిపోతుందంటూ కృష్ణమీనన్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకరించాడు. కేరళ తర్వాత ఆంధ్రరాష్ట్రంపై కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో- తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉండేది. అలాంటి ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటానికి నెహ్రూ సర్కారు అంత సముఖంగా లేదనేది నా అభిప్రాయం. అంతే కాకుండా - ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ల వంటివి రెండు స్థాయిల్లో ఉంటాయి. మొదటి స్థాయిలో ప్రజలు- ప్రత్యేక రాష్ట్రం వల్ల తమకు ఎలాంటి లాభం చేకూరుతుందనే విషయాన్ని ఆలోచిస్తారు. రెండో స్థాయిలో రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్ల తమకు ఎలాంటి లబ్ది చేకూరుతుందని ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో కేంద్రం తమకు ఎలా లబ్ది చేకూరుతుందనే విషయాన్ని మాత్రమే ఆలోచించింది. ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఎస్సార్సీ నివేదిక కూడా - ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.

ప్రత్యేక తెలంగాణ రాకుండా ఆంధ్రనాయకులు అడ్డుకున్నారనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది..
ఇందులో వాస్తవం లేదనిపిస్తుంది. 1950లలో కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేయగల ఆంధ్రనేతలు ఎవరూ లేరు. నా ఉద్దేశంలో తెలంగాణకు సంబంధించిన నిర్ణయం కేంద్రమే తీసుకుంది. నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. 1970లలో మళ్లీ ఆ నిర్ణయాన్ని సంపూర్తిగా అమలు చేయటంపైనే ఆయన కుమార్తె ఇందిర మొగ్గుచూపింది. ఇక 2011లో ఇందిర కోడలు సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాలి.

మీ వాదన ప్రకారం తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి..
అవును. కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి. అయితే కేంద్రం ఈ విషయంలో అలక్ష్యం చూపించింది. నైతిక బాధ్యత కూడా తీసుకోలేదు. ఉదాహరణకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారనుకుందాం. అది ఎందుకు అమలు కావటం లేదు అనే విషయాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కాని కేంద్రం మౌనంగా ఉంది. ఇదే విధంగా ప్రణాళిక సంఘం కూడా వ్యవహరించింది. ప్రణాళికా సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపుతుంది. ఆ సమయంలో- ఏ ప్రాంతానికి ఎ ంత ఖర్చు పెడుతున్నారు? ఒక ప్రాంతంపై అశ్రద్ధ చూపుతుంటే ఎందుకు చూపుతున్నారు? వంటి అంశాలపై ప్రణాళిక సంఘం ఆరా తీయొచ్చు. అంతే కాకుండా అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా తెలంగాణాకు అందాల్సిన అంశాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని.. అందువల్ల ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదన బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ అంశాలపై మీరు అధ్యయనం చేశారు కదా. మీ అభిప్రాయమేమిటి?
ఈ విషయంలో కొన్ని నిజాలు ఉండచ్చు. కాని ఎక్కువ అసత్యాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. 1969 ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి ప్రచారాలు జరిగాయి. ఉద్యోగాల విషయంలో ఆ సమయంలో జస్టిస్ వాంఛూ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం చూస్తే- మొత్తం 92,552 ఉద్యోగాలను భర్తీ చేస్తే- వాటిలో ప్రాంతీయేతరులు కేవలం 3,799 మంది మాత్రమే ఉన్నారు. ఉద్యోగాల విషయంలో కొందరికి అన్యాయం జరిగి ఉండచ్చు. కాని దానిని చాలా ఎక్కువగా చిత్రీకరించటం సరి కాదు.

ఇంత కాలంగా అందరినీ వేధిస్తున్న తెలంగాణ సమస్యకు పరిష్కారమేమిటి?
ఇక్కడ ఒక విషయం అందరూ చాలా స్పష్టంగా గమనించాలి. ఆంధ్రప్రజలు తమ ప్రాంతానికి రావాలని తెలంగాణ వారు కోరుకోలేదు. వారంతట వారే వచ్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని సంయమనంతో పరిష్కరించుకోవటం మంచిది. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. హైదరాబాద్‌నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ప్రాంతాల భేదం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో నేతలు - తమ స్వార్థం కోసమైతేనేమి.. ఇతర కారణాల వల్లనైతేనేమి హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. దీనితో పెట్టుబడులు ఇక్కడే ఎక్కువగా వచ్చాయి.

అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత - ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటే ఆంధ్ర ప్రాంత పరిస్థితి ఏమిటి? ఒక వేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే - అక్కడ ప్రజలకు విశ్వవిద్యాలయాలు వద్దా? వీటితో పాటుగా అసలు ఆ ప్రాంతానికి రాజధాని ఎక్కడ ఉండాలి? - ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిపై భావోద్వేగాలు లేకుండా చర్చ జరగాలి. ఈ చర్చల్లో కూడా కేంద్రం ప్రముఖ పాత్ర పోషించాలి. 'తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకుచావండి..' అనే వైఖరి అవలంభించటం సరికాదు. ఈ సమస్యలపై చర్చ జరిగినప్పుడే పరిష్కారం కూడా లభిస్తుంది.

- ఇంటర్వ్యూ: సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jul/24/edit/24edit5&more=2011/jul/24/edit/editpagemain1&date=7/24/2011

23, జులై 2011, శనివారం

ఆర్టీసీకి కష్ట కాలం

అయ్యయ్యో ఆర్టీసీ: పగిలిన బస్సు అద్దాలలోంచి (ఆంధ్ర భూమి ఫోటో)

ఐక్య కార్యాచరణ సంఘాలు చీటికి మాటికి బందులను ప్రజలపై రుద్దుతుండగా ఆర్టీసీకి కష్ట కాలం దాపురించింది. బందు రోజులలో బస్సులను డిపోలకే పరిమితం చేసి ఆర్టీసీ ఇప్పటికే లక్షలాది రూపాయల నష్టాలను మూటగట్టుకొంది. ఉద్యమాల పుణ్యమానని వయసు ముదిరిపోయిన  విద్యార్ధి సంఘాల నాయకులవారు కూడా కార్లకు అధిపతులు అయినట్లు వినికిడి.అది ఎంత నిజమో నాకు తెలియదు. కాని సామాన్యుల జీవనోపాధికి, రవాణాకు ఆధారమైన బస్సులు మాత్రం ఐకాసాల నోటినుండి బంద్ అన్నమాట రాగానే రోడ్డు ఎక్కడంలేదు.ఈ విధంగా "రైట్ టు లైవ్లిహుడ్" అనే ప్రాథమిక హక్కును వేలాదిమందికి చెందకుండా కొంతమంది కాలరాస్తుండగా హక్కుల సంఘాలు, చీకటి సంధ్యలు, వక్రపాణీలు గుర్రుకొట్టి నిద్రపోతున్నారు లేక సాయంత్రం లైవ్ షో లకు ముస్తాబవుతున్నారు. ఇదేమి దౌర్భాగ్యంరా బాబు అని అనుకోవడం  తప్ప సామాన్యులు రోడ్లు లేక టీవీ స్టూడియోలు ఎక్కలేరు కదా?

 రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ధైర్యం చేసి జనులకు ఇబ్బంది కలగకూడదని బంద్ రోజున నిన్న హైదరాబాద్ నగరంలో బస్సులు నడపగా అల్లరిమూకలు 40 కి పైగా బస్సులపై దాడి చేసినట్టు సమాచారం.

22, జులై 2011, శుక్రవారం

అమాయకులను గొర్రెల మందలో కలుపుకునే విధంబెట్టిదనిన


  • Jobs to one lakh youth in one year of formation of Telangana (July 2010)
http://www.thehindu.com/news/cities/Hyderabad/article525135.ece
http://www.youtube.com/watch?v=758itSuE-tg

  • Three acres of land free to each Dalit family( The Hindu, Feb 29, 2004)
Mr. Chandrasekhar Rao said that his party has promised the Telangana people that every landless Dalit family would be given three acres of land and a Dalit would be made first Chief Minister if Telangana State was formed http://www.hinduonnet.com/2004/02/29/stories/2004022902330400.htm

  •  Compulsory free education in Telangana from KG to PG (The Hindu, June 28,2010)


Mr. Rao also promised compulsory and free education from KG to PG in separate Telangana with a social responsibility thrust on police administration to ensure that no child above the age of three was left out of schools. http://www.hindu.com/2010/06/28/stories/2010062859720600.htm

KCR talking to the Telangana supporters said that once the separate statehood of Telangana is formed, he would implement UGC scale to all the employees and education will be free from Kindergarten to Post Graduation.http://www.gr8telangana.com/2011/02/free-education-from-kg-to-pg/


  • 12% reservations in jobs, free education from KG to PG and a budget of Rs.1000 crores for muslims from the first year of formation of Telangana  ( The Hindu, Feb 1, 2011 and Siasat Sep 29,2010)

Telangana Rashtra Samiti (TRS) president K. Chandrasekhar Rao has promised to provide 12 per cent reservation to Muslims if Telangana is formed. Mr. Rao also promised a budget of Rs. 1,000 crore for the welfare of Muslims from the first year of formation of Telangana http://www.hindu.com/2011/02/01/stories/2011020154070500.htm

http://www.siasat.com/english/news/free-education-kg-pg-minorities-telangana-kcr

  • Installing a dalit as CM and a muslim as deputy CM. Home and Finance portfolios to be given to Muslim community (Tehelka Jan 15,2011 and The Hindu, Feb 1,2011)
Telangana’s first chief minister will be a Dalit’ http://www.tehelka.com/story_main48.asp?filename=Ne150111incoldblood.asp
Besides Deputy Chief Minister, Muslim community will also get key portfolios of Finance and Home in the government http://www.hindu.com/2011/02/01/stories/2011020154070500.htm
  • 12% reservations to Tribal people ( The Hindu June 16,2011)
if the State was formed, the TRS would develop Devarakonda area, set apart 12 per cent reservations for tribal people and make a Dalit the Chief Minister. http://www.thehindu.com/news/cities/Hyderabad/article2109073.ece


  • Central government pay scales and special increments to Telangana employees ( The Hindu, Nov 22,2010)
Telangana Rashtra Samiti (TRS) president K. Chandrasekhar Rao  promised Central government pay scales to the government staff of Telangana State when it is formed http://www.hindu.com/2010/11/22/stories/2010112253370400.htm


TRS President has announced that special increments to all Government employees would be provided once the Telangana state is formed.http://www.telangananewsonline.com/2011/February/26/kcr-special-increments-telangana-employees.htm
  • Jurala High-Level Canal would be built ( The Hindu Oct 17,2007)
Telangana Rashtra Samithi president K. Chandrasekhara Rao announced that the Jurala High-Level Canal would be built as would Lower Jurala reservoir across river Krishna, to divert water to meet the needs of entire South Telangana, once a separate State was formed http://www.hinduonnet.com/2007/10/17/stories/2007101759080300.htm
  • Creation of new districts
Telangana Rashtra Samiti (TRS) presidents K. Chandrasekhar Rao has unveiled plans of seventeen districts in separate Telangana when it is formed http://www.hindu.com/2010/06/28/stories/2010062859720600.htm
TRS president K. Chandrasekhar Rao has promised that Vikarabad in Ranga Reddy district would be among seven new districts to be created in Telangana when it gets its statehood http://www.hindu.com/2010/09/10/stories/2010091063010900.htm
 Telangana Rashtra Samiti (TRS) president K. Chandrashekhara Rao promised to rename Adilabad as Komram Bheem district once Telangana as a separate State becomes a reality. http://www.hindu.com/2008/11/24/stories/2008112458860600.htm



ఇవి mainstream మీడియాలో నాకు కనిపించిన కొన్ని వాగ్దానాలు మాత్రమే. కేసిఆర్ దొర & కో ప్రైవేటు లిమిటెడ్ పార్టీలోని అనేక మంది  ప్రబుద్ధులు గత పదేళ్ళు గా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి అమాయకులను ఎగదోసి వసూళ్ళతో పబ్బం గడుపు కుంటున్నారని మనలో చాలా మంది నమ్ముతారు. గాలి బుడగల్లాంటి వాగ్దానాలు పగిలిపోయాయని ఆవేశాపరులు ప్రాణాలు తీసుకుంటే నాయకులు,కార్యకర్తలకు బాధ్యత ఉండదా? వీరికి సంబంధించి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోరేంటి అని ఇప్పటికే చాలా మంది అడిగివున్నారు

21, జులై 2011, గురువారం

శవ రాజకీయాలకు అడ్డువచ్చినందుకు ఏపీ భవన్ ఉద్యోగిపై చేయికున్న హరీష్ రావు




'కొట్టండిరా వాడిని' అంటూ రాష్ట్ర అసెంబ్లీ లో జేపీని కేసిఆర్ కుమారుడు కొట్టించిన విషయం మరవకుండానే ఇప్పుడు వారి మేనల్లుడు దేశ రాజధాని లో తెలుగు వాళ్ళ పరువు మంట గలిపాడు. ఉద్యమమంటూ అమాయకులను మభ్యపెడుతూ నాయకులుగా చలామణి అయిపోతున్న వీళ్ళు నిజానికి దేనికి యోగ్యులు? 

తెరాస రౌడీ మూకలు,నాయకులు అక్కడకు చేరుకున్నారని భయపడిన అధికారులు తమ భాద్యతను సక్రమంగా నిర్వహించారు.హరీష్ రావు అంతగా రెచ్చి పోవడానికి ఆ లేఖలో ఏముంది?

"తెలంగాణ ఉద్యమ మద్దతుదారుడు యాదిరెడ్డి మృతదేహాన్ని క్రిమిటోరియంకు తీసుకెళ్లకుండా ఏపీ భవన్‌కు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని మా దృష్టికి వచ్చింది. పెద్ద సంఖ్యలో తెలంగాణ మద్దతుదారులు, జేఎన్‌యూ విద్యార్థులు మృతదేహంతో ఏపీ భవన్ ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి భవన్ ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా శవాన్ని భవన్‌కు కాకుండా క్రిమిటోరియంకు తీసుకెళ్లేలా చూడండి.అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తక్షణం ఏపీ భవన్‌కు భద్రత పెంచండి''ఆంధ్రజ్యోతి ( జూలై 22)

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌కు మరో షాక్‌...

సూర్య  దినపత్రిక : గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2010-11 పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌ చెన్నయ్‌కు తరిలిపోయింది. తాజాగా సెప్టెంబర్‌ 19,20 తేదీల్లో జరిగాల్సిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ కూడా రద్దైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని స్థానంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, సీఐఐ సంయుక్తంగా 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియచేసినట్లు సర్కార్‌ జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నది.

ఇదిలా ఉండగా.. పరిశ్రమల అసోసియేషన్లు మాత్రం 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ షెడ్యూల్‌ ప్రకారం జరగకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికంగా కోలుకోలేని విధంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌తో పోల్చుకుంటే.. 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా అదనపు ప్రయోజనాలుంటాయని, ఈ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సీఇఓలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012 జనవరిలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

దేనికీ నోటి దూల?

" మా దేహం ముక్కలైనా... రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం. కేంద్రం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు సైతం దిగుతాం.'' - పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే

నిన్నటివరుకు కేశవ్ గారంటే ఎంతో అభిమానం ఉండేది. ఆయన సమైక్యవాదాన్ని ఎంతో సమర్ధంగా అనేక వేదికలపై (
గుంటూరు వేదికతో సహా ) వినిపించారు. కాని ఒక్క సారి నోరుజారిన మూలంగా అదంతా మరుగునపడిపోనుంది.

ఎంత మీ పార్టీ అధ్యక్షులు అధికారం కోసం నక్కి నక్కి చూస్తూ ఇరుప్రాంతాల నాయకులను ఎగదోస్తే మాత్రం మీరు సొంతంగా వ్యవహరించలేరా?మొన్ననే వారు ఎన్నికలకు సిద్ధం కామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణా లో మీ పార్టీ నేతలు మొదలుపెట్టిన  రాజీనామాస్త్రాలు, బస్సు యాత్రల గురించి మాట్లాడరే? కేంద్రం సమైక్యవాదనకు మొగ్గు చూపుతున్న వేళ మీ ప్రాంతంలో మీ ప్రత్యర్ధులు ముందుకు సాగిపోతున్నరనే కదా ఈ ఆత్రం? దయచేసి వేర్పాటువాదులకు,హింసను ప్రభోదించి నాలుకలను కోస్తాం, తిరిగానివ్వం, కాలుపెట్టనివ్వం అంటూ నోరుపరేసుకునే అనేకానేక పిట్టల దొరలకు మందుగుండు సరఫరా చేయకండి. క్లిష్టమైన ఈ సమయంలో స్వార్ధ చింతన అస్సలు తగదు.అధికార మదంతో  ప్రత్యర్ధులు కలిసిరాకపోయినా మీరే ఒక అడుగు ముందుకు వేసి వారిని కలుపుకుపొండి . ఏ మూల
దాక్కున్నారో మీ పార్టీ అధ్యక్షులవారిని బహిరంగ పరచి ఒక నిర్ణయాత్మకమైన పాత్రను పోషింపచేయండి.

20, జులై 2011, బుధవారం

'సింగిడి' వారి బూతు కవితలు

 'సింగిడి' ( తెలంగాణా రచయితుల సంఘమట! ) వారి శ్రావ్యమైన బూతు కవితలు http://tinyurl.com/3j9dxuf
 చదివి వినిపించి తరించండి
బూతులను కవితల రూపంలో అల్లడం ఒక అపురూపమైన కళ
మరి విద్వేషం అనే విషాన్ని పేజీలపై చిమ్మడమనేది అందరు కవులకు సాధ్యపడదు
మీలో ఎవరైనా బూతు కవిత్వం చెప్పే వాళ్ళుంటే 'సింగిడి' బూతు రచయితుల సంఘానికి తప్పక పంపించండి

విశాలాంధ్రకు మేం అనుకూలం: హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో డి.డి.ఇటాలియా

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజి నుండి
మిస్టర్ డిప్యూటీ చైర్మన్,

ఆంధ్ర స్టేట్ బిల్ మీద మాట్లాడే అవకాశమిచ్చినందుకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1895- 97 సంవత్సరాలలో నా ప్రాథమిక విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగిందనే విషయం, బహుశా నా మిత్రులనేకమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. నేను రాజమండ్రిలో ఉన్న సమయంలో ఇంకా గోదావరి మీద బ్రిడ్జి నిర్మించలేదు. ఆ రోజుల్లో మేము నదిని పడవ మీదే దాటాల్సి వచ్చేది. అందుకే, అతిసహజంగా నాకు ఆ ప్రాంతం మీద ఉన్న మమకారంతో , ఆ రోజు 'ఆంధ్రా బిల్లు'ను మనస్ఫూర్తిగా బలపరిచేందుకు ఉద్యుక్తుడనయ్యాను.

తమ చిరకాల వాంఛ ను నెరవేర్చుకున్నందుకు ఆంధ్ర ప్రజల్ని అభినందిస్తున్నాను. అనేక సంవత్సరాలుగా మద్రాస్ నుంచి విడిపోయి తమ సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలన్న, తెలుగువారి ఆలోచనలు నాకు తెలుసు. నేను రాజమండ్రిలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ విషయం విన్నాను. ఇన్నాళ్ళకైనా అది నిజయమయినందుకు సంతోషిస్తున్నాను. మీ చిరకాల వాంఛ నెరవేర్చుకోవడానికి ఎన్ని త్యాగాలు చేయవలసివచ్చిందో ఎన్ని కష్ట నష్టాలకు గురికావాల్సి వచ్చిందో, తెలియనిదికాదు.

ఇటీవల, గొప్ప దేశభక్తుడైన పొట్టి శ్రీరాములు తన జీవితాన్నే అర్పించారు. ఆయన దేశభక్తికి నివాళులర్పిస్తూ నేను శిరస్సు వంచి అభివందనాలు తెలియచేస్తున్నాను. అందరూ ఊహించిన దానికంటే అతి తొందరగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించిన మన ప్రధానమంత్రికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం ఏర్పడడానికి ముందే, ఆంధ్ర రాష్ట్ర ఆలోచన ఉన్నదని మనకి తెలుసు. రాజ్యాంగ నిర్మాతలు ఆంధ్ర రాష్ట్రాన్ని రాజ్యంగంలోనే పొందుపరుద్దామనుకున్నారు.

కొన్ని సిద్ధాంత పరమైన ఇబ్బందుల వల్ల, ఆఖరి నిముషంలో, ఆ ప్రయత్నాన్ని వాయిదా వేశారు. ఆంధ్ర ప్రజలు అనవసరంగా భారత ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. కానీ మొన్న డిప్యూటీ హోం మినిష్టర్ దత్తార్ 'భారత ప్రభుత్వం ప్రజల కోర్కెలను నెరవేర్చటంలో ఏ మాత్రం తాత్సారం చెయ్యదని' స్పష్టం చేశారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు, తప్పొప్పులు బేరీజు వేసుకోక తప్పదని, నూటొక్క సార్లు వెనకాముందు ఆలోచించుకోక తప్పదని కూడా దత్తార్ తెలియజేశారు.

ఒక హైదరాబాద్ వాసిగా, భారత ప్రభుత్వం ఇంకొంత మెరుగైన ఆలోచన చేసివుంటే బాగుండేదనిపిస్తోంది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే 12 జిల్లాలనూ హైదరాబాద్‌లో కలిపేసి వుంటే రాజధాని సమస్య హైకోర్టు సమస్య లేకుండా పోయే ది. చాలా డబ్బు కూడా అదా అయ్యేది. హైదరాబాద్‌లో తెలుగు మాట్లాడే 8 జిల్లాలతో తెలంగాణ ప్రాంతముందన్న సంగతి మనకి తెలిసిందే. 45వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంతో కోటి జనాభాలో ఉన్న ప్రాంతం తెలంగాణ. నిజానికి సీడెడ్ అని పిలవబడే కర్నూలు, కడప, అనంతపూర్, బళ్లారి జిల్లాలూ, ఉత్తర సర్కారుల్లో కష్ణా జిల్లా మద్రాస్‌లో కలిపేయక ముందు హైదరాబాద్ సంస్థానం లోనివే.

అందువల్ల, సహజంగానే ఆ జిల్లాల మీద హైదరాబాద్‌కు హక్కు ఉంటుంది. ప్రభుత్వం కనక ఆ జిల్లాలను హైదరాబాద్‌లో కలిపే విధంగా ఆలోచన చేసివుంటే హైదరాబాద్ రాజ్య విభజనా జరిగివుండేది. మహారాష్ట్ర, కర్ణాటక అనే మరో రెండు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కూడా జరిగి ఉండేది. చాలా మంది సభ్యులు, హైదరాబాద్ ప్రజలే హైదరాబాద్ రాజ్య విభజనను అడ్డుకుంటున్నట్లుగా మా మీద దాడి చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మేమే అడ్డు, అన్నట్లుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక యదార్థాన్ని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను.

ఇటీవలే, రెండు వారాల క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల మున్సిపల్ కార్పొరేషన్లు, హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర రాష్ట్రానికి తాము అనుకూలమని బాహాటంగా ప్రకటించాయి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ కూడా విశాలాంధ్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. విశాలాంధ్ర ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటని తెలుగేతర భాషలు మాట్లాడే వారిలో ఆందోళన ఉన్న మాట నిజమే. కాని ఇది అర్థంలేని ఆందోళన. ఈ ప్రజాస్వామ్య దేశంలో, తెలుగు వారైనా మరే భాష వారైనా, అందరి హక్కులూ సమాన ప్రాతిపదికమీదే కాపాడబడతాయి.

ఈ సభలో అనేకమంది, హైద్రాబాద్ రాజప్రముఖ్ అయిన నిజాంను నిందిస్తూ మాట్లాడడం నాకు బాధ కల్గించింది. ఇది వారి సంకుచితత్వాన్ని బెటపెడ్తోంది. నిజాం కేవలం ఒక నామమాత్రపు అధినేత మాత్రమే. ఆయన పరిపాలకుడు కాదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నిజాం అనుభవించిన అధికారాలేమీ ఇప్పుడాయనకు లేవు. హైద్రాబాద్ రాజ్యపాలనలో ఆయన జోక్యమే లేదు. పెద్దమొత్తం భరణంగా తీసుకుంటున్నారన్న అభియోగం తప్ప నిజాంకు వ్యతిరేకంగా మరో అంశమే లేదు.

ఆ భరణం కూడా నిజాం తప్పుకాదు. భారత ప్రభుత్వానికి హైద్రాబాద్ రాజ్యానికి మధ్యజరిగిన ఒప్పంద ఫలితమది. ఒకవేళ ఆ ఒప్పందాన్ని చిత్తుకాగితంగా భావించినట్తైతే, దాన్ని చింపి పారేయండి. ఆ డబ్బు ఆపేయండి. కానీ దానికి రాజ్యాంగ సవరణ అవసరం. అంతే కానీ, ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చెడుగా మాట్లాడటం మంచిది కాదు.

ఇక ఆంధ్ర రాజధాని విషయం, భారత ప్రభుత్వం బిల్లులోనే ఆంధ్ర రాజధాని పేరు కూడా ప్రస్తావించి వుంటే, ఈ విమర్శ వచ్చి వుండేది కాదు. రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయ, ఆత్మ కూడా. ఇక హైకోర్టు విషయం, ఆస్తుల పంపకమూ ఆంధ్ర లెజిస్లేటర్లు తేల్చుకోవల్సిన విషయాలు. నేనందులో జోక్యం చేసుకోను.

1953 అక్టోబర్ 1 శుభముహూర్తాన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతోంది. వారు తెలుగువారు గానీ, కన్నడిగులు గానీ మరేభాష మాట్లాడేవారు గాని... శాంతియుతంగా జీవించమని కోరుతున్నాను. మనమంతా ఇరుగుపొరుగు వారమే... స్నేహంగా కలిసి బతకాలి. ఆఖరుగా, ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి పథంలో విజయవంతంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి అంటే భారతావని అభివృద్ధే అని మనవి చేస్తూ... శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

- డి.డి.ఇటాలియా

1953 సెప్టెంబర్ 7న రాజ్యసభలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు మద్దతు తెలుపుతూ ఇటాలియా (హైదరాబాద్) చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలివి.
(ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన "హైద్రాబాద్'' అనే వ్యాస సంపుటిలోంచి) 


https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jul/20/edit/20edit3&more=2011/jul/20/edit/editpagemain1&date=7/20/2011

తప్పు ఒప్పుకున్నట్టేనా ?

జరిగిందేదో జరిగింది. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన చిదంబరం ఒక్కరిది కాదు. దానికి సమష్టిగా బాధ్యత వహించాల్సిందే. నిజానికి... ఆరోజు నేను ఢిల్లీలో లేను. జార్ఖండ్ నుంచి తిరిగి రావడంలో 4 గంటలు ఆలస్యమైంది. నేను ఉండి ఉంటే... ప్రకటనలో మార్పు జరిగేదేమో!- ప్రణబ్ ముఖర్జీ

తెలుగు వారంతా కలిసే ఉండాలి. వారి మధ్య ఘర్షణ వాతావరణం ఉండకూడదన్నదే నా అభిప్రాయం. తెలుగు వారు సొంత రాష్ట్రం కోసం చాలాకాలం పోరాడారని నాకు తెలుసు. ప్రస్తుత సమస్యపై పరిష్కారానికి ఏడాదిన్నరగా కృషి చేస్తున్నా ఒక నిర్ణయానికి రాలేకపోవడం బాధ కలిగిస్తోంది.- చిదంబరం

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/jul/20/main/20main1&more=2011/jul/20/main/main&date=7/20/2011

అకస్మాత్తుగా అవతరించి..

వీరాజీయం- ఆంధ్ర భూమి: బంద్‌ల ఇబ్బందులు పడలేక జనం మూల్గుతున్నారు. బంద్‌వల్ల ఆర్‌టిసికి ‘పదికోట్లు’ కన్నం-అంటే, రైల్‌రోకో చేత రైల్వేకి యాభై కోట్లు నష్టం-అంటున్నారు పెద్దలు. తీతాలు-అంటే తీసేసిన తాశిల్దారు మొహాలెట్టుకుని ఇందిరా పార్కు దగ్గర నిరాహార దీక్షకు కూర్చుని-‘‘దిక్కుమాలిన సూర్యుడు నత్తనడక నడుస్తున్నాడన్నట్లు’’ రెండోరోజు దీక్షలో రెస్ట్‌లెస్‌గా ఉన్న-జానా, కేకే లాంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు- ఇందిరమ్మనీ, సోనియామాతనీ మార్చి మార్చి తల్చుకుంటుంటే-అకస్మాత్తుగా అక్కడ గులాబీ రంగు కండువాతో వూడిపడ్డాడు ....అలా అవతరించినదెవరో కాదు. వ్యూహాత్మక మవున వ్రతం దాల్చిన మహారధుడు-శ్రీమాన్ కెసిఆర్ ది గ్రేట్. గులాం నబీ ఆజాద్‌గారు సంధించిన ‘ఏకాభిప్రాయ సాధనాస్త్రం’ దెబ్బ తట్టుకోలేక ఏకంగా ‘‘్ఫర్టీ ఎయిట్ అవర్స్’’-అనగా రెండు దినములు-నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లకుండా కాపాడుకుంటూ-మాట్లాడుటకు అనగా-మీడియాతో మాత్రమే మాట్లాడుటకు తప్ప మరోరకంకగా నోరు వాడమని కూర్చున్న జానా, కె.కె లాంటి అతిరథ మాజీ మహారధులు డీలా పడివున్నారు. కేంద్రంనుంచి ‘దూతా’-గానీ, సందేశం గానీ వస్తుందేమోనని ఎదురు చూస్తున్న నాయకులంతా ఒక్కసారి-గరుత్మంతుని చూసిన పక్షుల్లాగా-లేచి, తెరాస బాస్‌ని సాదరంగా ఆహ్వానిస్తూ-అట్టి తరి వేరొండు పూల మాల గాని దండగాని లేని కతంబున -త్రివర్ణాంకిత కాంగ్రెస్ కండువాని మువ్వనె్నలు మెరియగా-మురుస్తూ-ముచ్చటగా మెడలో వేసి ఆసీనులు కండు!’’ అన్నారు.

పంజరంలోనుంచి బయటపడ్డారే గానీ-ఎగురలేని పక్షుల్లాగా అయిపోయారు వాళ్లు పాపం! రాజ్యం ఉండీ కూడా నెత్తిన కిరీటం లేకుంటే -రాజుల్నే గుర్తించని ఈ రోజుల్లో-కిరీటం మైనస్-టి.కాంగ్రెస్ నాయకుల్ని-‘‘టి ఉద్యమ’’’ నిర్మాత స్వయంగా వచ్చి, వాటేసుకుని ‘‘డోంట్ వర్రీ..బీ హ్యాపీ..నాకు సంకేతాలు వస్తున్నాయ్’’ అన్నాడట. డైలాగుల్ని రిహార్సల్స్ లేకుండా చెప్పడానికి ప్రయత్నించే పాత్రధారుల్లా కెసిఆర్ బ్యాటింగ్‌ను చూస్తూ ఉండిపోయారు వాళ్లు. ‘‘రెండు వారాల్లో మీ పార్టీ హై కమాండ్ తెలంగాణ ఏర్పాటుకు ఓ ప్రకటన చేసి తీరుతుంది’’ అన్నాడు రావు. ‘‘క్లైమాక్స్‌కి వచ్చేశాం. క్రెడిట్ మీదే అవుతుది. కొనసాగించాడు దీక్షను’’ అంటూ ప్రోత్సహించాడు.

తన సహజ పంచాంగం విప్పి సందేశామృతాన్ని ఇచ్చి నకెసిఆర్‌జీ, కాంగ్రెస్ కండువాని తన గులాబీ కండువా పక్కనే చుట్టుకుని వున్న మెడను ఓసారి రిక్కించి నిష్క్రమించగా మీడియా నారదుడికి-షడ్ర సోపేతమయిన విందు లభించినట్టుగా ఉంది. గులాంనబీని పక్కన బెట్టుండ్రీ-. ఆయన మాట వినుండ్రీ! కిరణ్‌కుమార్‌రెడ్డి మాయలో పడకుండ్రీ’’-అన్నట్లు మొహాలు పెట్టారు.... తెలంగాణ కోసం పదవులను అటు ఇటు కాని ‘త్రిశంకు నరకం’లో వ్రేలాడతీసి కూర్చున్న హేమా హేమీలు జనాల్ని ఎట్లా మెప్పించడమా? అన్న సందిగ్ధంలో పడ్డారు. దీక్ష విరమించారు.సొంత పార్టీ మనుషులు-మాజీ ‘కాంపా’ అధ్యక్షులు, మంత్రులు-సారీ, ఇంకా మాజీ కాదు కాబోలు-రాజీనామా వీరులు-వాళ్లకి ‘వెదర్ రిపోర్ట్’ అందలేదు. కాంగ్రెస్ పార్టీనుంచి క్రెడిట్ తన్నుకుపోదాం అనుకుంటున్న తెరాస నాయకుడి దగ్గరనుంచి సంకేతాలు తీసుకోవడమా? పైగా ముంబయి బాంబు పేలుళ్లలో సతమతమైపోతున్న పార్టీ అధినాయకత్వం-తక్షణం వీళ్లకు అందుబాటులో కూడా ఉండదు కదా? పోలీసుల్ని, మీడియాని తప్ప మరెవ్వరినీ పని చెయ్యకుండా తెలంగాణ ప్రాంతాన్ని స్తంభింపచేసిన-జాయింట్ యాక్షన్ కమిటీలకు కూడా కెసిఆర్ చేతిలోవున్న ముక్క-‘తురుఫు’ ముక్కా? లేక ఉత్తుత్తి ముక్కా? అన్నది తెలియడంలేదు.

ఏమిటో ఒక తెలియని స్థితిలో పడ్డాడు కెసిఆర్‌గారు కూడా- ఎట్నుంచి చూసినా, ఇప్పుడు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నది - ‘ఇబ్బందులే’ గానీ, అవి ‘బంద్‌లు’ కావు అన్న నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయ్. ఒకప్పుడు టిడిపికి చెందిన తెలంగాణ నాయకుడు నాగం-విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేసారు. ‘‘అది వాళ్లకి స్కోరింగ్ పాయింట్’’ అన్నారు కొందరు. తెలంగాణలో-‘విద్య’ చతికిలబడ్డదంటూ-‘‘ఎంతోమంది తమ పిల్లల్ని-విజయవాడ, గుంటూరులు తీసుకునిపోయి-అక్కడ నారాయణ, చైతన్య అంటూ-ఇంటర్‌మీడియట్‌లో చేర్పిస్తున్నారు’’ అన్న వార్తలు కూడా పత్రికల్ని అలరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరోబంద్-ఇంకో బంద్ అనడానికి వీలు లేనట్లుగా ఉంది జెఏసి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కాక్రూగారు-మరో న్యాయమూర్తి ఆఫ్‌జుల్ పుర్కార్‌గారూ ఉన్న ‘్ధర్మాసనం’- వారు కెసిఆర్ కోదండరామ్‌లకీ అలాగే బంద్ అనంగానే-ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మాని-రైళ్లు, బస్సులు రద్దుచేసి ప్రజల్ని నానా ఇక్కట్లకు గురి చేసినందుకు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడ ‘శ్రీముఖం’ పంపించారు. ‘‘సీమాంధ్రా వాడెవడయినా పిటిషన్ కొట్టాడా?’’ అనడిగాడు, ఓ తటస్తవాది కుతూహలంగా. ‘‘కాదు..వరంగల్ వినియోగదారుల ‘్ఫరమ్’ అధ్యక్షుడు-చక్రపాణిగారు ‘చక్రం’ సంధించాడు- అసలీ బంద్‌లు-రాజ్యాంగంలోని 21వ అధికరణానికి భంగం కలిగిస్తున్నాయ్- అని పిటిషన్‌దారుని వాదన.’’ ఆమాటకొస్తే సుప్రీంకోర్ట్-లోగడ ఒకటికి మూడుసార్లు బంద్‌లు పిలిచే రాజకీయ పార్టీల మీద ‘అక్షింతలు’ వేసింది. ‘ఆంక్షలు’ పెట్టింది.

సుప్రీంకోర్ట్ ఈజ్ బ్యాక్ ఆన్ యూ!

http://www.andhrabhoomi.net/sub-feature/veerajeeyam-308

19, జులై 2011, మంగళవారం

తెలుగు సామెతలకు సరిపోయే మన తెలంగాణా కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన

ఈ కింది సామెతలను చూస్తే మన పెద్దలు ఎంత అనుభవంతో దేశ కాలమాన పరిస్థితులు ఏవైనా, అన్వయ పరచుకొనే విధంగా ఉంటాయో మన తెలంగాణా కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనని చూసీ ఈ సామెతల అర్థం ఈ విధంగా చెప్పుకోవచ్చు.

1 .చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు. 2.తెగే వరకూ లాగకూడదు.3. దుష్టులతో/శత్రువులతో స్నేహం పాము పడగ నీడ వంటిది. 4. పెద్దల మాట వినాలి. 5. పిలవని పేరంటానికి పోరాదు. 6. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి. ఈ ఆరు సామెతలూ మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు సరిగ్గా సరిపోతాయి.

అది ఎలాగంటే:

1. చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు: మన తెలంగాణా నాయకులు ఏదో ఒక ప్రలోభానికి లేదా ఒక నాయకుడి చెప్పుడు మాటలు విని ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా రాజీనామాలు చేసి పారేసారు. ఇప్పుడు వీరి పని ఏమి చేయాలో ఏమిటో తెలియని అయోమయ స్థితి లో పడ్డారు. ఈ విధంగా ఒక స్వార్థ నాయకుడి మాటలు విని చెడిపోయారు.

2. తెగేవరకూ లాగ కూడదు: ఈ నాయకులు గత ఐదు, ఆరు నెలల నుండి మేము రాజీనామాలు చేయడానికి సిద్ధం, రాజీనామాలు చేసేస్తాం, చేయబోతున్నాం, ఇంక ఈ ఆలస్యాన్ని భరించలేము, తొందరగా తెలంగాణా ప్రకటిస్తారా లేదా రాజీనామా చేసి మా దారి చూసుకోమంటారా, ఇత్యాది ప్రశ్నలతో బెదిరింపులతో వారి పార్టీ హై కమాండ్ ని రోజుకో బెదిరింపుతో, ప్రకటనతో ఊదరగోడితే ఆఖరికి అన్యాపదేశంగా కాంగ్రెస్ హై కమాండ్ మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అనే విధంగా ప్రవర్తించాల్సిన అగత్యాన్ని పట్టించారు. దీనినే అంటారు తెగే దాకా దేనినీ లాగ కూడదు. ఈ విషయం మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు చాలా ఆలస్యంగా ప్రబోధం అయింది.

3. దుష్టులతో/శతృవులతో స్నేహం పాము పడగ నీడ వంటిది: మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు అన్ని పార్టీలు తెలంగాణా తెలుగుదేశం తో సహా తమ శతృవు అయిన టీ ఆర్ ఎస్ పార్టీ యొక్క విషపుటాలోచనలు అంటే తన పార్టీని పటిష్టం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నదని కాంగ్రెస్ హై కమాండ్ మరియూ ఇతర పార్టీల నాయకులు నెత్తీ, నోరూ కొట్టుకొని చెప్పినా వినిపించుకోకుండా రాజీనామాలు చేసి పారేసారు. ఆ తర్వాతా తామేదో గొప్ప ఘనకార్యాన్ని సాధించామని ఢిల్లీ వెడితే అక్కడి నాయకులు వీళ్ళని హీనంగా చూసీ మీ నాయకుడు కేసీఆర్ కదా అనే అర్థం లో అవహేళన చేసారు. తీరా హైదరాబాద్ చేరుకోన్నాక చూస్తే అప్పటికే ఆయన గారు తన ఇంటి పనిమనిషి లాంటి ప్రొ. కోదండ రామ రెడ్డి గారితో కలిసి తన విషాన్ని వేరే విధంగా అంటే కొత్త ఆందోళనల షెడ్యూల్ తయారుచేసి, కనీసం వీళ్లు చేసిన త్యాగాలను కూడా తలవకుండా, తన ఇష్టం వచ్చినట్లు ప్రకటించడం జరిగింది. అంటే వీళ్లు శతృవు తో స్నేహం చేసి నష్ట పోయారన్నమాట. ఇంకా చెప్పాలంటే వీరి 48 గంటల దీక్షని 36 గంటలకు కుదించి దాని విరమణ మహోత్సవానికి టీఆరెస్ నాయకులు శ్రీ కేసీఆర్ గారు విచ్చేసి వీరు ఏర్పాటు చేసిన వేదిక మీదనే వీళ్ళెంత మూర్ఖ శిఖామణులో ఋజువు చేసి తన విషాన్ని కక్కి పోయాడు. అంటే వీరి డబ్బుతో వీళ్ళని పోగిడినట్లుగా మాట్లాడి తాను శతృవునే కానీ మితృడుని కాదు అని నిరూపించి మరీ పోయాడు.

4. పెద్దల మాట వినాలి: ఢిల్లీ లోని కాంగ్రెస్ పెద్దలు మీరు రాజీనాలు చేయాలని తొందర పడొద్దు అని ఎన్నో సార్లు ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకులకి చిన్న పిల్లలకు చెప్పినట్లుగా అంటే తల్లిదండ్రులు, ఇంటిలోని పెద్దవారు చిన్న పిల్లలకు ఫలానా పని చేయొద్దని చెప్పిన విధంగా నచ్చ చెప్పారు. కానీ అనవసర ప్రలోభానికి లోనై, ఒక రకమయిన బ్లాక్ మెయిల్ కి లొంగి రాజీనామాలని సమర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దల కోపాన్ని చవిగోన్నారు. అంటే పెద్దల మాట వినని దానికి ఫలితం అనుభవిస్తున్నారు.

5. పిలవని పేరంటానికి పోరాదు: ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఒకటికి పది సార్లు వారి హై కమాండ్ పిలిచినా పిలవక పోయినా ఢిల్లీ కి పోయి వారి మీద ప్రత్యెక తెలంగాణా కి సానుకూల ప్రకటన కోసం వత్తిడి చేయడం ప్రారంభించారు. వీరికి శ్రీ జైపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఆ విధంగా చేయవద్దని చెప్పినా వినకుండా పోయి ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం మాదిరి చేసారు. దానితో పై వారి దృష్టిలో చులకన అయిపోయారు. వీళ్లు ఆఖరుసారి రాజీనామాలు చేసి కాంగ్రెస్ హై కమాండ్ పిలవకపోయినా వారి గుమ్మాల లోకి వెళ్ళిన వెంటనే దక్ష ప్రజాపతి పుత్రిక శచీదేవికి జరిగిన విధంగా అవమానం పొంది తిరిగివచ్చారు. అనగా పిలవని పేరంటానికి పోయిన విధంగా వీళ్లు వెళ్లారనే కదా అర్థం.

6. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి: ఈ బ్లాగు రాయడానికి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ హై కమాండ్ సీమాంధ్ర నేతలతో బాటు మన తెలంగాణా నాయకులను కూడా ఢిల్లీ రమ్మనమని శ్రీ ఆజాద్ ద్వారా కబురుపెడితే, సీమాంధ్రులు తాము తప్పకుండా వస్తామని సమాధానము చెప్పి, ఆ తర్వాత మిగిలిన హై కమాండ్ నేతలను మరియూ ప్రధాన మంత్రి ని కలవడానికి వారి అనుమతులు సంపాదించుకొంటే, మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం శ్రీ ఆజాద్ తమని అవమానము చేసారని మేము ఢిల్లీ కి పోమని తమ లింగు, లిటుకుమంటూ ఉన్న స్టీరింగ్ కమిటీలో ఒక తీర్మానం చేసి దానికి తగిన విధంగా ఢిల్లీ కబురు పంపారు. దానితో హై కమాండ్ ఈ నాయకులను తమదైన శైలిలో ఫోన్లో ఆజాద్ తో చెప్పిస్తే ఇప్పుడు మేము మీటింగుకు వెడతామని చెబుతున్నారు. అంటే వీళ్లు ముద్దోచ్చినప్పుడు చంకను ఎక్కరు. అవతలివాడు వీరిని రెండు తిడితేగాని లేదా బెదిరిస్తే కానీ వీళ్లు దారిలోకి రారు.

అందుచేత పైన చెప్పిన సామెతలకు అనుగుణంగానే మన తెలంగాణా నాయకుల ప్రవర్తన ఉంది అనేది కాదనలేని కఠోర సత్యం.