18, సెప్టెంబర్ 2013, బుధవారం

హైదరాబాద్ విమోచన విశాలాంధ్ర ఏర్పాటుకు తొలిమెట్టు!


నిజాం పరిపాలననుండి హైదరాబాద్ విముక్తి తెలుగువారి రాష్ట్రం "ఆంధ్రప్రదేశ్" ఏర్పాటుకు తొలిమెట్టుగా భావించవచ్చు. ఈనాడు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నప్పుడు ఆనాడే దేశసరిహద్దులకు అతీతంగా నైజాం తెలంగాణా, మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారి మధ్య వెల్లివిరిసిన సౌభాతృత్వాన్ని స్మరించుకోవలసిన అవసరం ఎంతయినా వుంది. తెలంగాణా సాయుధపోరాటంలో పాల్గొని,నాయకత్వ పాత్రను పోషించి, తెలంగాణా సాయుధపోరాట చరిత్రని రచించిన పుచ్చపల్లి సుందరయ్య గారి మాటలలో

(Excerpts from Telangana People's Struggle and its lessons)
It was to the credit of our Party, to our Andhra unit, that it guided the Telangana anti-feudal and anti-Nizam struggle from 1940 to 1946 and converted the Andhra Mahasabha into a united mass organisation and front of all anti-Nizam people’s forces. It won the confidence of the people, became the leader of this front and organisation; it popularized the struggle of the Telangana people, the idea of Vishalandhra, mobilised wide-scale support to the fighting Telangana peasantry. It provided shelter and help to the cadre and people under the Nizam’s attacks, in the coastal areas. It made the coastal districts the rear of this Telangana people’s movement.

The people, all sections, in the Andhra areas, gave massive support to this state people’s movement. We could collect in two or three days in just the one town of Vijayawada Rs. 20,000 for providing arms for fighting the Razakars and the Nizam.
http://books.google.co.in/books?id=TPjIh1G0TmcC

12, సెప్టెంబర్ 2013, గురువారం

మేలుకో కావూరి మేలుకో!


నిరసన పత్రం


గౌరవనీయులు శ్రీ కావూరి సాంబశివరావు
కేంద్ర మంత్రివర్యులు

ఆర్య,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదన అమలయితే అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు నష్టపోతారు. మన రాష్ట్ర విభజన దేశవ్యాప్తంగా ఎన్ని విపరిమాణాలకు, విభజనలకు, విద్వేషాలకు, విధ్వంసాలకు, దారి తీస్తుందో మీకు ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. 

కేంద్రంలో మంత్రి పదవి చేపట్టక ముందు, తమరే సహీతుకంగా చాటి చెప్పిన సమైక్య వాదనలు ప్రజలు మరిచిపోలేదు. సమైక్యవాద ప్రవక్తగా, ఐక్యతా ఆశాజ్యోతిగా, మిమ్మల్ని నిన్న మొన్నటి వరకు, నెత్తిన పెట్టుకున్న ప్రజలే నేడు ఎందుకు కత్తి దూస్తున్నారో, ఎందుకు దూషిస్తున్నారో మీరు గుర్తించాలి. మీ వర్తమాన ప్రవర్తన, పదవీ వ్యామోహం, గతంలో ఎంతగానో అభిమానించిన వారందరిలో మీ పట్ల విముఖతను ఆగ్రహాన్ని పెంచాయి.

దళపతిగా వ్యవహరించిన మిమ్మల్ని బుట్టలో వేసుకుంటే సమైక్య సమరం చతికిలబడిపోతుందని అంచనా వేసారు ఢిల్లీ పెద్దలు. ఆ కుట్రలు నేడు వమ్ము అయిపోయాయి. ఈ రోజు నాయకులు లేకుండానే కోట్లాది సామాన్య ప్రజలు సమైక్య సమరంలో అలుపెరుగని వీరుల్లా పోరాడుతున్నారు.

కాబట్టి కావూరి వారు, ఇప్పటికయినా తమరు అంతరాత్మ ప్రబోధానికనుగుణంగా తక్షణం కేంద్రంలోని మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సమైక్యతకు పాటు పడవలసిందిగా అభ్యర్ధిస్తున్నాం. మీ రాజీనామా ఇతర సహచర తెలుగు కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు మార్గదర్శకం అవుతుంది. రాజీనామా చేసి రాష్ట్ర సమగ్రతను తద్వారా దేశ సమైక్యతను కాపాడండి.

సమైక్య ఉద్యమానికి మీ పెదవి సానుభూతి చాలదు. మీ పదవీ త్యాగం కావాలి.

నలమోతుచక్రవర్తి
అధ్యక్షులు
విశాలాంధ్ర మహాసభ

4, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడవలసిందిగా భారత రాష్ట్రపతి గారిని కోరుతూ తీర్మానం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం, ఆ దరిమిలా రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరలో ప్ర్రారంభిస్తామని రాజ్యసభ లో ప్రభుత్వం తరపున ప్రకటన రావడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

మేము దీనిని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాము.

రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణా ప్రాంతం లో కొంత మంది లేవదీసిన ఆందోళన అసత్యాల మీద, అపోహలమీద, అర్ధ సత్యాల మీద, వక్రీకరణల మీద, ద్వేష భావన మీద ఆధారపడి నిర్మాణ మయినది. ఈ ఆందోళనకు ప్రాతిపదిక లేదు. చరిత్రను వక్రీకరించి, ఆర్ధిక గణాంకాలను దాచిపెట్టి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకులు పనిగట్టుకుని నడిపిన ఆందోళన ఇది. ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లేదు. 2004 నుండి జరిగిన సాధారణ ఎన్నికల నుండి మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల వరకు వెల్లడైన ఫలితాలు ఇందుకు బలమైన నిదర్శనాలు. ఉద్వేగ భరిత వాతావరణం లో జరిగిన కొన్ని ఉపఎన్నికల ఫలితాలు మినహా, రాష్ట్ర విభజనకు విస్తృత మద్దతు ఉన్నదనడానికి ఎలాంటి దాఖలాలు లేవు.

తెలుగు ప్రజలు అందరూ ఒకే పాలన కిందకు రావాలని, స్వరాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనీ దశాబ్దాలుగా జరిగిన ఉద్యమాల ఫలితం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 1956 లో ఏర్పడింది. అనేక మంది నాయకులు సుదీర్ఘ కాలం తెలుగు జాతి ఐక్యతకు కఠోర మైన తపస్సు చేసి సాధించుకున్న భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.

తెలుగు జాతి ఐక్యత కేవలం కొంత మంది స్వార్ధ శక్తుల కుట్రలకు, అసత్యాలకు, అర్ధసత్యాలకు, వక్రీకరణలకు బలికాకూడదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఆలోచనను, ప్రతిపాదనను భారత ప్రభుత్వం తక్షణం వెనక్కు తీసుకోవాలని కోరుతూ మా పంచాయితీ సభ్యులందరం ఏకగ్రీవం గా తీర్మానించాము.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడ వలసినదిగా భారత రాష్ట్ర పతి గారిని కోరుతూ ఏకగ్రీవం గా ఈ తీర్మానం చేయడమైనది.    

సమైక్యాంధ్ర ఉద్యమకారులారా రాజకీయనాయకులతో జాగ్రత్త!

కోస్తా, రాయలసీమ ప్రజలు గత నెల రోజులుగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమించారు. ప్రజలలో వచ్చిన ఈ అనూహ్య చైతన్యాన్ని గమనించిన రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాలలో తమ అస్తిత్వాన్ని కోల్పాతామేమో అనే భయంతో, యాత్రల పర్వం మొదలు పెట్టాయి. ఈ నేపధ్యంలో వచ్చినవే చంద్రబాబు చేస్తున్న ఆత్మ గౌరవ యాత్ర, షర్మిల సమైక్య శంఖారావం.

వై.కా.పా.నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని విభజించినా పర్వాలేదు, సమ న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. అదే పార్టీ ఈ రోజు సమైక్యవాదం వినిపిస్తున్నది. తెలుగు దేశం పార్టీ ఇప్పటికీ రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉన్నది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన పై తన అభిప్రాయాన్ని మార్చుకుని, కేంద్రానికి మళ్ళీ లేఖ రాసి ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని మహాసభ కోరుతోంది.

మన రాష్ట్రంలో విభజన పోకడలకు మూల కారణం రాజకీయ పార్టీలు. తమ వోట్ల రాజకీయాలకు తెలుగు జాతి ఐక్యతను తాకట్టు పెట్టిన ఈ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాల్సిందిగా విశాలాంధ్ర మహాసభ విజ్ఞప్తి చేస్తోంది. ఓట్లకోసం , సీట్ల కోసం నాడు రాష్ట్ర విభజనకు అంగీకరించి తప్పు చేసామని పార్టీలు బహిరంగంగా ప్రకటించాలని మహాసభ డిమాండ్ చేస్తోంది. ఎటు గాలి వీస్తే అటు తిరిగే గాలివాటం రాజకీయాలను మానుకోవాలని మహాసభ పిలుపునిస్తున్నది. 

రాజకీయ పార్టీలు చేస్తున్న యాత్రలను చూసి ప్రజలు మోసపోవద్దని విశాలాంధ్ర మహాసభ కోరుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఒక శాంతియుత ధర్మ యుద్ధం. ఈ ప్రజా ఉద్యమం రాజకీయాలకి అతీతంగా జరుగుతోంది. తెలుగు జాతిని మోసం చేసిన రాజకీయ పార్టీలకి ఈ ఉద్యమ నాయకత్వాన్ని అప్పచెబితే మనకు మళ్ళీ వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి రాజకీయ నాయకుల యాత్రల పరంపర నేపధ్యంలో, సమైక్యవాద ఉద్యమకారులు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విశాలాంధ్ర మహాసభ విజ్ఞ్యప్తి చేస్తోంది.

నలమోతుచక్రవర్తి                                                                                    పరకాలప్రభాకర్    
అధ్యక్షులు                                                                                             ప్రధానకార్యదర్శి