28, డిసెంబర్ 2013, శనివారం

రాష్ట్ర విభజన ప్రక్రియ – సమాఖ్య స్ఫూర్తి


విశాలాంధ్ర మహాసభ డిసెంబర్ 28 2013న “రాష్ట్ర విభజన ప్రక్రియ – సమాఖ్య స్ఫూర్తి” అన్న అంశంపై సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు కి సమతా పార్టీ జాతీయ అధ్యక్షులు వి వి కృష్ణా రావు అధ్యక్షత వహించారు.ఈ సదస్సులో పాల్గొన్నవారు: డా. జయప్రకాష్ నారాయణ్ (లోక్ సత్తా), జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, సి. ఆంజనేయ రెడ్డి (మాజీ డిజిపీ), సతీష్ గల్లా (సుప్రీం కోర్టు న్యాయవాది), ఏ.బి.కే. ప్రసాద్ (పాత్రికేయులు), చందా లింగయ్య దొర (గిరిజన నాయకులు), ఎన్. తులసి రెడ్డి (కాంగ్రెస్), డా. ఎమ్.వి. మైసూరా రెడ్డి (వైకాపా), సయద్ జాఫ్రి (ఎంఐఎం), ఆచార్య ఏ. మురళి, కే. రవీంద్ర (న్యాయవాది), కే. నారాయణ రావు (తేదేప), ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (తేదేప).





సదస్సులో పాల్గొన్న వక్తలు, మేధావులు అందరూ, దిగువ ఉన్న అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసారు.
  • భారతదేశ చరిత్రలో కొత్త రాష్ట్రాల ఆవిర్భావం మాతృ రాష్ట్రాల అంగీకారం లేకుండా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్న విభజన ప్రక్రియ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుంది (డా. జే.పీ. నారాయణ)
  • రాష్ట్ర అసెంబ్లీ విభజనను వ్యతిరేకిస్తే, రాష్ట్రపతి విభజనను ఆపవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది (డా. జే.పీ. నారాయణ)
  • రాజ్యాంగ సభలో మాట్లాడుతూ డా. అంబేద్కర్ స్పష్టంగా రాష్ట్రాల పునర్విభజన విషయంలో ఆర్టికల్ 3ని కేంద్ర ప్రభుత్వం అనివార్య, అత్యవసర పరిస్తితులలో మాత్రమే వినియోగించాలని చెప్పారు. ఆ స్పూర్తికి విరుద్ధంగా నేడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
  • భారత దేశంలో మూడు దశల ప్రభుత్వ యంత్రాగం ఉన్నది: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతి రాజ్. సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా పంచాయతి రాజ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చెయ్యటం మూలంగా ఈ రోజు విభజనోద్యమం తెర మీదకి వచ్చింది (సి. ఆంజనేయ రెడ్డి)
  • గతంలో జరిగిన రాష్ట్ర విభజనలలో పాటించబడిన విధానాలను, సాంప్రదాయాలను విస్మరిస్తోంది.
  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకం కావున దీనిని సవరించటం దేశ సమగ్రతకు అవసరం. మాతృ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కాకుండా ఆమోదం అవసరమయ్యే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలి. (ఏ. బి. కే. ప్రసాద్)
  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాసన సభ్యులను సామ, దాన, దండోపాయాల ద్వారా బిల్లుకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది (డా. మైసూరా రెడ్డి)
  • రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుపై వోటింగ్ జరగాలి (డా. మైసూరా రెడ్డి)
  • రాష్ట్ర శాసనసభలోగాని, పార్లమెంట్ లో గాని కనీసం మూడింట రెండొంతుల ఆధిక్యత తోనే రాష్ట్రాల పునర్విభజనలు జరిగే విధంగా రాజ్యాంగ సవరణ చెయ్యాలి. (జస్టిస్ లక్ష్మన్ రెడ్డి)
  • ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ దాదాపు లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు. అయితే విభజన జరిగితే 60% బడ్జెట్ కోస్త-రాయలసీమకు ఉండే అవకాశం లేదు. (సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి)
  • కేంద్ర ప్రభుత్వం రాజకీయావసరాలకోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగిస్తోంది (జస్టిస్ లక్ష్మన్ రెడ్డి)
  • ముసాయిదా బిల్లులో ఆబ్జెక్ట్ స్ అండ్ రీసన్స్ లేకపోవటం చాలా తప్పు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మొదలవ్వాలి. ఈ సంప్రదాయాన్ని విస్మరించటం దేశ సమగ్రతకు నష్టదాయకం (జస్టిస్ లక్ష్మన్ రెడ్డి)
  • ఈ రోజు ముసాయిదా బిల్లుని అసెంబ్లీలో ఓడిస్తే, రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయినట్లే. అసెంబ్లీ వ్యతిరేకించే బిల్లుని రాష్ట్రపతి పార్లమెంట్ కు పంపించే అవకాశం లేదు (తులసి రెడ్డి)
  • ఎం.ఐ.ఎం. ముసాయిదా బిల్లుని అసెంబ్లీలో, పార్లమెంట్ లో వ్యతిరేకిస్తుంది. (సయద్ జాఫ్రి)
  • ఉమ్మడి రాజధాని, గవర్నర్ కి ఇచ్చిన ప్రత్యెక శక్తులు, 371-D ని ముసాయిదా బిల్లు సవరించే పధ్ధతి రాజ్యాంగ విరుద్ధం. ఈ మొత్తం బిల్లుని తిరిగి రాయాల్సిన అవసరం ఉంది (సయద్ జాఫ్రి)
  • హైదరాబాద్ నగర శాంతి భద్రత అధికారాలు గవర్నర్ కి ఏ రాజ్యాంగ అధికరణ ద్వారా లభించాయి?
  • కేంద్ర ప్రభుత్వం చట్టాల ద్వారా ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి విద్యుత్ కొనుగోలు చెయ్యాలని నిర్బందిచంగలదా?
  • పది కోట్ల గిరిజనులు ఉన్నారు భారత దేశంలో. గిరిజనులకు వారి స్వంత భాష ఉంది. కాబట్టి వారికి మన్నే సీమ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది (చందా లింగయ్య దొర)
  • కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లు తీసుకువచ్చే ముందు 18,000 వేల ఈమెయిలు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు? (కే. రవీంద్ర)
  • ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య వచ్చే నదీ జలాల వివాదాలను అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచాలని బిల్లులో ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. నదీ జలాల వివాదం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ ద్వారానే పరిష్కరించ వచ్చు (కే. రవీంద్ర)
ఈ సదస్సులో విశాలాంధ్ర మహాసభ నాయకులు కే. శ్రీనివాస్ రెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, కే. జగదీష్, పదిరి రవితేజ, భాగ్యలక్ష్మి, కరుణాకర్, పాల్గొన్నారు.

19, అక్టోబర్ 2013, శనివారం

హైదరాబాద్ తెలుగు ప్రజలందరి సొత్తు!

చార్మినార్ పునాదులు పడక ముందు నుండే గోల్కొండ ఖజానాకు ప్రతీయేటా తీరాంధ్ర ప్రాంతాల నుండి హెచ్చుమొత్తంలో ధనరాసులు తరలివెళ్లాయన్నది ఎంత నిజమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి తెలుగు ప్రజలు అందరూ ప్రాంతాలతో నిమిత్తం లేకుండా పాటుపడ్డారన్నది అంతే నిజం.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కొన్ని రోజులకు ముందే సెప్టెంబర్ 10,1956న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ద్వితీయ ప్రణాళిక మొత్తంలో వేరే పద్దుల్లో కోత పెట్టి 152 లక్షల రూపాయలు వెచ్చించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ ద్వితీయ ప్రణాళిక మొత్తంలో 76 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు.అప్పటినుండి ఇప్పటివరకూ వెచ్చించిన మొత్తానికి రూపాయి విలువకనుగుణంగా లెక్కలు తేల్చి చెప్పడం ఎవరి తరం?ఈనాడు భాషాసంస్కృతులే కాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ఏకీకృతమైన ప్రాంతాలను బలవంతంగా ఎలా విడదీస్తారు. ఆ తర్వాత తలెత్తే పరిణామాలకు ఎవరు భాద్యులు?



విభజనవాద నాయకులు హైదరాబాద్ మహానగరాన్ని బంగారుగుడ్లు పెట్టే బాతులా చూడబట్టే ఈ రోజు మన రాష్ట్రంలో ఈ విభజనవాద చిచ్చు రగిలిందేమో అని అనిపిస్తుంది. వారు ఇన్నాళ్ళు తాము ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమి చేసారు?ఏమి చేయబోతున్నారు?ఇతర ప్రాంతాల ప్రజలను అన్యాయంగా దొంగలు అంటూ మోసపూరిత వాగ్దానాలతో వారిని ఎంత కాలం ఏమార్చుతారు?

16, అక్టోబర్ 2013, బుధవారం

'విశాలాంధ్ర మహాసభ' పత్రికా ప్రకటన, అక్టోబర్ 16, 2013


విశాలాంధ్ర మహాసభ కేంద్ర మంత్రులు కిల్లి క్రుపారాణి, దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు విభజనను వ్యతిరేకిస్తామన్న మంత్రులు ఇప్పుడు మాట మార్చటం సోనియా గాంధీకి అమ్ముడుపోయారనటానికి నిదర్శనం.

ఈ రోజు తెలుగు ప్రజల భవిష్యత్తు విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎం. పీ. ల, ఎం. ఎల్. ఏ. ల పాత్ర నిరర్ధకం, శూన్యం అయిపొయింది. వారందరినీ సాంఘికంగా బహిష్కరించి వారి ఉనికిని గుర్తించటానికి నిరాకరించాలి.

యుపీఏ నియమించిన ఆంథోని కమిటీ మన రాష్ట్రానికి రానే రాలేదు. ఆ కమిటీ రిపోర్ట్ తయారు కాకముందే, కేంద్ర ప్రభుత్వ కాబినెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన టేబుల్ నోట్ ద్వారా పెట్టటం ద్వారా అన్ని ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది.

కేంద్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర విభజన మంత్రుల కమిటీ ప్రజలు, నాయకుల సూచనలు మన రాష్ట్రానికి వచ్చి తీసుకుంటుందని చెప్పటం జరిగింది. కాని నేడు కేవలం ఈమెయిలు ద్వారా ప్రజలు తమ సూచనలు పంపించాలని ప్రభుత్వం కోరింది. అంటే సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులను ఈ ప్రక్రియనుంచి దూరం పెట్టినట్లే. ఇదేమి ప్రజాస్వామ్యం?

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు శాతం ప్రజానీకం విభజనకు వ్యతిరేకం. తెలంగాణాలో కూడా గణనీయమయిన సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారు. కేవలం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొద్ది స్థానాల్లో గెలుపొండటానికి ప్రజస్వామ్యాన్నే ఖూనీ చేసే ప్రయత్నం దేశ సమగ్రతకు ఎనలేని హాని చేకూరుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లుని ముందుకు తీసుకుపోవటానికి శాయశక్తులా కృషిచేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని ఇతర వర్గాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

విజయనగరంలో కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ప్రజల మౌలిక హక్కులను కాలరాసే విధంగా కర్ఫ్యూ విధించి ఉద్యమకారులని, ముఖ్యంగా విద్యార్థులని పోలీసులు మరియు రాజకీయ నాయకుల అనుచరులు వేదించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

AP NRI Forum ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సదస్సు


Dear Telugu NRI,
Over two months, millions of people in Andhra Pradesh have been relentlessly standing against injustice done by Government of India to our Telugu People, yet Telugu People in USA are turning their back to fellow brothers and sisters. Many in US are talking about it, some are publicly debating, but only handful are trying to make a difference. Telugu people, historically, have always been actively promoting culture and social integration and doing charity at home?by establishing great organizations locally and nationally. These people and their organizations are doing great service to Telugu community. When need of the hour comes, it is quite surprising to see that these renowned organizations and its members and supporters failed to respond to this heinous divisional issue. Even more astonishing fact is that they did not even show basic emotion and could not call for unity. Rational people would agree that division of AP would lead to division of Telugu people across?the world because of the way division of the state is being progressed. Bitter feelings and deep animosity will prevail among Telugu communities for generations ahead.
We still have time to reverse the damage that is being caused to our great Telugu Jaathi.
Please come out and do the right thing i.e. STOP DIVISON and PROMOTE INTEGRATION.
Join your hands with those who have been struggling to fight with destroyers of Telugu Jaathi.
Support your brothers and sisters in Andhra Pradesh.
To donate and support please visit?http://andhrapradeshnri.org/

Please check out our upcoming historic ?Occupy Delhi? event at
http://andhrapradeshnri.org/?page_id=45
Jai Hind!! Jai Telugu Jaathi!! Jai Samaikhyandhra!!
Team
ANDHRA PRADESH NRI FORUM


Samikhyandhra Event in New Jersey
Dakshin Restaurant, 675 US-1 & Grill Ln, Iselin, NJ 08830
Saturday October 19,2013 from 3:00 PM EDT to 6:00 PM EDT




13, అక్టోబర్ 2013, ఆదివారం

బూర్గుల గారి త్యాగం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయం !


'ఆంధ్ర ప్రదేశ్ నాయకుని ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం మంచిది' , విశాలాంధ్ర పత్రిక ( 01/09/1956)



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం శ్రేయస్కరమని తానూ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికీ, ఉప ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారికీ సలహా ఇచ్చినట్లు హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు నేడిక్కడ విలేఖరులతో చెప్పారు. ఆ సంధర్బంలో ఆయన ఇలా ఒక ప్రకటన చేశారు.

"ఆంధ్ర-తెలంగాణాల లీనీకరణ జరుగుతున్న ఈ సమయంలో నాయకత్వానికి పోటీ గాని, తగాదాగాని ఏర్పట్డం శాశ్వత విభేదాలకు దారి తీస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిదికాదు అని నా నిశ్చితాభిప్రాయం. కాబట్టి ఐక్యతకు దోహదమిచ్చే వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆంధ్రప్రదేశ్ నాయకుని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొనేటట్లు చేయడానికి నా పలుకుబడిని వినియోగించాలని సంకల్పించాను. ఇక్కడ ఆంధ్రలోని మిత్రులందరికీ ఈ నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను.ఆంధ్రులు ఒక త్రాటిపై నడవడానికి ఒక మార్గం అన్వేషిస్తారనే నా నమ్మకం."

ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తానూ వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయ నిశ్చయించినట్లు చెప్పారు. రెండు వర్గాలవారు ఈ మధ్యకాలంలో మీరే ముఖ్యమంత్రిగా వుండండని కోరితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా తానూ ముఖ్యమంత్రిగా వుండాలని కోరడం లేదని ఆయన సమాధానం చెప్పారు.అదీకాక అలాంటి ప్రతిపాదనను తానింతవరకు వినలేదని కూడా చెప్పారు. నాయకత్వానికి సంతకాల సేకరణ సరియైన పద్ధతికాదని కూడా ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నాయకత్వం విషయంలో జోక్యం కలిగించుకొమ్మని కాంగ్రెసు అధిష్టాన వర్గానికి మీరు రాశారా అని ప్రశ్నించగా అలా రాయడం సరికాదనీ తానూ రాయలేదని శ్రీ రామకృష్ణారావుగారు చెప్పారు.

ఈ రోజు ఆయన గోపాలరెడ్డి, సంజీవరెడ్డి గార్లను వేర్వేరుగా కలుసుకొని వారితో మాట్లాడారు.నాయకత్వ సమస్యపైనే వారితో చర్చించినట్లు ఆయన చెప్పారు.

Also Read: ఢిల్లీ ముఖ్యమంత్రుల సదస్సు ( 22,23 అక్టోబర్,1955)లో విశాలాంధ్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు.http://visalandhra.blogspot.in/2011/11/blog-post_02.html

'నేను మొదటినుంచీ విశాలాంధ్ర ఏర్పాటును కోరుకున్నాను' : బూర్గుల
http://visalandhra.blogspot.in/2011/11/blog-post_5378.html

9, అక్టోబర్ 2013, బుధవారం

నాటి గజ్వేల్ శాసనసభ్యుని నోటి మాట: ప్రత్యేక తెలంగాణవాదన ద్వారా ఫ్యూడల్ వ్యవస్థ తలెత్తే ప్రయత్నం జరుగుతున్నది

హైదరాబాద్ అసెంబ్లీలో 1955 నవంబర్ 25నుంచి డిసెంబర్ 3 దాకా తొమ్మిదిరోజులపాటు విశాలాంధ్రపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.ఆ సమయంలో పెండెం వాసుదేవ్, గజ్వేల్ శాసనసభ్యులు , ఫ్యూడల్ వ్యవస్థ వారసులైన కొంతమంది విభజనవాదులను ఈ విధంగా తూర్పూరపట్టారు 

" బయటినుంచి ఆంధ్రులు వచ్చి హైదరాబాద్‌లోని తెలంగాణవారిమీద పడి దోచుకుంటారని, వారిపైన పెత్తనం చెలాయిస్తారని ఆలోచించే బదులు అసలు కారణాల్ని గ్రహించాలి... ఇప్పుడిప్పుడే మనం ఫ్యూడల్ సమాజంలోనుంచి బయటపడుతున్నాం. పోలీసుయాక్షన్ వరకు మనం బానిసల్లాగా ఎలాంటి పౌరహక్కులు లేకుండా అణచబడి ఉన్నాం. హైదరాబాద్ చరిత్రలో పెద్దమార్పు వచ్చి మనం స్వేచ్ఛావాయువులను పీల్చే సమయంలో తిరిగి మళ్ళీ పాతకాలం నాటి జాగీర్దారీ వాసనలు ఏర్పడి, ఫ్యూడల్ వ్యవస్థ తలెత్తే ప్రయత్నం జరుగుతున్నది... అది ప్రత్యేక తెలంగాణవాదనద్వారా జరుగుతున్నది.

పోలీసుయాక్షన్ పూర్వం మా భువనగిరిలో కూచిరెడ్డికి ఇల్లుకూడా లేదు. ఈ రోజున 24 గంటలూ కార్లలో తిరుగుతున్నారు. సీతాఫల్‌మండిలో ఒక ఇల్లుకూడా కొన్నారు. వీరు పోలీసువారి వెనక దాక్కొని లూటీలుచేసి బాగా సంపాదించి పోలీసువారి దొంగతనాల్లో వాటా తెచ్చుకుని పంచుకున్న పెద్దమనిషి. ఆయన ఇవాళ తెలంగాణ కావాలంటున్నారు. వీరి పెత్తనం మనకు కావాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిని కప్పిపుచ్చుకోవటానికి వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నారు..."  
http://andhrabhoomi.net/content/telugu-tagavu-6


చదవండి : విశాలాంధ్ర ఏర్పాటుకే మొగ్గు చూపిన హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ (డిసెంబర్,1955) 

18, సెప్టెంబర్ 2013, బుధవారం

హైదరాబాద్ విమోచన విశాలాంధ్ర ఏర్పాటుకు తొలిమెట్టు!


నిజాం పరిపాలననుండి హైదరాబాద్ విముక్తి తెలుగువారి రాష్ట్రం "ఆంధ్రప్రదేశ్" ఏర్పాటుకు తొలిమెట్టుగా భావించవచ్చు. ఈనాడు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నప్పుడు ఆనాడే దేశసరిహద్దులకు అతీతంగా నైజాం తెలంగాణా, మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారి మధ్య వెల్లివిరిసిన సౌభాతృత్వాన్ని స్మరించుకోవలసిన అవసరం ఎంతయినా వుంది. తెలంగాణా సాయుధపోరాటంలో పాల్గొని,నాయకత్వ పాత్రను పోషించి, తెలంగాణా సాయుధపోరాట చరిత్రని రచించిన పుచ్చపల్లి సుందరయ్య గారి మాటలలో

(Excerpts from Telangana People's Struggle and its lessons)
It was to the credit of our Party, to our Andhra unit, that it guided the Telangana anti-feudal and anti-Nizam struggle from 1940 to 1946 and converted the Andhra Mahasabha into a united mass organisation and front of all anti-Nizam people’s forces. It won the confidence of the people, became the leader of this front and organisation; it popularized the struggle of the Telangana people, the idea of Vishalandhra, mobilised wide-scale support to the fighting Telangana peasantry. It provided shelter and help to the cadre and people under the Nizam’s attacks, in the coastal areas. It made the coastal districts the rear of this Telangana people’s movement.

The people, all sections, in the Andhra areas, gave massive support to this state people’s movement. We could collect in two or three days in just the one town of Vijayawada Rs. 20,000 for providing arms for fighting the Razakars and the Nizam.
http://books.google.co.in/books?id=TPjIh1G0TmcC

12, సెప్టెంబర్ 2013, గురువారం

మేలుకో కావూరి మేలుకో!


నిరసన పత్రం


గౌరవనీయులు శ్రీ కావూరి సాంబశివరావు
కేంద్ర మంత్రివర్యులు

ఆర్య,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదన అమలయితే అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు నష్టపోతారు. మన రాష్ట్ర విభజన దేశవ్యాప్తంగా ఎన్ని విపరిమాణాలకు, విభజనలకు, విద్వేషాలకు, విధ్వంసాలకు, దారి తీస్తుందో మీకు ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. 

కేంద్రంలో మంత్రి పదవి చేపట్టక ముందు, తమరే సహీతుకంగా చాటి చెప్పిన సమైక్య వాదనలు ప్రజలు మరిచిపోలేదు. సమైక్యవాద ప్రవక్తగా, ఐక్యతా ఆశాజ్యోతిగా, మిమ్మల్ని నిన్న మొన్నటి వరకు, నెత్తిన పెట్టుకున్న ప్రజలే నేడు ఎందుకు కత్తి దూస్తున్నారో, ఎందుకు దూషిస్తున్నారో మీరు గుర్తించాలి. మీ వర్తమాన ప్రవర్తన, పదవీ వ్యామోహం, గతంలో ఎంతగానో అభిమానించిన వారందరిలో మీ పట్ల విముఖతను ఆగ్రహాన్ని పెంచాయి.

దళపతిగా వ్యవహరించిన మిమ్మల్ని బుట్టలో వేసుకుంటే సమైక్య సమరం చతికిలబడిపోతుందని అంచనా వేసారు ఢిల్లీ పెద్దలు. ఆ కుట్రలు నేడు వమ్ము అయిపోయాయి. ఈ రోజు నాయకులు లేకుండానే కోట్లాది సామాన్య ప్రజలు సమైక్య సమరంలో అలుపెరుగని వీరుల్లా పోరాడుతున్నారు.

కాబట్టి కావూరి వారు, ఇప్పటికయినా తమరు అంతరాత్మ ప్రబోధానికనుగుణంగా తక్షణం కేంద్రంలోని మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సమైక్యతకు పాటు పడవలసిందిగా అభ్యర్ధిస్తున్నాం. మీ రాజీనామా ఇతర సహచర తెలుగు కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు మార్గదర్శకం అవుతుంది. రాజీనామా చేసి రాష్ట్ర సమగ్రతను తద్వారా దేశ సమైక్యతను కాపాడండి.

సమైక్య ఉద్యమానికి మీ పెదవి సానుభూతి చాలదు. మీ పదవీ త్యాగం కావాలి.

నలమోతుచక్రవర్తి
అధ్యక్షులు
విశాలాంధ్ర మహాసభ

4, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడవలసిందిగా భారత రాష్ట్రపతి గారిని కోరుతూ తీర్మానం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం, ఆ దరిమిలా రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరలో ప్ర్రారంభిస్తామని రాజ్యసభ లో ప్రభుత్వం తరపున ప్రకటన రావడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

మేము దీనిని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాము.

రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణా ప్రాంతం లో కొంత మంది లేవదీసిన ఆందోళన అసత్యాల మీద, అపోహలమీద, అర్ధ సత్యాల మీద, వక్రీకరణల మీద, ద్వేష భావన మీద ఆధారపడి నిర్మాణ మయినది. ఈ ఆందోళనకు ప్రాతిపదిక లేదు. చరిత్రను వక్రీకరించి, ఆర్ధిక గణాంకాలను దాచిపెట్టి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకులు పనిగట్టుకుని నడిపిన ఆందోళన ఇది. ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లేదు. 2004 నుండి జరిగిన సాధారణ ఎన్నికల నుండి మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల వరకు వెల్లడైన ఫలితాలు ఇందుకు బలమైన నిదర్శనాలు. ఉద్వేగ భరిత వాతావరణం లో జరిగిన కొన్ని ఉపఎన్నికల ఫలితాలు మినహా, రాష్ట్ర విభజనకు విస్తృత మద్దతు ఉన్నదనడానికి ఎలాంటి దాఖలాలు లేవు.

తెలుగు ప్రజలు అందరూ ఒకే పాలన కిందకు రావాలని, స్వరాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనీ దశాబ్దాలుగా జరిగిన ఉద్యమాల ఫలితం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 1956 లో ఏర్పడింది. అనేక మంది నాయకులు సుదీర్ఘ కాలం తెలుగు జాతి ఐక్యతకు కఠోర మైన తపస్సు చేసి సాధించుకున్న భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.

తెలుగు జాతి ఐక్యత కేవలం కొంత మంది స్వార్ధ శక్తుల కుట్రలకు, అసత్యాలకు, అర్ధసత్యాలకు, వక్రీకరణలకు బలికాకూడదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఆలోచనను, ప్రతిపాదనను భారత ప్రభుత్వం తక్షణం వెనక్కు తీసుకోవాలని కోరుతూ మా పంచాయితీ సభ్యులందరం ఏకగ్రీవం గా తీర్మానించాము.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడ వలసినదిగా భారత రాష్ట్ర పతి గారిని కోరుతూ ఏకగ్రీవం గా ఈ తీర్మానం చేయడమైనది.    

సమైక్యాంధ్ర ఉద్యమకారులారా రాజకీయనాయకులతో జాగ్రత్త!

కోస్తా, రాయలసీమ ప్రజలు గత నెల రోజులుగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమించారు. ప్రజలలో వచ్చిన ఈ అనూహ్య చైతన్యాన్ని గమనించిన రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాలలో తమ అస్తిత్వాన్ని కోల్పాతామేమో అనే భయంతో, యాత్రల పర్వం మొదలు పెట్టాయి. ఈ నేపధ్యంలో వచ్చినవే చంద్రబాబు చేస్తున్న ఆత్మ గౌరవ యాత్ర, షర్మిల సమైక్య శంఖారావం.

వై.కా.పా.నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని విభజించినా పర్వాలేదు, సమ న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. అదే పార్టీ ఈ రోజు సమైక్యవాదం వినిపిస్తున్నది. తెలుగు దేశం పార్టీ ఇప్పటికీ రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉన్నది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన పై తన అభిప్రాయాన్ని మార్చుకుని, కేంద్రానికి మళ్ళీ లేఖ రాసి ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని మహాసభ కోరుతోంది.

మన రాష్ట్రంలో విభజన పోకడలకు మూల కారణం రాజకీయ పార్టీలు. తమ వోట్ల రాజకీయాలకు తెలుగు జాతి ఐక్యతను తాకట్టు పెట్టిన ఈ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాల్సిందిగా విశాలాంధ్ర మహాసభ విజ్ఞప్తి చేస్తోంది. ఓట్లకోసం , సీట్ల కోసం నాడు రాష్ట్ర విభజనకు అంగీకరించి తప్పు చేసామని పార్టీలు బహిరంగంగా ప్రకటించాలని మహాసభ డిమాండ్ చేస్తోంది. ఎటు గాలి వీస్తే అటు తిరిగే గాలివాటం రాజకీయాలను మానుకోవాలని మహాసభ పిలుపునిస్తున్నది. 

రాజకీయ పార్టీలు చేస్తున్న యాత్రలను చూసి ప్రజలు మోసపోవద్దని విశాలాంధ్ర మహాసభ కోరుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఒక శాంతియుత ధర్మ యుద్ధం. ఈ ప్రజా ఉద్యమం రాజకీయాలకి అతీతంగా జరుగుతోంది. తెలుగు జాతిని మోసం చేసిన రాజకీయ పార్టీలకి ఈ ఉద్యమ నాయకత్వాన్ని అప్పచెబితే మనకు మళ్ళీ వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి రాజకీయ నాయకుల యాత్రల పరంపర నేపధ్యంలో, సమైక్యవాద ఉద్యమకారులు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విశాలాంధ్ర మహాసభ విజ్ఞ్యప్తి చేస్తోంది.

నలమోతుచక్రవర్తి                                                                                    పరకాలప్రభాకర్    
అధ్యక్షులు                                                                                             ప్రధానకార్యదర్శి 

17, మే 2013, శుక్రవారం

ఆంధ్ర రాష్ట్రోద్యమము - విశేషాలు

మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మే లో నిడదవోలు లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా  వేసారు.

నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 26 గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. తరువాతి కాలంలో అనేక ఆంధ్ర పట్టణాలలో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ సభల స్ఫూర్తితో వివిధ  ఆంధ్రేతర నగరాలలోను విదేశాలలోనూ ఆంధ్ర మహాసభల పేరుతో ఆంధ్రులు కలసి తమ సమస్యలకు తగు  పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చెశారు. అప్పటి కొన్ని విశేషాలు:









 

  
 Ramineni Bhaskaredra Rao through email

11, మే 2013, శనివారం

వేర్పాటువాద తిమిరంతో సమరం


ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: వేర్పాటువాదాన్ని సమర్థించడం మాత్రమే తెలంగాణ పట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజన వాదులు కొంతవరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాది మంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇది ముఖ్య కారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడలేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటి పారిపోతుంది.

విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ప్రధానంగా మేధోపరమైనది. మేము మన రాష్ట్రం ఎందుకు ఒకటిగా ఉండాలి అనే విషయమై రాస్తున్నాము. రాష్ట్ర విభజనను కోరేవారు చేస్తున్న ఆరోపణలు, ఆక్షేపణలు, ప్రకటనలు అసత్యాలనీ, అర్థ సత్యాలనీ, వక్రీకరణలనీ నిరూపిస్తూ ప్రచురణలు, పుస్తకాలు వెలువరిస్తున్నాము. ప్రదర్శనలు, మీడియా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాము. టెలివిజన్ చర్చల్లో పాల్గొని మా వాదన వినిపిస్తున్నాము. సోషల్ మీడియాలో మా అభిప్రాయాలని ప్రకటిస్తున్నాము. వేర్పాటువాదుల అసమంజస ప్రవర్తనని, అసంబద్ధ వాదనలని, అప్రజాస్వామిక వైఖరిని, వారి బలప్రయోగాన్ని, హింసాత్మక ధోరణుల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.

మాకు ఏ ప్రాంతం పట్ల అయిష్టత లేదు. ఏ ప్రాంత ప్రజల పట్ల ద్వేష భావం లేదు. మేము వ్యతిరేకించేది వేర్పాటు వాదాన్ని. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వేర్పాటు వాదులను, మేము వ్యతిరేకించేది కేవలం తెలంగాణ వేర్పాటు వాదులను మాత్రమే కాదు. రాయలసీమ వేర్పాటు వాదులను, కోస్తా వేర్పాటు వాదులను కూడా అంతే పట్టుదలతో వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకిస్తాం. విభజనవాదం ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది అని చరిత్ర ఎరిగిన వారు ఎవ్వరూ అనరు. 1969లో తెలంగాణ వేర్పాటు వాదులు విజృంభిస్తే 1972లో కోస్తా, రాయలసీమల్లో పెద్ద ఎత్తున వేర్పాటు ఆందోళన జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరోసారి జరుగుతోంది. అంతే.

కోస్తా, రాయలసీమల్లో విభజనవాదం తలెత్తినపుడు అంతకు మూడు సంవత్సరా ల మునుపు ఆందోళన చేసిన తెలంగాణ వేర్పాటువాద నాయకులు మిన్న కుండడం చూస్తే రాష్ట్ర విభజన వాంఛనీయత పట్ల వారికి ఏ మాత్రం నిబద్ధత లేదని ఇట్టే అవగతమవుతుంది. 'దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం' అన్నది కేవలం కట్టుకథ అనీ అతిశయోక్తి అలంకార ప్రయోగమని తెలుస్తుంది. ఈ ఆందోళనలు కేవలం వారి రాజకీయ వ్యూహాలలో, బేరసారాలలో, లావాదేవీలలో భాగాలు మాత్రమే అనేది తేటతెల్లమవుతుంది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం అభం శుభం తెలియని సామాన్య ప్రజలను అబద్ధాలతో, అర్ధ సత్యాలతో, వక్రీకరణలతో రెచ్చగొట్టి వారిలో ప్రాంతీయ విద్వేష భావం ప్రజ్వలింపచేసి, వారిని వేర్పాటు వాదం వైపు మళ్లించే ఈ నాయకుల మీద మా పోరాటం.

ఇటువంటి స్వార్థ నాయకుల మాటలు విని, అవి యదార్థమని నమ్మి, రాష్ట్ర విభజనే మార్గాంతరం అని అనుకుంటున్న సామాన్య ప్రజల పట్ల మాకు వ్యతిరేకత లేదు. వారికి వాస్తవాలు తెలియచేసి, సమైక్యతా వాదాన్ని వినిపించి, వారి ఆలోచనలను మార్చి, రాష్ట్ర సమైక్యతను కాపాడాలన్నది మా ఆశయం. వారి మనసులను గెలుచుకోవడం మా లక్ష్యం. మూడు ప్రాంతాలలోనూ ప్రజల మస్తిష్కాలలో నుంచి వేర్పాటు వాదాన్ని ఆనవాళ్ళు కూడా లేకుండా తొలగించడం మా ఉద్దేశం. ఓట్ల కోసం కల్లబొల్లి మాటలతో వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతూ నాలుక భుజాన వేసుకుని తిరిగే మాటకారి రాజకీయనాయకులకు వారి పార్టీలకు ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ ఆదరణ లభించని వాతావరణాన్ని నిర్మించడం మా ధ్యేయం.

మా ఆశయ సాధనకున్న అవరోధాలు చాలా పెద్దవి. మా మాట సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా ఈ నాయకులు, వారి తాబేదార్లు అనేక అడ్డంకులు కలిగిస్తున్నారు. మేము ఎక్కడ సభపెట్టినా దాన్ని భగ్న ం చేయడం, మా మీద దాడులు చెయ్యడం, మమ్మల్ని కొట్టడం, మా పుస్తకాలు తగుల బెట్టడం వారికి పరిపాటి అయిపోయింది. మేము చెప్పే మాట జనసామాన్యానికి చేరితే, వీరి ఆటలు సాగవు అని వీరి భయం. ఒక చిన్న పుస్తకానికి, ఒక ఉపన్యాసానికి, ఒక పత్రికా ప్రకటనకి, ఒక ప్రదర్శనకి, ఒక బహిరంగ చర్చకి భయపడే ఉద్యమం కూడా ఒక ఉద్యమమేనా? వాదనలో పసలేని వారే దౌర్జన్యాలకి దిగుతారు అన్నదానికి తెలంగాణ వాదుల వేర్పాటు వాదుల హింసాత్మక ప్రవర్తన కంటే రుజువు ఏమి కావాలి?

'రుజువులు లేని ఉద్యమం: తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు వక్రీకరణలు' అన్న పుస్తకంలో ఆందోళనకారులు రాష్ట్ర విభజనకు చూపిస్తున్న కారణాలలో నిజం లేదని సమగ్రంగా వివరించాం. మా పుస్తకం ఎంత శక్తిమంతమైనదో వేర్పాటువాదులు అందులో మేము రాసిన ఒక్క విషయాన్ని కూడా పూర్వపక్షం చేయలేకపోయారు. ఒక్క అంశాన్ని కూడా తప్పుపట్టలేకపోయారు. పుస్తకం మీద జరిగిన ప్రతి చర్చలోనూ మమ్మల్ని ఆడిబోసుకున్నారు. మాది దురహంకారమన్నారు; మేము రెచ్చగొడుతున్నామన్నారు; మేము తెలంగాణ ప్రజల మనో భావాలను అగౌరవ పరుస్తున్నామన్నారు; ప్రజాభిప్రాయంపట్ల మాకు గౌరవం లేదన్నారు; ఇంతమంది అవునంటున్నది మేమెలా కాదనగలమన్నారు; మరెన్నో మాటలు మిగిలారు. కొంతమంది సోషల్ మీడియాలో మా మీద పచ్చి బూతులు కూడా ప్రయోగించారు. వ్యక్తిగత దూషణలకు హద్దూ పద్దూ లేకుండాపోయింది.

కాని ఒక్కరంటే ఒక్కరు ఇదిగో ఈ పుటలో ఇక్కడ ఈ దోషం ఉంది అని మాత్రం ఎత్తి చూపలేకపోయారు. మా గణాంకాలను తప్పు పట్ట లేకపోయారు. మా తర్కాన్ని వేలెత్తి చూపలేకపోయారు. మేము ఇచ్చిన భాష్యానికి ప్రత్యామ్నాయ వివరణ ఇవ్వలేకపోయారు. మా విశ్లేషణకు సమాధానం చెప్పలేక పోయారు. మా భావ ప్రకటనా స్వేచ్ఛ మీద సాక్షాత్తు ప్రెస్‌క్లబ్‌లో దాడి జరిగితే, పాత్రికేయులే మా పుస్తకాన్ని తగుల బెడితే దేశవ్యాప్తంగా లబ్ధ ప్రతిష్ఠులైన మన పౌర హక్కుల సంఘాల పెద్దలు ఒక్కరంటే ఒక్కరికి ఆ దుశ్చర్యను ఖండించడానికి నోరు రాలేదు. హక్కుల పరిరక్షకులుగా దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రతిష్ఠను ఇంత చవకగా వారు పోగొట్టుకుంటారని మేము ఊహించలేదు.

మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలందరి పక్షాన మాట్లాడుతున్నట్లు వేర్పాటువాద నాయకులు మనల్ని నమ్మమంటారు. కాదు, వారు కేవలం రాష్ట్ర విభజనను కోరుకునే వారి పక్షాన మాత్రమే మాట్లాడుతున్నారని యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం పక్షాన కాదనీ మేమంటున్నాం. రాష్ట్రంలో మూడు ప్రాంతాలలోనూ విభజన వాదులున్నారు. అలాగే మూడు ప్రాంతాలలోను సమైక్య వాదులున్నారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి విభజన వాదం బిగ్గరగా వినపడుతుంది. బిగ్గరగా వినపడినంత మాత్రాన బలంగా ఉన్నట్టు లెక్క కాదు. ఈవాళ్టికి వేర్పాటు వాదులు ఇంత బీభత్స వాతావరణం సృష్టించినా తెలంగాణలో విశాలాంధ్ర వాదం బలంగా ఉంది. విశాలాంధ్ర మహాసభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు చాలా ఎక్కువ మంది సభ్యులుగా ఉండడమే దీనికి ప్రబల తార్కాణం.

తమ వాదన బలంగా ఉందనడానికి ఈ మధ్య జరిగిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు తప్ప వేర్పాటు వాదులకు మరొక ఆధారం లేదు. 1969 నుంచి 2009 దాక తెలంగాణలో -నాలుగు దశాబ్దాల పాటు -విభజనవాదానికి ఎక్కడా పచ్చి మంచినీళ్ళు కూడా పుట్ట లేదు. భారతీయ జనతా పార్టీ, ఇంద్రారెడ్డి పార్టీ, దేవేందర్ గౌడ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఎంత ఆయాస పడ్డా వారు సాధించిన ఎన్నికల ఫలితాలు అంతంత మాత్రమే అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. మొన్న పరకాల ఉప ఎన్నికలో నెగ్గడానికి టి ఆర్ ఎస్‌కి తలప్రాణం తోకకొచ్చింది. పట్టుమని పదివేల మంది కూడా లేని సమీకరణని చూపించి దాన్నే 'మిలియన్ మార్చ్'అనుకోమన్నప్పుడే వేర్పాటు వాదులకున్న ప్రజా బలమెంతో అర్థమయ్యింది. బుకాయింపులకు, డబాయింపులకు కూడా ఒక అడ్డూ ఆపూ ఉంటాయి.

విభజన వాద సమైక్యవాద భావజాలాల మధ్య ఎప్పుడు సంఘర్షణ జరిగినా సమైక్యవాదమే విజయం సాధించింది. ఈ సారి కూడా సమైక్యవాదమే గెలుస్తుందని మా విశ్వాసం. తెలంగాణలో మా సభలు సజావుగా జరుపుకుని అసలు విషయాలను ప్రజలకు వివరిస్తే ఇప్పుడున్న కొద్ది బలం కూడా విభజనవాదులు కోల్పోతారు. అందుకే మమ్ములను ప్రజలలోకి వెళ్ళకుండా మా వాదనను ప్రజలకు చేరకుండా వారు మమ్మల్ని శతవిధాలా అడ్డుకుంటున్నారు. మా వాదన అంటే వారికి అభద్రతా భావం. లేకపోతే వారు ఆ పని చెయ్యరు.

మాతో బహిరంగ చర్చలకు అడపాదడపా వేర్పాటు వాదులు సవాళ్ళు విసురుతూ ఉంటారు. కానీ సమయం వచ్చేటప్పటికి పత్తా లేకుండా పోతారు. వారు విసిరిన ప్రతి సవాలునూ మేము స్వీకరించాం. చర్చకు సిద్ధమయ్యాం. గతంలో ఒక మాజీ మంత్రి చర్చకు పిలిచి ఆయన అనుచరులతో మా మీద దాడి చేయించి ఉడాయించారు. నిన్న కాక మొన్న ఒక విభజనవాద శాసనసభ్యుడు చర్చకు రమ్మని సవాలు విసిరారు. మేము స్వీకరించాం. ఇవ్వాళ్టి వరకూ అతగాడు మళ్ళీ కిమ్మనలేదు.

భావజాల వ్యాప్తికి అప్రజాస్వామిక మూకలు సృష్టించే అడ్డంకులను అదృష్టవశాత్తు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రానురాను బలహీన పరుస్తోంది. మేము ఇంటర్నెట్‌లో పెట్టిన 'రుజువులు లేని ఉద్యమం' పుస్తకం సాప్ట్ కాపీలు కొన్ని వేలు డౌన్‌లోడు అవుతున్నాయి. పుస్తకాల ప్రతులు కావలసిన వారు సంప్రదించాల్సిన ఈ మెయిలు అడ్రసు, ఫోన్ నెంబరు సోషల్ మీడియా లో ప్రకటించాం. రోజు కు కొన్ని వందల మంది పుస్తకాల కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఎడెతెరిపిలేకుండా పుస్తకాలు కావాలని ఎస్ ఎం ఎస్‌లు, ఈ మెయిల్సు వస్తున్నాయి. మా వాదన, మా మాట, మేము చెప్పే వాస్తవాలు ప్రజ లలోకి లోతుగా, నిశ్శబ్దంగా వెడుతున్నాయి.

మేము వేర్పాటు వాదాన్ని వ్యతిరేకిస్తే దాన్ని తెలంగాణ ప్రజానీకానికి మేము వ్యతిరేకమన్నట్టుగా వేర్పాటువాదులు చిత్రీకరిస్తున్నారు. విభజన వాదుల అబద్ధాలను ఎత్తి చూపితే తెలంగాణ ప్రజలను అబద్ధాలాడేవాళ్ళు అంటారా అని తిరగేస్తున్నారు. తెలంగాణలోని సామాన్య ప్రజలకు సమైక్యవాదులను శత్రువులుగా చూపించాలని వీరి ప్రయత్నం.

వేర్పాటువాదాన్ని సమర్థించడం మాత్రమే తెలంగాణ పట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజన వాదులు కొంతవరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాది మంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇది ముఖ్య కారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడలేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటిపారిపోతుంది. తెలంగాణలో ఉన్న అసంఖ్యాక విశాలాంధ్ర వాదులు ఈ ఎత్తుగడను, ఈ అభూత కల్పనను ఛేదించాలి. ముసిరిన ఈ తిమిరంతో సమరం చేయాలి.

ఇంతకు ముందూ ఇప్పుడు విశాలాంధ్ర కోరిన వారు, కోరుతున్న వారూ నిఖార్సయిన తెలంగాణ ప్రాంత శ్రేయోభిలాషులు అనడానికి రావి నారాయణరెడ్డి తో మొదలుకొని పీవీ నరసింహరావు వరకూ, దేవులపల్లి రామానుజరావు నుంచి నర్రా మాధవరావు వరకూ అనేక మంది నిష్ఠ గల నాయకులు మనకు ఉదాహరణలుగా నిలబడతారు. కాని ఇవాళ రాష్ట్ర విభజన కోరే నాయకులందరూ తెలంగాణ హితైషులు అనడానికి వారి రాజకీయ చరిత్రలలో దాఖలాలు బహు తక్కువ.

తెలంగాణ మీద అభిమానానికి విభజనవాదం గీటురాయి కాదు. విభజన వాదం వేరు, తెలంగాణ మీద మమకారం వేరు. ఈ రెండిటినీ ఒకటిగా చూపించి పబ్బం గడుపుకోవాలని వేర్పాటువాద నాయకుల ప్రయత్నం. అయితే ఈ రెండిటికీ వైరుధ్యం లేదని, విశాలాంధ్రలో మన ప్రాంత ప్రయోజనాలు సురక్షితమని తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశాలాంధ్ర వాదులు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెలిబుచ్చడానికి సంకోచించకుండా ధైర్యంగా ఇక ముందుకురావాలి. చరిత్ర, ఆర్థిక గణాంకాలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సహజీవన పరంపర వారి వాదనకు పెట్టని కోటలుగా నిలుస్తాయి. 'వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు' అన్న రావి నారాయణ రెడ్డి గర్జన తెలంగాణలో విశాలాంధ్ర వాదుల మంత్రం కావాలి.

తెలంగాణ ప్రయోజనాలకి తెలంగాణ వేర్పాటువాదులు, రాయలసీమ ప్రయోజనాలకి ఆ ప్రాంతానికి చెందిన విభజనవాదులు, కోస్తా ప్రయోజనాలకి అక్కడ విభజనవాదం వినిపించేవారు గుత్తేదార్లుగా చెలామణీ అయ్యే క్షుద్ర రాజకీయ క్రీడకి తెర దించాలి. మూడు ప్రాంతాలలో ఉన్న సమైక్య వాదులంతా ఉదాసీనతను వీడి క్రియాశీలకంగా పనిచేస్తే విభజన వాద భావజాలాన్ని తెలుగు నేల నుంచి శాశ్వతంగా సాగనంపగలుగుతాం.


- డాక్టర్ పరకాల ప్రభాకర్
ప్రధాన కార్యదర్శి, విశాలాంధ్ర మహాసభ

20, ఏప్రిల్ 2013, శనివారం

The Beginnings of Fascism?


‘When you fail to shoot, you beat with the butt’ so goes an old adage. This is what happened on 16th April ‘13, in the hall named for Suravaram Pratap Reddy, scholar-writer and pioneer-editor of the old Hyderabad State. On prior intimation to police and with the permission of the authorities, a meeting was called in the Press Club, Basheer bagh by the Visalandhra Mahasabha - an organization committed to the political and cultural integrity of the Telugu speaking people - to launch the Telugu version of their publication ‘Refuting an Agitation’ . The publication seeks to place in public domain facts and figures relating to some 100 assertions often made by the Telangana protagonists to incite emotions. The issues raised over the years were carefully collected, categorized and researched with an open mind to see if there is any room for genuine grievance. It has taken the organization more than two years to do all this and bring out a publication which gives unbiased and authentic information. Its English edition was launched in New Delhi some time ago in the presence of eminent journalists and writers and sent to all columnists, opinion-makers, MPs and MLAs of the State. Of late, many people have come to rely on the publication for authentic information. As a result, there is considerable disenchantment with the claims of the Telangana protagonists! Even, they have come to realize that their claims are not supported by statistics and switched to basing their case on ‘sentiment’ which all well-meaning people know cannot be the basis for dividing a State! Should sentiment be the criterion, we have to have more than 500 States in India!

The book was launched by Mehboob Ali, a veteran of the Telangana Struggle of the 1950s which not only fought the Nizam-supported Razakars bravely but rid Telangana of all feudalism and paved the way for what is now Andhra Pradesh. As the meeting progressed, some journalists came in, asked the police officers in plain clothes to leave the hall which they meekly did in spite of prior information to them that the trouble was brewing. Some hoodlums claiming to be journalists broke into the hall, broke the microphones and burnt copies of the book in the hall itself, all under the confused gaze of the policemen. Ironically, the venue is barely two hundred meters away from the office of the Dy. Commissioner who was briefed by the writer himself a day In advance about the possibility of inspired violence. There were at least a hundred policemen and officers including the ‘task-force’ bouncers whereas the trouble makers were about 25 or 30. When this writer, who presided over the meeting, later protested to the Dy. Commissioner, he pleaded helplessness on the ground that the incident took place inside the Press Club hall! He even seems to think that the journalists in their own premises are above the law!

The incident raises some questions of deep concern. Press Club should be the place where the right to freedom of speech is to be upheld more than anywhere else. Even if a section of the press is opposed to the book being launched – in the normal circumstance there can be no opposition – there is a way to protest. A day later another meeting can be held to counter or question the facts the book presents. Burning a book that too in the premises of the Press Club shows their utter contempt for freedom of speech about which they often yell from the rooftops and almost borders on fascist tendencies among a section of journalists. This menace, only the well-meaning among them can put down! If the self-correcting mechanism breaks down, freedom of the Press itself would be in jeopardy. We would like to tell our journalist friends that books are not for burning!

The police also have a few lessons to learn. Every police officer is administered an oath at the beginning of his or her career to uphold the Constitution which promises freedom of speech and the right to assemble “peaceably and without arms”. Failing to afford protection, in spite of prior intimation to them as in the instant case, would amount to abdication of professional responsibility. The confusion in the minds of senior officers whether they can intervene in the Press Club premises to restrain the misbehaving journalists has resulted in the whole force being reduced to mute spectators. This is precisely what happened on an earlier occasion again in the press club, when the Bangladesh activist, Taslima Nazreen was assaulted and humiliated by an MLA and a few of his fundamentalist followers right under the nose of the Police, while launching a book questioning religious orthodoxy. Our police officers are either inadequately briefed about the rights of the people or do not know their job well or trying to be more ‘tactful’ than correct in their conduct. If this kind of inaction is tolerated on part of the police officers, consequences can be disastrous and even normally law-abiding people, in their frustration, would be forced to take law into their hands! As long as the duty of the police is to prevent violence and lawlessness, it doesn’t matter where it takes place, in the Press Club or a university or even a temple or a mosque. None of these places are above the law of the land or people connected with them have any immunity from police action. Law-abiding people expect the Police to uphold their right to assemble and make their voices heard. The day the police fail to do this, democratic rights have no meaning! Let them not drive the law-abiding people to desperation! In any case let not our police force be over-awed by hooliganism whatever quarters it comes from!

-Anjaneya Reddy, Member Core Committee, Vishalandhra Mahasabha (presided over the aborted meeting); formerly of the Indian Police Service

16, ఏప్రిల్ 2013, మంగళవారం

'విశాలాంధ్ర మహాసభ' పుస్తకావిష్కరణ ఆహ్వానము



ఆంధ్ర ప్రదేశ్ లో విభజన వాదులు ప్రచారం చేస్తున్న అసత్యాలను, వక్రీకరణలను క్రోడీకరించి వాటిని గణాంకాలతో సహా తప్పులు గా నిరూపిస్తూ విశాలాంధ్ర మహాసభ రూపొందించిన పుస్తకం Refuting An Agitation: 101 Lies and Dubious Arguments యొక్క తెలుగు అనువాదం 

రుజువులు లేని ఉద్యమం
తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆవిష్కరింప బడుతోంది.

తేదీ: బుధవారం 17 ఏప్రిల్ 2013

సమయం: ఉదయం 11:30 గంటలు

వేదిక: ప్రెస్ క్లబ్, దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్, హైదరాబాద్

.
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ మెహబూబ్ అలీ  
పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.


శ్రీ సి. అంజనేయ రెడ్డి ( మాజీ డి జి పి )
సభకు అధ్యక్షత వహిస్తారు.

ఇట్లు
నలమోతు చక్రవర్తి                                                పరకాల ప్రభాకర్
అధ్యక్షులు                                                           ప్రధాన కార్యదర్శి