8, అక్టోబర్ 2012, సోమవారం

సమైక్యమే లక్ష్యం - కర్నూలు 'విశాలాంధ్ర మహాసభ' లో వక్తలు

ఆంధ్రజ్యోతి :  ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్న దే విశాలాంధ్ర మహా సభ లక్ష్యమని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళా క్షేత్రంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విజభన జరగటానికి వీలు లేదని, అన్ని ప్రాంతాల ప్ర జలు కోరుకుంటున్నారని అన్నారు. తె లంగాణ ఉద్యమకారులు కొన్ని కారణాలు చూపి ప్రత్యేక తెలంగాణ కా వాలని కోరుకుంటున్నారన్నారు. తె లంగాణ వాదులు ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హిత వు పలికారు. కలిసి ఉంటే జరిగే అభివృద్ధిని గురించి వివరిస్తామని చెప్పా రు.

వెనుకబాటు తనం అన్ని ప్రాంతాలలో ఉందని, కొన్ని జిల్లాలు అభివృ ద్ధి చెందినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదని తెలిపా రు. దూషణలతో, దుర్మార్గాలతో ప్ర త్యేక తెలంగాణ రాదని, కలిసి ఉండాలనే కోరిక రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉందని అన్నారు. మొదటి సారిగా ఢిల్లీలో నిర్వహించిన విశాలాంధ్ర మహా సభకు కులదీప్ నయ్యర్, సంజయ్ బారు, కేపీఎస్ గి ల్ వంటివారు హాజరయ్యారన్నారు. ఈ సదస్సులు అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విడిపోవడానికి పది కారణాలు చెబితే సమైక్యంగా ఉండడానికి వెయ్యి కారణాలు చెబుతామ న్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలియజేయటానికి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ప్రాంతీయ అసమానతలు తొలగించాలి

ఆంధ్ర భూమి :  రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలను తొలగించి సమగ్రతను కాపాడాలని మంత్రి టీజీ వెంకటేష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణవాదులు చెప్పే ప్రతిమాట అవాస్తవమేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంగా ఇవ్వాలని వారు ఒక్క కారణం చెబితే సమైక్యంగా ఉంచడానికి తాము లక్ష కారణాలు చెబుతామన్నారు. అబద్దాలు చెబుతూ, అభివృద్ధిని దాచిపెడుతూ వెనుకబాటుతనం పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్నారు. సమైక్యవాదులు చూపిన లెక్కల్లో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో వెల్లడైందన్నారు. ఆ తరువాత సెంటిమెంటు పేరుతో ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే వారు ఉద్యమం చేపట్టారని మండిపడ్డారు. రాయలసీమ వాసుల త్యాగంవల్లే నాడు రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆరోజే తాము అడ్డుకునే ఉంటే అది జరిగేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే తెలుగువారంతా కలిసి ఉండేందుకు తమ పెద్దలు అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు. విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వాదాన్ని బూచిగాచూపి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ చేరుకున్న తరువాత ఇప్పుడు పదవుల కోసం ప్రత్యేక వాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సూచించారు. రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాన్ని వివరించేందుకే కర్నూలులో సభ నిర్వహించామన్నారు. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధికి సంబంధించిన చిత్రాలు, ఇతర వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. తెలంగాణవాదులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో నిర్వహించిన ఫోటోలు, వివరాలతో కూడి ఎగ్జిబిషన్ ద్వారా తిప్పికొట్టగలిగామని పేర్కొన్నారు. పాత్రికేయులు సి.నరసింహారావు మాట్లాడుతూ తెలుగుమాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్ధేశ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని గుర్తుచేశారు. ఇపుడు కొందరు నాయకులు తమకు అవసరమైన పదవుల కోసం తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.


రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం

సాక్షి : రాష్ట్ర సమైక్యతను కాపాడుదామని విశాలాంధ్ర మహాసభ నాయకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీ క్యాంప్‌లోని టీజీవీ కళాక్షేత్రంలో విశాలాంధ్ర మహా సభ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. మంత్రి టీజీ వెంకటేష్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. సమైక్యతను కాపాడేందుకు విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశామన్నారు. ఈ సభ ద్వారా వాస్తవ అభివృద్ధిని అన్ని ప్రాంతాల ప్రజలకు వివరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతం కంటే రాయలసీమ రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎంతో వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణవాదులు పది కారణాలు చెబితే, సమైక్యంగా ఉండేందుకు వంద కారణాలు చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

అధికారం కోసమే ప్రత్యేక వాదం

రాయలసీమ వెనుకబాటు తనాన్ని వాస్తవ రూపంగా లెక్కల్లో చూపించిన విశాలాంధ్ర మహాసభను అభినందిస్తున్నామని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్రంలో అధికారం కోసమే కొంత మంది ప్రత్యేక వాదం పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిని తరలించకుంటే కర్నూలు లక్ష కోట్ల అభివృద్ధిని సాధించేదన్నారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక నాయకునిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. సీమలో అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని వర్గాల వారు సహకరిస్తే ఇక్కడి నుంచి 10 వేల మెగా వాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్నారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నరసింహరావు, శ్రీనివాసరెడ్డి, బివి.రెడ్డి, కుమార్ చౌదరి, రవితేజ, వెంకటేశ్వర్లు, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు.

4, అక్టోబర్ 2012, గురువారం

చర్చోపచర్చలు....నిజమా....?

తెలంగాణా వాదులు నిజమైన ప్రజాస్వామ్యిక వాదులైతే....వీరు నిజంగా తెలంగాణా కోసమే వీళ్ళు పోరాడుతుంటే ,వీళ్ళు కొన్ని ఆలోచించాలి.కేసీఆర్ ని నిలదీసి అడగాలి......
1 .కేంద్ర ప్రభుత్వము గానీ,కాంగ్రెస్ ప్రభుత్వము గానివ్వండి తెలంగాణా గురించి కేసీఆర్ ఒక్కడితోనే చర్చలు జరపడము ఏమిటి...? అంటే తెలంగాణా ప్రాంతములోని నాయకులు అనుకుంటున్న వారు అందరు చర్చలకు పనికిరాని........, తెలివితేటలూ లేని....... అనేనా ...?
2 . వీళ్ళల్లో వీళ్ళు రహస్యముగా తొలివిడత,తుదివిడత అంటూ రాష్ట్రము గురించి రహస్య చర్చలు చేసుకుని పంచుకోవటానికి ఇదేమన్నా గాంధీభవన లేక కేసీఆర్ వారసత్వ ఆస్థా...?
3 .ఒకవేళ తెలంగాణా ఏర్పాటు గురించి చర్చలు అయితే ఈ రాష్ట్రములో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియకుండా వేరే పార్టీ నాయకుడితో చర్చిండం అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెంత గోప్పవాల్లో మనము ఊహించుకోవచ్చు.......!
4 .లేదా.... కేసీఆర్ కి తెలంగాణా ప్రజల ఆత్మా గౌరవము మీద నమ్మకము ఉంటె కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపాదించిన "తనసొంత ప్రత్యెక ఎజెండా" మీద చర్చలు జరిపి ఉంటె కేసీఆర్ నిజాయతీగా ,ధైర్యముగా తెలంగాణా సమాజానికి ఆ ఎజెండా ఏమిటి,చర్చల సారాంశము ఏమిటో తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలకి,అందరు ఉద్యమ నాయకులకు ,తెలంగాణా జాతి యావత్తుకి చెప్పాల్సిన బాధ్యతా కేసీఆర్ మీద ఉంది.
5 . లేదా..... తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలు ,అందరు ఉద్యమ నాయకులు ,తెలంగాణా జాతి యావత్తు కేసీఆర్ ని నిలదీసి ,నిగ్గదీసి ఆ వివరాలు రాబట్టాల్సిన బాధ్యతా వీరి మీద ఉంది......అలా చెయ్యకపోతే వీళ్ళని సదా "బాంచన్ నీ కాల్మొక్తా" అంటూ ఆ దొరకి ఊడిగము చేసే బా ....లు వీళ్ళు అనుకోవాలి.

1, అక్టోబర్ 2012, సోమవారం

కర్నూలులో 'విశాలాంధ్ర మహాసభ'



Dear Friends,

Visalandhra Mahasabha is conducting a media exhibition and workshop in Kurnool this Sunday, October the 7th, 2012. The format will be similar to the past events that our organization has conducted in Delhi, Hyderabad, Vijayawada, and Tirupati.

The event will be held in T.G.V. Kalakshetram in Kurnool. The exhibition is going to be inaugurated by Minister Sri T.G. Venkatesh. Prominent personalities from Kurnool Sri B. V. Reddy, Sri G. Pullaiah, Sri K.C. Kalkura, Dr. K. Madhaiah will speak at the event.

Visalandhra Mahasabha members C. Anjaneya Reddy, Parakala Prabhakar, Challagulla Narasimha Rao, Kumar Chowdhary Yadav, Chegondi Ramajogaiah, Padiri Raviteja, Sunkara Venkateswar Rao, Laxman Reddy and several others will also present their views.

It is very important that we continue to voice our views on integration. The just finished Telangana march and separatists efforts in Delhi are an indication that the fight is far from over.

Drive to Kurnool from Hyderabad is less than 3 hours and the road is excellent. I urge you all to participate in the event and make it a big success.

Nalamotu Chakravarthy