సాక్షి :
బొత్సతో పరకాల ప్రభాకర్ భేటి!
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని బొత్సకు పరకాల వినతిపత్రం సమర్పించారు. అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ వైఖరి ఉండాలని బొత్సను కోరామని.. అందుకు స్పందించిన బొత్స తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు నివేదిస్తామని హామీ ఇచ్చారని పరకాల వెల్లడించారు.
సూర్య:
అఖిలంలో సమైక్యవాదం వినిపించండి
హైదరాబాద్, మేజర్ న్యూస్: ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదానికి అనుకూలంగా వాదనను వినిపించాలని పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం గాంధీభవన్‌లో పిసిసి ఛీప్‌కు ఓ వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమైక్యవాదన వినిపించాలని ఇతర రాజకీయ పార్టీలను కలసి కోరుతామన్నారు. టిఆర్‌ఎస్‌ను కోరుతారా అని అడగ్గా సమయం కేటాయిస్తే ఆ పార్టీ నేత హరీష్‌రావును కలసి విజ్ఞప్తిచేస్తామని ప్రభాకర్ పేర్కొన్నారు.
ఆంధ్ర భూమి:
‘సమైక్య’గళం వినిపించండి
హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని విశాలాంధ్ర మహాసభ నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరారు. విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు బుధవారం గాంధీభవన్‌లో బొత్సను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభాకర్ మీడియాతో రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదనే అభిప్రాయాన్ని అఖిలపక్షం ముందు వెల్లడించాలని బొత్సను కోరినట్లు చెప్పారు. మీరు, మీ పార్టీ, తెలుగు జాతి ఐక్యతను, రాష్ట్ర సమగ్రతను కాపాడాలని రాష్ట్ర ప్రజలు కాంక్షిస్తున్నారని బొత్సకు చెప్పామని ఆయన తెలిపారు. బ్రిటీష్ పాలనలో, నిజాం పాలనలో తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉన్నారని, అనేక మంది నాయకుల త్యాగాల ఫలితంగా 1956 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ఇలా అన్ని పార్టీల అధ్యక్షులను, ఇతర ముఖ్య నాయకులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు పరకాల తెలిపారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావునూ కలిసి వినతి పత్రం ఇస్తారా? అని ప్రశ్నించగా, కెసిఆర్ అప్పాయింట్‌మెంట్ ఇస్తే తప్పకుండా కలుస్తామని ఆయన సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రభ:
బొత్సతో 'విశాలాంధ్ర' నేతల భేటీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను బుధవారం గాంధీవభన్‌లో విశాలాంధ్ర మహాసభ నాయకులు కలిశారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని పార్టీ పరంగా మరింత గట్టిగా వినిపించాలని పేర్కొంటూ మహాసభ ప్రతినిధులు ఆయనకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రా న్ని ముక్కలు చేయవద్దని మెజార్టీ ప్రజ లు కోరుకుంటున్నారని తెలిపారు. తెలు గు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ప్ర జల గాఢమైన ఆకాంక్ష అని వినతి పత్రంలో మహసభ నాయకులు పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనతో పాటు నిజాం పాలనలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక్కటవ్వాలని దశాబ్దాలుగా జరగిన ఉద్యమాల వల్లే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని అందులో పేర్కొన్నారు. అప్పటి పోరాట ఫలితం కారణంగానే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించి ఇతర భాషా సమూహాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు.
అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను కలిసి అఖిలపక్ష సమావేశంలో ఇదే అభిప్రాయన్ని వినిపించాలని కోరనున్నామని తెలిపారు. టిఆర్‌ఎస్‌ను కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఖచ్చితంగా వారిని కూడా కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు అధికార కాంక్షతోనే రాష్ట్ర సమైఖ్యతకు ముప్పువాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని ప్ర భుత్వ విప్ జగ్గారెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై విశాలాంధ్ర మహసభ నాయకు లు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన ఈ మేరకు పార్టీ అధిష్టానవర్గానికి లేఖ రాయనున్నట్లు స్పష్టం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
ప్రజాశక్తి:
బొత్సను కలిసిన పరకాల ప్రభాకర్ బృందం
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నేతృత్వంలో బొత్స సత్యనారాయణు కలుసుకున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేయకుండా చూడాలని వినతిపత్రం అందించారు.
కొమ్మినేని.ఇన్ఫో :
విశాలాంధ్ర మహాసభ రాయబారం
ఒకపక్క తెలంగాణవాదులుకానివ్వండి, తెలంగాణ.జెఎసి నేతలు, ప్రజాసంఘాల నేతలు కాని విస్తారంగా తెలంగాణవాదానికి అనుకూలంగా అభిప్రాయానికి కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే, సమైక్య వాదాన్ని ఆ స్థాయిలో కాకపోయినా, ప్రాతినిద్యంగానైనా వినిపించడానికి విశాలాంధ్ర మహాసభ నడుం కట్టింది.ఈ మహాసభ నేత పరకాల ప్రభాకర్ పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం గురించి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అన్ని పార్టీల నేతలను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని చెప్పారు.దీనిపై తమ అధిష్టానానికి తెలియచేస్తానని బొత్స చెప్పినట్లు పరకాల చెప్పారు. ఆ తర్వాత టిడిపి నేత యనమల రామకృష్ణుడును కూడా కలుసుకుంటున్నట్లు ఈ నెతలు చెప్పారు.ఈ రెండు రోజులు ఇరుప్రాంతాల వాదనలు వినిపించడానికి ఎవరికి వారు పోటీపడడం సహజమే.అందులో భాగంగా విశాలాంధ్ర మహాసభ కూడా రాయబారం జరుపుతోందనుకోవాలి.
Now that TDP has given a green signal for the formation of separate Telangana in yesterday's (28 December 2012) All Party Meet at New Delhi there is every danger of Congress (I) also veering towards that option to gain political mileage in the coming 2014 elections and declare such division of our State of Andhra Pradesh overriding the express opinions of a decided majority of the Telugu people in the State which is totally against any division of the State and for continuance of the United State of Andhra Pradesh, with whatever packages or arrangements as necessary for the respective regions' development and proper say made in that course. So it is quite necessary that all people desiring unity express their opinions and desires clearly and directly to Ms. Sonia Gandhi, the ultimate decision-maker in this regard and to the Prime Minister and President of India and appeal to them not to divide the state at any cost. I hope my net-friends will in general agree with me and contact me for the purpose.
రిప్లయితొలగించండి