23, జనవరి 2013, బుధవారం

పుక్కిట పట్టిన పసలేని వాదనలే అన్నీ!

సాక్షి వ్యాసం ( 23/01/2013): 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు గురించి ఉద్యమ కారులు నొక్కి చెబుతున్న అంశాలు, చేస్తున్న ఆరోపణలు, తమకి సానుకూలమైనవిగా చెప్పుకుంటున్న అంశాలలోని వాస్తవాలను పరిశీలించడానికి విశాలాంధ్ర మహాసభ ప్రచు రించిన పుస్తకం ‘అసంగత ఉద్యమం: తెలం గాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ (REFUTING AN AGITATION: 101 LIES & DUBIOUS ARGUMENTS OF TELANGANA SEPARATISTS). ఈ పుస్తకం ఉద్దేశం ఉపోద్ఘాతంలో వివరంగానే ఉంది. తెలంగాణ వేర్పాటువాదులు చేస్తున్న ఈ ఆరోపణలు, అంశాలు చిరకాలంగా ఎవ రూ పరిశీలించక పోవడంవల్ల తిరిగి ఎవరూ సవాలు చేయలేదని ఇందులో చెప్పారు. వారు చెబుతున్నవన్నీ నిజాలేనని వారైనా నమ్ము తున్నారా? లేకుంటే తమ ఉద్యమం మనుగడ కోసం వీటిని ప్రచారం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నదీ పుస్తకం. తాము చెబుతున్న అంశాలూ, చేస్తున్న వాదనలూ నిజమైనవేనని వారు మనసావాచా నమ్ముతూ ఉంటే ఈ పుస్తకం వాటికి తగిన సమాధానం ఇవ్వగల దని కూడా పేర్కొన్నారు. పుస్తకంలో నాలుగు విభాగాలున్నాయి. మొదటి భాగం చరిత్ర గురించి, రెండోది భాషా సంస్కృతులను గురించి, తరువాతి రెండు భాగాలు ఆర్థిక రాజ కీయాంశాల గురించి ఇలా వివరిస్తున్నాయి.

తమ వాదనలు వాస్తవమేనని తెలంగాణ వేర్పాటువాదులు పదేపదే నొక్కి చెబుతున్నా రు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయిందనీ, దోపిడీకీ, అవమానాలకూ గురయిందని చెబు తున్నారు. ఇందులోని వాస్తవం ఏమిటో వెతికి పట్టుకునే సమయం, అవకాశం లేని వారికి ఈ పుస్తకం అసలు నిజాలు ఏవో వెల్లడించగలదు. అటు ఆంధ్ర ప్రాంతం గురించి, ఇటు తెలం గాణ గురించి అన్ని అంశాల పట్ల అవగాహన లేని కొన్ని పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు ఇది న్యాయబద్ధమైన ఉద్యమం అంటూ మద్దతు ఇస్తున్నారు.

తెలంగాణ నిర్లక్ష్యానికి గురయిందని, వెనుకబడిందని, దోపిడీకి గురయిందని ప్రత్యే క తెలంగాణ రాష్ట్రవాదులు మొదట వాదనలు ప్రారంభించారు. ఈ వాదనలను నల్లమోతు చక్రవర్తి My Telugu Roots అనే పుస్తకంలో బహు శా మొదటిసారి సవాలు చేశారు. ఈ రచనను తెలంగాణవాదులు ఎవరూ ఖండిచలేకపో యారు. పైగా అంతవరకు తమ ఉద్యమానికి పునాదిగా చేసుకున్న ఆర్థిక వెనుకబాటుతనం వాదన పూర్వపక్షం కావడంతో సహనం కోల్పో యారు. చక్రవర్తి మీద భౌతికంగా దాడి జరి గింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఆర్థిక వెనుక బాటుతనం వాదనను నిరాకరించింది. దీనితో ఆ వాదానికి ఊపిరిపోయింది. తరువాత నిరు ద్యోగ సమస్య, నీళ్ల వాటా దగ్గర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని... ఇలా వాదాలు వచ్చాయి. తరువాత ఇచ్చిన స్వయంపాలన నినాదం కూడా మన లాంటి ప్రజాస్వామిక దేశాలలో ఎంత అసంబద్ధమో వెల్లడైంది. విశా లాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాసిన ఈ ఉపోద్ఘాతం అలెగ్జాండర్ సోల్జ్‌నిత్సిన్ నోబెల్ పురస్కారం అందుకుంటున్నప్పుడు చెప్పిన మాటతో ముగించారు. అది- ‘వాస్తవాన్ని చెప్పే ఒక్క పదం ముందు కూడా ఈ విశాల విశ్వం తేలికై పోతుంది’.

చరిత్ర విభాగంలో ఖండనమండనలు

ఇందులో వేర్పాటువాదులు తరుచు ప్రస్తా వించే పదిహేను చారిత్రకాంశాలు, వాటికి విశా లాంధ్ర మహాసభ ఖండనలూ, వివరణలూ ఉన్నాయి. 2500 సంవత్సరాల తెలుగువారి చరిత్రలో తెలంగాణ 2200 సంవత్సరాల పాటు ప్రత్యేక ఉనికిని కలిగి ఉందంటూ ఉద్యమకారులు చేసే ప్రస్తావనను మహాసభ అసత్యమని పేర్కొన్నది. సమీప గతంతో సహా తెలుగువారంతా ఎప్పుడూ ఒకే రాజకీయ అధికారం కింద ఉన్నారని ఆయా చారిత్రక సందర్భాలను ప్రస్తావించారు. కొన్ని కొన్ని సమయాలలో వేర్వేరు రాజకీయ అధికార శిబి రాల కింద ఉన్నప్పటికీ తెలుగువారంతా భాషా సాంస్కృతిక ఐక్యతతోనే ఉన్నారని వివరించా రు. నిజాం కాలంలో ఉన్న మత సామరస్యం ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత భగ్నమైం దన్న వాదనను కూడా ఖండించారు. అప్పుడు ముస్లింలు 12 శాతమే అయినా సైనిక, పోలీసు వ్యవస్థలలో 90 శాతం వారికే ప్రాధాన్యం ఉండేదని దీనికి సమాధానం ఇచ్చారు. ఆం ధ్రతో తెలంగాణను విలీనం చేయడానికి నెహ్రూ బద్ధవ్యతిరేకి అంటూ వినిపించే వాదం లోను, విశాలాంధ్ర ఏర్పాటు విస్తరణవాద మేనని ప్రథమ ప్రధాని వ్యాఖ్యానించార నడంలోను ఎంత మాత్రం నిజంలేదని వీరు పేర్కొన్నారు. ‘దేశ శ్రేయస్సు దృష్ట్యా విశా లాంధ్ర ఏర్పరచాలని నిర్ణయించాం’ అన్న పతాక శీర్షికతో ఉన్న ‘ఆంధ్రపత్రిక’ క్లిప్పింగ్‌ను కూడా ఇచ్చారు. నెహ్రూ ‘ఏరిన రచనలు’ నుం చి నిజామాబాద్ బహిరంగ సభ ప్రసంగం ఉదహరించారు. ఈ రెండు ప్రాంతాలను కల పడం అంటే ‘ఒక అమాయక వధువుకూ, తెం పరి వరుడికీ పెళ్లి చేయడమే అంటూ నెహ్రూ చెప్పారంటూ తెలంగాణ వాదులు చేసే వాద నను కూడా ‘విశాలాంధ్ర’ పత్రిక క్లిప్పింగ్ సాయంతో ఖండించారు.

భాషా సంస్కృతులు
ఆంధ్ర, తెలంగాణ ప్రజలు వేర్వేరంటూ, ఆం ధ్ర అన్నపదం ఇటీవల తెలంగాణ అన్న పదానికి వ్యతిరేకార్థంగా ఉపయోగించడం లోని అసంబద్ధతను మొదటిగా ఖండించడం కనిపిస్తుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్వయంగా ‘ఆంధ్రుల చరిత్ర సం స్కృతి’ అన్న పుస్తకం రాశారని గుర్తు చేశారు. ‘రెండున్నర జిల్లాల భాష’, కోస్తా వారి తెలు గును తమ మీద రుద్దారన్న ఆరోపణ, ప్రతి తెలంగాణ ప్రాంతీయుడు ఉర్దూ మాట్లా డతా డన్న వాదనను, తెలుగు భాషాభివృద్ధికి నిజాం అవకాశం కల్పించినట్టు చెప్పే మాటను మహా సభ తిరస్కరించింది.

ఆర్థిక వ్యవహారాలు

ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు నిజాం కాలంలో తెలంగాణ ఎంతో సంపద్వంతంగా ఉండేదన్న వాదనతో విశాలాంధ్ర మహాసభ ఏకీభవించలేదు. ఇందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా 25 శాతం నుంచి 300 శాతం పన్ను విధించేవారని రావి నారా యణరెడ్డిగారి ‘వీరతెలంగాణ’ పుస్తకం నుంచి ఉదాహరణ చూపించారు. 610 జీవో ఉల్లంఘన ఆరోపణ, ఉద్యోగాల రిజర్వేషన్లలో అన్యాయాలు జరిగాయంటూ గిర్‌గ్లానీ కమి షన్ సిఫారసు చేసిందన్న ఆరోపణను మహా సభ వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలో విద్య వెనుకబడిందన్న ఆరో పణ, రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ యాభై శాతం ఇస్తున్నా, అది తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్న వాదనను ఈ పుస్తకం తిరస్కరించింది. 1956కు ముందు చాలా పరి శ్రమలు ఉన్నప్పటికీ, రాష్ట్రావతరణ తరువాత అవి మూతపడ్డాయన్న వాదనను మహాసభ తిరస్కరించింది.

రాజకీయ వ్యాఖ్యలు

పెద్దమనుషుల ఒప్పందం చట్టబద్ధమైన ఒప్పందంకాదని, అధికార పంపిణీకి చెందిన ఒడంబడిక అని ఇందులో పేర్కొన్నారు. 1969 నాటి ఉద్యమంలో 350 మంది చనిపోయారం టూ పదే పదే తెలంగాణ నాయకులు చెప్పడం పచ్చి అబద్ధమని ఇందులో తెలిపారు. డిసెం బర్ 9 ప్రకటన తరువాత చిదంబరం చేసిన ప్రకటన వల్ల యువకుల ఆత్మహత్యలు పెరిగా యని ఆరోపించింది. నాలుగున్నర కోట్ల తెలం గాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్న నాయకుల వ్యాఖ్యలను, సమైక్య ఆంధ్రకు మద్దతు లేదన్న మాటను కూడా ఈ పుస్తకం తప్పు పట్టింది. నిజాం, అప్పటి భూస్వామిక వ్యవస్థ మూలంగానే ప్రజలు దారుణమైన దోపిడీకి గురైనారని చాలా చరిత్ర పుస్తకాలు, సృజనాత్మక రచనలు పేర్కొంటున్నాయని, చివరిగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు దోపిడీదారులు అన్న ఆరోపణకు సమాధా నంగా మహాసభ పేర్కొన్నది. 

3 కామెంట్‌లు:

  1. arey donga andhra na kodukullara mimmulanu thannni vellagotte varaku yelage matladutharu kabbadhaar JAI TELANGANA JAI JAI TELANGANA

    రిప్లయితొలగించండి
  2. Dopidiki alavatu padda dongalu sulabhamuga velli porugada. Thanni valla gotta varaku yinthe

    రిప్లయితొలగించండి
  3. When the so called reasons propounded by the great Telanganawadis do not stand for scrutiny and they are caught red handed while falsifying information, no wonder people like Purush who do not have the courage to accept truth will resort to such abusive language. But let loers like Purush understand that nothing gives more satisfaction and kick than the groans of the vanquished who are defeated in their own game!! So Mr Purush the abusive language you use is actually music to my ears. The more you indulge, the more kick we get!!

    రిప్లయితొలగించండి