ఆంధ్రప్రభ : సత్యం, అహింస వంటి విలువల గురించి ప్రస్తావిస్తే చాలు, మనకు గాంధీజీ గుర్తుకు వస్తారు. అలాగే ఏకపత్నీ వ్రతం, పితృవాక్య పరిపాలన, పరస్త్రీ వ్యామోహం, అనుచిత ఆగ్రహం, దానశీలం, పాతివ్రత్యం చంచలత్వం వంటి గుణగుణాల్ని గురించి మాట్లాడుకుంటే పేర్లు పనిగట్టుకుని చెప్పకపోయినా ఏ పురాణ పురుషులు, స్త్రీలు జ్ఞాపకం వస్తారో తెలిసిందే. వర్తమానంలో కూడా కొందరు విశిష్ట లేదా విలక్షణ వ్యక్తులకూ ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే, వాళ్లు (రాజకీయంతో సహా ఏ రంగానికి చెందినవారైనా సరే!) తమ గుణగణాల ద్వారానే ఎక్కువ ప్రసిద్ధులు. తాము సాధించిన సత్ఫలితాలో, దుష్పలితాలో.
విజయాలో, అపజయాలో, మాటలో చేతలో, వాటి మూలంగా కీర్తో అపకీర్తో సాధించి ఆ విధంగా అందరికీ తెలిసిన వాళ్లైపోతారు. అలా కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా విశేష గుర్తింపు పొందిన రాజకీయ నేత ఒకరు మన రాష్ట్రంలో ఉన్నారు. ఆయన మాట -మౌనం, క్రియ -నిష్క్రియ పుట్టిన ఊరు, పెరిగిన తీరు, చదువు -సంధ్య, చుట్టాలు పట్టాలు, కుటుంబ మూలాలు, ఇంటి దూలాలు, తిట్లు, ఒట్లు, బెట్లు, గతంలో చేసిన వ్యాపారాలు, వ్యవహారాలు వ్యాఖ్యలు, వర్తమానంలో భాగ్యం -ఆరోగ్యం, ఇలా అదనీ ఇదనీ కాదు, తనకి సంబంధించిన సమస్తం అస్తమానూ ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకునే విషయాలైపోయాయి. పేరు చెప్పకపోయినా, కొన్నిగుణాలు విషయాలు ప్రస్తావిస్తే చాలు మనోఫలకాలమీద ఆయన సాక్షాత్కరించే స్థాయిలో సామాన్య ప్రజల అవగాహన ఉంది. పుట్టిన తేదీ, ఊరు, సహజ లక్షణాలు, తెచ్చిపెట్టుకున్న లక్షణాలు, ప్రవచిస్తున్న సిద్ధాంతాలు అలవాట్లు, వాపు, బలిమి, కలిమి, వంటి అందరికీ తెలిసిన వాటి గురించి చెప్పేసి, ఃఃఎవరో చెప్పుకోండిఃః అంటే అంత గొప్పగా ఉండదు. కాబట్టి కొందరికే గాని ఇంకా అందిరకీ పెద్దగా తెలియని వాటి గురించే చెప్పుకుందాం. ప్రధాన లక్షణాలని వదిలేద్దాం.
(1) మూలాల ప్రభావమే కావొచ్చు, ఆయనకి చాలామంది అపోహపడుతున్నట్లు ప్రాంతీయ దురభిమానం మనసులో చేతల్లో ఉండదని చెప్పడానికి కొన్ని నిదర్శనాలున్నాయి (అ) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తనచేతిలో ఉన్న పదవుల్ని ఇతర ప్రాంతాల వారికే కట్టబెట్టేరు. (ఆ) ఆ ప్రాంతాలకి ప్రధానమైన, వరమైన, పోలవరం ప్రాజెక్టు ఃఃటెండర్ల వండర్లఃఃలో విశాల హృదయంతో, క్రియాశీలక (స్వ)లాభ దాయక పాత్ర పోషించేరు. (ఇ) స్వయంగా చేసిన యాగాల్లో స్థానికేతర రుత్విక్కులకే ఎక్కువ ప్రాధాన్యత నీయటమే కాదు, సంభావనలు కూడా అధికంగా చెల్లించారు. అందుకు స్థానిక పురోహితులు యాగస్థలంలో కోపాగ్నిని రగిలిస్తే లెక్కచేయలేదు. (ఉ) వాస్తు వైద్య సలహాలు సేవలు పొందటంలోనూ ప్రాంతీయాతీతంగానే వ్యవహరించారు. (ఊ) ఆయన విశాల హృదయం ఇరుగు ప్రాంతాలవారి పట్ల మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల ప్రజల బాగుకోసం కూడా తపించిందనుకోవడానికి, బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టుల విషయాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కనుగుణంగా వ్యవహరించడాన్ని ఉదహరించాలి.
(2) కీలక సమయంలో ఃఃఫాంహౌస్‌ఃఃలో పండుకున్నాడని ఆరోపించేవాళ్లని నమ్మొద్దు -ఆ సమయంలో ఎంత అంతర్మధనానికి గురయ్యారో అర్థం చేసుకోకపోతే ఎలా ఃఃపులి స్వారీఃఃని సురక్షితంగా ఎలా విరమించుకోవాలో, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ హైకమాండ్ పైనుంచి అందించబోయే రక్షణ తాళ్లనందుకుని, పులివీపు మీదనుంచి, ప్రత్యామ్నాయ (విభజనేతర) పరిష్కారం చెట్టుమీదికి, ఎలా ఎగబాకాలో, తగు స్థాయి వారితో సంప్రదించాలంటే, అబిడ్స్ ప్రధాన పోస్టాఫీసు నుంచి కాల్ చేసి పబ్లిక్కుగా మాట్లాడటం కుదురుతుందా అలాగే రాంగ్‌రూటులో పోతున్న కారుని దారి మరల్చాలంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ సురక్షిత మలుపును ఎంచుకోవాలా అన్నదే కదా ఆయన ప్రస్తుత సమస్య -ఇవేమీ అర్థం చేసుకోకుండా, అడపాదడపా అజ్ఞాతంలోకి పోయినా, మౌన వ్రతం పట్టినా, ఆక్షేపించటం న్యాయం కాదు. ఫాంహౌస్‌లో ఉన్నప్పుడు అదుర్స్, దూకుడు వంటి సినిమాల్ని డి.వి.డిలో చూసి ఆనందిస్తారని కొద్దిమందికే తెలుసు! పాట సాయం జైబోలో తెలంగాణాకి దక్కింది సొమ్ముల సాయం కాదు.
(3) ఆయనకు స్వపర భేదాలు లేవు -ఇతర ప్రాంతాల ప్రజలను గంపగుత్తగా, రాక్షస సంతతి, దొంగలు, దోపిడీదారులు, మోసకారులు అని నిందిస్తారన్న దొక్కటే పరిగణనలో తీసుకుంటే ఎలా తన ఆధిపత్యాన్ని సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్న సొంత ప్రాంత నేతల్ని కూడా ఃఃచవటలు, దద్దమ్మలు, ద్రోహులు, అటూ ఇటూ కానోళ్లు, అని ఒక్కోసారి ఇంకా ఘాటుగా ఃమై సన్స్‌ః ఃయువర్ మదర్‌ః వంటి ఆంగ్ల పద ద్వయాలు యొక్క ముతకానువాద తెలుగుపదాలతో సత్కరించటం లేదా?
(4) ఎవరోలా రెండెకరాల కుటుంబంలో పుట్టలేదు. ఎన్నో ఎకరాలలో విస్తరించిన సొంత ఇల్లు ఉన్నవాణ్ణి అని దైర్యంగా ప్రకటించారాయన -ఇంకెవరో అంటున్నట్లు నిజంగా 50 వేల కోట్లు సంపాదించి ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు ఆ సంగతీ నిర్భయంగా చెప్పేస్తారు! సున్నాలను ముట్టుకోకుండా మొదటి అంకె ఐదు బదులు రెండు ఉండాలో ఏడు ఉండాలో ప్రకటించేస్తారు. ఈ లోగా మనం కాకి లెక్కలు వేసుకోవటం అనవసరం.
(5) వసూళ్లు లేకుండా ఏ ఉద్యమం జరిగింది ఈ ప్రపంచంలో ఈ ప్రశ్న ఆయనకాదు గాని కుటుంబ సభ్యులు, అనుయాయులు ఇప్పటికే లేచి, పరోక్షంగా కొంత నిజాన్ని ఒప్పుకున్నారు గదా -ఎవరు, ఎంత, సొమ్ములిచ్చారో ఎలా సహకరించారో అంతా బట్ట బయలుచేసేస్తే, పరువుపోయేది, ఇతర ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక సినిమా, మీడియా, రియల్ ఎస్టేట్ వర్గాలదే! అందుకే ఆ వివరాలు చెప్పటంలేదు -ఈ నేపథ్యంలో జమాఖర్చు -మిగులు లెక్కలు అడగటం ధర్మం కానేకాదు -సభ్యత అసలే కాదు-
(6) ఆయనను క్షమాగుణం కూడా ఎక్కువే! ఏదో ఒకసారి మూడ్ బాగోక, అలవాటైన రీతిలో చనువుగా మందలిస్తే, ఒక దళిత నాయకుడు నన్ను పలానా అశ్లీల పదంతో (ల గుణింతంలోది లెండి!) అచ్చతెలుగులో తిట్టేడని బయటికొచ్చి టీవీల సాక్షిగా నానాయాగీ చేసినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పార్టీ లోకి తీసుకుని పెద్ద పదవినిచ్చేరాయన -ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఃఃచెయ్యిచ్చినఃః ఎమ్మెల్యేలకూ త్వరలోనే క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేనా, తనని ఎంతో పరుషంగా తిట్టిన వాళ్లనెందరినో అక్కున చేర్చుకున్న ఉదాహరణలు పెక్కు-
(7) పితృవాత్సల్యం ఆయన సుగుణాల్లో ఒకటి -కుటుంబ సభ్యుల్ని ప్రేమించనివాడు, వాళ్లను పైకి తీసుకురాని వాడు, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరించలేడు.
(8) ఆయనకి దూరదృష్టి కూడా మిక్కుటం -అందుకే ఃఃఇక్కడ పుట్టినోళ్లంతా మావోళ్లేఃః అనేశారు ఉదారంగా -తగిన సమయం వచ్చినప్పుడు తెలుగువాళ్లంతా, ఆ మాటకొస్తే భారతీయులంతా ఒక్కటే అంటారు. భారత రాజ్యాంగం గురించి ఆయనకు తెలియదనుకోవద్దు -బుడ్డిపేట బుల్లోడు అని ఎద్దేవా చేయరాదు.
(9) ఏదో అవసరార్థం, నేడు ఎన్ని వితండ వాదాలు వినిపిస్తున్నా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నా, ఇదంతా ప్రజలు అంతిమంగా జ్ఞానోదయం పొందడానికి, నిజాన్ని గ్రహించడానికి చేసే ఒక వినూత్న నకారాత్మక ప్రక్రియలో భాగంగా అర్థం చేసుకోవాలి. పూర్వం నాస్తికులను లేదా సంశయాత్ములను ఆస్తికులుగా మార్చడానికి కొందరు రుషులు ఇలాంటి విధానాన్నే అవలంబించేవారట. దైవదూషణ ఏవగింపు కలిగే స్థాయిలో చేసేవారట. అందరికీ తెలిసిన నిజాల్ని ఖండించేవారట. అబద్ధాలు అలవోకగా చెప్పేవారట. అదే రీతిలో మనజాతి, రీతి, నీతి, సంస్కృతి, వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు అన్నీ లేరనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో ఆయన అంతిమధ్యేయం, ఇదో పిచ్చిరాద్ధాంతమని ప్రజలే తెలుసుకుంటారన్నదే మార్గం ఏదైతేనేం, అంతిమ ఫలితం ముఖ్యం కదా.
ప్రధాన వివరాలు, గుణగణాలు వదిలేసినా పైన చెప్పిన క్లూలతో పేరు చెప్పక పోయినా ఈ ప్రముఖుడెవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరికీ కరెక్టు ఆన్సరే వస్తుంది. కాబట్టి నగదు బహుమతి ఏదీ ఉండదు. కాదంటే అనంతం అమూల్యమైన తెలుగుతల్లి దీవెనలు లభిస్తాయి వచ్చేవారం ఇంకో విషయంపై వ్యాసం ఉంటుంది గాని కరెక్టు ఆన్సర్ ప్రకటించబడదు.

చేగొండి రామజోగయ్య
(వ్యాసకర్త విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు)