23, జనవరి 2012, సోమవారం

ఎం.ఎస్. రాజలింగం అమర్ రహే!

 స్వాతంత్య్రసమరయోధుడు, రాష్ట్ర మాజీ మంత్రి, అలనాటి 'విశాలాంధ్ర మహాసభ'లో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ ఎంఎస్ రాజలింగం గారు సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం- విశాలాంధ్ర మహాసభ 


కలసి ఉన్నా.. విడిపోయనా.. విద్వేషం వద్దు : ఎం ఎస్ రాజలింగం ( ఆంధ్రభూమి, మే 28,2010)  

కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రలోకానికి ఎన్నో పాఠాలు నేర్పింది. సామ్రాజ్య చరిత్రలో విజయంగురించి ఎంత ఘనంగా చెప్పుకున్నామో ఓటనిని గూర్చి కూడా చెప్పుకొని అంత మిక్కుటంగా బాధపడ్డాము. కాకతీయుల చరిత్రలో విజయం, పరాజయం ఒకరి సొత్తుకాదని అది దైవ నిర్ణయంపై ఆధారపడినదని అనుభవము చెప్పుచున్నది. శైవ, వైష్ణవ సాంప్రదాయాల ఘర్షణలు, రెడ్డి, వెలమ పరస్పర వైషమ్యాలు సామ్రాజ్యాన్ని కూల ద్రోశాయి. ఓరుగల్లు, కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకొని గర్వించడం మాత్రమే మనకు మిగిలింది. చరిత్ర పుటలు త్రిప్పినప్పుడు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఓరుగల్లు ప్రాశస్త్యమును గూర్చి చెప్పినప్పుడు గర్వించని సన్నివేశము లేదు. ఆంధ్ర విద్యాభివర్థనీ సంఘానికి ఉదయరాజు రాజేశ్వరరావు అధ్యక్షులుగాను , నేను కార్యదర్శిగానూ పనిచేశాము. చందా కాంతయ్యఆర్థిక సహాయముతో సంస్థ ఏర్పడ్డది. ఈ సంస్థ ద్వారా ఎ.వి. హైస్కూలు ప్రారంభించబడి క్రమాభివృద్ధి చెందింది. 1950లో ఎ.వి. హైస్కూలు ఉత్సవాలలో బూర్గుల రామకృష్ణారావు చారిత్రకప్రాధాన్యం ఉన్న ఓరుగల్లు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానికాక తప్పదని అన్నారు.ఫజల్ ఆలీ కమీషన్ వచ్చిన రోజులలో నీటి వసతి లేని కారణంగా ఓరుగల్లు రాజధానిగా సూచించుటకు వెనకా, ముందు అయినాము. 1949-50 సంవత్సరంలో విశాలాంధ్ర మహాసభ ఓరుగల్లులో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. నేను, ఒరిస్సా ప్రాంతమునకు చెందిన ప్రకాశ్ చంద్ర శతపథి కార్యదర్శిలుగా ఉన్నాము. తెలంగాణ నుంచి రామానంద తీర్థ స్వామి, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, కోదాటి, కాళోజీ, ప్రభృతులు పాల్గొన్నారు. ఆ సమయంలో , చందా కాంతయ్య ఆంధ్రుల ఆధిపత్యమును గూర్చి తెలంగాణ వారికి భయం ఉందన్నారు. ఈ విషయం ఆనాటి మహాసభకు హాజరైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, వావివాల, మాదల వీరభద్రరావు లాంటి పెద్దలకు తెలియజెప్పడం జరిగింది. ఆంధ్రకేసరి శ్రీ ప్రకాశం పంతులు‘‘ నేను బ్రతికుండగా మీకు అన్యాయం జరుగుతుందా?’’ అని ప్రశ్నించారు. దానితో ఆ సమస్య అప్పుడు సమసిపోయింది. 

విశాలాంధ్ర మహాసభ హైద్రాబాద్‌రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇరు పక్షాలకి భిన్న విశ్వాసాలు ఉన్నా మనసా, వాచా, కర్మణా ఎవరి విశ్వాసాలను వారు ప్రజలవద్దకు తీసుకువెళ్ళారు. పరస్పర దూషణలు, దెబ్బలాటలు లేకుండా ఎవరి భావాలను వారు సభల ద్వారానూ, పత్రికల ద్వారానూ ప్రచారం చేసుకున్నారు. కాని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంవారు ఇరువురూ ఒకరి ప్రాంతానికి మరొకరు రాకూడదని పొరపాటున కూడా అనలేదు.ఆరోజులలోనే ఇల్లెందులో గ్రంథాలయ మహాసభ జరిగింది. ఆ మహాసభకి సురవరం ప్రతాపరెడ్డి (గోల్కొండ పత్రికాధిపతి)గడియారం రామకృష్ణ శర్మ, వానమాముల వరదాచార్యులు, కాళోజీనారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు ప్రభృతులు హాజరయ్యారు. ఆ మహాసభలో ఆంధ్రమాత, తెలుగుతల్లి కీర్తనలు ప్రతిధ్వనించాయ..... ప్రాంతీయ భావాలు, విడిపోవాలనే ధోరణులు ఎక్కడా కనపడలేదు. ఇరు ప్రాంతాల వారు కలిసి ఉండాలనే సమైక్యభావములు చల్లపల్లి వెంకటశాస్ర్తీ, దాశరథి రంగాచార్యుల కలాలలో అక్షర రూపం దాల్చాయి. 1946లో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభ ఓరుగల్లు లో జరిగింది. అక్కడ ఆంధ్ర, తెలంణ కవుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు విచక్షణా రహితంగా నా (ఈ రచయిత) పై దాడి చేశాయ. దెబ్బలు తగిలినవి. ఈ విషయం మహాత్మా గాంధీకి తెలిపాము. గాంధీ- అహింసతో మీరు ఈ ఉద్యమాన్ని ఎదుర్కొన్నారు. సర్‌మీర్జా ఇస్మాయిల్ త్వరలో హద్రాబాద్ రాష్ట్రానికి ప్రధానిగా వస్తున్నారు. మీరు తొందరపడవద్ద-ని సందేశాన్ని పంపారు.. ఓరుగల్లు కోటలో జాతీయ జెండా ఎగురవేయబడ్డది. ఆ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ కార్యకర్త, బలహీన వర్గాలకు చెందిన బత్తిని మొగలయ్యను బహిరంగంగా బల్లెంతో పొడిచి, చంపిరు. ఇట్టి పరిస్థితులలో హంతకుడు కర్నూలులో ఉన్నాడని తెలిసి, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ఆ నిందితతుని తరలింపునకు వారంట్ ఇప్పించాఠు. ఆంధ్ర, తెలంగాణ భాషలో యాస వేరైనా అందరి సంస్కృతి ఒక్కటే అని గుర్తించి వ్యవహరించిన రోజులవి. ఇలాంటి ఘట్టాలలో ఆంధ్రా, తెలంగాణ వాదులు ఎవరైనా, వాచా, మనసా, కర్మణా, మానవతా దృష్టితో మాత్రమే వ్యవహరించినందువల్లనే చిక్కులూ విభేదాలు ఆనాడు అవుపడలేదు.ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ నాయకుల ఆలోచనలలోని ఆంతర్యము తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. రాజకీయ పరిశీలకులు, గత అనుభవాలు, 50 సంవత్సరాలకు పైగా చూచినవారికి ఈ ఉద్యమాలన్నీ ప్రజలకు దూరం అవుతున్నాయేమో అనిపిస్తున్నది. కాని ఉద్యమ నిర్వాహకులు మాత్రం ప్రజలకు చాలా సన్నిహితంగా ఉన్నామనే భావనలో ఉన్నారు. 

సైద్ధాంతిక విభేదాలు తీవ్రంగా ఉన్న రోజులలో కూడా పరస్పరంగా వారివారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకున్నారు గాని ఒక పార్టీవారు మరొక పార్టీవారిని తమ ఊరిలోకి రాకూడదని ఎవరూ శాసించలేదు. ఇప్పుడు ఈ హక్కు కేవలం ప్రొఫెసర్ కోదండరాంకే ఉన్నట్లుగా కనపడుచున్నది. సర్వదేవభట్ల రామనాథం సిసలైన కమ్యూనిస్టు నాయకులు. ఆస్తినంతా కమ్యూనిస్టు ఉద్యమానికి ధారపోసిన మహా వ్యక్తి. వారితో 1952 సార్వత్రిక ఎన్నికలో శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయవలసి వచ్చింది. ఎన్నడూ ద్వేషపూరిత స్వార్ధపూరిత వాతావరణం కనిపించలేదు. పార్టీ ప్రతిష్ఠ, సంస్థల ప్రతిష్ఠలు మాత్రమే ప్రాధాన్యత వహించేది. ఆనాటి నాయకులుగాని, కార్యకర్తలుగాని ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకటిగా ఉండేది. ఆ కారణంగా వైరుధ్యాలు ఉన్న దశలో కూడా పరస్పర విశ్వాసము ఉండేది. సభలు, సమావేశాలు ఉధృతంగా జరిగినాయి. మేము కాంగ్రెస్ వారము, కమ్యూనిస్టులు ఒక టేబుల్ వద్ద కూర్చొని భోజనంచేశాము. ఇది ఆనాటి విద్యాలయాలు గురువులు అభ్యసింపచేసిన పాఠాలు. కాని దీనికి భిన్నంగా ‘‘నేడు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, అధినేతలు కొందరు వ్యవహరించడం చాలా బాధాకరంగా ఉంది.చిల్లంచర్లలో 1957లో శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థినైన నాకు, కమ్యూనిస్టు అభ్యర్థి గోపాలరావుకు పోటీ జరిగింది. చెట్లముప్పారం గ్రామంలో గోపాలరావు అనుయాయులు మమ్ములను మీటింగ్ పెట్టుకోనివ్వలేదు. ఉద్రిక్త వాతావరణంలో మా కార్యకర్త శ్రీనివాసరావును ముక్కుపై వేటువేస్తే సగం ముక్కు తెగింది. నేను గోపాలరావు వద్దకు వెళ్ళి ఇదేమిటని అడిగా, అతను చాలా బాధపడ్డాడు. అతను ముందుండి మా సమావేశం నడిపాడు. ఆ తరువాత వారి సమావేశం జరిగింది. రెండోరోజు గోపాలరావు నన్ను భోజనానికి పిలిచాడు. వైద్య చికిత్సకు కూడా ఇరువురు కలిసివెళ్ళాం. నిజాం ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎదిరించవలసివస్తే అందరూ కలిసి నిర్వహించే కార్యక్రమాన్ని తలపెట్టి నిర్వహించేవారు. 

తెలంగాణ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టు అగ్రనాయకుడు రావి నారాయణరెడ్డి, పోరాటాన్ని ఒక దశలో కాంగ్రెస్ తరపున నడిపిన రేపాల క్యాంప్ అధినేత కోదాటి నారాయణరావు కలిసి కూర్చొని సమీక్షించుకొని తప్పులు దిద్దుకోవటం జరిగేది. వారిరువురి సిద్ధాంతాలకు అఘాతం లేకుండా చూచుకునేవారు. ఇలాంటి వివిధ ఘట్టాలలో కూడా , ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి రావద్దని కాని, ఆ ప్రాంతం వారు ఈ ప్రాంతమునకు రావద్దని కాని ఆంక్షలు విధించిన నాయకులు ఆ రోజులు వేరు. ఆ కీర్తి ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాంవంటి వారికే దక్కింది. బహిష్కరణ ఉద్యమాలు ఎవరు ఎప్పుడు ఏ కారణంవల్ల తలపెట్టినా అందలిలోపాలను అందుకు భిన్నమైన పార్టీలు చూపటం సహజం, సమంజసం. సభలు, సమావేశాలు చేసుకొని ఆ కార్యక్రమంలో ఉన్న లోపాలను ప్రజలకు చెప్పి తమవైపు ఆకట్టుకోవడం న్యాయం. అదే ప్రస్తుతం జై ఆంధ్ర, జై తెలంగాణా నాయకులు చేయవలసిన పని. మృదువైన తీయని మాటలతో, ప్రేమ పూర్వకమైన చర్యలు దేశ సౌభాగ్యానికి ఎంతేని తోడ్పడతాయి. గతంలో ఉద్రిక్త వాతావరణంలో ఆనాటి నాయకులు ఎలా వ్యవహరించారో తెలుసుకొని వారిని ఆదర్శంగా భావించి వారి అడుగుజాడలలో నడువాలని ఆ విధంగా జాతీయ ఐక్యతకు, అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు నారుూ కోరికను మన్నిస్తారని ఆశిస్తాను. ప్రాంతీయ బహిష్కరణ ఉద్యమాలను ఎవరు చేసినా , ఎప్పుడు చేసినా, ఎందుకు చేసినా వాటిని తెలంగాణ ప్రజలు బహిష్కరించాలి.

ఆంధ్రభూమి పత్రికకు రాసిన మరో వ్యాసం లో రాజలింగం గారు నిజాం పరిపాలనా కాలం లో పత్రికా స్వాతంత్ర్యం మరియు ఇతర పరిస్థితులను గురించి వివరించారు. 

1935లో నేను బి.ఎస్‌సి చదువుకోవడానికి నిజాం కాలేజీలో చేరాను. ఆనాటి విద్యార్థి ఉద్యమాలకి నాయకత్వం వహించానని చెప్పవచ్చు. ఆరోజుల్లో గోల్కొండ పత్రిక (తెలుగు) హైదరాబాద్ బులెటిన్ (ఇంగ్లీషు), డెక్కన్‌క్రానికల్ (ఇంగ్లీష్) ఉండేవి. ఈ పత్రికల్లో ప్రజా చైతన్యానికి సంబంధించి చైతన్యవంతులను చేసే ఏ కార్యక్రమమైన అంత తేలిగ్గా ప్రచురింపబడేవి కావు. ఆరోజుల్లో వాక్‌స్వాతంత్య్రం, పత్రిక స్వాతంత్య్రం, ఏవిధమైన న్యాయ సంబంధమైన హక్కులు ఉండేవికావు.

సికింద్రాబాద్‌లో ఒక మూల దివ్యవాణి అనే చిన్న పత్రిక ఉండేది. అది వారపత్రికో, మాసపత్రికో గుర్తులేదు. చివుకుల అప్పయ్యశాస్ర్తీ దానికి సంపాదకులుగా ఉండేవారు. వారు ఒకరుమాత్రం మేము విద్యార్థి సంఘం నుంచి పోగానే ‘‘నాయనా పిల్లలు మీరు వచ్చారు మీటింగ్ వివరాలు ప్రచురించడం నావల్లకాదు. కానీ చివరిపేజీలో మీ మీటింగ్ జరిగిందని, ఫలానావారి అధ్యక్షతన జరిగిందని వేస్తాననేవాడు. అప్పటికదే పెద్ద వరంగా ఉండేది. 1938లో మేము ‘ఆంధ్ర సారస్వత సంచిక’ తీయాలనుకున్నాం. ఆనాటి నిజాం కాలేజి అధ్యాపకులు సరిపల్లి విశ్వనాథశాస్ర్తీ, కురుగంటి సీతారామయ్య తగు ప్రోత్సాహం ఇచ్చేవారు. వారి ప్రోత్సాహంతోనే విద్యార్థి సంచిక తీయాలనుకున్నాం. కానీ మా ప్రిన్సిపాల్ టర్నరు. (The word Andhra has political significance) ఆంధ్ర అనే శబ్దం రాజకీయ ప్రాముఖ్యత కలిగింది. దానికి బదులు మీరు తెలుగు అనే పదం వాడి తెలుగు సారస్వత సంచిక అనే సంచికగా తీయమన్నారు. దాన్ని ఉల్లంఘించాము. ఈ పత్రిక అచ్చువేసిన బుచ్చయ్యలింగశాస్ర్తీని పోలీసువారు నిర్బంధించదలిచారు. కానీ ఆయన నెత్తిపై ఉన్న రుద్రాక్ష కిరీటం, చేతికి ఉన్న రుద్రాక్షదండలు మెడలో ఉన్న రుద్రాక్ష మాలలు విభూతిరేఖలు చూసి వచ్చిన పోలీసు ‘‘అయ్యా మీరెందుకు ఈ గొడవలో పడుతున్నారు. మీరెందుకు ఈ పత్రిక అచ్చువేసారు’’ అని అడిగారు. దానికి బుచ్చయ్యలింగ శాస్ర్తీ ‘‘పోరగాండ్లు వచ్చిండ్రు నేను అచ్చేసిన. దాంట్లో ఏముంది నాకు తెలియదు. ఇక మీ ఇష్టం పట్టుకెలితే పట్టుకెళ్లండి. ఆ జైళ్లోనే కూర్చుని తీరిగ్గా 24 గం.లు శివపూజ- చేసుకుంటా’’ అన్నారు. ఆయన అమాయకత్వం మమ్మల్ని రక్షించింది. ఈ రెండు ఘట్టాల్లోని ముఖ్యోద్దేశం సనాతన ధర్మసంస్థలు తెలిసో తెలియకో పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకై కొంత తోడ్పడ్డాయని చెప్పడం. మరొక ఘట్టంతో పత్రికా స్వేచ్ఛ ఎంతగా ఉండేదో తెలుస్తుంది. మేము వరంగల్ హైస్కూలులో వున్నపుడు 1933-36 ‘వ్యాసలత’ అనే చిన్న మాసపత్రిక తీసేవాళ్లం. అందులో రజస్వలానంతర వివాహం చేయాలి అని మా మిత్రుడు లక్కినేని నర్సయ్య వ్రాసాడు. అతనిని పోలీసులు పట్టుకెళ్లారు. విద్యార్థులు పోలీసుని నిలదీసి అడిగితే ఇది నేడు చిన్న విషయం, రేపు నిజాం తఖ్త్ (సింహాసనం)ని ఉల్టా (తలకిందులు) చేస్తుంది అని అన్నాడు. ఈ భూమికలోనే మరికొన్ని ప్రాథమిక హక్కులు ఏవిధంగా దెబ్బతిన్నవో చెప్పడం అవసరం. ఉర్దూ రాజభాష అయింది. బ్రిటిష్‌వారు భారతదేశంలో ఏవిధంగా వారికి అనుకూలించిన దాస్య ప్రవృత్తిగల మంత్రాంగాన్ని మనుషుల్ని సృష్టించారో అదేవిధంగా ఉర్దూను రాజభాషగా పాలకవర్గం వారు ఉపయోగించారు. ప్రాథమిక పాఠశాల సైతం అనుమతి లేనిదే పెట్టకూడదని ఒక సర్క్యులర్ జారీచేసింది. 1929లో లార్డ్‌ఇర్విన్ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు ఈ క్రిందివిధంగా ఉపన్యసించాడు. "It will be the fast of a mature statemenship so as to shape the policy of Osmania University so that it may have as strong apeal to the Hindus as to the Mohamadans subjects of your state.'' ఈ విధంగా ఉర్దూ భాష పేరిట మతఛాందసాన్ని ప్రభుత్వం పెంచింది. వారికి కీలక స్థానాల్లో ఉద్యోగాలనిచ్చింది. ఉద్యోగాలకి అర్హత కలిగినవారు ముస్లింల్లో లేకపోతేను ఉత్తరప్రదేశ్‌నుంచి ముస్లింలను పిలిచి ఉద్యోగాలిచ్చారు. ‘‘ఇత్తెహాదుల్ ముసల్మీన్’’ సంస్థ 1936లో స్థాపించబడి మతం మార్పిడిని ప్రభుత్వ సహకారంతో చేయడానికి పూనుకుంది. 18,000 హరిజనులను ఒక్క బహదూర్‌యార్‌జంగ్ ముస్లింలుగా మార్చగలిగాడు. ఆఫీసర్లు వెట్టిచాకిరికి పూనుకున్నారు. ఒక దశలో వెట్టిచాకిరి చేయించుకోలేని ఆఫీసర్లను, జాగీర్‌దారీ, వతన్‌దార్లను అసమర్ధులుగా ప్రభుత్వం చూపింది. ఇలాటి దుశ్చర్యలవల్ల బాధపడిన ఆంధ్రులు 1920లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ పేరిట ఆంధ్ర మహాసభను ఏర్పాటుచేసారు. తద్వార గ్రంథాలయాలు స్థాపించి వెట్టిచాకిరీ నిర్మూలనకు, రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు లేవదీసారు. ఈ ఉద్యమాల తాకిడివల్ల నైతేనేమి, భారతదేశంలో రాజకీయంగా వస్తున్న మార్పులవల్లనైతేనేమి రాజ్యాంగ సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. అయ్యంగార్ కమిటీ 1939లో ఏర్పాటైంది. 132 స్థానాలు హైదరాబాద్ శాసనసభలో ఉండేటట్లు దానిలో 76గురు ఎన్నుకోబడేటట్లు సంస్కరణలు సూచించబడ్డాయి. జిన్నా సూచనపై Functional Representation (వృత్తిపరమైన ప్రాతినిధ్యం) ఇవ్వబడింది. రైతులకు, ఇండ్ల యజమానులకు, కిరాయిదారులకు, జాగీరుదారులకు, కూలీలకు, డాక్టర్లకు వకీళ్లు వ్యాపారస్తులు ఇత్యాది వృత్తులవారికి ఇవ్వబడింది. 51% ఓట్లు వస్తే వారు గెలిచినట్టు లెక్క. పై 76 సీట్లుకాక 56 మందిని ప్రభుత్వం నామినేట్ చేయ నిశ్చయించింది. ఈవిధంగా ఆందోళన జరుగుతున్న రోజులలో 1941లో వ్యక్తి సత్యాగ్రహం జరిగింది.

వ్యక్తి సత్యాగ్రహం తరువాత 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌వారు భాగస్వాములయ్యారు. బార్డర్ క్యాంపులు పెట్టి కాంగ్రెస్‌వారికి శిక్షణ ఇచ్చి నిజాం వ్యతిరేక పోరాటం క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్‌వారు చేశారు. కమ్యూనిస్టులు ప్రజాయుద్ధం అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉన్నారు. బహదూర్‌యార్‌జంగ్ ఆనాటి హైదరాబాద్‌కు తోడు బీహార్, ఉత్తర సర్కార్‌లు కలుపుకొని ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ఏర్పడాలని కోరాడు. నిజాం వరల్డ్ ముస్లిం ఫెడరేషన్‌కి హైదరాబాద్ కేంద్రంగా ఉండాలని కోరుకున్నాడు. దీనిలో బహదూర్‌యార్‌జంగ్ ప్రముఖ పాత్ర వహించాడు. 1942నుంచి 1946 వరకు తెలంగాణ కమ్యూనిస్టు సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆశయాల కనుగుణంగా జరిగాయి. 1946లో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యాన బిందు అధ్యక్షతన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాచరణ సంఘం ఏర్పడింది. సత్యాగ్రహాలు, సాయుధ పోరాటాలు నిజాంకి వ్యతిరేకంగా జరిగాయి. పరిటాల లాంటి కొన్ని గ్రామాలు రిపబ్లిక్‌గా ప్రకటించుకొనబడ్డాయి. ఈవిధంగా జరిగిన పోరాటాల ఫలితంగా 17.09.1949న నిజాం ప్రభువు, రజాకార్లు భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.

 
మరపురాని ధన్యజీవి,ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ: ‘ఆరని నీటికొలనక్కట పూచిన తమ్మికన్, విధి ప్రేరణ రాలిపోయినవి, రేకులు తొంబది తొమ్మిది! అన్నట్లుగా కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులలో ఒక్కొక్కరే తనువు చాలిస్తున్నారు. నిన్నటిరోజు కన్నుమూసిన ఎం.ఎస్.రాజలింగంఅటువంటి చరితార్థులలో ఒకరు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం ఒక ఆరని నీటి కొలను. అందులో శతపత్ర పరంపర నిర్నిద్రంగా ప్రభవించింది. జాతీయోద్యమం నాటికీ ఆ పరంపర జాతికి నాయకశ్రేణిగా మారి పతన స్థితిలో ఉన్న జాతి జనులకు ఆత్మగౌరవం కల్పించి ధర్మంకోసం పోరాటం నేర్పింది. వారి కృషి ఫలితమే నేటి, మన రాష్ట్రం. ఆ నిర్మాతలలో నిస్సందేహంగా ఎం.ఎస్.రాజలింగం ఒకరు.

రాజలింగం 1919 ఫిబ్రవరి 9వ తేదీన వరంగల్‌లో జన్మించారు. అక్కడే మెట్రిక్ పాసయ్యారు. నిజాం కళాశాలలో బిఎస్సీ చేసి ఉస్మానియాలో ఎల్.ఎల్.బి. చేశారు. విద్యార్థి దశనుండే రాజకీయాలలో పాల్గొనేవారు. అవి సాహిత్యరూపంలో ఉండేవి. సాధనా సమితిలో చేరి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ చదువు పూర్తి అయ్యేనాటికి ఆయన మీద పోలీసు నిఘా తీవ్రమై రాష్ట్రం విడచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. పిట్టల వాని వేషంలో స్టేటు వదలి వార్థా చేరుకున్నారు. గ్రామీణ విద్యాలయంలో జె.సి. కుమారప్ప ఆధ్వర్యంలో గ్రామ పరిశ్రమణ శిక్షణ పొందారు. సేవాగ్రాంలో ఆశ్రమ మేనేజరుతో ఏర్పడిన విభేదాల కారణంగా గాంధీజీ, కస్తూరిబా, రాజాజీ వద్దని చెప్పగా సేవాగ్రాం వదలి వచ్చారు. మొదటినుంచి ఆయనది ఒకరికి లొంగి ఉండే తత్వం కాదు.

ఆ తరువాత కరీంనగరు జిల్లాలోని ముస్తాబాద్ గ్రామంలో 1941లో గ్రామీణ కార్యక్రమాలను ప్రారంభించారు. నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి చరఖా సంఘం ఏర్పాటుచేసారు. 1942-43లో క్విట్ ఇండి యా ఉద్యమ సందర్భంగా ఎం.ఎస్.ఆర్ అరెస్టయ్యారు. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షిక సభలకోసం వేసిన పందిళ్లను దుండగులు తగలబెట్టారు. ఎంఎస్ ధైర్యంగా తిరిగి కొత్త పందిళ్ళు వేయించారు. కవి సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. 1946లో ఓరుగల్లు కోటలో జెండా వందనం జరిగింది. జాతీయ విద్రోహశక్తులు మొగలయ్యను హత్య చేశారు. ఆ వార్తను జాతీయ పత్రికలు ప్రచురించే ఏర్పాటుచేసిన ఎం.ఎస్. రాజలింగంను వరంగల్ జిల్లా నుంచి మూడు నెలలు బహిష్కరించింది ప్రభుత్వం. వరంగల్ జైలు నుంచి ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. స్టేటు కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు ఎం.ఎస్.రాజలింగం ఎంతో బాధపడ్డారు. ఆయన చివరిదాకా స్వామీజీ పక్షంలోనే ఉన్నారు. 1950లో వరంగల్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలనే తీర్మానాన్ని ఎం.ఎస్. ప్రవేశపెట్టారు. దాన్ని కోదాటి, కొమరగిరి, చంద్రవౌళిశ్వరరావులు బలపరిచారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

1952లో జరిగిన ఎన్నికలలో వరంగల్ జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు రాజలింగమే. వరంగల్‌లో ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటుచేసే బాధ్యతను వరంగల్ పట్టణ ప్రముఖులు ఎం.ఎస్‌కు అప్పగించారు. అది ఫలించి, పాఠశాల ప్రారంభోత్సవానికి అప్పటి విద్యాశాఖ మంత్రి మహమ్మద్ ఆజమ్ విచ్చేయనున్నారు. ఆ సమయంలో ఎం.ఎస్. కుమారుడు తీవ్ర జబ్బుతో బాధపడుతున్నాడు. అత్యవసర సేవలందించవలసిన సమయంలో ఎం.ఎస్. లేకపోవడం వలన అతడికి వైద్య సహాయం లభించలేదు. ఫలితంగా పిల్లవాడు అసువులు బాసాడు. కర్తవ్యం - కుమారుడు, మధ్య కర్తవ్యం గెలిచింది. నాటి నాయకుల దేశభక్తి అలాంటిది.

1946 చివరి వారంలో మహాత్మాగాంధీ హిందీ ప్రచార సభలలో పాల్గొనటానికి మద్రాసు వచ్చారు. ఆ సందర్భంలో తిరుగు ప్రయాణంలో గాంధీజీని డోర్నకల్, గుండ్రాతిమడుగు, ఖమ్మం, వరంగల్, మానుకోట, మంచిర్యాలలో ప్రయాణం చేయిస్తే జాతీయోద్యమానికి తెలంగాణలో బలం కలుగుతుందని నాయకులు భావించారు. ఆ బాధ్యత ఎం.ఎస్.పై ఉంచారు. గాంధీజీ పర్యటన వరంగల్‌లో ఒక మధురానుభూతి.

1951 ఎన్నికల అనంతరం బూర్గుల మంత్రివర్గంలో ఉపమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించారు. ఎం.ఎస్. సమైక్యవాది అయినా తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల గురించి సమయం లభించినప్పుడల్లా గళమెత్తేవారు. వివిధ పత్రికలలో చాలా వ్యాసాలు రాశారు. బహుగ్రంథకర్తలు ఇటీవల తమ స్వీయచరిత్ర ప్రచురించారు. అది బహుళ జనాదరణ పొందింది.
 - జీ. వెంకటరామారావు

21 కామెంట్‌లు:

  1. దీని వల్ల మాకు తెలిసింది తెలంగాన వాలకి సమక్య అంధ్రా లొ చాలా ఆన్నాయం జరిగింది మరియు జరుగుతుంది...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకలా అర్థమయ్యిందన్న మాట. చానాళ్లకు దర్శనం కలిగింది.తెలంగాణకు జరిగిన అన్యాయం పూర్వ నిజాంరాష్ట్ర ప్రాంతాలైన బీదర్,రాయచూరు, లాతూర్, బీడ్, పర్భాని (ఇంకా ఇతర జిల్లాల పేర్లు గుర్తుకు రావడం లేదు) లతో పోలిస్తే గాని తెలియదు మరి.ఆ విషయాలు ఒక సారి చూసే ప్రయత్నం చేద్దామా?

      తొలగించండి
  2. తెలంగాన ఉద్యొగులకు జరిగిన అన్నయానికి నిజాం , బిధర్, రయాచుర్ కి ఏమి సంబందం ???

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకు లేదు?మీరు తెలంగాణ ఉద్యోగుల తరపున మాత్రమె వకాల్తా పుచ్చుకోన్నారా? నాకేం తెలుసు? మీ వ్యాఖ్యలో తెలంగాణ వాలకి అని ఉంది. తెలంగాణ ఉద్యోగులకు ఏమంత కష్టం ముంచుకొచ్చింది? పని ఎగ్గొట్టినకాలానికి కూడా జీతాలు రాలేదనా? కాదు కదా!

      నిజాం పాలన లో ఉత్తరాది నుండి దిగుమతి చేసుకొన్న ఉద్యోగులు, ముల్కీల గొడవల జామానాలో మనం లేము కదా!మన దేశంలో ఏయే రాష్ట్రాలలో జోనల్ వ్యవస్థ ఉందండీ? మొత్తం కింది స్థాయి ఉద్యోగులలో తెలంగాణ జిల్లాలనుండి కాకుండా ఇతర ప్రాంతాల వారు ఎంత శాతం ఉన్నారండీ?

      ఎప్పుడో 1969 లో రాష్ట్ర మంత్రి పీవీ నరసింహారావు గారు గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ లెక్కలు చెప్పారు
      "తెలంగాణకు చెందిన శ్రీ విటల్ రావు గారు జిల్లాల్లో తిరిగి అంకెల వివరాలు సేకరించారు.నాన్ ముల్కీల సంఖ్య నిచ్చారు. దాదాపు 5200 మంది నాన్ ముల్కీలు ముల్కీలకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో వున్నట్లు తేలింది. ఇందులో 1600 మంది ఉపాధ్యాయులు ,1800 మంది నర్సులు,ఆగ్జిలరీ నర్సులు, మిడ్ వైఫ్లు, 400 మంది స్టెనోగ్రాఫర్లు, 300 మంది ప్యూన్లు మిగిలినవారు ఇతరులు.లోపం యొక్క పరిమాణాన్ని ఆలోచించక తప్పదు. ఈ 1600 మంది ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ వారే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు లభించకపోవడం వల్లనే చేర్చుకొన్నారు. 1956 తర్వాత శిక్షణ అవకాశాలను ఎంతో అభివృద్ధి చేసుకొన్నాము.మరో రెండు శిక్షణ కళాశాలలు ఈ మే నుంచి ప్రారంభమవుతున్నాయి.భవిష్యత్తులో ఈ లోపం జరుగదు. నర్సులున్నారంటే దేశమంతా కేరళ నర్సులున్నారు. స్థానికంగా మహిళలు లభించక కేరళవారిని నియమించుకోవలసి వచ్చింది . ఇప్పుడు ప్రభుత్వము, ఆంధ్రమహిళాసభ నర్సుల శిక్షణా సౌకర్యాలను పెంపొందిస్తున్నాయి.అయినా ఎక్కువమంది ఈ సౌకర్యాల్ని ఉపయోగించుకోవడం లేదు.స్టెనోగ్రాఫర్లు ఆనాడు ఇక్కడ లభించలేదు. సౌకర్యాలను ఉపయోగపరచుకొనే చైతన్యాన్ని కూడా వెనుకబడిన ప్రాంతాల్లో కలిగించవలసివుంటుంది. ఇవన్నీ తీసేస్తే ఇక 1200 మంది మేరకు ముల్కీలకు రావలసిన ఉద్యోగాలు రాలేదని తేలుతుంది. తెలంగాణ ప్రాంతంలో లక్షాఏడు వేల ముల్కీ ఉద్యోగాలలో ఈ 1200 ఎంత అని ఆలోచించాలి."

      అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ విద్య,ఉపాధి విషయాల్లో ఇతర ప్రాంతాల కన్నా త్వరితగతిన అభివృద్ధి చెందింది.అందులో ఏమైనా అనుమానం ఉందా?వుంటే అధికారిక లెక్కలను పరిశీలించుకోవచ్చు

      పోనీ మీరు రాష్ట్ర స్థాయి సర్వీసులు, కేంద్ర స్థాయి సర్వీసుల గురించి మాట్లాడుతున్నారా? అందులో కూడా విద్యసౌకర్యాలు, అక్షరాస్యత పెరగడం మూలంగా గత కొన్ని సంవత్సారాలుగా తెలంగాణ విద్యార్థులు బాగానే రాణిస్తున్నారు కదా?మెరిట్ ప్రామాణికంగా ఉన్న వాటిలో అంతకన్నా ఏమి ఆశించవచ్చు?తెలంగాణ జిల్లాల్లో విద్యావ్యవస్థ మెరుగు పరచడానికి ఇక్కడి వేర్పాటువాద నాయకులు ఏమాత్రం కృషి చేసారేమిటి?

      పోనీ మీరు ఎవరో కొందరు వ్యక్తుల ప్రమోషన్ల గురించి చెబుతున్నారా? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?అటువంటి అన్యాయాలు మన దేశంలో తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమా? అయినా కొందరు వ్యక్తుల సమస్య ప్రాంతీయ సమస్యగా ఎప్పుడు మారింది?దానికి జనాలతో ఏం సంబంధం?? అరవయ్యో దశకంలో అంటారా నూటికి యాభైకు పైగా ఉద్యోగాలు(నాకు ఖచ్చితమైన సంఖ్య గుర్తులేదు) ప్రభుత్వ శాఖలలో ఉండేవి ఇప్పుడు ఉద్యోగస్తులలో ప్రభుత్వోద్యోగుల శాతం ఎంతేమిటి? కచరాకు ఆయన సేనకు బులబాటం ఎక్కువయిందని చెప్పి మన తాతయ్యలు,నానమ్మలు పాడుకున్న పాత పాట ఇప్పుడు పాడితే ఎలాగా?

      తొలగించండి
    2. here the question is why we should give our share to someone? whether that is one post or two..one paise or two..
      on that day that was one. what about today?what is the cumilative effect of it? we last our 15 year domicile safeguard. why we should lost? if telangana continues... the safe guard might continue!
      if we face any scarecity we might appoint outsiders on temporary basis...until we got trained. why this andhra headache? they came here with promises and occupied all. and telling stories after eating all.
      after nizam rule thousands of muslims removed from services...for the sake of andhra's employment.
      the idiot politicians gave scope to them .they were afraid of comunist's rule. one of that idiot is PV.
      and coming to PV style.... the grand man show the same attitude in respect of babri mazid. today we are facing the concequences in the form of terrorism, attacks.. blasts....etc.
      the only person responsible for all this is PV.
      And who is this vithal rao and what excersize he done in counting posts. his report is superior to TNGO's report?
      and atlast the VBRaju, MS families migrated from andhra.. the parrots sing andhra song......... naturally!!

      తొలగించండి
  3. Cruel fate has taken away many of our great leaders in the last couple of years. Narayanrao Pawar, MP Gautam, Midde Ramulu, KG Kannabiran, Prof. K. Jayashankar, Burra Ramulu, G. Pullareddy, MS Rajalingam, C. Jagannadha Rao and many more have ended their physical journey. Telangana (indeed India) mourns them.

    This is not an appropriate time to go into the political stand or personal aspects of these individuals. Allah miya hisab karega khayamat ke din.

    The above holds good for those who gave up their life for Telangana or other causes like communism.

    రిప్లయితొలగించండి
  4. Please visit our blog: http://telugujativedika.blogspot.com/ for some more details of life of Sri M.S. Rajalingam.

    రిప్లయితొలగించండి
  5. Very dignified gentleman from a different era. It is worth mentioning Chukka Ramaiah's article in KCRs paper yesterday and its insight into the life and times of Sri Rajalingam.

    రిప్లయితొలగించండి
  6. I feel Comparing Jayashankar with other great gentlemen is not appropriate.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. KM, I mentioned several people who passed away in the recent past irrespective of their politics. The fact that I disagree with some of these great individuals does not blind me to their work.

      The passing away of both Rajalingam & Jagannadha Rao makes it a doubly sad day for Telangana.

      తొలగించండి
  7. Even Osama Bin Laden, whose ideals are considered as the ideological basis for TRS movement died this year.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Sure but I restricted myself to Telangana people. I did not even mention the unfortunate individuals who lost their lives in Sompet.

      I don't judge the dead when I speak about their depth. Please read my comment again: "Allah miya hisab karega khayamat ke din"

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. The late G. Pulla Reddy was originally from Kurnool but settled down in Hyderabad. You appear to have missed KG Kannabiran in my list (Tamil roots, grew up in Nellore & settled down in Hyderabad). Ayi baat samajh mein?

      తొలగించండి
    2. How did hyderabad become Telangana? I didnot miss Kannabiran. I never consider the human rights ( read naxalite rights) activists as normal human beings.

      తొలగించండి
    3. Emotional statements apart, can you tell me how Hyderabad was part of Telangana. Then we shall go to is and will be.

      తొలగించండి
  9. jai saab, hamaara bhejaa, mendak ki tharah hai, baath itni jaldi samajh mein kahaa aathi hai? aur aap yeh bathaane ki kasht karenge, kurnool vaalaa pullaa reddy telangana vaalaa kaise hogaya?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. तेलंगाना हर उसकी खौम है जो उसे अपनाता है! हम जुबां का नहीं, दिल के परवाने है!

      తొలగించండి
  10. అచ్చ్హా, దిల్ భి హై ఇసకా మత్లబ్. బహుత్ ఖూబ్. యే తెలంగాణా కో అప్నానా కైసే కర్తే హై? పత్తర్ ఫెంక్ కే, జబాన్ కాట్ కే తో నహి నా ?

    రిప్లయితొలగించండి