25, జనవరి 2012, బుధవారం

ఎవరో మీకే తెలుసు!!

ఆంధ్రప్రభ : సత్యం, అహింస వంటి విలువల గురించి ప్రస్తావిస్తే చాలు, మనకు గాంధీజీ గుర్తుకు వస్తారు. అలాగే ఏకపత్నీ వ్రతం, పితృవాక్య పరిపాలన, పరస్త్రీ వ్యామోహం, అనుచిత ఆగ్రహం, దానశీలం, పాతివ్రత్యం చంచలత్వం వంటి గుణగుణాల్ని గురించి మాట్లాడుకుంటే పేర్లు పనిగట్టుకుని చెప్పకపోయినా ఏ పురాణ పురుషులు, స్త్రీలు జ్ఞాపకం వస్తారో తెలిసిందే. వర్తమానంలో కూడా కొందరు విశిష్ట లేదా విలక్షణ వ్యక్తులకూ ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే, వాళ్లు (రాజకీయంతో సహా ఏ రంగానికి చెందినవారైనా సరే!) తమ గుణగణాల ద్వారానే ఎక్కువ ప్రసిద్ధులు. తాము సాధించిన సత్ఫలితాలో, దుష్పలితాలో.

విజయాలో, అపజయాలో, మాటలో చేతలో, వాటి మూలంగా కీర్తో అపకీర్తో సాధించి ఆ విధంగా అందరికీ తెలిసిన వాళ్లైపోతారు. అలా కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా విశేష గుర్తింపు పొందిన రాజకీయ నేత ఒకరు మన రాష్ట్రంలో ఉన్నారు. ఆయన మాట -మౌనం, క్రియ -నిష్క్రియ పుట్టిన ఊరు, పెరిగిన తీరు, చదువు -సంధ్య, చుట్టాలు పట్టాలు, కుటుంబ మూలాలు, ఇంటి దూలాలు, తిట్లు, ఒట్లు, బెట్లు, గతంలో చేసిన వ్యాపారాలు, వ్యవహారాలు వ్యాఖ్యలు, వర్తమానంలో భాగ్యం -ఆరోగ్యం, ఇలా అదనీ ఇదనీ కాదు, తనకి సంబంధించిన సమస్తం అస్తమానూ ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకునే విషయాలైపోయాయి. పేరు చెప్పకపోయినా, కొన్నిగుణాలు విషయాలు ప్రస్తావిస్తే చాలు మనోఫలకాలమీద ఆయన సాక్షాత్కరించే స్థాయిలో సామాన్య ప్రజల అవగాహన ఉంది. పుట్టిన తేదీ, ఊరు, సహజ లక్షణాలు, తెచ్చిపెట్టుకున్న లక్షణాలు, ప్రవచిస్తున్న సిద్ధాంతాలు అలవాట్లు, వాపు, బలిమి, కలిమి, వంటి అందరికీ తెలిసిన వాటి గురించి చెప్పేసి, ఃఃఎవరో చెప్పుకోండిఃః అంటే అంత గొప్పగా ఉండదు. కాబట్టి కొందరికే గాని ఇంకా అందిరకీ పెద్దగా తెలియని వాటి గురించే చెప్పుకుందాం. ప్రధాన లక్షణాలని వదిలేద్దాం.

(1) మూలాల ప్రభావమే కావొచ్చు, ఆయనకి చాలామంది అపోహపడుతున్నట్లు ప్రాంతీయ దురభిమానం మనసులో చేతల్లో ఉండదని చెప్పడానికి కొన్ని నిదర్శనాలున్నాయి (అ) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తనచేతిలో ఉన్న పదవుల్ని ఇతర ప్రాంతాల వారికే కట్టబెట్టేరు. (ఆ) ఆ ప్రాంతాలకి ప్రధానమైన, వరమైన, పోలవరం ప్రాజెక్టు ఃఃటెండర్ల వండర్లఃఃలో విశాల హృదయంతో, క్రియాశీలక (స్వ)లాభ దాయక పాత్ర పోషించేరు. (ఇ) స్వయంగా చేసిన యాగాల్లో స్థానికేతర రుత్విక్కులకే ఎక్కువ ప్రాధాన్యత నీయటమే కాదు, సంభావనలు కూడా అధికంగా చెల్లించారు. అందుకు స్థానిక పురోహితులు యాగస్థలంలో కోపాగ్నిని రగిలిస్తే లెక్కచేయలేదు. (ఉ) వాస్తు వైద్య సలహాలు సేవలు పొందటంలోనూ ప్రాంతీయాతీతంగానే వ్యవహరించారు. (ఊ) ఆయన విశాల హృదయం ఇరుగు ప్రాంతాలవారి పట్ల మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల ప్రజల బాగుకోసం కూడా తపించిందనుకోవడానికి, బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టుల విషయాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కనుగుణంగా వ్యవహరించడాన్ని ఉదహరించాలి.

(2) కీలక సమయంలో ఃఃఫాంహౌస్‌ఃఃలో పండుకున్నాడని ఆరోపించేవాళ్లని నమ్మొద్దు -ఆ సమయంలో ఎంత అంతర్మధనానికి గురయ్యారో అర్థం చేసుకోకపోతే ఎలా ఃఃపులి స్వారీఃఃని సురక్షితంగా ఎలా విరమించుకోవాలో, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ పైనుంచి అందించబోయే రక్షణ తాళ్లనందుకుని, పులివీపు మీదనుంచి, ప్రత్యామ్నాయ (విభజనేతర) పరిష్కారం చెట్టుమీదికి, ఎలా ఎగబాకాలో, తగు స్థాయి వారితో సంప్రదించాలంటే, అబిడ్స్‌ ప్రధాన పోస్టాఫీసు నుంచి కాల్‌ చేసి పబ్లిక్కుగా మాట్లాడటం కుదురుతుందా అలాగే రాంగ్‌రూటులో పోతున్న కారుని దారి మరల్చాలంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ సురక్షిత మలుపును ఎంచుకోవాలా అన్నదే కదా ఆయన ప్రస్తుత సమస్య -ఇవేమీ అర్థం చేసుకోకుండా, అడపాదడపా అజ్ఞాతంలోకి పోయినా, మౌన వ్రతం పట్టినా, ఆక్షేపించటం న్యాయం కాదు. ఫాంహౌస్‌లో ఉన్నప్పుడు అదుర్స్‌, దూకుడు వంటి సినిమాల్ని డి.వి.డిలో చూసి ఆనందిస్తారని కొద్దిమందికే తెలుసు! పాట సాయం జైబోలో తెలంగాణాకి దక్కింది సొమ్ముల సాయం కాదు.

(3) ఆయనకు స్వపర భేదాలు లేవు -ఇతర ప్రాంతాల ప్రజలను గంపగుత్తగా, రాక్షస సంతతి, దొంగలు, దోపిడీదారులు, మోసకారులు అని నిందిస్తారన్న దొక్కటే పరిగణనలో తీసుకుంటే ఎలా తన ఆధిపత్యాన్ని సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్న సొంత ప్రాంత నేతల్ని కూడా ఃఃచవటలు, దద్దమ్మలు, ద్రోహులు, అటూ ఇటూ కానోళ్లు, అని ఒక్కోసారి ఇంకా ఘాటుగా ఃమై సన్స్‌ః ఃయువర్‌ మదర్‌ః వంటి ఆంగ్ల పద ద్వయాలు యొక్క ముతకానువాద తెలుగుపదాలతో సత్కరించటం లేదా?

(4) ఎవరోలా రెండెకరాల కుటుంబంలో పుట్టలేదు. ఎన్నో ఎకరాలలో విస్తరించిన సొంత ఇల్లు ఉన్నవాణ్ణి అని దైర్యంగా ప్రకటించారాయన -ఇంకెవరో అంటున్నట్లు నిజంగా 50 వేల కోట్లు సంపాదించి ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు ఆ సంగతీ నిర్భయంగా చెప్పేస్తారు! సున్నాలను ముట్టుకోకుండా మొదటి అంకె ఐదు బదులు రెండు ఉండాలో ఏడు ఉండాలో ప్రకటించేస్తారు. ఈ లోగా మనం కాకి లెక్కలు వేసుకోవటం అనవసరం. 

(5) వసూళ్లు లేకుండా ఏ ఉద్యమం జరిగింది ఈ ప్రపంచంలో ఈ ప్రశ్న ఆయనకాదు గాని కుటుంబ సభ్యులు, అనుయాయులు ఇప్పటికే లేచి, పరోక్షంగా కొంత నిజాన్ని ఒప్పుకున్నారు గదా -ఎవరు, ఎంత, సొమ్ములిచ్చారో ఎలా సహకరించారో అంతా బట్ట బయలుచేసేస్తే, పరువుపోయేది, ఇతర ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక సినిమా, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలదే! అందుకే ఆ వివరాలు చెప్పటంలేదు -ఈ నేపథ్యంలో జమాఖర్చు -మిగులు లెక్కలు అడగటం ధర్మం కానేకాదు -సభ్యత అసలే కాదు-

(6) ఆయనను క్షమాగుణం కూడా ఎక్కువే! ఏదో ఒకసారి మూడ్‌ బాగోక, అలవాటైన రీతిలో చనువుగా మందలిస్తే, ఒక దళిత నాయకుడు నన్ను పలానా అశ్లీల పదంతో (ల గుణింతంలోది లెండి!) అచ్చతెలుగులో తిట్టేడని బయటికొచ్చి టీవీల సాక్షిగా నానాయాగీ చేసినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పార్టీ లోకి తీసుకుని పెద్ద పదవినిచ్చేరాయన -ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఃఃచెయ్యిచ్చినఃః ఎమ్మెల్యేలకూ త్వరలోనే క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేనా, తనని ఎంతో పరుషంగా తిట్టిన వాళ్లనెందరినో అక్కున చేర్చుకున్న ఉదాహరణలు పెక్కు-

(7) పితృవాత్సల్యం ఆయన సుగుణాల్లో ఒకటి -కుటుంబ సభ్యుల్ని ప్రేమించనివాడు, వాళ్లను పైకి తీసుకురాని వాడు, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరించలేడు.

(8) ఆయనకి దూరదృష్టి కూడా మిక్కుటం -అందుకే ఃఃఇక్కడ పుట్టినోళ్లంతా మావోళ్లేఃః అనేశారు ఉదారంగా -తగిన సమయం వచ్చినప్పుడు తెలుగువాళ్లంతా, ఆ మాటకొస్తే భారతీయులంతా ఒక్కటే అంటారు. భారత రాజ్యాంగం గురించి ఆయనకు తెలియదనుకోవద్దు -బుడ్డిపేట బుల్లోడు అని ఎద్దేవా చేయరాదు.

(9) ఏదో అవసరార్థం, నేడు ఎన్ని వితండ వాదాలు వినిపిస్తున్నా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నా, ఇదంతా ప్రజలు అంతిమంగా జ్ఞానోదయం పొందడానికి, నిజాన్ని గ్రహించడానికి చేసే ఒక వినూత్న నకారాత్మక ప్రక్రియలో భాగంగా అర్థం చేసుకోవాలి. పూర్వం నాస్తికులను లేదా సంశయాత్ములను ఆస్తికులుగా మార్చడానికి కొందరు రుషులు ఇలాంటి విధానాన్నే అవలంబించేవారట. దైవదూషణ ఏవగింపు కలిగే స్థాయిలో చేసేవారట. అందరికీ తెలిసిన నిజాల్ని ఖండించేవారట. అబద్ధాలు అలవోకగా చెప్పేవారట. అదే రీతిలో మనజాతి, రీతి, నీతి, సంస్కృతి, వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు అన్నీ లేరనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో ఆయన అంతిమధ్యేయం, ఇదో పిచ్చిరాద్ధాంతమని ప్రజలే తెలుసుకుంటారన్నదే మార్గం ఏదైతేనేం, అంతిమ ఫలితం ముఖ్యం కదా.

ప్రధాన వివరాలు, గుణగణాలు వదిలేసినా పైన చెప్పిన క్లూలతో పేరు చెప్పక పోయినా ఈ ప్రముఖుడెవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరికీ కరెక్టు ఆన్సరే వస్తుంది. కాబట్టి నగదు బహుమతి ఏదీ ఉండదు. కాదంటే అనంతం అమూల్యమైన తెలుగుతల్లి దీవెనలు లభిస్తాయి వచ్చేవారం ఇంకో విషయంపై వ్యాసం ఉంటుంది గాని కరెక్టు ఆన్సర్‌ ప్రకటించబడదు.

చేగొండి రామజోగయ్య
(వ్యాసకర్త విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు)

29 కామెంట్‌లు:

  1. జంతు వాత్సల్యం కూడా మిక్కిలి గానే వున్నది. అందుకే పేడ రుచి కూడా చెప్పగలిగారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ ఆన్ద్రోల్లకు ఏమీ తెలియదు. అన్ని తెల్సిన పోజులోకటి.. పైగా సెటైర్లు!
      పేడ వ్యాఖ్య మీద వాళ్ళు చేస్తున్న రభస అల్లాంటిదే.
      ఇక్కడ... తెలంగాణాలో ముఖ్యంగా దక్కని ఉర్దూలో అనేక ఉపమానాలు ఉన్నాయి. అవి తెలుగు ఉపమానాల్లగా ఉండవు. వాటికంటూ ప్రత్యేకత ఉంది. ఆహార సంబంద మైన విషయాల్లో రుచి లేని వంటలను పేడతో పోల్చడం దక్కని ఉర్దూలో సాధారణం .. సాలన్ గోబర్ కే జైసే... అలా ..
      కెసిఆర్ హాజరైంది ముస్లిముల సమావేశం. వారి ఉపమానాలను ఉపయోగించడం సహజం .
      పేడ అన్నందుకే మీకు అంత రోషం పుట్టింది. మరి మా భాషను మీరెన్ని సార్లు అవమాన పరిచారు? మా తిండిని, మా తెలివిని, నడకను అవమాన పరిచినపుడు ఈ నొప్పి తెలియ లేదా?
      పేడ అంటే రాద్దాంతం చేస్తున్నారు..మరి బాగా లేని ఆహారాన్ని మీరేమంటారు?
      చండాలంగా ఉండనే కదా?
      అంటే అర్థం తెలుసా మీకు. చండాలం అనే మాట ఎవరికీ తగులుతుందో తెలుసా?
      చండాలుడు అంటే పంచముడు.
      అస్ప్రు శ్యుడు . ఈ చండాలం అనే మాట ఎన్ని కోట్ల సార్లు వాడి ఉంటారు? అలా దళితులను ఎంత అవమానించారు.
      తొక్కలో.... మాట్లాడే మాట అర్థం తెలియదు గానీ నీతులు చెప్పడానికి వస్తారు.

      తొలగించండి
    2. /అవి తెలుగు ఉపమానాల్లగా ఉండవు. వాటికంటూ ప్రత్యేకత ఉంది. ఆహార సంబంద మైన విషయాల్లో రుచి లేని వంటలను పేడతో పోల్చడం దక్కని ఉర్దూలో సాధారణం ../
      హా హా హ్వా
      పేడ రుచితో పోల్చుకోవడం ఉర్దూలో సాధారణమైన విషయమా! మంచి విషయం తెలుసుకున్నా.
      పాపం, ఎపుడో అపుడు రుచి చూడంది ఎలా పోల్చుకోగలుగుతారు లేండి. అదీ సాధారణమైన ఉపమానం అని కూడా అంటున్నారు. గుండె తరుక్కుపోతోంది. స్వాభావిక ఎరువులు దొరక్క రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అనే సమస్యకు ఓ ఆధారం చూపారు. సమస్యంత ఉర్దూతో అన్న మాట, వదిలేసి తెలుగు ఫాలో అయిపోండి. :P :))

      తొలగించండి
  2. మీరు చెప్పిన పెద్దాయన కి ఒక గొప్ప సువర్ణ అవకాశం. తెలంగాణా కి వ్యతిరేకంగా పరాయి దేశం లో, గాలిలో విమానాల్లో మాట్లాడుతున్న, తెలంగాణా ద్రోహి, సర్దార్ సింగన్న ( ప్రధాన మంత్రి), ఫిబ్రవరి 4 నాడు హైదరాబాదు మెట్రో రైలు శంఖు స్తాపనకి వస్తున్నాడు. ఆయనని ఎయిర్ పోర్టు లోనే అడ్డుకుని, రాళ్ళతో కొట్టి, వీలయితే మన తోట గంగ నర్సు( జగన్ కారు మీద వెకిలిగా నవ్వుకుంటూ కోడి గుడ్డు వేసి తరువాత, డబ్బులు ఇయ్యలేదు అని పెద్దాయనని శాపనార్ధాలు పెట్టిన మహిళా మూర్తి ) ని పిలిచి కోడిగుడ్ల తో కొట్టిస్తే , సింగన్న కి తెలంగాణ సెంటిమెంటు తెలిసి, వెంటనే వెనక్కి వెళ్లి బిల్లు పార్లమెంటు లో పెడతాడేమో. ఆలోచించండి

    రిప్లయితొలగించండి
  3. ఎలెక్షన్ ఏరు దాటగానే అన్నగారి తెప్ప తగలేసి, ఇంకో అన్న దగ్గరికి వెళ్ళిపోయినా పదో చెల్లిని కూడా చేర దీసి మళ్ళీ పదో చెల్లి పోస్టు ఇచ్చాడు

    రిప్లయితొలగించండి
  4. Prabhakar's sage advice "debate on issues, not individuals" is not obviously meant for his own cronies :)

    రిప్లయితొలగించండి
  5. ప్చ్,అందరికి అన్నే పంచిఇస్తూ బక్కచిక్కి పోయిన ఈ మహానుభావునికి మనం తిరిగి ఏమి ఇస్తున్నాం.ఈయన ఎవరో మనందరికి(భారతీయులందరికీ)తెలిసినా నోబుల్ ప్రైజ్ కమిటీ వారికి తెలియదు కాబట్టి మీరు ఈయన గురించి చక్కని ఇంగ్లీషులో(సహాయం కావాలంటే కేశవరావు ఖాళీగా ఉన్నారు)నాలుగు మంచి మాటలు(?)వ్రాసి "నోబుల్ శాంతి"పురస్కారం అయినా వచ్చేట్లు మీ వంతు కృషి చేయగలరు.మీ ప్రతిపాదనకి ఉస్మానియా ప్రొఫెసర్ గారు కూడా గట్టిగా మైకులద్వారా మద్దతు తెలియజేసేదరు.

    రిప్లయితొలగించండి
  6. తన పర బేధం లేకుండా బూతులు తిట్టగాలిగిన ఈయనకు భారత బూతు రత్న అవార్డు ఇచ్చి గౌరవించాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. /తన పర బేధం లేకుండా బూతులు తిట్టగాలిగిన ఈయనకు భారత బూతు రత్న అవార్డు ఇచ్చి/

      చెడ్డీ లేని బుడ్డోడు ( అల్లం భాషలో) కూడా బూతులలో ఎక్సపర్టే..
      ఒక్కడికి మాత్రమే భారతరత్న అంటే వేరే వాళ్ళని అవమనించినట్టే

      తొలగించండి
  7. మీ ప్రతిపాదనకి మేము బేషరతుగా మద్దతు తెలుపుతున్నాం :)

    రిప్లయితొలగించండి
  8. ఒక కారణం కోసం విభజన అడిగేవాల్లని సంతృప్తి పరచొచ్చు. విభజన కోసం కారణాలు వెతికేవారిని ఆపడం కష్టం. ఎందుకంటే వాళ్ళు సూది మొన లాంటి సమస్యని కూడా గునపం లాగా చూపిస్తారు.

    తెలంగాణా ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తే ఇక్కడ కొంతమంది చాల సంతోషించోచ్చు... కాని స......మస్య ఎక్కడుందంటే.. తెలంగాణా ఇస్తే మనం కూడా ఇదే పద్దతిలో గొడవలు, బ్లాక్ మెయిల్ చేసి రాష్ట్రాలు సాధిద్దామని ఇంకొక 21 ప్రాంతాల ప్రజలు గోతి కాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. వాటిని చూసి ఇంకా కొత్తవి రావు అన్న గారంటీ లేదు.
    పోనీ అడిగినోడికల్లా ఇద్దామా అంటే ఇంకొక సమస్య. కొత్త రాజధానుల సమస్య. సీమంధ్ర కి కొత్త రాజధాని ఇవ్వాలంటే ఒక లక్ష కొట్లన్న ఇయ్యాలి. రాయలసీమ కూడా విడిపోతే దానికి ఇంకొక యాభై వేల కోట్లు అడుగుతారు. మరి మిగతా కొత్త రాష్ట్రాలు ?? ఎన్ని లక్షల కోట్లు ?? పెట్రోల్ , గాస్ భరించ లేక చేతులెత్తిసిన ప్రభుత్వం వీటన్నిటికి డబ్బు ఎక్కడ నుంచి తీసుక రావాలి ?? హాయిగ ఇక్కడ కుర్చూని ఇచ్చేయ్యమండం తేలిక .. వాళ్ళ సమస్య కూడా తెలుసుకోవాలి కదా ?
    మనం చదువుకున్నోళ్ళం... కొంచం బుర్ర పెట్టి ఆలోచిద్దాం. మొండెడ్డు లాగా మేము అడిగినం కాబట్టి ఇయ్యలె అనకుండా కొంచం ఇయ్యల్సిన వారి స్థానం నుంచి కూడా ఆలోచించాలి..ముందు మనం భారతీయులం తరవాతే తెలంగాణా అయినా సీమాంధ్ర అయినా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పటి దాంక ఎన్ని రాష్ట్రాలకు రాజధాని కట్టుకోనీకే ఎంతెంత ఇచ్చిన్రో చెప్పి పుణ్యం కట్టుకొండ్రి. Capital packages వస్తే Kurnool శామియానలల ఎందుకు ఉన్నరండి పాపం ఆంధ్రోల్లు.

      తొలగించండి
  9. How long do you guys take shelter on much debunked Lagadapati theory? How pity, can't VMS create their own argument for a change?

    You guys are suffering with the phobia of change aversion. Seriously in need of some management tutorials.

    రిప్లయితొలగించండి
  10. ఆ మహానుభావుడి గురించి ఇంకొక విషయం చెప్పడం మరిచ్పోయారు. ఆయన ఏది చేసినా లోకోపకారం కోసమే చేస్తారు. అది ఎదుటివారిని తిట్టడమే కావచ్చు. ఆమరణ నిరాహార దీక్ష అని ఢిల్లీలో పొద్దున్న 10 గంటలకు ప్రారంభించి సాయంత్రం అయ్యేసరికి విరమించి, మళ్ళీ ఆంధ్ర దేశంలో (తెలంగాణా ప్రాంతంలో పాపము క్షమించుగాక) ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని గంజీ కాలు పట్టుకొని హైదారాబాద్ లోని ఆసుపత్రిలో పడేస్తే తాత్కాలికంగా విరమించి మళ్ళీ ఓ యూ వృద్ధ విద్యార్థుల ప్రాబల్యనికి లొంగి తూచ్ నేను దీక్ష ఆపలేదు అని కొనసాగించి ఆసుపత్రిలో రాత్రిపూట ఆయన ఏదో నాలుగు ఇడ్లీలో లేదా వేరే ఏదైనా అల్పాహారం తీసుకొని, దానితో పాటుగా కావలసిన ఫ్లూయిడ్స్ ని ఇంజక్షన్ల రూపంలో శరీరం లోకి ఎక్కించొకొని ఆమరణ నిరాహారదీక్ష చేసినా, ఏమి చేసినా లోకోపకారం కోసమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును నమస్తే పోలవరం పేపర్,తిట్ల.న్యూస్ చానెల్ కూడా 'తన'సమాజోద్దరణకి అప్పులు చేసి మరీ పెట్టాడు.ఆత్మహత్యలు "చేసిన"వారి కుటుంబాల కన్నీరు తుడవడం కోసం వేగంగా వెళ్లడానికే "కాడిలాక్" కారు కొన్నారు(కారు వారి పార్టీ సింబల్ మరి).ఇంకా తెలంగాణ ప్రాంతంకి సాగర తీరం లేదు కాబట్టి బవిష్యత్తులో దీనిని ఎలా సాదించాలి,ఎలా ఉపయోగించుకోవాలి అని తెలిసికొనడం కోసమే "షిప్ యార్డ్"లో దురద్రుష్టితొ పెట్టుబడులు పెట్టి తెలంగానోపకారం చేస్తున్నారు.సీమాంధ్ర వారి విద్యా సంస్థలని తన్ని తరిమేస్తాను అని అన్నట్టు వచ్చిన ఆరోపణలని తిప్పికొట్టడానికే ఆంధ్రా వారి ఖరీదయిన"వోక్రిట్జి" స్కూల్లో తన మనవాళ్ళని చదివిస్తున్నారు.సీమాంధ్ర అంటే తనకేమాత్రం ద్వేషం లేదని చెప్పేటందుకే "వైజాగ్ " చుట్టుపక్కల స్థలాలు కొన్నారు.రైతులని గౌరవించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఒక ఫాంహౌజ్ కొంటె, పార్లమెంటుకి వెళ్ళకుండా అక్కడ తను తాగి దూకుడు సినిమా,బిజినెస్ మాన్ సినిమాలు చూస్తున్నట్లు ఆరోపణ.తెలంగాణా ఉద్యమం కోసం తీసిన సినిమాలలో ఆంధ్రా హీరోలయిన జగపతిబాబు,శివాజీలను పెట్టింది ఎందుకు? తనకు అన్ని ప్రాంతాల వారు సమానమే అని సింబాలిక్కుగా చూపించడం కోసమే.
      సమాజం కోసం ఆయన ఇన్ని చేస్తుంటే...

      ' సకలం' తాకట్టు!
      ఉద్యమాన్ని ఢిల్లీకి అమ్ముకున్న కేసీఆర్, కోదండరాం
      మావోయిస్టు నేత జగన్ ధ్వజం.

      ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇంత దారుణమైన ఆరోపణలా లంకె:http://goo.gl/lzUwf

      ?????????

      తొలగించండి
    2. సూటిగా గారూ...మీరు ఎన్ని చెప్పినా మా గొర్రెల జాతిపిత ఈయనే...

      తొలగించండి
    3. నక్సలైట్లు ఎమన్నా పెద్ద పత్తిత్తు లా ఏమిటి. దోచుకున్న సొమ్ము లో వాళ్ళ వాటా ఇచ్చినట్టు లేడు. అందుకే అంటున్నారు. వాళ్ళ వాటా రాగానే నోరు మూసుకుంటారు. తెరాస అంటేనే నక్సలైట్ల జేబు సంస్థ.

      తొలగించండి
    4. చా నిజమా, దొరల సంస్కృతికి అడ్డం పట్టే ఫ్యూడల్ పార్టీ కాదా?

      తొలగించండి
    5. నక్సలైట్లు కూడా దొంగలే కదా. వాళ్ళ వసూళ్ళ కోసం ఒక దొర ని అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అడ్డం తిరిగినట్టున్నాడు.

      తొలగించండి
    6. దొంగలు దొంగలు కలిసి ఊర్లు దోచుకోవడం అనేది పాత సామెత. దొంగలు దొరలూ కలిసి వాటాలు పంచుకోవడం సరికొత్త భగవనువ్వాచ! To paraphrase Ramadas, "శ్రీకృష్ణ మంత్రము కోరక దొరికెను, ధన్యుడనయితని ఓరన్నా"

      తొలగించండి
  11. నాలుగు ఇడ్లీలు మాత్రమే తిని దీక్ష చెయ్యడానికి ఆయనకీ ఏమి ఖర్మ అండీ, రొజూ రాత్రి పూట, వారికి ప్రియమైన పానీయాలు కూడా పడేవి అని విన్నాను.

    రిప్లయితొలగించండి
  12. KCR in Urdu: Andhrawalonka biryani kabhi khaye, gobar ki sarka rahta
    Translated: ఆంధ్రోల్ల బిరియానీ ఎప్పుడన్న తిన్నారా, పెండ లక్క ఉంటది
    Smart aleck andhera retort: ఓహో అంతే మీకు పేడ (పెండ) రుచి తెలుసా? మీరు ఎన్నిసార్లు పేడ బిరియాని తిన్నారు?

    Let us apply similar rhetoric to aaj ka taza khabar about Tirumala.

    త్రిదండి చిన్న జీయర్: తిరుమలకు వస్తే క్లబ్బు కొచ్చిన అనుభూతి కలుగుస్తుంది.

    Smart aleck andhera netizens will now spend the next few months building on this. Some forecast examples:

    "ఓహో మీకు క్లబ్బులు ఎలా ఉంటాయో తెలుసన్న మాట. మీకు ఎన్ని క్లబ్బులలో సభ్యత్వం ఉంది?"

    "క్లబ్బులను మరిపిస్తున్న తిరుమల; చిన్నజీయర్ పరవశం"

    "చిన్నజీయర్ త్యాగి కాదు భోగి, క్లబ్బులను తలదన్నే తిరుమలలో విలాసం"

    రిప్లయితొలగించండి
  13. పరమ భక్తుడు చిన జియ్యరు ని, పచ్చి తాగుబోతు తో పోలుస్తారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పచ్చి తాగుబోతు కెసిఆర్ అని చదువుకోండి

      తొలగించండి
    2. బిరియాని రుచి చెప్పడానికి తాగుబోతు అయితే కాకపొతే ఎంత?

      I did not criticize the religious leader called Chinna Jeeyar or compare him with anyone. I just remind you the smart aleck questions possible from his comparing Tirumala to a club.

      తొలగించండి
    3. మీరు ఏమీ అనుకోకపోతే చిన్న ప్రశ్న. కెసిఆర్ ఏ సినిమా డీవీడీలు చూస్తున్నాడో, ఆయన ఎంత తాగుతాడో మనకు ఎందుకు? అవసరమనుకుందాం పో, ఆ విషయాలు ఎక్కడ తెలుసుకోవచ్చు? ఆయన జీతగాల్లకూ లేదా సాకీలకు (saqi) మాత్రమె తెలిసిన విషయాలు VMS వారికి చేరదీస్తున్నది ఎవరు?

      నాకు ఈ విషయాలు అనవసరం కానీ చూసినట్టే రాస్తుంటే కుతూహలంగా ఉంది.

      తొలగించండి
    4. కెసిఆర్ పేడ మాత్రమే కాదు, ఇంకేమన్నా తిన్నా మాకు అభ్యంతరం లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు తాగామనండి. కాకుంటే తాగిన మత్తులో నోటికి వచ్చిన బూతులు వాగా వద్దని చెప్పండి

      తొలగించండి