ఆంధ్రప్రభ వ్యాసం: ఈ శీర్షిక కింద 29.2.12న ప్రచురితమైన 'విభజనవాదం విషతుల్యం' అన్న నా వ్యాసానికి, నిజానికి మళ్లీ ఆగ్రహించిన చొల్లేటి శ్రీశైలం గుప్త విభజన వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే (ఇది విధ్వంసంతో శాంతికి పోరాటం అన్నట్లు లేదూ?) అనే నూరు శాతం విడ్డూరమైన మకుటంతో (21.3.12న) రాసిన వ్యాసంలో, ఎటువంటి తటపటాయింపులు లేకుండా చేసిన బుకాయింపులకు గతంలోలానే తొలుత సాటి తెలుగు వ్యక్తిగా గౌరవం ప్రకటిస్తూనే తగువిధంగా ప్రతిస్పందించడం, సరైన సమాధానాలు సహేతుకంగా ఇవ్వడం, నా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వోత్కర్ష అవుతుందేమోనని, ఆ వ్యాసంలో ప్రస్తావించలేదు కానీ, దానికో నేపథ్యముంది. ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీలోనూ లేని నేను, ఇటీవలి కాలంలో రాష్ట్ర సమైక్యతను పరిరక్షించే కృషిలో భాగంగా దేశ, రాష్ట్ర రాజధానుల లోను, రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాల్లోను సమైక్య సదస్సులు, నిజానిజాల ఆవిష్కరణ ప్రదర్శనలను నిర్వహించిన ఒక రాజకీయేతర సంస్థ, విశాలాంధ్ర మహాసభలో ఒక సామాన్య కార్యకర్తను. ఈ సంస్థ ఫిబ్రవరి 25న తిరుపతిలో ఒక సదస్సు నిర్వహించింది. పలువురు స్థానిక విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్న ఈ సమైక్య సదస్సులో నేను అప్పటికప్పుడు అడిగితే ఆశువున ప్రసంగించాల్సొచ్చింది. పలువురు వక్తలున్న కారణంగా కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే చేసిన ఆ క్లుప్త ప్రసంగంలో, తెలంగాణ ప్రాంతంలోనూ గణనీయ సంఖ్యలో ఉన్న సమైక్యవాదులు ప్రశంసార్హులని అలాగే, సీమాంధ్రలో కూడా కొద్దో గొప్పో ఉన్న విభజనవాదాన్ని కూడా తుదముట్టించాలని, సందర్భతోచితంగా సమైక్యవాద నిబద్ధతతో, పాత్రికేయ సహజమైన నిర్మొహమాటంతో చెప్పడం జరిగింది. అక్కడ క్లుప్తంగా చెప్పిన విషయాన్నే బాగా విస్తరించి వివరించి రాసిన వ్యాసం నాలుగు రోజుల తర్వాత ఈ శీర్షిక కింద ప్రచురితమైంది. విభజన వాదం విషతుల్యం అన్న మకుటంతో సీమాంధ్రలోని వేరు కుంపట్లనీ ఆర్పాలి అన్న మకుటంతో ఏ ప్రాంతంలో తలెత్తినా విభజనవాదం కాలకూట విషం లాంటిదన్న నిశ్చితాభిప్రాయాన్ని ఆ విధంగా పాఠకులతో పంచుకున్నానన్నమాట. చొల్లేటి వారికి మళ్లీ పట్టలేని కోపం వచ్చింది. ఇంకోసారి మండిపడ్డారు. గతంలో చేసిన విమర్శలనే మళ్లీ వండివార్చడం.
వారి మంటకు కారణాలు ఊహించడానికి ప్రయత్నిద్దాం. 'మనోళ్ల' అంతిమ ధ్యేయం ప్రత్యేక రాష్ట్ర సాధన మాత్రం కాదన్న నిజం ఇప్పటికైనా అర్థమైకాబోలు, లేదా వీళ్ల నిర్వాకం ఎలా ఏడ్చినా పోనీ, అక్కడి ప్రజలైనా విసిగివేసారి, మా పీకలు మేమే కోసుకుంటాంలే, విభజనకు సహకరిస్తాంలే అంటే బాగుంటుంది, నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు వాళ్ల మూలంగానైనా సాకారమవుతుందేమోనన్న దింపుడు కళ్ళం మాదిరి పేరాశ శ్రీశైలం గుప్తకి గుప్తంగా ఉన్నందువల్ల, సీమాంధ్రలోని విభజనవాదాన్ని నా వ్యాసంలో అంత కఠినంగా విమర్శించడం నచ్చలేదని అనుకోవచ్చేమో!
చొల్లేటివారు తన తాజా వ్యాసం మకుటంలోనే విభజనం వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటూ బుకాయింపు ప్రారంభించేరు. సమైక్య వాదం పలికేవారి నాలుకలు కోస్తాం, చేతులు నరికేస్తాం, ఈ ప్రాంతంలో తిరగనివ్వం వంటి బెదిరింపులతో కూడిన విభజన వాదంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, వారు ఘనంగా పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛ వగైరాలు ఎంత మేరకు, ఎలా ఉన్నాయో వారే చెప్పాలి! ఇంతకీ నా ప్రస్తావిత వ్యాసంలో ఉన్న కొన్ని అంశాల్ని చొల్లేటి వారు చీల్చి చెండాడి నిందించారు కాబట్టి, వాటిని దాదాపు యధాతథంగా మరోసారి చెప్పుకోవాల్సిన అవసరమేర్పడింది. నేను రాసిందేమిటంటే 'విభజన వాదం కాలకూట విషం --ఆ విషాన్ని ఏ ప్రాంతంలో తాగినా, కాకినాడలో కాచి వడబోసి తీపి కాజాలో కలిపితిన్నా --ఏ పాత్రలో తాగినా, కొద్దిగానే రుచిచూసినా ఆ ప్రాంతానికి, ప్రజలకి మాత్రమే కాదు మొత్తం దేశానికే చేటు చేస్తుంది. ఇది చొల్లేటి వారికి రుచించకపోవడం, ఎంత నిజమైనా చేదుగా ఉందనిపించడం సహజమే! ముందే చెప్పుకున్నాం కదా, అక్కడి ప్రజలనైనా మభ్యపెడితే, రాష్ట్ర విభజన సాధ్యం కావచ్చేమోనన్న పేరాశ కొందరికి ఉందని. నిస్పృహ నుంచి ఆగ్రహం పుట్టడం కూడా అసహజం కాదు. ఆయన మండిపడి చీల్చి చెండాడిన నా వ్యాసంలోని మరో వాక్యం --'ప్రత్యేక రాష్ట్ర వాద అసత్యాల పునాదులపై చారిత్రక సాంస్కృతిక వక్రీకరణల సున్నంతో వంకర టింకర రాళ్లు కల్తీ రాజకీయ పొత్తుల ఇసుక మిశ్రమంతో నిర్మితమైన ఒక (అయో)మయ సభ' న్యాయంగా ఈ వాక్యాల్ని వ్యాసం శీర్షికరీత్యా ఇరుప్రాంతాల్లోని విభజన వాదాల్ని అభివర్ణించినట్లు లేదా సమంగా విమర్శించినట్లు అర్థం చేసుకోవాలి. అయితే చొల్లేటివారు దీన్ని నేను తెలంగాణవాదానికి మాత్రమే అన్వయించుకుంటానంటే అది వారిష్టం. (గతంలో రాసిన కొన్ని వ్యాసాల్లో ఆయనే 'తెలంగాణ వాదాన్ని' 'వేర్పాటువాదం' అంటే, 'అలా కాదు చొల్లేటి సారూ, విభజన వాదమంటే గౌరవంగా ఉంటుందని' నేనే రాయాల్సి వచ్చిందిలెండి!)
పేరు చెప్పకుండా ఫలానా వారిని శుక్రాచార్యుడన్నావు ఇంకొకరిని మయుడన్నావు. అన్న చొల్లేటి వారి ఊహాశక్తిని కించపరిచే లేదా ప్రశ్నించే సాహసం కలగడం లేదు కానీ, ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ ఒక గొప్ప విద్యావేత్త చుక్కారామయ్యలా, ఉన్నత స్థానాలలో, విదేశాలలో ఎంతోమంది శిష్యులున్న గొప్ప గురువు అని గతంలో ఒక వ్యాసంలో శ్లాఘించాను. అలానే ఆర్.విద్యాసాగర్‌రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను, కె.ఎల్.రావు అంతటి గొప్ప ఇంజనీర్ అంటారు. (ఇద్దరూ సీమాంధ్రులే అంటే ఏమీ చెప్పలేను కానీ హైదరాబాద్‌కి, తెలంగాణకి సేవలందించారని గుర్తు చేయగలను) అంతేకానీ, నేను కూడా కొన్ని వ్యాసాల్లో నిన్ను చాలా పౌరుషంగా వ్యక్తిగతంగా విమర్శించాను గదా, అందుకని కెసిఆర్‌తో సమానంగా నన్ను కూడా గుర్తించమని, అడిగితే మాత్రం అంగీకరించలేను. ఆయనెక్కడ, మీరెక్కడ? అయితే జయశంకర్, విద్యాసాగర్‌ల మేధోసంపత్తిలో నాకు ఆవగింజంతైనా లేదంటూ చొల్లేటి వారు చెప్పిన సత్యాన్ని వినమ్రంగా అంగీకరిస్తాను.
సందర్భం ఎలానూ వచ్చింది కాబట్టి చొల్లేటి తన తాజా వ్యాసంలో చేసిన మరో బుకాయింపుని వారి మాటల్లోనే చూద్దాం. కెసిఆర్ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా, అశ్లీల పదాలు ఒక్కటికూడా ఉపయోగించలేదు అన్నారు. ఓ దేవుడా! టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో, ప్రింట్ మీడియాలో ఉన్న సాక్ష్యాల్ని కాదనే వారిని ఏమంటానులే గాని, నేనైతే దొరవారి దుర్భాషలను యధాతథంగా పేర్కొనే సంస్కారం లేనందువల్ల 'ల' గుణింతంలో తెలుగు ఉర్దూ మిశ్రమ తిట్లు అని రాసేవాణ్ణి. లేదా 'మై సన్స్' 'సన్స్ ఆఫ్ డాంకీ' అనే ఆంగ్ల పదాలకి ముతకానువాదాలు అని చెప్పేవాణ్ణి అని మాత్రం జ్ఞాపకంచేసి ఊరుకుంటాను. ఏమైనా కొందరి దుర్భాషలను 'తెలంగాణ యాస' అని సమర్థించడం ఈ ప్రాంతాన్ని అతి దారుణంగా అవమానించడమేనని గ్రహించాల్సిందిగా చొల్లేటి వారికి మనవి.
తెలంగాణ ప్రజల సంస్కారం చాలా గొప్పది. వారు తీవ్ర అభ్యంతరం చెప్పిన మరో అంశం, కర్మకాలి ఒకవేళ విభజనంటూ జరిగితే అది ఏదో దేముడి ముందు ఒడుపుగా కొట్టిన కొబ్బరికాయలా రెండు చెక్కలే అవదు బలంగా నేలకేసి కొట్టిన గాజుగ్లాసులా పలు ముక్కలవుతుందని చెప్పడం ఎవరికీ నచ్చదని నిజం చెప్పకుండా ఉండలేం కదా. విభజన వాదులు చెప్పే ఏ ఒక్క కారణం వెనకబాటుతనం, చిన్న రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, ప్రత్యేక సంస్కృతి, యాసా భేదాలు వగైరా వగైరాల్లో ఏది వర్తింపచేసినా తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం.
ఐదారు సంవత్సరాలుగా వారం వారం ఈ శీర్షిక కింద ప్రచురితమైన పలు వ్యాసాల్లో విభజన వాదంలోని అన్ని అంశాల్ని నేను సహేతుకంగా విశ్లేషణాత్మకంగా ఖండించడం దేశ సమగ్రత కోసమైనా విభజన వాదాన్ని వీడడం ఎంత అవసరమో వివరించడానికే. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ వ్యాసంలో కొన్ని ముఖ్యాంశాల్ని మాత్రమే ప్రస్తావించడానికి పరిమితమయ్యాను. ఎన్నో బుకాయింపులను ఇంకోసారి ఖండించే అవసరం లేదని భావిస్తున్నాను. సాటి తెలుగువాడిగా చొల్లేటినే కాదు, ఇంకా విభజన వాదాన్ని వీడలేకపోతున్న సాటి తెలుగువారందరికీ కూడా మాతృభాషాభిమాన పూరిత ప్రణామాలర్పిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు
కచరా దొరవారి తేనెపలుకుల విన్యాసాలకి కొన్ని విడియో ఉదాహరణలు .చొల్లేటివారు చూసి,విని తమ జన్మ ధన్యం చేసుకోగలరు. లంకెలు >> 1.http://www.youtube.com/watch?v=h3TFzhwaKLY&feature=related
రిప్లయితొలగించండి2. http://www.youtube.com/watch?v=_IQN8dGutg0&feature=related
3.http://www.youtube.com/watch?v=iDgOTzcyo3U&feature=related
4.http://www.youtube.com/watch?v=Ujz18JdPHt4&feature=related
5.http://www.youtube.com/watch?v=s3HtJbxsZvk&feature=related
6.http://www.youtube.com/watch?v=7w0moaOuFeM&feature=related
అన్నీ కచరా గారి విడియోలేనా నాది ఒక్కటి కూడా లేదు అని కచరా గారి పుత్రరత్నం కోపగించుకోకుండా ఒకే ఒక్క విడియో లంకె(కేటీఆర్ గారి ప్రతిభ ,కచరా గారికేమీ తీసిపోదు): http://www.youtube.com/watch?feature=player_embedded&v=w8cqaOLazzU#!
రిప్లయితొలగించండి______________________________________________
గమనిక: చిన్న పిల్లలకు చూపించవద్దు!
"విభజన వాదులు చెప్పే ఏ ఒక్క కారణం వెనకబాటుతనం, చిన్న రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, ప్రత్యేక సంస్కృతి, యాసా భేదాలు వగైరా వగైరాల్లో ఏది వర్తింపచేసినా తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం"
రిప్లయితొలగించండిWhy are you bothered if Telangana splits into many pieces? Let the concerned people raise the demand on their own.
విడిపోవాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు ఎన్ని ముక్కలయితేనేం? ప్రాతిపదిక ముఖ్యం కానీ పర్యవసానం కాదు.
"Why are you bothered if Telangana splits into many pieces? Let the concerned people raise the demand on their own."
రిప్లయితొలగించండివిడిపోతే మీ పక్కనుండేది ఆంధ్రోల్లె జై గారూ. ఆల్రెడీ విడిపోయిన జార్ఖండ్, చత్తీస్ ఘడ్ లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో మీరూ చూసి ఉంటారు. పక్క కొంప తగలేట్టుకుంటామంటే పట్టించుకోకుండా ఉండమంటే ఎలా?
మీ మావోఇస్తుల పుణ్యమా అంటూ మీ పక్క రాష్ట్రం ఒడీశ ఎంత ప్రశాంతంగా ఉందొ పాపర్లలో చదివారా? అక్కడ ఏ విభజన జరగలేదని, పైగా అది మొట్ట మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమనీ తమకు విదితమే కదా. ఎప్పుడో భవిష్యత్తులో తెలంగాణా మండిపోతుందని పుక్కిటి పురాణాలు అల్లి అసమదీయులను నమ్మబలికే పెద్దలకు "మీ" పక్కింట్లో జరిగుతున్నవిడ్డూరం కనిపిస్తలేదా?
తొలగించండిఏందో గీ ఆంధ్రోల్ల రూటే సపరేటు :)
"మీ మావోఇస్తుల పుణ్యమా"
తొలగించండిమా మావోయిస్టులా? అలా అని నేను ఎక్కడైనా అన్నానా? ఓ సారి చూసి రండి జై గారూ. ఇలా లేనివి ఉన్నట్టు చెప్పే తెలబానుల వైఖరి మానండి.
"మీ పక్క రాష్ట్రం ఒడీశ ఎంత ప్రశాంతంగా ఉందొ పాపర్లలో చదివారా?"
"మీ పక్క రాష్ట్రం" - ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు జై గారూ. అందుకే పగటి పూట నిద్ర వద్దు అనేది.
ఒడిశా లో గొడవలకి కారణం విభజన వాదాన్ని సమర్ధించే మావోయిస్టులే అని మీరే అన్నప్పుడు మరి చూస్తూ చూస్తూ మావోయిస్ట్ లు మద్దతిస్తున్న తెలంగాణా వాదాన్ని ఎలా సమర్ధించమంటారు?
పక్కిల్లు తగలడుతున్నప్పుడు మన దాకా వచ్చాక చూసుకుందాం అనుకునే వాళ్ళు కాదు జై గారూ తెలుగు ప్రజలు.
@SHANKAR.S:
రిప్లయితొలగించండి"పక్క కొంప తగలేట్టుకుంటామంటే పట్టించుకోకుండా ఉండమంటే ఎలా?"
ఇప్పుడు కూడా కొంప చల్లగ లేదు. తేడా ఒకటే: విడిపోతే కాలేది పక్కోడి కొంప, సొంత ఇల్లు కాదు.
The "author" is trying an old scare tactic (if you break away, you will break up). No one is willing to buy these twisted cliches here.
అసలు పెట్రోల్ ధర మళ్ళీ 3రూపాయలు పెంచుతున్నారంటే దానికి కారణం ఈ ఆరున్నొక్కవందల అమరుల త్యాగఫలమే అని నా గట్టి అనుమానం, మరీ నమ్మకమూ. గొట్టి ముక్కల వారు దేశం మీద దయతలచి, పునరాలోచించాలి. హార్మోని, ఎత్తుకో ఆరులో...
తొలగించండి"అమరులెటులైన పెట్రోలు పొందవచ్చు
మనుజలోకాన మనుషులు వసూళ్ళు లేక
పెట్రోలు ఏ రీతి పొందగలరు?
తమకు తెలియని ధర్మమే గొట్టిముక్కల రాజా ఆ ఆఆఆఆ...
తమకు తెలియని ధర్మమే గొట్టిముక్కల రాజా!" :))))
గొట్టి ముక్కాల గారు,
రిప్లయితొలగించండినిషిద్ధ జాతి, సంఘ వ్యతిరేక మావో ముష్కర విధ్వంశక వాదులు మద్దతిచ్చిన వుద్యమాలకు తెలంగాణ ప్రజలు కాదు కదా, పూర్తి దక్షిణ భారతదేశ జనమంతా కిరోసిన్ పోసుకుని అర్జంటుగా అమరులవుతామన్నా... ఇలాంటి వుద్యమాలకు దత్తన్న, సూష్మా గాలి స్వరాజ్‌లు బర్దన్‌తో చేతులు కలిపి తమ గర్దన్ తెగేసుకుంటామన్నా, మీరు మహమ్మద్ బిన్ జలాలుద్దీన్ బాద్షా సలాలుద్దీన్ గారి పుత్రుడు అసద్దుద్దీన్ దీన్-ఎ-ఇలాహీ జహాపనాతో ఒహ మాట చెప్పిస్తేగాని పీకి ఇవ్వడం అయ్యేపని కాదేమో అని మా ఆంధ్రుల గట్టి నమ్మకం. ఆయన్ను ఒప్పించి రండి, 2వ లేదా 3వ SRCలో బుందేల్ఖండ్, మారట్వాడా, మధురై, విధర్భ, నార్త్ కర్నాటక, జమ్ము, గూర్ఖాలాండ్, బోడోలాండ్లతో డిమాండులతో బాటు తప్పక పరిశీలిస్తాం.