ఆంధ్ర ప్రభ వ్యాసం: పోయిన వారం వ్యాసంలో సీమాంధ్రలోని కోవూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో 'తెరాస' అభ్యర్థిని నిలుపుతానని అక్కడికి రోడ్డు మార్గాన ఎన్నికల ప్రచారానికి వెళ్తానని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆనందించి, వారు కాని నిజంగా కాని పర్యటిస్తే సీమాంధ్ర ప్రజలు పూలమాలలతో స్వాగతించాలని, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రవ్వాలని ఆశీర్వదించాలని క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. అయితే, ఇదేదో ఈ వ్యాసకర్తకు కొత్తగా వచ్చిన ఆలోచన కాదని చెప్పడానికి మాత్రమే ప్రస్తావించాల్సొస్తోంది. ఇదే శీర్షిక కింద 25 నెలల క్రితమే 27.1.2010న 'కెసిఆర్ సీమాంధ్రలో పర్యటించాలి' అన్న మకుటంతో, ప్రచురితమైన నా వ్యాసంలో ఈ భావాన్ని వ్యక్తీకరించాను. (దీన్ని వంకర వ్యంగ్యంగా అపోహపడి కాబోలు, కొందరు 'వీర విభజనవాదులు' బెదిరింపు కాల్స్ చేయడం వేరే విషయం అనుకోండి!) ఇంతకీ ఈ వ్యాసం రాస్తున్న సమయానికి దొరవారి సీమాంధ్ర పర్యటన నిజంగా ఉంటుందో లేదో, కచ్చితంగా నిర్థారణ కాకపోవడం, నిరుత్సాహాన్ని కలిగిస్తున్నా, ఈ విషయం గురించి మరికొంత ఈ వారం చర్చించాలన్న కోరిక (దయ ఉంచి, దురద అనుకోవద్దు) కలిగింది.
తారక రామారావు, కవితమ్మలు నిజాల్ని నిజాయితీగా ఒప్పుకోవాలన్న (తప్పనిసరైన తరుణం వరకు ఆగా?!) నైజాన్ని పితృదేవుని నుంచి పుణికి పుచ్చుకున్నామని ఒకసారి ఉద్ఘాటించారు. అందుకు అందరూ హర్షించదగ్గ నిదర్శనాలుగా కుమారరత్నం (మొదట్లో కాదని దబాయించినా) తను గుంటూరులో విద్యాభ్యాసం చేశానని, అమెరికా నుంచి అమాంతంగా తిరిగొచ్చేసి, ఉద్యమంలో దూకేసిన పిదప కూడా, సీమాంధ్ర మిత్రులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నానని ఒప్పుకున్నారు. కుమార్తె ఏమో, తనకు ఇప్పటికీ సోకాల్డ్ ఆంధ్రోళ్లతో, ఆమాటకొస్తే కనిమొళితో కూడా ప్రాంతేతర స్నేహ బాంధవ్యాలున్నాయని చెప్పి (వాణిజ్య సంబంధాల గురించేమీ చెప్పలేదు) ప్రచా(సా)రమాధ్యమాల సాక్షిగా తన నిజాయితీని ప్రదర్శించేరు. ఇవేమీ తప్పులు కావు గదా! కవితమ్మ ఇంకా ముందుకుపోయి, ఒక వారపత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో, తన తండ్రికి, అపారంగా ధూమపానం, పరిమితంగా మద్యంసేవించే అలవాటుండేదని, ఇప్పుడు సంపూర్ణంగా మానేశారని, 'నాన్న విల్ పవర్' కిది నిదర్శనమని సగర్వంగా పేర్కొన్నారు. మానేసిన విషయాన్ని నమ్మని వాళ్లెవరైనా ఉంటే అది వాళ్ల ఖర్మ! ఏమైనా, రాబోయే రోజుల్లో ఈ సూపర్ అన్నా చెల్లెళ్ల ఖర్మ! ఏమైనా రాబోయే రోజుల్లో ఈ సూపర్ అన్నా చెల్లెళ్ల నుంచి మరికొన్ని కుటుంబపరమైన ఉద్యమ సంబంధమైన నిజా నిజాల ఆవిష్కరణ, నిజాయితీల ప్రదర్శనలను ఆశించవచ్చు. అప్పటివరకు మనం సహనం వహిస్తే బాగుంటుంది. అంతేకానీ, ఈలోగానే విపరీత ఊహలకు, అనవసరపు అపోహలకు రెక్కలు తొడగరాదు. ఇక పెద్దాయన సంగతికొస్తే, 'తెలంగాణ ఇస్తనని' సోనియా నా చెవిలో ఎప్పుడూ చెప్పలేదులే అన్న దానితో ప్రారంభించి మరెన్నో నిజాలు, మనకు 'చెప్పేసే' శుభ సమయం కోసం వేచి ఉందాంలే కానీ, ప్రస్తుతానికి ఆయన సీమాంధ్ర పర్యటన అవసరం గురించి చర్చించుకోవడానికే పరిమితమవుదాం!
దొరవారి కుటుంబ మూలాల ప్రస్తావన కాస్త పక్కన పెడదాం. అంటే బీహార్ టు విజయనగరం జిల్లా టు కరీంనగర్ జిల్లా టు, మెదక్ జిల్లాలో చింత మండక గ్రామం టు సిద్ధిపేట టౌన్ టు హైదరాబాద్ నగరానికి వలస ప్రస్థావనం, అలానే మెదక్ జిల్లాలో ఎకరాల విస్తీర్ణంలో నివాస గృహాలు, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ఇతర తెలంగాణ జిల్లాల్లో (ఎక్కడ పోటీ చేస్తే అక్కడ) అతిథి గృహాలు, హైదరాబాద్‌లో భవంతులు, గుజరాత్‌లో, గుర్గావ్‌లో వ్యాపారాలు, ఇలాంటి వాటి గురించి ప్రచారంలో ఉన్న ఊసులిప్పుడొద్దు, ఆయన ఒక ఉద్యమ కారుడు. ఒక గొప్ప పార్టీకి అధ్యక్షుడు. ఇంతవరకు ఎన్నికలలో అపజయం ఎదురవ్వని ప్రజాప్రతినిధి -ఇవన్నీ ఎందుకు? ఒక భారతీయపౌరుడు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉందా లేదా? 2000కి ముందు ఉన్న రాజ్యాంగమే ఇప్పుడూ ఉంది గదా! నిజానికి మంత్రిగా ఉన్నప్పుడు అరుదుగానైనా ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు. ఆంధ్రుల ఆదికవి నన్నయ నడయాడిన రాజమహేంద్రవరం వెళ్ళారు. కోటిలింగాల రేవుని చూసి తరించారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాఠాలు చెప్పారు. పల్నాడులో ప్రఖ్యాతి పొందిన 'నాగమ్మ' అసలు కరీంనగర్ నుంచి వలస వెళ్లిన భామ అన్నది ఈ సందర్భంలో గమనార్హం. ఓరుగల్లు పోతన పద్యాలే కాదు పల్నాటి శ్రీనాథుని పద్యాలు కూడా కెసిఆర్‌కి కంఠతా వచ్చు. వారిద్దరూ బావ బావమరదులని కూడా తెలుసు. సహజ వాగ్ధాటితో బాటు, మాతృభాషపై గట్టి పట్టు ఉన్న కెసిఆర్‌ని సీమాంధ్రలోని పార్టీ కార్యకర్తలు చాలా అభిమానించే వారు. విజన్ 2020 లో ఇంకా ఎన్నో పార్టీ పథకాల రూపకల్పనలో ఆయన పాత్ర గణనీయంగా ఉండేదని చాలామందికి తెలుసు. తెలుగు ప్రజల దురదృష్టవశాత్తు 1999లో ఆయనకి మంత్రిపదవి రాలేదు. ఆ అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. అంతే 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రజలకు దొరవారి దర్శన భాగ్యం బుల్లితెరకే పరిమితమై పోయింది! ఆయన పర్యటనలు లేక సీమాంధ్ర చిన్నబుచ్చుకుంటోంది, బోసి పోతోంది. ఆయన ప్రత్యక్ష దర్శనానికి ముఖం వాచి ఉంది. నిజానికి కెసిఆర్‌కి కూడా సీమాంధ్ర వెళ్లాలనే ఉంటుందనుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఒకేసారి తన ఇష్టదైవమైన వేంకటేశ్వరుని దర్శనార్థం, 2004 ఎన్నికలకు ముందు తిరుపతికి వెళ్లారు. 26 సీట్లు వచ్చాయి. 2008లో తెలుగుదేశం పార్టీలో పొత్తుకుదురిన సందర్భంలో, ఆ ఏడు విశాఖపట్నంలో జరిగిన మహానాడుకి రోడ్డు మార్గాన, మందీ మార్బలం, వాహన శ్రేణితో వెళ్తానని ఆనందంగా ప్రకటించారు. ఎందుకనో మనసు మార్చుకుని వెళ్లనేలేదు. సీమాంధ్రలో పర్యటిస్తానని 2009 ఎన్నికల సందర్భంగా కూడా మిత్రపక్షాలకు ప్రచారం చేస్తానని చెప్పారు కానీ వెళ్లలేదు. తను వెళ్లకపోయినా, కొడుకుని కూతుర్నీ పంపించక పోయినా, ఇతర తెలంగాణ వాదులను సీమాంధ్ర పర్యటనలు చేయవద్దని ఎప్పుడూ అనలేదు. వెళ్లమనే పరోక్షంగా ప్రోత్సహించేరు. వెళ్లినవాళ్లకీ ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వలేదు. ఉద్యమం బహు ఉద్ధృతంగా ఉన్నప్పుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ తిరుపతిలో అంగరంగ వైభోగంగా వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం క్రితం హరీష్‌రావు శ్రీకాళహస్తిలో ఎంచక్కా రాహుకేతుపూజ చేసుకున్నారు (ఆయన రాహుకేతువులుగా పార్టీలో ఎవర్ని భావిస్తున్నారన్న విషయంలో ప్రచారంలో ఉన్న కథనాల ఊసుమనకొద్దులెండి!) తెలంగాణ వాదులుగా చలామణి అవుతున్న పలువురు గద్దర్ కొండాలక్ష్మణ్‌లతో సహా సీమాంధ్రలో సభలు పెట్టుకున్నారు. పోయిన శనివారం నాడు పొన్నం ప్రభాకర్ గుంటూరులో రాయపాటి ఇంటిని పావనం చేశారు. మధుయాష్కి గౌడ్ అదేరోజు (4.3.12న) గుంటూరులో ఉన్నారు. వివేక్ వంటి టిఎంపిలు కొందరికి సీమాంధ్రలో వ్యాపార సామ్రాజ్యాలున్నందున తరచుగా అక్కడికి వెళ్తూనే ఉంటారు. వి.హెచ్. విషయం వేరే చెప్పాలా? ఈ విషయాలపై కెసిఆర్ ఏ విధమైన విమర్శలు చేయలేదు. అభ్యంతరాలు చెప్పలేదు. ఆవిధంగా అఖిలాంధ్రపై తనకున్న ఆదరాన్ని పరోక్షంగా చాటుకుంటూనే ఉన్నారు. అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పే అవుతుంది కానీ, ఆయనది కాదు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన విజయశాంతిని ఎంపిని చేశారు. పదో చెల్లిగా ప్రకటించారన్న నిజం మర్చిపోతే ఎలా?
కిరణ్, బాబు, చిరంజీవి, బొత్సలు తెలంగాణలో పర్యటిస్తున్నట్లే ఒక పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్ సీమాంధ్రలో ఎందుకు పర్యటించకూడదు? ఒబామా కెన్యా వెళ్తే ఆ దేశ ప్రజలు ఎంత ఆనందించారో, స్వాగతించారో, సీమాంధ్రులు కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సాటి తెలుగువాడు, కెసిఆర్‌ని అదేవిధంగా అక్కున చేర్చుకుంటారు. అసలే తెలుగువాళ్లందరికీ 'తెగువ' ఎక్కువ. కెసిఆర్‌లో కూడా. పైగా ఆయన హనుమంతుని కన్న గొప్పవాడు. స్వీయ శక్తి సామర్థ్యాల గురించి ఎవరూ చెప్పనవసరం లేకుండానే తనకే బాగా తెలుసున్న మేధావి. అలా చేయాలనుకుంటే విడిపోతే మీకే మేలు అని చెప్పగలిగే వాక్చాతుర్యం ఉన్నదాయనకు. విభజనకు సహకరించమని అక్కడి ప్రజల్ని అభ్యర్థించి, ఇక్కడి వాళ్లకి, మనోళ్లు ఒప్పుకోవడంలేదు, ఏం చేస్తం మరి, ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాకుల అభిమతాన్నే ఆమోదించాలి, కదా ఊర్కొందాం అని నచ్చచెప్పగలిగే తెలివితేటలు, వాక్చాతుర్యం ఆయనకున్నాయి. సరే ఇవన్నీ ఎలాగున్నా ఆయన తరచుగా చెప్పేమాట, ప్రజాక్షేత్రమంటారే, అందులోకి అడుగిడి మాటలతో దున్నేసి ఆడ కూడా విభజన విత్తులు నాటివస్తాను. ఏమో, పంట పండావచ్చు -గుర్రం ఎగరావచ్చు. 'నా ప్రయత్నాన్ని అపార్థం చేసుకోవద్దు' అని ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలకు చెప్పుకోవచ్చు. కాబట్టి కెసిఆర్ తటపడాయించకండి. సీమాంధ్రలో త్వరగా పర్యటించండి -ఆఖర్లో కొందరి మనసుల్లో కదలాడే అనుమానాన్ని కూడా నివృత్తి చేయాలి. అక్కడికి కెసిఆర్ వెళ్లినప్పుడు ఒకవేళ సంస్కారం లేని మూర్ఖుడెవరైనా, 'మమ్మల్ని అలా తిట్టారు' 'ఇలా అన్నారు' అని ప్రశ్నిస్తే, 'అదేం కాదు సోదరా -తిట్టనే లేదు, మై సన్స్ అంటే నా పుత్రసమానులని అర్థం. అలానే సన్స్ ఆఫ్ డాంకీ అంటే నన్ను నేనే తిట్టుకున్నట్లు అని చెప్పేసి అందర్నీ నవ్వించగలిగే హాస్యసంభాషణా చతురత కెసిఆర్‌కి ఉంది. కాబట్టి ఆయన త్వరలో సీమాంధ్రలో పర్యటించి తీరాలి. తెలుగువారి చరిత్రలో ఒక మేలు మలుపుకి ఆద్యుడు కావాలి. దొరవారూ ప్లీజ్ వెళ్లరూ...
- చేగొండి రామజోగయ్య ,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు
/దొరవారూ ప్లీజ్ వెళ్లరూ/
రిప్లయితొలగించండివెళ్ళండి దొరవారూ ప్లీజ్ ...కావలంటే మీకు RTC బస్సు లో నా ఖర్చుతో రానూ పోనూ టికట్ తీసిపెడతా..(ఆంధ్రోళ్ళు దోచుకుపోవడం వల్ల తెలంగాణా లో అంతా బీదవాళ్ళేనట కదా.. అందుకని మీ దారి ఖర్చులు నేను పెట్టుకుంటా అని చెబుతున్నా )
సువిశాల తెలంగాణా రాష్ట్రాన్ని యేర్పాటు చేసి దానికి విజయవాడను రాజధానిగా చేస్తే యెలాగుంటుందో చెప్పండి?
రిప్లయితొలగించండిమీ కత్తికి మూడువైపులా పదును!!!
రిప్లయితొలగించండిWhat a parapazzi! KCR must be pleased to note a fan who tracks his roots (almost from Kunta Kinte), his every movement, every function he conducts, every DVD he sees, every program his family members appear in and every peg he downs. Sachin & Aiswarya Rai must be envious because they don't have similarly obsessed fankas.
రిప్లయితొలగించండి/వ్యంగ్యంగా అపోహపడి కాబోలు, కొందరు 'వీర విభజనవాదులు' బెదిరింపు కాల్స్ చేయడం/
రిప్లయితొలగించండివ్యంగమంటే స్వయంప్రకటిత సాహితీసమరాంగణ సార్వభౌములు, సంస్కృతీ పరిరక్సకులకే కాక, వీర వేర్పాటువాదులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారా! మీరు చెప్పక చెప్పినట్టు తిరగనిస్తాం, తరిమి తరిమి తిరగనిస్తాం అనడమే బెటర్ అనిపిస్తోంది. హ్వా హ్వా హ్వా
"ఓరుగల్లు పోతన పద్యాలే కాదు పల్నాటి శ్రీనాథుని పద్యాలు కూడా కెసిఆర్‌కి కంఠతా వచ్చు. వారిద్దరూ బావ బావమరదులని కూడా తెలుసు"
రిప్లయితొలగించండిపదునాల్గో శతాబ్దంలో పుట్టిన శ్రీనాథునికి, ఆయన చనిపోయిన కొన్ని ఏళ్ళకి కొన్ని వందల మైళ్ళు దూరంలో పుట్టిన బమ్మెర పోతనకు చుట్టరికాన్ని ఆపాదించిన కెసిఆర్ మూర్ఖత్వానికి జోహార్లు. ఆయన ఏదంటే అదే వేదంగా భావించి ఈ అబద్దాన్ని ప్రచారం చేసే వీరాభిమానులకు నా సానుభూతి.
పాపం, యెందుకండీ కం.చం.రావుగారికని వాయిస్తారు. ఆమాటకు వస్తే మహామహా నాగయ్యగారి పోతన సినిమాలో కూడా పోతనకు శ్రీనాథునికి చుట్టరికాన్ని ఆపాదించిన విషయం నిజమేకదా! ఆ చుట్టరికంగురించి ప్రజలకు అపోహ యెప్పటినుండో ఉన్నదే.
తొలగించండిమీరు చెప్పిన సినిమా నేను చూడలేదు కానీ సినిమాలు fiction కదా. వాటినే చరిత్ర పాఠాలుగా భావిస్తే పప్పులో కాలేసే ప్రమాదం ఉంది.
తొలగించండిఇకపోతే విభజనవాదుల మాటలకూ పై "వ్యాస"కర్తకు ఉన్న అవినాభావ సంబంధం మీరు గమనించండి. తాను నమ్మే విషయాలకు సరిపోయే సందర్భంలో మాత్రం వారి మాటలను ఈయన నమ్ముతారు. మిగిలిన అన్ని విషయాలలో వారు అబద్దాలకోరులని వీరి వాదన.
@John: రెండు కొచ్చెన్లు నాకు తెల్వక అడుగుత.
రిప్లయితొలగించండి1. "తెలబాన్లు" బస్సు టిక్కెట్లు కొంటరా?
2. హైదరాబాదు కెల్లి కోవూరుకి బస్సులు ఎప్పటిసంది పడ్డయి?
బస్ల వేసే సీన్మలు మట్టుకు దొర ఆయన వీరాభిమానులయిన ఆంధ్రోల్లని అడిగి సెలెక్టు చెయ్యాలే, లేకపోతె పరేషాని.
@గొట్టి గారూ
రిప్లయితొలగించండి/హైదరాబాదు కెల్లి కోవూరుకి బస్సులు ఎప్పటిసంది పడ్డయి?/
హైదరాబాదు To కోవూరు డైరెక్ట్ బస్సు ఉంది అని 'అద్రం' అయ్యిందా మీకు ?!!! ఇంకా నయం. /RTC బస్సు లో నా ఖర్చుతో రానూ పోనూ టికట్ తీసిపెడతా/ అని నేనంటే రానూ పోనూ ఒకే టికట్ పై తిరిగేయచ్చు అని 'అద్రం' కాలేదు. సంతోషం. ఈ మద్యన తెలంగనోళ్లకు అన్నీ తెలిసిపోతున్నాయి అంటే ఏటో అనుకున్నాను. ఇదా తెలిసిపోవడం ..'అద్రం' చేసుకోవడమూనూ...
ఉజ్జోగాలు రావాలంటే తెలివితేటలుండాలిరా మనవడా అని చెప్పే తాత మాటలు ఎందుకో గుర్తు వచ్చేస్తన్నాయి.
/"తెలబాన్లు" బస్సు టిక్కెట్లు కొంటరా?/
ఆంధ్రాలో అందరూ టికట్ కొని ప్రయాణిస్తారు. తెలంగాణలోనే దౌర్జన్యం చేసే ఆంధ్రా దొరలు టికట్ లేని తె.వాది ని జైలులో తోసేయరూ.. అందుకనే అతి బీదవారైన తెలంగాణ వాది కి టికట్ కొనిస్తా అన్నా.
తెలబాను నాయకుడు పాపం చిప్ప కూడు తింటుంటే ఉజ్జమం దిక్కులేనిదయిపోదూ ?
"తాత మాటలు ఎందుకో గుర్తు వచ్చేస్తన్నాయి" Nani bhi yaad ayegi kuch din ke baad :)
రిప్లయితొలగించండి/Nani bhi yaad ayegi kuch din ke baad/
రిప్లయితొలగించండిపెద్దలను, వారి మాటలను గుర్తు చేసుకోనోళ్ళు ఎందుకూ పనికి రాక... ఉజ్జమాలు చేస్కుంటూ వాళ్ళమీదా వీళ్ళమీద పడి ఏడ్వాల్సిందే..
ఇందు మూలంగా కెసిఆర్ గారికి ఒక సూచన (లేదా హెచ్చరిక అనుకున్నా ఓకే).
రిప్లయితొలగించండిఇది 1971 కాదు, పబ్లిక్ సోయికొచ్చింది. ఎవరి మాయలో పడి మోసపోయినా, అధికార దాహంతో అమ్ముడు పోయినా "సమైఖ్య" రాష్ట్ర "ముక్కు" మంత్రి కలలు నీ వొంటికి మంచిది కాదు.
మమ్మల్ని ముంచనీకే చూసినవంటే జనం పుటం పెడ్తరు. నీకే నోరుందని మాకు మాయమాటలు చెప్తే గదే నోట్ల మన్ను కొడ్తరు. నెత్తికి ఎత్తుకున్నోల్లె పాడె కడ్తరు.
"ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణం తోటే పాతరేస్తం": ప్రజాకవి కాళోజీ
మస్తు చెప్పిన్రు. గోస బ్లాగులో ఈ మాట చెప్పండి. కాళోజీని కూడా తెలంగాణాలో తిరగనియ్య్రేమో. :)
తొలగించండిఎప్పుడో చచ్చిపోయిన కాళోజీ ఇప్పుడు తిరగడులే, రంది చేయొద్దు.
తొలగించండిగయితేనేం, సచ్చి తిరిగేటోడు కవి. కాళోజీని ఆంధ్రోళ్ళు కవి కాడంటున్రా? దానికీ తిరగనీయం.
తొలగించండి/కెసిఆర్ గారికి ఒక సూచన (లేదా హెచ్చరిక అనుకున్నా ఓకే)./
రిప్లయితొలగించండిఇలాటి తాటాకు చప్పుళ్ళకే భయపడిపోయేవాడైతే కచరా మూడు కోట్ల కాబేజీలు కొనేవాడే కాదు.
ఆయన మీద మీకు ఎందుకో అంత నమ్మకం? సర్లెండి మీ అభిమానానికి నేనెందుకు అడ్డం రావాలే?
తొలగించండిరాముడి గుడి కట్టేస్తే బాజపా కి భజన చేసే వాడెవ్వడుంటాడు ? తెలంగాణా తెచ్చేస్తే బుడ్డిపేట బుడ్డోడి ని ఎవరు పట్టించుకుంటారు ?!
తొలగించండిఎప్పుడైనా ఎక్కడైనా లాజిక్కే మా బలం. అందుకే కచరా ని పూర్తి సమైఖ్యవాదిగా భావిస్తాం.
సమై"ఖ్య"వాది ఎవడయినా మాకు ఒక్కటే. బుడ్డిపాలెం బుడ్డోడయినా, మొగల్తూరు మొనగాడయినా, ఇంకెవడయినా అనవసరం. తెలంగాణకు అడ్డొస్తే అందరొక్కటే.
తొలగించండివాడెవ్వడు వీడెవ్వడు ఆవలికెల్లగొట్టుడే!
/వాడెవ్వడు వీడెవ్వడు ఆవలికెల్లగొట్టుడే/
తొలగించండిఆఫ్ఘన్ తాలిబన్లే చేయలేనిది ( 'ఆవలికెల్లగొట్టుడే' ) తెలబాను గాళ్ళు ఎక్కడ చేయాలి.
ఐనా మొరిగే కుక్క కరవదు.