ఆంధ్ర భూమి సంపాదకీయ పేజీ (02/09/2012) : ఉద్యమాలకీ ‘బ్రేకు’లుంటాయి. లేకుంటే, ఉద్యమాలు చేసే వాళ్ళకీ, చూసే వాళ్లకీ
కూడా బోరు కొడుతుంది. ఆ బ్రేకులు ఒక్కొక్కసారి సినిమాల్లో ‘ఇంటర్వల్
బ్రేకు’ల్లా వుండొచ్చు. లేదా టీవీ సీరియల్స్‌లో ‘కమర్షియల్
బ్రేకు’ల్లాగయినా వుండవచ్చు.
నిజమే మరి. ఉద్యమాలు కూడా డొన్ని సినిమాల్లా మూడు గంటల్లో తేలిపోతాయి. కొన్ని సీరియళ్ళలాగా ఏళ్ళతరబడి, ఎపిసోడ్ల తరబడి సాగుతుంటాయి. బంగి అనంతయ్య తరహా ఉద్యమాలున్నాయనుకోండి. నడి రోడ్డు మీద ఒక మారువేషంతో మూడు గంటల పాటు నడుస్తుంది. వంటగ్యాస్ ధరకు వ్యతిరేకంగా ఆయన ఆడ వేషం కట్టుకుని నెత్తిమీద గ్యాస్ బండ పెట్టుకుని నినాదాలిస్తారు. ఎంత సేపని బండను మోస్తారు? గంటన్నర తర్వాత వంక కోసం చూస్తారు. ఈ లోగా ఎవరో అధికారి వచ్చి ట్రాఫిక్ దిగ్బంధమయిందని చర్చలకు చెట్టుకిందకు తీసుకు వెళ్తాడు. బండ దించి పక్కకు వెళ్తారు అనంతయ్య. ఇదే ఇంటర్వెల్ బ్రేకు. తర్వాత మళ్ళీ బండ ఎత్తుకుంటారు. ఈ లోగా మీడియా వారు ‘గొట్టాల’ (కెమేరాల)తో వస్తారు. ఉద్యమం క్లయిమాక్సుకు వస్తుంది. నినాదాలు హోరెత్తించేస్తారు. వెంటనే పోలీసులు చక్కటి వ్యానుతో వస్తారు. నెత్తిన బండతో పాటు వ్యాను ఎక్కేస్తారు. అంతే శుభం కార్డు పడిపోతుంది.
ఈ ఉద్యమం ఒక పూటలో తేలిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లాంటిది. ఇది లోబడ్జెట్ ఉద్యమం. చేయడానికి వందలమంది ఉండనవసరం లేదు. ఒక్కరున్నా చేసుకోవచ్చు. ప్రేమించి, పెళ్ళాడలేక పోతున్నవారూ, రిటయిరయ్యాక పింఛను రానివారూ- ఇలా ఎవరయినా సరే, ఈ తరహా ఉద్యమాన్ని ప్రయత్నించవచ్చు. ఒక టెలిఫోన్ టవర్‌నో, ఒక హోర్డింగ్, ఒక నీళ్ళ ట్యాంకునో చూసుకుని ఎక్కేయటమే. బాజా లూ (మీడియా), భజంత్రీలు (పోలీసులూ) తమ స్వంత ఖర్చుల మీద వచ్చేస్తారు. ‘దూకేస్తాను, దూకేస్తాను’- అని బెదిరించ వచ్చు. మధ్యలో అలిసిపోతే, ఇంటర్వెల్ బ్రేకు ఇచ్చుకోవచ్చు. కిందనుంచి పోలీసులు, ‘బర్గలో, పిజ్జాయో’ పొట్లాం కట్టి పైకి విసురుతారు. బంతిని అందుకున్నట్టు, అందుకుని భోంచేయవచ్చు. ఈలోగా కింద ఉత్కంఠతో నరాలు తెగిపోతున్న జనం కూడా, పక్కకు వెళ్ళి టీ తాగి వస్తారు. ఆ తర్వాత పోలీసులే పరిష్కార మార్గం వెతుకుతారు. ప్రేమించిన ప్రియుణ్ణి వెతికి పట్టి, వాడి చేతికి పుస్తెలు తాడు యిచ్చి నీళ్ళ ట్యాంకు పైకి పంపిస్తారు. వాడు గాలిలో మూడు ముళ్ళూ వేశాక దిగివచ్చేస్తే, జనంతోపాటు అందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఉద్యమాలకు మధ్యలో ఒకే ఒక్క బ్రేకు సరిపోతుంది.
కానీ ‘సీరియల్ ఉద్యమాల’తోనే సమస్య. ఎందుకంటే వీరు తీసుకునే సమస్యలకు వెనువెంటనే పరిష్కారాలు దొరకవు. ఆ మాటకొస్తే, అలా పరిష్కారాలు దొరకని సమస్యలనే వీరు ఎంచుకుంటారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ, మంద కృష్ణ ఎస్సీల వర్గీకరణ, అద్వానీ, మోడీల రామమందిర నిర్మాణం, అన్నా హజారే లోక్‌పాల్- ఇలాగన్నమాట. ‘మొగలి రేకులు’ సీరియల్ అయినా ముగుస్తుందేమో కానీ, ఈ ఉద్యమాలు ముగియవు. అందుకని వీటికి ‘ఇంటర్వెళ్ళు’ సరిపోవు. మాటిమాటికీ ‘కమర్షియల్ బ్రేకుల్లాం’టివి ఇస్తూ వుండాలి. ఇందువల్ల వారు విశ్రాంతి తీసుకోవచ్చు. నిరాహార దీక్షల వల్ల బరువు తగ్గి వున్నట్లయితే పూడ్చుకోవచ్చు. ఈ ఉద్యమాలను అభిమానించే జనం కూడా, మధ్య, మధ్యలోచదువుల్లాంటివి చదువుకోవచ్చు. ఉద్యోగాల్లాంటివి చేసుకోవచ్చు. అయితే పేరుకు ‘కమర్షియల్’ బ్రేకులయినా, ప్రయోజనమున్నట్టుండాలి. పక్క చానెల్‌కు వెళ్ళకూడదు. ‘చూస్తూనే వుండాలి’. కాబట్టి ఉద్యమాలు నడపటానికే కాదు, బ్రేకులు ఇవ్వడానికి కూడా వ్యూహం ఉండాలి.
తెలంగాణ ఉద్యమానికి ఇలాంటి బ్రేకులు ఇవ్వడంలో ఆరితేరి పోయారు కేసీఆర్. అందుకనే బ్రేకుల వేళల్లో కూడా ఆయన అభిమానులూ, అనుచరులూ ఆయన్ను వదలి పక్క పార్టీలకు వెళ్ళరు. ఆ మధ్య ఆయన తన ఉద్యమానికి వరుసగా ఇచ్చిన రెండు బ్రేకుల్ని చూడండి. ఒక్కటి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఆయన కుమార్తె కె. కవిత చేశారు. ఈ బ్రేకు అందర్నీ ఆకర్షించింది. విరామం ఇచ్చినట్టూ వుంది. ప్రయోజనమూ ఉంది. కేవలం కేసీఆర్ సామాజిక వర్గానికో, లేక కేసీఆర్ కుంటుంబానికో టీఆర్‌ఎస్ పరిమితమయిందన్న అతిపెద్ద ఆరోపణలకు, ఈ బ్రేకు అతి చిన్న సమాధానం.
అలాగే ఈ మధ్య జగన్మోహన రెడ్డి తన ‘నిరవధిక ఓదార్పు’కు కూడా ‘బ్రేకు’ ఇచ్చారు. ఈ ‘బ్రేకు’లో తల్లి విజయమ్మ ‘చేనేత కార్మికుల ఆకలి చావులు’, ‘రైతుల సమస్యలు’ అంటూ తెలంగాణలో చొచ్చుకు పోతున్నారు. అప్పుడు కేసీఆర్ ఏం చేశారు? బ్రేకుకు బ్రేకే సమాధానం అనుకున్నారో లేక ‘పక్క చానెల్లో బ్రేకు ఇచ్చిన వేళకే మనమూ బ్రేకు ఇవ్వాలి’ అని అనుకున్నారో ఏమో- ఇదే సమయానికి తెలంగాణ ఉద్యమాన్ని అలా ఉంచి, ‘విద్యుత్ కోత’ల మీద ఆందోళనలు మొదలుపెట్టారు.
మంద కృష్ణ కూడా అంతే. ఆయన చేపట్టిన ఎస్సీల వర్గీకరణ సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. కానీ, మధ్యమధ్యలో బ్రేకులు ఇచ్చి, ఆయన గుండెకు చిల్లులు పడ్డ బాలల గురించీ, వికలాంగుల గురించీ నిరసనలూ, నిరాహారదీక్షలూ చేస్తుంటారు. మోడీనే చూడండి. కాసేమపు ‘హిందూ త్వ’ఎజెండాను పక్కన పెట్టి ‘సద్భావనా యాత్ర’ మొదలు పెట్టలేదూ? లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ ప్రధాన కార్యక్రమాలను పక్కన పెట్టి, ‘సురాజ్య’ యాత్ర చేస్తున్నారా? లేదా?
కానీ, ఈ దేశంలో బ్రేకులు లేనిది కేవలం ఒక్క ఉద్యమానికే- అదే సామాన్యుడి బతుకు పోరు. అది వాడికి నచ్చినా నచ్చకపోయినా, సాగుతూనే ఉంటుంది. ఒక్క బ్రేకూ ఉండదు. కడకు మృత్యువే శుభం కార్డు వేస్తుంది.
-సతీష్ చందర్
నిజమే లెండి.. చాలా బ్రేకులను గురించి చెప్పారు. కానీ తెలుగు హిందీ సీరియళ్లలో వచ్చే కొన్ని బ్రేకులు విచిత్రంగా ఉంటాయి.... ఈ బ్రేకు తర్వాత చూసేసరికి పాత్ర ఉంటుంది. పాత్రధారి కాస్తా మారిపోతాడు.. పక్కనున్న వాళ్లు అతన్ని లేదా ఆవిడను పేరు పెట్టి పిలిస్తే ఒహో ఆ కారెక్టర్ పాత్రధారి మారాడా అని అనుకోవాలి.....ఇంకొన్ని బ్రేకులుంటాయి. ఈ బ్రేకులో విలన్ కేరెక్టర్ కాస్తా నెక్ట్ బ్రేకుకల్లా సాధుస్వభావిగా మారిపోతుంది...మొగిలిరేకులు సీరియల్లో యంగ్ విలన్లా... అచ్చం మీలాగా...
రిప్లయితొలగించండిఓసారి తెలంగాణ వేదిక మీద కనిపిస్తారు. కావడికుండల్లో కనిపిస్తారు. తెలంగాణ సమర్థకుడి కేరెక్టర్ లో..
సీను కట్ చేసి ఆంధ్రావాళ్ల పత్రికల్లోకి వచ్చేసరికి సమైక్యాంధ్ర ఎజెండా పట్టుకుని తెలంగానవాదులపై ఎగిరెగిరి పడతారు. ఉన్నమాట చెప్పాలి. ఏ కేరెరక్టర్ ఎక్కడ చేసినా ఓచోటి ప్రభావం ఇంకోచోట పడకుండా చాలా జాగ్రత్త పడతారు మీరు . గొప్పవారండీ.
పాపం కేసిఆర్ కు ఈ టాలెంటు లేక మాటిమాటికి బ్రేకులు తీసుకుంటున్నాడు. లేకపోతే రకరకాల కేరెక్టర్ లు వేసి కుమ్ముకునేవాడు మీలాగా... ఏంచేద్దాం ఎంతైనా తెలంగాణ వాడు కదా.. మీ అంత తెలివితేటలు ఉండి ఉండవు లెండి.
నిజమే లెండి.. చాలా బ్రేకులను గురించి చెప్పారు. కానీ తెలుగు హిందీ సీరియళ్లలో వచ్చే కొన్ని బ్రేకులు విచిత్రంగా ఉంటాయి.... ఈ బ్రేకు తర్వాత చూసేసరికి పాత్ర ఉంటుంది. పాత్రధారి కాస్తా మారిపోతాడు.. పక్కనున్న వాళ్లు అతన్ని లేదా ఆవిడను పేరు పెట్టి పిలిస్తే ఒహో ఆ కారెక్టర్ పాత్రధారి మారాడా అని అనుకోవాలి.....ఇంకొన్ని బ్రేకులుంటాయి. ఈ బ్రేకులో విలన్ కేరెక్టర్ కాస్తా నెక్ట్ బ్రేకుకల్లా సాధుస్వభావిగా మారిపోతుంది...మొగిలిరేకులు సీరియల్లో యంగ్ విలన్లా... అచ్చం మీలాగా...
రిప్లయితొలగించండిఓసారి తెలంగాణ వేదిక మీద కనిపిస్తారు. కావడికుండల్లో కనిపిస్తారు. తెలంగాణ సమర్థకుడి కేరెక్టర్ లో..
సీను కట్ చేసి ఆంధ్రావాళ్ల పత్రికల్లోకి వచ్చేసరికి సమైక్యాంధ్ర ఎజెండా పట్టుకుని తెలంగానవాదులపై ఎగిరెగిరి పడతారు. ఉన్నమాట చెప్పాలి. ఏ కేరెరక్టర్ ఎక్కడ చేసినా ఓచోటి ప్రభావం ఇంకోచోట పడకుండా చాలా జాగ్రత్త పడతారు మీరు . గొప్పవారండీ.
పాపం కేసిఆర్ కు ఈ టాలెంటు లేక మాటిమాటికి బ్రేకులు తీసుకుంటున్నాడు. లేకపోతే రకరకాల కేరెక్టర్ లు వేసి కుమ్ముకునేవాడు మీలాగా... ఏంచేద్దాం ఎంతైనా తెలంగాణ వాడు కదా.. మీ అంత తెలివితేటలు ఉండి ఉండవు లెండి.
కేసీయార్ కూడా క్యారెక్టర్ మార్చినోడేలే.. మళ్ళీ మార్చటానికి ట్రై చేస్తుండు గాని జనం తంతారని భయమాయే.. పైగా ఈ క్యారెక్టర్ లో రెమ్యూనరేషన్ కూడా బాగా ముడుతుంది కదా.. అందుకనే ఉన్న క్యారెక్టర్ లో మల్టిపుల్ పర్సనాలిటి డిజార్డర్ చూపిస్తుండు.. ఒకరోజు లగడపాటి ని తిరగనియ్యం అంటడు.. ఇంకో రోజు ఐ లవ్యూ అంటడు..ఒక్కోసారి నిరవధిక బంద్ అంటడు.. అందరూ బందు చేసుడు షురూ చేసినప్పుడు ఈయన తెలంగాణ వచ్చేస్తుంది బందులకు బొందపెట్టుడు అంటడు.. డైలాగుల్లేనప్పుడు వ్యూహాత్మక మౌనం అంటడు.. అసలు క్యారక్టర్ మాత్రం ఫాంహౌస్ లోనే జూపిస్తడు. "అనుభవించు రాజా.. హెయ్.. అనుభవించు రాజా....
తొలగించండినాదొక ధర్మ సందెహం? పిదమర్తి రవి గారు, రాజరం గారు మొదలైనవారిని నేను గత 3 -4 సంవత్సరాలనించి ప్రతి పండగకి ముందు టి వి లొ దర్శనం చేసుకుంటున్నాను. ప్రతి తెలుగు వారి పండక్కి ముందు వారు హెచ్చరిస్తారు వూరు వెల్తె మల్లి రానివ్వనని. అయ్యా ఒస్మానియా యూనివెర్సిటీలో (ప్రొఫెస్సుర్ కొడండ రెడ్డ్య్ గారి నాయకత్వములొ) పొస్టు గ్రాద్యూషున్ రెందు సంవత్సరాలా లేక ఈ ఒక్క యూనివెర్సిటీలో ఎమైన ప్రత్యేకమైన నిభందన వుందా. ఏన్ని సంవత్సరాలైనా ఆడుతు, పాడుతు చదవచ్చన్ని ఇక్కడనె, పెల్లి చెసుకొని పిల్లలని చదివిస్తు కాలక్షెపం చెయ్యవచ్చని? వారు స్వాతంత్ర సమరయొధులు కూడాను (దొమ్మి కెసుల్లొ చాల నెలలు జైల్లొ వున్నారు కద)అతి త్వరలొ వారిని శాసన సభ సభ్యులుగా గా చూడలిని హరీష్ రావు గారితొ పాటు బల్లలు ఎక్కి బూతులు తిట్టాలని మనస్పూర్తిగ కొరుకుంటున్నాను.
తొలగించండిపిడమర్తి రవి యూనివర్సిటీల లైఫ్ మెంబర్, ఆకారం చూస్తే తెల్వద్? పోతరాజు లక్క ప్రతి పండక్కి వస్తడు.
తొలగించండిబ్రేక్ డాన్స్ మీద మస్తు చెప్పిన్రు. వీళ్ళకు బ్రేఖ్ డాన్స్ నేర్పించినోళ్ళు రైల్వే పోలీసులంట గదా! నాంబెయిలబుల్ కేసులు అనగానే చిన్న చితకా నాయకులంతా బ్రతికివుంటే పులిసిన బగారా బైగాన్ తినైనా బ్రతకచ్చు అని బ్రేక్ డాన్స్ చేసిన్రంట గదా!
రిప్లయితొలగించండిఇంతకీ విలీనదినమా? విద్రోహదినమా? విమోచనదినమా? విరోచనదినమా?!
ఏదో ఒహటిలే, అమరులు గోసాచారి, కాలా-ముట్ఠీ-రూప్ లకు నా ఇప్లాబినందనలు, కాలా-లాల్ సలాం.
మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుడు... అమరత్వము కూడా పిరమై పోతున్నాదే, శవాల్ రెడ్డీ!?
నాకు సంకేతాలొస్తున్నాయ్, అర్జంటుగా పోయొస్తా... ఢిల్లీ.
జై తెలంగానా!
మహానుభావుడు మన నందమూరి అన్నగారు పూర్వం "కుక్కమూతి పిందెలు" అని కాంగీలను తిట్టేతప్పుడు నాకు అది సరిగా అర్థం అయ్యేది కాదు(అప్పుడు చిన్న వాడిని). ఇప్పుడు అర్థం అవుతుంది "కుక్కమూతి పిందెలు" అంటే ఏమిటో, ఎవరో :) నేను 'కచరా'ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించడం లేదు అని గమనించగలరు !
రిప్లయితొలగించండి