రెండవ భాగం తరువాయి
కొంత కాలము పట్టినది
ఈ విధముగ ప్రారంభమైన విశాలాంధ్రోద్యమము హైదరాబాదు నగరములో అడుగుపెట్టి, తెలుగు సీమలో వ్యాపించుటకు కొంతకాలము పట్టినది. ఉస్మానియా విశ్వవిద్యాలయమున జరిగిన మొట్టమొదటి ఆంధ్రాభ్యుదయోత్సవాల సందర్భమున అయ్యదేవర కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చి, విశాలాంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు పంతులుగారి సలహాతో ప్రారంభించుటకు ప్రయత్నించిరి. ఈ సందర్భమున సుల్తాను బజారులోని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యాలయమున ఇందుకొరకై ఒక సమావేశము జరిగియుండెను. ఆ సమావేశానికి అపుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకు ఉపాధ్యక్షులుగానున్న పల్లెర్ల హనుమంతరావు గారు అధ్యక్షత వహించిరి. సమావేశములో మాడపాటి హనుమంతరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పి.పుల్లారెడ్డి, దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, యం.ఎస్.రాజలింగం మొదలైన వారు పాల్గొని, కొంతకాలము ఆగి ఈ ఉద్యమమును ప్రారంభింపవలెనని అభిప్రాయపడిరి.
అంకురార్పణ- ప్రజాస్వామిక వాతావరణము
ఇట్టి పరిస్థితులలో హైదరాబాదు రాష్ట్రమున జనరల్ ఎన్నికలు జరిగినవి. మొట్టమొదటిసారిగా శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వము ఏర్పడినది. కమ్యునిస్టులు తెలంగాణ పోరాటమును విరమించి శాసనసభలో ప్రవేశించిరి. ఈ ప్రజాస్వామిక వాతావరణములో విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి తగిన తరుణము ఆసన్నమైనదని ఉద్యమకారులు అభిప్రాయపడినారు. ఈ అభిప్రాయముతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయమున మీర్ అహమ్మదలీఖాన్ గారి ప్రేరణతో మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, నందగిరి వెంకట్రావు గారలు 13 ఆగస్టు, 1953 నాడు సమావేశమయి, హైదరాబాదు రాష్ట్రములో విశాలాంధ్రోద్యమము ప్రారంభింపవలెనని నిర్ణయించి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి గారలతో సంప్రదింపవలెనని నిశ్చయించిరి. ఈ సంప్రదింపులు 20 ఆగస్టు 1953 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్సులోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయములో జరిగినవి. ఈ సంప్రదింపులలో మాడపాటి హనుమంతరావు, అహమ్మదలీఖాన్, సురవరం ప్రతాపరెడ్డి, నందగిరి వెంకట్రావు , దేవులపల్లి రామానుజరావు, పల్లెర్ల హనుమంతరావు, సర్దారుల్లాఖాన్, భోజ్ రాజ్ గారలు పాల్గొని యుండిరి. ఆనాడు ఈ ఎనిమిది మంది సంతకాలతో 1953 సెప్టెంబరు 14 వ తేదీనాడు సాయంకాలం 5 గంటలకు పట్టభద్రుల కార్యాలయములో ఒక పెద్ద సమావేశమును జరుపుటకు నిర్ణయించబడినది. ఆ సమావేశమునకు నగరము నుండి, జిల్లాల నుండి నూరుమందికి పైగా ప్రతినిధులు ఆహ్వానింపబడిరి. సమావేశపు నోటీసు సురవరం ప్రతాపరెడ్డి గారు ఇంగ్లీషులో వ్రాసిరి. 14 సెప్టెంబరు 53 నాటి సమావేశమున మాడపాటి హనుమంతరావు, పల్లెర్ల హనుమంతరావు, భోజ్ రాజ్, బొజ్జం నరసింహులు, కొమ్మవరపు సుబ్బారావు, ఆదిరాజు వీరభద్రరావు, ఎస్.శ్యామారావు, కమతం వెంకటరెడ్డి, మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, సర్దారుల్లాఖాన్ , మడూరి శంకరలింగం, రంజిత్ సింగ్, భద్రదేవ్, నూకల సర్వోత్తమరెడ్డిగారలు పాల్గొనిరి. మాడపాటి హనుమంతరావుగారు ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిరి. ఈ విధముగ హైదరాబాదు నగరమున, జిల్లాలలో విశాలాంధ్రోద్యమ అభిప్రాయాలు క్రమక్రమముగ వ్యాపింపసాగినవి. విశాలాంధ్ర మహాసభను స్థాపించవలెనని అభిప్రాయములు బలపడినవి. ఇది ఇట్లుండగా మద్రాసులో ఆంధ్రరాష్ట్రము కొరకు పొట్టి శ్రీ రాములు ఆత్మార్పణము తరువాత భారత ప్రభుత్వముచే ఆంధ్ర రాష్ట్ర స్థాపన ప్రకటన జరిగినది. ఈ పరిస్థితిలో 1953 ఏప్రిల్ నెలలో విజయవాడ యందు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహక వర్గ సమావేశము జరిగియుండెను. ఈ సమావేశము మిక్కిలి ముఖ్యమైనది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి సంజీవరెడ్డిగారు అధ్యక్షులుగా నుండిరి. ఈ సందర్భమున తెలంగాణా ప్రతినిధులు కొందరు విజయవాడకు వచ్చిన బాగుండునని కాళేశ్వరరావుగారు మాడపాటి హనుమంతరావు పంతులు గారికి వ్రాసిరి. మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంతరంగికులను సంప్రదించి, అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావులను విజయవాడ వెళ్ళమని కోరిరి. వీరి విజయవాడకు వెళ్లకముందు కొండా వెంకటరంగారెడ్డిగారిని కలుసుకొనిరి. రంగారెడ్డి గారు కొంత ముందుగానో, ఆలస్యముగనో, అనివార్యముగ విశాలాంధ్ర ఏర్పడగలదనియు, ఈ విషయమై తమను కలుసుకొనిన ముగ్గురు, అనగా మాడపాటి హనుమంతరావు,అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావుగారలు పనిచేయుట తమకు సమ్మతమేనని ప్రోత్సహించిరి. విజయవాడలో ఈ ఉభయులకు ఘన స్వాగత మీయబడినది. అక్కడ ఈ ఉభయులు సంజీవరెడ్డి, కాళేశ్వరరావు మొదలైన కాంగ్రెస్ నాయకులతో సంప్రదించిరి. ఆంధ్రనాయకులు విశాలాంధ్రకు తమ సంపూర్ణ సముఖత్వమును వెల్లడించి, విశాలాంధ్ర ఉద్యమము తెలంగాణమునుండియే సాగవలెనని అభిప్రాయపడిరి. ఆనాడు విజయవాడలో యీ విషయమై జరిగిన బహిరంగ సభలో పై ఉభయులు ప్రసంగించిరి. దీని తరువాత హైదరాబాదు, సికిందరాబాదు మునిసిపల్ కార్పొరేషనులు హైదరాబాదు రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర ఏర్పదవలెనని తీర్మానించినవి. 2 వ జూన్ 1953 నాడు హైదరాబాదులో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశము రామానందతీర్థ అధ్యక్షతన జరిగినది. అందులో విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రముల స్థాపన వాంఛించుచు తీర్మానము జరిగినది. ఈ సంఘటనలు హైదరాబాదు, సికిందరాబాదు నగరాలలోను తెలంగాణ జిల్లాలలోను విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి బలమైన ఊతనిచ్చినవి. కమ్యునిస్టు పార్టీ విశాలాంధ్రను బలపరుచుచు ప్రకటన గావించినది. 1953 ఆగస్టు 14 ,15 తేదీలలో హిమాయత్ నగర్ లో తెలంగాణా రైతుసంఘ కార్యాలయమున బద్ధం ఎల్లారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశములో విశాలాంధ్ర కావలెనను తీర్మానము ఆమోదింపబడినది. తరువాత కొన్నినెలలకు ఈ ఆంధ్రమహాసభ సమావేశము ప్రతాపగీర్జి కోఠిలో జరిగినది. విశాలాంధ్రము సత్వరముగ ఏర్పడవలెనని తీర్మానింపబడినది. 1953 ఆగస్టు 24 వ తేదీనాడు రెడ్డి విద్యార్ధి వసతి గృహమున విశాలాంధ్రోద్యమమును బలపరచుటకై మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన ఒక సమావేశము జరిగినది. ఇందులో దేవులపల్లి రామానుజరావు, వి.బి. రాజు, గురుమూర్తి, వెంకటేశం, వాసుదేవనాయక్, అహమ్మదలీఖాన్, సర్దారుల్లాఖాన్, డాక్టరు రంగాచారిగార్లు విశాలాంధ్ర నిర్మాణము తొందరగా జరుగావలెనని ఉపన్యసించిరి. 1953 అక్టోబరు 2 వ తేదీన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఈ సందర్భమున కర్నూలులో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర స్థాపన జరుగావలెనని తీర్మానింపబడినది. ఇది గమనించదగినది. ఆంధ్ర రాష్ట్రావతరణ ఉత్సవాలలో పాల్గొనుటకు హైదరాబాదునుండి సుమారు రెండునూర్ల మంది విశాలాంధ్రోద్యమాభిమానులు కర్నూలుకు వెళ్లియుండిరి. 1953 అక్టోబరు ఒకటవ తేదీ సాయంకాలము కర్నూలులో తెలంగాణా ప్రతినిధుల సమావేశము జరిగినది. ఆ సమావేశములో అనంతశయనం అయ్యంగార్, బెజవాడ గోపాలరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ఆంధ్ర నాయకులు పాల్గొనిరి. సమగ్రమైన చర్చలు జరిగిన పిదప తెలంగాణా ప్రతినిధులు విశాలాంధ్రకు కృషి చేయడానికి నిర్ణయించిరి.
ఈ విధముగ ప్రారంభమైన విశాలాంధ్రోద్యమము హైదరాబాదు నగరములో అడుగుపెట్టి, తెలుగు సీమలో వ్యాపించుటకు కొంతకాలము పట్టినది. ఉస్మానియా విశ్వవిద్యాలయమున జరిగిన మొట్టమొదటి ఆంధ్రాభ్యుదయోత్సవాల సందర్భమున అయ్యదేవర కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చి, విశాలాంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు పంతులుగారి సలహాతో ప్రారంభించుటకు ప్రయత్నించిరి. ఈ సందర్భమున సుల్తాను బజారులోని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యాలయమున ఇందుకొరకై ఒక సమావేశము జరిగియుండెను. ఆ సమావేశానికి అపుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకు ఉపాధ్యక్షులుగానున్న పల్లెర్ల హనుమంతరావు గారు అధ్యక్షత వహించిరి. సమావేశములో మాడపాటి హనుమంతరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పి.పుల్లారెడ్డి, దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, యం.ఎస్.రాజలింగం మొదలైన వారు పాల్గొని, కొంతకాలము ఆగి ఈ ఉద్యమమును ప్రారంభింపవలెనని అభిప్రాయపడిరి.
అంకురార్పణ- ప్రజాస్వామిక వాతావరణము
ఇట్టి పరిస్థితులలో హైదరాబాదు రాష్ట్రమున జనరల్ ఎన్నికలు జరిగినవి. మొట్టమొదటిసారిగా శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వము ఏర్పడినది. కమ్యునిస్టులు తెలంగాణ పోరాటమును విరమించి శాసనసభలో ప్రవేశించిరి. ఈ ప్రజాస్వామిక వాతావరణములో విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి తగిన తరుణము ఆసన్నమైనదని ఉద్యమకారులు అభిప్రాయపడినారు. ఈ అభిప్రాయముతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయమున మీర్ అహమ్మదలీఖాన్ గారి ప్రేరణతో మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, నందగిరి వెంకట్రావు గారలు 13 ఆగస్టు, 1953 నాడు సమావేశమయి, హైదరాబాదు రాష్ట్రములో విశాలాంధ్రోద్యమము ప్రారంభింపవలెనని నిర్ణయించి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి గారలతో సంప్రదింపవలెనని నిశ్చయించిరి. ఈ సంప్రదింపులు 20 ఆగస్టు 1953 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్సులోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయములో జరిగినవి. ఈ సంప్రదింపులలో మాడపాటి హనుమంతరావు, అహమ్మదలీఖాన్, సురవరం ప్రతాపరెడ్డి, నందగిరి వెంకట్రావు , దేవులపల్లి రామానుజరావు, పల్లెర్ల హనుమంతరావు, సర్దారుల్లాఖాన్, భోజ్ రాజ్ గారలు పాల్గొని యుండిరి. ఆనాడు ఈ ఎనిమిది మంది సంతకాలతో 1953 సెప్టెంబరు 14 వ తేదీనాడు సాయంకాలం 5 గంటలకు పట్టభద్రుల కార్యాలయములో ఒక పెద్ద సమావేశమును జరుపుటకు నిర్ణయించబడినది. ఆ సమావేశమునకు నగరము నుండి, జిల్లాల నుండి నూరుమందికి పైగా ప్రతినిధులు ఆహ్వానింపబడిరి. సమావేశపు నోటీసు సురవరం ప్రతాపరెడ్డి గారు ఇంగ్లీషులో వ్రాసిరి. 14 సెప్టెంబరు 53 నాటి సమావేశమున మాడపాటి హనుమంతరావు, పల్లెర్ల హనుమంతరావు, భోజ్ రాజ్, బొజ్జం నరసింహులు, కొమ్మవరపు సుబ్బారావు, ఆదిరాజు వీరభద్రరావు, ఎస్.శ్యామారావు, కమతం వెంకటరెడ్డి, మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, సర్దారుల్లాఖాన్ , మడూరి శంకరలింగం, రంజిత్ సింగ్, భద్రదేవ్, నూకల సర్వోత్తమరెడ్డిగారలు పాల్గొనిరి. మాడపాటి హనుమంతరావుగారు ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిరి. ఈ విధముగ హైదరాబాదు నగరమున, జిల్లాలలో విశాలాంధ్రోద్యమ అభిప్రాయాలు క్రమక్రమముగ వ్యాపింపసాగినవి. విశాలాంధ్ర మహాసభను స్థాపించవలెనని అభిప్రాయములు బలపడినవి. ఇది ఇట్లుండగా మద్రాసులో ఆంధ్రరాష్ట్రము కొరకు పొట్టి శ్రీ రాములు ఆత్మార్పణము తరువాత భారత ప్రభుత్వముచే ఆంధ్ర రాష్ట్ర స్థాపన ప్రకటన జరిగినది. ఈ పరిస్థితిలో 1953 ఏప్రిల్ నెలలో విజయవాడ యందు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహక వర్గ సమావేశము జరిగియుండెను. ఈ సమావేశము మిక్కిలి ముఖ్యమైనది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి సంజీవరెడ్డిగారు అధ్యక్షులుగా నుండిరి. ఈ సందర్భమున తెలంగాణా ప్రతినిధులు కొందరు విజయవాడకు వచ్చిన బాగుండునని కాళేశ్వరరావుగారు మాడపాటి హనుమంతరావు పంతులు గారికి వ్రాసిరి. మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంతరంగికులను సంప్రదించి, అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావులను విజయవాడ వెళ్ళమని కోరిరి. వీరి విజయవాడకు వెళ్లకముందు కొండా వెంకటరంగారెడ్డిగారిని కలుసుకొనిరి. రంగారెడ్డి గారు కొంత ముందుగానో, ఆలస్యముగనో, అనివార్యముగ విశాలాంధ్ర ఏర్పడగలదనియు, ఈ విషయమై తమను కలుసుకొనిన ముగ్గురు, అనగా మాడపాటి హనుమంతరావు,అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావుగారలు పనిచేయుట తమకు సమ్మతమేనని ప్రోత్సహించిరి. విజయవాడలో ఈ ఉభయులకు ఘన స్వాగత మీయబడినది. అక్కడ ఈ ఉభయులు సంజీవరెడ్డి, కాళేశ్వరరావు మొదలైన కాంగ్రెస్ నాయకులతో సంప్రదించిరి. ఆంధ్రనాయకులు విశాలాంధ్రకు తమ సంపూర్ణ సముఖత్వమును వెల్లడించి, విశాలాంధ్ర ఉద్యమము తెలంగాణమునుండియే సాగవలెనని అభిప్రాయపడిరి. ఆనాడు విజయవాడలో యీ విషయమై జరిగిన బహిరంగ సభలో పై ఉభయులు ప్రసంగించిరి. దీని తరువాత హైదరాబాదు, సికిందరాబాదు మునిసిపల్ కార్పొరేషనులు హైదరాబాదు రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర ఏర్పదవలెనని తీర్మానించినవి. 2 వ జూన్ 1953 నాడు హైదరాబాదులో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశము రామానందతీర్థ అధ్యక్షతన జరిగినది. అందులో విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రముల స్థాపన వాంఛించుచు తీర్మానము జరిగినది. ఈ సంఘటనలు హైదరాబాదు, సికిందరాబాదు నగరాలలోను తెలంగాణ జిల్లాలలోను విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి బలమైన ఊతనిచ్చినవి. కమ్యునిస్టు పార్టీ విశాలాంధ్రను బలపరుచుచు ప్రకటన గావించినది. 1953 ఆగస్టు 14 ,15 తేదీలలో హిమాయత్ నగర్ లో తెలంగాణా రైతుసంఘ కార్యాలయమున బద్ధం ఎల్లారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశములో విశాలాంధ్ర కావలెనను తీర్మానము ఆమోదింపబడినది. తరువాత కొన్నినెలలకు ఈ ఆంధ్రమహాసభ సమావేశము ప్రతాపగీర్జి కోఠిలో జరిగినది. విశాలాంధ్రము సత్వరముగ ఏర్పడవలెనని తీర్మానింపబడినది. 1953 ఆగస్టు 24 వ తేదీనాడు రెడ్డి విద్యార్ధి వసతి గృహమున విశాలాంధ్రోద్యమమును బలపరచుటకై మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన ఒక సమావేశము జరిగినది. ఇందులో దేవులపల్లి రామానుజరావు, వి.బి. రాజు, గురుమూర్తి, వెంకటేశం, వాసుదేవనాయక్, అహమ్మదలీఖాన్, సర్దారుల్లాఖాన్, డాక్టరు రంగాచారిగార్లు విశాలాంధ్ర నిర్మాణము తొందరగా జరుగావలెనని ఉపన్యసించిరి. 1953 అక్టోబరు 2 వ తేదీన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఈ సందర్భమున కర్నూలులో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర స్థాపన జరుగావలెనని తీర్మానింపబడినది. ఇది గమనించదగినది. ఆంధ్ర రాష్ట్రావతరణ ఉత్సవాలలో పాల్గొనుటకు హైదరాబాదునుండి సుమారు రెండునూర్ల మంది విశాలాంధ్రోద్యమాభిమానులు కర్నూలుకు వెళ్లియుండిరి. 1953 అక్టోబరు ఒకటవ తేదీ సాయంకాలము కర్నూలులో తెలంగాణా ప్రతినిధుల సమావేశము జరిగినది. ఆ సమావేశములో అనంతశయనం అయ్యంగార్, బెజవాడ గోపాలరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ఆంధ్ర నాయకులు పాల్గొనిరి. సమగ్రమైన చర్చలు జరిగిన పిదప తెలంగాణా ప్రతినిధులు విశాలాంధ్రకు కృషి చేయడానికి నిర్ణయించిరి.
డా.దేవులపల్లి రామానుజరావు
మీ కృషి అభినందనీయము...విడగొట్టడానికి అవాకులు చెవాకులు,నిందలు, అసత్యాలు సరిపోతాయి, కానీ కలిపి ఉంచడానికి ఓపిక, సత్య శోధన అవసరము.
రిప్లయితొలగించండి!!!
తొలగించండిఆర్యా, మీరు చరిత్రను ఏకపక్షంగా చూపిస్తూ కేవలం ఒకరిద్దరిని మాత్రమె విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
రిప్లయితొలగించండిఉ. ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు గారు తొలుత విశాలాంధ్రను సమర్తించిన మాట వాస్తవమే. అయితే వారు ఫజల్ అలీ నివేదిక వచ్చిన పిమ్మట ప్రజాభిమతం మేరకు తన అభిప్రాయం మార్చుకున్న విషయ తమరు ఎరుగరా?
ఈ కింది ఆధారాలను పరిశీలిస్తే మీకే తెలుస్తుంది:
హరిశ్చంద్ర హేడా గారి నాయకత్వంలో నవంబరు 1955 లో జరిగిన తెలంగాణా కన్వెన్షన్ కు మాడపాటి వారి సందేశం: "ప్రస్తుత పరిస్తితులలో తెలంగాణా రాష్ట్రమే వాంచనీయం. ఎస్.ఆర్.సి సిఫారుసులను అమలు జరపాలి": గోలుకొండ పత్రిక నవంబరు 24, 1955
"In the resolution so passed at this convention after a long debate, besides the known Telangana protagonists K.V. Ranga Reddy and M. Chenna Reddy, Heda was supported by several other senior Congress leaders, such as APCC President J.V.Narasinga Rao, Ahmed Mohiuddin, MP, M. Hanumantha Rao and the like." SKC page 47
నేను ఎరగను.గోలుకొండ పత్రిక నవంబరు 24 వ ఎడిషన్ మొదటి పేజీ లో నాకైతే మాడపాటి హనుమంతరావు గారి సందేశం కనిపించలేదు.మీకు కనిపిస్తే స్కాన్ చేసి పోస్ట్ చేయండి.మాడపాటి హనుమంత రావు తొలి నుండి తుద వరకూ కూడా విశాలాంధ్ర వాదే. వివరాలు సరిగ్గా కనుక్కొని ఆ హనుమంతరావు ఎవరో చెప్పండి.
తొలగించండిఇప్పటికే విశాలాంధ్ర వాదం గురించి, దాని ఘన చరిత్ర గురించి,మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఊగిసలాడిన సమయంలో కొంత వినవచ్చి నిర్ణయం వెలువడగానే మాయమైన ప్రత్యేక వాదం గురించి ఈ బ్లాగ్ లోనే అనేక పోస్టులు చేయడం జరిగింది. ఆనాటి వార్త కథనాలతో కూడిన తెలంగాణలో విశాలాంధ్రోద్యమం అనే ఈబుక్ కూడా పోస్ట్ చేయడం జరిగింది.
మీకు నా తరపున మరొక చరిత్ర పాఠం.చదువుకొని ఆనందించండి.మాడపాటి హనుమంతరావు గారు తానూ చనిపోయే ముందు రోజులలో ఇచ్చిన, చరిత్రకారులు, సామాన్యులందరికీ తెలిసిన సందేశం ఇది
ప్రత్యేకరాష్ట్ర నినాదం తెలంగాణా ప్రయోజనాలకు మంచిది కాదు : మాడపాటి
ఆంధ్రజనత దినపత్రిక, మార్చి 22,1969: వేర్పాటు ఆలోచనలకు స్వస్తి చెప్పి తెలంగాణ ప్రగతికై ఆంధ్రప్రాంత సోదరులతో కలిసి మెలిసి కృషిచేయవలసిందని తెలంగాణా ప్రజలకు తెలంగాణాలో విద్యాభివృద్ధికి, తెలుగు భాష,సంస్కృతిల పునర్జీవనానికి, మహిళల ప్రగతికి నిర్విరామంగా కృషి చేసిన తెలుగు పెద్ద ఆంధ్ర పితామహ శ్రీ మాడపాటి హనుమంతరావు పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శాసనమండలి మాజీ అధ్యక్షుడైన శ్రీ హనుమంతరావు తమ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు:
"తెలంగాణాలో ఇటీవల కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘటనలు నాకు చాలా బాధను , ఆందోళనను కలిగిస్తున్నవి. ప్రత్యేక తెలంగాణ నినాదం తెలంగాణ ప్రజలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని నేను త్రికరణశుద్ధిగా విశ్వసిస్తున్నాను. తెలంగాణను విశాలాంధ్రలోని అంతర్భాగంగా భావించుకొని, చిరకాలంగా మనం మురిసిపోతూ వచ్చాము. మనం నిజాం పరిపాలనా కాలంలో కూడా సమస్త రాజకీయ, సాంఘిక, విద్య మహోద్యమాలను 'ఆంధ్ర పతాక' క్రిందనే నడుపుకుంటూ వచ్చాము. మనకు ఆంధ్రమహాసభ ఉన్నది.మన విద్య, సంస్కృతి సంస్థలన్నీ ఆంధ్రనామ శబ్దాంకితములు. ఆంధ్రతో కలిసిమెలిసి చేదోడువాదోడుగా వ్యవహరించడంలోనే తెలంగాణ శ్రేయస్సు గర్భితమై యున్నది. ఈ దశ లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రయోజనకరం కాదు. గిట్టుబాటు కాదు. రాజ్యాంగచట్టాన్ని సవరించకుండా 'ప్రత్యేక తెలంగాణాను' ఏర్పాటు చేయడం సైతం అసంభవమే. రాజ్యాంగ చట్టసవరణ అనేసరికి ఎన్నో క్రొత్త చిక్కులను ఎదుర్కోవలసి వస్తుంది.దీని ప్రభావం ఇతర ప్రాంతాలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ వాదం జాతీయ సమైక్యత సాధనకు ఏ మాత్రం దోహదం చేయజాలదు"http://visalandhra.blogspot.in/2011/11/21031969.html
జైగో,
తొలగించండిఎప్పుడూ చీకట్లో రాళ్ళు వేయడమేనా!
ఇది మూడవ భాగమే. తరువాతి భాగంలో మీరు చెప్పినది ఉండవచ్చుకదా.
ఈ భాగం గురించి ఏమైనా తప్పులు, విమర్శలు ఉంటే రాయండి.
మాడపాటి వారి అభిప్రాయం రాసేముందు ఒక్క మారు వారి "ఆంధ్రుల సంస్కృతీ చరిత్ర" చదవండి.
చైతన్య గారూ, మళ్ళీ చూడండి (Nov-24-1955; page 1; column 7; para 3). దీని పైన సంగెం లక్ష్మీబాయి గారి ప్రకటన ఉంటుంది. ఇండియా ఆర్ధిక అభివృద్దికి రషియా చేయూత అనే శీర్షిక దీని కింద ఉంది. తెలంగాణా కన్వెన్షన్ నివేదిక అనే అంశం మూడు కాలుమ్లలో ఉన్నా పైని ఉన్న శీర్షిక చూసి రెండే కాలమ్లు అనిపిస్తాయి.
తొలగించండిసందేహం వలదు, స్పష్టంగా ఆంధ్రపితామహుల వారిదే ఈ సందేశం & శ్రీక్రిక రెఫరెన్సు. ఎం. హనుమంతరావు అనే పేరు గల "సీనియర్ కాంగ్రెస్ నాయకులు" ఎవరూ ఆ కాలంలో ఉన్నట్టు లేరు. 1951 శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్తులలో ముగ్గురు నలుగురు హనుమంత రావులు ఉన్నారు కానీ ఎం. ఇనీషియల్ నాకు కనిపించలేదు.
మాడపాటి వారు 1955 కాలంలో విశాలాంధ్రను సమర్తించినట్టు నాకయితే ఆధారాలు దొరకలేదు. మీకు తెలిస్తే చెప్పండి. 1969 వరకు ఆయన మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నారనే విషయం నాకు తెలిసిందే.
/మాడపాటి వారు 1955 కాలంలో విశాలాంధ్రను సమర్తించినట్టు నాకయితే ఆధారాలు దొరకలేదు./
తొలగించండిమీకు ఆధారాలు దొరకకపోయినంత మాత్రాన వాస్తవాలు విస్మరించజాలము :
1) కృష్ణా జిల్లాలో జన్మించారు, గుంటూరుతో వియ్యమందారు 2)'ఆంధ్రా మహాసభను స్థాపించారు (తెలంగానా మహాసభ కాదు) 3) శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అభివృద్ధికి తోడ్పడ్డారు (కాకతీయ యాస-గోసా నిలయానికి కాదు) :P 4) 1956 ఆంధ్రరాస్ట్రం ఏర్పడిన తరువాత ఉజ్జమాలు చేసిన ఆధారాలు లేవు 5)1970 న 'ఆంధ్ర'కుటీరం, హనుమాన్ టెక్డిలో పరమపదించారు. 6) గోసబాస కాక చక్కటి తెలుగు వాడేవారు 7)...
ఇవి చాలు, ఆయన సమైక్యవాది అనడానికి. అర్థం చేసుకోవాలండీ, వూకే ఏదో రాబోవు కాలం వుందికదా అని వున్నకాలం వృథా మాటలకు కరుసుచేయడం కాదు, అర్థం చేసుకోవాల. :))
@SNKR:
తొలగించండిఓహో ఒక వ్యక్తి అభిప్రాయం తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడ పుట్టాడో, ఏమి చేసాడో లాంటివి తెలుసుకుంటే సరిపోతుందన్న మాట. అనవసరంగా విమస వారు చాలా ప్రయాసపడి వారి వారి వ్యాఖ్యలను సేకరించారు :)
ఆధారాలు దొరకలే అంటూ మన అభిప్రాయాలు ఆయనకు రుద్దడం కన్నా ఆ వ్యక్తి నేపథ్యాన్ని కూడా పరిగణన లోకి తీసుకుని బేరీజు వేయడం శాస్త్రీయమే.
తొలగించండి/తెలుసుకుంటే సరిపోతుందన్న మాట/
మన అర్థంలేని అభిప్రాయాలు ఎదుటివాళ్ళకు రుద్దడంతో పోలిస్తే, ఇది సరిపోదూ?! :)
అవ్వ, నేను ఆయనకు నా అభిప్రాయం రుద్దానా? నేనిచ్చిన ఆధారాలు తమకు గిట్టనంత మాత్రాన కొట్టేయుట పాడియేనా మిత్రమా?
తొలగించండితెలంగాణా లో ఆంద్ర నేతల మాయ మాటలకు భ్రమసి
రిప్లయితొలగించండి"విశాలాంధ్ర ఝెండా" పట్టుకుని ప్రజల చేతుల్లో రాళ్ళ దెబ్బలు తింటూ కూడా వరంగల్ లో ఊరేగిన వారిలో కాళోజి కూడా వున్నాడు.
ఆయన ఆంధ్ర నేతల మోసాన్ని, తెలంగాణా చవట నాయకుల స్వార్ధాన్ని గ్రహించి ఆ తర్వాత ఎంతోమంది లాగే ప్రత్యెక తెలంగాణా ఉద్యమంలో చేరాడు .
కాళోజీ ఎంతో ఆవేదనతో రాసిన ఈ కవితే
మీకు తిరుగులేని సమాధానం :
చదవండి
ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు,
ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని
హామీలిచ్చినవారే అంతా స్వాహా చేస్తారని ||ఎవర||
అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని
పరిపాలనతో తమ్ముల ‘ఫజీత’ పాలు చేస్తారని ||ఎవర||
ముఖ్యమంత్రియే స్వయముగ సఖ్యత ఛేదిస్తాడని
ప్రాంతీయాధ్యక్షుండు ప్రక్క తాళమేస్తాడని ||ఎవర||
‘కావలి కుక్కలు’ దొంగల గంజికాసపడతాయని
కావలివాడే దొంగల కావళ్లను మోస్తాడని ||ఎవర||
సిబ్బందిలోగల తమ్ముల ఇబ్బంది పెడతారని
అన్నలమను మాట మరచి అహంకార పడతారని ||ఎవర||
తమ్ముని తల బోడిచేసి దక్షత అనుకుంటారని
తంతే-తమ్ముడు అన్నను తన్నిండని అంటారని ||ఎవర||
తపుడు లెక్కతొ తమ్ముల నెప్పుడు ఒప్పిస్తారని
అంకెల గారడి చేస్తూ చంకలు ఎగిరేస్తారని ||ఎవర||
పోచంపాడు, శకుని పాచిక పాలౌతుందని
తెలంగాణవాసులకు త్రిశంకుస్థాయి వస్తుందని ||ఎవర||
ప్రాంతాన్ని పాడుచేసి శాంతి శాంతి అంటారని
కడుపుల్లో చిచ్చుపెట్టి కళ్ళు తుడువ వస్తారని ||ఎవర||
అధికార ప్రకటనలో అబద్దాలె ఉంటాయని
బాధ్యతగల మంత్రికూడ బాతాలే కొడతాడని ||ఎవర||
మంత్రి అయిన మురిపెముతో మనిషి దయ్యమౌతాడని
ప్రజాస్వామ్య విధానాన్ని బదనాము చేస్తాడని ||ఎవర||
ఓట్లు పొంది సీటు దొరక నోట్ల మన్ను పోస్తాడని
నమ్మకద్రోహం చేస్తూ గమ్మున కూర్చుంటాడని ||ఎవర||
ప్రజాస్వామ్యమీ తీరుగ పాడుచేయబడుతుందని
శాసనసభ వుండికూడ మోసమె సాగిస్తారని ||ఎవర||
విశాలాంద్రులను సైతము విషాదులను చేస్తారని
తెలంగాణ వేర్పాటుకు తీరులు కల్పిస్తారని ||ఎవర||
తీరవాసులైనంతనె తీర్థంకరులౌతారని
తెలంగాణ వాసులను దేభ్యాలుగ చూస్తారని ||ఎవర||
అభయమిచ్చి కుత్తుకనే అదిమి అదిమి పడతారని
ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమంటారని ||ఎవర||
తెలంగాణ వేరంటె తెలివి లెక్క పెడతారని
ఆత్మహత్య ధోరణంచు హంగామా చేస్తారని ||ఎవర||
‘ముల్కి’ మంత్రులందరును ముఖ్యమంత్రి భజన చేస్తారని
దొడ్డిదారి పదవులతో దొడ్డవారు అవుతారని ||ఎవర||
ప్రతినిధులు ప్రజల మరచి పదవిపథము పడతారని
బ్రహ్మానందునిపదమున బ్రహ్మపదముకంటారని ||ఎవర||
విచ్చలవిడి ఖర్చులతో విలాసాలు చేస్తారని
కేంద్రంపై నిందమోపి కేరింతలు కొడతారని ||ఎవర||
బార్డరువీరులు ద్రోహుల ఆర్డరు పాటిస్తారని
చేటుగూర్చినోనికి తమ ఓట్లు అందజేస్తారని ||ఎవర||
చేతకు సిద్ధాంతానికి చీమ ఏన్గు తేడాయని
వట సావిత్రి వ్రతమును వారకాంత చేస్తుందని
ఎవరనుకొన్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు.
కాళోజీ అనుకోలేదు కానీ చాలా మంది సరిగ్గానే ఊహించారు :)
తొలగించండి"కాళోజీ ఎంతో ఆవేదనతో రాసిన ఈ కవితే"
తొలగించండిఆయన ఎప్పుడు, ఎక్కడ ఆ కవితను రాసారో ఎవరు దానిని ప్రచురించారో మేము దానిని ఎక్కడ చదువుకోవచ్చో చెబితే బావుంటుంది
ఇంక వివాదాలు అనవసరం.
తొలగించండితెలుగువాళ్ళలో ఐకమత్యం నేతిబోరకాయలో నేయి వాంటిదని తేలిపోయింది.
రాయలసీమకు కూదా వేరే రాష్ట్రం కావాలన్న మాటా వింటున్నాము. తెలంగాణా కావాలన్న గొడవ సరేసరి. పనిలోపని ఉత్తరాంధ్ర కూడా అడగవచ్చును.
అన్నట్లు కోనసీమ రాష్ట్రం తప్పక యేర్పడవలసి ఉంది.
మొత్తానికి నాలుగైదు రాష్ట్రాలు అయితే బాగుంటుంది.
ఉదారంగా అలా కానిస్తే మిగతా రాష్ట్రాలలోనూ విభజన రాగాలు ఊపందుకోవా అంటారా. కానివ్వండి. ఆదిగిన వారికల్లా రాష్త్రాలు ఇవ్వక బలహీనమైన కేంద్రప్రభుత్వాలు యేమీ చేయలేని రోజు కళ్ళెదురుగానే ఉన్నట్లుంది.
సమీప భవిష్యత్తులోనే నాలుగైదు వందలో, వేయి రాష్ట్రాలతోనో మన దేశం అద్భుతస్వరూపాన్ని సంతరించుకోబోతోంది.
అంతమంది ముఖ్యమంత్రుల సభ తయారయ్యాక పార్లమెంటు దేనికనే రోజూవస్తుంది వెంబడే.
కాని ఆలోగానే మరేదో మంచిదో చెడ్డదో అయిన దేశం మనని పాలించి ఉధ్ధరించటానికి తయారవుతుంది.
దేశం భవిష్యత్తు గురించి మనకేలా ఆలోచనలు?
మనం కోరుకున్న రాష్త్రాలు యేర్పాటయితే మనకు చాలు.
ఈ దేశం యే గంగలో మునిగితేనేం.
ఎవరు ఎవరికి అన్యాయం చేసారో లెక్కలు వేస్సుకుని తన్నుకుంటూ ఉందాం.
ఈ దేశం యేమయితే మనకేం.
తమషా చూడటమే మన పని.
చాలా బాగుంది.
ఈ కవిత నిజంగా కాళోజీ గారిది ఐతే, ఒక్క గమనించవలసినది ఉంది.
తొలగించండిఒకటి రెండు పదాలు తప్పించి ఇందులో ఎక్కడా "మా భాష, మా యాస" కనపడదు.
ముఖ్యంగా నందిని సిధారెడ్డి గారు వాపోయినట్టు భాషకు అయువుపట్టిన తెలంగాణ క్రియ లేనే లేదు.
ఆంధ్రోల్లతో కలసి తెలంగాణ క్రియను తోక్కేసిన కీర్తి కాళోజీ గారికి కూడా కొంత పంచుదామా?
ఆ మధ్య ఎప్పుడో దేసపతి శ్రీనివాస్ గారు అన్నట్టు కాళోజీ గారు కూడా ఆత్మ న్యూనతాభావంలో తెలంగాణ భాష యాస లో రాయలేకపోయారా?
@శ్యామలీయం:
తొలగించండిపొట్టి శ్రీరాములు గారికి ఆంద్ర రాష్ట్రం ఏర్పడాలని కోరుకునే హక్కు ఉంది. దేవులపల్లి వారికి విశాలాంధ్ర కోరుకునే హక్కు ఉంది. మాడపాటి వారికి తెలంగాణా అడిగే హక్కు ఉంది. అలాంటప్పుడు బైరెడ్డి గారికి రాయలసీమ కోరే హక్కు లేదా? వారికి ఉన్న కొమ్ములు ఏమిటి? ఈయనకు లేనిదేమిటి?
దేశం గంగలో ముణిగినా ఫరవా లేదనుకొనే ఆనాడు ఆంద్ర రాష్ట్రం అడిగారా? కానప్పుడు కొందరి మీదే ఆక్షేపణలు ఎందుకు?
ప్రజాదరణ పొందగలిగితే అందరూ వీరులే. రాయలసీమ వారో, కోనసీమ వారో మాకు మా రాష్ట్రం కావాలి మొర్రో అంటే బుజ్జగించగలిగితే ప్రయత్నించండి. లేకపోతె ఊరుకోండి అంతే తప్ప అవహేళన చేయకండి.
నాలుగయిదు వందల రాష్ట్రాల వికృత విపరీత ఊహాగానాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకున్న పెద్దలకు ఇవే శతకోటి వందనాలు.
గొట్టిముక్కల వారు,
తొలగించండివారడిగారు, వీరడిగారు, బైరెడ్డి గారికి రాయలసీమ కోరే హక్కు లేదా అంటే ఏం చెప్పేది? ఆనాటినీ యీ నాటినీ మీరు ఒక్కటే గాటన కట్టుతానంటే ఏం చెప్పేది? వందలకొద్దీ సంస్థానాలను విలీనం చేసి కొద్ది రాష్ట్రాలను యేర్పాటు చేసుకోవటంలో సారస్యం వేరు. ఆవేశకావేశాలతో ఉన్న రాష్ట్రాలను ముక్కలు ముక్కలు చేసుకోవటం వేరు విషయాలు కాదా?
ఇందులో నేను అవహేళన చేస్తున్నది యేమీ లేదు. మీకు అలాంటి అభిప్రాయం కలగటం విచారకరం.
అలాగే నేనేమీ మీరన్నట్లు వికృత విపరీత ఊహాగానాలు చేయటం లేదు. సుదూర భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెబుతున్నానంతే. ప్రత్యేక తెలంగాణా వాదన ఒకటే కాదు మరి కొన్ని, అంటే ప్రస్తుతానికే దాదాపు మరొక ఇరవై పైచిలుకు అటువంటి ప్రత్యేక వాదనలు వినిపిస్తున్న మాట తమకు తెలియనిది కాదు. మరి వారి కోరికల మేరకూ ప్రత్యేక రాష్ట్రాలు యేర్పడకుండా నిరోధించగలమా? అసలెందుకు నిరోధించాలన్న ప్రశ్న రాదా? పంపకాలంటూ మొదలు పెట్టాక మరికొన్ని కొత్త రాగాలాపనలు వినిపించవన్న హామీ యెవరన్నా యిస్తున్నారా?
ఇకపోతే నేను ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకున్నగా మీరు అర్థం చేసుకోవటం కేవలం అన్యాయం అని మనవి చేసుకుంటున్నాను. ఒకవేళ ప్రజలు ఆవేశాలకు లోనై యెక్కడి కక్కడ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని పట్టుబడితే అలా ఇచ్చినండువలన మీరనుకొనే ప్రజాస్వామ్యం అద్భుతంగాపండినా, అది దేశక్షేమానికి మంచిది కాదని నా అభిప్రాయం. కాడూ ప్రజలందరూ అడిగినదే దేశక్షేమకరం అనుకుంటే - మంచిది అలాగే కానివ్వండి. కాని పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేక ఆహ్వానిస్తున్నామేమో అన్న భయం మాత్రం ఉండాలి. అదీ వద్దంటారా - చేయగలిగింది యేమీ లేదు..
అందరూ కోరినదల్లా మంచి భవిష్యత్తుకు దారి తీస్తుందనుకోవటం ఒక అందమైన భ్రమ. కలిసికట్ట్గా ఆవేశంతో చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే, దేశాన్ని రక్షించటానికి ప్రజాస్వామ్యం యేమీ దైవం కాదు కృపతో రక్షించటానికి.
ప్రజాస్వామ్యంలో ప్రజాభిమతానిదే పెద్ద పీట. అలనాడు ఆంద్ర రాష్ట్రం ఏర్పడినా, రేపో మాపో తెలంగాణా ఏర్పడినా దానికి కారణం ప్రజాభిమతం మాత్రమె, దైవ లీల కాదు. మీరు ఉదాహరించిన సంస్థానాల విలీనం ప్రజలు ఆమోదించారు కాబట్టే తద్వారా వచ్చిన రాష్ట్రాలు నిలబడ్డాయి.
తొలగించండిఅడిగిన వారందరికీ కాదనుకుండా వారి రాష్ట్రం ఇవ్వాలని నేను అనలేదు. ఆయా కోరికలకు ప్రజాదరణ ఉంటె ఆపడానికి మనమెవ్వరం?
ఎప్పుడో "సుదూరంగా" ఏవో ప్రమాదాలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని ఒక వ్యక్తి అభిప్రాయం ఒక ఎత్తు. ఈనాడు కోట్లాది ప్రజలు తమ భవిష్యత్తు తామే నిర్ణయించుకోవాలనే తపన & ఆరాటం మరో ఎత్తు.
సంబంధం లేని వ్యక్తులు ఎటువంటి తర్కం & ఆధారాలు లేకుండా ప్రమాదాలు రావచ్చని బెదిరిస్తే ప్రజల కోరికను మన్నించకపోవడం దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.
దేశాన్ని విచ్చిన్నం చేయాలనో లేదా గంగలో ముంచాలనో ఎవరూ కోరుకోరు. అలాంటి దురభిప్రాయంతో ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయని తమకు ఎందుకు అనిపించిందో?
రాష్ట్రాల ఏర్పాటు ఆవేశమో, చెడు నిర్ణయమో అయితే ముందుగా 1953 మదరాసు రాష్ట్ర విభజనను తిరిగి తోడుదాం. దేశంలో విభజన మంత్రం తొలుత జపించిన ఆంధ్రులు ఈనాడు ఆలాపించే సమైక్యరాగం వెనుక భావమేమిటో ఆ తిరుమలేశునికే తెలియాలి.
ఇరవై డిమాండులు నాలుగయిదు వందలు అవుతాయా? ఎందుకు అవుతాయి? ఇది విపరీతవాదం కాదా? కనీసం ఒక వంద "కొత్త రాష్ట్రాల" పేర్లు ఎల్లలు ఎవరయినా చెప్పగలరా?
గొట్టిముక్కలవారు,
తొలగించండిరాష్ట్రాలు దైవలీలతో యేర్పడతాయని నేననలేదే! నా వాక్యం మరలా ఓపిగ్గా చదువుకోండి. ఆవేశపూరిత చెడ్డనిర్ణయాలనుండి ప్రజాస్వామ్యం అన్నది కూడా రక్షించలేదని మాత్రమే కదా నేనన్నది?
మీరు నాకు దురుద్దేశాలు అంటగట్టటం అభ్యంతరకరం. నేనేదో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేస్తున్నానని పదే పదే అనటం బాగోలేదు. మీ అభిప్రాయాలతో యేకీభవించని వారంతా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే వారంటే యెలా?
సాటి తెలుగువాడిని నేను సంబంధం లేని వ్యక్తినెలాగవుతానండీ? నా తర్కం మీకు నచ్చాలని లేదు కాని మీకు నచ్చనంతమాత్రాన అది తర్కం కాకుండా పోతుందా?
దురభిప్రాయంతో ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయని నేననన్నానా? లేదే? ఆవేశం గురించి ప్రస్తావించానంతే.
ఐకమత్యమే బలము లాంటివి ఒకనాటి మంచి మాటలని అనిపిస్తోంది మీ ధోరణితో. ఆంధ్రులు అంటే నా భావనలో తెలుగువాళ్ళంతా - కోస్తా వాసులు మాత్రమే అనే రాజకీయ నూతనార్థం నాకు కొత్త, నచ్చదు కూడా. తమిళ,ఆంధ్రప్రజలకు రాష్ట్రాలు వేరుగా ఉండవచ్చును దానికేం. ఇప్పుడు తెలుగుగడ్డను పగులగొట్టటం కేవలం రాజకీయ లబ్ఢులకోసమే అని నా అభిప్రాయం.
ఇరవై నుండి నాలుగయిదు వందలు అవుతాయా అంటే - ఏమో కావని మాత్రం మీరు యెలా చెప్పగలరు. దిగిజారుడుకి బోలెడు అవకాశం ఉంటుంది.
మన చర్చ యెడతెగక సాగటం అనవసరం అని అనుకుంటున్నాను. అపై మీ యిష్టం.
భాష పేరుతొ ఆవేశపూరితంగా దేశాన్ని (గంగలో మునిగినా) విడగొట్టడం ఫరవాలేదు. ఇతరుల కోరికలు మాత్రం స్వార్థంతోనో, ఆవేశంతోనో కూడుకున్నవి. బాగుందండీ ఈ తర్కం.
తొలగించండిరాయలసీమ విషయంలో రాయలసీమ వారి అభిమతమే ముఖ్యం. సాటి తెలుగు వారయినా, భాషేతరులయినా, వేరే రాష్ట్రం వారయినా (many-many links here if one notices carefully i.e. Telugu speaker may not be from AP) భారతీయులు అందరికీ ఒకటే సంబంధం (అంతంత మాత్రమె). నేను తెలుగు వాడిని కాబట్టి నాకేదే ప్రత్యేకమయిన సంబంధం ఉందని తగుదునమ్మా అంటూ దూరడం నేనయితే చేయను, మరి మీ ఇష్టం.
ప్రత్యెక రాష్ట్రాలు ఒకటి (1953 ఆంద్ర) నుండి ఇరవైకి చేరుకోవడం వెనక ఒక చారిత్రిక నేపధ్యం ఉంది. రాయలసీమతో సహా ఈరోజు పైకి వచ్చిన డిమాండులు అన్నీపాతవే. ఎ నేపద్యం లేకుండానే వందలాది డిమాండులు వస్తాయని అనుకోవడం మీ హక్కు, అటులే కానిండు.
ఒద్దన్నా కావాలన్నా ప్రజాస్వామ్యమే మనకు శరణ్యం. ఇతరుల అభిమతాన్ని గౌరవిస్తేనే అందరికీ మంచిది. కలిసి ఉంటె అవతల వారికి వచ్చే లాభాలు ఏమయినా (big if) ఉంటె అవి చెప్పి convince చేయాలి కానీ దబాయిస్తే ఎలా? బలవంతపు సహవాసం అందరికీ చేటు కాదా?
ప్రజల ఆకాంక్ష కంటే మరేదో ముఖ్యం అని వాదించడం నా దృష్టిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఇది వ్యక్తిగత విమర్శ కాదని పెద్దలు అర్ధం చేసుకుంటారని ఆశిస్తాను. సెలవు.
/ బలవంతపు సహవాసం అందరికీ చేటు కాదా?/
తొలగించండిచేటైనా, మేలైనా ఒక దేశంలో చచ్చిపడి వుండాలి, రాజధాని తీసుకుని పోతా అంటే కుదరదు. అంతగాపోవాలనుకుంటే రాజధానిని విడచి పోతామంటే ఎవడూ ఆపేవాళ్ళుండరేమో. అయినా ఆపాలనుకునేందుకు ఏమన్నా శ్రీరామచద్రులా! వట్టి ఏడుపుగొట్టు మొహాలాయె. :)
వేరే దేశం వెళ్ళవచ్చు... ద్వారములు తెరిచియే వున్నవి :))
వీరి పూర్వీకులయిన దాయాదుల పవిత్రదేశం "పాకిస్తాన్" అయితే ఉత్తమం అయిన ఎంపిక :)
తొలగించండిచైతన్య, శ్యామలీయం, పీపీఆర్ ల
రిప్లయితొలగించండికామెంట్లు చదివిన తరువాత
ఆంద్ర సోదరుల ఆలోచనావిధానం ఇక ఎప్పటికీ మారదు గాక మారదు అనిపిస్తోంది.
చైతన్య గారికి
కాళోజీ ఈ కవితను ఎప్పుడు రాసారో , ఎక్కడ రాసారో,
ఎవరు ప్రచురించారో కావాలట, ఎక్కడ చదువుకోవాలో చెప్పాలట!!!
పీపీఆర్ గారికి
ఈ కవిత నిజంగా కాళోజీ గారు రాసిందేనా అన్న ధర్మ సందేహం కలిగింది !!
ఈ కవితలో ఒకటి రెండు పదాలు తప్ప "మా భాష మా యాస" ఎక్కడున్నాయని ఓ వెటకారం.!!!
ఇక శ్యామలీయం గారు
తెలంగాణా రాష్ట్రం ఇస్తే కోనసీమ రాష్ట్రం, రాయలసీమ రాష్ట్రం , ఉత్తరాంధ్ర రాష్ట్రం
ఆ తర్వాత మొత్తం దేశంలో నాలుగైదు వందల రాష్ట్రాలో... వెయ్యి రాష్ట్రాలో ఇవ్వాల్సి వస్తుందని, దేశం ఏమైపోతే మనకేం అని ...
అసందర్భ ప్రలాపనలు, వెకిలి వెక్కిరింతలు చేసి మురిసిపోయారు.
ముగ్గురిలో ఒక్కరైనా అసలు కవితలో ఉన్న ఆవేదనని, వాస్తవాలని తడిమిన పాపాన పోలేదు.
యువ తెలంగాణా డాట్ కాం (www.yuvatelangana.com)లో కాళోజి రాసిన నిప్పులాంటి నిజాలను చాటే మరెన్నో కవితలున్నాయి కాని
ఇలాంటి మనస్తత్వంతో ఉన్న వాళ్లకి.....
కోడిగుడ్డుపై ఈకలు పీకాలని సరదా పడే వాళ్లకి ....
తెలంగాణా అస్తిత్వ ఆకాంక్ష ,
ఎనిమిది వందల యాభై తెలంగాణా ఆత్మల ఘోష ఎం అర్ధమవుతాయి .
కానివ్వండి మీ గోల మీది
మా పోరాటం మాది.
పోయే కాలం మీది
రాబోయే కాలం మీది.
రవి అస్తమించని సామ్రాజ్యమే తోక ముడిచింది.
ఆంద్ర ఆధిపత్యం ఒక లెక్కా !
http://www.scribd.com/doc/24218217/Kaloji-Telangana-Bhasha-బతుకు
తొలగించండికాళోజీ రాసారు కాబట్టి అది మీకు 'ఆవేదన', 'వాస్తవం'. అంతే!
http://www.scribd.com/doc/24218217/Kaloji-Telangana-Bhasha-బతుకు
పైన ఇచ్చిన లింకు చదవండి. కాళోజీ తన విద్వేష భావాన్ని పూర్తిగా తెలంగాణ యాసలో వ్యక్త పరిచారు.
ఈ స్థాయి "మన భాష మన యాసని" తన ఒక్క రచనలోనైన ప్రయోగించరా?
సాయుధ పోరాటంలో జైలు గోడల మీద రాసిన కవితలలో ఆ భాష ఈ యాస ఉన్నాయా?
http://www.youtube.com/watch?v=8MJGjWYFI-౮
ఇది కూడా వినండి. ఎక్కడ ఉంది "మన భాష మన యాస" ఇందులో?
కవితలకు, రచనలకు, ప్రసంగాలకు "మన భాష మన యాస" పనికి రాదు! అదే పక్క ప్రాంతం వాడి మీద ద్వేషం చిమ్మడానికి కావాలి.
//పోయే కాలం మీది
తొలగించండిరాబోయే కాలం మీది.//
నిజాన్ని సరస్వతి అమ్మవారు మీతో చక్కగా చెప్పించారు.ధన్యవాదాలు :)
పోయే కాలం మీది
రిప్లయితొలగించండిరాబోయే కాలం మాది.
కుదురుగా తెలుగులో రెండు వ్యాఖ్యలు సరిగ్గా రాయడం నేర్చుకున్న తరువాత వ్యాఖ్యానించడం మంచిది.ఈ మాత్రం కూడా రాయలేవివాళ్ళు 'రాళ్ళు'వేయడానికి మాత్రం తయారు!
తొలగించండిగౌతమ్ గారు
రిప్లయితొలగించండియెవరిది మాత్రం పోయే కాలం కాదు?
యెవరికి మాత్రం రాబోయే కాలం లేదు?
కాలం యెవరి అధీనంలోనూ తాను నడవదు.
కాలం యెవరి అభీష్టాలకూ తాళం వేయదు.
ఒకరిది పోయే కాలం అన్న వారూ పోతారు.
రాబోయే కాలంలో రాబోయే వారు పోతారు
రాకపోకలు అవిఛ్ఛిన్నంగా సాగుతూనే ఉంటాయి
కాకపోతే చేతల గురుతులు మిగులుతుంటాయి
అందుకే కాస్త విజ్ఞతతో వ్యవహరిస్తే మంచిది
అందమైన భవిష్యత్తును ఆలోచిస్తే మంచిది.
ఆలోచనతో మంచిదారిని నడవగలము కాని
ఆవేశాలతో మంచి భవిష్యత్తును నిర్మించలేము
తొలగించండిదింపుడుకళ్ళెం ఆశలతో
దోపిడి సాగించు యోచనతో
ఆధిపత్యపు పైత్యంతో
అధికారం చలాయిస్తూ
హక్కులనడ్డే గద్దలకిదియే
పోయే కాలం!
గుండెలనిండా ధైర్యంతో
గెలుపు నాదనే విశ్వాసంతో
రాష్ట్రసాధనే లక్ష్యంగా
ప్రజల మద్దతే విధానమవగా
ధర్మయుద్ధమున ముందుకు సాగిన
నవతరానిదే రాబోయే కాలం!!
సత్యాన్వేషి అన్న మారుపేరు బాగానే ఉంది కాని తిట్లదండకం కవిత్వం కాలేదని గ్రహించగలరా దయచేసి?
తొలగించండిఏది కవిత్వమో ఏది కాదో తేల్చాల్సింది మీరు కాదు. వాస్తవానికి మీకంత సీను లేదని మీరు గ్రహించినట్లు లేరు. ఇలాంటి అహంకారపూరిత ప్రవర్తనే ప్రస్తుత విభజనవాదానికి కారణమని తెలిసికూడా మీరదే కొనసాగిస్తున్నారంటే మీవాదనలో సమైక్యభావన ఎంతో తెలుస్తూనే ఉంది.
తొలగించండిసత్యాన్వేషిగారు,
తొలగించండిఅహంకారపూరిత ప్రవర్తన అన్నమాట మీరు వాడారు. సంయమనం పాటించండి. మీరు నిలువుగా వ్రాసిన రెండు సుదీర్ఘవాక్యాలూ ఒక కవితారూపం సంతరించుకున్నాయని నమ్మితే నమ్మండి. దానికేం. ఇడ్లీలు వేయటం రానివాడు కూడా అవి బాగారాక పోతే ఆసంగతి చెప్పగలడు కదా? అలాంటప్పుడు తిట్లదండకం కవిత్వం కాలేదని చెప్పటానికి మీలాటి వారి దగ్గర కోచింగు తీసుకుని సర్టిఫికేట్ పొందవలసిన అగత్యం ఉందా చెప్పండి. మీ ధోరణిలోనే చెప్పాలంటే ఎవరికెంత సీన్ ఉన్నదీ తేల్చాల్సింది మీరు కాదు అని కూడా మీకు తెలిసినట్లు లేదు! నిందాలాపాలతో వ్రాసింది మీరు - నేనటువంటి మాటలు వాడానా? లేదే? అహంకారపూరిత ధోరణీ మీదే అని తెలుస్తూనే ఉంది కదా? సభామర్యాదలు పాటించక వ్రాసే మీబోటి వారికి జవాబు ఇవ్వటం అనవసరం కాబట్టి ఇంతటితో యీ చర్చ సమాప్తం.
శ్యామలీయం, సత్యాన్వేషి గార్లకు మనవి:
తొలగించండిసత్యాన్వేషి గారి కవిత్వం బాగుందో లేదో పక్కన పెడితే తిట్లయితే నాకు కనిపించలేదు. అయితే ఎవరికి ఎంత సీనుందో అప్రస్తుతం అనుకుంటా.
గొట్టిముక్కలవారూ,
తొలగించండిదోపిడి యోచన.. పైత్యం.. గద్దలు..పోయే కాలం..
ఇవన్నీ అందమైన కవితా ప్రతీకలా? దూషణాలా? చెప్పండి పోయేకాలం అన్నది తిట్టుమాట కాదని అనుకోను. అయినా ఈ విషయం సాగదీయటం బాగుండదు కాబట్టి ముగిద్దాం.
శ్యామలీయం గారు,
తొలగించండి1)నేనెక్కడా నేను రాసింది కవిత అని చెప్పుకోలేదు..కేవలం మీరు రాసిన నాల్గు ముక్కలకు సమాధానం అనుకోండి. అలాగే మీరు రాసింది కవిత ఔనా కాదా అనీ నేను ప్రశ్నించలేదు.
2) కవితలో ఇలాంటి పదాలు వాడలి, ఇలాంటివి వాడొద్దు అని ఎవరైనా సూత్రీకరించారా? "ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళీన సోమరులారా చావండి" అని శ్రీశ్రీ అంటే మీరు అభ్యంతరపెట్టారా?
3) అహంకారం అని వాడడానికి కారణం..మీకిది మొదటిసారి కాదు గనక. తెలంగాణ గూర్చి ఎవరు ఏది రాసినా విషయంపై విభేదించడం చేతకాక భాషను, కవితను వెక్కిరించడం మీకు పరిపాటి కనుక.
4)సభామర్యాదలు ఎదుటివారివైపునుండే ఆశించి మీరుమాత్రం పాటించకపోవడం సరి కాదేమో.
మీరన్నట్టు చర్చకు స్వస్తి.
పొగాలం ఆరున్నూటొక్క కన్‌ఫ్యూజ్డ్ అమరులది
తొలగించండివర్తమాన, రాబోవు కాలాలు తెలుగులది :)))
"దోపిడి యోచన.. పైత్యం.. గద్దలు..పోయే కాలం.." ఎట్సెట్రాలు మంచి పదాలో కాదో కానీ తిట్లు కావు. బూతులు అంతకన్నా కావు.
తొలగించండితెలుగు సాహిత్యంలో బూతులు లేదా దూషణలు సర్వసామాన్యం. గురజాడ, విశ్వనాధ, శ్రీశ్రీ లాంటి మహామహులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తరువాత తరంలో నగ్నమునులు అనే పేరుతొ కొందరు ఎర్ర కవులు బూతునే సాహిత్యంగా మలిచారు. ఆత్రేయ, వేటూరి లాంటి సినీ రచయితల పాటలలో ద్వందార్ధలను ఒక కళాప్రతీకగా (art form) ఎదిగించారు.
గొట్టిముక్కలవారు,
తొలగించండి> నగ్నమునులు అనే పేరుతొ కొందరు ఎర్ర కవులు
అవును ౧౯౭౦ల మొదట్లో వారి కవిత్వాలనేవి వచ్చినట్లు గుర్తు.
కాని నగ్నమునులు అనే పేరుతొ కాదు దిగంబర కవిత్వం పేరుతో అనుకుంటాను.
@శ్యామలీయం:
తొలగించండిఅవునండీ నిజమే. తప్పు సరి చేసినందుకు థాంక్స్. నగ్నముని అనే వ్యక్తి ఈ దిగంబరకవులలో ముఖ్యుడు అన్నట్టు గుర్తు.
ఇగ్గా ... నా నిలువురాత కపితలు ఏస్కొంటున్నా కాస్కోన్రి: :D
రిప్లయితొలగించండిపొగాలం ఆరున్నూటొక్క కన్‌ఫ్యూజ్డ్ అమరులది
వర్తమాన, రాబోవు కాలాలు తెలుగులది
-----
ఎందుకు పోయారో! పోతున్నారో!!
ఎందుకు బ్రతుకుతున్నారో
తెలియని అయోమయం లొల్లికారులది
-----
చిన్న రాష్ట్రాలు అభివృద్ధి అవుతయి అంటే
రెండు/నాలుగు తెలంగాణాలు చేస్తం
హైదరాబాద్ దిగువ, ఎగువ తెలగాన
తూర్పు, పడమర తెలంగాన
-----
:) అదపాదడపా సెంటిమెంటు బలంగా వుంది, సెంటిమెంటల్స్ ఎంత బలంగావున్నారో కాలపరీక్ష చేయాల్సిందే. 10/50/100 ఏళ్ళు గాని, టెస్ట్ చేయాల్సిందే. :P
/(బై)రెడ్డ్లకి, %నాయుళ్ళకి, -గౌడ్లకి, +వెలమలకి రాయలసీమ, కోస్త, లంగాన పంచివ్వాలా!
రిప్లయితొలగించండి+/-%???!!! :)))
తెలంగాణా అని కూడా అనలేని లంగాలకు
రిప్లయితొలగించండితెలుగుజాతి గురించేం తెలుసు?
భాషను అడ్డం పెట్టుకుని దోచేవాళ్ళకు
భ్రాత్రుత్వపు విలువేం తెలుసు?
సమైక్యాంధ్రకి కడ్దోస్తే అడ్డంగా నరుకుతాం అని అరవడం రాదు,పండగలకి వెళ్ళిన తెలంగాణ వారిని ఆంధ్రలోనికి రానివ్వం అని బెదిరించడం రాదు,తెలుగు వైతాళికుల విగ్రహాలని ద్వంసం చేయటం రాదు,తెలంగాణా అధ్యాపకులని కొట్టడం రాదు,తెలంగాణ ఉద్యోగస్తులని మీ తెలంగాణకి వెళ్ళిపొండని బెదిరించటం రాదు,తెలంగాణ వారి బిర్యాని పేడ లాగ ఉంటదని ఎగతాళి చేయడం రాదు,తెలంగాణ బ్రాహ్మణులకి పూజ చేయడమే చేతకాదు అని కించపరచడం రాదు,మాకు బాష రాదు, బూతులు రావు, చివరికి గూగుల్ ఫ్రొఫైల్కి 104294459323128621260 అని మీకు లాగా అందంగా,అర్థవంతంగా పేరు పెట్టుకోవడం కూడా రాదు! ప్చ్... మరి అమాయకులమైన మమ్మల్ని వదిలేసిపోతామంటారేమిటండి మీరు? మరి మీరు స్వార్తపరులుగా మిగిలిపోతారేమో !!?
తొలగించండిచైతన్య గారూ, నేను చెప్పిన ఆధారం దొరికిందా స్కాన్ పంపించమంటారా? స్కాన్ కావాలంటే ఈమెయిల్ ఐడీ తెలపగలరు.
రిప్లయితొలగించండిజైగో గారు, పంపించనవసరం లేదు.వార్తాకథనంలో ఒక మూలాన ఉన్న మీ ఏకవాక్య ఆధారం చూశాను లెండి. అది ఏమన్నదంటే "ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు ఈ కన్వెన్షన్ కు తమ సందేశానిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రమే వాంఛనీయమని ఎస్.ఆర్.సీ సిఫారుసులను ఆమోదించి అమలుపరచాలి" అని వుంది. అది దేనికి అధారమో నాకు తెలియదు కాని మాడపాటి గారు ఎల్లప్పుడూ విశాలాంధ్రవాదాన్నే సమర్ధించిన లోకవిదితమైన నిజాన్ని మాత్రం మీ ఆధారం రూపుమాపలేదు.కావాలంటే ఆయన రచనలు చదవడానికి అందుబాటులోనే ఉంటాయి.
తొలగించండికాస్త ఆ సందేశ పూర్తి పాఠం దొరుకుతుందేమో ప్రయత్నించరాదు?దానికి కన్వెన్షన్ నిర్వాహకులు ఎటువంటి స్పిన్ ఇచ్చారో,మీరు మీరనుకున్న ఆధారానికి ఎటువంటి స్పిన్ ఇస్తున్నారో తేలిపోతుంది. మాడపాటి వారు ఎస్.ఆర్.సీ అభిప్రాయపడినట్లు ఐదు ఏళ్ళ తర్వాత మూడింట రెండు వంతుల ప్రజాప్రతినిధులు ఒప్పుకునే వరకూ విశాలాంధ్ర కోసం వేచి చూడవచ్చు అన్న అభిప్రాయంతో ఉండి వుంటారు.కాకపోతే అదే సంవత్సరం, మీరు పేర్కొన్న వార్త కథనం వెలువడిన కొద్ది రోజులలోనే, హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో విశాలాంధ్ర వాదానికి మొగ్గు చూపిన విషయం మరువ వద్దు.బ్లాగ్ ఆర్కైవస్ లో అన్ని వివరాలు ఉన్నాయి
అమ్మయ్య ముందు కనిపించలేదన్నారు ఇప్పటికి దొరికింది. ఏక వాక్యమో పుంఖానుపుంఖాలో అనే విషయం అప్రస్తుతం. అట్లాగే (మొదటి పేజీలో) మూలను ఉన్నంత వార్తా అబద్దం కాదు కదా?
తొలగించండికీలకమయిన ఆ దశలో విశాలంధ్రకు మద్దతిస్తూ ఆంధ్రపితామహులు చేసిన వ్యాఖ్య/సందేశం/ప్రకటన చూపించగలిగితే సంతోషిస్తాను. అంతేతప్ప "లోకవిదితం" ముసుగులో ఆ తరువాత కాలంలో వారి ప్రకటనలు చూపించి బుకాయించకండి.
కన్వెన్షన్ నిర్వాహకులు మాడపాటి వారి సందేశానికి వికృత భాష్యం చెప్పారనేది కేవలం మీ ఊహ. అసలు తెలంగాణా రాష్ట్ర సాధన కోసమే నిర్వహించిన సదస్సుకు ఆయన సందేశం పంపడమే ఒక విశేషం. పైపెచ్చు తన మాటలకు స్పిన్ లేదా పేసు ఇచ్చారని పసికడితే వారు ఊరుకుంటారా? (కామ్రేడు పెండ్యాల విషయంలో ఇలాంటి అయోమయం జరిగినప్పుడు ఆయన దానికి వివరణ ఇచ్చారనే విషయం తమకు విదితమే అనుకుంటాను)
వారి అభిప్రాయాల గురించి ఆధారాలు లేని ఊహాగానాలు చేయడం కన్నా ఒకానొక (కీలకమయిన) కాలంలో మాడపాటి హనుమంతరావు లాంటి పెద్దలు కూడా తెలంగాణాను సమర్తిన్చారనే వాస్తవాన్నే ఒప్పుకుంటే మీకే హుందాతనం. ఆపై మీ ఇష్టం.
బుకాయించడం వేర్పాటువాదుల హక్కు.దానిని లాక్కోవడం ఎవరి తరమూ కాదు.ఇంతకీ మీ ఆధారం దేనికి అధారమో, మీరు మీ ఆధారంతో ఏమి నిరూపించదలచారో స్పష్టమవలేదు.మాడపాటి హనుమంతరావు పంతులు గారు తన జీవితాంతం విశాలాంధ్రవాదాన్ని బలపరిచారు.ఇది లోకవిదిత నిజం. కాదని మూర్ఖంగా వాదించినా, ఆయన భావాలను వక్రీకరించినా ఒరిగేది ఏమి ఉండదు. మీరు కాస్త ఓపిక పడితే ఇక్కడ పోస్ట్ చేయబడుతున్న దేవులపల్లి రామానుజరావు గారి పుస్తకంలోనే ఎస్సార్సీ నివేదిక వెలువడిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో మాడపాటి హనుమంతరావుగారు అయిదేండ్ల వరకూ తెలంగాణ ప్రత్యేకంగా ఉండుటకు సమ్మతించారన్న ప్రస్తావన వస్తుంది.నేను ఆ భాగాన్ని కొంతసేపటి క్రితమే చదివాను.వక్రంగా కాక సవ్యంగా ఆలోచిస్తే 'ఇంత కాలం వేచిచూశాం..విశాలాంధ్ర ఏర్పాటుకు ఇంకొన్నాళ్ళు ఆగవచ్చు' అన్న అర్థమే ఇందులో స్పురిస్తుంది. ఇంకేదో కాదు. ఆపై మీ స్పిన్ మీరు చేసుకోండి.మీ ఇష్టం.మా కనవసరం
తొలగించండిఅసలు నెహ్రూకి, ఇతర జాతీయ నాయకులకి ప్రాంతీయవాదం తలెత్తుతుందేమోనన్న అనవసర భయాలు లేకపోయి ఉండుంటే ప్రత్యేక తెలంగాణ అనే డిమాండ్ ను ఎవరూ తలెత్తుకునేవారు కాదు. అది కాక వారు విశాలాంధ్ర ఏర్పాటును అన్ని రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ అనే క్లిష్ట సమస్యలో భాగంగానే చూశారు. వీర విభజనవాదులు/అవకాశవాదులు కొంత మంది(పేర్లు గుర్తుచేయనవసరం లేదు)1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేనాటికి కూడా విశాలాంధ్రవాదాన్నే సమర్ధించారు.ఆధారాలు అవసరంలేదనుకుంట
నేను చూపిన ఆధారం వల్ల తేలేది ఏమిటో స్పష్టం కాలేదా? మాడపాటి వారు 1955 నవంబరు నాటికి ఫజల్ అలీ నివేదిక ప్రకారం ప్రత్యెక తెలంగాణా ఏర్పడాలని కోరుకున్నారు. వెంటనే విశాలాంధ్ర ఏర్పడాలని కొందరు చేసిన ప్రయత్నాలను ఆయన సమర్తించలేదు. ఆయన కారణాలు ఏమిటని ఊహాగానం చేయకపోతే మంచిది. ఏది వక్రం ఏది సవ్యం అనే విషయం పక్కన పెడితే నేను మీకు మల్లె విశ్లేషణకు దిగలేదు. నేను చేయని విశ్లేషణ వక్రమని మీరు భావిస్తే మీ ఇష్టం.
తొలగించండిI reported the fact at face value without any interpretation. It is you who have choosen to first deny my source and later attribute motives to him.
I will wait for the explanation from Devulapalli's book. I trust it will provide Madapati's explanation, not Devulapalli's interpretation.
జైగో, మాడపాటి వారు ఒక ప్రభుత్వ నివేదికని అమలు పరచాలనే అభిప్రాయం మాత్రమే వ్యక్తపరిచారు. ఎక్కడా తనకు తానుగా తెలంగాణ వాదాన్ని తలకెత్తుకోవటం కాని తెలంగాణ ఉద్యమానికి (1955 సమయంలో గాని, 1969 లొ కాని) మద్దతు తెలపటంగాని చెయ్యలేదు. అందుకు భిన్నంగా వ్యక్తిగత స్థాయిలో విశాలంధ్ర వాదాన్ని అనేక సమయాల్లో బలపరిచారు.
తొలగించండిI skeptical about claim of message from Sri Madapati. Read this 'వార్తా ఖండన' from Golconda Patrika. It tells what kind of false propaganda తెలంగాణ వాదులు resorted to in those days.
తొలగించండి'వార్తా ఖండన' - 11-11-1955 Golconda Patrika
@satya: I am only reporting the message as a fact without any comment or interpretation.
తొలగించండి@PPR: తన సందేశాన్ని వక్రీకరించి ఉంటె, మాడపాటి వారు తన "వార్తా ఖండన" అధికారం ఎందుకు ఉపయోగించలేదు? అసలు ఆయనకు తెలంగాణా కన్వెన్షన్ నిర్వాహకులకు సందేశం పంపాల్సిన అవసరమే లేదు కదా?
JaiGo,
తొలగించండిI guessed your counter-question even before I clicked submit. I said 'skeptical' only. I did not assert it was wrong or bogus.
Your queries are usually very tricky. I am doubting if Sri Madapati really sent any message to the convention. So I gave link to another instance where T-vaadis published something without knowledge of the person.
But you are asserting the message was actually sent by Sri. Madapati.
Anyways, I really take back my doubts. Primarily because I do not want to be obsessed with suspecting everything like T-vaadis.
PPR, I for one take news reports of those days at face value. There was no "paid news" or "slanted coverage" then unlike today. The politicians of those days were also much more straight forward who did not try to take the "I was misquoted" route when caught on the wrong foot.
తొలగించండిI have seen several instances in Golkonda Patrika as well as others where the newspaper either retracted their earlier report after obtaining clarification or published the leader's clarification prominently. Apart from the case you highlight, there is also the Pendyala episode involving the communist MP. (as I said earlier "కామ్రేడు పెండ్యాల విషయంలో ఇలాంటి అయోమయం జరిగినప్పుడు ఆయన దానికి వివరణ ఇచ్చారనే విషయం తమకు విదితమే అనుకుంటాను").
All I am saying is that there is no need to be skeptical. Both Madapati & Narottam Reddy were men of honor unlike today's netas. GP would not have dared to misreport a statement issued by someone of Madapati's stature. Even if they did, he would have issued a denial.
Having said this, this applies to what was reported and does not extend beyond this. For instance GP reported KV Ranga Reddy saying 90% of people support Telangana. I believe this (GP report on KVR's statement) as correct but don't believe KVR was right.
JaiGo,
తొలగించండిI have already withdrawn my comments and explained the reason too.
I would like you realize one simple matter. There was lot of confusion around demand for Vishalandhra and separate Telangana in Telangana region itself. IMO, the role of Seemaamndhra leaders was external only compared to conflict inside Telangana. As per some of the news items, it appears they lost hopes for VA (again IMO).
People like late Prof. Jayashankar used this to build a victimhood and then justify with out of context statements like "now or never". Worst of these is Nehru's 'divorce' statement. Read Nehru's statement w.r.t merger in Parliament. If those news items were right, there is no scope for 'divorce' statement at all.
I believe here the effort of VMS is present first hand account of a VA proponent from Telengana region. Naturally to counter 'forced merger' propaganda.
The biggest problem for Telangana movement is views and opinions. The accusations were emotional in nature. On top of it they were backed by opinions and views rather than verifiable (by third party) facts.
JaiGo,
తొలగించండిBTW, stop nit-picking. You are either early or out-of-context. Sometimes both.
PPR, JaiGo is giving sanctity to the leaders and also the news papers. Reasons are well known as he wants to attribute whatever reported in GP that time is actual reflection of people's pulse and has nothing to do with its editors political inclinations.
తొలగించండిSo this implies that all the accusations of 'T leaders were sold for power/money and dumped the aspirations of ppl' will prove utterly wrong and may be KVRR or MCR or many T proponents might have genuinely believed in Visalandhra after their many interactions with their leaders at center and their counterparts in andhra region.
Also seems people welcomed the decision of VA as GP does hardly reported any instances of reprehension by them.
satya, my comments on the nationalistic (Cong/Socialist/Swatantra/Jansangh etc.) leaders & press of that day applies to all regions. Remember this was the freedom fighter generation. IMO the first "sale" on this issue happened only much later (when MCR betrayed Telangana).
తొలగించండిYes, I do believe GP's editorial stance did not impact their reporting. Similarly Andhra Patrika's pro-Congress stance did not stop them from giving adequate coverage to other parties including the reds.
BTW PAAP archives of GP are few & far between after 1955.
So as far as I remember, none of the nationalistic leaders supported the idea of telangana. Nehru opposed visalandhra in the favor of hyderabad state. But when fazal ali report suggested a separate T state for 5 yrs, he did not supported it.
తొలగించండి"Some honourable members here may well remember that I delivered some speeches in Hyderabad opposing the disintegration of the State of Hyderabad. That was my view. I would still like the State of Hydera-bad not to be disintegrated, but circumstances have been too strong
for me. I accept them. I cannot force the people of Hyderabad or others to fall in line with my thinking. I accept their decision and I adjust myself to the position that Hyderabad will be disintegrated. The Commission has suggested that if Hyderabad was going to be disintegrated, the Telangana area should remain separate for five years and then decide whether it should merge with the other areas of Andhra. We have no particular objection to that, but logically speaking, it seems to me unwise to allow this matter to be left to argument. Let it be taken up now and let us be done with it."
>>> BTW PAAP archives of GP are few & far between after 1955.
తొలగించండిJaiGo,
it is really bad that GP archives from Dec 1955 to March 1956 are missing. We are missing T-side story of how Moulana Azad stalled VA decision.
Anyways, there is no news in GP archives about protests or disagreement over Nizamabad announcement. Nor further demand for separate T.
I feel the demand for separate T was very short-lived between 1954 and 1956.
1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణాలో అందరూ హర్షించారు. పైగా మద్రాసు పోతే పోయింది బాధ పడకండి, మన తెలుగువారికి హైదరాబాదు వుంది, దాన్ని వెంటనే ఆంధ్రకు రాజధాని చేయొచ్చు, ఇవ్వాళో రేపో ఆంధ్ర తెలంగాణా కలిసిపోయేదే గదా అన్నట్లే మాట్లాడారు. ఈ మేరకు పైన ప్రస్తావించబడ్డ హరిశ్చంద్ర హెడాయే ఒక ప్రకటన చేసాడు, దాన్ని శ్రీకృష్ణ కమిటీవారు తమ నివేదికలో ఉల్లేఖించారుకూడ.GN రాసినట్లు కాళోజీ అప్పట్లో వీరతెలంగాణావాదే. కాని విశాలాంధ్ర వద్దనే ఇప్పటి వాదనల సారమంతా అప్పుడూ వచ్చింది. అది 1955 తర్వాతే - నెహ్రూ ఆంధ్ర వ్యతిరేక దృక్పథంవల్లే. నెహ్రూ వైఖరి వల్లే పొట్టి శ్రీరాములు చనిపోయాడు. లేకుంటే మద్రాసు సంగతి పక్కకు పెట్టి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం అతిత్వరలో చేస్తామని ఒక్క ప్రకటన నెహ్రూ చేసినా పొట్టి శ్రీరాములు తన దీక్ష విరమించి వుండేవాడని అభి్జ్ఞులు అంటారు. నెహ్రూ పెడసరి వైఖరి వల్లే, దానికి ఆజాద్ ముస్లిం ప్రీతి తోడుకావడంతో, ఫజల్ ఆలీ కమిషన్ పెడసరి వైఖరి వచ్చింది. ఆ కమిషన్ ఏర్పడినప్పటినుండే అప్పట్లో ప్రత్యేక తెలంగాణా నినాదానికి ఊపు వచ్చింది. ఇక ఆ కమిషన్ అవార్డు తర్వాత ఇక చెప్పనక్కరే లేదు. మొన్న చిదంబరం 9 డిసెంబర్ ప్రకటన ఇప్పటి వేర్పాటువాదులకు ఎంత బ్రహ్మాండమైన ఊపు నిచ్చిందో, దాదాపు అంత ఊపూ ఫజల్ ఆలీ కమిషన్ అవార్డు కూడ యిచ్చింది. కాని కమ్యూనిస్టు పార్టీ సాంతంగా, ఇంకా కాంగ్రేసులో బలమైన నాయకులు ప్రాంతీయోన్మాదానికి లొంగకుండా గట్టిగా నిలవడంతో చివరికి నెహ్రూకూడ దిగివచ్చి విశాలాంధ్రకు ఒప్పుకోక తప్ప లేదు. నెహ్రూ నిజామాబాదు ప్రకటన (5 మార్చి 1956) తర్వాత ఎవరో అరాకొరా తప్పితే అప్పటిదాకా ప్రత్యేక తెలంగాణా అని ఊరేగిన నేతలంతా కిమ్మన లేదు; చాల మంది, కె.వి. రంగారెడ్డి తో సహా, విశాలాంధ్రకు జేజేలు పలకడం ప్రారంభించారు. ఆనక 1956 నవంబరు నుండి 1969 దాకా ప్రత్యేక తెలంగాణా డిమాండు చేసినవాళ్లే ఎవరూ లేరు అని గ్రహించాలి.
రిప్లయితొలగించండిపోతే కాళోజీ చాల సెంటిమెంటల్ మనిషి; ఆవేశపరుడు; మాటల్లో మాటల్లో బుడిబుడీమని ఏడ్చేసే తత్వం [అది తప్పుగా నేను అనడం లేదు; కేవలం ఆయన సెంటిమెంటలిజం తీవ్రతను చెబుతున్నానంతే]. కనుక తప్పంతా ఆంధ్ర నాయకులదే నని చెప్పుడు మాటలు నమ్మేసాడు; కాని కె.వి. రంగారెడ్డి, చెన్నారెడ్డిలు ముఖ్యమైన విలన్‌లని, వాళ్లే గనుక నీలం సంజీవరెడ్డి గొడుగు పట్టకుంటే, పరిస్థితి మరో విధంగా వుండేదని గ్రహించలేక పోయాడు. అంతేగాక పెద్దమనుషుల ఒప్పందం అతిక్రమణలు ఆంధ్ర నాయకుల వల్లే కాక తెలంగాణా నాయకుల వల్ల కూడ జరిగాయని గ్రహించలేక పోయాడు. కనుక అంతకుముందు విశాలాంధ్ర ఏర్పాటును ఎంతగా హర్షించాడో, తర్వాత అంతగా గుడ్డి వ్యతిరేకత (blind prejudice) ఏర్పాటు చేసుకున్నాడు. అసలుకు కాళోజీ మరాటీ సంతతి అని, ఆయన అన్న [రామోజీ నో ఏమో పేరు గుర్తు లేదు] మంచి ఉర్దూ రచయిత, కాళోజీలా అటు ఇటూ తీవ్రంగా మొగ్గే సెంటిమెంటలిజం లేని వ్యక్తి అని తెలియాలి. They are naturalized Telugus of Marathi descent.
అలాగే మాడపాటి హనుమంత రావు గారుకూడ ఫజల్ ఆలీ నివేదిక తర్వాత పోనీ ఐదేళ్లు వేచిచూద్దాం; ఐదేళ్లలో నీరుగారిపోయేంత బలహీనమైంది కాదుగదా విశాలాంధ్రోద్యమం అన్న తత్వంతో వున్న మాట నిజమే. దీనికంతా నెహ్రూయొక్క negative వైఖరి, ఫజల్ ఆలీ కమిషన్ పుడకలు పెట్టే నివేదిక [విశాలాంధ్రవాదులు ఫుజూల్ ఆలీ కమిషన్ అని ఎగతాళి చేసేవాళ్లు] ముఖ్య కారణం. ఏమైతేనేం గండం గడిచి విశాలాంధ్ర ఏర్పడింది - కాని అడుగడుగునా మళ్లీ ప్రాణగండాలే, ఈ ప్రాంతీయోన్మాదానికి ఫాసిజానికీ పెద్ద తేడాలేదు. తెలుగువాళ్లలో తగినంత ఐక్యత లేదనడానికి ఇది నిదర్శనమే. కాని భారతీయుల్లో తగినంత ఐక్యత లేనంత మాత్రాన మన దేశం ముక్కచెక్కలవాలనడం ఎంత తప్పో, వున్న సమైక్య రాష్ట్రం ముక్కచెక్కలు కావాలనడమూ అంత తప్పే అని గుర్తెరగాలి.
శర్మ గారూ, కాళోజీ గారు తన సెంటిమెంటల్ ప్రవ్రుత్తి/ఆవేశం వల్లే ముందు విశాలాంధ్రను సమర్తించారని కూడా అనుకోవచ్చు కదా. లేదా పదునాలుగు ఏళ్లలో ఆయన మనస్తత్వం మారిందా?
తొలగించండి"నాకు భాష రాదన్నోడు నా యాసను ఎక్కిరించినోడు సిగ్గు లేకుండా కలిసి ఉందామంటున్నాడు" లోని ఆవేశమే "అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా?" లో కూడా కనిపించదా?
కనిపించకేం తెలంగాణా 'సంస్కృతి' తెలుస్తానే వుంది. చచ్చినాడుగా సచ్చినోడు.
తొలగించండిసారీ, 4-5 లైనులలో 'కాళోజీ అప్పట్లో వీర విశాలాంధ్రవాదే' అని చదువుకోగలరని మనవి.
రిప్లయితొలగించండి"అలాగే మాడపాటి హనుమంత రావు గారుకూడ ఫజల్ ఆలీ నివేదిక తర్వాత పోనీ ఐదేళ్లు వేచిచూద్దాం; ఐదేళ్లలో నీరుగారిపోయేంత బలహీనమైంది కాదుగదా విశాలాంధ్రోద్యమం అన్న తత్వంతో వున్న మాట నిజమే."
రిప్లయితొలగించండి.
మీ విలువైన వ్యాఖ్యకు ధన్యవాదాలు
1042944593231286212606 సెప్టెంబర్ 2012 1:01 ఉ
రిప్లయితొలగించండిఇలా చులకనగా, తిట్టుపదాలతో మాట్లాడడం సరికాదు; అది మనోభావాల్ని గాయపరుస్తుంది - ఆంధ్రవాళ్లు చేసినా, తెలంగాణా వాళ్లు చేసినా అది తప్పే.
అయితే ఒకటి మాత్రం కరెక్టు - ఇప్పుడు ప్రత్యేక తెలంగాణాను సమర్థించేవాళ్లందరినీ ఒకే ప్రశ్న అడగండి - ' తెలంగాణా ' అంటే అర్థం ఏమిటి' అని. అది చాలు వాళ్లలో సరియైన ఆలోచన రేకెత్తించడానికి.
పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనలు ఏమిటి అంటే నాకు తెలిసినంతవరకూ తెలంగాణా వేర్పాటువాదులు చూపించేవి రెండే ఉదాహరణలు. 1. ఉపముఖ్యమంత్ర పదవి 1956 లో యివ్వకపోవడం. కాని దానికి chief villain నీలం సంజీవరెడ్డి - ఆ మహానుభావుడు 31 అక్టోబరు 1956 దాకా ఆంధ్ర రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా చక్రం తిప్పి, పెద్దమనిషి బెజవాడ గోపాలరెడ్డి గారిని ముప్పుతిప్పలూ పెట్టినవాడు. కాని 1 నవంబరు వచ్చేసరికి పెద్దమనుషుల ఒప్పందం షరతును లెక్క చేయలేదుగదా, ' ఆ, ఆరవ వేలుకు విలువ ఏముంది?' అని ఎద్దేవా చేసిన ఘనుడు. మరి అంతదాకా తానూ ఆంధ్రలో ఆరవవేలుగా పనిచేసిన నిర్భాగ్యుడేనా అన్న ఇంగితజ్ఞానం లేని వ్యక్తి; మరెవరూ ఆయన్ను అలా నిలదీసి అడిగినట్లు లేదుకూడ. పోతే ఆయన్ను పూర్తిగా వెనకేసుకొచ్చింది ఎవరనుకున్నారు? కె.వి. రంగారెడ్డే. సంజీవరెడ్డి ముందు అన్నాడో, లేక ఈయనే ముందు అన్నాడో తెలియదు గాని పాత్రికేయులు గుచ్చి గుచ్చి అడిగితే ' ఆ ఆరవ వేలుకు విలువేముంది?' అని కె.వి. రంగారెడ్డికూడ కొట్టిపారేసాడు. ఆనక దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన్ను ఉపముఖ్యమంత్ర చేసాడు (1959-60)కాని ఈ మహానుభావుడు మాత్రం సంజీవరెడ్డి పాలనలో యిచ్చిన ప్రాముఖ్యం తనకు సంజీవయ్య యివ్వలేదని వాపోయాడు!
రిప్లయితొలగించండి2. తెలంగాణా అదనపు నిధుల మళ్లింపు (Telangana surpluses diversion) గురించి. నిజమే అది జరిగిన మాటా వాస్తవమే. కాని అప్పటికే కె.వి. రంగారెడ్డి, చెన్నారెడ్డి గార్లు మంత్రివర్గంలో చాల కీలకస్థానాల్లో వున్నా, ఎప్పుడూ వాపోలేదు. తర్వాత తర్వాత (ముఖ్యంగా 1969 నుండీ) రాద్ధాంతమైతే, భార్గవ కమిటీ అని కూడ ఒకటి వేసి తెలంగాణాకు వడ్డీ తో సహా కొన్ని నిధులు కేటాయించడంద్వారా ఆ సమస్యనూ పరిష్కరించడం జరిగింది. కాని మన వీరతెలంగాణావాదులు మాత్రం నేటికీ దాన్నే కుత్తుతూవుంటారు.
పోతే, తెలుగు ప్రజల ఐక్యత దృష్ట్యా, ముల్కీ నిబంధనలు త్వరలో రద్దు చేయాలని, అలాగే రాజధానీ నగరాన్ని స్వతంత్ర మండలం గా వుంచాలనే షరతుల్ని తెలంగాణా నాయకులు ఉల్లంఘించడమే గాక, ఏదో తమకు మహా అన్యాయం జరిగిపోయినట్లు కల్లబొల్లి ఏడ్పులతో ఎంత రాద్ధాంతం చేసారో, ఇంకా చేస్తున్నారో మనం గమనిస్తూనే వున్నాము. ఇవి పెద్ద మనుషుల ఒప్పందానికి, ఆ తర్వాత వచ్చిన 6 సూత్రాల ప్రణాళికకు తెలంగాణా నాయకులు పొడిచిన తూట్లు. కాని ' తప్పులెన్ను వారు...' అనే వరుస వాళ్లది - ఏం చేద్దాం?
కాళోజీ కవిత ప్రసక్తి వచ్చిందికాబట్టి ఆయన విశాలాంధ్రవాదిగా వున్నప్పుడు, సమైక్యరాష్ట్ర ఏర్పాటును హర్షిస్తున్నప్పుడు రాసిన రెండు కవితల excerpts యిస్తున్నాను చూడండి:
రిప్లయితొలగించండి1. తెనుగునాడు మనది ఐననాడు
ఆ నాడూ ఈ నాడూ ఏ నాడును లోటు లేదు
వ్యక్తి వ్యక్తి స్నేహానికి మనిషి మనిషి శ్రేయానికి
సర్వజనుల సౌఖ్యానికి భారత సౌభాగ్యానికి
ఆ ఈ నాడుల మధ్య లంకె కుదిరి మెలగునాడు
ఆంధ్రుని అభ్యుదయానికి ఏనాడును లోటు లేదు
………………………….…
ఆంధ్రాభ్యుదయమ్ము అందరిమేలును గన్ననాడు మనది తెనుగునాడు
దేశమంటే మట్టికాదు మనుషులు అన్న మొదటినాడు మన తెనుగునాడు
మనిషి మనిషిగ బ్రతుకవీలు సౌకర్యము ఉన్ననాడు మన తెనుగునాడు
కొదువ పూజ్యమ్ము, గొడవకు తావులేదు,
ముదము మురిపము పబ్బాల సంబరమ్ము
అన్నపూర్ణమ్మ మన ఆంధ్ర పూర్ణకుంభ, సుజల సుఫల సస్యశ్యామలాంబ.
లోటేమున్నది ఆంధ్రుని అభ్యుదయానికి
భారతి సౌభాగ్యానికి లోటేమున్నది? …………………
తెనుగునాడు మనది ఐననాడు ' జైహింద్', వందే మాతరం.
2. ఆంధ్రుడా!
ఏ భాషరా నీది యేమి వేషమురా?
ఈ భాష ఈ వేష మెవరి కోసమురా?
ఆంగ్లమందున మాటలాడ గలుగగనే
ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?
…………………………….
ఉర్దు మాటలాడి యుబ్బిబ్బిపడుటకు
కారణంబేమిటో కాస్త చెప్పుమురా? ……………
తెలుగు బిడ్డడవయ్యు తెల్గు రాదంచును
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా?
దేశభాషలందు తెలుగు లెస్సయటంచు
తెలుగుబిడ్డా! యెపుడు తెలుసుకొందువురా?
తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడెయెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా? // ఏ భాషరా//
గుర్తొచ్చింది - మన కాళోజీ పేరు కాళోజీ నారాయణ రావు. అప్పట్లో ప్రసిద్ధిచెందిన నారాయణ త్రయం [కాళోజీ, కోదాటి, కొమరగిరి నారాయణరావు మిత్రత్రయం'] లో ఒకనిగా తెలుగుప్రజల ఐక్యతకు, విశాలాంధ్ర నిర్మాణానికి అశేషకృషి సల్పిన వ్యక్తి. ఈయన గృహస్తుడు. కొడుకు రవి ఇప్పుడు వరంగల్లులోనే వున్నాడు.
రిప్లయితొలగించండిఆయన అన్న కాళోజీ రామేశ్వరరావు - కాళోజీకి అన్న అంటే ఎంత గౌరవమో, ప్రేమో! రామేశ్వరరావుగారు ఒంటరి మనిషి - అసలు పెళ్లే చేసుకోలేదో, లేక widower యో ఖచ్చితంగా చెప్పలేను. సమర్థవంతుడైన ఉర్దూ రచయిత.
I.M. Sharma గారి వివరణ చాలా బాగుంది. ఆంధ్రోద్యమం నడుస్తున్న రోజులలో వీర విశాలాంద్రోద్యమం ఎలా ఉండేదో ఇప్పుడు వీర తెలనగాణా వాదం కూడా అలా వెఱ్ఱి తలలు వేయడం మొదలైంది. దానికి ఉదాహరణ ఈ మధ్యనే కొంతమంది యువకులు వేరే ప్రాంత నాయకుల మీద దాడి చేయడానికి చేసిన ప్రయత్నం. అది మన రక్షణ వ్యవస్థ సమర్దవంతం గా ఎదుర్కొంది. కానీ అన్నిసార్లు అలా పట్టుకోగలరు భావిన్చాదమూ తప్పే. ఒక్క కాళోజీ యే ఎందుకు. ఇప్పటికీ జీవించి ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ ని కూడా అదే కోవలోకి చేర్చవచ్చు. తాను మంత్రిగా ఉంది అన్ని రకాల పదవులూ అనుభవించినప్పుడు పక్కా సమైక్యవాదిగా ఉన్న పెద్దమనిషి ఎప్పుడైతే నలుగురు నాయకులు తన వద్దకి వచ్చి తెలంగాణా గురించి అడిగితె జై తెలంగాణా అంటే అంతటి తొంభయి సంవత్సరాల వృద్ధుడి ని ఏమనగలం? అవకాశవాది అని తప్ప. చాలామంది వ్రుద్ధనాయకులు కూడా తమ కన్నా చిన్న వారైనా స్వార్థపర, నిరుద్యోగ నాయకులు తమ స్వలాభం కోసం ప్రత్యెక తెలంగాణా విషయాన్ని నేట్టికేట్టుకొంటే వారిని వారించడం మాని తామూ అదే పాట పాడడం అంటే జీర్ణించుకోవడం కష్టమే. అంత సమస్యలు ఉన్నప్పుడు ఈ వృద్ధ నాయకులు తమవంతు కృషిగా ఎందుకు ఆందోళన అప్పుడే చేబట్ట లేదు. అప్పుడు కనుక చేసి ఉంటె ఈ రోజు ఈ తలనొప్పి ప్రస్తుత అవినీతి నాయకులు మన తల పైన పెట్టె ఆస్కారం ఉండేది కాదు కదా.
రిప్లయితొలగించండినాదొక ధర్మ సందెహం? పిదమర్తి రవి గారు, రాజరం గారు మొదలైనవారిని నేను గత 3 -4 సంవత్సరాలనించి ప్రతి పండగకి ముందు టి వి లొ దర్శనం చేసుకుంటున్నాను. ప్రతి తెలుగు వారి పండక్కి ముందు వారు హెచ్చరిస్తారు వూరు వెల్తె మల్లి రానివ్వనని. అయ్యా ఒస్మానియా యూనివెర్సిటీలో (ప్రొఫెస్సుర్ కొడండ రెడ్డ్య్ గారి నాయకత్వములొ) పొస్టు గ్రాద్యూషున్ రెందు సంవత్సరాలా లేక ఈ ఒక్క యూనివెర్సిటీలో ఎమైన ప్రత్యేకమైన నిభందన వుందా. ఏన్ని సంవత్సరాలైనా ఆడుతు, పాడుతు చదవచ్చన్ని ఇక్కడనె, పెల్లి చెసుకొని పిల్లలని చదివిస్తు కాలక్షెపం చెయ్యవచ్చని? వారు స్వాతంత్ర సమరయొధులు కూడాను (దొమ్మి కెసుల్లొ చాల నెలలు జైల్లొ వున్నారు కద)అతి త్వరలొ వారిని శాసన సభ సభ్యులుగా గా చూడలిని హరీష్ రావు గారితొ పాటు బల్లలు ఎక్కి బూతులు తిట్టాలని మనస్పూర్తిగ కొరుకుంటున్నాను.
తొలగించండి:)
తొలగించండిఉస్మానియా విద్యార్ధులను కొంతమంది సీమాంధ్ర నాయకులు 'తాలిబాన్ల' తో పోల్చారని మన ఉద్యమకారులు తెగ ఆక్రోస పడిపోతారు. వారి సంస్కారాన్ని ప్రశ్నిస్తారు కూడా.
రిప్లయితొలగించండియాభై సంవత్సరాల క్రితం విశాలాంధ్ర వాదులు తీవ్రవాదులు అన్న గోలకొండ పత్రిక వారి సంస్కారం ఎంత గొప్పదో వర్రికే తెలియాలి.
http://www.pressacademyarchives.ap.nic.in/Archive/STATE_CENTRAL_LIBRARY_AFZALGUNJ/GOLCONDAPATRIKA/100556_GOLCONDAPATRIKA_22_11_1955_Volume_No_8_Issue_No_281/00000001.pdf
రాయలసీమకు చెందిన కొందరు "విశాలాంధ్ర తీవ్రవాదులను" ప్రశ్నిస్తూ రాసిన కరపత్రమండీ అది. నాలుగో పేజీలో "రాయలసీమ గతి ఏమిటి" అని కూడా ప్రశ్నించారు. ఆంద్ర రాయలసీమ లోల్లిలో తెలంగాణాను ఎందుకు గుంజుతారు సార్?
తొలగించండితెలివిగా వాదిస్తున్నాని తమరి అపోహ. కోడిగుడ్డుకు ఈకలు పీకడానికి ముందు గుడ్డు అవసరం. మీరు గాల్లోనే అన్నీ పీకేస్తారు.
తొలగించండి'తీవ్ర వాదులు' అని కరపత్రంలో ఎక్కడా లేదు. గోలకొండ వారి సృష్టి మాత్రమె.
మాడపాటి వారి విషయంలో పొరపాటు చేసాం కాబట్టి మాకు చదవడమే రాదు అని మీకు ఒక చిల్లర అభిప్రాయము.
పైగా ఇది ఆంద్ర రాయలసీమ లొల్లి అంటున్నారు. సీమవారు ప్రస్నిస్తున్నది ఆంధ్ర ప్రాంతం వారిని కాదు. విశాలాంధ్ర వాదులను. శర్మ గారి పోస్టులు చదవండి. అప్పుడు తెలంగాణలో కూడా వీర విశాలాంధ్ర వాదులు ఉన్నారు.
వారు, ప్రత్యెక వాదులు తన్నుకున్న వైనం ఇదిగో.
గోలకొండ పత్రిక 26-11-1955
రజాకార్లు దాడి చేసిన సమయంలో పంజాబు వారు చేసినంత సాయంకూడా ఆంధ్ర దేశం వారు చేయలేదని పైగా తలదాచుకోవడానికి వెళ్ళిన వారిని దోచుకున్నారని ఒక మహానుభావుడి ఆవేదన.
రిప్లయితొలగించండిఇక్కడ చదవండి.
రిప్లయితొలగించండిఈ ఉద్యమంలో 'సీమాంధ్ర చానళ్ళు' అని ముద్ర వేసి దుమ్మెత్తి పోస్తున్నారు. అప్పటి పత్రికల మీదకూడా ఇదే తరహా దుష్ప్రచారం.
గోలకొండ పత్రిక 7-11-1955
నిజానికి 1955 సమయంలో గోలకొండ పత్రికే ఆనాటి ప్రత్యేక తెలంగాణ వాదుల కొమ్ముకాసి, విశాలాంధ్ర వాదులపై దుష్ప్రచారం చేసింది. కారణం ఆ పత్రిక సంపాదకుడు ఎన్.నరోత్తమ రెడ్డి, కె.వి. రంగారెడ్డి వర్గం లోని వాడు, ఇంకా హైదరాబాద్ సిటి కాంగ్రెస్ సభ్యుడుగానో, అధ్యక్షుడిగానో ఉన్నాడు. నెహ్రూ నిజామాబాద్ లో విశాలంధ్ర ప్రకటన తర్వాత ఈ పత్రిక కూడా తన వైఖరి మార్చుకుంది. కాబట్టి 1955 సమయం లో ఆ పత్రిక లో వచ్చిన వార్తలు అంత పూర్తిగా విశ్వసించదగినవి కావు. ఆ సమయంలోని ఆంగ్ల పత్రికలనో, ఉర్దూ పత్రికలతోనో cross check చేసుకోవటం మంచిది. దురదృష్టవశాత్తు అప్పుడు తెలంగాణ లో అది ఒక్కటే తెలుగు పత్రిక.
తొలగించండిసత్య,
తొలగించండిసరిగా చెప్పారు.
1955 అక్టోబరు, నవంబరు మాసాలలో వచ్చిన గోల్కొండ పత్రిక, ఆంద్ర పత్రిక, ఆంద్ర ప్రభ చదివితే చాల చక్కగా అర్ధమవుతుంది.
ఆంద్ర పత్రిక లో విశాలాంధ్ర తో పాటు ప్రత్యేక తెలంగాణ వాదుల వార్తలు కూడా వేసారు.
గోల్కొండ పత్రికలో అసలు తెలంగాణలో విశాలాంధ్ర వాదమే లేనట్టు మొత్తం తెలంగాణ ఉద్యమ వార్తలే వేసేవారు.
అటువంటి చాలా వార్తల కింద (స్వ. వి.) అని ఉండేది. బహుసా స్వతంత్ర విలేఖరి అయ్యుండవచ్చు.
మిత్రులారా ఒక వ్యక్తిపై నిందలు వేసి ఆయనే అన్ని సమస్యలకు మూలకారణం అనే మనస్తత్వం సరి కాదు. గోలుకొండ పత్రికలో విశాలంధ్రకు అనుకూల వార్తలు రాలేదన్నది కేవలం అపోహ. లింకులు కావాలంటే చెప్పండి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఇంతపాటి ఆలోచన మన సమస్యలన్నిటికి ఉమ్మడి రాష్ట్రమే కారణం అని చెప్పినప్పుడు కూడా చూపిస్తే బాగుండేది.
తొలగించండిఎవరో అన్న దానికి నన్ను అడిగితె నేను చెప్పలేను. తెలంగాణా సమస్యలు తీరాలంటే రాష్ట్ర ఏర్పాటు అవసరం అనేది నా అభిమతం. సమస్యలన్నిటికీ కారణం విశాలాంధ్ర అని కానీ, తెలంగాణా ఏర్పడితే అన్ని సమస్యలు మాయమవుతాయని కానీ నాకు అపోహలు లేవు.
తొలగించండిOn the present subject I believe most of those who supported or opposed Vishalandhra in 1955-1973 period did so on conviction. The fact that one disagrees with someone's stand should not lead us to brand him as opportunist or worse.
ఈ జైగోగారి లొల్లికి అర్థం లేదు.
రిప్లయితొలగించండిఅక్కడికేదో, మాడపాటి గారి 50ఏళ్ళ క్రితం అభిప్రాయాలకు అనుగుణగా వీరు నడుచుకుంటున్నట్టు. మాడపాటి కాదు కదా, మర్రి, కాళోజి, దాశరథి కట్టకట్టుకుని వచ్చి కాదన్నా వసూళ్ళు ఆగవు, మిలీనియం మార్చి ఆగదు, రాజకీయ ఏడుపులు, లొల్లి ఆగవు. దీన్ని ఆపే శక్తి రైల్వే నాన్-బెయిలబుల్ చట్టాలకు మాత్రమే వుంది. పోయినసారి చూడండి, ఒకేరోజులో ఏక్ దమ్ అన్నీ బంద్ అయిపోయినాయి. కేసులెత్తేయండో అని ఏడ్చిన్రు, విజ్ఞాపనలు చబితకు ఇచ్చిన్రు గాని, తెలంగాన ఇస్తారా అని ఒక్కడైనా అడిగారా?! మళ్ళీ మిలీనియం కామెడీ షురూ... 'జరగాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ' టైపులో.
వీళ్ళకు చరిత్రలు అనవసరం, వర్తమానంలో జరిగే వసూళ్ళు, డ్రామాలు చూడున్రి, ఖుషీ చేయుని. మస్తు మజా..
పెట్టుబడి లేని వ్యాపారం,బట్టలేసుకుని తిరిగే గొర్రెలకు నాయకత్వం వహిస్తూ,ఫాంహౌస్లో మస్తు మజా,మస్తు మజా!ఇక్కడ బోర్ కొడితే డిల్లీకి వెళ్లి మస్తు మజా మస్తు మజా!! ఏమైనా ముక్కు రాజా అదృష్టమే అదృష్టం! ఒక్క విషపు నాలికతో కాడిలాక్ కార్లు,బంజారా హిల్సులో విశాలమైన బంగ్లా,షిప్ యార్డుల్లో వాటాలు,ఫాం హౌజ్, కొడుక్కి,అల్లుడికి ఎంఎల్ఎ హోదా, తనకు లోకసభ సభ్యత్వం,ఒక విషపు పత్రిక,తిక్క న్యూస్ చానెల్,కాంట్రాక్టులు!ఒక్క తట్ట మన్ను మోస్తే వచ్చే లక్షల్లో కూలి...అబ్బో ఇంత సాధించిన 'కచరా'దొరవారిని చూసి అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఎవడ్రా తె'లంగా'ణ వాళ్ళు వెనకబడ్డారు,అని అరిచేది???
తొలగించండితెలంగాణ వాది ఐన ప్రతి సాహితీవేత్త సురవరం వారి 'గోలకొండ కవుల సంచిక' ప్రస్తావించి, తెలంగాణ కవులకు జరిగిన అవమానానికి రగిలి పోతూ ఉంటారు కన్నీరు కార్చేస్తూ ఉంటారు.
రిప్లయితొలగించండిఇది 'గోలకొండ కవుల సంచిక' పేజీ 14 .
ఇందులో సురవరం వారు రాసిన "అయిననీయభిప్రాయములు ఇచ్చటి పరిస్థితులు దెలియకను, తెలిసికొనుట కవకాసములేమియు వెల్లడింపబడినవేగాని ద్వేషబుద్ధిచే గాదనుట నిశ్చయము" మాత్రము ఎవరికీ కనపడదు.
Sri Suravaram did great job. He published a 460 pages book with great literary talent of Nizamaandhra. Read the initial sections on how he managed raised funds for publishing this book. This happened nearly 80 years ago.
Today what our 'sons of soil' doing? Earning dollars, setting up websites, conducting dhoom dham across the world etc etc etc. They still refer to 'గోలకొండ కవుల సంచిక' and cry discrimination
. How many of these have really put an efforts like Sri Suravaram? There might be hundred sites dedicated to Telanagana cause. Not even single of them has small collection of stories/songs/novels from Telangana. All that they know is to say "మమ్మల్ని గుర్తించలేదు". Had Sri Suravarm also did the same "crib and sit" we would not be seeing this 460 pages treasure.