11, ఏప్రిల్ 2012, బుధవారం

వన విహారమూ నేరమేనా?!

ఆంధ్రప్రభ వ్యాసం : ఎంత అన్యాయం! మాట్లాడితే విమర్శలు! మౌనం వహిస్తే కూడా విమర్శల జడివాన! ఇవన్నీ ఓపిగ్గా దిగమింగుకుంటున్న దొరవారికి ఈ వారం ఇంకోసారి ఎదురవుతున్న విడ్డూరమైన విమర్శ. వారు సన్నిహిత కుటుంబీకులతో కలిసి మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ శివారులో, సొంత వ్యవసాయ క్షేత్రంలోని విలాస గృహంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, మీడియాకి దూరంగా దాదాపు అజ్ఞాతంలో ఉండాలన్న వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం! మరీ ఇంగితం లేకుండా చేస్తున్న విమర్శలేమంటే (1) తెలంగాణలో మళ్ళీ కొన్ని బలిదానాలు జరుగుతుంటే వారినేం పట్టించుకోకుండా సొంత తోటలో (కోటలో) తొంగోటమేంటి? (2) సొంత జిల్లాలో మతఘర్షణలు చెలరేగితే వాటిని అరికట్టడానికి ఒక నేతగా తమరికేబాధ్యతా లేదా? (3) అసలు ఇంత విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రం, ఇంకా అపారమైన కుటుంబ ఆస్తులు ఎలా వచ్చాయి? (4) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో రహస్య సంప్రదింపులు జరుగుతూ ఉంటాయని అంతిమంగా విభజనేతర పరిష్కారానికి క్రమంగా ఒప్పుకోవడానికి రాజకీయ ఆర్థిక కుటుంబ రక్షణ ప్యాకేజీ ఇప్పటి నిర్ణయమై పోయిందన్న లీకేజీ గుసగుసల్లో పసలేకపోలేదూ? (5) కేవలం కుమారుడు కుమార్తెలకు తప్ప, కనీసం, విజయశాంతి, హరీష్‌, వినోద్‌ వంటి వారికి కానీ, పార్టీలోని జిల్లా ప్రముఖులకు కానీ ఎందుకు 'ప్రవేశం' ఉండదు? ఇవండీ ఇప్పుడు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు-

వ్యంగ్యం అనుకున్నా, నమ్మలేకపోయినా, ఏమీ చేయలేను కానీ ఆయన విశాల దేశ ప్రయోజనాల కోసం అంతిమంగా ఏదో ఒక విభజనేతర పరిష్కారాన్ని సాధించడానికి తోడ్పడతారని, ఆ క్రమంలో త్వరలో సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బృహత్తర బాధ్యతను స్వీకరించడానికి భయపడరన్న విశ్వాసం ఈ వ్యాసకర్తకుంది -అందుకేపైన పేర్కొన్న విడ్డూరమైన విమర్శలకు విలోమ క్రమంలో, దేశ కాలమాన పరిస్థితుల కనుగుణమైన సమాధానాలిచ్చే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను -తమకు తామే వివరణలు, సంజాయిషీలిచ్చుకోవడం దొరలకు నామోషీ కదా?

(1) ఆయన నెహ్రూ జీ అంతటి ప్రజాకర్షక నేత. పండిట్‌ జీకి కూడా అప్పుడప్పుడు కుమార్తె ఇందిరతో కలిసి కొంతకాలం ప్రశాంతంగా ఏదో ఒక ప్రాంతంలో రాజకీయాలకు దూరంగా ఉండి, విశ్రాంతి తీసుకునే అలవాటుండేది -ప్రపంచాధినేతలలో కూడా చాలామంది ఈ పనే చేస్తుంటారు -మరి పన్నెండేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న (అంతిమ ధ్యేయం ఏమిటన్నది వదిలేయండి!) నిన్నా మొన్న సహజ అభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటుకి హాజరై ఏకంగా ముచ్చటగా మూడురోజులు పరిమిత లొల్లి చేసి, బాగా అలసిపోయిన అధినేత కొంత విశ్రాంతి కోరుకోవడం తప్పా? దానికి సొంత తోటని, కోటని ఎంచుకోవడం దొరవారి దోషమా? సన్నిహిత బంధువుల కన్న పార్టీ శ్రేణులకన్న సంతానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం భారతదేశ రాజకీయ నాయకులందరిలో ఉన్న గుణం -అయినా రాజ్‌ఠాక్రే వంటి మేనల్లుణ్ణి మరీ నెత్తికెక్కించుకోకూడదు. విజయశాంతి వంటి విలక్షణ, చంచల స్వభావురాలినీ అంతే! (2) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో సంప్రదింపులు జరుగుతాయని ఆరోపిస్తున్న వారి ఉద్దేశమేంటి? అటువంటి జాతీయ ప్రాముఖ్యం కల అంశాల్ని ఆంతరంగికంగా రహస్యంగా కాకుండా, బహిరంగంగా, అబిడ్స్‌ ప్రధాన తంతి తపాలా కార్యాలయానికొచ్చి పబ్లిక్‌ బూత్‌ నుంచి బిగ్గరగా మాట్లాడాలా? (3) ఇన్ని విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రాలు, అపార కుటుంబ ఆస్తులు, నౌకావ్యాపారాలు సొంత మీడియా ఎలా వచ్చేయని ప్రశ్నించే వాళ్లకి దేశ కాల మాన పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదని అనుకోవాలి.

ఈ దేశంలో ఒక్క టర్మ్‌ సర్పంచిగా పనిచేసిన వాడే ఎంత సంపాదిస్తున్నాడు? పలుదఫాలు ఎమ్మెల్యేగా, ఎంపిగా, కొంతకాలం రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిగా, గత పుష్కరకాలంగా ఒక మహోద్యమ నేతగా వెలిగిన ఒక మహానేతను మీ వర్తమాన కుటుంబ ఆస్తుల విలువెంతో చెప్పమని అడగడం భావ్యంకాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాకపోతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడా శషభిషలనవసరం! (4) మొదటి రెండవ విమర్శలు కూడా అన్యాయమే -తెలంగాణలో బలిదానాలు, సొంత జిల్లాలో మతఘర్షణలు జరుగుతున్నప్పుడు తోటలో తొంగొటమేమిటనే వాళ్లకు, ఈ పరిణామాలు కలుగజేసిన ఆవేదనని మరిచిపోవడానికే, తన అసంతృప్తిని వెలిగక్కడానికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆవేదనల్ని మర్చిపోవడానికి ఎవరి వ్యక్తిగత అలవాట్లు వాళ్లకుంటాయి! ఆఖర్లో స్థలాభావం దృష్ట్యా దొరవారికి క్లుప్తంగా కొన్ని విజ్ఞప్తులు:

-(1) పచ్చని వ్యవసాయ క్షేత్రాల్ని అభివృద్ధి పరచడాన్ని డబ్బు రంగు మార్చే ప్రక్రియగా విమర్శించే వాళ్లని పట్టించుకోవద్దు -అది ప్రకృతి పరిరక్షణ కోసం ఏమాత్రం సొమ్ము ఉన్నవాళ్లైనా చేయాల్సిన సత్కార్యం -(2) ప్రపంచంలో ఇప్పటికే నెలకొని ఉన్న క్లిష్టమైన సమస్య నీటికరవు -మీ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రారంభించిన బిందుసేద్య ప్రయోగాలు కొనసాగించండి (3) మీ విశాల దృక్పథానికి అనుగుణంగా మీ క్షేత్రాల్లో నూజివీడు మామిడి చెట్లు, మహబూబ్‌నగర్‌ ఫలవృక్షాలు, టెక్కలి టేకు చెట్లు, కోనసీమ కొబ్బరి చెట్లు, అదిలాబాద్‌ అరటి, జామ రకాలు, గుంటూరు మిర్చి, నెల్లూరు నేరేళ్లు ఇంకా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల చామంతి, గులాబీ, మల్లెల అంటులు, అన్నీ పెంచండి -అన్నట్టు ఆనపకాయ అన్నా సరే సొరకాయ అన్నా సరే, ఆ పాదులతో పాటు అన్ని కూరగాయలు, ఆకుకూరలు పండించండి -దొరవారికి దండాలతో ఉంటాను మరి.
-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు  

13 కామెంట్‌లు:

  1. Why this why this papapazzi da?

    కొలువు మానేసి ఖాళీగున్నంత మాత్రాన ఆయనెవరిదో రోజు వారీ కార్యక్రమాలను ఫాలో కావాల్నంటే బోరు కొడ్తలేదా? ఇంతకంటే మంచి వినోదం IPL చూడొచ్చు కదా.

    అవతలోనికి అక్కర లేని సలహాలు ఇచ్చే బదులు ఆ టేకులు, కొబ్బరి చెట్లు ఏవో మీరో పెంచుకోండి. విశ్రాంతి తీసుకుంటున్న మీకు మస్తు తిముపాసు అయితది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 1. /అవతలోనికి అక్కర లేని సలహాలు ఇచ్చే బదులు/
      2. /టేకులు, కొబ్బరి చెట్లు ఏవో మీరో పెంచుకోండి/

      LOL

      తొలగించండి
  2. "త్వరలో సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బృహత్తర బాధ్యతను స్వీకరించడానికి భయపడరన్న విశ్వాసం ఈ వ్యాసకర్తకుంది"

    తిక్క వేషాలేస్తే తగిన శాస్తి జరుతదని ఆయనకు ఎరుకే. దీక్ష బంజేసిండని వార్తలు రాంగనే శవయాత్రలు తీసిన్రు. ఇంకా బుద్ది రాకపోతే నిజమయిన పీనుగకు యాత్ర జేస్తారు జనం.

    మీ అభిమాన "వి"నాయకుడు, మీ గాసిప్ రాతలకు inspirationగా ఉంటూ మీ పొట్ట పోషిస్తున్న మీ పెద్ద దొర బాగుండాలని, తద్వారా మీ "వ్యాసాలకు" గిరాకీ ఉండాలని కోరుకుంటే ఇలాంటి సలహాలు మానేయండి. లేకపోతె అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  3. "తమకు తామే వివరణలు, సంజాయిషీలిచ్చుకోవడం దొరలకు నామోషీ కదా?"

    దొర జవాబు ఇస్తలేడు కాబట్టి జీతగాళ్ళు ఇస్తరా?

    రిప్లయితొలగించండి
  4. గొర్రెలు"కచరా"వాడినే నమ్ముతాయ్, ప్రతిదానికి పెడర్ధాలు తీస్తాయ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కచరా మీద అత్యంత అభిమానంతో అత్యాషలు పెంచుకున్నది మీ "వ్యాస"కర్త. మాకు ఎవడయినా ఒక్కటే: ఇది 1969 కాదు.

      తొలగించండి
    2. /మాకు ఎవడయినా ఒక్కటే/

      ఔలే, కచరా అయినా, పంచకల్యాణి అయినా, నందయినా/పందైనా మీకు తేడాలుండవ్/తెలియవ్. అంతా సమానమే! :D ఇంకా వ్యూహాత్మక మౌనమేనా? గిప్పుడు తెలబాన్ IPL స్కోరెంతకొట్టిన్రు? 600, 632, 673... 700 ???

      తొలగించండి
  5. కొత్త పోస్టు పడింది.
    ఈ బ్లాగులో ఏమి పోస్టు వేస్తారా..అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినోళ్ళకి పండగే..

    ఇగ పోస్టు ను 'ముక్క'లు 'ముక్క'లుగా చేసి ( ofcourse, ముక్కలు చేయడమే తెలబానులు, పాకీయులకు కావలసింది) స్వయం త్రుప్తే..స్వయం త్రుప్తే

    రిప్లయితొలగించండి
  6. తమాషా ఏమిటంటే రాజకీయనాయకుడు రామజోగయ్య గారికి,విశ్రాంత బ్యాంకు అధికారి రామజోగయ్య గారికి తేడా తెలియని తింగరిమేళం ఒకటి తగుదునమ్మా అంటూ మేధావిలా అన్ని బ్లాగుల్లో తన పైత్యాన్ని ఒలకబోస్తుంటే,ఆయనకీ సరితూగే ఇంకొక మేతావి ముక్కలు ముక్కలుగా తన వేర్పాటువాద విషాన్ని శక్తివంచన లేకుండా చిమ్ముతూ అందరినీ ప్రశ్నిస్తూ తన ఏడుపులని కామెంట్ల రూపంలో బహుబాషల్లో వెలువరిస్తుంటారు.తన ఆత్మబందువుల బ్లా'గుల'లో రామజోగయ్య గారి "parapazzi ishtyle రాతలు రాసినా మనం పట్టించుకోమని తెలవదు పాపం" అని సాటి తెలబానుల ముందు గొప్పలు పోతుంటారు.ఈయన పట్టించుకుంటే ఎంత పట్టించుకోక పొతే ఎంత అనే సందేహం మనలాంటివాల్లకు వస్తుందని కూడా తెలవని అయోమయం. రామజోగయ్య గారు తన అభిప్రాయాలని "ఆంధ్రప్రభ" పత్రికలో వ్యక్తీకరించారు సంపాదకులు ప్రచురించారు అంటే అందులో విషయపరిజ్ఞానం,వ్యాసంలో సరుకు ఉండబట్టే అని ఎవరికయినా అర్ధం అవుతుంది.దానిని తిరిగి చైతన్యగారు మూలం ప్రస్తావించి మరీ ఇక్కడ తిరిగి ప్రచురించారు అని అర్ధంచేసుకోకుండా ప్రతిదీ తెలంగాణాకి వ్యతిరేకమని తీర్మానించేసుకుని ఎవరూ సమైక్యత గురించి రాయకూడదు,మాట్లాడకూడదు అని పిడివాదం చేస్తున్నారు.అసలు రామజోగయ్య గారు తన వ్యాసం గురించి స్పందనలకి జవాబులు ఇవ్వవచ్చు లేకపోతే గమ్మున ఉండవచ్చు.అది ఆయన ఇష్టం.ఇంకొక అతితెలివిబాన్ ప్రశ్నలు వేయుట మా హక్కు-మాకిష్టమైన సమాధానాలు ఇవ్వడం మీ వంతు అనే బ్రమలో మిగతా వ్యాఖ్యాతలని "టాట్" మద్యలో పిలవని పేరంటానికి మీరెందుకోచ్చారంటూ ఆ'విషం'చెందుతూ అందరినీ ఆడిపోసుకుంటున్నారు. అందరికీ మీ సమయం వృధా చేసుకోవద్దు అని ఉచితసలహాలు ఇస్తుంటారు! అతికాకపోతే ఆఖరికి సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న "విశాలాంధ్ర"బ్లాగులో కూడా మా అభిప్రాయాలు చెప్పుకోకూడదా అని మేము ఆశ్చర్యపడే పరిస్థితి.
    @చేగొండి రామజోగయ్య అనబడే విశ్రాంత బ్యాంకు అధికారి ఈమధ్య విశ్రాంతి లేకుండా ఆంధ్రప్రభలో ఎడాపెడా తెలంగాణపై విషాన్ని గుప్పిస్తున్నాడు. ఇతని రాతల్లో ఒక అర్ధం, పర్ధం ఉండదు అని తేలిగ్గా తీసిపడేసిన ఇంకొక కోదండంతమ్ముడు - రామజోగయ్యగారి టపా మీద ఏకంగా తన బ్లాగులో ఒక టపా రాసి తన "విశ్వరూపం"చూపించారు.
    రామజోగయ్య గారి వ్యాసాల్లో నిజాలు,విషయం,వాస్తవాలు లేకపోతే వీల్లకేందుకు ఇంత "బాధ"+"ఉక్రోషం"+"ఏడుపు"+"వెటకారం"+"దౌర్జన్యం"+"కుళ్ళు"+"ఆ-విషం"+"ప్రేలాపనలు"+"- - -".
    * ఈ ఉష్ట్రపక్షి మనస్తత్వం మార్చుకోకపోతే,వెర్రిబాగుల మరదలొకటి బావనిచూసి సిగ్గుపడి లంగాతో మొఖం కప్పుకుందట! అలా అవుద్ది వ్యవహారం.
    * తమ మేదావితనాన్ని చూపించుకోవడానికి తెలవాదులు సామెతలని తగవాడుతుంటే నేను కూడా గుర్తుకుతెచ్చుకుంటూ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. /ఆంధ్రప్రభలో ఎడాపెడా తెలంగాణపై విషాన్ని గుప్పిస్తున్నాడు. ఇతని రాతల్లో ఒక అర్ధం, పర్ధం ఉండదు అని తేలిగ్గా తీసిపడేసిన ఇంకొక కోదండంతమ్ముడు - రామజోగయ్యగారి టపా మీద ఏకంగా తన బ్లాగులో ఒక టపా రాసి తన "విశ్వరూపం"చూపించారు./
      ఆ కామెంట్లు చూశాను, అసలు విషయం వదిలేసి, బ్యాంకు( ఏబ్యాంకో కూడా తెలియదు) దివాలా తీసిండేమో, గదేమో, గిదేమో అంటూ అర్థం లేని అక్కసు తీర్చుకుంటు, కోతిరతనాలు రెండు గోక్కోవడం చూసి జాలేసింది. సూటిగా చెప్పారు.
      అసలే తెలబాన్లు, ఆపై కోతిరతనాలు కూడా పాపం అంతకన్నా ఏంజేస్తారు? :D

      తొలగించండి
    2. 8 కోట్లను 18 కోట్లు చేసే కాకిలెక్కల బాంకు నడుస్తదా శంకరన్నా?

      విడిపోతే ఆంద్ర వారికి లాభం కానీ మేము సమైక్యంగా ఉండాలి అనే ఆర్ధిక "సూత్రం" ప్రకారం వ్యాపారం చేస్తారా ఎవరన్నా?

      తొలగించండి
    3. ధన్యవాదాలు శంకర్ గారు.
      సహజసిద్దమైన వ్యాపకం 'పేలు'చూసుకుంటూ పక్కనోళ్ళ మీదపడి ఏడ్చుకుంటూ,ఏడ్చుకుంటూ,ఏడ్చుకుంటూ...

      తొలగించండి