21, ఏప్రిల్ 2012, శనివారం

శభాష్‌ కవితమ్మా!

ఆంధ్రప్రభ వ్యాసం : సహజ ప్రవృత్తి, సంస్కారాలకి విరుద్ధంగా ఎవరైనా సరే తాత్కాలికంగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుడు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా, నెమ్మదిగా వాటి నుంచి వైదొలగుతూ, క్రమంగా (ఒక్కసారిగా సాధ్యం కాదు కదా!) మంచి కార్యక్రమాలకు మరలుతూంటే ఆ పరివర్తనా పరిణామాన్ని ప్రోత్సహించాలి, హర్షించాలి. శభాష్‌ అనాలి. అందుకే, పోయినవారంలో, తనలోని పరివర్తనా క్రమానికి నాందిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఆవరణలో మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని చట్టసభల ప్రాంగణాల్లో కూడా, మనరాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాల్ని సత్వరం నెలకొల్పాలన్న ఒక సముచిత డిమాండ్‌తో ఏకంగా 48 గంటల నిరాహారదీక్ష చేసిన కల్వకుంట్ల కవితమ్మను అభినందించాలి. శభాష్‌ తల్లీ అనాలని అనిపించింది.

రాజకీయ (కొండొకచో ఆర్థికం కూడా!) వారసత్వాల్ని గాఢంగా కోరుకునే కుమార్తెలు పుట్టింటి ఇంటిపేరుతో చలామణి కావడం మనదేశంలో కొత్త కాదు. తప్పు అసలే కాదు! కాబట్టి మన తెలుగింటి ఆడపడుచు, కవిత వివాహానంతర రికార్డుల్లో సర్టిఫికెట్లతో అమెరికా వీసా పత్రాలలో ఇంకా ఇతర అపార ఆస్తుల పత్రాల్లో ఏ ఇంటిపేరు నమోదై ఉందో మనకనవసరం! ఆ రమణి కల్వకుంట్ల వంశంలో జన్మించిన ఒక మహోజ్వలమణి! అగధా సంగ్మా, సుప్రియా సూలె, ప్రియాదత్‌, కనిమొళి (వారందరూ ఇప్పటికే ఎంపిలు) వంటి దేశంలోని ఇతర మహిళా నేతల సరసన ఉండాల్సిన అర్హతలున్న గొప్పమహిళ. ఈమెకు కూడా వారికి లభించినంత పితృవాత్సల్యం, వారసత్వ బలం లభించడం ఒక నేతగా వెలిగేందుకు కొంతవరుకు తోడ్పడిన మాట వాస్తవమే కావచ్చు. అయితే జయలలిత, మమత, మాయావతిల స్థాయి స్వీయప్రతిభ చొరవ, చతురత తనకున్నాయని కవితమ్మ నిరూపించుకున్నారని మర్చిపోరాదు. అంతేకాదు, సహజ వాగ్ధాటి, వాదనా పటిమ, నాయకత్వ లక్షణాలు, శ్రమించేతత్వం, సొంత అనుచరణగణాల్ని ఏర్పరచుకునే నైపుణ్యం, తగు సమయం సందర్భం కోసం ఎదురు చూసే ఓర్మి కవితను ఇప్పటికే మన రాష్ట్రంలో ఒక అగ్రశ్రేణి అసామాన్య నేతగా నిలిపాయనడంలో అతిశయోక్తి లేదు. ఆమాటకొస్తే ఃనాన్న, అన్న కన్న మిన్నః అనిపించుకుని వారికీ సంతుష్టి, సంతోషాల్ని కలగజేస్తూండడం సామాన్యమైన విషయం కాదు. కవితే ఒకసారి చెప్పేరు, బాల్యంలో ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాస కాలంలో ఉన్నత విద్యాభ్యాస సమయంలో తాను అమెరికాలో ఉన్నట్లు, తనకు అన్ని ప్రాంతాల, వర్గాల తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయని, అవి ఇప్పటికీ చక్కగా కొనసాగుతున్నాయని. ఇకపోతే ప్రస్తావిత దీక్షా విరమణ సమయంలో కవిత, ఇతర ప్రాంతాల ప్రజల నుంచి తన కార్యక్రమానికి అపారంగా లభించిన ఆదరణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తాను జాతీయ స్థాయి సమస్యలపై పోరాటాలు చేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఉదాహరణకి జాతీయ ఉపాధి పథకంలో పనిదినాల్ని, వేతనాల్ని బాగా పెంచాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తానని అన్నారు. ఇకముందు తన కార్యకలాపాలు ఏదో ఒక ఉపప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబోనని చెప్పకనే చెప్పారు. ఇదంతా ఒక సత్పరిణామక్రమాన్ని స్పష్టంగా సూచిస్తోందని అర్థం చేసుకోకపోతే అది మన తప్పే అవుతుంది. అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలపై పోరాడతానంటే స్వాగతించక పోవడం మూర్ఖత్వం అవుతుంది. నిజానికి ముందే చెప్పినట్లు కవిత సహజ ప్రవృత్తి, సంస్కారం రీత్యా విభజన వాది కాదు.

అరాచకవాది అసలే కాదు. అయినా ఆమె తన విశాల భావాల నుంచి తాత్కాలికంగా నైనా మరలడం తెలుగు ప్రజల దురదృష్టమనుకుందాం. నాన్న వద్దన్నప్పటికీ అమెరికాలో సుఖజీవనాన్ని వదలుకుని, తనకు తానే నిర్ణయించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చేసి, ప్రజాక్షేత్రంలోకి దూకేశానని తనే చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆయన్ని నిందించడం తగదు. కానైతే, ఆమె తనకు ఏ రాజకీయ పరమైన ఆకాంక్షలు లేవని, కేవలం తెలంగాణ ప్రజల సాంస్కృతికోద్ధరణకు మాత్రమే పాటు పడతానని కూడా ఎన్నోమార్లు వక్కాణించారు. (ఇప్పటికీ తనకు తెరాసతో సంబంధం లేదని కూడా చెబుతుంటారు.) కానీ ప్రస్తుతం చేసేవన్నీ రాజకీయ కార్యక్రమాలే! మొదట్లో, అంటే అమెరికా నుంచి తిరిగొచ్చేసిన కొత్తలో ఎంతో శ్రమించి మెదక్‌ జిల్లాలో ఇటీవల బయల్పడిన కొన్ని ప్రాచీన తెలుగు శాసనాల గురించి, ఉమ్మడి తెలుగు భాష విశిష్టత గురించి ప్రచారం చేశారు. తనే స్వయంప్రకటిత అధ్యక్షురాలిగా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి, దాన్ని అనతికాలంలో బాగా విస్తరించేరు. బతుకమ్మ పండుగ వైశిష్ట్యాన్ని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. కనిమొళినీ తీసుకోచ్చేరు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా తండ్రి తరఫున ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా, ఫలవంతంగా నిర్వహించిన ఘనత సాధించడంతో తృప్తి పడలేదు. పలు రాజకీయ కార్యక్రమాల్లో సంసారాన్ని కూడా విస్మరించి పాల్గొంటూ వచ్చారు. దూరదృష్టితో తన సొంత సంస్థ -జాగృతిని ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాంతమంతటా విస్తరించారు, పార్టీకి సమాంతరంగా జాగృతికిప్పుడు రాజధానిలో మాత్రమే కాదు, పలు పట్టణాలలో కార్యాలయాలు, వనరులు, నిధులతోబాటు మంచి కార్యకర్తల పటాలాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా నాన్న, అన్నల కన్న కొన్ని విషయాలలో నైనా మిన్న అని నిరూపించుకున్నారన్నమాటే కదా!

ఃఅదుర్సు రభసః ఇంటర్‌ విద్యార్థుల పరీక్షా పత్రాలు ప్రాంతీయ మూల్యాంకనం, సినిమా షూటింగులకు ఆటంకాలు ఇటువంటి కొన్ని కార్యక్రమాలు మరీ ఃదూకుడుఃగా నిర్వహించి కొంత అప్రదిష్టని మూటకట్టుకున్నారని, ఉద్యమపరంగా కొన్ని చాలా లాభదాయకమైన చందాల దందాల ముడుపుల విభాగాల్ని సొంతం చేసుకున్నారని, ఇలాంటి కొన్ని విమర్శలు కవితమ్మపై విభజనవాద వర్గాల నుంచే వచ్చేయి. ఇంకా వస్తున్నాయి ఈ విమర్శల్లోని నిజానిజాల సంగతెలా ఉన్నా ఒకటిమాత్రం నిజంగా నిజం. తెరాస పార్టీ పరంగా జరిగిన అన్ని ఉద్యమ కార్యకలాపాల్లోనూ ప్రజలకు ఏర్పడిన విలాపాల్లోను) కవితమ్మ పాత్ర చాలా ఎక్కువగా ఉంటూ వచ్చింది. వంటావార్పూ కానీండి, రైల్‌రోకో, లేదా సకల జనుల సమ్మె కానీండి ఇతర పార్టీ నేతల కన్న, ఆ మాటకొస్తే నాన్న, అన్నల కన్న మిన్నగా ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా దూసుకుపోయేరు. పోరాట పట్టాలపై కూర్చున్నారు. ఎక్కువ రాజకీయ చతురత చూపారు. ఆవిధంగా అందరికన్న అధికంగా దృశ్యతః (విజిబిలిటీ) సాధించారు.

ఇతర ప్రాంతాల ప్రజలనూ ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇంతటి అసామాన్య ప్రతిభగల ఒక తెలుగు యువతి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే దానికి నాందిగా వచ్చే ఎన్నికలలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే అది మనం హర్షించదగిన విషయమే. వచ్చే ఎన్నికల నాటికి దొరవారికే నియోజకవర్గాన్ని మార్చవలసిన అవసరమేర్పడి తానే నిజామాబాద్‌కే తరలిపోదామనుకుంటే చెప్పలేం గానీ, కుమార్తె ముచ్చట తీర్చడానికే ఆయన మొగ్గు చూపవచ్చు. లేదా కరుణానిధి కనిమొళికి ప్రసాదించినట్లు రాజ్యసభకి పంపించే అవకాశం ఎలానూ ఉంటుంది. ఏమైనా మన కవితమ్మ త్వరలో ఎంపీ కావడం, తర్వాత కేంద్రంలో మంత్రి పదవిని పొందడం దాదాపు ఖాయం, కాదంటే ఆమె భర్తకి, అన్నకి రాష్ట్రంలోనే వేరే పదవుల్ని చూడాల్సి ఉంటుంది దొరవారికి. తనది జాతీయ స్థాయి అన్న ఆత్మ విశ్వాసం ఉన్నందువల్ల, ఎలానూ అంతిమంగా విభజనేతర పరిష్కారమే రానున్నదన్న విజ్ఞత, అవగాహన ఉన్నందువల్లనే కల్వకుంట్ల కవితమ్మ తన పంథాని క్రమంగా మార్చుకుంటున్నారని, విస్తరించుకుంటున్నారని అర్థమవుతూనే ఉంది. మన తెలుగింటి ఆడపడుచుకి అభినందనలు చెబుదాం. శభాష్‌ కవితమ్మా! అందాం.

( దీనిని వ్యంగ్యం అనుకునేరు సుమా!)

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

13 కామెంట్‌లు:

  1. ఇపుడు అంత అర్జంటుగా విగ్రహాలెందుకో..

    తెలంగాణా వచ్చినాక ఎన్ని కావలిస్తే అన్ని...ఎక్కడ కావలిస్తే అక్కడ హాపీ గా పెట్టుకోవచ్చు కదా ( తెలంగాణా సాధించి తీరుతారటకదా వీరు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణ వచ్చుడో చచ్చుడో
      విగ్రహాలుంటే కూల్చే ఆట ఆడుకోవచ్చుకదా,
      టైం పాసవుతుంది, కవరేజి వస్తుంది. :))

      తొలగించండి
    2. అంబేడ్కర్ గారి విగ్రహాలు కూల్చే దౌర్భాగ్యం ఆంధ్రోల్లకే చెల్లింది, కారంచేడు వారసులారా.

      తొలగించండి
    3. మొత్తం తెలుగు సాహితీ,సంస్కృతి వారసుల విగ్రహాలు టాంక్ బండ్ మీద కూల్చింది ఎవరు ??? రజాకార్ల సంతానమా! తెలబాన్ల తమ్ముల్లా!! అసలు వారసులెవరో తెలియని అసురులా!అక్రమ సంతాన వికృత రూపులా ??? ఎవ్వలు తమ్మీ !!?

      తొలగించండి
    4. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article2898360.ece

      ఇదీ ఆంధ్రోల్లె చేశారా జై గారూ. ఇకపోతే ట్యాంక్ బండ్ మీద పిచ్చికుక్కల్లా తెలబాన్లు చేసిన విధ్వంసానికి ఎలాగూ మీ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకండీ అనవసరంగా అన్నిటిలో తలదూర్చి కామెడీ స్టేట్మెంట్లు ఇస్తారు?

      తొలగించండి
    5. శంకర్ గారు ! లింకుతో లంక వారసులకి లెక్క సరిగ్గా చెప్పారు!!!

      తొలగించండి
  2. I think VMS should do better scrutiny in publishing the posts in the blog. otherwise There is a danger of an individual's opinion( సహజ వాగ్ధాటి, వాదనా పటిమ, నాయకత్వ లక్షణాలు, శ్రమించేతత్వం xyz..) will be attributed to VMS. The representatives once faced a difficult situation with one of Rallabandy posts on Jayasankar and Burra ramulu. I mailed to Chakravarthy garu to brought it to his notice and he made that post deleted. (till then He is completely unaware of the article).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Satya, there are two major differences.

      Rallabandy & Tadepalli ("low talent zone" fame) are fringe individuals outside VMS influence. Chegondi, on the other hand, is a member of the VMS inner group. He signs off as "విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు" and does not even say something like "my personal views only".

      Chegondi's స్తుతి నింద style is in sharp contrast to Chakravarthy's no nonsense approach. This offers ample scope of misinterpretation.

      తొలగించండి
    2. Jai, I know he is signing of as a 'member of VMS'. But I am not sure whether he is part of the team that is driving(with some agenda) VMS. For me the sycophancy of chegondi does not appear to be fit in with the principles of VMS. A member should have the thought process inline to the organization but not try to carry his personal views in the name of org. such mixed bang of opinions if published under VMS will dilute the principles and creates confusion, ultimately toughens the job of chakravarthy and others. I dont want him to answer all these nonsense instead of focusing on his mission.

      తొలగించండి
  3. కచరా వారి వీరాభిమానినని మరొక్కసారి రుజువు చేసుకున్నందుకు శభాష్ చేగొండి దొర వారూ. వ్యక్తి పూజ నుండి ఒక మెట్టు ఎదిగి ఇప్పుడు సాంతం కుటుంబ సభ్యులందరికీ మస్కా కొట్టడం మీ అభివృద్దికి మంచిదే.

    కచరా గారు మీ స్తుతికి (సుత్తికి?) సంతోషించి మిమ్మల్ని సముచితంగా సన్మాలించాలని కోరుకుందాం. ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తూ ఇలాగే వారి మీద పుంఖానుపుంఖాలుగా "వ్యాసాలు" రాయండి. మీ "శ్రమ" తప్పక ఫలిస్తుంది.

    (దీనిని వ్యంగ్యం అనుకునేరు సుమా!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జైగో గారు,
      కపితమ్మని పొగిడితే, మీకెందుకు కాలుతావుంది? :))

      (దీనిని వ్యంగ్యం అనుకోకపోయేరు సుమా!)

      తొలగించండి
    2. క"పిత"మ్మను కానీ ఆమె "పిత"శ్రీని కానీ పొగడడం విషాంధ్ర సఫా సమితి వారికే చెల్లుతుంది లెండి. చేగొండి వారి విధేయతకు, స్వామి భక్తికి నేను అడ్డం కాదు, నిలువు కాదు :)

      తొలగించండి
    3. అలా అనకండి, మీ ముక్కోడు గారే ఉజ్జమానికి మూల పురుసుడు, బార్బర్షాప్ కపితమ్మ, భాజపాలో వుండి వేరుకుంపటి పెట్టి, అప్పులోళ్ళు వెంటబడితే కాంగ్రెస్లో దూకబోయి, స్కాముల ముక్యమంత్రి టపా కట్టేశాక తెరాస జండా ఎత్తుకున్న విజగశాంతి తదితరులు మూల స్త్రీలు. దళిత ముసలోణ్ణి టివి కెమరా వేసుకుని వెళ్ళి కొట్టిన మగధీరుడు బేవార్సు ఉజ్జమ సేనాని అన్న విషయం బేవార్సులంతా రోజూ మూల పురుషాధములను తలుచుకుని దీపం పెట్టి ఆరాధన చేసుకోవాల్సిన చారిత్రిక అవసరం తెలగానకు ఎంతైనా వుంది. పరిశీలించుడీ.ఈ..ఈ

      తొలగించండి