19, ఏప్రిల్ 2012, గురువారం

విశాలాంధ్రమహాసభ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం’ పుస్తకావిష్కరణ

Eenadu 18/04/2012

విశాలాంధ్ర దినపత్రిక : ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం” పుస్తకావిష్కరణ సభ మంగళవారం నగరంలో జరిగింది. తెలంగాణలో జరిగిన ఉద్యమ ఘట్టాలు, విశాలాంధ్ర దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ప్రచురించిన వార్తలు, కథనాలతో కూడిన విశాలాంధ్ర మహాసభ ముద్రించిన పుస్తకాన్ని స్వాతంత్య్ర సరమయోధులు నర్రా మాధవరావు ఆవిష్కరించారు. సభకు విశ్రాంత ఐపిఎస్‌ అధికారి సి. ఆంజనేయరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా మాధవరావు మాట్లాడుతూ, దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులు గతంలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విశాలాంధ్ర నుంచి తెలంగాణను వీడదీయవద్దని కోరారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుతూ ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేశామని ఆయన చెప్పారు. విశాలాంధ్ర మహాసభ ప్రధానకార్యదర్శి పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పోరాటాలు సాగాయని, అనంతరం ఆంధ్ర మహాసభ విశాలాంధ్రగా మారింద న్నారు. స్వాతంత్య్ర సమ యోధుడు మహబూబ్‌ అలీ మాట్లా డుతూ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం కమ్యూనిస్టులు పోరాటాలు జరిపా రని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న మాటల్లో నిజం లేదని అభిప్రాయపడ్డారు. విశా లాంధ్ర మహాసభ అధ్యక్షులు ఎన్‌. చక్రవర్తి, నాయకులు వి.లక్ష్మణరెడ్డి చేగొండి రామజోగయ్య పాల్గొన్నారు.


 

Download E-Book here తెలంగాణలో విశాలాంధ్రోద్యమం

2 కామెంట్‌లు:

  1. అసలు అంధ్ర రాష్ట్రానికి నాయకత్వలేమి అత్యంత తీవ్ర సమస్య గా మారింది. నరెంద్ర మొఢి లాంటి నాయకుదు మనకు లెకుండా పొయెడు. నర్మద నది కల్వల మీద సౌర ఫలకలని పరచి విద్యుత్ను ఉథ్పథి చెయదమె కాక నీటిని ఆవిరి కాకుందా చెస్థున్నాదు. అలాంటి ఆలొచనలు మనవారికి ఎందుకు రావు? ఎంతసేపు కులం మతం ప్రాంతీయ దురభిమానం. కాకతియ వైభవం రాయలవారి పాలన గురించి చెప్పుకొవడమే మనకి మిగిలింది. ఆందరిని ఒక్కత్రాతిపై నదిపే ఎంటీఆర్ లాంటి నాయకుదేడీ?

    రిప్లయితొలగించండి
  2. కల్యాణ్ రామ్ గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా, ప్రస్తుతం మన రాష్ఠ్రం లో జరిగే ఉద్యమాల వెసు క అసలు కారణం నాయకత్వసూన్యం. కులాభిమానం, కులవిద్వేషం,ప్రాంతీయదురభిమానం ముఖ్యకారణం. దివంగత నేత రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ తమ తమ పార్టీలలో ద్వితీయ పంక్తి నాయకత్వాన్ని ఎన్నడు ప్రోత్సహించలేదు, ప్రాంతీయాభిమానం (దురాభిమానం) కేవలం ప్రాంతీయనాయకులను మాత్రమే సష్ఠిస్తుంది.

    రిప్లయితొలగించండి