19, అక్టోబర్ 2013, శనివారం

హైదరాబాద్ తెలుగు ప్రజలందరి సొత్తు!

చార్మినార్ పునాదులు పడక ముందు నుండే గోల్కొండ ఖజానాకు ప్రతీయేటా తీరాంధ్ర ప్రాంతాల నుండి హెచ్చుమొత్తంలో ధనరాసులు తరలివెళ్లాయన్నది ఎంత నిజమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి తెలుగు ప్రజలు అందరూ ప్రాంతాలతో నిమిత్తం లేకుండా పాటుపడ్డారన్నది అంతే నిజం.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కొన్ని రోజులకు ముందే సెప్టెంబర్ 10,1956న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ద్వితీయ ప్రణాళిక మొత్తంలో వేరే పద్దుల్లో కోత పెట్టి 152 లక్షల రూపాయలు వెచ్చించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ ద్వితీయ ప్రణాళిక మొత్తంలో 76 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు.అప్పటినుండి ఇప్పటివరకూ వెచ్చించిన మొత్తానికి రూపాయి విలువకనుగుణంగా లెక్కలు తేల్చి చెప్పడం ఎవరి తరం?ఈనాడు భాషాసంస్కృతులే కాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ఏకీకృతమైన ప్రాంతాలను బలవంతంగా ఎలా విడదీస్తారు. ఆ తర్వాత తలెత్తే పరిణామాలకు ఎవరు భాద్యులు?



విభజనవాద నాయకులు హైదరాబాద్ మహానగరాన్ని బంగారుగుడ్లు పెట్టే బాతులా చూడబట్టే ఈ రోజు మన రాష్ట్రంలో ఈ విభజనవాద చిచ్చు రగిలిందేమో అని అనిపిస్తుంది. వారు ఇన్నాళ్ళు తాము ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమి చేసారు?ఏమి చేయబోతున్నారు?ఇతర ప్రాంతాల ప్రజలను అన్యాయంగా దొంగలు అంటూ మోసపూరిత వాగ్దానాలతో వారిని ఎంత కాలం ఏమార్చుతారు?

16, అక్టోబర్ 2013, బుధవారం

'విశాలాంధ్ర మహాసభ' పత్రికా ప్రకటన, అక్టోబర్ 16, 2013


విశాలాంధ్ర మహాసభ కేంద్ర మంత్రులు కిల్లి క్రుపారాణి, దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు విభజనను వ్యతిరేకిస్తామన్న మంత్రులు ఇప్పుడు మాట మార్చటం సోనియా గాంధీకి అమ్ముడుపోయారనటానికి నిదర్శనం.

ఈ రోజు తెలుగు ప్రజల భవిష్యత్తు విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎం. పీ. ల, ఎం. ఎల్. ఏ. ల పాత్ర నిరర్ధకం, శూన్యం అయిపొయింది. వారందరినీ సాంఘికంగా బహిష్కరించి వారి ఉనికిని గుర్తించటానికి నిరాకరించాలి.

యుపీఏ నియమించిన ఆంథోని కమిటీ మన రాష్ట్రానికి రానే రాలేదు. ఆ కమిటీ రిపోర్ట్ తయారు కాకముందే, కేంద్ర ప్రభుత్వ కాబినెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన టేబుల్ నోట్ ద్వారా పెట్టటం ద్వారా అన్ని ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది.

కేంద్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర విభజన మంత్రుల కమిటీ ప్రజలు, నాయకుల సూచనలు మన రాష్ట్రానికి వచ్చి తీసుకుంటుందని చెప్పటం జరిగింది. కాని నేడు కేవలం ఈమెయిలు ద్వారా ప్రజలు తమ సూచనలు పంపించాలని ప్రభుత్వం కోరింది. అంటే సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులను ఈ ప్రక్రియనుంచి దూరం పెట్టినట్లే. ఇదేమి ప్రజాస్వామ్యం?

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు శాతం ప్రజానీకం విభజనకు వ్యతిరేకం. తెలంగాణాలో కూడా గణనీయమయిన సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారు. కేవలం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొద్ది స్థానాల్లో గెలుపొండటానికి ప్రజస్వామ్యాన్నే ఖూనీ చేసే ప్రయత్నం దేశ సమగ్రతకు ఎనలేని హాని చేకూరుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లుని ముందుకు తీసుకుపోవటానికి శాయశక్తులా కృషిచేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని ఇతర వర్గాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

విజయనగరంలో కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ప్రజల మౌలిక హక్కులను కాలరాసే విధంగా కర్ఫ్యూ విధించి ఉద్యమకారులని, ముఖ్యంగా విద్యార్థులని పోలీసులు మరియు రాజకీయ నాయకుల అనుచరులు వేదించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

AP NRI Forum ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సదస్సు


Dear Telugu NRI,
Over two months, millions of people in Andhra Pradesh have been relentlessly standing against injustice done by Government of India to our Telugu People, yet Telugu People in USA are turning their back to fellow brothers and sisters. Many in US are talking about it, some are publicly debating, but only handful are trying to make a difference. Telugu people, historically, have always been actively promoting culture and social integration and doing charity at home?by establishing great organizations locally and nationally. These people and their organizations are doing great service to Telugu community. When need of the hour comes, it is quite surprising to see that these renowned organizations and its members and supporters failed to respond to this heinous divisional issue. Even more astonishing fact is that they did not even show basic emotion and could not call for unity. Rational people would agree that division of AP would lead to division of Telugu people across?the world because of the way division of the state is being progressed. Bitter feelings and deep animosity will prevail among Telugu communities for generations ahead.
We still have time to reverse the damage that is being caused to our great Telugu Jaathi.
Please come out and do the right thing i.e. STOP DIVISON and PROMOTE INTEGRATION.
Join your hands with those who have been struggling to fight with destroyers of Telugu Jaathi.
Support your brothers and sisters in Andhra Pradesh.
To donate and support please visit?http://andhrapradeshnri.org/

Please check out our upcoming historic ?Occupy Delhi? event at
http://andhrapradeshnri.org/?page_id=45
Jai Hind!! Jai Telugu Jaathi!! Jai Samaikhyandhra!!
Team
ANDHRA PRADESH NRI FORUM


Samikhyandhra Event in New Jersey
Dakshin Restaurant, 675 US-1 & Grill Ln, Iselin, NJ 08830
Saturday October 19,2013 from 3:00 PM EDT to 6:00 PM EDT




13, అక్టోబర్ 2013, ఆదివారం

బూర్గుల గారి త్యాగం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయం !


'ఆంధ్ర ప్రదేశ్ నాయకుని ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం మంచిది' , విశాలాంధ్ర పత్రిక ( 01/09/1956)



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం శ్రేయస్కరమని తానూ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికీ, ఉప ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారికీ సలహా ఇచ్చినట్లు హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు నేడిక్కడ విలేఖరులతో చెప్పారు. ఆ సంధర్బంలో ఆయన ఇలా ఒక ప్రకటన చేశారు.

"ఆంధ్ర-తెలంగాణాల లీనీకరణ జరుగుతున్న ఈ సమయంలో నాయకత్వానికి పోటీ గాని, తగాదాగాని ఏర్పట్డం శాశ్వత విభేదాలకు దారి తీస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిదికాదు అని నా నిశ్చితాభిప్రాయం. కాబట్టి ఐక్యతకు దోహదమిచ్చే వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆంధ్రప్రదేశ్ నాయకుని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొనేటట్లు చేయడానికి నా పలుకుబడిని వినియోగించాలని సంకల్పించాను. ఇక్కడ ఆంధ్రలోని మిత్రులందరికీ ఈ నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను.ఆంధ్రులు ఒక త్రాటిపై నడవడానికి ఒక మార్గం అన్వేషిస్తారనే నా నమ్మకం."

ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తానూ వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయ నిశ్చయించినట్లు చెప్పారు. రెండు వర్గాలవారు ఈ మధ్యకాలంలో మీరే ముఖ్యమంత్రిగా వుండండని కోరితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా తానూ ముఖ్యమంత్రిగా వుండాలని కోరడం లేదని ఆయన సమాధానం చెప్పారు.అదీకాక అలాంటి ప్రతిపాదనను తానింతవరకు వినలేదని కూడా చెప్పారు. నాయకత్వానికి సంతకాల సేకరణ సరియైన పద్ధతికాదని కూడా ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నాయకత్వం విషయంలో జోక్యం కలిగించుకొమ్మని కాంగ్రెసు అధిష్టాన వర్గానికి మీరు రాశారా అని ప్రశ్నించగా అలా రాయడం సరికాదనీ తానూ రాయలేదని శ్రీ రామకృష్ణారావుగారు చెప్పారు.

ఈ రోజు ఆయన గోపాలరెడ్డి, సంజీవరెడ్డి గార్లను వేర్వేరుగా కలుసుకొని వారితో మాట్లాడారు.నాయకత్వ సమస్యపైనే వారితో చర్చించినట్లు ఆయన చెప్పారు.

Also Read: ఢిల్లీ ముఖ్యమంత్రుల సదస్సు ( 22,23 అక్టోబర్,1955)లో విశాలాంధ్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు.http://visalandhra.blogspot.in/2011/11/blog-post_02.html

'నేను మొదటినుంచీ విశాలాంధ్ర ఏర్పాటును కోరుకున్నాను' : బూర్గుల
http://visalandhra.blogspot.in/2011/11/blog-post_5378.html

9, అక్టోబర్ 2013, బుధవారం

నాటి గజ్వేల్ శాసనసభ్యుని నోటి మాట: ప్రత్యేక తెలంగాణవాదన ద్వారా ఫ్యూడల్ వ్యవస్థ తలెత్తే ప్రయత్నం జరుగుతున్నది

హైదరాబాద్ అసెంబ్లీలో 1955 నవంబర్ 25నుంచి డిసెంబర్ 3 దాకా తొమ్మిదిరోజులపాటు విశాలాంధ్రపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.ఆ సమయంలో పెండెం వాసుదేవ్, గజ్వేల్ శాసనసభ్యులు , ఫ్యూడల్ వ్యవస్థ వారసులైన కొంతమంది విభజనవాదులను ఈ విధంగా తూర్పూరపట్టారు 

" బయటినుంచి ఆంధ్రులు వచ్చి హైదరాబాద్‌లోని తెలంగాణవారిమీద పడి దోచుకుంటారని, వారిపైన పెత్తనం చెలాయిస్తారని ఆలోచించే బదులు అసలు కారణాల్ని గ్రహించాలి... ఇప్పుడిప్పుడే మనం ఫ్యూడల్ సమాజంలోనుంచి బయటపడుతున్నాం. పోలీసుయాక్షన్ వరకు మనం బానిసల్లాగా ఎలాంటి పౌరహక్కులు లేకుండా అణచబడి ఉన్నాం. హైదరాబాద్ చరిత్రలో పెద్దమార్పు వచ్చి మనం స్వేచ్ఛావాయువులను పీల్చే సమయంలో తిరిగి మళ్ళీ పాతకాలం నాటి జాగీర్దారీ వాసనలు ఏర్పడి, ఫ్యూడల్ వ్యవస్థ తలెత్తే ప్రయత్నం జరుగుతున్నది... అది ప్రత్యేక తెలంగాణవాదనద్వారా జరుగుతున్నది.

పోలీసుయాక్షన్ పూర్వం మా భువనగిరిలో కూచిరెడ్డికి ఇల్లుకూడా లేదు. ఈ రోజున 24 గంటలూ కార్లలో తిరుగుతున్నారు. సీతాఫల్‌మండిలో ఒక ఇల్లుకూడా కొన్నారు. వీరు పోలీసువారి వెనక దాక్కొని లూటీలుచేసి బాగా సంపాదించి పోలీసువారి దొంగతనాల్లో వాటా తెచ్చుకుని పంచుకున్న పెద్దమనిషి. ఆయన ఇవాళ తెలంగాణ కావాలంటున్నారు. వీరి పెత్తనం మనకు కావాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిని కప్పిపుచ్చుకోవటానికి వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నారు..."  
http://andhrabhoomi.net/content/telugu-tagavu-6


చదవండి : విశాలాంధ్ర ఏర్పాటుకే మొగ్గు చూపిన హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ (డిసెంబర్,1955)