19, అక్టోబర్ 2013, శనివారం

హైదరాబాద్ తెలుగు ప్రజలందరి సొత్తు!

చార్మినార్ పునాదులు పడక ముందు నుండే గోల్కొండ ఖజానాకు ప్రతీయేటా తీరాంధ్ర ప్రాంతాల నుండి హెచ్చుమొత్తంలో ధనరాసులు తరలివెళ్లాయన్నది ఎంత నిజమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి తెలుగు ప్రజలు అందరూ ప్రాంతాలతో నిమిత్తం లేకుండా పాటుపడ్డారన్నది అంతే నిజం.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కొన్ని రోజులకు ముందే సెప్టెంబర్ 10,1956న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ద్వితీయ ప్రణాళిక మొత్తంలో వేరే పద్దుల్లో కోత పెట్టి 152 లక్షల రూపాయలు వెచ్చించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ ద్వితీయ ప్రణాళిక మొత్తంలో 76 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు.అప్పటినుండి ఇప్పటివరకూ వెచ్చించిన మొత్తానికి రూపాయి విలువకనుగుణంగా లెక్కలు తేల్చి చెప్పడం ఎవరి తరం?ఈనాడు భాషాసంస్కృతులే కాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ఏకీకృతమైన ప్రాంతాలను బలవంతంగా ఎలా విడదీస్తారు. ఆ తర్వాత తలెత్తే పరిణామాలకు ఎవరు భాద్యులు?



విభజనవాద నాయకులు హైదరాబాద్ మహానగరాన్ని బంగారుగుడ్లు పెట్టే బాతులా చూడబట్టే ఈ రోజు మన రాష్ట్రంలో ఈ విభజనవాద చిచ్చు రగిలిందేమో అని అనిపిస్తుంది. వారు ఇన్నాళ్ళు తాము ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమి చేసారు?ఏమి చేయబోతున్నారు?ఇతర ప్రాంతాల ప్రజలను అన్యాయంగా దొంగలు అంటూ మోసపూరిత వాగ్దానాలతో వారిని ఎంత కాలం ఏమార్చుతారు?

1 కామెంట్‌:

  1. హైదరాబాద్ మనది, మనందరిది, తెలంగాణా నాది, రాయలసీమ నాది, కోస్తా నాది, ఆంధ్రప్రదేశ్ మనది, మన తెలుగు వాళ్ళది,

    రిప్లయితొలగించండి