13, అక్టోబర్ 2013, ఆదివారం

బూర్గుల గారి త్యాగం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయం !


'ఆంధ్ర ప్రదేశ్ నాయకుని ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం మంచిది' , విశాలాంధ్ర పత్రిక ( 01/09/1956)



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం శ్రేయస్కరమని తానూ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికీ, ఉప ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారికీ సలహా ఇచ్చినట్లు హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు నేడిక్కడ విలేఖరులతో చెప్పారు. ఆ సంధర్బంలో ఆయన ఇలా ఒక ప్రకటన చేశారు.

"ఆంధ్ర-తెలంగాణాల లీనీకరణ జరుగుతున్న ఈ సమయంలో నాయకత్వానికి పోటీ గాని, తగాదాగాని ఏర్పట్డం శాశ్వత విభేదాలకు దారి తీస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిదికాదు అని నా నిశ్చితాభిప్రాయం. కాబట్టి ఐక్యతకు దోహదమిచ్చే వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆంధ్రప్రదేశ్ నాయకుని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొనేటట్లు చేయడానికి నా పలుకుబడిని వినియోగించాలని సంకల్పించాను. ఇక్కడ ఆంధ్రలోని మిత్రులందరికీ ఈ నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను.ఆంధ్రులు ఒక త్రాటిపై నడవడానికి ఒక మార్గం అన్వేషిస్తారనే నా నమ్మకం."

ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తానూ వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయ నిశ్చయించినట్లు చెప్పారు. రెండు వర్గాలవారు ఈ మధ్యకాలంలో మీరే ముఖ్యమంత్రిగా వుండండని కోరితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా తానూ ముఖ్యమంత్రిగా వుండాలని కోరడం లేదని ఆయన సమాధానం చెప్పారు.అదీకాక అలాంటి ప్రతిపాదనను తానింతవరకు వినలేదని కూడా చెప్పారు. నాయకత్వానికి సంతకాల సేకరణ సరియైన పద్ధతికాదని కూడా ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నాయకత్వం విషయంలో జోక్యం కలిగించుకొమ్మని కాంగ్రెసు అధిష్టాన వర్గానికి మీరు రాశారా అని ప్రశ్నించగా అలా రాయడం సరికాదనీ తానూ రాయలేదని శ్రీ రామకృష్ణారావుగారు చెప్పారు.

ఈ రోజు ఆయన గోపాలరెడ్డి, సంజీవరెడ్డి గార్లను వేర్వేరుగా కలుసుకొని వారితో మాట్లాడారు.నాయకత్వ సమస్యపైనే వారితో చర్చించినట్లు ఆయన చెప్పారు.

Also Read: ఢిల్లీ ముఖ్యమంత్రుల సదస్సు ( 22,23 అక్టోబర్,1955)లో విశాలాంధ్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు.http://visalandhra.blogspot.in/2011/11/blog-post_02.html

'నేను మొదటినుంచీ విశాలాంధ్ర ఏర్పాటును కోరుకున్నాను' : బూర్గుల
http://visalandhra.blogspot.in/2011/11/blog-post_5378.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి