9, అక్టోబర్ 2013, బుధవారం

నాటి గజ్వేల్ శాసనసభ్యుని నోటి మాట: ప్రత్యేక తెలంగాణవాదన ద్వారా ఫ్యూడల్ వ్యవస్థ తలెత్తే ప్రయత్నం జరుగుతున్నది

హైదరాబాద్ అసెంబ్లీలో 1955 నవంబర్ 25నుంచి డిసెంబర్ 3 దాకా తొమ్మిదిరోజులపాటు విశాలాంధ్రపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.ఆ సమయంలో పెండెం వాసుదేవ్, గజ్వేల్ శాసనసభ్యులు , ఫ్యూడల్ వ్యవస్థ వారసులైన కొంతమంది విభజనవాదులను ఈ విధంగా తూర్పూరపట్టారు 

" బయటినుంచి ఆంధ్రులు వచ్చి హైదరాబాద్‌లోని తెలంగాణవారిమీద పడి దోచుకుంటారని, వారిపైన పెత్తనం చెలాయిస్తారని ఆలోచించే బదులు అసలు కారణాల్ని గ్రహించాలి... ఇప్పుడిప్పుడే మనం ఫ్యూడల్ సమాజంలోనుంచి బయటపడుతున్నాం. పోలీసుయాక్షన్ వరకు మనం బానిసల్లాగా ఎలాంటి పౌరహక్కులు లేకుండా అణచబడి ఉన్నాం. హైదరాబాద్ చరిత్రలో పెద్దమార్పు వచ్చి మనం స్వేచ్ఛావాయువులను పీల్చే సమయంలో తిరిగి మళ్ళీ పాతకాలం నాటి జాగీర్దారీ వాసనలు ఏర్పడి, ఫ్యూడల్ వ్యవస్థ తలెత్తే ప్రయత్నం జరుగుతున్నది... అది ప్రత్యేక తెలంగాణవాదనద్వారా జరుగుతున్నది.

పోలీసుయాక్షన్ పూర్వం మా భువనగిరిలో కూచిరెడ్డికి ఇల్లుకూడా లేదు. ఈ రోజున 24 గంటలూ కార్లలో తిరుగుతున్నారు. సీతాఫల్‌మండిలో ఒక ఇల్లుకూడా కొన్నారు. వీరు పోలీసువారి వెనక దాక్కొని లూటీలుచేసి బాగా సంపాదించి పోలీసువారి దొంగతనాల్లో వాటా తెచ్చుకుని పంచుకున్న పెద్దమనిషి. ఆయన ఇవాళ తెలంగాణ కావాలంటున్నారు. వీరి పెత్తనం మనకు కావాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిని కప్పిపుచ్చుకోవటానికి వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నారు..."  
http://andhrabhoomi.net/content/telugu-tagavu-6


చదవండి : విశాలాంధ్ర ఏర్పాటుకే మొగ్గు చూపిన హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ (డిసెంబర్,1955) 

5 కామెంట్‌లు:

  1. స్వాతంత్ర పోరాటం లో కూడా ఇలాంటి వారు ఉన్నారు, స్వాతంత్రము వద్దు బ్రిటిష్ వాళ్ళు ఇండియా కు చాల అభిరుద్ది చేసారు. మనం బ్రిటిష్ కు అనుబందగా ఉందాం అన్న వారు ఉన్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునవును.నిజాం మారాజు తొత్తులు, ప్రజానీకాన్ని పీడించిన దొరలు తెలంగాణా ముద్దు బిడ్డలు.రావి నారాయణ రెడ్డి,మాడపాటి, బూర్గుల, రామానంద తీర్థ, పీవీ నరసింహారావు లాంటి వారు మాత్రం తెలంగాణ ద్రోహులు.మనకు తెలిసింది అంతేకదా. మన పిట్టల దొరకూడా ఆ మాటే చెప్పాడు.

      తొలగించండి
    2. avunu appudu kontha mandhi vishalandhraaa nu maavollu supprt chesinaa mata nijam kani ... majority dhaniki vyathirekam ..alla support chesinaa kaloji kavithaa " evaranukunnaru giltayyethadhi ani chaduvuthe " meeke artham ayyethadi

      తొలగించండి
    3. తెలంగాణా లో ఎప్పటి వరకు కుల గజ్జి లేదు, అది మొదలు పెట్టాడని ప్రయత్నం చేయవద్దు.

      తొలగించండి
    4. తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో గాని, అప్పుడు కొంత మంది కాదు తెలంగాణా అంతటా విశాలాంధ్రవాదం ప్రతిధ్వనించింది. రెండింట మూడువంతుల కన్నా ఎక్కువమంది హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ సభ్యులు, తెలంగాణా గ్రామోద్యోగుల సంఘం సభ్యులు, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కార్యవర్గం,పైన పేర్కొన్న తెలంగాణ ప్రముఖులు, ఎన్నో పురపాలక సంఘాలు,పంచాయితీలు, తెలంగాణా సాయుధ పోరాట యోధులు, సామాన్య ప్రజానీకం అందరూ విశాలాంధ్ర కోరుకున్నారు. ఆఖరికి కేవీ రంగ రెడ్డి,ఆయన మేనల్లుడు చెన్నారెడ్డి కూడా 1953 వరకూ విశాలాంధ్రవాదులే పిట్టల దొర కథలు పక్కన పెట్టి కొంచెం ప్రాంత చరిత్రను చదువుకోండి.

      ఈ లింక్స్ చూడండి http://visalandhra.blogspot.in/2011/12/blog-post_11.html http://visalandhra.blogspot.in/2011/10/blog-post_08.html

      నెహ్రూ హైదరాబాద్ స్టేట్ను మూడు ముక్కలు చేసి బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇస్తే ప్రాంతీయవాదం వెర్రితలలు వేస్తుందేమో అని తటపటాఇస్తే రంగారెడ్డి వంటి కొంత మంది ప్రత్యేకవాదాన్ని తలెత్తుకున్నారు..అది నిజం.

      తొలగించండి