29, జూన్ 2012, శుక్రవారం

మహోన్నత నేత పీవీ

ఈనాడు దినపత్రిక(29/6/2012)



ఘననివాళులు అర్పించిన ప్రముఖులు

దివంగత భారత ప్రధాని పీవీ నర్సింహారావు 91వ జయంతి ఘనంగా జరిగింది. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో జరిగిన జయంతి ఉత్సవంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, బండారు దత్తాత్రేయ, కుటుంబ సభ్యులు పీవీ రాజేశ్వరరావు, పీవీ రంగారావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి బహుదా ప్రయోజనకరమైనాయని ప్రశంసించారు. ఆయనకు భారతరత్న ఇవ్వడంతో పాటు పాఠ్యాంశాల్లో పీవీ జీవిత చరిత్రను చేర్చాలని దత్తాత్రేయ అన్నారు. గురువారం పీవీఘాట్‌ వద్ద సర్వమత ప్రార్థనలు, ఉచిత వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఉచిత కంటి పరీక్షలు చేయించుకునే రోగులకు చుక్కల మందువేసి రోశయ్య శిబిరాన్ని ప్రారంభించారు.దేశానికి దశ, దిశ నిర్దేశించిన మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఆయన తనయుడు పీవీ రాజేశ్వరరావు అన్నారు. గురువారం గాంధీభవన్‌లో పీవీ చిత్రపటానికి ఆయనతో పాటు, పీసీసీ అధికార ప్రతినిధి కమలాకర్‌రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్‌ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.

తెలంగాణ పట్ల నిబద్ధత కలిగి ఉంటూనే.. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్‌ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ, తెలంగాణ పట్ల పీవీ నిజాయితీ, నిబద్ధత సాటిలేనివన్నారు. పీవీ ఎడమకాలి గోటికి, ఆయన చిత్తశుద్ధికి సరిపోనివారు.. వారు ఏ పార్టీ వారైనా.. ఏ ప్రజాసంఘాల వారైనా ప్రత్యేకరాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

7 కామెంట్‌లు:

  1. "పీవీ ఎడమకాలి గోటికి, ఆయన చిత్తశుద్ధికి సరిపోనివారు"

    వెటకారం అదుర్స్. కంపనీ అన్నా, విషవృక్షం అన్నా, భస్మాసుర హస్తం అన్నా, ఎడమకాలి గోరు అన్నా మీకే చెల్లింది. ఇదే వాక్ప్రవాహంలో సాగిపొండి, ఎప్పుడో ఒకప్పుడు పదవీలక్ష్మి వరించక మానదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈత ముల్లులా ఎక్కడో గుచ్చుకుందా ఆ గోరు?! :P మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలాగమ్మా? :))

      తొలగించండి
  2. ఆయన ఏదో మర్యాదగా మాట్లాడాలని కేసిఆర్ కుటుంబ సభ్యుల పేర్లు, కొంత మంది ఇతర వేర్పాటువాద నాయకుల పేర్లు తియ్యలేదనుకుంట! మీరు మాత్రం పీవీ ఎడమకాలి గోటితో వారిని తప్పక పోల్చి చూడండి.విశాలాంధ్రమహాసభ ప్రెస్ రిలీజ్ లో ఇంకా చాలా చెప్పారు.ఈనాడు పత్రిక ఈ వాక్యాన్నే ఎందుకో హైలైట్ చేసి మంచి పని చేసింది

    రిప్లయితొలగించండి
  3. హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌కు ఆ బోఫోర్స్‌గాంధి పేరు తీసేసి, తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు పేరు పెట్టాలని తెలబాన్లు ఉద్యమిస్తే విభజనకు సమ్మతించడం పెద్ద సమస్య కాదు. (నేనైతే బేషరతుగా ఒప్పుకుంటా, లగడ, టి.జి.వెంకిలను ఒప్పిస్తాం :) )
    ఇలాంటి బుర్ర వున్న, ఆత్మగౌరవమైన వుద్యమాలు చేయరే!? ఎప్పుడు చూసినా ఆటవికుల్లా డప్పు కొట్టి గెంతడం, బేరుమని గొంతెత్తి ఒకటే ట్యూనులో కట్టిన పాటలు పాడటం, పోతరాజుల్లా గెంతడం, ఎవడో నిజాం గడ్డం నిమరడం, గోస బ్లాగుల్లో ఏడ్వటం... ఛా!...
    :)

    రిప్లయితొలగించండి
  4. శంకర్ గారూ, వాళ్లు పోతరాజుల్ల గెంతులు వేయడమే కాదు. రోడ్లమీద అర్ధనగ్న కేబరెలు చేసి, ప్రజా ఉద్యమం అంటే గుడ్డలు వేసుకోకూడదు అని భావిస్తూ, సినిమాలలోని కేబరే డాన్సర్లె నయం అనిపించే విధంగా మగ డాన్సర్లు తయారయ్యారు. ఏమైనా అంటే మా తెలంగాణా బాస, యాస, గోస , గోంగూర అని కబుర్లు ఒకటి. ఒక పాట విన్న తరువాత రెండో పాట వింటే ఎక్కడో విన్నాం అనే అనుమానం రావడం సహజం. ఇంక నాలుగో పాట వచ్చేసరికి ఒళ్ళుమండి కనబడితే నీ మొహం మండా ట్యూన్ మార్చ రా అని బూతులు తిట్టాలనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిగ్గా చెప్పారు, రవీంద్రనాథ్ గారు.
      గద్దార్ నుంచి గోరేటి ఎంకన్న దాకా ఒకటే స్వరం, ఒకటే జీర, అదే రాగం, అదే డప్పు, అదే కంబళి. ముఖాలు చూపకుంటే, ఎవరు పాడుతున్నారో గుర్తుపట్టడం కష్టం, అందరూ చీమలదండు నారాయణమూర్తిలా పొలికేకలేసుడు, నిముషానికి 20సార్లు కనుబొమలు ఎగరేసుడు, గెంతుడు - ఇదీ ఆ గానకళావైభోగం. విమలక్కదీ అదే బాణి, వేసిన స్టెప్పులే వేసుడు. :))
      వీళ్ళ బొంగురు స్వరాల దెబ్బకి, హుసేన్సాగర్ బుద్ధ విగ్రహం రాయి కరిగిపోలేదేమిటా అని అప్పుడపుడు ఆశ్చర్యం వేస్తోంటుంది. :)

      తొలగించండి
    2. మిమ్మల్ని చూడమని ఎవరయినా బలవంతం చేసిన్రా? రిమోటు నొక్కి కెవ్వు కేక లాంటి తెలుగు కళారాజములు చూసుకోవచ్చు కదా.

      తొలగించండి