5, జూన్ 2012, మంగళవారం

పరకాల ఉపఎన్నిక లో MCPI పోటీకి 'విశాలాంధ్ర మహాసభ' సంఘీభావం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం తెలుగు ప్రజలకు అత్యంత కీలకం, ఆవశ్యకమైన రాష్ట్ర సమగ్రత పరిరక్షణ విషయంలో దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా ద్వంద్వ వైఖరిని లేదా దాటవేత ధోరణిని అవలంభిస్తున్న ఈ తరుణంలో MCPI పార్టీ వరంగల్ జిల్లా పరకాల ఉపఎన్నికలో సమైక్యవాదానికి బాసటగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు ఆ పార్టీకి సంఘీభావం, అభినందన తెలుపటానికి 'విశాలాంధ్ర మహాసభ' 06/06/2012 (బుధవారం) ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో MCPI పార్టీ ప్రతినిధులు శ్రీ వెంకటరెడ్డి ప్రభుతులు, 'విశాలాంధ్ర మహాసభ' తరపున సంస్థ అధ్యక్షులు శ్రీ నలమోతు చక్రవర్తి, స్వాతంత్య్రసమరయోధురాలు శ్రీమతి శాఖమూరి సుగుణమ్మ, శ్రీ ఆంజనేయరెడ్డి, శ్రీ చేగొండి రామజోగయ్య, శ్రీ కుమార్ యాదవ్ చౌదరి, శ్రీ పీ రవితేజ, శ్రీ కే శ్రీనివాసరెడ్డి ఇంకా ఇతర సభ్యులు పాల్గొంటారు.

Visalandhra.org :Andhra Pradesh Communists held the mantle of Telugu unity for many decades. During the armed uprising against Nizam, it is the Telugu brotherhood that brought together leaders like Puchalapalli Sundarayya and Ravi Narayan Reddy to fight against Nizam. Alas, several communists today have given up the original ideals. While CPI that runs “Visalandhra” wants to divide the state and CPM that stands for integration only pays a lip service. It is in this difficult environment, MCPI party for the last several years, has strongly stood for the geographical integrity of the state of Andhra Pradesh. In fact, late Sri B.N. Reddy and Sri Omkar, I understand, were staunch integrationists.

It is indeed bold of MCPI to stand on a platform of integration in Warangal’s Parkal constituency. We express our gratitude to MCPI candidate Somidi Srinivas for taking a principled position on this issue.

Our electoral politics are no longer won by principles and philosophies. Our elections are won via money, caste, creed, and religion. It is in this difficult electoral environment, we urge the integrationists in the Parkal constituency to support MCPI candidate and make our voices heard.

Visalandhra Mahasabha is conducting a press meet in the Somajiguda Press Club at 11.00 AM on Wednesday, June 6th. Leaders of Visalandhra Mahasabha and MCPI will address the press during this meet. You all are welcome to participate in the event.

16 కామెంట్‌లు:

  1. MCPI అనే పేరు ఎప్పుడు వినలేదే! రాష్ట్రంలో ఎక్కడైనా, ఎప్పుడైనా పోటీ చేశారా? ఏదో దిక్కుమాలిన కమ్యూనిస్ట్ పార్టీలకు మద్దతిచ్చే బదులు CPMకే మద్దతివ్వాల్సింది.
    /CPM that stands for integration only pays a lip service/

    What else is expected to 'pay'?! Only YSRCong can pay more than expected, support that.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. The late Maddikayala Omkar was a CPM MLA for several terms. After he was expelled from CPM, he started his own party called MCPI. The "party" is not recognized by the election commission.

      MCPI "leaders" have been associating themselves with VMS for several months now. ఈ రెండు గాంగులకు పట్టుమని పది మంది సభ్యులు ఉన్నట్టు కనిపించదు. జోగీ జోగీ రాసుకున్నట్టు ఉంది ఈ వ్యవహారం.

      మూడు పార్టీలు మారి ఎక్కడా సందు దొరకని ప్రభాకర్ గారికి గంటకు తగ్గ బొంతే దొరికింది :)

      తొలగించండి
    2. జైగో, ఎలాగూ రాని సీటే కాబట్టి, CPMకి మద్దతివ్వకపోవడం చారిత్రిక తప్పిదం అంటూ తరవాత సారీ చెప్పేయొచ్చు గాని, ఈ సారి ఈ సీటు ముక్కోడు గారు నొక్కేయగరంటారా? మీ కచరా ఎలక్షనైన మరుసటి రోజు ఇచ్చుడు-తెచ్చుడు అని తాజాగా డేట్ ఇచ్చండంట గదా, గొర్రె పెజలు ఇంకా నమ్ముతున్నారా లేదా తెలివిమీరారా?

      తొలగించండి
    3. అన్నా ప్రజలు గొర్రెలు కారు. లేకపోతె పరకాల ప్రభాకర్ పోటీ చేసి నేను కూడా పరకాల వాన్నే అనెటోడు.

      వీఎంఎస్ వాళ్ళు కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వడం కాకతాళీయం కాదు. వాళ్ళ పది సభ్యులలో నలుగురు కామ్రేడులు. చక్రవర్తి గారి "పుస్తకం" కూడా వారికే అంకితం.

      మొన్న మహబూబునగర్ షాక్ పడ్డది కదా, పరకాల ముచ్చట కూడా చూద్దాం. See you on June 15!

      తొలగించండి
    4. జైగోరుకి విషయం అర్థం కానట్టుంది.అరాచక గ్యాంగ్ ల బెదిరింపులకు లొంగక బాహాటంగా సమైక్యవాదానికి నిలబడి పోటీ చేస్తున్న ఒక పార్టీకి సమైక్యవాదులు కొంత మంది చేరి సంఘీభావం, మద్దతు తెలుపుతున్నారు.ఉన్న విషయాన్ని వదిలేసి ప్రభాకార్ గారి బొంత, నేను చీకటిలో నక్కి చూసాను MCPI leaders have been associating with VMS for several months, జోగి జోగి రాసుకున్నాయి అని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు.

      @SNKR గారు, సీపీఏం పరకాలలో పోటీ చేయడం లేదు

      తొలగించండి
    5. పరకాల ప్రభాకరే ఒక పార్టీ పెడితే బాగుండేది. నీది తెనాలి నాది తెనాలి లాగా మీది పరకాల, నాది పరకాల అని వోట్లడగొచ్చు.

      సీమాంధ్రలో గూడా పరకాల పార్టీ పోటీకి దిగితే సీమాంధ్రలో ఎంతమంది సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారో కూడా తెలిసేది.

      తొలగించండి
    6. mcpi(u) party peru anduku vintav nv dikkumalinodivi... mundhu ne mentality marchuko ..mcpiu party gurinchi nekem telsu dikkumalinodiki dikkumalina partylu matrame telusthaye .....asalu oka party ne tidthunnav nev 100 rupayalu mandhu teskokunda vote vesava? avadina avi panchuthunte vatini addukunnava? praja seva cheyadam kosam, puttina party mcpi(u) party......vallu dabbulu pancharu .....media mundhu bilduplu evvaru .....samasa pariskaram kosam matrame poradutharu... evala puttina party kuda andariki telsu kani 1986 lo puttina party gurinchi avadiki telyadu .andukante burjava party kadu adhe dhongala party la tho kalisthe easy ga meku telsuthundi....eroju tdp,congres,trs,prp,navatelangana,ela anno partyla MLA la asthulu perigi pothunna avi ala perigayo avadina alochinchada? Ledu...adhe comminist party leaders asthulu ala unnaye..OMKAR MADDIKAYALA 4 times MLA undataniki kanisam oka ellukuda ledu..BN REDDY garu MP undataniki ellukuda ledu..mundu nv andho telsukoni vimarshinchu .,......
      FRM:KONDAGORLA CHANDRASHEKAR

      తొలగించండి
  2. నాన్నా పందులే గుంపుగా వస్తాయి...సింగం సింగిల్ గానే వస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనీసం వోట్లు అయినా పదులలో వేయించుకోండి, మరీ సింగులు డిజిట్ కాకుండా!

      తొలగించండి
    2. ఏం ? ఎవర్నీ వదలకుండా వట్లు పెట్టించేసుకున్నారా ?

      తొలగించండి
  3. The account of visalandhra.org has been suspended.

    http://visalandhra.org/cgi-sys/suspendedpage.cgi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Domain has been registered till 2013. It could be something to do with the hosting.

      might be financial problems....అందరికీ వసూళ్ళు ఉండవుకదా ...

      తొలగించండి
    2. అందరికీ వసూళ్ళు ఉండవుకదా ...

      haa haa haa... rightO , John.

      తొలగించండి
    3. Jai Gottimukkala is such a great follower of integrationalist forums. Thanks to his timely action of pointing it out,web hosting account is restored

      తొలగించండి
  4. తెలంగాణ నాయకులు మరియు మేధావులు తెలంగాణ ప్రజలను ఇంకా ఇంకా మభ్య పెట్టడం ఒక చిల్లర వ్యవహారంలా ఉంది.
    ఐతే ఇంకోలాగా చూస్తె వీరిని వీరే మభ్య పెట్టుకునే ప్రయత్నం అనిపిస్తోంది.

    జగన్, అయన పార్టీ ఈరోజు వరకు తెలంగాణ సమస్య మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. ఐనప్పటికీ ఒక గట్టి శక్తిగా ఎదిగాడు.
    గెలిచారు కనుక తెరాస వారు ఏమైనా చెప్తున్నారు. కాని వరంగల్ జిల్లాలో, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్ధుల మరియు జాక్ సమర్ధన ఉండి కూడా జగన్ గాలిని పూర్తిగా అడ్డుకోలేక పోయారు.
    రాబోయే రోజుల్లో జగన్ కొరకు రాజీనామా చేసే వారిని వీరు ఎదుర్కోనగలరా?
    మరి జగన్ సమర్ధన లేకుండా తెలంగాణ వస్తుందా?

    దీనికి వీరు చాల (అతి)తెలివి విశ్లేషణ చేస్తున్నారు. వీరి ఉద్దేశంలో కాంగ్రెస్సుకు ఇక గత్యంతరం లేదు.
    వారు సీమాంధ్ర లో పూర్తిగా దెబ్బతిన్నారు కనుక తెలంగాణ ఇచ్చి తెరాసతో పొట్టు పెట్టుకుంటే కొన్ని స్థానాలు గెలుచుకోవచ్చు.
    పాపం వీరికి కాంగ్రెస్సు పద్ధతులు ఇంకా అర్ధం కానట్టుంది.
    2008 అణు ఒప్పందం విషయంలో వామ పక్షాలు అడ్డుపడితే యాభయ్ మందికి పైగా సభ్యులను 'మానేజ్' చేసారు. అందులో ముగ్గురు తెలంగాణ వారుకూడా ఉన్నారు.
    ఈరోజున పంతొమ్మిది సభ్యులు ఉన్న మమత బెదిరిస్తే, మళ్ళీ ములాయంని 'మానేజ్' చేసి, నీదారి నువ్వు చూసుకో అని (చెప్పక) చెప్పారు.
    మరి తెరాస ఇచ్చే ఐదో పదో సభ్యుల కోసం ఏకంగా రాష్ట్రం ఇచ్చేస్తారా?
    ఇంకొక విషయం ఏమిటంటే ఒకటి తరువాత ఒకటిగా చాలా రాష్ట్రాలలో పట్టు కోల్పోవడం కాంగ్రెస్సుకు అలవాటై పోయింది.
    వారు పెద్దగా ఆందోళన పడుతున్నట్టు అనిపించదు. ఎందుకంటే అందరికి ఒక్క విషయం స్పష్టంగా తెలుసు.
    కేంద్రంలో నూట యాభయ్ కు ఫై చిలుకు స్థానాలు గెలిచినంతకాలం కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది.
    చాలా చిన్న చితక పార్టీలు అమ్ముడు పోతూనే ఉంటాయి.

    ఐతే ఒక్కటి వీరి ఆశలు నిజమయ్యే అవకాశం లేకపోలేదు. ఈరోజున పెద్దమ్మ, అదే మన సోణమ్మ లీలలు ఎవరికీ తెలియడంలేదు. ఆ తల్లే తెలంగాణ తల్లి ఐతే ఆశ్చర్యపడనవసరంలేదు.

    రిప్లయితొలగించండి
  5. /అదే మన సోణమ్మ లీలలు ఎవరికీ తెలియడంలేదు. ఆ తల్లే తెలంగాణ తల్లి ఐతే ఆశ్చర్యపడనవసరంలేదు./
    :)) తల్లో బైలెల్లినాదో ... అనే కట్ట మైసమ్మ మాత్రమే అనుకున్నా, తెలంగాణ తల్లికూడా ఆమేనా! ?

    రిప్లయితొలగించండి