31, ఆగస్టు 2012, శుక్రవారం

కె.సి.ఆర్.అవాకులు..చెవాకులు..

                    సాధారణ శాంతి భద్రతలకు,   దేశ సార్వభౌమత్వానికి భంగకరం కాని   రీతిలో ఎవరైనా తమ  కోర్కెల  సాధన కోసం ఉద్యమాలు చెయ్యడం రాజ్యాంగబద్ధమే కనుక దాన్ని  ఎవ్వరూ తప్పుబట్టబోరు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమాన్ని కూడా  - అది పెడ పోకడలు పోనంతవరకూ-వ్యతిరేకించాల్సిన అవసరం  కూడా ఎవరికీ లేదు      ఈ దేశ ప్రజలకు - ప్రత్యేకించి  ఈ రాష్ట్ర ప్రజలకు -- ఉద్యమాలు కొత్తవేమీ  కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారు చెప్పుకునే స్వేచ్చ ఉంది.    అయితే  ఇటీవల  కొందరు ప్రత్యేక తెలంగాణ  ఉద్యమ నేతలు     ప్రజలను రెచ్చగొట్టడానికి  బాధ్యతారహితంగా తమకు తోచినట్లు మాట్లాడడం   సర్వ సాధారణం అయిపోయింది.  ఎప్పటికప్పుడు తన ఉత్తేజ పూరిత ఉపన్యాసాలతో  జనాన్ని ఆకట్టుకుంటూ,  అబద్ధాలు చెప్పి  వారిని రెచ్చగొడుతూ,తన పబ్బం గడుపుకుంటూ వస్తున్న  టి.ఆర్.యస్.అధ్యక్షుడు కేసీఆర్ తాజాగా ఇందుకోసం  చరిత్ర వక్రీకరణకు కూడా పూనుకోవడం దారుణం.

                        ఇటీవల ఆయన తవ్వి తీసిన చారిత్రక విశేషం--నన్నయ్య తెలుగులో ఆదికవి కాడనీ,ఆయన   సంస్కృత   మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం మాత్రమే చేసినందున ఆయన కేవలం అనువాదకవి మాత్రమేననీ. ‘బసవపురాణం'రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆదికవి అని తేల్చారాయన.’ ఈ ముచ్చట కూడా ఆంధ్రోల్లు అబద్ధం చెప్తరు. నేను ఇట్లా అంటే వాల్లు కొట్లాటకు వస్తరు. పక్కన ఓ కవి (నందిని సిద్దారెడ్డి) ఉండడం వల్ల ఈ మాట.ధైర్యంగా చెబుతున్నా’ ననికూడా సెలవిచ్చారాయన.

                           అలా కేసీఆర్ అలనాటి మహాకవులకు కూడా నేటి మన ప్రాంతీయ తత్త్వపు బురదను అంటించాలని చూడడం క్షమించరాని నేరం.పాల్కురికి సోమనాథుడు నేడు తెలంగాణ అని పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనే నమ్మకంతోనే, మితిమీరిన ప్రాంతీయ అభిమానంతో  ఆయన  అలా సోమనాథ కవిని ఆదికవిని చేయబూనారనేది స్పష్టం.  నన్నయ్య నేడు ఆంద్ర ప్రాంతంగా పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనేది నిర్వివాదాంశం. అయితే మహాభారత అనువాదాన్ని ఆరంభించిన నన్నయ్య భట్టు (క్రీ.శ.1026 ప్రాంతం) కంటే ‘కుమార సంభవ' కావ్యం రాసిన నన్నెచోడుడు ముందరివాడని  మానవల్లి రామకృష్ణ కవి గారి వంటి ప్రముఖ విమర్శకులు  కొందరు వాదించినా, నన్నయ్యే ఆదికవి అని    హెచ్చుమంది సాహిత్య చరిత్రకారులు తేల్చారు..అందుచేతనే తెలంగాణకు చెందిన  మహాకవి సినారె ‘ఆదికవి నన్నయ్య అవతరించిన నేల’ అంటూ ఓ సినీ గీతంలో  కూడా రాశారు. ఇక ఇప్పుడు , క్రీ.శ.1300 ప్రాంతంలో  ‘పండితారాధ్య చరిత్రము' రాసిన  పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి  అంటున్నారు కేసీఆర్. పోనీ   భారతం అనువదించిన నన్నయ్య లాగానే  ‘కుమారసంభవం' అనే సంస్కృత కావ్యాన్ని అనువదించిన నన్నెచోడుడు, ‘గణిత సార సంగ్రహం ‘ అనే అనువాద గ్రంథం రాసిన పావులూరి మల్లన్నలు  కూడా  అనువాద కవులే కనుక   కేసీఆర్ లెక్క ప్రకారం  వారిరువురూ కూడా  ఆదికవి  గౌరవానికి  తగినవారు కాదనుకుందాం.  తేనెలొలికే తేట తెలుగులో ‘సుమతీ  శతకం', ‘నీతి శాస్త్ర ముక్తావళి' అనే రాజనీతి గ్రంథం రాసిన  బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా?  పోనీ చాళుక్య యుగానికే    చెందిన తెలుగు కవులు  వేములవాడ భీమకవి, అమృత నాథుడు వీరి కంటికి ఆనలేదా ?  నేటి తూర్పు గోదావరి జిల్లా దాక్షారామానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు (జననం క్రీ.శ.1140) ‘శివ తత్త్వ సారం’ అనే  తెలుగు శతకం రాసినట్లు కూడా కేసీఆర్ కు తెలియకపోవడం చిత్రం !   మరీ విచిత్రమేమిటంటే ఆ మల్లికార్జున పండితారాధ్యుని అనంతరం ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' పేరుతో క్రీ. శ.1300 లో కావ్యం రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ‘ఆదికవి ‘ అని శ్రీవారు తీర్మానించడం !!   కేసీఆర్ గారి ఈ చారిత్రక హ్రస్వ దృష్టికి కారణం మితిమీరిన వారి ప్రాంతీయ దురభిమానమేనని వేరుగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.  ఇప్పుడిక మల్లికార్జున  పండితారాధ్యుని కంటే ఆయన చరిత్రను ద్విపద కావ్యంగా రాసిన పాల్కురికి సోమన ముందరికాలానికి చెందినవాడని నిరూపించే  దుస్సాహసానికి కేసీఆర్ పూనుకోరు కదా !!!

                    ఇక కేసీఆర్ చే  ‘ఆదికవి'గా గుర్తించబడిన పాల్కురికి సోమన వాస్తవంగా  ఏ ప్రాంతానికి చెందినవాడో విచారిద్దాం. ‘బసవ పురాణం', ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' అన్న కావ్యాలు రాసిన పాల్కురికి సోమన ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని సమకాలికుడని కొందరి భావన. దీనికి ఆధారం పిడుపర్తి సోమన అనే కవి రాసిన ‘బసవ పురాణం'లో పాల్కురికి సోమన ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవాడని చెప్పడం. అతడు బహుశా క్రీ.శ.1296-1323 మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన  రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికుడని  మనం  భావించినా, అతడు ఓరుగల్లుకు చెందినవాడని నిర్ధారించడం కష్టం.ఓరుగల్లుకు 70 మైళ్ళ దూరంలో ఉన్న పాలకుర్తే ఒకనాటి సోమనాథుని స్వస్థలం అయినట్టి పాలకురికి అని కొందరి భావన. కాని ఈ సిద్ధాంతం సర్వజనామోదం పొందలేదు. సువిశాలమైన కాకతీయ సామ్రాజ్యంలో నాడు దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాలు అంతర్భాగాలు. ఆ సువిశాల సామ్రాజ్యంలో ప్రతాపరుద్రునికి సమకాలికునిగా సోమనాథుడు   ఉన్నాడని అంటే, వరంగల్ జిల్లా పాలకుర్తే    సోమనాథుని స్వస్థలం పాలకురికి అని నిర్ధారించబూనడం  తొందరపాటు కాగలదు. పాలకుర్తి , పాల కురికి గ్రామనామాలు వేర్వేరు. తెలంగాణ వీరవనిత ‘చాకలి ఐలవ్వ ‘ గా ప్రసిద్ధురాలైన చిట్యాల ఐలమ్మ స్వస్థలం పాలకుర్తి. ఇక ఇప్పుడు నాటి కాకతీయ సామ్రాజ్యంలో పాలకురికి గ్రామం ఎక్కడ ఉన్నదో పరిశీలిద్దాం.

              నిజాం  రాష్ట్రపు గ్రామనామాల పట్టికను నిశితంగా పరిశీలించిన విఖ్యాత పరిశోధకులు డా.చిలుకూరి నారాయణ రావు వరంగల్ జిల్లాలో అసలు పాలకురికి అనే పేరుగల గ్రామమే లేదని తేల్చారు.  మరో పరిశోధకులు ఆర్. నరసింహాచార్యులు గోదావరి జిల్లాలోని పాల కురికి గ్రామమే సోమనాథుని జన్మస్థలమని   పేర్కొన్నారుగానీ ,  వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలలోనూ పాలకురికి పేరుతో గ్రామమేదీ లేదు.  కిట్టెల్ పండితుడు  దక్షిణ మహారాష్ట్రలో పాలకురికి పేరుగల ఒక గ్రామముందని పేర్కొన్నారు.అయితే సోమనాథుని భాష, శైలి వగైరాలను పరిశీలిస్తే అతడు దక్షిణ మహారాష్ట్రకు చెందినవాడయ్యే అవకాశమే లేదు.కన్నడ భాషలో ‘కురికి', ‘గురికి' శబ్దాలు గ్రామానికి పర్యాయపదాలు.మన తెలుగులో కుర్రు (కసుకుర్రు,బోడసకుర్రు మొ.), కుచ్చి (పోతుకుచ్చి మొ.), తమిళ భాషలో కురిచ్చి (పాంచాల కురిచ్చి మొ.) శబ్దాలు ఇలాంటివే. కుర్రు శబ్దం కొన్ని గ్రామనామాలలో కాల క్రమంలో ‘కుర్తి' (పాలకుర్తి, చీమకుర్తి మొ.) గానూ, మరికొన్ని గ్రామనామాలలో ‘కూరు' (నిమ్మకూరు, పొదలకూరు)గానూ రూపాంతరం చెందింది. అలా పాలకుర్తి గ్రామనామం యొక్క  పూర్వరూపం ‘పాలకుర్రు' అవుతుందే కానీ ‘పాలకురికి' అయ్యే అవకాశమే లేదు.

పైపెచ్చు కురికి, గురికి శబ్దాలతో అంతమయ్యే గ్రామనామాలు కన్నడ దేశంలోనే ఉన్నాయి.సోమనాథుడు తెలుగులో మహాకవి. కన్నడ  భాషలోనూ    కొన్ని రచనలు చేసాడు. ఉభయ భాషలు మాట్లాడే ప్రజలు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.అతడి భాష, శైలి వగైరాలు  కూడా అతడు కన్నడ భాషా ప్రభావం ఉన్న ప్రాంతానికి చెంది ఉంటాడని సూచిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రం తుమ్కూరు తాలూకాలో పాలకురికి పేరు గల ఓ గ్రామం ఉంది.ఇది మన అనంతపురం జిల్లా మడకసిరకు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఉంది.కన్నడిగులు దీనినిప్పుడు హాలకురికి
అంటున్నారు.  ఇదే సోమనాథుని జన్మస్థలమని  డా. చిలుకూరి అభిప్రాయపడ్డారు.ఇది సమంజసమే.ఎందుకంటే కన్నడ భాషలో ‘ప' శబ్దం ‘హ' గా పలుకబడుతుంది. పల్లిని వారు ‘హళ్లి' అంటారు. పులిని ‘హులి' అంటారు.పామును ‘హావు' అంటారు. మనం ‘పాల పరిమి ‘ అనే గ్రామాన్ని వాళ్ళు ‘ హాల హరివి ‘ అంటారు..అలానే పాల కురికి గ్రామనామం  కన్నడిగుల పలుకుబడిలో ‘హాల కురికి'గా మారిందనేది సుస్పష్టం.

                       ఇంత చర్చించిన తరువాత , భాషా సరిహద్దులు లేని నాటి కాకతీయ రాజ్యంలోని  (నేటి కర్నాటక రాష్ట్రంలోని ) పాలకురికి కి చెందిన  ఓ మహాకవిని , ఆయన్ని  తనకు తాను  నేటి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని భావించేసి, ఆ కారణంగా ఆయన్ని  కూడా  తన ప్రాంతీయ దురభిమానపు కళ్ళద్దాలలోంచి చూస్తూ,  (నేటి  కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందిన )   నన్నయ్య స్థానంలో ఆదికవిని చేయబూనే కేసీఆర్ చర్య  ఎవరికైనా జుగుప్స కలిగించక మానదు. ఒకవేళ ఆ మహాకవి నిజంగా తెలంగాణ కు చెందినవాడే అనుకున్నా, ఏరకంగా చూసినా ఆయన తెలుగులో  ఆదికవి కాబోడనేది సుస్పష్టం.రాజకీయనేతలు జనం మనోభావాలు రెచ్చగొట్టడానికి పలికే పచ్చి అబద్ధాలలో భాగమే కేసీఆర్ పలికిన ఈ అవాకులు, చెవాకులు.అంతకంటే వాటికి ఎటువంటి విశ్వసనీయత లేదు.

                           నేటి కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందినంతమాత్రం చేత నన్నయ్య తెలుగులో ఆదికవీ, తెలుగు ప్రజల ఆరాధ్యకవీ కాకుండా పోతాడా ? భాషకు రాష్ట్ర, ప్రాంతీయ ఎల్లలు విధించడం సమంజసమేనా ? నేటి తెలంగాణ ప్రాంతానికి చెందిన  సురవరం ప్రతాపరెడ్డి, వానమామలై వరదాచార్యులు, పల్లా  దుర్గేశ్వర శర్మ, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, సినారె, బిరుదురాజు రామరాజు వంటి  గొప్ప సాహితీవేత్తలను  ఎటువంటి సరిహద్దులు లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన  తెలుగువారైనా అభిమానిస్తారు. ఇందుకోసం ఆ అభిమానులు   కూడా తప్పనిసరిగా నేటి తెలంగాణ ప్రాంతంలో పుట్టాల్సిన అవసరమేమీ లేదు.భాషా, సాహిత్యాలు, కళలను  అభిమానించడానికి, ఆ యా సాహితీమూర్తులు, కళాకారులను ఆరాధించడానికి  మన  మనస్సులో మనం ఏర్పరచుకున్న ప్రాంతీయ అడ్డుగోడలు ఎన్నటికీ ఆటంకం కాబోవు.ఎంచేతంటే అవి సార్వకాలీనమైనవేకాక, సార్వజనికమైనవి కూడా!!

         తెలుగుతల్లి స్థానంలో కేసీఆర్ తెలంగాణ తల్లిని కొత్తగా ప్రవేశపెట్టారు.  ఆమేమో మాత అట; తెలుగుతల్లేమో దయ్యమట.తెలుగు ఆణెము - అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం - అనే అర్థంలో ఆ ప్రాంతాన్ని తెలంగాణము  అన్నారని కేసీఆర్ మరచినట్లున్నారు.  యాసలో కొంత తేడా ఉన్నా,  అక్కడి వారిదీ, ఇక్కడి  వారిదీ- ఇరువురిదీ తెలుగు  మాట్లాడే ప్రాంతమే. కాకపోతే ఈ రెండు ప్రాంతాలవారూ  సుదీర్ఘ కాలంపాటు పరాయి పాలనలో మగ్గారు. ఒకరు నిజాం  నిరంకుశత్వంలో కనలిపోతే, మరొకరు బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పదఘట్టనల కింద నలిగి నల్లేరయ్యారు. ఆంద్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు నిజాం పాలన యొక్క దాస్య సంకెళ్ళనుంచి ప్రజల్ని విముక్తం చేసే పోరాటంలో ముందు పీటీన నిలిచాయి. ఆ పోరాటంలో తెలంగాణ వీరులతో భుజం కలిపి నిలిచిన ఎందఱో కోస్తా ఆంద్ర ప్రాంత యోధులు సైతం నేలకొరిగారు.  ఇప్పుడు కొత్తగా ‘ఒకరిది తెలుగు భాష  - ఇంకొకరిది తెలంగాణ భాష ‘ అంటూ శ్రీవారు కొత్త పల్లవి అందుకున్నారు. ఇద్దరిదీ తెలుగు భాషే కాకపోతే విశాలాంధ్ర నిర్మాణానికీ, అందుకోసం  ముందుగా తెలంగాణ  విముక్తికీ , కోస్తా ఆంద్ర ప్రజలు ఎందుకు ఉద్యమించారు ? ఎందఱో త్యాగధనులు ఆ సాయుధ రైతాంగ ఉద్యమంలో అసువులెందుకు  కోల్పోయారు ?  

                   ‘ఆంధ్రమాత స్థానంలో ఆంధ్రోల్లు తెలుగుతల్లిని  కొత్తగా ముందుకు తీసుకు వచ్చా ‘రంటూ  మరో పచ్చి అబద్ధం పలికారు కేసీఆర్.  నిజానికి ఆంధ్రము , తెలుగు - ఈ రెండు పదాలనూ తెలుగువారు ఒకే అర్థంలో ప్రయోగించారు.’మాతా నీకిదే వందనం..ఆంద్ర మాతా నీకిదే వందనం' అనీ ,‘ మా తెలుగుతల్లికీ మల్లెపూదండ' అనీ, ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..గతమెంతో ఘన కీర్తి కలవోడా..’ అనీ తెలుగు ప్రజలు ఇష్టంగా పాడుకునే   పాటలన్నీ  తెలుగు కవులు ఇంచుమించుగా ఒకే కాలంలో సృష్టించారు.  ఇంతకాలం విభజనవాదులు తెలంగాణ పది జిల్లాలలో ‘ఆంద్ర' అనే శబ్దం మీద వ్యతిరేకత కలిగించే ప్రయత్నం చేశారు.ఇప్పుడేమో ఏకంగా ‘తెలుగు’అనే శబ్డంపైనే వారు కత్తి కట్టారు. ప్రజల్ని ఇంకా ఎక్కడికి తీసుకుపోదలచారో వారు ? ‘తెలుగు', ‘ఆంద్ర' శబ్దాలను ఒకే అర్థంలో వాడారు కనుకనే మెదక్ జిల్లా జోగిపేటలో తెలుగువారిని ఏకం చేసే ఉద్దేశంతో జరిపిన సభను  ‘ప్రథమ ఆంద్ర మహాసభ ‘అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ లోని తెలుగువారు స్థాపించుకున్న గ్రంథాలయానికి ‘శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయం' అని పేరు పెట్టుకున్నారు.బొగ్గుల కుంటలో ‘ఆంద్ర సారస్వత పరిషత్తు' వెలిసింది.’ఆంద్ర మహిళా సభ' అలాగే స్థాపించుకున్నారు.మాడపాటి హనుమంతరావు గారిని ‘ఆంద్ర పితామహ' అని పిలుచుకున్నారు. తెలుగువారిని ఒక్కటి చేసి,  భాషాభివృద్ధి ద్వారా వారి మధ్య సాంస్కృతిక సమన్వయం  సాధించే ఉద్దేశంతో ఏర్పరచిన  తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం సంగతి సరేసరి. అప్పుడు పనికొచ్చిన ‘ఆంద్ర', ‘తెలుగు' పదాలు ఇప్పుడెందుచేత  గిట్టనివిగా అయ్యాయో శ్రీవారే సెలవివ్వాలి. అంతేకాదు;  ‘ఆణెము ‘ అంటే దేశము అనే అర్థం ఉన్న  కారణంగానే ‘తెలుగు మాట్లాడే ప్రదేశము ‘అనే అర్థంలో తెలంగాణ అనే శబ్దం ఏర్పడితే, తీరా ఇప్పుడు  ‘మా  ప్రజలు మాట్లాడేది తెలుగు కాదు ; మా తల్లి తెలుగుతల్లి కాదు’ అని నొక్కి వక్కాణిస్తున్న  కేసీఆర్ తన మాటలవెనుక ఆంతర్యమేమిటో కూడా సెలవివ్వాలి. ఆత్మలు ఉండడమే కనుక నిజమే అయితే ‘తెలుగువాడవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడేదవు సంగతేమిటిరా; అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా ?’ అని చురకలు అంటించిన కాళోజీ నారాయణరావు గారి ఆత్మ  కేసీఆర్ తీరు చూసి ఘోషించి తీరుతుంది.
                        
                  కోస్తా ఆంద్ర, రాయలసీమ ప్రజలను కించపరుస్తూ, ‘అక్కడ పన్నుల ఎగవేత ఎక్కువ.వాల్లు చట్టాలను ఉల్లంఘిస్తారు.’ అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు   కేసీఆర్. రాష్ట్రంలోని ఎన్నో పరిశ్రమలు వాటి కార్యాలయాలను సౌలభ్యం కోసమని హైదరాబాద్ లో పెట్టుకుని, అక్కడే పన్నులు చెల్లిస్తున్న కారణంగానే హైదరాబాద్ ఆదాయం, అందుచేత తెలంగాణ ఆదాయం ఎక్కువగా  కనిపిస్తూ ఉన్నదనే వాస్తవాన్ని  అక్కడి ప్రజలు గ్రహించకుండా  ఇంకా ఎంతకాలమో  తాను వారి కళ్ళకు గంతలు కట్టలేనని   కేసీఆర్ గుర్తిస్తే మంచిది.ఒకప్రాంత ప్రజలంతా నిజాయతీపరులుగానూ,   మరో ప్రాంత ప్రజలంతా పన్ను ఎగవేతదారులుగానూ ఉండడం ఎలా సాధ్యమో, ఈ కుతర్కం పన్నిన కేసీఆరే వివరించి ఉంటే బాగుండేది.

                   విద్వేషం అనే విషం చిమ్మే ఇటువంటి వారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇలాంటివారిని జనం నిలదీసి, ప్రశ్నించే రోజు రావాలని కోరుకుందాం.

                                                                                                            -ముత్తేవి రవీంద్రనాథ్

29, ఆగస్టు 2012, బుధవారం

తేనెలొలుకు తెలుగు

నేడు ప్రపంచంలో ఎన్నో ప్రాంతీయ భాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన మాట వాస్తవం. వాటిలో తేనెలొకు మన తేట తెలుగు భాష ప్రస్తుతాని కైతే ప్రమాదం లేదని ఢంకా భజాయించి చెప్పొచ్చు. వేయి సంవత్స రాలకు పైగా తలవంచకుండా రెపరెపలాడుతున్న ఘనచరిత్ర కలి గిన మాతృ భాష మనది. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా పేరుగాం చిన తెలుగు వెలుగు... వెలవెలబోయే పరిస్థితి కనీసం మనత రం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష మహా సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులో కాలుష్యం పెరగదు! అయితే, నానాటికీ మనం పెంచి పోషించుకుంటున్న ‘మమ్మీ, డాడీ’ల సంస్కృతి ఇలాగే కొనసాగితే మాత్రం... తెలుగు భాషకు భవిష్యత్తులో ఆటంకం తప్పదు. కనుక, మన తెలుగు భాషను కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత నేటి తెలుగు యువలోకానిదే అని తెలియజేస్తూ... ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సూర్య’ ప్రత్యేక కథనం...

logo1
భావ వ్యక్తీకరణలో భాష అత్యంత ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని భాషల ఆధిపత్యమే నడుస్తున్నా... ఎవరికివారికి మాతృభాషపై ఉన్న మమకారం ప్రత్యేకమైందే. ఇలా మాతృభాష గురించి చె ప్పేటప్పుడు మన తెలుగు గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే, మాటకై నా... పాటకైనా మన శైలిలో ఉన్న ప్రత్యేకతే వేరు. అమ్మలా కమ్మనైనది.. మాధుర్యంలో అమృతానికి మించినది.. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’గా గుర్తింపు పొందింది.. ఇలా మన తెలు గు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అచ్చతెలుగు నుడికారాలు, ఛందస్సులు, పద ప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాలవారీగా యాసలు... మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ద్రవిడ భాషల్లోకెల్లా మన అక్షర మాలది ప్రత్యేకమైన గుర్తింపు. ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడ నేను తెలుగొకొండ, ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. అలా అనడమే కాదు... మన తెలుగు గొప్పదనం దశదిశలా చాటేం దుకు తన వంతు కృషి చేశారు. ఆదికవి నన్న య మొదలు... ఈకాలం ప్రముఖుల వరకూ ఎందరో మహానుభావులు మాతృభాష గొప్ప దనాన్ని మరింత ఇనుమడింప చేశారు.

మన భాషలో, భావనలో... మన సంస్కృతి లో, సంప్రదాయంలో అన్నింట్లోనూ తెలుగే. అలాంటి తెలుగు భాషాభ్యున్నతి కోసం ఎనలే ని సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వాడుక భాషలో భోధన జరగాలంటూ... రామ్మూర్తి పంతులు ఉద్యమించారు. దాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు. వ్యవహారిక భాషా పితామహుడిగా కీర్తి గడించారు. ఇలా తెలుగు వెలుగు కోసం... ఓ చిలకమ ర్తి, ఓ గురజాడ, ఓ కందుకూరి వీరేశలింగం వంటి ఎందరో మహానుభావులు కృషి చేశా రు. ఆంధ్రులైన మనమే కాదు... తెల్లదొరలు సైతం మన భాషను చూసి మురిసిపోయారు. చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ లాంటి మహాశయులు... తెలుగు భాష వ్యాప్తికి తమవంతు చేయూత నందించారు. తెలుగును భారత ప్రభుత్వం కూడా ప్రాచీన భాషగా కూడా గుర్తించింది.

అయితే ప్రపంచకీరణ నేపథ్యంలో ఆంగ్ల విద్య వ్యామోహంలో పడి ఇప్పుడు తెలుగును చిన్నచూపు చూస్తున్నారు. ఈ పరిణామం సాహితీవేత్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎంతో ఘనచరిత్ర ఉన్న మన తీయ నైన తెలుగును పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని పలువురు భాషా వేత్తలు పిలుపిస్తున్నారు

భాషా సేవలో మనమెక్కడ?

శాస్త్ర / సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific / Technical Jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుం ది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికో ప్ర త్యేక దినోత్సవం పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషిస్తూ... భాషకు కొత్త ఊపిరూదాలి. నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మా త్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంత రీకరణలు (Transformations), యుద్ధా లు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాష కు మన రోజువారీ సంభాషణలే ప్రాణవా యువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి.

అదేంటంటే తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని / అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం ఇవి ఎంతమంది చేస్తున్నారు? ‘ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అన్న సామెత’ మనదే! దురదృష్టవ శాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్టం చేయటం ఎంత అవసరమో కాలానుగుణంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడు కోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ ఎప్పుడో బళ్ళో చదువు కుని వదిలేసిన సంగతులు! సంధులు, సమా సాలు, ఛందస్సు అనవసర కష్టాలు.

తెలుగు భాషోద్యమం...

 
annamayya1 


సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు. ఆయన ఈ ఉద్యమాన్ని ప్రా రంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కా వొస్తోంది. గ్రాంథిక భాషలో రచనలు చేయని వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉం డాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, స వాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రా చుర్యంలోకి తెచ్చిన కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సం ఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది ఆ సంస్థ ప్రధాన ఆశయం. 45 ఏళ్ల తర్వాత కూ డా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఐక్యరాజ్య స మితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యా ప్తంగా అంతరించిపోతున్న మాతృభాషల్లో తె లుగు కూడా ఒకటని, దీని కి రెండు దశాబ్దా లలోపు సమయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.


kavulu 
ఇవి చేయాలి...

1. అధికార భాషా సంఘం చిత్తశుద్ధితో పని చేసి వెంటనే కార్యాలయాలన్నిటిలో తెలుగు భాషనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పదకోశాలలో కృత్రిమమైన అను వాదాలను సవరించాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువాదాలుండాలి గానీ అనువాద కుల పాండిత్య ప్రతిభ ప్రదర్శనకు వేదిక కాకూడదు.
2. బహుళ వాడుకలో ఉన్నా ఇతర భాషా ప దాలను యథాతధంగా వాడటం వలన నిరక్ష రాస్యులకు కూడా సులువుగా అర్థమవుతా యి. ఉదాహరణకి రైలు, బస్సు, రోడ్‌ మొద లయినవి. వీటిని మన భాషా పటిమతో అను వాదం చేసి అందర్నీ గందరగోళపరిచే పని మానుకుంటే అదికార భాష అమలు సులభసాధ్యమవుతుంది.
3. ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్ల అవసరా న్ని సాకుగా చూపి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న కార్పోరేట్‌ కాలేజీలను నియత్రించాలి.

4. ప్రాచీన భాష హోదా కేవలం నిధులు సాధించడం, ఖర్చు చెయ్యడం కోసం కాక వాస్తవంగా పరిశోధన, ప్రచురణ మొదలైన వాటికోసం మాత్రమే... కావాలి.
5. ఏ విషయాన్నైనా ప్రజాబాహుళ్యం లోకి చొచ్చుకుపోయేటట్లు చేసేవి వివిధ కళారూ పాలు. వీటిని తగిన రీతిలో ప్రోత్సహించినపు డు భాష ప్రజల్లోకి వెడుతుంది.
6. మన భాషలోని ప్రముఖ కావ్యాల్ని, నాట కాల్ని... అన్నిటినీ ఇతర భాషల్లోకి అనువాదా లు చేయించాలి. అంతేకాదు. వాటిని ఇతర భాషా ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి అవ సరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఆయా ప్రాంతాల కళారూపాల సహకారం తీసుకోవ చ్చు. పరభాషలో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు తెలుగు భాషా వ్యాప్తికి ఉపకరించే కథలను, సన్నివేశాలను ఎన్నుకోవాలి.

తెలుగు మహాసభలు...
 
ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వ హించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమై న పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది. 1981 రెండవ ప్ర పంచ తెలుగు మహాసభలు కైలాలంపూర్‌ (మ లేషియా)లో జరుగగా... 1990 మూడవ ప్ర పంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో జరి గాయి. ఆ తరువాత 37 ఏళ్ళకు ఇప్పుడు మ ళ్లీ రాష్ట్రంలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.

నాలుగో ప్రపంచ తెలుగు మహాసభ లను డిసెంబర్‌ 27 నుంచి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలో నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహాసభల నిర్వహణ పై సీఎం కిరణ్‌ మంగళవారం సమీక్ష నిర్వ హించారు. ఈ సభల నిర్వహణకు రూ.25 కోట్లు మంజూరు చేయాల్సిందిగా సీఎం అధి కారులను ఆదేశించారు. మొదటి విడతగా రూ.5 కోట్లు విడుదల చేయడానికి సీఎం అంగీకరించారు. మహాసభల నిర్వహణ లో టీటీడీ, తెలుగు వర్సిటీ, సాంస్కృతిక వ్య వహారాల శాఖ, సమాచార శాఖలు ప్రధాన బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. సమా వేశంలో మంత్రులు వట్టి వసంతకుమార్‌, రఘువీరారెడ్డి, శ్రీదర్‌బాబు, డీకే అరుణ పాల్గొన్నారు.

మంత్రి వట్టి వసంతకుమార్‌ మా ట్లాడుతూ.. 1975లో ప్రపంచ తెలుగు మహా సభలు మొదటిసారి గా హైదరాబాద్‌లో నిర్వ హించారని.. 37 ఏళ్ల అనంతరం డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తు న్నామని వెల్లడించారు. ఈ సభలకు 16 దేశా ల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సంగీత, నాటక, లలితకళా అకాడమీలను పునరుద్ధరిం చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

గిడుగు కాదు పిడుగు

 
Gidugu_Ramamurthy2 
ఆంధ్రభారతి కృత్రిమ (గ్రాంధిక) అలంకారాల భారంతో కుంగి కృశిస్తూ కళ తిప్పి ఉన్న సమ యంలో సజీవమైన ప్రజల వాడుక భాషా ప్రయోగాల తో ఆంధ్రభారతికి నవ్యత చేకూర్చడానికి ఒక మహోద్య మం నడిపిన మహామనిషి గిడుగు రామ్మూర్తి పంతు లు. కాలం మారింది... సాహిత్యం సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉంది. వ్యవహారిక భాషతోనే ఇది సాధ్యమన్నది ఆయన దృఢ విశ్వాసం. సాధారణంగా మార్పును సమాజం అంత తేలికగా అంగీకరించదు. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహానికి ఉద్యమించినపుడు, ఇతర సాంఘిక సంస్కరణలు ప్రబోధించినపుడు ఆయనకు ఎదురైన గట్టి సవాళ్లవంటివే రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టినపుడూ ఎదురయ్యాయి.

వ్యవహారిక భాష పేరు తల చుకుంటే తెలుగు సాహిత్యం మైలు పడిపోతుందన్న భాషా ఛాందసులు తెలుగు సాహితీలో కాన్ని ఏలుతున్న రోజులవి. గిడుగు సాహసించి ఈ కొత్త ప్రతిపాదన చేసినపుడు వారు ఎదురుతిరిగారు. అయినా గిడుగు వెనుకంజ వేయలేదు. శద్ధగ్రాంథికవాదులను ఢీకొని వారిని నిరుత్తరులను చేశారు. జయంతి రామయ్యపంతులు, రాజా విక్రమదేవవర్మ, పిఠాపురం రాజా వంటి ఉద్దండులు గిడుగును ఎదుర్కొన్నారు. ఆనాటి వ్యవహారిక ప్రయోగాలను ఉటంకిస్తూ వారివాదాన్ని గిడుగురామ్మూర్తి పంతులు తిప్పికొట్టారు. గిడుగువారిది ప్రజా ఉద్యమం.

అందుకనే ఆనాటి కవులు, పత్రికలు గిడుగు వారి వ్యవహారిక భాషావాదాన్ని స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. 1915 నుంచి 1919 వరకు రామ్మూర్తి బరంపు రం నుంచి మద్రాసు వరకు ఊరూరా తిరిగి పండితులను ఢీకొన్నారు. వేటూరి ప్రభాకర శాస్ర్తి వంటి పండితుల చేత తన వాదాన్ని అంగీకరింపేశారు. జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరామశాస్ర్తి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి వంటి ప్రముులు రచించిన గ్రంథాల్లో దోషాలను చూపించి ఉద్దండ పండితులేక గ్రాంథికభాష పట్టుబడక తప్పులు రాస్తున్నపుడు బడి పిల్లలకు నేర్ఫడమా అని గిడుగువారు వాదించారు. నాడు గ్రాంధికభాషలో దిట్ట, మంచి వక్త అయిన కొక్కొండ వెంకటరత్నాన్ని తన వాదనతో గిడుగు మట్టికరిపించారు.

తెలుగు వెలుగు... శంకరంబాడి

 
sankarambadi 
తెలుగు రచయి తలలో శంక రంబాడి సుందరా చారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. సుందరాచారి, 1914 ఆగష్టు 10న తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియే ట్‌ వరకు చదివాడు. చిన్న తనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండే వాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావం దనం వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యా న్ని తెంపివే సాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు.

తిరుపతిలో హోటలు సర్వర్‌గా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్రపత్రిక లో ప్రూఫ్‌ రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన. అమిత మైన ఆత్మ విశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనా ధుని నాగేశ్వరరావు పంతులు నీకు తెలుగువచ్చా అని అడిగాడు. దానికి సమాధా నంగా మీకు తెలుగు రాదా అని అడిగాడు. నివ్వెరపోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని చెప్పిన మాతృభాషాభిమాని శంకరంబాడి సుందరాచారి.

ఆంగ్లేయులపై అక్షరాగ్ని గరిమెళ్ళ

 
GarimellaSatyanarayana
 
మాకొద్దీ తెల్లదొరతనమూదేవా!
మాకొద్దీ తెల్లదొరతనమూ
మా ప్రాణలపై పొంచి
మానాలు హరియించే...

జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ఈ గేయం తెల్లదొరల గుండెల్ని జల్లుమనిపించింది. స్వాతంత్య్ర సంగ్రామం లో పోరాటాలను తమ భుజస్కందాలపై మో స్తూ ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగి ల్చిన ఘనకీర్తిగల జాతిమరిచిన జాతిరత్నం గరిమెళ్ల సత్యనారాయణ. స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనా రాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గే యాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడు తూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ తో పాటు ‘దం డాలు దండాలు భారత మాత’ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరి మెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మా రుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరత నం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జా తీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలు గునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

1921 లో గరిమెళ్ళ ‘స్వరాజ్య గీతములు’ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా త మిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమి ళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువ దించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రం థాలను తెలుగులోకి అనువదించాడు. భోగ రాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసి న ‘ది ఎకనామిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అను వదించా డు. చివరిదశలో గరిమెళ్ళ పేదరికం అనుభ వించాడు.

ఆ రోజుల్లో దేశోద్ధారక కాశీనాథు ని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. చివరిదశ లో ఒక కన్ను పోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యా చన మీద బ్రతికాడు. స్వాతంత్య్రానంతరం మన పాలకు ల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు.

20, ఆగస్టు 2012, సోమవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - రెండవ భాగము


మొదటి భాగము తరువాయి

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కావలెననియు, మద్రాసు నుండి విడిపోవలెననియు అభిప్రాయము మొట్టమొదటిసారి 1912 లో కలిగినది. తమిళులతో కూడిన మద్రాసు రాష్ట్రములో ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి సరియైన అవకాశాలు దొరకకపోవుటే ఈ అభిప్రాయానికి మూలము. ఆంధ్రరాష్ట్రోద్యమమును ప్రారంభించి దానికి నాయకత్వం వహించినది స్వర్గీయ కొండా వెంకటప్పయ్య పంతులు, స్వర్గీయ నాగేశ్వరరావు పంతులు, స్వర్గీయ న్యాయపతి సుబ్బారావు పంతులు, స్వర్గీయ కట్టమంచి రామలింగారెడ్డి గారలతో పాటు, స్వర్గీయులు  ప్రకాశం పంతులుగారు , బులుసు సాంబమూర్తిగారు, పట్టాభి సీతారామయ్య పంతులు గారు మొదలైన పెద్దలు. మొట్టమొదట భాషా రాష్ట్రవాదము కాంగ్రెసు వర్గాలలో  కొంత అలజడిని కల్గించినది. భాషారాష్ట్రాల ఆవశ్యకతను గూర్చి ఇంగ్లీషులో ఒక ఉద్గ్రంథమును వ్రాసి, భాషారాష్ట్ర వాదమును పట్టాభి సీతారామయ్యగారు సహేతుకముగ సమర్ధించిరి. ఆంధ్ర కాంగ్రెసు నాయకులు అఖిల భారత కాంగ్రెసుచే భాషా రాష్ట్రాల సూత్రమును ఆమోదింపచేసి, మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు సంఘమును సాధించిరి. తరువాత క్రమక్రమముగ ఆంధ్ర రాష్ట్రోద్యమము బలపడి, మనకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రము ఏర్పడినది. ఆంధ్రరాష్ట్రోద్యమమును గూర్చి ఆంధ్రదేశములో ఎటువంటి అభిప్రాయ భేదము లేకుండెను. అన్ని రాజకీయపక్షాలీ ఉద్యమమును సమర్థించినవి. మద్రాసులో జరిగిన ఇరువదవ ఆంధ్రమహాసభ సమావేశానికి ఆచార్య రాధాకృష్ణగారు అధ్యక్షత వహించిరి. తరువాత వారు ఇంగ్లాండుకు వెళ్లి, ఆంధ్ర రాష్ట్ర స్థాపన గూర్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ తో సంప్రదింపులు కూడ జరిపిరి. మొదటినుండియు ఆంధ్రోద్యమము పట్ల సంపూర్ణమైన సానుభూతిని కలిగి రాధాకృష్ణ గారు అవసరమైనపుడు తగిన సహాయమును చేసినారు.

విమోచన ఉద్యమము  


భారత దేశమునకు స్వాతంత్య్రము వచ్చిన తరువాత హైదరాబాదు ప్రజల యొక్క విమోచనోద్యమానికి క్రొత్త బలము చేకూరినది. భారత యూనియన్లో ప్రవేశించుటకు హైదరాబాదు నిజామ్ నిరాకరించుటతో హైదరాబాదు ప్రజల విముక్తి ఉద్యమములో నూతనాధ్యాయము ప్రారంభమైనది. 1947 లో చెలరేగిన రజాకారు అమానుష చర్యల ఫలితముగ హైదరాబాదు ప్రజలు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు తాత్కాలికముగా వలస పోయిరి. హైదరాబాదాంధ్రులు విజయవాడ,కర్నూలు ప్రాంతాలకు వెళ్ళిరి. ఈ వెళ్ళుటలో ఉభయ ప్రాంతాల రాజకీయ సమైక్యత యొక్క మనస్తత్వము వెల్లడియగుచున్నది. 1947 జూలైలో విజయవాడయందు అయ్యదేవర కాళేశ్వరరావు గారి యింటిలో స్వామీరామానంద తీర్థ అధ్యక్షతన ఇట్లు తాత్కాలికముగ వలసపోయిన రాజకీయ కార్యకర్తల సమావేశము జరిగి, హైదరాబాదు ప్రజల స్వాతంత్ర్య పోరాట చర్యా సంఘము స్థాపితమైనది. దీని శాఖ యొకటి కర్నూలులో
స్థాపితమైనది. ఈ చర్యా సంఘము పక్షాన మాట్లాడుచు, హైదరాబాదులో ప్రజలకు ఫాసిస్టు పరిపాలననుండి విముక్తి కలిగి బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన జరుగవలెనని స్వామి రామానంద తీర్థ ఉద్ఘాటించిరి. ఇదే నెలలో మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర కాంగ్రెసు సంఘమువారు హైదరాబాదు ప్రజల సహాయ సంఘము నొకదానిని కాళేశ్వరరావు గారి అధ్యక్షతన నెలకొల్పిరి.

పోలీసు చర్య 


1948 ఏప్రిల్ 26 నాడు బొంబాయిలో రాజేంద్రబాబుగారి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెసు స్థాయీ సంఘ రహస్య సమావేశము జరిగినది. దీనికి హైదరాబాదు కాంగ్రెసు నాయకులు కూడ వెళ్ళియుండిరి. ఈ రహస్య సమావేశములో హైదరాబాదుపై పోలీసుచర్య జరుపవలెనని వాదించిన వారిలో కాళేశ్వరరావు గారు ముఖ్యులు. ఈ సందర్భమున ఆంధ్ర రాష్ట్రము కావలెనని ఆంధ్ర నాయకులు రాజేంద్రబాబును కోరగా, వారు ఆంధ్రులకు మాత్రమే వెంటనే రాష్ట్రము నిచ్చుటకు నిర్ణయించినచో మహారాష్ట్ర, కర్నాటకలకు కూడ ఈయవలసి యుండుననియు, ఈ అన్ని సమస్యలు ఒకే సారి నిర్ణయించుట మంచిదని తెలిపిరి. మొత్తముమీద 13 సెప్టెంబర్ నుండి 17  సెప్టెంబర్ (1948 ) వరకు హైదరాబాదు పై పోలీసు చర్య జరిగి ప్రజల విముక్తి జరిగినది. 1948 నవంబరులో హైదరాబాదుకు కాళేశ్వరరావుగారు వచ్చి, స్థానిక కాంగ్రెసు నాయకులైన స్వామీజీ మొదలైన వారితో సంప్రదించిరి. ఆ సందర్భంలో హైదరాబాదు విభజన జరిగి, విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రాల కొరకు పనిచేయవలెనని నిర్ణయింపబడినది. 1949 ఏప్రిల్ లో తిరిగి కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చినప్పుడు హైదరాబాదు తెలుగు నగరమనియు, అది తెలుగు సీమకు రాజధాని యనియు మహారాష్ట్ర నాయకులు ఒప్పుకొని ఉద్ఘాటించుట జరిగినది. ఆ సమయమున రామకృష్ణారావుగారిచ్చిన తేనేటి విందు సందర్భమునకూడ హైదరాబాదు సకలాంధ్రమునకు రాజధానియని అందరు ఒప్పుకొనుట జరిగినది. సకలాంధ్రమునకు హైదరాబాదు రాజధానియని వ్యాపించుచున్న భావము సర్దారు పటేలుగారి దృష్టికి ఎట్టులో తీసుకొని రాబడినది. అపుడాయన ఈ విషయమై కాళేశ్వరరావు గారికి వ్రాసిన ఉత్తరములో ఇప్పుడే హైదరాబాదు విభజనను గూర్చిన ఆందోళన చేయవద్దని హెచ్చరించిరి. తరువాత 1949 మే నెలలో డెహ్రాడూన్ జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశ సందర్భమున హైదరాబాదు కాంగ్రెసు నాయకులతో మాట్లాడుచు సర్దార్ పటేల్ గారు హైదరాబాదు విభజన గూర్చి ఆందోళన చేయు సమయము ఆసన్నము కాలేదనియు, ఒక అయిదు సంవత్సరాల కాలమున ఈ పని జరుగుటకు తగిన వాతావరణము సృష్టింప బడగలదనియు తెలిపిరి. ఈ విధముగ, తరువాత హైదరాబాదు విభజనోద్యమమునకు తగిన వాతావరణము కల్గించబడినది. హైదరాబాదు సకలాంధ్రమునకు రాజధానియని కూడ గుర్తించబడినది. ఇట్లు గుర్తించిన అప్పటి మద్రాసు ఆంధ్ర కాంగ్రెసు నాయకులలో మొదటివారు కాళేశ్వరరావుగారు. మద్రాసు ఆంధ్రులకు లభించదని వీరు మొదటి నుండియు అభిప్రాయపడిరి. జనవరి 1950 లో మద్రాసులో సమావేశమయిన ఆంధ్ర
కాంగ్రెసు శాసనసభ్యులు కర్నూలు ఆంధ్రుల తాత్కాలిక రాజధానియని , హైదరాబాదు శాశ్వత రాజధాని యనియు నిర్ణయించుట గమనింపదగిన విశేషము. ఆంధ్రరాష్ట్ర అవతరణమునకు ఒక రోజు ముందు అనగా 3౦ వ సెప్టెంబరు 1953 నాడు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘమువారు కూడ కర్నూలు తాత్కాలిక రాజధాని, హైదరాబాదు శాశ్వత రాజధానియని నిర్ణయించిరి. కమ్యునిస్ట్ పార్టీవారు మొదట నుండియు, అనగా 1947 వ సంవత్సరము నుండియు హైదరాబాదు సంస్థానమును విచ్చిన్నము గావించి, మదరాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమును తెలంగాణాముతో కలిపి వేసి విశాలాంధ్రమును హైదరాబాదు రాజధానిగా ఏర్పాటు చేయుట తమ ఆశయమని ఉద్ఘాటించుచు, యీ ఉద్యమము జనసామాన్యములో వ్యాపించుటకు కృషి సల్పుచుండిరి.

కృత్రిమ రాష్ట్రము - ప్రజల ఆకాంక్ష

ఇంగ్లీషువారి రాజ్యవిస్తరణ ఫలితముగ ఆంధ్ర, మహారాష్ట్ర,
కర్ణాటకములతో కూడిన కృత్రిమ రాష్ట్రము అసఫ్జాహి పరిపాలన క్రింద ఏర్పడినది. మధ్య యుగములో నిరంకుశ పరిపాలన క్రింద ప్రజలు నలిగిపోయినారు. పోలీసు చర్య తరువాత ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణమున హైదరాబాదు విభజన జరిగి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు పొరుగు రాష్ట్రాలలోని ఆయా భాషాప్రాంతాలతో కలిసి విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్ణాటకములు ఏర్పడవలలెనని ప్రజలు ఆకాంక్షించినారు. ఈ ఆకాంక్ష పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రములోని అన్ని రాజకీయ పక్షాల తీర్మానాలయందు ప్రతిబింబితమైనది. సాంస్కృతిక సంస్థలు యీ అభిప్రాయములను బలపరచినవి. పోలీసు చర్య తరువాత  తూపురాన్ జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు 1949 ఫిబ్రవరి సమావేశములో భాషా రాష్ట్రాలను బలపరుచటయే కాక అది వాస్తవముగా విశాలాంధ్ర సారస్వత సమావేశాముగ జరిగినది. తరువాత పరిషత్తు సభలు యీ మార్గముననే నడిచినవి. ఆలంపురములో రాధాకృష్ణ పండితుని ఆశీర్వచనములతో ప్రారంభమైన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలు వాస్తవముగ సకలాంధ్ర సారస్వత సభలు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇతర సారస్వత సంస్థలు విశాలాంధ్రోద్యమమును సంపూర్ణముగ బలపరిచినవి. పోలీసు చర్య జరిగిన వెంటనే కీ.శే. సర్దారు జమలాపురం కేశవరావుగారి అధ్యక్షతన ఘణపురంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సమావేశములో విశాలాంధ్ర కావలెనని ఉద్ఘాతించు తీర్మానము ఆమోదింపబడినది. ఈ తీర్మానమును అప్పటి తెలంగాణా ఏకైక దినపత్రికయగు గోలకొండ సంపాదకీయమున బలపరిచిరి. రాజకీయముగ, ఒక బహిరంగ సభలో ఇట్టి ఉద్ఘాటన జరుగుట బహుశా ఇదియే మొదటి పర్యాయమేమో! నిజామాబాదులో 1950 మార్చి నెలలో శ్రీ దిగంబరరావు బిందూ అధ్యక్షతన జరిగిన హైదరాబాదు స్టేటు కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాష్ట్రమును విభజించి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను తత్పరిసర భాషా ప్రాంతాలతో కలిపి వేయవలెనని తీర్మానింపబడినది. ఈ తీర్మానమును ప్రతిపాదించినవారు బూర్గుల రామకృష్ణారావు గారు. ఈ తీర్మానమునకు రంగారెడ్డి, చెన్నారెడ్డి గారాల ఆమోదము కూడ లభించెను. 1950 వ సంవత్సరమున ఫిబ్రవరి 12, 13 తేదీలలో వరంగల్లులో అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విశాలాంధ్ర మహాసభ స్థాయీ సంఘ సమావేశములో విశాలాంధ్ర తీర్మానము ఆమోదించుట జరిగినది. ఈ సమావేశములో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు పాల్గొనిరి. ఈ విశాలాంధ్ర స్థాయీ సంఘ సభ్యుల పట్టికను పరిశీలించినపుడు ఇందులో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రతినిధులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు కనిపించుచున్నారు. కాంగ్రెస్సే కాక ఇతర రాజకీయ పక్షాలు కూడా, ముఖ్యముగా కమ్యునిస్టు, సోషలిస్టు పక్షాలు విశాలాంద్రోద్యమానికి ఎంతో బలమును చేకూర్చినవి.

డా.దేవులపల్లి రామానుజరావు 


11, ఆగస్టు 2012, శనివారం

పరకాల ప్రభాకర్ తో ఎడిటర్స్ టైం - మహా టీవీ (03/08/2012)

Part 1



Part 2



Part 3


కేసీఆర్ కుసంస్కారి!

ఆంధ్రజ్యోతి, ఆగస్టు 9: 'తెలుగు తల్లి'ని తెలుగు దెయ్యం అనగలిగిన కుసంస్కారి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ విమర్శించారు. వెర్రి తలలు వేస్తోన్న ప్రాంతీయ విద్వేషానికి ఇది పరాకాష్ఠ అని అభివర్ణించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సభలో కేసీఆర్ తెలుగుతల్లిని దెయ్యంతో పోల్చుతూ మాట్లాడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేవారు. "తల్లి అందరి కీ ఒక్కటే. అది భాషకు సంబంధించినది. కేసీఆర్ మా ట్లాడేది తెలుగు భాష. ప్రస్తుతమున్న లిపి, వ్యాకరణం తెలుగు భాషదే. అటువంటి భాషకు తల్లి అయిన తెలుగును దెయ్యం అనే నీచానికి కేసీఆర్ దిగజారడాన్ని ఆయన ప్రాంతానికి చెందిన తెలుగువారంతా ఖండించాల్సిన అవస రం ఉంది'' అని జయప్రకాష్ అన్నారు. 1942లోనే శంకరంబండి సుందరాచార్య 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' రాశారని, ఆనాడే తెలంగాణలో ఆంధ్ర మహా సభ సమావేశాలు ప్రారంభమయ్యాయని, ఈ చరిత్ర కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు.

తన ఉ ద్యమం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహలతో భాషను, కవుల ను, సాహిత్యాన్ని, తల్లిని చిన్నబుచ్చడం కేసీఆర్‌కు మంచిది కాదన్నారు. నన్నయ భట్టు ఆది కవి అవునో కాదో తెలుగు భాషా గ్రంథాలను తరిచి చూసుకుంటే తెలుస్తుందని చె ప్పారు. వెయ్యేళ్ల క్రితం జీవించిన కవులకు తన సంకుచిత భావాలను అంటగట్టి ప్రాం తాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ జిల్లాల నుంచి ఆంధ్ర కం టే ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్న కేసీఆర్... ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆంధ్ర ప్రాంతం వెనుకబడిందని ఒప్పుకొంటారా అని ప్రశ్నించారు


"నన్నయ్య ఆదికవి కాదని, పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని టీఆర్ఎస్ నేత కేసీఆర్ చెబుతున్నారు. అలాగే తెలుగుతల్లి ఆంధ్రాకే పరిమితమని, తెలంగాణకు తెలంగాణ తల్లి అని చెబుతున్నారు. రాజకీయ స్వార్థం కోసం సాహిత్యకారులు, చరిత్రకారులను వివాదాల్లోకి లాగడం దారుణం'' అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి వ్యాఖ్యానించారు.

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిది నన్నయ్య కవితా యుగమేనని, అలాగే ఆయన భారతాన్ని అనువాదం చేయలేదని, అది ఆయన సృష్టేనన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నన్నయ్యను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని కేసీఆర్‌కు లింగారెడ్డి హితవు పలికారు. పాల్కురికి సోమనాథుడు కన్నడ కవితా లక్షణాలను అలవర్చుకున్న కవి అని, సి. నారాయణరెడ్డి, కాళోజీ వంటి కవులు అన్ని ప్రాంతాలకు చెందినవారని, అలాంటివారిని కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయొద్దని సూచించారు.

"భారత మాత అంటే ఉత్తర, దక్షణ, మధ్య భారతమాతలుండరు. భారత జాతి మొత్తానికీ ఆమే తల్లి. అదో మధుర భావన. అలాగే తెలుగుతల్లి కూడా తెలుగు ప్రజలకు ఓ మధుర భావన. అలాంటి తెలుగు తల్లిని ముక్కలు చేసి, దానితో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎదుగుతామంటే కుదరదు'' అని కేసీఆర్‌కు స్పష్టం చేశారు. నన్నయ్య ఆదికవి కాదంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సాహితీ లోకానికి, తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను లింగారెడ్డి డిమాండ్ చేశారు.

10, ఆగస్టు 2012, శుక్రవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - మొదటి భాగము

డా.దేవులపల్లి రామానుజరావు పేరు తెలియని తెలుగువారు ఈ తరంలో ఉన్నారేమో గాని మన తల్లిదండ్రుల, తాతల తరంలో ఉండి ఉండరు. తెలంగాణా ప్రాంతంలో పుట్టి పెరిగి నిజాముల పరిపాలనలో తెరమరుగవుతున్న తెలుగు భాషాసంస్కృతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎనలేని సేవ చేసిన వారియందు ఆయన ముఖ్యుడు. ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా సేవలందించి, గ్రంథాలయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినారు. ఆయన వ్రాసిన 'తెలంగాణాలో జాతీయోద్యమాలు'  లోని 'విశాలాంధ్రోద్యమము' భాగాన్ని ఇక్కడ సీరియల్ గా పోస్ట్ చేస్తున్నాము. మొత్తం టైపు చేయబడిన తర్వాత దానిని ఈబుక్ రూపంలో అందరికి అందుబాటులో ఉంచుతాము


ఆంధ్రావళికి మోదము - చారిత్రాత్మక ప్రకటన


భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ 5వ మార్చి 1956 నాడు నిజామాబాదులో సుమారు రెండు లక్షల ప్రజలతో కూడిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో విశాలాంధ్ర ఏర్పడవలెనని భారత ప్రభుత్వము చేసిన నిర్ణయమును ప్రకటించిన సందర్భము ఆంధ్రదేశ చరిత్ర లో చరిత్రాత్మకమైన, మహోజ్వలమైన ఘట్టము. రెండువందల సంవత్సరాల తరువాత తిరిగి తెలుగు ప్రజలందరు రాజకీయముగా ఏక కుటుంబీకులు కాగల అవకాశము నిచ్చిన భారత ప్రధాని ప్రకటన ఆంధ్రావళికి మోదము చేకూర్చినది. ఈ ప్రకటన నిజామాబాదున జరుగుటయందు కూడ ఒక విధమైన ఔచిత్యము కన్పించుచున్నది. ఈ నిజామాబాదులోనే పోలీసు చర్యకు చాలా సంవత్సరాల ముందు జరిగిన ఆంధ్ర మహాసభ నాలుగవ సమావేశములో ఆంధ్రోద్యమము రాజకీయోద్యముగా రూపొందినది. పోలీసు చర్య తరువాత ఈ నిజామాబాదు పట్టణములోనే జరిగిన హైదరబాద్ స్టేట్ కాంగ్రెసు మహాసభలో హైదరాబాద్ విభజన గావించి ఆంధ్ర,మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలను పొరుగునున్న ఆ భాషా రాష్ట్రాలతో కలిపివేయవలెనని తీర్మానించనైనది.ఆ నిజామాబాదు లోనే 1956 సంవత్సరమున విశాలాంధ్ర ప్రకటన జరిగినది.

ఇంగ్లీష్ సామ్రాజ్య వ్యాప్తితో భారతదేశమున రాష్ట్రాల ఏర్పాటు ప్రజల అవసరాలతో  నిమిత్తము లేక పరదేశ పరిపాలకుల అవసరాలకు ఉపయోగ పడునట్లుగా జరిగింది.తత్ఫలితముగ కుతుబ్ షాహీల పాలన ముందే కాక నిజామ్ షాహీల పాలనమందు కూడ కొంతకాలము ఏకముగా నుండిన ఆంధ్రులు మద్రాసు, హైదరాబాదు రాష్ట్రాలలో చీలిపోవుట జరిగినది. సుమారు నూటయేబది సంవత్సరాలకు పైగా చీలిపోయిన తరువాత తిరిగి ఏకము కావలెనను అభిలాష 1900 సంవత్సరములో మొట్టమొదట పొడసూపినది. బ్రిటిష్ ఆంధ్రుడైన కీర్తిశేషులగు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు గారు హైదరాబాదుకు వచ్చి 1900 సంవత్సరములో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయము, 1904 సంవత్సరములో విజ్ఞానచంద్రికా గ్రంథమండలిని స్థాపించి, ఉభయ ప్రాంతాలలో నున్న తెలుగువారిని వైజ్ఞానికముగ దగ్గరకు తీసుకొనివచ్చిరి. ఈ నైజ్ఞానికోద్యమము క్రమక్రమముగ నాటక ప్రదర్శనాలు, పత్రికలు, వైజ్ఞానికుల పర్యటనలు మొదలైన సాంస్కృతికోద్యమాల ద్వారా వ్యాపించి, బలపడి, పోలీసు చర్య జరిపిన కొన్ని సంవత్సరాలలోనే సాంస్కృతికముగ విశాలాంధ్ర స్థాపన కావించినది.అందుచేతనే తెలంగాణా నాయకులైన కొండా వెంకటరంగారెడ్డిగారు 1955 జూలై నెలలో జరిగిన తెలుగుభాషా సమితి శాఖ ప్రారంభోత్సవ సమయమున సాంస్కృతికముగ విశాలాంధ్ర ఏర్పడినదని ఉద్ఘాటించిరి. రాజకీయ 
విశాలాంధ్రకు పూర్వమే సాంస్కృతిక విశాలాంధ్ర ఏర్పడుట సహజము, స్వాభావిక పరిణామము. 

రెండు దశాబ్దాల క్రిందట భావన


రాజకీయముగ విశాలాంధ్రకూడ రెండు దశాబ్దాల క్రిందట భావించిన ఉద్యమమనియే చెప్పవచ్చును. హైదరాబాదులోని ఆంధ్రోద్యమమును గురించి ఇది విశాలాంధ్రోద్యమముగ పరిణమించ వచ్చునను అనుమానము ఇరువది సంవత్సరాల క్రిందట  అప్పటి హైదరాబాదు ప్రభుత్వమునకు కలిగినది. 1936 లో హైదరాబాదు ప్రభుత్వమునకు హోం సెక్రటరీగా నుండిన నవాబు ఆలియావర్ జంగ్ బహద్దూర్ అప్పుడు ఆంధ్రమహాసభ అధ్యక్షులుగా నుండిన మాడపాటి హనుమంతరావు పంతులుగారితో ప్రభుత్వమునకు గల పై అనుమానమును వెల్లడించియుండిరి. 1946వ  సంవత్సరములో కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్యగారు " విశాలాంధ్రలో ప్రజారాజ్యము" అను పుస్తకమును వ్రాసి, పై అనుమానము సకారణమైనదని నిరూపించియున్నారు. హైదరాబాదులోని  సాంస్కృతోద్యమము విశాలాంధ్రమునకు పునాదులు వేసినది. దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వమున 1947  లో వరంగల్లు నుండి వెలువడిన " శోభ" మాస పత్రిక విశాలాంధ్ర దృక్పథముతో నడిచినది.

రెండు పాయలు


ఈ శతాబ్దమున ఆంధ్రోద్యమము రెండు పాయలుగా అభివృద్ధి పొందినది.ఇందులో మొదటిది మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర రాష్ట్రోద్యమము. మన దేశమున భాషారాష్ట్రోద్యమము భారత జాతీయోద్యమమునకు అనుబంధముగ నిర్వహింపబడినది. భాషారాష్ట్రాలను భారత జాతీయ కాంగ్రెసు స్వాతంత్య్రమునకు పూర్వమే బలపరచి తన రాష్ట్ర కాంగ్రెసు సంఘాలను ఈ ప్రాతిపదిక మీదనే నిర్మించినది. భారతదేశమునకు
స్వాతంత్య్రము రాకపూర్వము మద్రాసు రాష్ట్రములోని ఆంధ్రోద్యమము ఆ రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమునకు మాత్రమే పరిమితమైన రాష్ట్రోద్యమముగ నుండెను. రెండవ పాయ హైదరాబాదులోని ఆంధ్రోద్యమము. ఈ ఉద్యమము యొక్క లక్ష్యము పోలీసుచర్యకు పూర్వము వరకు హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వస్థాపనయై యుండెను. కాని భారతదేశమునకు స్వాతంత్య్రము ప్రాప్తించి స్వదేశ సంస్థానాలు స్వతంత్ర భారతమునందలి అంతర్భాగాలైన తరువాత ఉభయప్రాంతాలలోని ఆంధ్రోద్యమ దృక్పథములో స్పష్టమైన, సహజమైన పరిణామాలు కన్పించినవి. ఈ పరిణామమే తిరిగి ఆంధ్రులందరు ఏక రాష్ట్రవాసులు కావలెనను ఉద్యమముగ రూపొందినది.ఇటువంటివే సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్నాటక ఉద్యమాలు. కావుననే మైసూరు,హైద్రాబాదు రాష్ట్రాలు స్వతంత్ర భారత యూనియన్ లో చేరిన తరువాత 26 వ నవంబరు 1949 వ సంవత్సరమున విశాలాంధ్ర మహాసభ స్థాపన జరిగినది. ఈ మహాసభ తరువాత 1950 ఫిభ్రవరి 13 ,14 తేదీలలో సమావేశమై, విశాలాంధ్ర తన ఆదర్శముగా ప్రకటించినది. 1953 అక్టోబరు  2వ తేదీనాడు మద్రాసు రాష్ట్ర విభజన, అక్కడి తెనుగు ప్రాంతాలతో కూడిన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఇది విశాలాంధ్ర రాష్ట్రస్థాపనకు తొలిమెట్టు. 

8, ఆగస్టు 2012, బుధవారం

తెలంగాణా లో కులపిచ్చి లేదా?

(రాళ్లభండి రవీంద్రనాథ్): తెలంగాణా లో కులపిచ్చి లేదు - ఒక వితండ వాదన: మన తెలంగాణా వాదులు ఒక విచిత్రమైన కనీ, వినీ ఎరగని వాదన ఒకటి చేస్తూ ఉంటారు. అది తెలంగాణా లో కుల పిచ్చి ఆంధ్రాలో లాగా లేదు. కులగజ్జి లేదా కులాభిమానం అభిమానం భారత దేశం అంతటా ఉన్న జాడ్యం. బిహార్, యూపీ, ఎంపీ, బెంగాల్, ఒరిస్సా, తెలంగాణా లోని కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా దీనికి అతీతం కాదు అన్ని ప్రాంతాల లోనూ కుల పిచ్చి ఉంది. కుల పిచ్చి లేదన్నప్పుడు, దళితులు తెలంగాణా ప్రాంతం వారైన మంద కృష్ణ మాదిగ ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? కోదండరామ రెడ్డి తన పేరు చివరన రెడ్డి తొలగించుకొన్నాడు అంటారు కానీ అతని రికార్డులు అదే యూనివర్సిటీ రికార్డులు చెక్ చేస్తే రెడ్డి అనే పేరుని తొలగించుకోలేదని అర్థమవుతుంది. రెడ్డి అనే పేరుతో తనని పిలవ వద్దని ఊళ్లో వాళ్లకి చెబుతాడు. అంతే.
 
ఇంక ఈ గౌడ్, యాదవ్ అనే పేర్లు మీకు సీమాన్ద్రా ప్రాంతం లో పెట్టుకోరు. ఈ గౌడ్, యాదవ్, ముదిరాజ్, శర్మ, శాస్త్రి, యానాది, రెడ్డి, మాదిగ, పేర్లు తెలంగాణా నాయకులు ఎందుకు పెట్టుకొంటున్నారు. అవేమైనా రాముడు, కృష్ణుడు లాంటి పేర్లా? అవి కులాల కి సంకేతాలు కావా? పైగా ఆ మాట అడిగితె దాట వెత బాట పడతారు. ఏతా వాతా తేలేదేమిటంటె కుల పిచ్చి లేదు అని డబ్బా కొట్టుకొనే తెలంగాణాలో కుల పిచ్చి ఎంత నర నరాల్లో జీర్ణించుకొని పోయిందో అర్థం కావడం లేదా?