29, ఆగస్టు 2012, బుధవారం

తేనెలొలుకు తెలుగు

నేడు ప్రపంచంలో ఎన్నో ప్రాంతీయ భాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన మాట వాస్తవం. వాటిలో తేనెలొకు మన తేట తెలుగు భాష ప్రస్తుతాని కైతే ప్రమాదం లేదని ఢంకా భజాయించి చెప్పొచ్చు. వేయి సంవత్స రాలకు పైగా తలవంచకుండా రెపరెపలాడుతున్న ఘనచరిత్ర కలి గిన మాతృ భాష మనది. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా పేరుగాం చిన తెలుగు వెలుగు... వెలవెలబోయే పరిస్థితి కనీసం మనత రం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష మహా సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులో కాలుష్యం పెరగదు! అయితే, నానాటికీ మనం పెంచి పోషించుకుంటున్న ‘మమ్మీ, డాడీ’ల సంస్కృతి ఇలాగే కొనసాగితే మాత్రం... తెలుగు భాషకు భవిష్యత్తులో ఆటంకం తప్పదు. కనుక, మన తెలుగు భాషను కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత నేటి తెలుగు యువలోకానిదే అని తెలియజేస్తూ... ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సూర్య’ ప్రత్యేక కథనం...

logo1
భావ వ్యక్తీకరణలో భాష అత్యంత ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని భాషల ఆధిపత్యమే నడుస్తున్నా... ఎవరికివారికి మాతృభాషపై ఉన్న మమకారం ప్రత్యేకమైందే. ఇలా మాతృభాష గురించి చె ప్పేటప్పుడు మన తెలుగు గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే, మాటకై నా... పాటకైనా మన శైలిలో ఉన్న ప్రత్యేకతే వేరు. అమ్మలా కమ్మనైనది.. మాధుర్యంలో అమృతానికి మించినది.. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’గా గుర్తింపు పొందింది.. ఇలా మన తెలు గు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అచ్చతెలుగు నుడికారాలు, ఛందస్సులు, పద ప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాలవారీగా యాసలు... మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ద్రవిడ భాషల్లోకెల్లా మన అక్షర మాలది ప్రత్యేకమైన గుర్తింపు. ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడ నేను తెలుగొకొండ, ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. అలా అనడమే కాదు... మన తెలుగు గొప్పదనం దశదిశలా చాటేం దుకు తన వంతు కృషి చేశారు. ఆదికవి నన్న య మొదలు... ఈకాలం ప్రముఖుల వరకూ ఎందరో మహానుభావులు మాతృభాష గొప్ప దనాన్ని మరింత ఇనుమడింప చేశారు.

మన భాషలో, భావనలో... మన సంస్కృతి లో, సంప్రదాయంలో అన్నింట్లోనూ తెలుగే. అలాంటి తెలుగు భాషాభ్యున్నతి కోసం ఎనలే ని సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వాడుక భాషలో భోధన జరగాలంటూ... రామ్మూర్తి పంతులు ఉద్యమించారు. దాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు. వ్యవహారిక భాషా పితామహుడిగా కీర్తి గడించారు. ఇలా తెలుగు వెలుగు కోసం... ఓ చిలకమ ర్తి, ఓ గురజాడ, ఓ కందుకూరి వీరేశలింగం వంటి ఎందరో మహానుభావులు కృషి చేశా రు. ఆంధ్రులైన మనమే కాదు... తెల్లదొరలు సైతం మన భాషను చూసి మురిసిపోయారు. చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ లాంటి మహాశయులు... తెలుగు భాష వ్యాప్తికి తమవంతు చేయూత నందించారు. తెలుగును భారత ప్రభుత్వం కూడా ప్రాచీన భాషగా కూడా గుర్తించింది.

అయితే ప్రపంచకీరణ నేపథ్యంలో ఆంగ్ల విద్య వ్యామోహంలో పడి ఇప్పుడు తెలుగును చిన్నచూపు చూస్తున్నారు. ఈ పరిణామం సాహితీవేత్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎంతో ఘనచరిత్ర ఉన్న మన తీయ నైన తెలుగును పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని పలువురు భాషా వేత్తలు పిలుపిస్తున్నారు

భాషా సేవలో మనమెక్కడ?

శాస్త్ర / సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific / Technical Jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుం ది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికో ప్ర త్యేక దినోత్సవం పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషిస్తూ... భాషకు కొత్త ఊపిరూదాలి. నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మా త్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంత రీకరణలు (Transformations), యుద్ధా లు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాష కు మన రోజువారీ సంభాషణలే ప్రాణవా యువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి.

అదేంటంటే తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని / అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం ఇవి ఎంతమంది చేస్తున్నారు? ‘ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అన్న సామెత’ మనదే! దురదృష్టవ శాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్టం చేయటం ఎంత అవసరమో కాలానుగుణంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడు కోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ ఎప్పుడో బళ్ళో చదువు కుని వదిలేసిన సంగతులు! సంధులు, సమా సాలు, ఛందస్సు అనవసర కష్టాలు.

తెలుగు భాషోద్యమం...

 
annamayya1 


సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు. ఆయన ఈ ఉద్యమాన్ని ప్రా రంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కా వొస్తోంది. గ్రాంథిక భాషలో రచనలు చేయని వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉం డాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, స వాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రా చుర్యంలోకి తెచ్చిన కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సం ఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది ఆ సంస్థ ప్రధాన ఆశయం. 45 ఏళ్ల తర్వాత కూ డా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఐక్యరాజ్య స మితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యా ప్తంగా అంతరించిపోతున్న మాతృభాషల్లో తె లుగు కూడా ఒకటని, దీని కి రెండు దశాబ్దా లలోపు సమయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.


kavulu 
ఇవి చేయాలి...

1. అధికార భాషా సంఘం చిత్తశుద్ధితో పని చేసి వెంటనే కార్యాలయాలన్నిటిలో తెలుగు భాషనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పదకోశాలలో కృత్రిమమైన అను వాదాలను సవరించాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువాదాలుండాలి గానీ అనువాద కుల పాండిత్య ప్రతిభ ప్రదర్శనకు వేదిక కాకూడదు.
2. బహుళ వాడుకలో ఉన్నా ఇతర భాషా ప దాలను యథాతధంగా వాడటం వలన నిరక్ష రాస్యులకు కూడా సులువుగా అర్థమవుతా యి. ఉదాహరణకి రైలు, బస్సు, రోడ్‌ మొద లయినవి. వీటిని మన భాషా పటిమతో అను వాదం చేసి అందర్నీ గందరగోళపరిచే పని మానుకుంటే అదికార భాష అమలు సులభసాధ్యమవుతుంది.
3. ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్ల అవసరా న్ని సాకుగా చూపి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న కార్పోరేట్‌ కాలేజీలను నియత్రించాలి.

4. ప్రాచీన భాష హోదా కేవలం నిధులు సాధించడం, ఖర్చు చెయ్యడం కోసం కాక వాస్తవంగా పరిశోధన, ప్రచురణ మొదలైన వాటికోసం మాత్రమే... కావాలి.
5. ఏ విషయాన్నైనా ప్రజాబాహుళ్యం లోకి చొచ్చుకుపోయేటట్లు చేసేవి వివిధ కళారూ పాలు. వీటిని తగిన రీతిలో ప్రోత్సహించినపు డు భాష ప్రజల్లోకి వెడుతుంది.
6. మన భాషలోని ప్రముఖ కావ్యాల్ని, నాట కాల్ని... అన్నిటినీ ఇతర భాషల్లోకి అనువాదా లు చేయించాలి. అంతేకాదు. వాటిని ఇతర భాషా ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి అవ సరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఆయా ప్రాంతాల కళారూపాల సహకారం తీసుకోవ చ్చు. పరభాషలో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు తెలుగు భాషా వ్యాప్తికి ఉపకరించే కథలను, సన్నివేశాలను ఎన్నుకోవాలి.

తెలుగు మహాసభలు...
 
ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వ హించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమై న పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది. 1981 రెండవ ప్ర పంచ తెలుగు మహాసభలు కైలాలంపూర్‌ (మ లేషియా)లో జరుగగా... 1990 మూడవ ప్ర పంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో జరి గాయి. ఆ తరువాత 37 ఏళ్ళకు ఇప్పుడు మ ళ్లీ రాష్ట్రంలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.

నాలుగో ప్రపంచ తెలుగు మహాసభ లను డిసెంబర్‌ 27 నుంచి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలో నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహాసభల నిర్వహణ పై సీఎం కిరణ్‌ మంగళవారం సమీక్ష నిర్వ హించారు. ఈ సభల నిర్వహణకు రూ.25 కోట్లు మంజూరు చేయాల్సిందిగా సీఎం అధి కారులను ఆదేశించారు. మొదటి విడతగా రూ.5 కోట్లు విడుదల చేయడానికి సీఎం అంగీకరించారు. మహాసభల నిర్వహణ లో టీటీడీ, తెలుగు వర్సిటీ, సాంస్కృతిక వ్య వహారాల శాఖ, సమాచార శాఖలు ప్రధాన బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. సమా వేశంలో మంత్రులు వట్టి వసంతకుమార్‌, రఘువీరారెడ్డి, శ్రీదర్‌బాబు, డీకే అరుణ పాల్గొన్నారు.

మంత్రి వట్టి వసంతకుమార్‌ మా ట్లాడుతూ.. 1975లో ప్రపంచ తెలుగు మహా సభలు మొదటిసారి గా హైదరాబాద్‌లో నిర్వ హించారని.. 37 ఏళ్ల అనంతరం డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తు న్నామని వెల్లడించారు. ఈ సభలకు 16 దేశా ల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సంగీత, నాటక, లలితకళా అకాడమీలను పునరుద్ధరిం చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

గిడుగు కాదు పిడుగు

 
Gidugu_Ramamurthy2 
ఆంధ్రభారతి కృత్రిమ (గ్రాంధిక) అలంకారాల భారంతో కుంగి కృశిస్తూ కళ తిప్పి ఉన్న సమ యంలో సజీవమైన ప్రజల వాడుక భాషా ప్రయోగాల తో ఆంధ్రభారతికి నవ్యత చేకూర్చడానికి ఒక మహోద్య మం నడిపిన మహామనిషి గిడుగు రామ్మూర్తి పంతు లు. కాలం మారింది... సాహిత్యం సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉంది. వ్యవహారిక భాషతోనే ఇది సాధ్యమన్నది ఆయన దృఢ విశ్వాసం. సాధారణంగా మార్పును సమాజం అంత తేలికగా అంగీకరించదు. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహానికి ఉద్యమించినపుడు, ఇతర సాంఘిక సంస్కరణలు ప్రబోధించినపుడు ఆయనకు ఎదురైన గట్టి సవాళ్లవంటివే రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టినపుడూ ఎదురయ్యాయి.

వ్యవహారిక భాష పేరు తల చుకుంటే తెలుగు సాహిత్యం మైలు పడిపోతుందన్న భాషా ఛాందసులు తెలుగు సాహితీలో కాన్ని ఏలుతున్న రోజులవి. గిడుగు సాహసించి ఈ కొత్త ప్రతిపాదన చేసినపుడు వారు ఎదురుతిరిగారు. అయినా గిడుగు వెనుకంజ వేయలేదు. శద్ధగ్రాంథికవాదులను ఢీకొని వారిని నిరుత్తరులను చేశారు. జయంతి రామయ్యపంతులు, రాజా విక్రమదేవవర్మ, పిఠాపురం రాజా వంటి ఉద్దండులు గిడుగును ఎదుర్కొన్నారు. ఆనాటి వ్యవహారిక ప్రయోగాలను ఉటంకిస్తూ వారివాదాన్ని గిడుగురామ్మూర్తి పంతులు తిప్పికొట్టారు. గిడుగువారిది ప్రజా ఉద్యమం.

అందుకనే ఆనాటి కవులు, పత్రికలు గిడుగు వారి వ్యవహారిక భాషావాదాన్ని స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. 1915 నుంచి 1919 వరకు రామ్మూర్తి బరంపు రం నుంచి మద్రాసు వరకు ఊరూరా తిరిగి పండితులను ఢీకొన్నారు. వేటూరి ప్రభాకర శాస్ర్తి వంటి పండితుల చేత తన వాదాన్ని అంగీకరింపేశారు. జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరామశాస్ర్తి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి వంటి ప్రముులు రచించిన గ్రంథాల్లో దోషాలను చూపించి ఉద్దండ పండితులేక గ్రాంథికభాష పట్టుబడక తప్పులు రాస్తున్నపుడు బడి పిల్లలకు నేర్ఫడమా అని గిడుగువారు వాదించారు. నాడు గ్రాంధికభాషలో దిట్ట, మంచి వక్త అయిన కొక్కొండ వెంకటరత్నాన్ని తన వాదనతో గిడుగు మట్టికరిపించారు.

తెలుగు వెలుగు... శంకరంబాడి

 
sankarambadi 
తెలుగు రచయి తలలో శంక రంబాడి సుందరా చారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. సుందరాచారి, 1914 ఆగష్టు 10న తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియే ట్‌ వరకు చదివాడు. చిన్న తనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండే వాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావం దనం వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యా న్ని తెంపివే సాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు.

తిరుపతిలో హోటలు సర్వర్‌గా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్రపత్రిక లో ప్రూఫ్‌ రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన. అమిత మైన ఆత్మ విశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనా ధుని నాగేశ్వరరావు పంతులు నీకు తెలుగువచ్చా అని అడిగాడు. దానికి సమాధా నంగా మీకు తెలుగు రాదా అని అడిగాడు. నివ్వెరపోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని చెప్పిన మాతృభాషాభిమాని శంకరంబాడి సుందరాచారి.

ఆంగ్లేయులపై అక్షరాగ్ని గరిమెళ్ళ

 
GarimellaSatyanarayana
 
మాకొద్దీ తెల్లదొరతనమూదేవా!
మాకొద్దీ తెల్లదొరతనమూ
మా ప్రాణలపై పొంచి
మానాలు హరియించే...

జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ఈ గేయం తెల్లదొరల గుండెల్ని జల్లుమనిపించింది. స్వాతంత్య్ర సంగ్రామం లో పోరాటాలను తమ భుజస్కందాలపై మో స్తూ ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగి ల్చిన ఘనకీర్తిగల జాతిమరిచిన జాతిరత్నం గరిమెళ్ల సత్యనారాయణ. స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనా రాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గే యాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడు తూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ తో పాటు ‘దం డాలు దండాలు భారత మాత’ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరి మెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మా రుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరత నం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జా తీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలు గునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

1921 లో గరిమెళ్ళ ‘స్వరాజ్య గీతములు’ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా త మిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమి ళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువ దించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రం థాలను తెలుగులోకి అనువదించాడు. భోగ రాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసి న ‘ది ఎకనామిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అను వదించా డు. చివరిదశలో గరిమెళ్ళ పేదరికం అనుభ వించాడు.

ఆ రోజుల్లో దేశోద్ధారక కాశీనాథు ని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. చివరిదశ లో ఒక కన్ను పోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యా చన మీద బ్రతికాడు. స్వాతంత్య్రానంతరం మన పాలకు ల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు.

1 కామెంట్‌: