పత్రికా ప్రకటన (16/7/2012)
ఈ రోజు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ కి విశాలాంధ్ర మహాసభ హాజరయ్యింది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మా వాదనను వినిపించే అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన మీదట మా సభ్యులం సమావేశానికి హాజరయ్యం. పిలవని పేరంటానికి మేము వెళ్ళలేదు.
ఇరవై నుంచి ముప్ఫై నిముషాలు అడ్డం పడకుండా అంతరాయం కలిగించకుండా మా మాట చెప్పే అవకాశం ఇస్తామని పదే పదే మాకు చెప్పి అనేక సార్లు మాకు ఫోన్లు చేసాక మేము అక్కడికి వెళ్ళాం.
మా తరఫున డా పరకాల ప్రభాకర్ తన ఉపన్యాసం ప్రారంభించగానే అక్కడ ఉన్న వారు అడ్డుతగలడం మొదలుపెట్టారు.
విభజనకు అనుకూలంగా వారు ఒక కారణం చెపితే మేము కలిసి ఉండడానికి వందకారణాలు చెపుతామని, వారు వంద చెపితే మేము వెయ్యి చెపుతామని, వారు వెయ్యి చెపితే మేము లక్ష చెపుతామని విశాలాంధ్ర మహా సభ ప్రధాన కార్యదర్శి డా పరకాల ప్రభాకర్ ఆ సమావేశం లో సవాలు చేసారు.
తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర సమైక్యతను కోరుకునే వాళ్ళు లక్షలాదిగా ఉన్నారని, దానికి నిదర్శనం విశాలాంధ్ర మహాసభ లో ఉన్న శ్రీయుతులు నర్రా మాధవరావు (సాతంత్ర్య సమరయోధులు), కుమార్ చౌదరి యాదవ్, శ్రీనివాస రెడ్డి, నలమోతు చక్రవర్తి, శ్రీమతి సుగుణమ్మ(స్వాతంత్ర్య సమరయోధులు) లు ప్రముఖ నిదర్శనాలు. ఇందులో అనేక మంది ఇవాల్టి సభలో పాల్గొన్నారు. విశాలాంధ్ర కోరే ఈ తెలంగాణ ప్రముఖుల కన్నా విభజన కోరే వారికి తెలంగాణా పురోగతి పట్ల అధికంగా ఉన్న నిబద్ధత ఏమిటో వారు సమాధానం చెప్పాలి అని విశాలాంధ్ర మహాసభ ప్రశ్నించింది.
తెలంగాణ ప్రాంతం లో విశాలాంధ్ర వాదుల నోరునోక్కే ప్రయత్నం మానుకోవాలి.
పౌర హక్కులను కాపాడతామని చెప్పుకునే వారు, స్వాత్రంత్ర్య సమరయోధులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్న సభలో మా వాదనను చెప్పడానికి అడ్డుపడడం చాల విచారకరం. వారెవరూ మా అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు మాకు ఉన్నదని మా వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి ముందుకు రాక పోవడం చాల గర్హనీయం.
వీరందరికీ విశాలాంధ్ర మహా సభ ఒక విజ్ఞప్తి చేస్తున్నది.
ఇప్పటికయినా ప్రజాస్వామ్య వాతావరణం లో ఒక చర్చ చేపట్టండి. విభజన వాదన వక్రీకరణల మీద, అభూత కల్పనల మీద, అసత్యాల మీద అర్ధ సత్యాల మీద ఆధార పడి సాగు తున్న ఆందోళన అని మేము నిరూపిస్తాం. రాష్ట్ర విభజన ఎందుకు జరగాలో వారు చెప్పవచ్చు.
మా నోరు నొక్కడంతో వారి వాదన లో బలం లేదు అని వారు చెప్పకనే చెప్పినట్టు అయింది.
విశాలాంధ్ర మహాసభ అటువంటి చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం.
రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ నిర్వాహకులు మాకు ఇచ్చిన మాట, హామీ నిలబెట్టుకోనందువల్ల, మూకుమ్మడిగా లేచి మాట్లాడుతూ మాకు అంతరాయం కలిగించడం వల్ల, విభజన కు అనుకూలంగా మాట్లాడ మని మమ్మల్ని ఒత్తిడి చేయడం వల్ల మేము సమావేశం నించి నిష్క్రమించాము.
నలమోతు చక్రవర్తి
అధ్యక్షులు, విశాలాంధ్ర మహాసభ
విశాలాంధ్ర మహాసభ తరపున నేను చేస్తున్న సవాలు కి ఈ "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి....ఇవ్వగలరా...? ఆ ఇవ్వగలిగే సత్తా మీకు ఉందా..?
రిప్లయితొలగించండిమా పరకాల ప్రభాకర్ గారి గురించి మాటమాటకి ప్రతి ఒక్క బొడ్డు ఊడని ,తాడు బొంగరము లేని,సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది "నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.....ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను మీకు సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటె ఈ దిగువ అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు మాత్రము సమాధానము ఇవ్వండి ప్లీజ్.
1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(26 - 02 - 1997 )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) ( 18 - 07 -1996 )
౩. శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)
5 .వేర్పాటు వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)(22 -08 -1988 )
మమ్ములను చర్చలలో ఎదుర్కోలేక,మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటే మీ వాదములో పసలేదు కాబట్టే....!
మీరు చేస్తున్న ఇప్పటి ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి బ్రతుకుదెరువు ఉద్యమము ,ఉపాధి హామీ ఉద్యమము, స్వయం ఉపాధి ఉద్యమము లాంటిది కాదా అని అడుగుతున్నా...!
మీకు ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి "బంగారు బాతు" లాగా అవ్వలేదా ...?
ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము ముసుగులో మీలో ఎంతమంది కోటీశ్వరులు అయ్యారో , కొండవీటి చేంతాడు లాంటి వారి వివరాలు , పేరులతో సహా ఎక్కడైనా రుజువులతో సహా చెప్పటానికి మేము సిద్ధము.. ఈ దోచుకున్న డబ్బు ఆంధ్రా , తెలంగాణా రైతులది,వ్యాపారస్తులది,బడుగు జీవులది కూడా కాదా అని అడుగుతున్నా.....?
ఇట్లు ,
మీ భవదీయుడు
వెంకటేశ్వర్
Expected... the seperatists are uncivilised. They can't be better, that's why their agitation quickly subsided when Police started booking non-bailable cases on them. :)
రిప్లయితొలగించండి@VENKATESWAR SUNKARA
రిప్లయితొలగించండి"సమైఖ్య" కాదు, "సమైక్య" ముందు కాస్త తెలుగు నేర్చుకో. ఆతరువాత కాస్త సమస్కారం నేర్చుకో.
>>>తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి>>>
తీవ్రవాదులు, వేర్పాటువాదులు నీకు సహనంతో సమాధానం ఇవ్వాలా. ఏమన్నా మెడకాయమీద తలకాయుందా? నువ్వు తీవ్రవాదులు, వేర్పాటువాదులు అన్నందుకు నిజంగా తీవ్రవాదులే అయ్యుంటే నీపని అయిపొయుండేది. ఫాక్షనిస్టు, బెజవాడ రౌడీ సమైక్యవాదులదగ్గరికి వెల్లి ఇలాగే మాట్లాడితే వేటకొడవలితో నరికేస్తారు.
సమైక్యవాదులు అని చెప్పుకునేవారు ఉద్యమాలు చేసిందే దోచుకున్న లక్షలకోట్లను కాపాడుకోవడానికి. రుజువులు కాదు, ఇప్పటికే సీబీఐ కేసులు నడుస్తున్నై.
నర్రా మాధవరావు అనే వ్యక్తి భారత సైన్యంపై హింసాయుత పోరాటం చేసినా ఆయన వీళ్ళకు మాత్రం దేశభక్తుడట. vms వారి మాటలకు అర్ధాలే వేరులే :)
తొలగించండిబాబు జైగో, యుద్దం ఏదైనా అది హింసాయుతంగానే ఉంటుంది. అది మన హరగోపాల్, గద్దర్ లాంటి వాళ్ళు కలలుకనే గెరిల్లా యుద్దమైనా, లేక అలనాటి కమ్యూనిస్టులు భారత ప్రభుత్వంపై చేసిన సాయుధ పోరాటం అయినా.. కాని నర్రా మాధవరావు గారైన, సుందరయ్య గారైన వాళ్ళ సొంత లాభం కోసమో, అస్థుల కోసమో ఆ పోరాటం చెయ్యలేదు కదా.వాళ్ళు ఒక సిద్దాంతాన్ని నమ్మారు. దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందని భావించారు. దాన్ని అమలు పరిచే ప్రక్రియ లోనే వాళ్ళు భారత సైన్యం మీద పోరాడారు.
తొలగించండినేతాజీ కూడా హిట్లర్, జపనీయుల సహాయంతో భారత దేశంపై దండెత్తాలని వ్యూహరచన చేసాడు. కాబట్టి హిట్లర్ పాపాల్లో అతనికి భాగం అంటగడతామా? లేక దేశద్రోహి ముద్ర వెయ్యాలా?
మరి రెడ్ కారిడార్ పేరుతో దేశాన్ని చీల్చాలనుకునే నేటి కాలపు 'దేశభక్తులు ', వారి సానుభూతిపరులు ఎంతోమంది తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మరి ఇది ఖచ్చితంగా విచ్చిన్న కర శక్తులు నడిపిస్తున్న దేశద్రోహ ఉద్యమం కాదా?
దేశభక్తులులో తెలంగాణ దేశభక్తులు వేరయా..
@satya: సుందరయ్య, నర్రా లాంటి ఒకనాటి నక్షలైటులు భారత సైన్యంపై యుద్ధం చేయడానికి కారణం సిద్దాంతం కాదు, వారి ప్రభువు స్టాలిన్ వారి ఆదేశం. ఈ విషయం సదరు సుందరయ్య తన పుస్తకంలో రాసుకొని గొప్పలు చెప్పుకున్నారు.
తొలగించండిహింస అనేది యుద్దంలో జరిగితే ఒప్పు, ఉద్యమంలో అయితే తప్పు అనే మీ వాదనకు శతకోటి వందనాలు.
ఈ రోజటి నక్షలటులని దేశాభాక్తులని నేను అనలేదు. వారికి ఈ బిరుదు ఇచ్చిన తోలి వ్యక్తి అంధుల అభిమాన విటుడు ఉరఫ్ ఏమ్ప్తీ డ్రామారావు.
నేతాజీ గారు దేశభక్తుడా దేశాద్రోహా అనే విషయం రాళ్ళబండి వారిని అడిగితె బాగుంటుంది. నాకు నచ్చని అభిప్రాయాలు ఉన్న వారిపై (నర్రా తో సహా) అభాండాలు వేయడం నాకు అలవాటు లేదు.
జైగో, యుద్ధం లో చేసేదాన్ని సైనికుల కర్తవ్యం అంటారు. మీరే రాసారు కదా వాళ్ళు భారత సైన్యం పై పోరాడారని.. భారత ప్రజలపై కాదు కదా.. సైన్యం కూడా ప్రజల్లో భాగమే అంటారా? :)
తొలగించండిఇంకా నయం.. తెలంగాణ సాయుధ పోరాటం కూడా దగ్గరుండి స్టాలినే జరిపించాడు అని చెప్పలేదు. ఆనాడు దేశం లో ఉన్న అనేకమంది కమ్యూనిస్ట్ నాయకులకు చైనా ,రష్యా ల్లోని వారి కామ్రేడ్ లతో సంభందాలు ఉండేవి..తమ దేశాల్లో జరుగుతున్న ఉద్యమాలపై వాళ్ళు సంప్రదింపులు జరిపేవాళ్ళు. అంతేకాని ఆయన ఎక్కడా స్టాలిన్ వాళ్ళకు ప్రభువనో, వాళ్ళకు నాయకుడనో, అతని ఆదేశం తో నడుస్తున్నట్లు చెప్పనే లేదు..
హింస లేకుండా యుద్ధాలు జరగాలి అనే మీ ఉన్నతమైన భావాలకు అనంతకోటి అభినందనలు.. దీన్ని విశ్వవ్యాప్తం చేసి ప్రపంచానికి చాల ఖర్చు మిగల్చాలని సూచన..
భారత సైన్యంపై యుద్ధం చేయాలనే నిర్ణయంలో స్టాలిన్ పాత్ర ఏమిటో మీరు సుందరయ్య పుస్తకం చదివితే తెలుస్తుంది. Do you want me to provide links or excerpts?
తొలగించండిభారత సైన్యంతో యుద్ధం చేయడం వేరే, భారత దేశంతో యుద్ధం చేయడం వేరే అంటారా? అట్లే కానిండు.
యుద్ధంలో హింస తప్పు కాదన్న వివరణకు ధన్యవాదాలు. టాంకుబండు విగ్రహాల లాంటి ఘటనలను కూడా ఒక యుద్ధంలో భాగంగా భావించి వదిలేయండి మరి.
Yes.. I need the links... I read the sundarayya book.. He no where mentioned they worked under Stalin's command.
తొలగించండిమీ వాదం ప్రకారం భారత ప్రభుత్వం నిజాం పై కాకుండా తెలంగాణ ప్రజలపై యుద్దం చేసింది అని అర్ధం చేసుకోవాలి కాబోలు.. మరి బానిసలకు హక్కులుండవేమో..
మీకు చేతనైతే యుద్దం చేస్తున్నాం భారత ప్రభుత్వం పై అని ప్రకటించండి..తర్వాత చూద్దాం విగ్రహాలను కూల్చిన తాలిబాన్ల గతే మీకు పడుతుందేమో..
బైదవే, ఉస్మానియా లో ఊతకొట్టుడు కూడా యుద్దం లో భాగమా కాదా?
Page 129:
తొలగించండి"So it was correct to have carried on armed resistance against the attempts of Nehru's armies to seize back lands from the peasants and give it to the landlords."
Nehru's armies, sic(k)!
"Our Party obtained all this clarification only when its delegation met the leadership of the international Communist movement and Comrade Stalin, towards the end of 1950 and the beginning of 1951"
Clarifications, indeed!
Page 408:
The new Polit Bureau at once approached the leadership of the CPSU and Comrade Stalin, who readily agreed to render all fraternal assistance in resolving the difficult political-organisational and ideological problems that the Communist Party of India was confronted with"
Please note "organisational" in addition to other "problems".
"But the "legal opposition," led by the Party headquarters in Bombay continued its disruptive activities, even after knowing that the Polit Bureau was seeking the help of the CPSU and Comrade Stalin, to resolve the inner-party controversies"
Comrade Stalin is my chairman, what, old chap?
When you said excerpts I expected you will do the selective cut & paste job which u r known for.. anyways.. u tried hard to back ur words but show me where Stalin ORDERED (స్టాలిన్ వారి ఆదేశం).
తొలగించండిIn page 129, in the preceding paragraph of your selective excerpt sundarayya garu clearly mentioned why they have chosen to fight back on Indian army..
We had a foretaste of it in the way the congress government attacking and suppressing our party in the andhra area.. So should we continue the armed struggle against the Nehru's armies and its attack on telangana peasants to snatch away all the gains?
In another para.. But if we withdrew struggle unconditionally, and immediately after the intervention would the indian govt declare amnesty and not prosecute thousands of guerrilla squads and cadre and members of party and sangham....
The clarification he meant, "The partisan struggle need NOT necessarily be a liberation struggle". so, the clarification is indeed opposite to ur claim that Stalin ordered for fighting T liberation.
This is even acknowledged by one of stalin's close aid.
t it was Stalin who impressed upon the Communist Party of India in the '50s to withdraw the armed struggle in the Telangana region of Andhra Pradesh.
http://www.rediff.com/news/dec/30stalin.htm
by the way, Jai.. may be u r oversmart and seems to have an obsession to find faults with grammatical mistakes, politically incorrect lines in book (as u pointed out usage of Nehru's armies). But a better job for u may be proof reader or editor or book reviewer. This is not a right forum for u to seek explanations for such things.. Here content is more important than grammar..
/హింస అనేది యుద్దంలో జరిగితే ఒప్పు, ఉద్యమంలో అయితే తప్పు అనే మీ వాదనకు శతకోటి వందనాలు./
తొలగించండిహింస అనేది ఉద్యమాల్లో వుండటం తప్పు కానే కాదు, వుండాల్సిన ఆంశం అని లంటున్నారా?! అయితే మీ శతకోటికి పావులావడ్డీ కాదు మార్వాడీ వడ్డీతో బాకీ వేడి వేడిగా తీర్చేయాలి. :))
ఎవరేకీభవించినా, లేకున్నా పోలీసుల లాఠీలూ మీ వాదనతో వ్యూహాత్మకంగా ఏకీభవిస్తాయి, ఇక తమదే ఆలస్యం, మొదలెట్టండి మరి.
@SNKR: I am not supporting violence. Just wondering why Comrade Narra & co. criticize violence when they themselves had no qualms earlier.
తొలగించండి@satya:
The Stalin story you refer to is about the 1951 cessation of hostilities (incidentally after the elections were announced), not the 1948 decision to continue the war against "Nehru's army".
Further, it is not certain if the people referred in the story had any first hand knowledge. I would not treat this as a better source than Sundarayya (being a participant & chronicler).
Regarding Stalin's "interpretation", you can see the background yourself in the book. Many Telangana communists wanted to stop the war and cooperate with the Indian Govt. Hardliners like Sundarayya wanted to continue the adventure. Stalin ruled in favor of the latter.
You may consider implementing some of your own advice.
Jai, The reference is from the preceding paragraphs.. By the way, in google books, the page no is 88 but not 129 as u mentioned.
తొలగించండిYou are not answering the simple question. In which part of the book Sundarayya mentioned they carried away the fight on Stalin's command as u claimed ( వారి ప్రభువు స్టాలిన్ వారి ఆదేశం. )
by the way, as far as I know, there was no meeting between stalin and andhra communists before 1950.
I would consider once you leave ur obsessionwith the word సమైఖ్య..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచక్రవర్తి గారూ,
రిప్లయితొలగించండిమీరు పిలవని పేరంటానికి వెళ్ళారని ఎవరూ ఆరోపించలేదు. మరి గుమ్మడి కాయ దొంగెవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు?
మిమ్మల్ని పిలిచింది మాట్లాడానికి మాత్రమె. మీరు కరపత్రాలు పుస్తకాలు పంచడం సభా మర్యాదకు విరుద్దం కాదా? ఆ మాత్రం సోయి లేని వాళ్ళు వాక్స్వాతంత్ర్యం గురించి వాపోవడం విడ్డూరంగా లేదూ? సభా మర్యాదను పాటించడం చేతకాని వారు నిర్వాహకులు హామీలను నిలుబెట్టుకోవడం గురిందగింజ సామెత లక్క ఉన్నది.
తెలంగాణాలో లక్షలాది మంది విశాలాంధ్రను కోరుకుంటున్నారని అబద్ద ప్రచారం చేసే మీరు కనీసం వెయ్యి మందిని ఒక దగ్గర పోగు చెయ్యగలరా? రాజకీయ నిరుద్యోగులు, స్టాలిన్ భజన మండలికి చెందిన వృద్ధ జంబూకాలు లాంటి ఒక డజను మందిని ప్రచారకాముకులు తెలంగాణ ప్రజల అభిమతానికి ప్రతినిధులా?
వంద అక్కరలేదు, విశాలాంధ్ర ఎందుకు కావాలో ఒక్క కారణం చెప్పండి. అవతలి వారిని వేర్పాటువాదులుగా ముద్ర వేయడం, వారి వాదనలు తప్పని నిరూపించామనడం ప్రఘల్భాలు పలకడం లాంటివి తప్ప మీరు ఎప్పుడయినా విశాలాంధ్ర ఎందుకు కావాలో ఎప్పుడయినా చెప్పారా?
మీకు ఒక వేదిక కల్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీ రోదనలో పట్టుంటే మీరే దాన్ని ప్రచారం చేసుకోండి. మీకు చర్చ కావాలని ఉంటె మీ పెరంటానికే బాపూజీ గారినో, ఇతర తెలంగాణా వాదులనో పిలవండి.
ప్రసంగ పాఠ కరపత్రాలు పంచడం సభామర్యాదలకు తీవ్ర విఘాతమా?! విగ్రహాలు కూల్చడం, విభజనకు వ్యతిరేకంగా మాట్లాడితే తిరగనీయం ఇవి? సభామర్యాదలూ, పెజాసామ్య స్పూర్తి అవుతాయా?! అబ్బో! ఎన్ని మర్యాదలు నేర్చిన్న్రు?
తొలగించండి/మరి గుమ్మడి కాయ దొంగెవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు?/
ఇది కాదు, పిశాచులు వేదాలు వల్లించడం అని వేర్పాటువాదులు అనుకోవాలి. :))
విగ్రహాలు సభలో కూల్చిన్రా? వీళ్ళు తప్ప ఎవరయినా కరపత్రాలు పంచిన్రా?
తొలగించండివిగ్రహాలు సభలో వుంటే కూల్చక వదిలేసేవారా? తెలబాన్లు :))
తొలగించండిఎవరూ ఇవ్వకపోతే వీళ్ళివకూడదా? అలా ముందే కండీషన్లు పెట్టారా? ఆ తెలివిలేక వాళ్ళివ లేదు, వీళ్ళు ప్రిపేర్ అయి తెచ్చుకున్నారు. దానికి గాభరాపడిపోయి కిందమింద పడాల్సిన అవసరమేమిటో! జనాలు చదివితే వూడిపోయే ఉజ్జమాలను ఎన్నాళ్ళు సాగనిస్తారో! :))) ఈ వుజ్జమకారులకు అంత టెన్షన్ ఎందుకు? పోనీ బలవంతంగా ఆహ్వానితుల నోర్లు నొక్కడం సభామర్యాదా?!!
ఔ ఔ జైగో, సభామర్యాద అంటే కేటీఆర్ ని చూసో, చర్చా మర్యాద అంటే బాల్క సుమన్ ని చూసో నేర్చుకోవాలన్నది చక్రవర్తి గారికి తెలీదులే.. లేక సభామర్యాద అంటే పిలవని పేరంటానికి వెళ్ళి పుస్తకాలను చించి, దాడులు చేసి వచ్చే టి లయ్యర్లును(లాయర్లు)చూసి గ్రహించాలి కాబోలు.
రిప్లయితొలగించండిసమై'ఖ్య' లోనే కాదు. ప్ర'ఘ'ల్బాలు లో కూడ ఒత్తు ఉండదు.
మాదిప్రజాస్వామ్య ఉద్యమం అదీ ఇదీ అని ప్రగల్భాలు పలికే తెరాసా నాయకులు, వారి వందిమాగధులు శ్రీ పరకాల ప్రభాకర్ గారిని కరీం నగర్లో తన వాదనతో విశాలాంధ్ర ఎందుకు కావాలో ఒప్పిస్తాను నేను శ్రీ కేసీఆర్ సవాలుని స్వీకరిస్తున్నాను అంటే శ్రీ కేసీఆర్ ఆయనని తీసుకు వెడుతూ జీప్ కూడా ఎక్కకుండానే శ్రీ పరకాల గారి మీద నలమోతు చక్రవర్తిగారి మీద మీరు వాకృచ్చిన కేసీఆర్ గారి ప్రజాస్వామ్యవాదులు దాడిచేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యం? నిన్న జరిగిన మీ వృద్ధ కొండా లక్ష్మణ్ బాపూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఏదో మహాత్మా గాంధిగారి రౌండ్ టేబుల్ కార్యక్రమంగా వర్ణించి నిర్వహించి దానికి శ్రీ పరకాల గారిని ఆహ్వానించి, మీ ప్రజాస్వామ్య గూండాలు ఆయన మాట్లాడరాదు అని ఆందోళన చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? అక్కడ ఒక గుడ్డలిప్పుకొని గంతులు వేసే ఒక పాటగాడు, నిన్నా మొన్నటి దాకా అన్నిరకాలైన పదవులు అనుభవించి నంత కాలం రాష్ట్రం సమైక్యమ్గా ఉండాలని నినదించిన పెద్దాయన కొండా వీళ్లు కనీసం ఆ ఆందోళన చేస్తున్న గూండాల్ని ఆపలేకపోయారు అంటే మీ యొక్క వాదం లో పస లేదు అని అర్థం. కనుకనే ఒక వ్యక్తిని చర్చకు ఆహ్వానించి ఆయన పై దాడికి తెగబడి ప్రజాస్వామ్యం అంటే గూండా యిజమేరా అని నిరూపించి అవహేళన చేయడమేనా వీరి పజాస్వామ్య లక్షణం? చాలా బాగుంది. ముందు శ్రీ సుంకర వెంకటేశ్వర రావు గారికి మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పండి. చెప్పలేకపోతే టాపిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు మానండి.
రిప్లయితొలగించండిఆంధ్రుల ఆత్మఘోష -సోము జ్ఞానశంకర్ gnanasankar.somu@gmail.com
రిప్లయితొలగించండిసమైఖ్యాంద్ర ఎందుకన్న ప్రశ్నకు 10 సమాధానాలు(తెలంగాణా నాయకులడగిన ప్రశ్నకు):
1.హైదరాబాదులోఉన్నన్ని సాఫ్ట్వేర్సంస్థలు, ఉద్యోగఅవకాశాలు, ఉన్నతవిద్యావకాశాలు, కోచింగ్సంస్థలూ, నల్సార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , మెట్రోరైల్, ఎం ఎం టీయస్, ఫార్మకంపెనీలు, స్పెషాలిటీ- సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులూ, ఐఐటిలు, హైటెక్ సిటీ , ఔటెర్ రింగ్రోడ్లు, ఫ్లైఓవర్లు , సెంట్రల్ యూనివర్సిటీలు, పోలీసుట్రైనింగ్ అకాడేమీలు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇక్రిశాట్, డిఫెన్స్ అకాడెమీలు, అనేక కేంద్ర సంస్థలు సీమాంధ్రలో ఉన్నాయా? ఉంటే మీరు విభజనచేయొచ్చు. లేదా! అవి సీమాంధ్రలోనెలకొల్పాక ఆతర్వాత విభజనకు అభ్యంతరంలేదు. కనీసం 10సం" హైదరాబాదుపై వచ్చేఆదాయాన్ని సీమాంద్రులకు పంచుతారా? ప్రత్యేక రాష్ట్రరాజధాని నిర్మాణానికి అయ్యేఖర్చును ఎవరుభరిస్తారు? రాష్ట్రఅప్పులు ఎవరు తీర్చాలి? ఇక్కడపన్నులేసి అక్కడ అభివృద్దిచేశారు. ప్రపంచబాంకుదగ్గర అప్పుచేసి హైదరాబాదు అభివృద్దిచేశారు. మరి ఈఆప్పులకు భాధ్యులెవ్వరు. హైదరాబాద్విషయమై- హైదరాబాదుప్రజలతోనే ప్రజాభిప్రాయసేకరణ జరుపుతారా? ఆంద్రప్రదేశ్రాష్ట్ర విభజనపై ప్రజాభిప్రాయసేకరణ రాష్ట్రవ్యాప్తంగాజరుపుతారా? ఆంద్రప్రదేశ్లో మజ్లిస్పార్టీల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొన్నారా? ఒకపార్టీని కాంగ్రెస్పార్టీలో కలుపుతామంటే రాష్ట్రాన్నివిభజించవచ్చా? ప్రత్యేకతెలంగాణా కొరకు కోదండరాంలాంటి అధ్యాపకుడు సంవత్సరాలతరబడి పాఠాలుచెప్పకపోయినా ఫర్వాలేదు.- సమైఖ్యాంద్రప్రదేశ్ సాధనకు, వారిభవిష్యత్తుకొరకు ఎన్జీ్వోలు ఉద్యమముచేయకూడదా?
సమైఖ్యాంధ్ర ప్రదేశ్లో రాయలసీమ ‘సాధారణప్రజలకు’ ప్రత్యేకంగాఒరిగిందేమీలేదు. అయితే ప్రత్యేకతెలంగాణావస్తె పరిస్థితులు ఇంకా అధ్వాన్నం అవుతాయనేభయం సామాన్యప్రజలకుకూడా ఉన్నది.. రాయలసీమ రాళ్ళసీమగా త్వరత్వరగామారిపోతున్నది. దేశంలోనే అత్యల్ప వర్షపాతంఉన్న ఒకప్రాంతంగా నమోదుచేసుకొన్నది. ప్రత్యెకతెలంగాణాఇస్తే, రాయలసీమవాసులు సాగునీటికి-త్రాగునీటికై వలసలు పోవాలా?
2. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశ పెట్టిన విద్యార్థులకు ఫీజు రీ-ఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులూ, రూపాయికి కిలో బియ్యము, ఆరోగ్య శ్రీ, బంగారుతల్లి, వృద్దులకు-వికలాంగులకు పింఛను, ఇతర సంక్షేమపథకాలకు నిధులుఉన్నవా? లేదా ఈపథకాలు సీమాంధ్రకు అవసరం లేదా?
3.ఆర్టీసీ, విద్యుత్తు, రైల్వేలు ఇంకా ఇతరసంస్థ్లల కేంద్రకార్యాలయాలు హైదరాబాదులోనే ఉన్నవి. వాటి ఆస్థులు సీమాంధ్రులకు సమానంగా, ఆమోదయోగ్యంగా పంచుతారా?
4.ఆంధ్రులు శాంతస్వభావులు. టాంక్బండ్పై విగ్రహాలధ్వంసం, రాష్త్రహైకోర్టును తగులబెట్టేప్రయత్నం, న్యాయవాదులపైదాడి, సినిమాహాళ్ళపైదాడి, సినిమావారినిబెదిరించడం - అక్రమ వసూళ్ళకు పాల్పడడంమొదలైనవి ‘విభజనకుముందు ట్రైలర్లు’. ట్రైలర్లే ఇలా ఉంటే విభజన తర్వాత ‘అసలుసినిమా’ ఎలావుంటుందో? మరి ఈ తీవ్ర సంఘటనలు చేసినది ఎవరు? వారిని వెనకేసుకొని వచ్హినది ఎవరు?
డా” నాగం జనార్ధన రెడ్డిపై చెప్పులతో దాడి చేయించిందెవరు. ఒక మేధావి, సౌమ్యుడైన లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ్, ఐ. యే ఎస్ పై దాడి చేయించిదెవరు.
5.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు డీఏ, ఐఆర్, పీఆర్సీ, పెన్షను ఇచ్హే సామర్ధ్యము విభజన తరువాత సీమాంధ్ర ప్రభుత్వానికి ఉంటుందా?
హైదరాబాదుపై వచ్చేఆదాయాన్ని గుర్తులోఉంచుకొని కేసీఆర్ లాంటివారు కేంద్రప్రభుత్వోద్యోగులతోసమంగా వేతనాలు, ప్రత్యెక తెలంగాణా సాధనకు ఒక అదనపు ఇంక్రిమెంట్ మొదలైన వరాలిస్తున్నారు. అంతేగానీ తనసొంతసొమ్ము ఒక్క కానీ అయినా ఇచ్చే గొప్ప హృదయం ఆయనకు ఉందా.
6’.సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్’అని మీరంటున్నారు. ఒకవేళఅది ప్రత్యేకతెలంగాణాకు వ్యతిరేకంగావచ్చిఉంటే ఈమాటే అనగలిగి ఉండేవారా? సీమాంద్రులు సీడబ్లూసీ ని డబ్బు సంచులతో కొనేశారు అనేవారుకాదా? శ్రీకృష్ణకమిటీని ఈమాట మీరుఅనలేదా? ఇప్పటికైనా శ్రీకృష్ణ కమిటీపై మీఅభిప్రాయము తెలిపే ధైర్యము ఉందా?
7.సకల సీమాంధ్రప్రజానీకము సమైఖ్యాంధ్రకోసం కుల-మత, బాల-వృద్ధ, ధనిక-పేద, స్తీ- పురుష బేధాలు లేకుండా ఉద్యమాలుచేస్తుంటే అవిపెట్టుబడిదారులుచేస్తున్న- చేయిస్తున్నఉద్యమాలు అనేకేసీఆర్, తెలంగాణాలోవారుచేస్తే- ఉద్యమాలు, సీమాంద్రులుచేస్తే- ఉద్యమాలు కావు. ఇదిఎలాఉందంటే ‘రాజుచేస్తే శృంగారము- సామాన్యుడుఅదేపనిచేస్తే వ్యభిచారం’. వినేవాళ్ళు, చూసేవాళు నవ్వుతారనే ఇంకిత జ్ఞానం ఇసుమంతైనా లేదా?
8.అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టి వారిలోఆవేశాన్ని, అలజడిని నెలకొల్పే నాయకులు ఎలక్షన్లలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్క ఎం.ఎల్.యే సీటునైనాఇచ్చారా? చనిపోయిన విద్యార్థులలో పేదలు, బలహీన వర్గాలు ఎందరనే గణాంకాలు ఉన్నవా? దాదాపు చనిపోయిన విద్యార్థులందరూపేదలే-బలహీనవర్గాలవారే. ఎంతమందినాయకులు, నాయకులకుటుంబాలవారు ఈఉద్యమాలకై చనిపోయినారనే గణాంకాలు ఉన్నవా?
రిప్లయితొలగించండి9. ప్రత్యేకపాకేజీలు ఎన్నిమార్లుఇచ్చి తెలంగాణానుఅభివృద్ధిచేశారో అన్నిమార్లు సీమాంధ్రకుప్రత్యేకపాకేజీలుఇచ్చి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధిచేసి, తప్పక ప్రత్యేకతెలంగాణా కోరవచ్చు.
10. ‘నీబాంఛన్ నీకాల్మొక్తదొరా’- అనేదొరలసంస్కృతికొరకే కేసీఆర్ ప్రత్యేకతెలంగాణా కోరుతున్నాడనేఅనుమానం సామాన్యుడికికూడా వస్తుంది. కొడుకు ఎం.ఎల్.యే, మేనల్లుడు ఎమెల్యె, తను ఎంపీ. తెలంగాణా అంటే తన కుటుంబమేనా. ఇలాంటివ్యక్తి రాబోయేరోజుల్లో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాడా? ఒక వేళచేస్తే ఆవ్యక్తి ఒక రెమోట్ కంట్రోల్ ముఖ్యమంత్రి కాడా? మీకుటుంబమూ, మీకూతురు కుటుంబమూ కలిసి ఉండాలి- రాష్ట్రము మాత్రము విడిపోవాలి.
ఈ ఉద్యమాలవల్ల సామాన్యులకు కష్టాలు. కుటిల నాయకులకు ఒక వినోదం. ఉద్యమాలతో ‘విద్యార్థులు ఎంత మంది చని పోతే వారికి అంతలాభం’. దాదాపు ఒక సంవత్సరము నుండి ఈ రాష్ట్రవిద్యార్థులకు సరైనవిద్య లేదు, పోలీసులకు తమ కుటుంబాలతో గడిపే తీరికాలేదు. ధరలు రోజు రోజుకీ పరిగెడుతున్నాయి. వాటిగురించి అడగరు. సగటుఉద్యోగి వీధిన బడుతున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులురావు, కొత్త రైల్వేలురావు. కొత్త పరిశ్రమలు రావు. కానీ ‘నాయకులకు పదవులొస్తాయి- వారి నోరుమూయడానికి’. మన రాష్ట్ర ఎంపీలు ముక్కుమీద వేలేసుకొని సోనీయమ్మచెప్పింది నచ్చినా-నచ్చకపోయినా ఊకొట్టాలి. లేదంటే ‘వేలుచూపిస్తూంది’. ‘ఇదీ ప్రజాభిప్రాయం’ అని చెప్పకూడదు. మనం నియంతృత్వదేశంలోఉన్నామా? మనఎంపీలకన్నా ఎలిమెంటరీ్‌స్కూల్ విద్యార్థులే కాస్తమేలు. అయినా వారినెందుకు అనుకోవడం' ఇంట్లోవాడే-కంట్లోపుల్ల' అనేనాయకులుదొరకడం మనఖర్మకాకపోతే! ‘వాళ్ల సొంతఆస్తులైతే పదిసార్లుఆలోచించిగానీ సంతకంపెట్టక కళ్ళుమూసుకొని ఇలా సంతకాలుపెడతారా? పరవస్తుచిన్నయసూరి పంచతంత్రకథలలోని' మూడుచేపలకథలో ‘మూడొచేప పరిస్థితి’ ఈసీమాంద్రులకు దాపురించింది. దీనికికారణం అన్నిపార్టీలనాయకులే. ప్రమాదంరాదు, ప్రమాదంవచ్చినపుడు చూసుకొందామనేనిర్లిప్తత మన మేధావి-నాయకుల లక్షణాలు. ప్రత్యేక తెలంగాణాఏర్పడినా ‘తామే’ రెండుప్రాంతాలకూ ఏలికకావాలనే దురాశే ఈ సమస్యకు మొదటి కారణం.. మీనిర్వాకంవల్ల సామాన్యుడి ఇల్లూ- వళ్లూ గుల్లవుతోంది. రాష్ట్రంతగలబడుతోంది. ఎంతసేపూ మీపదవులూ మీ సౌఖ్యాలేనా? రాష్ట్రాన్ని చదరంగంబల్లగామార్చి రాష్ట్రప్రజలను పావులుగామార్చి చదరంగంఆడే నాయకులకు ఒక విన్నపం. ఇప్పుడైనా అందరుకలవండి.`రెండు గుర్రాలపైస్వారీ సిద్ధాంతం మాది’ అనే పద్ధతి మానండి. `రాబోయేతెలంగాణాలో కాబోయేసీయంనేనే’నని ఆతెలుగు తమ్ముళ్ళు తమనాయకుడి స్థానము తెలంగాణాలో ఏమిటొ చేతిలో అంజనమువేసి చూపిస్తున్నారు. ఎంజీవోలనుండి ఉద్యమ భాద్యతలు తీసుకొనే సమయం మీకు ఇంకా రాలేదా? ప్రజా సమస్యలు మీకు పట్టవా? ఇక ఈ ప్రాంత రైతుల, ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార, సామాన్యుల,శ్రామికుల ప్రయోజనాలు కాపాడేదెవ్వరు?
ఉన్నవి పోతాయేమోనని సీమాంద్ర ఉద్యోగులు, కొత్తగాఅదనం వస్తాయని తెలంగాణా ఉద్యోగులు. Struggle for existence. ఉద్యోగుల సంక్షేమం/సమస్యలకొరకేపోరాడాల్సిన, సంయుక్తంగాఉండాల్సిన కుడీ-ఎడమచేతులు బాహాబాహీఅంటున్నాయి. ఇరుప్రాంత రాజకీయనాయకులు వారిలాభనష్టాలు లెక్కించుకొంటూ వారినిపావులుగా వాడుకొంటున్నాయి. తెలంగాణాకొత్తగాఏర్పడితే ఆటోనడిపేవాడి జీవితంలో, సామాన్య శ్రామికుడి జీవితంలో పెద్దమార్పులేమీఉండవు. నాయకులకు ఉన్నపదవులు పోతాయి.. కొత్త నాయకులకు పదవు లొస్తాయి. కేవలం నాయకులపదవుల్లోనే మార్పులొస్తాయి. సామాన్యుడు నిన్నకష్టంచేశాడు, నేడూ చేస్తున్నాడు, రేపు ప్రత్యేకరాష్ట్రంవచ్చినా వారికష్టం వారికితప్పదు. శ్రమ చేయకుండా వారిని కూర్చోబెట్టి సాకే గొప్పవారెవరూ లేరు. రేపు కొత్తగారారు. ‘రాళ్లుమోసి మీరు కోటకట్టండి. మేము కోటలొకూర్చొని దర్జాగా ఠీవి ఒలకబోస్తాం!’- అనేనాయకులు మనకు కోకొల్లలు. వారివల్లనే ఈసమస్యలంతా.
చేతకాని నాయకులు 100 మందికంటే తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పగలిగే కిరణాల్లాంటి నాయకులు కనీసం 10 మంది ఉంటే
సమైక్యాంద్రను నిలబెట్టుకోవడం అసాధ్యంకాదు.