19, జులై 2012, గురువారం

భారతీయ జనతా పార్టీ కి…కొన్ని ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారికి ,విశాలాంధ్ర మహాసభ తరపున సుంకర వెంకటేశ్వర రావు అను నేను కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను....ఆ ప్రశ్నలకు వారి నుండి సూటి సమాధానాలు కావాలి, ఇవ్వగలరా...?
ఇప్పుడు మీ ముందు పెడుతున్న ఈ దిగువ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రజల కోసము మీరు చెప్పి తీరాలి.......

1 . మీరు 1997 లో మీ పార్టీ రాష్ట్ర శాఖ కాకినాడ లో చేసిన తీర్మాన ప్రతిని బహింగ పరచగాలరా...? ప్రజల కోసము బహిరంగ పరచి తీరాలి.

2 . ఆ తీర్మానములో "ఆంద్ర రాష్ట్ర" "తెలంగాణా రాష్ట్ర" ఏర్పాటు అని మీరు సవివరముగా పెర్కొన్నారా....? లేక.....పరిపాలనా సౌలభ్యము కొరకు రెండు చిన్న రాష్ట్రాలు అని పెర్కొన్నారా...?

3 . పరిపాలనా సౌలభ్యము కొరకు ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించటం అంటే భౌగోళికముగా మీ పరిభాషలో మీ నిర్వచనము ఏమిటి...?

4 . ఉత్తరాంధ్ర....ఆంద్ర.....రాయలసీమ.....హైదరాబాదు...ఉత్తర తెలంగాణా....దక్షిణ తెలంగాణా అని ఇప్పుడున్న ప్రాంతాలను ఏ విధముగా విదగొడతారు,ఏ విధముగా కలుపుతారు..? కొద్దిగా వివరించండి....!

5 . మీరు చేసిన ఆ తీర్మానానికి మీ కేంద్ర పార్టీ ఆమోదము తెలిపినదా...? (ఒకవేళ ఆమోదము తెలిపి ఉంటె ఆ ప్రతిని కూడా ప్రజల కొరకు మీరు బహిరంగ పరచి తీరాలి) అప్పటి మీ కేంద్ర పార్టీ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ కి ఇంచార్జ్ గా ఉన్న శ్రీ జానా కృష్ణమూర్తి గారు మీ తీర్మానము మీద ఏమని అన్నారు...చెప్పగలరా...?

6 . పరిపాలనా సౌలభ్యము కొరకు చిన్న రాష్ట్రాలు అని చిలుక పలుకులు పలుకుతున్న మీరు ఉత్తరప్రదేశ్ విషయములో మీ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది.....? మీరు నాగు పాము లాంటి రెండు నాలుకులు ఉన్నవారిగా , అవకాశ వాదులుగా మేము మిమ్మలిని అనుకోవాలా...?

7 . మీ పార్టీ అధినాయకుడు శ్రీ ఎల్ కే అద్వాని గారు 2002 లో కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పార్లమెంటు సభ్యుడుగా ఉన్న శ్రీ ఆలె నరేంద్ర గారు పార్లమెంటు లో ది.26 - 02 -2002 న అడిగిన ప్రశ్నకు శ్రీ అద్వానీ గారు ది 01 -04 -2002 న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానములో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు వీలు పడదు అని వివరముగా చెప్పారా లేదా.....?

8 . రాజధాని కలిగి ప్రాంతము వెనకబడిన ప్రాంతముగా పరిగణిస్తూ వేరే రాష్ట్రముగా విడిపోవటము అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా...? ఉంటె ఆ చరిత్ర కొద్దిగా వివరించండి....

9 . రాష్ట్రములో వెనకబడిన ప్రాంతాలు ,దానికి సవివరమైన కారణాలు తో మీ పార్టీ ప్రజల కొరకు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యగలదా...?

10 . "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" ( జాక్,ప్రజాసంఘాలు,తెరాసా,తీవ్రవాద వామపక్ష సంఘాలు) భావదారిద్ర్యముతో తరచుగా, అదేపనిగా ఇతర ప్రాంతము(ఆంద్ర) వారిమీద విద్వేష భావముతో చేస్తున్న ఒక తీవ్ర ఆరోపణ "ఆంద్ర పెట్టుబడి దారులు,ఆంధ్రా దోపిడీదారులు,ఆంధ్రా వలసవాదులు,బ్రతకటానికి పొట్ట చేతబట్టుకు వచ్చినోల్లు,మా వనరులు అన్ని దోచుకుంటున్నారు, క్విట్ తెలంగాణా,తెలంగాణా నుండి తరిమికోదతాం,ఆంధ్రా వాళ్ళను బట్టలు ఊడదీసి తరిమి కొడతాం , రక్తపాతం సృష్టిస్తాం " అని ఇంకా అసభ్యముగా చేస్తున్న ప్రకటనలను ,భౌతిక దాడులను మీరు ఎందుకు ఇంతవరు ఖండించలేదు....? అంటే మీరు కూడా ఆకోవలోకే వస్తారని మేము అనుకోవాలా...? మీరు ఆ భాషని,దాడులని సమర్ధిస్తున్నారా...?

11 . "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" భావదారిద్ర్యముతో చేస్తున్న మరో ఆరోపణ "ఆంధ్రా వాళ్ళు మా వనరులు అన్ని దోచుకుంటున్నారు,మా సంస్కృతిని నాశనము చేస్తున్నారు ,మమ్మల్ని సాంస్కృతముగా అణచివేస్తున్నారు" అని చేస్తున్న ఆరోపణలను మీరు సమర్ధిస్తున్నారా...?

మీరు ఇతర బ్రతుకుదెరువు రాజకీయ సంఘాలు, రాజకీయ పార్టీలు,రాజకీయ నాయకులుగా కాకుండా "భారతజాతి ,భారతదేశ సఖ్యత, సమగ్రత కోసము పరితపించే ఒక జాతీయ పార్టీగా" ,పై ప్రశ్నలకు సమాధానాలు అవునో కాదో ప్రజలకు వివరించాల్సిన భాద్యత మీ మీద ఎంతో ఉంది ...సమాధానాలు ఆశిస్తూ....
మీ భవదీయుడు ,
వెంకటేశ్వర్
19 -7 -2012
http://pravasarajyam.com/1/nri/2012/07/19/quation-paper-to-bjp-from-sunakara/

3 కామెంట్‌లు:

  1. Wonderful questions. I trust your colleague will forward these to the BJP's national spokesperson.

    రిప్లయితొలగించండి
  2. సుంకర వెంకటేశ్వర్ గారు,

    మీరు సభ్యులుగా ఉన్న “విశాలాంధ్ర మహాసభ” నాయకుడు పరకాల ప్రభాకర్ గారు కాకినాడ తీర్మానం నాటికి బీజేపీ లోనే ఉన్నారు. ఆ తీర్మానం గురించి సవివరంగా ఆయన చెప్పగలరు.

    రాష్ట్రప్రభుత్వం లెక్కల ప్రకారమూ, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమూ, పత్రికల ప్రకారమూ, ప్రజల్లో వ్యవహారికం ప్రకారమూ, మన రాష్ట్రంలో అధికారికంగా మూడే ప్రాంతాలున్నాయి – కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ. బీజేపీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చెయ్యాలనుకుంటే, మీరు ఆల్రెడీ ఆరు ముక్కలు చేసేశారు!! అద్భుతమైన సమైక్యవాదం మీది!!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో బీజేపీది అవకాశవాద ధోరణే!! “పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు” అన్నది బీజేపీ కేంద్రస్థాయి విధానం కాదు. ఎక్కడి ప్రయోజనాలను బట్టి అక్కడ విధానాలను బీజేపీ రూపొందిస్తున్నది. మీ ప్రశ్నల్లో ఇది మాత్రం కచ్చితంగా నిజం!! అందుకే ఉత్తరప్రదేశ్ విభజన అంశం తెరపైకి రాగానే తెలంగాణలో కిషన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు!!

    అద్వానీ గారి మాట 2002 నాటిది. అప్పటికి తెరాస తెలంగాణ ఉద్యమాన్ని revive చేసి సంవత్సరం కూడా సరిగ్గా కాలేదు. అప్పటికి సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీలు కూడా సమైక్యవాదులే!!

    అయితే కాకినాడ తీర్మానం చేసిన తరవాత కూడా అద్వానీ అట్లా మాట్లాడటం కచ్చితంగా అవకాశవాదమే!! ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది కూడా అవకాశవాదమే మరి!! ఒకసారి తీర్మానం చేసిన తరవాత సీపీఐ, న్యూడెమోక్రసీ మాత్రమే ఆ తీర్మానానికి ఇప్పటి వరకూ కట్టుబడి ఉన్నాయి!!

    రాజధాని ఉందంటే అభివృద్ధి జరిగినట్టే అని thumb rule ఏమీ లేదు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ప్రాంతాలే అభివృద్ధి చెందుతాయి, రాజధాని ఉన్న ప్రాంతాలు కాదు. లక్నో నగరానికి ఆనుకునే ఉన్నా రాయిబరేలీ, బారాబంకీ జిల్లాలు అభివృద్ధిలో అట్టడుగు స్థాయిలో ఉన్నాయి!! రాజధాని లేని పశ్చిమ యూపీ రాజకీయ, సామాజిక ఆధిపత్యం కారణంగా అబివృద్ధి చెందుతుంటే, రాజధాని లక్నో ఉన్నా కూడా మధ్య యూపీ (అవధ్) వెనకబడే ఉన్నది. ఇంచుమించు అదే కారణాలతో తెలంగాణ కూడా వెనకబడే ఉన్నది.

    తెలంగాణవాదులు “రక్తపాతం” లాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తెలంగాణవాదులైనా, సమైక్యవాదులైనా, ఏ వాదులూ కాకపోయినా అందరూ ఆ వ్యాఖ్యలను ఖండించాల్సిందే!! హైదరాబాద్ జిల్లాలో ఉన్న సీమాంధ్ర ప్రజల కన్నా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న సీమాంధ్ర ప్రజల సంఖ్య ఎక్కువ!! తెలంగాణ ఉద్యమం మొదట్నుంచీ బలంగా ఉన్నదీ ఇక్కడే!! రక్తపాతం సృష్టించాలన్న తెలంగాణవాదుల ఆలోచనలు మీరు చెప్పినట్టు నిజమే అయితే, ఇప్పటికే ఈ జిల్లాల్లో ఉన్న లక్షలాది సీమాంధ్రుల పరిస్తితి ఏమయ్యేది?? అనవసరంగా గగ్గోలు పెడుతున్న సమైక్యవాదుల్లో తప్ప తెలంగాణవాదుల్లో ఈ ఆలోచన ముమ్మాటికీ లేదు.

    తెలంగాణ నుంచి సీమాంధ్రకు వలస వచ్చి బతుకుతున్న వాళ్లు ఎంతమంది, సీమాంధ్ర నుంచి తెలంగాణ జిల్లాలకు (హైదరాబాద్ మినహాయించినా) వలస వచ్చిన వాళ్లు ఎంతమంది?? తెలంగాణ జిల్లాల్లో గుంటూరు పల్లెలూ, గుడివాడ పల్లెలూ ఎన్నో ఉన్నట్టు, సీమాంధ్రలో ఒక్క సిరిసిల్ల పల్లెనో, జగిత్యాల పల్లెనో, మెదక్ పల్లెనో చూపించగలరా?? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వలసలు జరిగాయన్నది వాస్తవం!! బుకాయింపులతో వాస్తవాలు ఎంతో కాలం దాగవు!!

    ఈగోలూ, prejudices వదిలేసి చిత్తశుద్ధితోనూ, open mind తోనూ పరిశీలిస్తే వాస్తవాలు కనిపిస్తాయి. తెలంగాణవాదులు చెప్తున్న విషయాల్లోని వాస్తవాలు ఎంత అని తెలుసుకోవడం కన్నా తెలంగాణవాదులను “వేర్పాటువాదులు”, “తీవ్రవాదులు” అని సంబోధించడంలోనే సమైక్యవాదులకు ఎక్కువ సంతోషం, ఆత్మసంతృప్తి కలుగుతున్నట్టు కనిపిస్తున్నది.

    తమ్ముడు విడిపోవాలనుకుంటుంటే, బుర్ర ఉన్న అన్న ఎవరైనా (కలిసుండాలన్న ఆలోచన నిజంగా ఉంటే గనక) వాడికి నచ్చజెప్పి, వాడి బాధ ఏంటో తెలుసుకుని, పరిష్కరించి, కలుపుకుపోడానికి ప్రయత్నిస్తాడు గానీ, తమ్ముడి మీద వేర్పాటువాది, తీవ్రవాది, మోసకారి అంటూ అభాండాలు వెయ్యడు, ఏదో ‘రహస్య ఎజెండా’ ఉంటే తప్ప!! సమైక్యవాదం తెలంగాణ సమస్యకు పరిష్కారం సూచించే దిశగా ఉండాలి, అసలు సమస్యే లేదని భ్రమపడుతూ ఇతరులను మభ్యపెట్టే విధంగా కాదు.

    వాస్తవాల ఆధారంగా సమస్యలకు పరిష్కారం సూచించే వాదాలు భావజాలం అనిపించుకుంటాయి. వాస్తవాలను ignore చేసేసి, పరిష్కారం మాట గాలికి వదిలేసి సమస్య చుట్టూనే భ్రమించడం భావదారిద్ర్యం అవుతుంది. మీది ఏదో మీకే తెలియాలి!!

    “సమైక్యరాష్ట్రమే సమస్య” అని తెలంగాణవాదులు అంటుంటే, “సమైక్యరాష్ట్రమే పరిష్కారం” అని వాదించడం ఏ రకమైన తర్కమో సమైక్యవాదులకే తెలియాలి!!

    రిప్లయితొలగించండి
  3. /తెలంగాణవాదులు “రక్తపాతం” లాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తెలంగాణవాదులైనా/
    అనలేదనే భ్రమలోనే బ్రతుకుతున్న వాళ్ళు ఇంకా వున్నారా?!! తలలు నరుక్కుంటామంటే... రక్తపాతం కాక కల్లు/ గుడంబా పారుతుందా?

    /తమ్ముడు విడిపోవాలనుకుంటుంటే, బుర్ర ఉన్న అన్న ఎవరైనా (కలిసుండాలన్న ఆలోచన నిజంగా ఉంటే గనక) వాడికి నచ్చజెప్పి, వాడి బాధ ఏంటో తెలుసుకుని, పరిష్కరించి, కలుపుకుపోడానికి ప్రయత్నిస్తాడు /
    చాలా బాగా సెప్పినారు. అందుకే బుర్ర బుద్ధి వుండే మనిషిలా ప్రవర్తిస్తారని రాష్ట్రానికి చెందని సభ్యులతో SKC కమిటీ వేసి, ఏడాదిగా విస్తృత విస్లేషణ జరిపి రిపోర్ట్ ఇచ్చారు. మరి 'బుర్ర' వుంటేగా! మాకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తేనే లేదంటే అది దిక్కుమాలిన కమిటీ అని అన్నారు. సామ విఫలమైతే ఇక మిగిలేది భేధ, దాన, దండోపాయాలు. దానం దగ్గర ఆగిపోయింది. కచరా గారికి బేరాలు కుదరలేదు. ఇక మిగిలిన దండోపాయం లైట్‌గా ప్రయోగిస్తామని 'సంకేతాలు' రాగానే వుజ్జమం, వీరంగాలు, షర్ట్లు విప్పి ఆడే కల ఆటా-పాటా, 'లుచ్చే లఫంగే' భాష, గోస, సంస్కృతి ఒక్కరోజులో బంద్ అయిపోయాయి. మా మీద కేసులు తీసేయున్రి అని కాళ్ళబేరానికి వచ్చారు. ఏదీ హరీష్‌రావుడి ఢిల్లీ శాంతియుత వీరంగం?! ఈ పాటికి 101మంది పోరాట సారధులు: గద్దరులు, మద్రాసు మైగ్రంట్ విజయశాంతిలు, మూలనున్న లచ్చుమయ్యలు కూడా తమ భాగాలకు బయల్దేరారు. బత్కమ్మ నేర్చి ప్రతి ఏడూ ఆడే ఓపిక లేక విజయశాంతి, రోజాలు, జయసుధ, చిరులను ఫాలో అవుతూ, YSR పోక ముందు ఆపరేషన్ ఆకర్షకు క్యూలు కట్టిన వారు కాదా?
    'తమ్ముడికి' బుర్ర వుంటే చెప్పి చూస్తారు, లేదంటే బుర్ర రామ కీర్తన పాడించాలని తమిళ కవి బాల రామాయణంలో ఓ చోట అన్నారని విన్నాను.

    రిప్లయితొలగించండి