28, జులై 2012, శనివారం

తమ వార్తా పత్రికలో మూడు నెలలలో తెలంగాణా వచ్చేస్తుందని అబద్ధాలు రాసి, ప్రజలని మభ్య పెడుతూ వస్తున్నా టీఆరెస్ బాకా ఊదే పత్రిక నమస్తే తెలంగాణా పత్రికలో ఎదుటివారు అంటే మెయిల్ టుడే అనే ఆంగ్ల పత్రికలోనూ, సాక్షి, ఆంద్ర భూమి పత్రికలలోనూ వచ్చిన వార్తని అబద్ధం అని సీమాంధ్రుల అక్కసు అని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన తీరు చూడ ముచ్చటగా ఉంది. దాని లంకె మరియూ వార్త యొక్క పూర్తీ పాఠం ఈ కింది విధంగా ఉన్నాయి.
http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=3&ContentId=133428

తెలంగాణపై ఆఖరి దశలోనూ అక్కసు
n నివేదిక పంపే అధికారం హోంకు లేదు
- అదే జరిగితే రాజ్యాంగ ఉల్లంఘనే
- తెలంగాణపై రాజకీయ నిర్ణయం రావాల్సి ఉంది
- ఏమీ పట్టించుకోని సీమాంధ్ర మీడియా
- చిత్తు కాగితం దొరికినా విత్రంగా చూస్తున్నారు
- కన్నెర్ర చేస్తున్న ప్రత్యేకవాదులు
- అసత్య కథనాలు నమ్మొద్దని ప్రజలకు వినతి

(టీ మీడియా, న్యూఢిల్లీ) సీమాంధ్ర మీడియా..భగ్గుమన్న తెలంగాణవాదులు ఆంగ్ల పత్రిక సింగిల్‌కాలం భవిష్యవాణిఅమోఘంగా వినిపించిన ఆంధ్ర మీడియాఅంతా అయిపోయిందంటూ విశ్లేషణలు కేంద్ర హోం శాఖ ఓ నివేదికను రూపొందిస్తున్నట్లు, అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్న అభివూపాయం ఉండబోతున్నట్లు, ఆ నివేదికను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హోం శాఖ త్వరలో అందజేయనున్నట్లు మెయిల్ టుడే అనే ఆంగ్ల పత్రిక ఊహాజనిత కథనాన్ని ప్రచురించడం.. దానికి సాధ్యాసాధ్యాలను కనీసంగానైనా అంచనా వేయకుండా.. కేంద్రం ఇక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వన తెలంగాణపై సీమాంధ్ర మీడియా అక్కసు వెళ్లగక్కడంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండటమే కాకుండా.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్న తరుణంలో ఇటువంటి ప్రచారాలు తెలంగాణ సమాజాన్ని గాయపర్చే అవకాశాలు ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాష్ట్ర విభజన చేయాలా వద్దా అనే విషయంలో నిర్ణయం హోంశాఖకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దేశంలో ఏదైనా రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్ర విభజనపై అటో ఇటో నిర్ణయం తీసుకోవాలన్నా అది కేంద్ర కేబినెట్ పని. దానిపై పార్లమెంటు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. దానిని రాష్ట్రపతి ఆమోదించాలి. రాష్ట్రపతి సిఫారసు మేరకు కొత్త రాష్ట్రం ఏర్పాటు జరుగుతుంది. ఇంత ప్రక్రియ జరగాల్సి ఉండగా.. తెలంగాణ ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయంటూ హోం శాఖ ఏకంగా రాష్ట్రపతికి నివేదిక పంపేందుకు సిద్ధపడుతున్నదని, తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా లేదని అందులో పేర్కొనబోతున్నారంటూ ఓ అంగ్ల పత్రికలో వచ్చిన ఊహాజనిత కథనాన్ని ఆంధ్ర మీడియా తలకెత్తుకోవడంపై తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దున్నపోతు ఈనిందంటే లేగను కట్టేయమన్నట్లు వీటి వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతాజేసి అసలు అలాంటి నివేదికేదీ లేదని తెలుస్తున్నది.


కానీ.. సదరు ఆంగ్ల పత్రిక మాత్రం ఆ నివేదికలో మంత్రిత్వ శాఖకు సంబంధించి పలు పెండింగ్ అంశాలు ఉండనున్నట్లు తన జ్యోతిష్యాన్ని జోడించింది. అనేక సమస్యలపై చాలా కాలంగా ఏటూ తేల్చుకోలేక సతమవుతున్న హోం శాఖ ఏదో మంత్రమేసినట్లుగా ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారాలు కనుగొని.. రాష్ట్రపతికి నివేదించనున్నట్లు తన ఊహాశక్తిని ప్రదర్శించిందని పరిశీలకులు అంటున్నారు. సున్నితమైన అఫ్జల్ గురు క్షమాభిక్ష మొదలుకుని, అతి సున్నితమైన తెలంగాణ అంశం దాకా దేన్నీ వదలకుండా హోం శాఖ తన నివేదికలో పరిష్కారమార్గాలను పేర్కొనబోతున్నట్లుగా కథనాన్ని వండి వార్చింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉగ్రవాద చట్టాన్ని కేంద్రం వ్యతిరేకించనున్నట్లు, అఫ్జల్ గురుకు ఉరిశిక్ష తప్పదన్నట్లు, ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడనట్లు, సర్వ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఓ ఎన్‌సైక్లోపీడియా మాదిరిగా హోం శాఖ నివేదిక ఉండనున్నట్లు తన రచనా పాటవాన్ని ప్రదర్శించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణపై నిర్ణయం తీసుకోనప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయానికి రావడం.. అది కూడా వ్యతిరేక నిర్ణయానికి రావడం అసాధ్యమన్న కనీస విశ్లేషణను సైతం ఆ కథనం విస్మరించినట్లు కనిపిస్తున్నది.

గత సంవత్సర కాలంగా ‘ఆ నాలుగు పార్టీలు’ వైఖరి చెప్పాలంటూ ప్రతి నెలా చివరి రోజున ఆరున్నొక్కరాగంలో ఆలపిస్తున్న హోం మంత్రి చిదంబరం పాట కూడా ఆ పత్రికకు వినపడలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం వెల్లడిస్తే మిగిలిన మూడు పార్టీలు నిర్ణయానికి వస్తాయని, దాని తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకోగలుగుతుందని హోం మంత్రివర్యులు మొత్తుకుంటున్న విషయం సదరు పత్రిక చెవినపడలేదు. సంప్రతింపుల ప్రక్రియ సాగుతోదంటూ ఏడాదిగా సాగదీస్తున్న గులాంనబీ ఆజాద్ విన్యాసాలు దానికి కనపడలేదు. తెలంగాణపై ఒక నిర్ణయానికి రావడానికి రాష్ట్ర నేతలందరి అభివూపాయాలు సేకరిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం హడావుడి చేస్తుండగానే.. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయానికి వచ్చేసినట్లుగా రాయడం సత్య దూర మన్న విషయాన్ని తొక్కిపట్టింది. కాంగ్రెస్‌ను కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన నివేదికలో తెలంగాణపై కేంద్ర నిర్ణయాన్ని ప్రకటించే సాహసం చేయలేదన్న వాస్తవాన్ని మరుగునపరిచింది. రానున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా తెలంగాణపై అందరు నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానన్న ఆజాద్ మాటలను ఆ కథనం అసలు పరిగణించలేదు.

ఆజాద్‌ను కాదని తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి వెల్లడించనంత వరకు కేంద్ర మంత్రి వర్గం ఏం చేయలేదని, కేంద్ర మంత్రి వర్గం అంటే అది కేవలం కేంద్ర హోం శాఖ ఒక్కటే కాదన్న రాజ్యంగ స్పూర్తిని పూర్తిగా విస్మరించి తెలంగాణ సమస్య పరిష్కారం అంతా హోం శాఖ చేతిలోనే ఉన్నట్లు కథనాన్ని ప్రచురించిందని ఉద్యమ శ్రేణులు ఆక్షేపణ తెలుపుతున్నాయి. కనీసం జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకుండానే తెలంగాణపై అంతా నాకే తెలుసన్నట్లుగా భవిష్యవాణిని వినిపించిందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సినిమా గాసిప్స్‌ను అమోఘంగా వండి వార్చె సదరు పత్రిక ఇప్పుడు సంచలనాల కోసం తెలంగాణలాంటి సున్నిత అంశాలను కూడా గాసిప్స్ రొంపిలోకి దింపుతోందదని తెలంగణవాదులు విమర్శిస్తున్నారు. ఇక ఏ ఆధారం లేకుండా, స్థానిక అంశాలతో ఏ మాత్రం పరిచయం లేని మెయిల్ టుడే ప్రచురించిన కథనం అదేదో రాజపవూతమైనట్లు.. అన్నీ తెలిసిన సీమాంధ్ర మీడియా సంస్థలు ఇక అంతా అయిపోయిన ప్రచారం చేయడంపై తెలంగాణవాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

తెలంగాణ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మీడియా సంస్థలకు తెలంగాణపై విషం గక్కడం ఇదే మొదటి సారి కాదని గుర్తు చేస్తున్నారు. ఆజాద్ ఇరు ప్రాంత నేతలతో సంప్రతింపులు ముగించి అధినేత్రి సోనియాకు ఇచ్చిన నివేదికలో తెలంగాణ అవసరం లేదని ఆజాద్ పేర్కొన్నట్లుగా ప్రచారానికి దిగారని పేర్కొంటున్నారు. ఆ నివేదిక ఏదో తామే ఇచ్చినంతగా బిల్డప్ ఇచ్చాయని తెలంగాణవాదులు చెబుతున్నారు. నిజానికి ఆ సమయంలో అప్పటికి ఆజాద్ సంప్రతింపుల ప్రక్రియను ముంగించనూ లేదు.. తుది నివేదికను సమర్పించనూ లేదని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే 14ఎఫ్ తొలగింపు, ప్రాణహిత-చే ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయ మార్గాలంటూ గోల చేశాయని అంటున్నారు. వారి మదిలో దాగున్న కోర్కెను సందర్భానికనుగుణంగా ప్రజలపై రుద్ది, వికృతానందం పొందటం ఆ మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని తెలంగాణవాదులు నిప్పులుగక్కుతున్నారు.


తమ ఆకాంక్షలను, అజెండాలను ఢిల్లీ పెద్దలకు ఆపాదించడం వారికి పరిపాటిగా మారిందని, ‘మనం మండించి వండిన వార్తలను ఖండించే వారు దండించే వారు లేరన్న ధీమా’తో సీమాంధ్ర మీడియా వికృత చేష్టలు రోజు రోజుకు మీతిమీరిపోతున్నాయని తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ రాదని రోడ్డు మీద ఓ పిచ్చి కాగితం దొరికినా దాని ఆధారంగా ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఊదర కొట్టేదాకా ఈ పైత్యం వెళ్లిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మెయిల్ టుడే కథనానికి ఎక్కడలేని పవివూతతను ఆపాదించి, తెలంగాణ రాదని చెప్పడం ద్వారా తమ కుళ్లుబోతు తనాన్ని వెల్లబోసుకున్నారని మండిపడుతున్నారు. ఏదో లక్ష్యంతో, ఏవో ప్రయోజనాలాశించి మెయిల్ టుడే రాసుకున్న సింగల్ కాలమ్ ఐటమ్‌ని గంటల తరబడి మోతబెట్టిన సీమాంధ్ర మీడియాను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేదని ఉద్యమ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ తేల్చెయ్యాలన్న కృతనిశ్చయంతో మేడమ్ ఉన్నారన్న వార్తలు వెలువడగానే అర్థం పర్థం లేని కథనాలతో ప్రజలను గందరగోళ పరచాలనుకుంటే అది అయ్యే పని కాదని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం చెబుతుండటం గమనార్హం.


సున్నితవాతావరణంపై దాడి!
ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రత హెచ్చు స్థాయిలో ఉంది. దశాబ్దాల అణచివేతల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం కల్పించిన భావోద్వేగాలు తెలంగాణ గుండెల్లో నిండి ఉన్నాయి. ఇప్పటికే ఒకసారి నోటిదాకా వచ్చిన కూడును సీమాంధ్ర నేతలు కట్టగట్టుకుని, రాజీనామా డ్రామాలాడి నేలపాలు చేశారని తెలంగాణ ఉద్యమ శ్రేణులు విమర్శిస్తున్నాయి. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణకు ఏ కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తున్నదని అనిపించినా సీమాంధ్ర నేతలు దానిని నాశనం చేయడానికి ప్రయత్నించారని, ఇప్పుడు కూడా అదే తీరులో వారి ప్రవర్తన ఉందని నేతలు అంటున్నారు.

అన్నింటికంటే మించి తెలంగాణ ఏర్పాటు చేయడమా? నిరాకరించడమా? అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా జరగాల్సిన నిర్ణయమని, అనేక రాజకీయ సమీకరణాలు ఈ నిర్ణయంతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం వెలువడుతుందని సంకేతాలు ఉన్నాయి. ఆ నిర్ణయం ఎలా ఉంటుందన్నది చెప్పలేకపోయినా.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తెలంగాణలో భావోద్వేగాల తీవ్రత నేపథ్యంలో సానుకూలంగానే నిర్ణయం ఉంటుందన్న ఆశాభావాల వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితుల నేపథ్యంలో అధిష్ఠానం అనివార్యతతో కూడిన సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందన్న వాదన ఉంది. ఇదే విషయంలో తమకు సంకేతాలు ఉన్నాయని కొందరు రాజకీయ నేతలు చెప్పడం మినహా కాంగ్రెస్ అధిష్ఠానం మనసులో ఏమున్నదన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మొత్తంగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. సానుకూల సంకేతాలు ఎలా ఉన్నా.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ జేఏసీ సంసిద్ధమవుతున్నది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30 చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. రాగల నిర్ణయం ఏదైనాప్పటికీ ముందే ఊహాగానాలు చేసి, ప్రతికూల ఫీలర్లు వదలడం ప్రమాదకరమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఇటువంటి ప్రతికూల ప్రచారాలు దాదాపు 800 మంది తెలంగాణ బిడ్దలను బలిగొన్నాయి. కరడుగట్టిన సమైక్యవాదులైన లగడపాటి వంటి వారి అసత్య ప్రచారాలు, తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేసిన ప్రయత్నాలకు మనసు కకావికలమై, వీరంతా ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇప్పుడు మళ్లీ తెలంగాణకు వ్యతిరేకంగా ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రసారం చేయడం తెలంగాణ యువకులను రెచ్చగొట్టడమే అవుతుందన్న అభివూపాయాలను తలపండిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఒక రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఒక శాఖ స్వతంవూతించి నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని వారు స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వారు తేల్చి చెబుతున్నారు. 2009 డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన కూడా కేంద్రం తరఫున చేసిందే తప్పించి, హోం శాఖ తనకు తానుగా చేసింది కాదని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్న సున్నితవాతావరణాన్ని దెబ్బతీసేందుకు తప్ప మరొకందుకు కాదని వారు అంటున్నారు. ఈ సున్నిత వాతావరణం దెబ్బతిని, జరగరాని ఘటనలు ఏవైనా జరిగితే అందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

13 కామెంట్‌లు:

  1. తెరాస నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశే 'ఖర'రావుగారు వచ్చే మూడు నెలలలో తెలంగాణా ఇచ్చేస్తుంది ఆ సంకేతాలు అందుతున్నాయి అని పత్రికా ముఖంగా వాకృచ్చిన తరువాత ప్రాథమిక పాఠశాల స్థాయి ఉపాధ్యాయుడు, మొన్నటివరకూ దుబాయి శేఖర్ ఇంటి మనిషి, తెలంగాణా అనైక్యత అకార్యాచరణ కమిటీ కన్వీనరులు,తనని ప్రొఫెసర్ అని పిలవమని పత్రికా విలేఖరులని పదిసార్లు అడిగి పిలిపించుకొనే ము.కో.రా.రె (ముద్ద సాని కోదండ రామీ రెడ్డి)ఆ సూచనలేవో ఆయన చెవిలో ఊదారేమో అని ఢంకా బజాయిన్చినట్లు చెబితే, మన ఉద్యమకారుల భగవద్గీత అయినటువంటి నమస్తే తెలంగాణా సీమాంధ్ర వార్తా పత్రికలూ అసలు విషయాన్ని దాచి విషం కక్కుతున్నయనడానికి ఆ వార్తా పత్రిక సంపాదకులవారి విజ్ఞత మీద నాకు కించిత అనుమానం గా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rallabhandy Ravindranath గారు, మీరు తెలంగాణవాదులను ద్వేషించడమూ, దూషించడమూ మాత్రమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. మంచో చెడో పక్కన పెడితే, కేసీఆర్ ఒక purpose కోసం దశాబ్దానికి పైగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న నాయకుడు!! అటువంటి ఒక నాయకుణ్ణి పట్టుకుని 'గాడిద' అనే అర్థం వచ్చేలా అవమానకరంగా సంబోధిస్తూ వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడమే సమైక్యవాదం అని మీరు అనుకుంటే అది సమైక్యవాదంలోని డొల్లతనాన్ని, మీ నరనరాల్లో జీర్ణించుకుపోయిన అహంభావాన్ని, అహంకారాన్ని మాత్రమే సూచిస్తుంది!!

      తెలంగాణవాదులను, ఉద్యమాన్ని, నాయకులను వ్యక్తిగతంగా అవమానించడం ద్వారా మీ అహం తాత్కాలికంగా తృప్తి చెందవచ్చేమో కానీ, మీ సిద్ధాంతం స్థాయిని అది తక్కువ చేస్తుంది. మీ వాదంలో బలం, ideological basis గనక ఉంటే ఇట్లా నోరుజారి, తిట్లు తిట్టి, వాదం సాగించాల్సిన అవసరం ఏంటి?? అది మీ భావదారిద్ర్యాన్ని, అల్పసంతోష గుణాన్ని చూపిస్తున్నది.

      కోదండరామ్ గారు కె. బాలగోపాల్ సహచరుడు. బాలగోపాల్ తో కలిసి మానవ హక్కుల సంఘాన్ని స్థాపించిన మనిషి. ప్రొఫెసర్ గా తనకు వచ్చే జీతంలో ఇప్పటికీ సగానికి పైగా పేద విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేస్తున్న మనిషి. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ప్రాథమిక పాఠశాల స్థాయి ఉపాధ్యాయుడని మీరు భ్రమించడాన్ని బట్టి, మీ వాదానిది foot path స్థాయి అని అర్థం అవుతున్నది.

      మీ సమైక్యవాద సిద్ధాంతానికి ప్రత్యేకరాష్ట్ర సిద్ధాంతం వ్యతిరేకం కావచ్చు. వాదాన్ని వాదంతోనే ఎదుర్కోవాలి. సిద్ధాంతాన్ని సిద్ధాంతంతోనే ఎదుర్కోవాలి. తిట్లు, శాపనార్థాలు, ఎగతాళి మాటలు, హేళనలు ఏవీ వాదం, సిద్ధాంతం అనిపించుకోవు, నోటి దూల అనిపించుకుంటాయి. నాలుగు తిట్లు తిట్టేసి, నలుగుర్ని ఎగతాళి చేసేసి నేను వాదం గెలిచేశాను, సమైక్యవాదం నిలబెట్టేశాను అని మీరు అనుకుంటే మీకన్నా అల్పసంతోషి ప్రపంచంలోనే ఉండరు.

      సహజంగా సమైక్యవాదంలో విశాల దృక్పథం ఉంటుంది, విభజనవాదంలో సంకుచిత దృక్పథం ఉంటుంది. కానీ మీ వాదం (నిజానికి ఇది వాగుడు మాత్రమే) తీరు చూస్తుంటే సమైక్యవాదంలో సంకుచితత్వం కనిపిస్తున్నది, విభజనవాదంలో విశాలత్వం కనిపిస్తున్నది.

      తెలంగాణవాదులు సమైక్యాంధ్రవాదులను దూషించినా, వ్యక్తిగతంగా తిట్టి రాక్షసానందం పొందజూసినా అది ముమ్మాటికీ తప్పే!! ఆ పని సమైక్యవాదులు తెలంగాణవాదుల పట్ల చేసినా తప్పే!!

      కేసీఆర్ మమ్మల్ని బూతులు తిట్టారు అంటూ ఆకాశం బద్దలయ్యేట్టు గగ్గోలు పెట్టే ఈ సమైక్యవాదులు, తాము కూడా అదే పని చేస్తున్నారు. గురివిందలు కూడా మీ తీరు చూసి నవ్వుకునే స్థాయికి సమైక్యవాదం అనే సుహృద్భావనను, విశాల దృక్పథాన్ని దిగజార్చారు.

      తొలగించండి
    2. /కేసీఆర్ మమ్మల్ని బూతులు తిట్టారు అంటూ ఆకాశం బద్దలయ్యేట్టు గగ్గోలు పెట్టే ఈ సమైక్యవాదులు, తాము కూడా అదే పని చేస్తున్నారు/

      తమరైతే ఏంచేసివుండేవారు?! దం బిరియాని తినబెట్టి, వంగొని సరదాగా చితక్కొట్టుకోమని వీపు ఇచ్చేవారా?! :))

      తొలగించండి
    3. /సిద్ధాంతాన్ని సిద్ధాంతంతోనే ఎదుర్కోవాలి. తిట్లు, శాపనార్థాలు, ఎగతాళి మాటలు, హేళనలు ఏవీ వాదం, సిద్ధాంతం అనిపించుకోవు, నోటి దూల అనిపించుకుంటాయి. /
      కరక్టే, మీతో వ్యూహాత్మకంగా ఏకీభవిస్తా.
      మరి, రాద్ధాంతాన్ని, తింగర వేర్పాటువాద నోటి దూల వాదాన్ని ఎలా ఎదుర్కోవాలంటారు? :P :))

      తొలగించండి
    4. >>> అటువంటి ఒక నాయకుణ్ణి పట్టుకుని 'గాడిద' అనే అర్థం వచ్చేలా అవమానకరంగా సంబోధిస్తూ

      ఒక్క వ్యక్తిని హేలనచేస్తేనే మీరు ఇంత ఆవేశం చెందుతున్నారు. మరి ఒక ప్రాంతం వారినందరినీ 'దోపిడీ' దారులు అన్నప్పుడు ఎక్కడ ఉన్నారు.
      (క్షమించండి 'పిడికెడు పెట్టుబడిదారులు' పిట్ట కధలు చాలానే విన్నాము)

      >>> తెలంగాణవాదులను, ఉద్యమాన్ని, నాయకులను వ్యక్తిగతంగా అవమానించడం

      రవీంద్రనాథ్ గారు కేవలం కచరా మరియు కోదండ రామిరెడ్డి గురించి మాత్రమె చెప్పారు. మీరు మొత్తం ఉద్యమాన్ని తెలంగాణ వాదులను ఇందులో కలిపి అతి తెలివి చూపొద్దు.

      >>> ప్రొఫెసర్ గా తనకు వచ్చే జీతంలో ఇప్పటికీ సగానికి పైగా పేద విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేస్తున్న మనిషి

      ఉద్యమం పేరుతొ డిల్లి పెద్దల వద్ద సెటిల్మెంట్లు చేసుకుంటే, సగం ఏమి మొత్తం జీతమే ఇచ్చేయ్యొచ్చు.

      >>> నాలుగు తిట్లు తిట్టేసి, నలుగుర్ని ఎగతాళి చేసేసి నేను వాదం గెలిచేశాను, సమైక్యవాదం నిలబెట్టేశాను అని మీరు అనుకుంటే మీకన్నా అల్పసంతోషి ప్రపంచంలోనే ఉండరు.

      పాపం మీరు మీ 'డప్పు' చానలు అసలు చూడరనుకుంటా. ఒక ఆదివారం చూడండి. భ్రమ అనే మాటకు అర్ధం తెలుస్తుంది.

      >>> సహజంగా సమైక్యవాదంలో విశాల దృక్పథం ఉంటుంది, విభజనవాదంలో సంకుచిత దృక్పథం ఉంటుంది.
      అంటే విభజన వాదులు ఏమి వాగినా, కూసినా ఊర్కోవడమే విశాల దృక్పధమా?
      అసలు సమైక్యవాదం, విశాలంధ్ర అంటే విశాల దృక్పధం అని మీకు ఎవరు చెప్పారు?

      తొలగించండి
    5. Avinash Vellampally గారూ, శ్రీమాన్ చంద్రశే ఖర రావు గారు అని కాస్త వ్యంగ్యంగా రాస్తేనే తతుఉకోలేకపోయిన మీ భావదారిద్రయానికి నా జోహార్లు. ఇంక మీరు భుజాల కేత్తుకొనే శ్రీమాన్ ము.కో.రా.రె (ముద్దా సాని కోదండరామ రెడ్డి)గారు తమ పీహెచ్డీ కార్యక్రమాన్ని చాలా కష్టపడి చెసారని అదీ మీ అల్లం నారాయణ గారు సంబోదించే విధంగా ముడ్డి కిందకి యాభయి సంవత్సరాలు వయసు దాటాక కానీ ఆ పీహెచ్ డీ ప్రోగ్రాం యొక్క బ్రాకెట్లు విడదియలేక పోయారని నేను వేరుగా చెప్పలిసి వస్తున్నందుకు చింతిస్తున్నాను. పైగా తానూ చేసే ఉద్యోగం గురించి ఆయన గొప్పగా నన్ను ప్రొఫెసర్ అని పిలవండి అని పత్రికల వాళ్లని దేబిరించడం నిజం కాదా! కావాలంటే మీరు బూతులు తిట్టే సీమాంధ్ర పత్రికలూ చదవండి. ఇఇయనగారికి ప్రోగేసర్ గిరి ఏదో ఊదబోడుస్తాడని సీనియర్ అని రాలేదు. ఆయన రెడ్డి కులస్తుడు. రాజశేఖర రెడ్డి తన కులం వాడని రికమెండ్ చేస్తే ప్రొఫెసర్ గిరి ప్రాప్తమయ్యింది. ఇంక చంద్రశే ఖరులుం గారిని అలా పిలవడం తప్పే. కారణం ఆయన తన సంపదని వేల కోట్లరూపాయలకు పెంచుకొన్నాడు తన వెనుక ఉన్న జనాలని పిచ్చివాల్లని చేసి. నేను ప్రత్యెక రాష్ట్రవాదాన్ని నా యీ బ్లాగులో తప్పు పట్టలేదు. శ్రీమాన్ కల్వకుంట్ల చంద్ర శేఖర రావుగారి స్వంత పత్రిక నమస్తే తెలంగాణా లోని రాసిన వార్తని, ఆయన చేసిన ప్రకటనని మీ తెలంగాణా వాదులే ఖండించారు పరుష పద జాలంతో ఎదుటివారి ని చూపించే ముందు మడిచి ఉన్న మీ మూడు వెళ్ళని చూసుకోండి. ఇంక మీరు నన్ను ఫుట్ పాత్ మీద బతికే మనిషిని అని చెప్పారు. బాగుంది నేను ఆ విధమైన మనిషినే కావచ్చు. దానివలన మీరు రాసినది ఉన్నత స్థాయిలో నిలబెడుతుందంటే నాకేమీ అభ్యంతరం లేదు. మీకు వ్యాస కర్తని అవమానించడం మీ యొక్క సంస్కారం. నాకు అంత సంస్కారం లేదు కనుక మిమ్ములని ఆ విధంగా సంబోదిన్కాలేను.

      తొలగించండి
  2. జైగో గారికి కూడా సంకేతం అందినట్టుంది, 'త్వరలో విడుదల' అంటున్నారు. :))

    రిప్లయితొలగించండి
  3. /విభజనవాదంలో విశాలత్వం కనిపిస్తున్నది/
    పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా .. అంటారు. మీ దృష్టి ది foot path స్థాయి అని అనుకోవచ్చా?

    రిప్లయితొలగించండి
  4. తెలంగాణోద్యమం లో ఒక మహత్తర ఘట్టం రైల్ రొఖో. దీన్ని మళ్ళీ చేపట్టేసి తెలంగాణా సాధించేయండి. ఎందుకీ పనికిమాలిన మార్చులూ...జనవరులూ..

    అస్సలుకీ మూడు నెలల్లో తెలంగాణా సాధించబోతూ కోడిరెడ్డి గారి ఈ తపన ఏంటో... వార్తల్లో లేకుంటే వసూళ్ళు సరిగా రావనా...

    రిప్లయితొలగించండి
  5. http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/didn%E2%80%99t-send-note-t-prez-pc-451

    When his attention was drawn on reports in a section of media, saying Home ministry officials have prepared a report to be sent to the President expressing inability to find a consensus on the Telangana issue and favouring continuation of the state in its present geographical form, the Union home minister said, “We have not prepared any such report or sent it to President. The Home ministry will not have any opinion on matters that come under the Union Cabinet.”

    రిప్లయితొలగించండి
  6. There was a mention about the designation of professor in this thread.
    The other day I met a retired professor of Kakatiya University in a train journey.The (real) professor told me that Late Jayashankar was never a professor and he only held the post of a reader ( equivalent to Asst. Professor?) before becoming registrar.
    In that scenario I am at sea as to how he was and is being called professor? Is it like the so called kaaki lekkalu ?

    రిప్లయితొలగించండి
  7. శ్రీమాన్ చంద్రశేఖరరావ్ గారిని రాళ్ళబండి రవీంద్రనాథ్ గారు "చంద్రశే 'ఖర'రావుగారు" అని సంభోదించి 'గాడిద' అనే అర్థం వచ్చేలా అవమానకరంగా సంబోధిస్తూ వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడమే సమైక్యవాదం అని మీరు అనుకుంటే అది సమైక్యవాదంలోని డొల్లతనాన్ని, మీ నరనరాల్లో జీర్ణించుకుపోయిన అహంభావాన్ని, అహంకారాన్ని మాత్రమే సూచిస్తుంది!! అసలు శ్రీమాన్ చంద్రశేఖరరావ్ గారిని ఎలా సంబోదించాలో సరిగా తెలుగు తెలీని ఆంధ్రులకేమి తెలుసు, సాటి తెలంగాణా వాది పదహారణాల అచ్చతెలుగులో ఇలా సంభోదిస్తున్నారు. కని-విని తరించండి. లంకె >> http://www.youtube.com/watch?v=jKQYZb5twkA&feature=share&list=PLC3C6DD49F8A6EDE5

    రిప్లయితొలగించండి