8, డిసెంబర్ 2011, గురువారం

జనవాక్యం: తెలుగు పీఠమా? ఆంధ్ర పీఠమా?

జనవాక్యం,ఆంధ్ర జ్యోతి : ఎట్టకేలకు తెలుగు భాషకు ప్రాచీనహోదా, ఆ పీఠం మైసూర్‌లో కాకుండా తెలుగు నేలపై నెలకొల్పటానికి అంగీకారం పొందటం జరిగింది. ఇది అందరూ సంతోషించదగ్గ సఫలత. అయితే ఒక విషయంలో జాగరూకులమూ ఆలోచించవలసిన అగత్యం ఉంది. రాష్ట్ర విభజన ఉద్యమం పేరిట జరిగిన అన్యాయాల, అవమానాల, జాబితాలో భాష, భాషావేత్తలు, కవులు పొట్టిశ్రీరాములు, ఆర్థర్ కాటన్, తెలుగు తల్లి, కాసు బ్రహ్మానందరెడ్డి, వంటి ప్రముఖులే గాక, ఆంధ్రా బేంక్, ఆంధ్ర మహిళాసభ వంటి సంస్థలు, ప్రాంతీయ దైవాలు, తిరుపతి లడ్డూ కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు వేరు ఆంధ్రం వేరు, సీమాంధ్రులది ఆంధ్రభాష, తెలంగాణ వారిది తెలుగు భాష అన్న వాదనలు కూడా బయలుదేరాయి. ఇన్నాళ్ళూ 'మన' రాజధాని అన్న భావంతో రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు పరంగా ఎన్ని విద్యా, వైద్య పార్రిశామికాది సంస్థలు హైదరాబాదులో వెలసినా కిమ్మనలేదు. కాని నేటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు పీఠాన్ని మైసూర్ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని సి.నా.రె, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి రచయితలు బుద్ధప్రసాద్, పురంధేశ్వరి వంటి మంత్రులు ఇతర ప్రముఖులు విజయవంతమైన ప్రయత్నాలు చేశారు.

బహుప్రయత్న లబ్దమైన ఈ సంస్థ హైదరాబాదులో నెలకొన్నాక- ఇది మా తెలుగుపీఠం ఇందులో మీరు వేలు పెట్టకండి, మీ ఆంధ్ర పీఠం మీరు తెచ్చుకోండి అనే సందర్భమూ రావచ్చు. అందులో కృషిచేసే పండితులకు, భాషా వేత్తలకు ఇతర సిబ్బందికి- పైన పేర్కొన్న ప్రముఖులకు జరిగిన 'సన్మానం' జరగదని, ఆ సంస్థకు ట్యాంక్ బండ్ మీది విగ్రహాలకు పట్టిన గతి పట్టదని భరోసా ఏమైనా ఉన్నదా? ఇప్పటికే సాహిత్యపీఠం ఉన్న రాజమండ్రీ, సాహిత్య రాజధానిగా పేరొందిన విజయవాడ అనువైన ప్రదేశాలు అన్న విషయం పరిగణలోకి తీసుకోవాలి.

అసలింతకూ ఈ పీఠం కర్ణాటకలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఏం చెయ్యాలి? ఏ విషయాలమీద పరిశోధన చేపట్టాలి? ఎట్టి పరిశోధకుల్ని, భాషా వేత్తలను నియమించుకోవాలి? ప్రాచీన భాషా? క్లాసికల్ భాషా? ఏ పేరుతో పిలవాలి? ఈ అర్థాన్నిచ్చే తెలుగు పదమేది? ఏదో ఒకటిలే అనుకున్నా, వచ్చిన ప్రతిపత్తిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి? - ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించండి మహాప్రభో అని ఏ మంత్రిత్వ శాఖ వారికి మొర పెట్టుకోవాలి? తమిళ, కన్నడ ప్రభుత్వాల వలె మన భాషకూ ఒక మంత్రిత్వ శాఖ ప్రారంభించటం అత్యవసరం కాదా? ఇలాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని ముందుకు సాగాలి. మాతృభాష పట్ల శ్రద్ధాభక్తులున్న అందరూ తలోచెయ్యీ వెయ్యాల్సిన అవసరం ఉంది.

- ప్రసాద్ మున్షీ, ఆర్.కె.పురం, సికింద్రాబాద్

4 కామెంట్‌లు:

  1. తెలుగు పీఠం ,అన్నా, ఆంధ్రపీఠం అన్నా ఒకటే అని తెలుసుకోండి.ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర భాగవతం అని వినలేదా?

    రిప్లయితొలగించండి
  2. పూర్తిగా చదవండి కమనీయం గారు

    రిప్లయితొలగించండి
  3. Telugu is not an ancient or classical language by any measure. This "me too" type copy cat approach adds no value to the language's greatness.

    Telugu is the youngest of Indian languages, with the exception of Urdu. This youthful zest has enhanced the language's ability to grow by leveraging on existing languages. This fusion approach is a better situation than the so called classical languages.

    రిప్లయితొలగించండి
  4. "Telugu is the youngest of Indian languages, with the exception of Urdu."

    Such authoritative statements can be made only after proper study. How old is India's Rajyabasha?

    Why should we place much importance on criteria defined by government(for declaring any language as classical language)?How important a factor is age of the language? There are many little known ancient languages in India which have little literature of their own.Some of them are in dying stage

    రిప్లయితొలగించండి