22, డిసెంబర్ 2011, గురువారం

యూపీ కి కేంద్రం కొర్రీలు - నమస్తే తెలంగాణా ఆక్రోశం

నాలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉత్తర్ ప్రదేశ్ చేసిన అసెంబ్లీ ప్రతిపాదన పైన కేంద్రభుత్వం అడిగిన ప్రశ్నల పై మాయావతి స్పందన ఎలా ఉన్నా మన యెల్లో జర్నల్ నమస్తే తెలంగాణా ఏడుపు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నేటి నమస్తే తెలంగాణా దినపత్రిక లో వచ్చిన ఎడిటోరియల్ చదివి తరించండి.

ఉత్తరప్రదేశ్ శాసన సభ పంపించిన రాష్ట్ర విభజన తీర్మానానికి కేంద్రం కొర్రీలు పెట్టి తిప్పి పంపడంతో కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడ్డది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించినట్టుపజాభివూపాయాన్ని పట్టించుకోక పోవడం, ప్రధాన సమస్యలను దాటవేయడం కాంగ్రెస్ స్వభావం. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనను కాదనలేక, తిరస్కరించలేక కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ‘కాంక్షిగెస్ కో ఖతం కరో’ నినాదం చేపట్టారు. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఈ విషయం ఎంతో ముందే గ్రహించి అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనను సమాధి చేశారు.


రాష్ట్రాల విభజనపై కేంద్రానికే అధికారం ఉన్నదని, తాము తీర్మానం చేసినందు వల్ల ఇక బాధ్యత కేంద్రానిదే అని మాయావతి ఇప్పటికీ అంటున్నారు. మాయావతి వాదనలో ఔచిత్యం ఉన్నది. భిన్న సాంస్కృతిక, భౌగోళిక మండలాలతో వైవిధ్య భరితమైన మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక్క ప్రాంత పక్షం వహించడం వల్ల మరో ప్రాంతం అణచివేతకు గురికావచ్చు. ఆనాడు ధర్ కమిషన్ హెచ్చరించింది కూడా ఇదే. భాష పేరుతో మరో ప్రాంత సాంస్కృతిక అస్తిత్వానికి ముప్పు వాటిల్లకూడదనే భావన కూడా ఆనాడే గ్రహింపునకు వచ్చింది. అందువల్ల కేంద్రం తీర్పరి పాత్ర పోషించాల్సిందే. అయితే కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించక పోవడం అనుచితంగా ఉంటుందనే భావన కూడా ఏర్పడింది. అందుకనే రాష్ట్రాన్ని సంప్రదించాలి తప్ప, రాష్ట్ర అభివూపాయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. రాజ్యాంగం ఇంత స్పష్టంగా ఉన్నది కనుకనే యూపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగం తనకు కట్టబెట్టిన బాధ్యతకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించక పోవడం వల్లనే ఇప్పుడు రాష్ట్రాల విభజనకు సంబంధించి చిక్కులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విషయంలో మాదిరిగానే యూపీ పట్ల కూడా కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్త్తున్నది.


రాజ్యాంగంలోని 3 వ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసన సభ అభివూపాయాన్ని రాష్ట్రపతి ద్వారా కోరాలే తప్ప హోం మంత్రిత్వ శాఖ లేఖ రాయడం సరైంది కాదని మాయావతి అంటున్నారు. ఇది జరగాలంటే మొదట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను సూత్రబద్ధంగా అంగీకరించాలె. ఇష్టం లేకపోతే ఆ విషయం ధైర్యంగా చెప్పాలె. కానీ తన నిర్ణయం చెప్పకుండా, కాలయాపన కోసం కొర్రీలు పెట్టి హోం మంత్రిత్వ శాఖ ద్వారా లేఖలు పంపడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే. మనదేశంలో రాష్ట్రాల ఏర్పాటు కొత్తేమీ కాదు. ఇదే ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కూడా విడిపోయింది. 1998 సెప్టెంబరు 22 వ తేదీన పార్లమెంటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అభివూపాయాన్ని కోరింది. 2000 సంవత్సరం మార్చి 30వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అప్పుడే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఏర్పడ్డాయి. అప్పుడు రాష్ట్రాలను కాలయాపన కోసం ఇటువంటి అసంబద్ధ ప్రశ్నలు వేయలేదు. మన దేశంలో రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి కాదు. అందుకు అనుసరించవలసిన విధానాలు స్థిరపడి ఉన్నాయి. 

యూపీ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వేసిన ప్రశ్నలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయాలని నిర్ణయించుకున్నదని తెలిసిపోతుంది. కొత్త రాష్ట్రాల సరిహద్దులు ఏమిటి? ఏ జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి? వాటి వైశాల్యం, జనాభా ఎంత వంటి ప్రశ్నలు అర్థం లేనివి.


అవి ముంజేతి కంకణం మాదిరిగా చూస్తేనే కనబడుతున్నాయి. ఆయా ప్రతిపాదిత రాష్ట్రాల రాజధాని సమస్య కూడా లేదు. ఏ ప్రాంతం వారూ బుద్ధి జ్ఞానం లేకుండా మరో ప్రాంత రాజధాని కావాలని కోరడం లేదు. కోరినా అసంబద్ధమైన కోరికను ఎవరూ హర్షించరు. రాష్ట్ర విభజన జరిగితే ఐఎఎస్ అధికారులు ఎంత మంది ఏ రాష్ట్రంలో ఉంటారనేది సూత్ర బద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు చర్చించాల్సిన గొప్ప అంశమా అనే ఆశ్చర్యం కలుగుతున్నది. ఆదాయ పంపకం, రుణాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా అడగడం వింతగా ఉన్నది. రాష్ట్రాల రుణ భారాన్ని సమస్యగా చెప్పడం కూడా అర్థ రహితమే. ఈ విదేశీ రుణాల గురించి మాట్లాడాలంటే, ఈ తరహా ఆర్థిక విధానాలకు ఆద్యులలో ఒకరైన ప్రధాని మన్మోహన్‌సింగ్ జవాబుదారు అవుతారు.


ఆధిపత్య దేశాలు , వారి తాబేదారులు మొత్తం మూడవ ప్రపంచ దేశాలకు తెచ్చిపెట్టిన సమస్య ఇది. అన్ని రాష్ట్రాలూ రుణభారంతోనే ఉన్నాయి. విభజన జరిగినప్పుడు ఆస్తులు, రుణాలు న్యాయబద్ధంగా పంపకాలు చేయడానికి ఇప్పటికే అనుసరించిన విధానాలు మార్గదర్శకంగా ఉంటాయి. ఇది కూడా కేంద్రానికి తెలియదని కాదు. తెలిసి చేస్తున్న కుతర్కాలు ఇవి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూపీ ప్రభుత్వానికి పంపిన ప్రశ్నావళిని బుద్ధి పూర్వకంగా పత్రికలకు విడుదల చేసింది. దీనిని కాంగ్రెస్ నాయకులు పారదర్శకతగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు పారదర్శకతపై అంత నమ్మకం ఉంటే, తెలంగాణ విషయంలో ఆజాద్, ప్రణబ్ జరుపుతున్న చర్చల సారాన్ని ఎందుకు వెల్లడించడం లేదు? తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గడియకోసారి చెబుతున్నారు. కానీ పరిష్కార యత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎందువల్ల తాత్సారం జరుగుతున్నదో చెప్పడం లేదు. ఇక్కడి నాయకులు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నదేమిటో తెలియదు. యూపీ విషయంలోనైనా, తెలంగాణకు సంబంధించి అయినా ప్రజలు కోరేది ఒక్కటే. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించాలె, ప్రజల మనోభావాలు గౌరవించాలె.

2 కామెంట్‌లు:

  1. న.తె. ఏడుపు అజ్ఞానపూరితం. నిజానికి అదీ జఱగదు. ఇదీ జఱగదు. ఎటొచ్చి ఎటుపోయినా మొత్తమ్మీద యూపీలో ఏదో ఒక ప్రాంతంలో అధికారానికి శాశ్వతంగా పట్టుకుని వేళ్ళాడ్డమే మాయావతి అజెండా. అందుకనే ముందు మూడుముక్కలన్న మనిషి కాస్తా చివఱి నిమిషంలో నాలుగుముక్కలనేసింది.

    రిప్లయితొలగించండి
  2. U P is a failed state with 20 crore population, most of the people are illiterate, no family planning surgeries, only thing they know is producing more and more children, they will go to Mumbai, Delhi or other metros for work, this is only because of political leaders like Mayavathi, though she is not a married one, she won,t bother about her state's people,BJP wants Hindu votes, Samajwadi party works for muslim vote, congress wants to come back to power with the help of polical prostitute Ajith singh( KCR junior), so there is nothing wrong,but in case of AP, it formed on the basis of language, leaders developed Hyderabad and it surrounding areas, thats why this discussion, Jealous of T- leaders is the sole reason for this agitation.. which is ended after rail roko,

    రిప్లయితొలగించండి