27, డిసెంబర్ 2011, మంగళవారం

‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’

మిత్రులారా,


‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.
మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.
ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.
వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.

December 29th 11.00 AM – 4.00 PM

Venue: Sundaraiah Vignanan Kendram, Bagh Lingampally, Hyderabad.

24, డిసెంబర్ 2011, శనివారం

'విగ్రహాలను వెంటనే పునఃప్రతిష్ఠించండి' : విశాలాంధ్రమహాసభ

డిసెంబర్ 20 వ తేదీన విశాలాంధ్రమహాసభ ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన కార్యాలయంలో కలిసి ట్యాంక్ బండ్ పై విధ్వంసానికి గురయ్యిన తెలుగు మహనీయుల విగ్రహాలను వచ్చే ఉగాదిలోగా  పునఃప్రతిష్ఠించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఏం విగ్రహాల పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మిలియన్ మార్చ్ రోజున ట్యాంక్ బండ్ పై ఆందోళనకారులపై చర్య తీసుకొంటే వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే విగ్రహాల ధ్వంసాన్ని ఆపలేకపోయామన్నారు. పోలీసుచర్యలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయివుంటే పరిస్థితి అదుపుతప్పుతుందేమోనన్న ఆలోచన చేశామన్నారు.




22, డిసెంబర్ 2011, గురువారం

దార్శనికుడు పి.వి.

"ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ''

1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసనసభలో చదివిన ఈ కవితార్థం చరితార్థం కావించిన వాడు పాములపర్తి వేంకట నరసింహారావు దేశమంతా 'పి.వి'గా పిలుచుకున్న తొలి తెలుగు ప్రధాని. పి.వి. రాజకీయ చతురతలో రాణించాడు; ఏ కుల, వర్గ, మతాల గుంపును దరిచేరనివ్వలేదు. ఆయన దృక్పథం ప్రజాస్వామ్యం. దృష్టి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు జరిపారు; కాంగ్రెస్ అధ్యక్షునిగా, బడుగువర్గాలకే ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారానికి స్వాగతించారు.

తెలుగు భాషకు పట్టనున్న దుర్గతి ఊహించి తెలుగు అకాడమీ స్థాపించారు. తెలుగు అధికార భాషా సంఘ స్థాపనలో పి.వి. కృషి ఉంది. రాష్ట్రంలో, బోధనా భాషగా తెలుగు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. తెలుగు బోధన తప్పనిసరిగా పదవ తరగతి వరకు అమలులో ఉండేలా చూశారు.1973లో అకాడమీ అధ్యక్షులుగా 'ఉత్తరోత్తరా ఏమి జరుగుతుందో చెప్పలేం' అన్నారు.

1933లో అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ న్యూడీల్ అనే కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా ప్రధాని పి.వి. భావి భారతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని గ్రహించి తన దార్శనిక దృష్టితో అటువంటి కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. తద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు.

కేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని వదిలి, ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ మార్కెట్‌కు ప్రవేశం కల్పించారు. 1995లో పోఖ్రాన్-2 అణు పాటవ పరీక్షలను పి.వి.నే సాహసోపేతంగా నిర్వహించారు. దేశ అవసరాలు, ఆలోచనలు పూర్తిగా తెలిసిన వివేకవంతమైన పాలకుడు పి.వి. 1988లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అంతర్జాతీయంగా మేధావి అని గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగానికి, వివిధ దేశాల ప్రతిని«ధలు వినమ్రంగా లేచి నిలుచుని పదినిముషాల పాటు చప్పట్లతో ప్రశంసలు కురిపించారు.

పి.వి.కి భవిష్యత్తు పట్ల చక్కని అవగాహన ఉంది. మానవుని క్రమవికాసం అరనిందులు దర్శించురని ప్రస్తావిస్తూ "ఈ అభూత పరిణామ క్రమంలో భారతదేశం అనేక ఇతర దేశాలకన్నా విజయవంతంమైన సమాజంగానూ, భాగస్వామిగా వ్యవహరించే మహదావకాశాలు కలిగి ఉందని నా ప్రగాఢ విశ్వాసం'' అని దృఢంగా చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకే విధంగా నడిచిన పి.వి. స్థితప్రజ్ఞుడు. తన మనసుకు నచ్చింది చేసేవాడు. అంతటి మహామనిషికి భరతజాతి చిత్తశుద్ధితో నివాళి అర్పించగా; ఆయన సేవలు నిరంతరం పొందిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మాత్రం ఆయనను చివరిదశలో అశాంతికి గురిచేసింది.

పలు కోర్టు కేసుల్లో సతమతమైనా, ఆయన ఎవరినీ విమర్శించలేదు సరికదా తన కేసులు తానే వాదించి నెగ్గారు. మరణానంతరం ఆయన అంతెవాసు లు, పార్టీ నేతలు ఘోరంగా వ్యవహరించారు. అందరు ప్రధానులకు అం తిమ సంస్కారాల వేదికలు నిర్మించిన ఢిల్లీ నేతలు పి.వి.కి. ఆరడుగుల నేల ఇవ్వ మనసురాలేదు సరికదా ఆయన దేహాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోకి అనుమతించని 'గొప్ప' నాయకత్వం ప్రపంచంలో ఇదేనేమో! అయినా తెలుగు ప్రజల గుండెల్లో పి.వి. చిరంజీవి.

- డా. బి. దామోదరరావు
పి.వి.స్మారక పీఠం, కరీంనగర్
(డిసెంబర్ 23న పి.వి.నరసింహారావు వర్ధంతి)

యూపీ కి కేంద్రం కొర్రీలు - నమస్తే తెలంగాణా ఆక్రోశం

నాలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉత్తర్ ప్రదేశ్ చేసిన అసెంబ్లీ ప్రతిపాదన పైన కేంద్రభుత్వం అడిగిన ప్రశ్నల పై మాయావతి స్పందన ఎలా ఉన్నా మన యెల్లో జర్నల్ నమస్తే తెలంగాణా ఏడుపు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నేటి నమస్తే తెలంగాణా దినపత్రిక లో వచ్చిన ఎడిటోరియల్ చదివి తరించండి.

ఉత్తరప్రదేశ్ శాసన సభ పంపించిన రాష్ట్ర విభజన తీర్మానానికి కేంద్రం కొర్రీలు పెట్టి తిప్పి పంపడంతో కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడ్డది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించినట్టుపజాభివూపాయాన్ని పట్టించుకోక పోవడం, ప్రధాన సమస్యలను దాటవేయడం కాంగ్రెస్ స్వభావం. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనను కాదనలేక, తిరస్కరించలేక కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ‘కాంక్షిగెస్ కో ఖతం కరో’ నినాదం చేపట్టారు. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఈ విషయం ఎంతో ముందే గ్రహించి అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనను సమాధి చేశారు.


రాష్ట్రాల విభజనపై కేంద్రానికే అధికారం ఉన్నదని, తాము తీర్మానం చేసినందు వల్ల ఇక బాధ్యత కేంద్రానిదే అని మాయావతి ఇప్పటికీ అంటున్నారు. మాయావతి వాదనలో ఔచిత్యం ఉన్నది. భిన్న సాంస్కృతిక, భౌగోళిక మండలాలతో వైవిధ్య భరితమైన మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక్క ప్రాంత పక్షం వహించడం వల్ల మరో ప్రాంతం అణచివేతకు గురికావచ్చు. ఆనాడు ధర్ కమిషన్ హెచ్చరించింది కూడా ఇదే. భాష పేరుతో మరో ప్రాంత సాంస్కృతిక అస్తిత్వానికి ముప్పు వాటిల్లకూడదనే భావన కూడా ఆనాడే గ్రహింపునకు వచ్చింది. అందువల్ల కేంద్రం తీర్పరి పాత్ర పోషించాల్సిందే. అయితే కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించక పోవడం అనుచితంగా ఉంటుందనే భావన కూడా ఏర్పడింది. అందుకనే రాష్ట్రాన్ని సంప్రదించాలి తప్ప, రాష్ట్ర అభివూపాయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. రాజ్యాంగం ఇంత స్పష్టంగా ఉన్నది కనుకనే యూపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగం తనకు కట్టబెట్టిన బాధ్యతకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించక పోవడం వల్లనే ఇప్పుడు రాష్ట్రాల విభజనకు సంబంధించి చిక్కులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విషయంలో మాదిరిగానే యూపీ పట్ల కూడా కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్త్తున్నది.


రాజ్యాంగంలోని 3 వ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసన సభ అభివూపాయాన్ని రాష్ట్రపతి ద్వారా కోరాలే తప్ప హోం మంత్రిత్వ శాఖ లేఖ రాయడం సరైంది కాదని మాయావతి అంటున్నారు. ఇది జరగాలంటే మొదట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను సూత్రబద్ధంగా అంగీకరించాలె. ఇష్టం లేకపోతే ఆ విషయం ధైర్యంగా చెప్పాలె. కానీ తన నిర్ణయం చెప్పకుండా, కాలయాపన కోసం కొర్రీలు పెట్టి హోం మంత్రిత్వ శాఖ ద్వారా లేఖలు పంపడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే. మనదేశంలో రాష్ట్రాల ఏర్పాటు కొత్తేమీ కాదు. ఇదే ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కూడా విడిపోయింది. 1998 సెప్టెంబరు 22 వ తేదీన పార్లమెంటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అభివూపాయాన్ని కోరింది. 2000 సంవత్సరం మార్చి 30వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అప్పుడే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఏర్పడ్డాయి. అప్పుడు రాష్ట్రాలను కాలయాపన కోసం ఇటువంటి అసంబద్ధ ప్రశ్నలు వేయలేదు. మన దేశంలో రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి కాదు. అందుకు అనుసరించవలసిన విధానాలు స్థిరపడి ఉన్నాయి. 

యూపీ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వేసిన ప్రశ్నలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయాలని నిర్ణయించుకున్నదని తెలిసిపోతుంది. కొత్త రాష్ట్రాల సరిహద్దులు ఏమిటి? ఏ జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి? వాటి వైశాల్యం, జనాభా ఎంత వంటి ప్రశ్నలు అర్థం లేనివి.


అవి ముంజేతి కంకణం మాదిరిగా చూస్తేనే కనబడుతున్నాయి. ఆయా ప్రతిపాదిత రాష్ట్రాల రాజధాని సమస్య కూడా లేదు. ఏ ప్రాంతం వారూ బుద్ధి జ్ఞానం లేకుండా మరో ప్రాంత రాజధాని కావాలని కోరడం లేదు. కోరినా అసంబద్ధమైన కోరికను ఎవరూ హర్షించరు. రాష్ట్ర విభజన జరిగితే ఐఎఎస్ అధికారులు ఎంత మంది ఏ రాష్ట్రంలో ఉంటారనేది సూత్ర బద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు చర్చించాల్సిన గొప్ప అంశమా అనే ఆశ్చర్యం కలుగుతున్నది. ఆదాయ పంపకం, రుణాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా అడగడం వింతగా ఉన్నది. రాష్ట్రాల రుణ భారాన్ని సమస్యగా చెప్పడం కూడా అర్థ రహితమే. ఈ విదేశీ రుణాల గురించి మాట్లాడాలంటే, ఈ తరహా ఆర్థిక విధానాలకు ఆద్యులలో ఒకరైన ప్రధాని మన్మోహన్‌సింగ్ జవాబుదారు అవుతారు.


ఆధిపత్య దేశాలు , వారి తాబేదారులు మొత్తం మూడవ ప్రపంచ దేశాలకు తెచ్చిపెట్టిన సమస్య ఇది. అన్ని రాష్ట్రాలూ రుణభారంతోనే ఉన్నాయి. విభజన జరిగినప్పుడు ఆస్తులు, రుణాలు న్యాయబద్ధంగా పంపకాలు చేయడానికి ఇప్పటికే అనుసరించిన విధానాలు మార్గదర్శకంగా ఉంటాయి. ఇది కూడా కేంద్రానికి తెలియదని కాదు. తెలిసి చేస్తున్న కుతర్కాలు ఇవి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూపీ ప్రభుత్వానికి పంపిన ప్రశ్నావళిని బుద్ధి పూర్వకంగా పత్రికలకు విడుదల చేసింది. దీనిని కాంగ్రెస్ నాయకులు పారదర్శకతగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు పారదర్శకతపై అంత నమ్మకం ఉంటే, తెలంగాణ విషయంలో ఆజాద్, ప్రణబ్ జరుపుతున్న చర్చల సారాన్ని ఎందుకు వెల్లడించడం లేదు? తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గడియకోసారి చెబుతున్నారు. కానీ పరిష్కార యత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎందువల్ల తాత్సారం జరుగుతున్నదో చెప్పడం లేదు. ఇక్కడి నాయకులు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నదేమిటో తెలియదు. యూపీ విషయంలోనైనా, తెలంగాణకు సంబంధించి అయినా ప్రజలు కోరేది ఒక్కటే. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించాలె, ప్రజల మనోభావాలు గౌరవించాలె.

19, డిసెంబర్ 2011, సోమవారం

విశాలాంధ్రోద్యమాన్ని నేను హృదయపూర్వకంగా బలపరుస్తున్నాను: స్వామి రామానందతీర్థ (14 .2 .1950)

1950 ఫిబ్రవరి 13,14 వ తేదీలలో విశాలాంధ్రమహాసభ స్థాయిసంఘ సమావేశం వరంగల్ లో అయ్యదేవర కాళేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశాలకి మాడపాటి హనుమంతరావు, టంగుటూరి ప్రకాశం,స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు,కే.వీ.రంగారెడ్డి, బులుసు సాంబమూర్తి,అబ్దుల్ సలీం, కాళోజి మొదలైన ప్రముఖులు హాజరైయారు.  

ఆ సందర్భంగా ప్రసంగించిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానందతీర్థ, హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి ప్రస్తావన కావాలని, విశాలాంధ్రోద్యమం న్యాయమైనది, సహజమైనది అని , ఎనిమిది తెలంగాణా జిల్లాలు చేరనిదే ఆంధ్రరాష్ట్రం సమగ్రంకాదని అన్నారు.




ఆంధ్రప్రభ,ఫిబ్రవరి 15,1950





11, డిసెంబర్ 2011, ఆదివారం

తెలంగాణ ఊరువాడా 'విశాలాంధ్ర' అని నినదించిన వేళ

నైజాం ప్రాంతంలో తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు వారి ఆత్మా గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రారంభమైన 'ఆంధ్రోద్యమం' నిజాంపాలన నుండి విముక్తి లభించడంతోనే ఆగలేదు. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే నినాదం తెలంగాణ సాయుధ పోరాటం నాడే వినవచ్చింది. 1950 లోనే 'విశాలాంధ్రమహాసభ' వరంగల్ లో స్థాయిసంఘ సమావేశాన్నినిర్వహించి అన్ని ప్రాంతాల ప్రముఖులను ఒక వేదిక పై తెచ్చి 'విశాలాంధ్ర' ఏర్పడాలని తీర్మానాలు చేసింది.

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాలాంధ్ర వెంటనే ఏర్పడాలని అభిలాషించినా, శాసనసభలో మెజారిటీ సభ్యులు ఆ మేరకు తీర్మానాన్ని సమర్ధించినా, వారు తమ వ్యక్తిగత అభిప్రాయములను ఇతరులపై రుద్దలేదు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై దేశమంతటా చర్చ జరుగుతున్న సమయంలో తెలుగువారందరూ ఒకే గొడుగు కిందకు రావాలని, విశాలాంధ్ర ఏర్పడాలని, తెలంగాణ ఊరువాడా ఎన్నో తీర్మానాలు వెలువడ్డాయి.ఈనాడు తమ ప్రాంత చరిత్రే తెలియని  అజ్ఞానులు, స్వార్థపరులు 'విద్రోహం' అంటూ కొత్త వాదనలు లేవదీస్తున్నారు, అమాయకులను తప్పుదారి పట్టిస్తున్నారు, వేర్పాటువాదంతో ఒక ప్రాంతప్రజల కష్టాలన్నీ తొలగింపబడతాయి అని మాయమాటలు చెబుతూ తరాలుగా మిమ్మల్ని అణిచివేసింది మేముకాదు ఇతర ప్రాంతాల వారు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, స్వార్థచింతనతో తమ భవిష్యత్తు బాగుంటే చాలన్న ఉద్దేశంతో ఎన్నో కష్టాల పిమ్మట ఒకటిగా చేరిన తెలుగువారిని చీల్చాలని చూస్తున్నారు. వారు ఎన్ని చేసినా నిజాలను దాయడం అంత సులువకాదు



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 3,1955



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

 
ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955




ఆంధ్రపత్రిక, డిసెంబర్ 27,1955

ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!


10, డిసెంబర్ 2011, శనివారం

విశాలాంధ్ర ఏర్పాటుకే మొగ్గు చూపిన హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ (డిసెంబర్,1955)

ఇదివరకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫార్సులపై ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం(అక్టోబర్,1955 )లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే విశాలాంధ్ర ఏర్పడాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి చదివాము. అదే సంవత్సరం నవంబర్ మాసాంతంలో శాసనసభ లో హైదరాబాద్ రాష్ట్ర భవిష్యత్తుపై చర్చను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధికార తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానం విషయం పై ప్రసంగించిన బూర్గులగారు ఈ క్రింది విధంగా అన్నారు:

"రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫార్సులపై ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్మానాన్ని రూపొందించారు.అందులో లోపాలోపాలు నాకు తెలుసు.


సభలోని అన్ని వర్గాలనూ తీర్మానం సంతృప్తికలిగించలేదని కూడా నాకు తెలుసు. ప్రతిపాదించదలచినట్టు ఇప్పటికే నోటీసు రెండు డజన్ల సవరణలు ఈ విషయాన్ని విదితం చేస్తున్నవి.


కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలను ఏర్పాటు చేసే విషయంలో కూడా అభిప్రాయభేదాలున్నవి. తెలంగాణలో మూడు రకాల అభిప్రాయములున్నవి. తక్షణ విశాలాంధ్ర నిర్మాణానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యవర్గం ఇచ్చిన సలహాను పాటించాలని కొందరు అంటున్నారు.శాశ్వతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు అంటున్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసును ఆమోదించడమే మంచిదని వేరొక వర్గం అంటున్నారు.నివేదిక పై దాదాపు 25 మంది సభ్యులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘముకు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. సభ్యులందరూ అదే విధంగా సభలో తమ అభిప్రాయాలను తెలియచెయ్యడం సాధ్యం కాక పోవచ్చు. సభ్యుల అభిప్రాయాలను భారత ప్రభుత్వానికి తెలియజేస్తాం.వ్యవధి లేనందువల్లచర్చలో పాల్గొనే అవకాశం లభించని సభ్యుల లిఖితపూర్వక అభిప్రాయములను అంగీకరించడమా అంగీకరించపోవడమా అనేది సభాపతి నిర్ణయించాలి. ఏమైనా ఈ విషయమై తుది నిర్ణయం చేసే అధికారం పార్లమెంటుదే.

ఆంధ్ర పత్రిక, డిసెంబర్ 1,1955


సభలో ఎక్కువ మంది సభ్యులు తమ అభిప్రాయములు వెల్లడించడానికి అవకాశం కల్పించడం కోసం చర్చ సుదీర్ఘంగా సాగింది

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 4,1955

ఎనిమిది రోజుల పాటు బూర్గుల గారు ప్రతిపాదించిన తీర్మానాన్ని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ చర్చించింది. సభలో మెజారిటీ సభ్యులు తక్షణ విశాలాంధ్ర ఏర్పాటునే సమర్ధించారు.చర్చలో మొత్తం 147 సభ్యులు పాల్గొనగా వారిలో 103 మంది వెంటనే విశాలాంధ్రను నిర్మించడానికి అనుకూలంగా మాట్లాడారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 29 మంది వాదించారు.15 మంది ఎటూ చెప్పలేదు.అంతటితో చర్చను ఆపి తదుపరి శాసనసభ సమావేశం మొదటి రోజున దానిని కొనసాగించాలని నిర్ణయించి శాసనసభ సమావేశం వాయిదా పడింది. నేటి తరం వేర్పాటువాదులు, వారి అబద్ధాల విషపత్రిక తిరిగి రాయలేని చారిత్రిక సత్యం ఇది.

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955
 

 

8, డిసెంబర్ 2011, గురువారం

'ఏకాభిప్రాయంతోనే కొత్త రాష్ట్రాలు' - రాజ్యసభలో హోం శాఖ సహాయమంత్రి

ఆంధ్రజ్యోతి: ఇక నుంచి దేశంలో ఒక రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ ప్రతిపాదనపై సంబంధిత రాష్ట్రంలో విస్తృత ఏకాభిప్రా యం ఉన్నప్పుడు మాత్రమే తాము ముందుకు కదులుతామని కేంద్రం ప్రకటించింది. "కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల విస్తృత పర్యవసానాలు ఉంటాయి.

అందువల్ల రాష్ట్ర విభజనపై సంబంధిత రాష్ట్రంలో విస్తృత ఏకాభిప్రాయం ఉన్నప్పుడు.. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే కొత్త రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం ముందుకు కదులుతుంది'' అంటూ రాజ్యసభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం, దానిపై సాధారణ ఏకాభిప్రాయం మీద ఆధారపడి కేంద్రం చర్యలు ఉంటాయని బుధవారం రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు.

RAJYA SABHA
UNSTARRED QUESTION NO. †1608. 
TO BE ANSWERED ON THE 7th DECEMBER, 2011/AGRAHAYANA 16, 1933 (SAKA)

DIVISION OF UP INTO FOUR SEPARATE STATES

1608. SHRI MOHAN SINGH:


Will the Minister of HOME AFFAIRS be pleased to state:

(a) whether a proposal to divide the present geographical unit of Uttar Pradesh into four parts has been passed by the State Assembly;

(b) if so, whether Central Government intends of formulate separate States of Gorkhaland, Vidarbha, Bundelkhand including Telangana, etc;

(c) if not, the reason therefor;

(d) whether there is any plan to bring various parts of India, suffering the agony of backwardness, into the race for development by providing them special packages; and 

(e) if not, the reasons therefor?

ANSWER

MINISTER OF STATE IN THE MINISTRY OF HOME AFFAIRS
(SHRI JITENDRA SINGH) 

(a): Yes Sir.

(b) & (c): Creation of any new State has wide ramifications and direct bearing on the federal polity of our country. The Government of India moves in the matter only when there was a broad consensus in the parent State, that one part thereof may be separated to form a new State. Government takes decision on the matter of formation of new States after taking into consideration all relevant factors. Action by the Government would depend on the felt need and general consensus.


(d) to (e): Under the Backwards Regions grant Fund, central assistance is granted to identified backward districts/ regions. Besides, State-specific need based special dispensation is made as and when required through existing programmes, schemes under Annual/Five Year Plans.


జనవాక్యం: తెలుగు పీఠమా? ఆంధ్ర పీఠమా?

జనవాక్యం,ఆంధ్ర జ్యోతి : ఎట్టకేలకు తెలుగు భాషకు ప్రాచీనహోదా, ఆ పీఠం మైసూర్‌లో కాకుండా తెలుగు నేలపై నెలకొల్పటానికి అంగీకారం పొందటం జరిగింది. ఇది అందరూ సంతోషించదగ్గ సఫలత. అయితే ఒక విషయంలో జాగరూకులమూ ఆలోచించవలసిన అగత్యం ఉంది. రాష్ట్ర విభజన ఉద్యమం పేరిట జరిగిన అన్యాయాల, అవమానాల, జాబితాలో భాష, భాషావేత్తలు, కవులు పొట్టిశ్రీరాములు, ఆర్థర్ కాటన్, తెలుగు తల్లి, కాసు బ్రహ్మానందరెడ్డి, వంటి ప్రముఖులే గాక, ఆంధ్రా బేంక్, ఆంధ్ర మహిళాసభ వంటి సంస్థలు, ప్రాంతీయ దైవాలు, తిరుపతి లడ్డూ కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు వేరు ఆంధ్రం వేరు, సీమాంధ్రులది ఆంధ్రభాష, తెలంగాణ వారిది తెలుగు భాష అన్న వాదనలు కూడా బయలుదేరాయి. ఇన్నాళ్ళూ 'మన' రాజధాని అన్న భావంతో రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు పరంగా ఎన్ని విద్యా, వైద్య పార్రిశామికాది సంస్థలు హైదరాబాదులో వెలసినా కిమ్మనలేదు. కాని నేటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు పీఠాన్ని మైసూర్ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని సి.నా.రె, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి రచయితలు బుద్ధప్రసాద్, పురంధేశ్వరి వంటి మంత్రులు ఇతర ప్రముఖులు విజయవంతమైన ప్రయత్నాలు చేశారు.

బహుప్రయత్న లబ్దమైన ఈ సంస్థ హైదరాబాదులో నెలకొన్నాక- ఇది మా తెలుగుపీఠం ఇందులో మీరు వేలు పెట్టకండి, మీ ఆంధ్ర పీఠం మీరు తెచ్చుకోండి అనే సందర్భమూ రావచ్చు. అందులో కృషిచేసే పండితులకు, భాషా వేత్తలకు ఇతర సిబ్బందికి- పైన పేర్కొన్న ప్రముఖులకు జరిగిన 'సన్మానం' జరగదని, ఆ సంస్థకు ట్యాంక్ బండ్ మీది విగ్రహాలకు పట్టిన గతి పట్టదని భరోసా ఏమైనా ఉన్నదా? ఇప్పటికే సాహిత్యపీఠం ఉన్న రాజమండ్రీ, సాహిత్య రాజధానిగా పేరొందిన విజయవాడ అనువైన ప్రదేశాలు అన్న విషయం పరిగణలోకి తీసుకోవాలి.

అసలింతకూ ఈ పీఠం కర్ణాటకలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఏం చెయ్యాలి? ఏ విషయాలమీద పరిశోధన చేపట్టాలి? ఎట్టి పరిశోధకుల్ని, భాషా వేత్తలను నియమించుకోవాలి? ప్రాచీన భాషా? క్లాసికల్ భాషా? ఏ పేరుతో పిలవాలి? ఈ అర్థాన్నిచ్చే తెలుగు పదమేది? ఏదో ఒకటిలే అనుకున్నా, వచ్చిన ప్రతిపత్తిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి? - ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించండి మహాప్రభో అని ఏ మంత్రిత్వ శాఖ వారికి మొర పెట్టుకోవాలి? తమిళ, కన్నడ ప్రభుత్వాల వలె మన భాషకూ ఒక మంత్రిత్వ శాఖ ప్రారంభించటం అత్యవసరం కాదా? ఇలాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని ముందుకు సాగాలి. మాతృభాష పట్ల శ్రద్ధాభక్తులున్న అందరూ తలోచెయ్యీ వెయ్యాల్సిన అవసరం ఉంది.

- ప్రసాద్ మున్షీ, ఆర్.కె.పురం, సికింద్రాబాద్

7, డిసెంబర్ 2011, బుధవారం

చిన్న రాష్ట్రాలకు నేను వ్యతిరేకం : కుల్దీప్ నయ్యర్

ఆంధ్రజ్యోతి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను వ్యతిరేకమని, రెండో ఎస్సార్సీ వేసేందు కు ఇది సమయం కాదని ప్రముఖ జర్నలిస్టు, మాజీ హై కమిషనర్ కుల్దీప్ నయ్యర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రా ష్ట్రాల డిమాండ్లు అన్ని సమస్యలనూ ఆటోమేటిక్‌గా పరిష్కరించలేవని, పైగా ఎవరూ పరిష్కరించలేని మరిన్ని సమస్యలను సృష్టిస్తాయని స్పష్టం చేశారు. 'భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాల సమస్య' అనే అంశంపై బోడోల్యాండ్ విద్యార్థి విభాగం మంగళవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ సదస్సు నిర్వహించింది.

ఇందులో కు ల్దీప్ నయ్యర్ పాల్గొని ప్రసంగించారు. చిన్న రాష్ట్రాల ఆ కాంక్షలు సమంజసమే కావొచ్చని, వీటి కోసం ఎస్సార్సీ వేయాల్సి ఉంటుందని, అయితే, తన దృష్టిలో రెండో ఎ స్సార్సీ వేసేందుకు కూడా ఇది సరైన సమయం కాదని వివరించారు. దేశంలో మరెన్నో సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు ఎస్సార్సీ వేస్తే ఇక ఆ హంగామాలో పనులేమీ జరగవని చెప్పారు. మొదటి ఎస్సార్సీ సమయంలో ఇలాగే జరిగిందని, తాను అదంతా చూశానని, కాబట్టి ఇప్పుడు రెండో ఎస్సార్సీ వేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఏ రాష్ట్రంలోని ఆకాంక్షలపైనైనా ఎస్సార్సీ వేసే ముందు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎస్సార్సీతో ఆర్థికంగా కేంద్రంపై చాలా భారం పడుతుందని, దీనికి కేంద్రం డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. అందుకే చిన్న రాష్ట్రాలకు తాను అనుకూలం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణకు కూడా తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు. మరొకవైపు కూడా మనోభావాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదన్నారు. దీనివల్ల దేశం, రాష్ట్రం నాశనం కాకూడదని హితవు పలికారు.

ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుల్దీప్ నయ్యర్ సూచించారు. తెలంగాణ అంశంలో కేంద్రం తప్పు చేసిందని, ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత కమిషన్‌ను ఏర్పాటు చేసిందని.. అలా కాకుండా ముందే కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రకటన చేసి ఉండాల్సిందని చెప్పారు.

ఒకవేళ తెలంగాణ ఏర్పాటైతే గూర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, వి దర్భ, యూపీలో నాలుగు రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తారని, ఇది సరైనదేనా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాను గౌరవిస్తాను. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజనకు మాత్రం అంగీకరించనని స్పష్టం చేశారు.

6, డిసెంబర్ 2011, మంగళవారం

విశాలాంధ్ర ఏర్పడితే చాలా సంతోషిస్తాను : పండిట్ నెహ్రూ (11.12.1955)

1955 అక్టోబర్ మాసంలో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు విశాలాంధ్ర ఏర్పాటు వెంటనే జరగాలని ఏకాభిప్రాయమునకు వచ్చారని చదివాము

భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు డిసెంబర్ 11 న గుంటూరు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆంధ్ర రాజకీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ కార్యవర్గం విశాలాంధ్ర ఏర్పడాలని చెప్పిందని, దానిపై ఇరు ప్రాంతాల నాయకులు కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విశాలాంధ్ర ఏర్పడితే తాను మిక్కిలి సంతోషిస్తానని, త్వరలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘ నివేదిక పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుందని, ఆ నిర్ణయాలు పార్లమెంట్ పరిశీలనకు వస్తాయని చెప్పారు.



ఆ తర్వాత పండిట్ నెహ్రూ నిజామాబాద్ నందు మార్చ్ 5,1956 తేదీన విశాలాంధ్ర ఏర్పాటును ప్రకటించిన విషయం తెలిసినదే.