13, ఫిబ్రవరి 2012, సోమవారం

భాషాప్రయుక్త రాష్ట్రాల విధానం వీడితే దేశ సమగ్రతకే ముప్పు : విశాలాంధ్రమహాసభ సదస్సులో వక్తలు



మొగల్రాజపురం, న్యూస్ టుడే: విభజన పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న స్వార్థపరుల కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విశాలాంధ్రమహాసభ అధ్వర్యంలో సనివారం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా వర్కుషాపులో పలువురు సమైక్యవాదులు పాల్గొని, తమ వాణీని వినిపించారు. విడిపోవడానికి తెలంగాణవాదులు 100 కారణాలు చెబితే రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో తాము వెయ్యి కారణాలు చూపుతామంటూ సవాల్ విసిరారు.రాష్ట్ర విభజన కోసం  జరుగుతున్న యత్నాలను ఆందోళనకారులను మహాసభ తీవ్రంగా ఖండిస్తోందని, విభాజనవాదులు చేస్తున్నవన్నీ కేవలం అసత్యాలు, అభూతకల్పనలని, 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలలో గణనీయమైన అభివృద్ధి జరిగిందనేది నిర్వివాదమని, ఒక ప్రాంతంలో ఆర్ధికపరమైన సమస్యలకు విభజన పరిష్కారమని ఆందోళన చేపట్టడంలో అర్థం లేదని, భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశఐక్యతకు పట్టుకొమ్మలని, భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ అంకురార్పణ చేసిందని, భాషా ప్రయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నం దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాద హేతువని, దేశంలో ఏ భాషాప్రయుక్త రాష్ట్రాన్ని కూడా విభజించే ఆలోచనను భారత  ప్రభుత్వం చేయరాదంటూ పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా విభజన పేరుతో కొన్ని నెలల కిందట తెలంగాణవాదులు సృష్టించిన బీభత్సకాండ, భౌతికదాడులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రతీఒక్కరినీ ఆలోచింపజేసింది. పలువురు విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి వేర్పాటువాదుల చేతుల్లో రాష్ట్రం అగ్నిగుండంగామారిన దృశ్యాలను చూసి చలించిపోయారు. మిలియన్ మార్చ్ సందర్భంగా విగ్రహాల విధ్వంసం,రాజధానిలో చెలరేగిన విధ్వంసకాండ, రాష్ట్ర ప్రథమ పౌరుడిపైన , లోక్ సత్తా అధినేతపైన దాడి,బస్సులు , రైళ్లపై ఆందోళనకారుల ప్రతాపం, వరుస సమ్మెలు, బంద్ లతో జనజీవనం అస్తవ్యస్తం , ఒస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సంఘ వ్యతిరేకుల తిష్ట, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం ...ఇలా పలు చిత్రాలతో పాటు తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన గణాంకాలతో ఏర్పాటు చేసిన అందర్నీ ఆలోచింపజేసింది. 

దీనిలో పాల్గొన్న వక్తలు ఎవరేమన్నారంటే... 

గణాంకాలు తప్పుల తడకలు : పరకాల ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి , విశాలాంధ్ర మహాసభ
తెలంగాణవాదుల వాదన మొత్తం అసత్యంతో కూడుకుంది. వారు చూపుతున్న గణాంకాలన్నీ తప్పుల తడకలే. విశాలాంధ్ర మహాసభ సభ్యుల్లో ఎక్కువమంది నైజాం ప్రాంతానికి చెందినవారున్నారు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నారు.ఈ విషయాన్ని ప్రశ్నించే వారిపై భౌతికదాడులకు పాల్పడడంతో ఎవరూ బయటకొచ్చి మాట్లాడే సాహసం చేయడంలేదు. రానున్న కాలంలో ఈ ప్రదర్శనను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తాం
సమైక్యవాదం వినిపిస్తాం : నలమోతూ చక్రవర్తి, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు 
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎదాదికాలంగా కృషి చేస్తున్నాం.అందులో భాగంగానే ఢిల్లీ తరువాత ప్రదర్శనను హైదరాబాద్, విజయవాడల్లో ఏర్పాటు చేశాం. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
విభజన జరిగితే తెలుగు ఉనికికే నష్టం: ఆంజనేయరెడ్డి, రాష్ట్ర మాజీ డీజీపీ
కొందరు స్వార్థపరులు విభజన యత్నం కోరడం బాధాకరం. విభజన జరిగితే తెలుగు ఉనికికే నష్టం వాటిల్లుతుంది. రాజకీయాలకతీతంగా కలిసో సమైక్యవాదం వినిపిస్తాం
తాత్కాలిక ప్రయోజనాల కోసమే : నరసింహారావు, విశాలాంధ్ర మహాసభ అడ్వైజర్ 
ప్రధాన రాజకీయ పక్షాలన్నీకలిసి భయంకరమైన కుట్ర చేశాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసమే విభజన యత్నం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని చీల్చాల్సిన అవసరం లేదు.
ఇటువంటి ప్రదర్శనలు అవసరం : అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే 
విభజన పేరుతో తెలంగాణవాదులు దాడులకు పాల్పడినప్పటికీ సమైక్యంగా ఉద్యమం సాగించడం అభినందనీయం. రాగద్వేషాలు పక్కన పెట్టాలి. ఇటువంటి ప్రదర్శనలు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయి.
విభజనకు ఎక్కువమంది అనుకూలం కాదు: రామజోగయ్య, విశ్రాంత బ్యాంకు అధికారి,సమైక్యవాది 
తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులందర్నీ అభినందించాలి. విభజన కోరేవారిలో ఎక్కువమంది అనుకూలురు కారు.ఉద్యమం ముసుగులో కొందరు స్వార్థపరులు కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.



భౌతికదాడులు దారుణం: శ్రీనివాసరెడ్డి, మహాసభ సభ్యులు, కరీంనగర్ 
స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. సమైక్యతా అన్నవారిపైన భౌతికదాడులకు తెగబడడం దారుణం. కొందరు రాజకీయ పార్టీల నాయకులు విభజన పేరుతో కబ్జాకు యత్నిస్తున్నారు
కనువిప్పు కలగాలి : వేములపల్లి వామనరావు, స్వాతంత్య్ర సమరయోధులు
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడడం సమంజసం కాదు. వాస్తవం తెలుసుకొని మాట్లాడాలనుకునేవారికి ఈ ప్రదర్శన కనువిప్పు కలిగిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో నాకు చాలా బాంధవ్యం ఉంది. 60 ఏళ్ళ పాటు ఖమ్మంలోని ఓ గ్రామంలో వ్యవసాయం చేశాను. పడి ఊళ్లలో ఉపాధ్యాయునిగా పనిచేశాను.రాజకీయ పార్టీల నాయకులు ఆత్మస్తుతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు చెప్పేది ఒకటైతే మనస్సులో మరొకటి ఉంటుంది.

ఇతర మీడియా కథనాలు
ఆంధ్రజ్యోతి : రాష్ట్ర విభజన ప్రమాదకరం

ఆంధ్రభూమి: భాషాప్రయుక్త రాష్ట్రాల విధానం వీడితే దేశ సమగ్రతకే ముప్పు

విశాలాంధ్ర : ప్రాంతీయ విద్వేషాలు పక్కన పెట్టి...

సాక్షి: విశాలాంధ్ర సభ సమైక్యతా సమరం

ప్రజాశక్తి:  రాష్ట్ర సమగ్రతే ఆశయం

సూర్య: ప్రాంతీయతత్వం విడనాడదాం

 
 

23 కామెంట్‌లు:

  1. వేర్పాటు టెర్రరిస్టులు వాగిన బూతులతో ఒక ఆడియో కూడా తయారు చేయించి పెట్టాల్సింది. మనవ మృగాలు అంటే ఏమిటో ప్రజలకు తెలిసి వచ్చేది.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణ మోహన్ గారు
    మీ సమైక్య వాదం మీది ! మా ప్రత్యేక వాదం మాది
    ఆంద్ర ప్రదేద్ సమైక్యంగా ఉందాలని కోరడంలో మీ కెంత హక్కు ఉందొ ! ప్రత్యేక రాష్ట్రం కోరడంలో మాకు అంతే హక్కు ఉందన్న విషయం గుర్తుంచుకోండి ,
    పచ్చ కామెర్ల కళ్ళతో చూడడం మానడం మంచిది !

    రిప్లయితొలగించండి
  3. కోరుకోండి, అది మీ ఇష్టం, ఆ పేరు తో బూతులు తిట్టే హక్కు ఎవరికీ లేడు

    రిప్లయితొలగించండి
  4. భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే ఏమిటి? ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండాలని కాదు. ఒక రాష్ట్రంలో ఒక భాష ప్రధానంగా ఉండాలన్నదే భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతానికి నిర్వచనం.

    పరకాల ప్రభాకర్, అడుసుమల్లి జయప్రకాష్ లాంటి రాజకీయ నిరుద్యోగులు, ఆంజనేయ రెడ్డి లాంటి "విశ్రాంత" అధికారులకు ఈ కింది నిర్వచనాలు చదువుకోవలిసిందిగా విజ్యప్టి.

    It also rejected the theory of “one language one state” arguing that there could be more than one State speaking the same language without offending the linguistic principle." (SKC page 434 about SRC report)

    "It should be clear, however, that this is not an argument for “one language, one state” and the linguistic platform should not come in the way of creating new states out of unwieldy unilingual units, wherever necessary." (SKC page 438)

    భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే ఏంటో తెలియని ఈ మేతావులు కారు కూతలు కూసినంత మాత్రాన వచ్చే తెలంగాణా ఆగిపోదు.

    రిప్లయితొలగించండి
  5. తెలంగాణా ఎప్పుడో ఆగి పోయింది. పోలవరం గోదారిలో ముంచి అమ్మేసుకున్నాడు తమ దొర గారు. :)

    రిప్లయితొలగించండి
  6. రాజకీయ నిరుద్యోగులు - హహహహ్హహ,

    అసలు తెలంగాణా ఉత్తుత్తి వసూళ్ళ ఉద్యమమే, రాజకీయ నిరుద్యోగం. పదవులు రాని కొందరు, తయారు చేసే ఉన్మాదం.

    రిప్లయితొలగించండి
  7. కంటికి కనపడేదే ఉద్యమం
    టీవీ వార్తల్లో చూపించేదే ఉద్యమం
    పత్రికల్లో అచ్చువేసిందే ఉద్యమం
    ఉద్యమం.. బ్లాగులో పది లైన్ల పోస్టు
    ఫేస్ బుక్‌లో నాలుగు లైన్ల స్టేటస్ ఆప్ డేట్
    సెల్ ఫోన్‌లో ఆరు పదాల ఎస్సెమ్మెస్
    అలా అనుకోవడం వల్లనే తెలంగాణా ఉద్యమం సంక నాకి పోయింది

    రిప్లయితొలగించండి
  8. పాపం జై గొట్టిముక్కల గారి మాటల్లో, కుళాయి దగ్గర పోరాటం లో వోడిపోయిన ఉక్రోషం ధ్వనిస్తున్నది. ఏమీ పర్వాలేదు బ్రతర్. Next time better luck. ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం

    రిప్లయితొలగించండి
  9. Jai Gottimukkala 'విశాలాంధ్ర మహాసభ'సభ్యులపై నోటికొచ్చినట్లు వ్యక్తిగత దూషణలు చేసిన ఒక వ్యాఖ్య తొలిగించబడినది.We prefer not to moderate the comments but it doesn't mean anything will be tolerated

    రిప్లయితొలగించండి
  10. చైతన్య గారూ, పెద్ద మనిషి ముసుగు లో ఉన్న ఈ గొట్టి ముక్కల గారు, తెలంగాణా వాదుల సహజ స్వభావం, (ఓడి పోతే బూతులు తిట్టడం) బయట పెట్టుకున్నారు. తొలగించకుండా ఉంచాల్సింది.

    రిప్లయితొలగించండి
  11. "తొలగించకుండా ఉంచాల్సింది"

    KM gaaru, yes..I shouldn't have removed it

    రిప్లయితొలగించండి
  12. Chaitanya, your blog you decide.

    Having said this, I respectfully submit I did not use any unparliamentary or abusive term. Yes, I criticized certain individuals but the tone was in tune with the general language on this blog. నేను ఎవరినీ బూతులు తిట్టలేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  13. @Krishna Mohan:

    వాదనలో ఓడిపోయింది ఎవరు? భాషా ప్రయుక్త రాష్ట్రాలనే ఆలోచనకు పై వక్తలు ఇచ్చిన నిర్వచనం తప్పని నేను ఆధారాలతో చూపించాను.

    దానికి సమాధానం ఇవ్వకుండా మీకు మీరే విజయం ప్రకటించుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  14. గొట్టిముక్కల గారు వేర్పాటువాదంలో ఓడినా, ఇక్కడి వాదనలోనైనా గెలిచాడనిపిద్దాము, పాపం!. :))

    ఎవరక్కడ? హాయ్ హాయ్ నాయకా!
    వేయండీయనకు రెండు వీరతాళ్ళు హ్హ్వాహ్వాహ్వా...

    "అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై... "

    రిప్లయితొలగించండి
  15. "భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ అంకురార్పణ చేసిందని"

    మరో సత్యదూరమయిన ప్రచారం. భాషా ప్రాతిపదిక మీద ఏర్పడ్డ తోలి రాష్ట్రం ఒడిష అయితే స్వాతంత్ర్యం తరువాత ఏర్పడ్డ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంద్ర.

    భాషా ప్రాతిపదకపై రాష్ట్రావతరణ హరియానా దాకా కొనసాగింది. ఆ తరువాత అనేక రాష్ట్రాలు ఏర్పడినా ఏ ఒక్క దానికీ భాష ప్రాతిపదిక కాదు.

    కొన్ని ప్రశ్నలు:

    1. గోర్ఖాలాండ్, బోడోలాండ్, జమ్మూ ప్రాంతాలలో (అంతెందుకు మేఘాలయలోని గారో జిల్లాలో) మాట్లాడే భాష వేరు. ఆయా ప్రాంతాలకు ప్రత్త్యేక రాష్ట్రం ఇవ్వాలనే కోరిక మీరు సమర్తిస్తారా?

    2. కొన్ని భాషలు (ఉ. కొంకణి) పలు రాష్ట్రాలలో ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్నాటక రాష్ట్రాలలో విచ్చిన్నమయి పోయిన కొంకణి మాట్లాడే వారందరినీ ఒక రాష్ట్రంగా మార్చాలనే ప్రస్తావనపై మీ అభిప్రాయం ఏమిటి?

    3. అదే రకంగా గోవా రాష్ట్రాన్ని రెండు ముక్కలు (మరాఠీ, కొంకణి), అలాగే పుదుచ్చేరి మూడు ముక్కలు (తమిళం, మలయాళం, తెలుగు) చేసి ఆయా ముక్కలను పక్కనే ఉన్న భాషా ప్రయుక్త రాష్ట్రాలతో విలీనం చేయాలనీ ప్రస్తావనలు వచ్చాయి. మీరేం అంటారు?

    రిప్లయితొలగించండి
  16. ఇక లాభం లేదు.

    "మరో సత్యదూరమయిన ప్రచారం. భాషా ప్రాతిపదిక మీద ఏర్పడ్డ తోలి రాష్ట్రం ఒడిష అయితే స్వాతంత్ర్యం తరువాత ఏర్పడ్డ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంద్ర."

    ఒడిష రాష్ట్రం 1936 లో ఏర్పాటు అయ్యిందని హైస్కూల్కు వెళ్ళే రోజులలోనే మనోరమ ఇయర్ బుక్ చదివి తెలుసుకొన్నాము. కొత్త విషయం ఏమైనా వుంటే చెప్పండి. విషయమేమిటంటే భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలపై అర్థవంతమైన చర్చ జరిగింది ఆంధ్రరాష్ట్ర డిమాండ్ ముందుకు వచ్చినప్పుడే. ఆ చర్చ కొన్ని దశాబ్దాల పాటు జరిగింది. ఇంతకుముందు ఇదే బ్లాగ్లో స్వాతంత్య్రానికి పూర్వం ఈ విషయమై మహాత్మాగాంధీ , సర్వేపల్లి రాధాకృష్ణన్, విజయనగరం మహారాజు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పోస్ట్ చేయడం జరిగింది http://visalandhra.blogspot.in/2011/05/blog-post_11.html

    స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు దేశవ్యాప్తంగా రాష్ట్రాల పునర్విభజనకు ఎలా దారి తీసిందో అందరికి తెలుసు. అప్పటికే ఉన్న రాష్ట్రాల రూపు రేఖలు ఎలా మారిపోయాయో తెలుసు. రాష్ట్రాల పునర్విభజనకు 'భాష'ను ఒక ముఖ్య ప్రాతిపదికగా అప్పుడే ఆమోదించారు. అందుకే ఏ మాత్రం చారిత్రికపరిజ్ఞానం వున్నా వాడైనా "భారతదేశం లో భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ అంకురార్పణ చేసింది" అని అంటాడు.

    స్వాతంత్య్రానంతరం భారత దేశం ఎదుర్కొన్న ముఖ్య సమస్య రాష్ట్రాల పునర్విభజన. ఆ సమయం లో అనేక ఆలోచనల తర్వాత, మొదటి రాష్ట్రాల పునర్విభజన సంఘం తన నివేదికను సమర్పించిన తర్వాత, పార్లమెంట్లో వాడి వేడి చర్చలు జరిగిన పిమ్మట రాష్ట్రాల పునర్విభజనకు "భాష" నుఒక ముఖ్యమైన ప్రాతిపదికగా అంగీకరించారు . భాష ఒక్కటే ప్రాతిపదిక కావాలని అనలేదు లేదా ఒక బాషకు ఒక రాష్ట్రం అన్న సిద్ధాంతాన్ని ఎవరూ నెత్తికెక్కుకోలేదు.భాషకో రాష్ట్రంఏర్పాటు చేస్తే ఒక్క అరుణాచల్ ప్రదేశ్ లోనే ఒక్కొక్క తెగవారి భాషకి ఒక్కో రాష్ట్రం ఏర్పాటు చేయాలి. వాటిని మిషిల్యాండ్, మిరిల్యాండ్, మొన్పలాండ్, మిష్మిల్యాండ్, అది ల్యాండ్ మరెన్నో మరెన్నో లాండ్లు లేదా ప్రదేశ్లు అనవలసివస్తుందేమో.

    ఎప్పుడైతే దేశవ్యాప్త చర్చ జరిగి అందరికి ఆమోదయోగ్యంగా, ముఖ్యభాషా సంస్కృతులకు గుర్తింపునిస్తూ "భాషాప్రయుక్త రాష్ట్రాలు" ఏర్పడ్డాయో ఆ తర్వాత రాష్ట్రాల ఏర్పాటు అనే పెద్ద తలనొప్పి చాలావరకూ సమసిపోయి దేశ ఐక్యతకు ఎటువంటి సమస్య సృష్టించలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట చేసిన ప్రయోగం విజయవంతం అయ్యిందని ఒప్పుకోక తప్పదు. ఈశాన్యంలో 70వ దశకంలో ఏర్పడిన రాష్ట్రాలను,అప్పటివరకు కేంద్ర పాలనలో ప్రత్యేక ప్రాంతాలుగా ఉండి కొత్తగా ఏరడిన రాష్ట్రాలను, 2000 లో రాజకీయలబ్ది కోసం ఎక్కువ ఆలోచన చేయకుండా హడావుడిగా ఏర్పరిచిన రాష్ట్రాలను ఉదాహరణలుగా చూపి భాషప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతం విడిచిపెట్టేశాం అని వాదించడం మూర్ఖత్వమవుతుంది.

    చూశాముగా తెలంగాణ లొల్లి బోడోలాండ్, గారో హిల్స్ మొదలైన చోట్ల ఎంత గడబిడ సృష్టించిందో. అందుకే ఆనాడు భాషప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలను విభజింపవద్దని, అప్పుడు ఆమోదించిన విధానాన్ని వీడవద్దని పెద్దలు అంటున్నారు.

    గోవాను రెండు ముక్కలు చేయాలని ఎవరన్నారో మాకు తెలియదు.అది అంత సులువు కాదు. గోవాలో ఒకప్పుడు ప్రభుత్వాన్ని ఏలిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఇప్పుడు దిక్కుమొక్కు లేకుండా వుంది. పుదుచ్చేరి ప్రాంతాలైన యానం, మాహే, కరైకల్ లను పక్క రాష్ట్రాలలో భవిష్యత్తులో కలపవలిసి వస్తే ప్రజామోదంతో కలపవచ్చును.ఇప్పుడు మనకి ఆ విషయాలు ఎందుకు?

    రిప్లయితొలగించండి
  17. Statement: "ఒక బాషకు ఒక రాష్ట్రం అన్న సిద్ధాంతాన్ని ఎవరూ నెత్తికెక్కుకోలేదు"

    Inference: Formation of Telangana is not a violation of the "linguistic principle"

    Statement: "వాటిని మిషిల్యాండ్, మిరిల్యాండ్, మొన్పలాండ్, మిష్మిల్యాండ్, అది ల్యాండ్ మరెన్నో మరెన్నో లాండ్లు లేదా ప్రదేశ్లు అనవలసివస్తుందేమో"

    Inference: The "linguistic principle" is neither scalable nor eternal. It served a purpose at one point in history but can't be relied for future organization. The litmus test can only be democratic aspirations.

    రిప్లయితొలగించండి
  18. "చూశాముగా తెలంగాణ లొల్లి బోడోలాండ్, గారో హిల్స్ మొదలైన చోట్ల ఎంత గడబిడ సృష్టించిందో"

    బోడోలు లేదా భారతీయులు ఎవరు కూడా copycats కారు. వాళ్ళకూ వ్యక్తిత్వం ఉంటుంది. సొంత రాష్ట్రం కావాలనుకుంటే అడుగుతారు తప్ప తెలంగాణా వారినో ఇతరులనో అనుకరించరు.

    The domino theory floated by some is a cynical attempt to trivialize democracy.

    రిప్లయితొలగించండి
  19. Breaking of the state which is always cited as an example for linguistic reorganization of states is prone with many dangers. No one wants to convince you if you don't want to believe in that. But there is no basis to say that lingusitc principle served its purpose and it can be disowned now


    Democratic aspirations అంటే నాకు నవ్వు వస్తుంది. వేర్పాటువాద నాయకులు పదేళ్ళు అదేపనిగా బొంకి , ప్రజలకు ఇతర ప్రాంతాలవారిపై విషాన్ని నూరిపోసే ప్రయత్నం చేసి, అబద్దపు వాగ్దానాలతో వారిని గొర్రెలు చేయ ప్రయత్నాలు చేసి( http://visalandhra.blogspot.in/2011/07/blog-post_22.html ), ప్రజలచే ఎన్నికల్లలో తిరస్కరింపబడి, సుమారు ఎనభై లక్షలు మంది నివసించే రాజధాని పరిసర ప్రాంతాలలో కనీసం ఒక్క కార్పొరేటర్ సీటుకి పోటీ చేయలేకి భయబడి పారిపోయి, ఇతరులకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అరాచకాలకు దిగిన తర్వాత కూడా ఆ మాట అనకూడదు. వారికి ప్రజాస్వామ్యవిలువల పైన నమ్మకం వుంటే రాష్ట్రాన్ని ఎందుకు ఏ ప్రాతిపదికపై విభజించాలో అసెంబ్లీలోనో లేక ఇంకే వేదిక పైనో చర్చించమనండి.ప్రజలకు అన్ని విషయాలు తెలిపిన తర్వాత వారి democratic aspirations గురించి మాట్లాడవచ్చు.ప్రజలను అబద్దాలతో మోసంచేసి, ఎదురు చెప్పిన వారి నోరునోక్కే దెయ్యాలకు democratic aspirations అందరికి ఉంటాయని చెప్పండి.


    "బోడోలు లేదా భారతీయులు ఎవరు కూడా copycats కారు."

    మిలియన్ మార్చ్ నిర్వాహకులు తక్క!

    "వాళ్ళకూ వ్యక్తిత్వం ఉంటుంది. సొంత రాష్ట్రం కావాలనుకుంటే అడుగుతారు తప్ప తెలంగాణా వారినో ఇతరులనో అనుకరించరు."

    KCR లాంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఎవరి వ్యక్తిగత స్వార్ధాలకు ఇతరులు బలికారాదు.నేనన్న మాట "ప్రత్యేక తెలంగాణా లొల్లి ఇతర ప్రాంతాలలో గడబిడ సృష్టించింది" అని. అది ఎంత నిజమో గత రెండు సంవత్సరాలుగా వస్తున్నా వార్తాకథనాలు చెబుతాయి. { The intensified Telangana movement has spurred new life into similar demands in Assam. After the All Bodo Students Union (Absu) made a fresh call for a movement for the separate state of Bodoland, the All Koch Rajbongshi Students Union (AKRSU) has also renewed its Kamatapur demand.(TOI July 19,2011)

    "If the UPA-II government declares Telangana as a separate state, we will raise the pitch for Bodoland" chief of the Bodoland People's Front (BPF) (TOI July 10 Telangana agitation renews Bodoland cry , TOI July 18 Bodoland demand gains momentum )


    ఇప్పుడు ప్రశ్నలు సంధించడం నా వంతు. మన్య సీమ పై మీ అభిప్రాయం? గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనా వద్దా? హైదరాబాదీలకు, తెలంగాణా జిల్లాలో సమైక్యవాదులకు ప్రజాస్వామ్యక హక్కులు ఉన్నాయా లేవా? చిన్న రాష్ట్రాలు ఎంత చిన్నగా ఉండాలి? ఒక జిల్లానే ఎందుకు రాష్ట్రంగా చేయకూడదు?ఒక వేళ ఒక ఉద్యమాన్ని సృష్టించి (పని లేని వాళ్ళు పైసా ఖర్చు లేకుండా ఉద్యమాలు చేయాడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, తెరాస చేసిన ఉద్యమాన్ని చూసి కొంత మంది జేబులు నింపుకోవడానికి కూడా ఉద్యమాలు చేయవచ్చని నమ్ముతున్నారు) దానిని కొన్నాళ్ళ పాటు నడిపి ప్రజలను ఎమార్చితే మీరు జిల్లాను ఒక రాష్ట్రం గా చేయాడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోకుంటే ఎందుకు ఒప్పుకోరు?



    మా సమయాన్ని తినక మా మానాన మమ్మల్లి వదిలివేసి మా ప్రాథమిక హక్కైన "Right to Expression" ను కనీసం మా బ్లాగ్లో కాపాడుకొనే అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  20. @Chaitanya: Sorry for responding in English.

    Forgetting Telangana for a moment, Bodos have not destroyed statues, accused Andhras of loot, falsified irrigation records or done any of the things you accuse "Telabans" of. Why are you then opposing their demand?

    Let me turn to your questions. I have no objection if (a big if in my perception though) the people of Manyaseema, greater Hyderabad or South Telangana ask for their own state. "Integrating" them with Telangana or AP against their aspirations is a travesty of democracy.

    Language, size etc. don't matter beyond a point. The litmus test is people's wish.

    A "movement" that is inspired merely by a remote event (e.g. some other state formed) can't sustain itself without public support. Public opinion and not brute force is the only way to eliminate such fly-by-night forces.

    Finally, you are the boss of your blog. I am (was) under the impression you are open to differences of opinion being expressed by commenters. I sincerely apologize if you believe that a comment contrary to your views curtails your freedom of expression.

    రిప్లయితొలగించండి
  21. " Why are you then opposing their demand?"

    I don't have a strong opinion against their demand for the simple reason that I have nothing to do with Bodo identity. I don't know why separatists in our state are supporting it as if they are duty bound to support any statehood demand in India. As facts stand, Assam had a troubled past and GOI made peace with "Armed" Bodo Liberation Tigers as recently as 2003. An autonomous Territorial council was created and BLT was allowed to join popular politics. Bodo language was honoured by its inclusion in the 8th schedule of Constitution.I don't understand why should anyone support any individual/organisation (inspired by separatist agitations elsewhere) raking up the demand for separate state after hard earned peace brought solace to Bodos.

    .

    "Integrating" them with Telangana or AP against their aspirations is a travesty of democracy. Language, size etc. don't matter beyond a point. The litmus test is people's wish."

    First of all there exists no hard evidence to prove that separatist agitations anywhere in India have popular support. Two, sudden spurt of emotions will not long last and yielding to them might work against the larger good in the long run. People are vulnerable to all kinds of propaganda and ill-informed wishes can't be granted without proper deliberations and without involving other affected parties. As far as seperate Telangana issue is concerned, VMS is 100% confident of its stand and it is willing to prove and spread the message that united state is in the interests of everyone. VMS is also ready to engage with opponents of this position. ( I don't have any formal membership of VMS but since I am administering this blog and I have access to VMS members, I think I can speak on their behalf).
    .

    "Finally, you are the boss of your blog. I am (was) under the impression you are open to differences of opinion being expressed by commenters. I sincerely apologize if you believe that a comment contrary to your views curtails your freedom of expression."

    Commenting will not curtail anybody's freedom of expression but invading online forums (whether website or blog) as if to thrust your opinions down our throats and arguing tangentially about things which don't matter(as it happened many times in the past) and making personal attacks against VMS members made me say that. In the real world, separatists are not allowing integrationists to freely express their opinions in Telangana districts including the capital city. There is no way to even organize an indoor meeting(unless it is a private meeting) without facing black clothed rowdy jac members descending on to the scene and trying to create ruckus. We at least want to protect our online forums. You are free to differ and argue to the point but I can't guarantee about providing answers whenever you demand for them

    రిప్లయితొలగించండి