ఆంధ్రప్రభ వ్యాసం: ఒక పెనుముప్పుని తక్షణాగత్యంగా ఎదుర్కొంటున్న అనివార్యతా క్రమంలో, లేదా దేహంలోని ఒక భాగంలో ప్రస్తుతం విపరీతంగా బాధిస్తున్న 'పుండు' ని నయం చేసుకునే ప్రయత్నంలో, ఇంకా ప్రమాదకరమైన ఇతర సమస్యల్ని, అనారోగ్యాల్ని అలక్ష్యం చేయటం సహజంగా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుత సమస్య కొంత ఉపశమించిన తర్వాతనైనా, ఇతర జాఢ్యాలపై దృష్టి సారించాలి. సమాంతర వైద్యం జరగాలి. ఊపిరితిత్తుల్లో వ్యాధికి మందులిచ్చి ఊరుకోకుండా కాలి గోటికున్న పుండుకి కూడా మందుపూయాలి. అంతిమంగా అన్ని సమస్యలకు పరిష్కారం, సంపూర్ణ ఆరోగ్యం లభించేలా ఏ రోగమూ తిరగబెట్టని రీతిలో బహుళ చికిత్స జరగాలి. (దీన్నే వైద్యుల పరిభాషలో (మల్టిపుల్ ట్రీట్‌మెంట్) అంటారు). ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం కొంత బలహీనపడిందన్నది నిర్వివాదాంశం.
ఈ పరిణామానికి ప్రశంసార్హులు క్రమంగా వాస్తవాలను, ఉద్యమకారుల అరాచకాల్ని మూ(మా)టకారుల అసలు ధ్యేయాల్ని, రంగుల్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు మాత్రమే కానీ, ఏ ఎండకాగొడుగు పట్టే మన రాజకీయ నేతలు సంచలనాలు, అరాచకాలకే ప్రాధాన్యమిచ్చే మీడియా కానీ కానే కాదు! తెలంగాణ ప్రజల్లో అంతర్మథనం పరివర్తన ప్రారంభమైన ఈ తరుణంలో, అన్ని ప్రాంతాల తెలుగువాళ్లకున్న తెగుళ్ల గురించి, వాటి నివారణోపాయాల గురించి చర్చించుకోవాల్సిన అగత్యముంది, ప్రస్తుత సమస్యకు మూలకారణాలు అవే కాబట్టి వర్తమాన ప్రపంచంలో అన్ని వర్గాల వారికున్న జాఢ్యాలన్నీ, స్వార్థం, అవినీతి, విలువల పతనం వంటివి మనకూ ఉన్నాయి. అయితే, తెలుగువాడికున్న కొన్ని ప్రత్యేక రోగాల గురించి మాత్రమే చెప్పుకొందాం.
(1) అనైక్యత: ఆరంభ శూరత్వం మాటేమోకానీ, అమెరికాలో అస్సాంలో, అమలాపురంలో, ఆదిలాబాద్‌లో ఎక్కడున్నా సరే, ఒక బండగుర్తుగా తెలుగువాళ్లని పట్టిచ్చే గుణం అనైక్యత. ఎక్కడైనా ఇద్దరు తెలుగువాళ్లుంటే మూడు సంఘాలుంటాయన్న ఖ్యాతి మనకుంది గదా! ఇంకే ఇతర భాషా వర్గానికి లేనిది, మనకు మాత్రమే ఉన్న దుర్గుణం 'యాసా వైషమ్యం'. ప్రపంచంలో ఆరువేల భాషలున్నాయంటారు. అన్ని ఏకలిపి భాషల్లోనూ అసంఖ్యాక యాసలుంటాయి (స్లాంగ్స్). యాస అనేది, ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం, విద్యాస్థాయి, జన్మస్థలం, శాశ్వత నివాస ప్రాంతం, వృత్తి ఇతర భాషలతో, వర్గాలతో సాహచర్యం, ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది.
తెలంగాణ ప్రాంతంలో ఆ మాటకొస్తే ఏ ఊళ్లోనూ, ఏ కుటుంబంలోకూడా ఒకే యాస ఉందని చెప్పలేం. ఉదాహరణకి కెసిఆర్, ఈ మధ్యకాలంలో ఎంతో కష్టపడి అభ్యాసం చేసి, కృతకంగా అలవరచుకున్న యాసను ఆయన కొడుకు, కూతురు కూడా సంపూర్ణంగా అనుకరించలేకపోతున్నారు! యాసలు భాషా సూర్యుని శతకోటి కిరణాలు. దేని గొప్ప దానిదే. ఎప్పుడో, సినారె అన్నట్లు 'వచ్చాడన్నా, వచ్చిండన్నా' రెండూ తీపి తెలుగుపదాలే! కాని మన ఖర్మ ఏమిటో కానీ యాసా సంబంధిత ద్వేషాలు మనకు మాత్రమే సొంతం. ఈ సమస్యకు పరిష్కారం ఒక ప్రామాణిక వ్యవహారిక భాషను రూపొందించుకొని, నిర్దేశించడం కాదు.
ఇతర భాషల వారి లాగానే భాషాభిమానం పెంపొందించుకోవడం, ఇతర స్వభాషీయులు మాట్లాడే తీరుల్లోని స్వల్ప తారతమ్యాలను ఎగతాళి చేసే దుర్గుణాన్ని మానుకోవటం, మాత్రమే ఈ మాయరోగానికి మందు. యాసాద్వేషాలని ప్రేరేపించే వారిని వెలివేయాలంతే! ఏది ఏమైనా అనైక్యత మూలాన్నే తెలుగువాళ్లంటేనే అందరికీ చులకన భావం ఏర్పడిపోయి ఉంది. జాతీయ స్థాయిలో కూడా మన సంఖ్యాబలానికి తగిన దామాషాలో రాజకీయ ప్రాధాన్యం, గౌరవం, నిధులు, ప్రాజెక్టులు లభించడం లేదని తెలుసుకదా.
(2) మనకు మాత్రమే ఉన్న అవలక్షణం మాతృభాషపై ఉండాల్సినంత గౌరవం, ఆదరణ లేకపోవడం. తర్వాతి తరాలవారికి భాషాభిమానం కల్పించే ప్రయత్నం చేయకపోగా, వారి పరంగా నిరాదరణను ప్రోత్సహించడం 'మనోళ్ల'కే చెల్లు అన్యభాషా మాధ్యమాల్లో పిల్లలకి ప్రాథమిక స్థాయి నుంచి చదువులు చెప్పించడం మనలో అధిక సంఖ్యాకులు తెలిసీ చేస్తున్న పాపం. కొన్ని సంవత్సరాల క్రితమే, యునెస్కో వారు రానున్న కొద్ది దశాబ్దాలలో తెలుగు మృత భాషగా మారనున్నదనే హెచ్చరిక చేసినా మనకు చీమకుట్టినట్లైనా లేదు. దాదాపు 30 శాతం మందికి ఆ భాషలో రాయడం, చదవడం రాకపోతే, అది త్వరలో అంతరించిపోతుందన్న ప్రామాణికతను మనం ఇప్పటికే సాధించాం.
ఎలాగంటే, ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో ఉన్న ఎనిమిది కోట్ల మంది తెలుగువారిలో, వారి వారసుల్లో దాదాపు సగం మందికి తెలుగు రాయడం, చదవడం సంగతలా ఉంచి మాట్లాడడమూ అంతంత మాత్రమే. మన రాష్ట్రంలోను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 10 కోట్ల మంది తెలుగువాళ్లలోనైనా రాయడం, చదవడం వచ్చిన వాళ్ల శాతం సంగతలా ఉంచి, ఇష్టంగా స్వచ్ఛంగా మాట్లాడే వాళ్లెంతమందో చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. కాబట్టి ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయి ఉంది. మృత భాషగా మిగిలి పోకూడదంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రవాసాంధ్రులు భాషాంతరీకరణం చెందకుండా మనవంతు సహకారం అందించాలి. ఈ విషయంలో తమిళ సోదరులను ఆదర్శంగా తీసుకోవాలి.
(3) అన్యభాషలపై మోజు: ఇది మనకున్న మరో పెద్ద అవలక్షణం. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదు, మాతృభాషకే పెద్ద పీట వేసినంత వరకు తెలంగాణ ప్రజాకవి కాళోజీ 'అన్యభాషలు నేర్చి ఆంధ్రము రాదని సకిలించువేందిరా' అని అందుకే మనల్ని తిట్టేరు. ఇతర భాషల వారు కూడా అన్యభాషా పదాల్ని అవసరమైన మేరకు ఆహ్వానిస్తారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో మన హిందీ పదాలు, ఘెరావ్, బంద్ వంటివి చేరేయి కానీ వాళ్లు తమ భాషలో సరైన పదాలు లేకపోతేనే ఆ పని చేస్తారు. కానీ మనం అలాకాదు. మనకున్న మంచి పదాల స్థానంలో వాటిని నెత్తికెక్కించుకుంటాం. పాలకుల, ఇతరుల ప్రాపకం కోసం మన ఊళ్లపేర్లు కూడా మార్చేసుకున్నాం. ఊళ్లకు, పట్టణాలకు ఉర్దూ పేర్లు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయనుకోవద్దు. ఉర్దూ పేర్లున్న ఊళ్లెన్నో సీమాంధ్రలో ఉన్నాయి. ఆంగ్లేయులు తమ సౌకర్యం కోసం, రాజమండ్రి, బెజవాడ అని మార్చిన పేర్లు మనకింపుగానే ఉన్నాయి ఇంకా.
(4) ప్రాంతీయ తత్వం: ఇతరులకన్న ఎంతో అధికంగా మనకున్న మరో అవలక్షణం ప్రాంతీయ దురభిమానం సొంత ఊరుని ప్రేమించడం తప్పుకాదు. కానీ ఉంటున్న ఊరుని, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాల్ని సంపూర్ణంగా అలవరచుకోలేకపోయినా గౌరవించాలి. అన్నిప్రాంతాల తెలగువాళ్లకీ ఈ సుగుణం తగుస్థాయిలో ఉండదన్నది వాస్తవం. అందుకే విభజనవాదులు స్థానికులకి, స్థిరపడిన వారికి మధ్య విభేదాలు సృష్టించడంలో కొంతమేరకు సఫలమయ్యారన్నది గ్రహించాలి.
(5) ప్రాంతేతర బంధాలపై విముఖత తమిళులు కానీ, ఇతర భాషల వారు కానీ, ఎక్కడ కలుసుకున్నా తమ భాషలోనే మాట్లాడుకుంటారు. ఏ ప్రాంతం వాళ్లవెరన్న దానికి అసలేమీ ప్రాధాన్యమివ్వరు. మనోళ్లు అలాకాదు. విదేశాల్లో ఉన్న వాళ్లలో కూడా ఒక ప్రాంతం, జిల్లా వాళ్ల మధ్యనే ఎక్కువ సౌహార్దం ఉంటుంది. మతపరమైన కట్టుబాట్లు, కులాల కుంపట్లు కూడా తెలుగువాళ్లలో అధికం. ప్రాంతీయ భావాలు మరీ ఎక్కువ. ఒక ప్రాంతం వాళ్లు అన్యప్రాంతాల వాళ్లతో వైవాహిక బంధాలకి అంతగా ఇష్టపడరు. మతాంతర, కులాంతర వివాహాలు జరుగుతున్న స్థాయిలోనైనా తెలుగువాళ్లలో ప్రాంతేతర వివాహాలు జరగడం లేదు. అసలు జరగడం లేదని చెప్పలేం కానీ, ఆ రోజుల్లోనే హైదరాబాద్ వాసి, మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్, విజయనగరం జిల్లా వాసి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి కుటుంబంతో వివాహబంధం ఏర్పరచుకొన్నారు. ఇది మర్చిపోని సీమాంధ్రులు ఆయన్ని తెనాలి నుంచి ఎంపి గా గెలిపించుకున్నారు. వర్తమానకాలంలో కూడా మహబూబ్‌నగర్ మంత్రి డి.కె.అరుణ, మొగల్తూరు మొనగాడు చిరంజీవి, కృష్ణా జిల్లా కోనమేరు రంగారావు, తెరాస దళిత నేత చంద్రశేఖర్‌ల కుటుంబాలు ఇతర ప్రాంతాలతో వియ్యమందాయి.
కానీ ఇలాంటి ప్రాంతేతర వివాహాలు బహు అరుదుగానే ఉంటున్నాయి.అమెరికాలో ఉన్న అమలాపురం కుర్రాడు, ఆస్ట్రేలియాలోని ఆదిలాబాద్ పోరడు, తమ తల్లిదండ్రులతో, మనవైపు సంబంధమే చూడమనే చెప్తుంటాడు! పూర్వం మొఘలులు, రాజ్‌పుత్‌లతో వైవాహిక బంధాలనేర్పరుచుకుని సత్ఫలితాలు సాధించారు. అలానే ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారితో, ఇతర యూరోపియన్లతో వివాహబంధాల ద్వారానే వారికి తమపట్ల ఉన్న వైషమ్యాన్ని తగ్గించగలిగారు. కాబట్టి తెలుగువాళ్లలో కూడా ప్రాంతాంతర వివాహాలు ఇంకా ఎక్కువగా జరిగితే బాగుంటుంది. తర్వాతి తరాల వారిలోనైనా ప్రాంతీయ విభేదాలు తగ్గుతాయి. స్వల్ప సాంస్కృతిక తారతమ్యాలను భూతద్దంలో చూసే దుర్గుణం కూడా తగ్గుతుంది.
ఈ తెలుగు తెగుళ్లన్నీ త్వరలో మాసిపోయి, పాత చరిత్ర అయిపోతుందని ఆశిద్దామా?!
-చేగొండి రామజోగయ్య
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు
"అన్ని ఏకలిపి భాషల్లోనూ అసంఖ్యాక యాసలుంటాయి (స్లాంగ్స్)."
రిప్లయితొలగించండిఅన్ని భాషలలో మాండలీకాలు (dialects) ఉంటాయి, యాసలూ (accents, not slang as this guy claims) ఉంటాయి.
లిపికి భాషకు సంబంధం లేదు. ఒకే భాషను వివిధ లిపిలలో రాయడం (e.g. Sindhi, Konakani) అనేక సందర్భాలలో చూస్తున్నాం. అలాగే ఒకే లిపిలో అనేక భాషలు ఉండడం సర్వ సాధారణం.
ఎన్నో భాషలకు సొంత లిపి లేదు. ఉదాహరణకు హిందీ భాషను సంస్కృత (దేవనాగరి) లిపి వాడతారు.
లిపికి భాషకి, మాండలీకానికి యాసకు, తేడా తెలియని ఈయన కూడా లెక్చరులిచ్చేటొడే!
ఇకపోతే తెలుగోల్లకు ఉన్న ప్రత్యెక రోగాల గురించి రాసిన ఈ జోగయ్య గారి రోగాలేంటో చూద్దామా?
KCR జీతగాడిని అడిగి ఆయన ఏమేమి సినిమాలు చూస్తాడో, ఏమేమి తాగుతాడో కనుక్కొని ఆంధ్రోల్లకి తెలియచేయడం
KCR వెంట 40 ఏళ్ల నుంచి తిరిగి తిరిగి ఆయన భాష యాసలను అధ్యయనం చేయడం. ఆయన కృత్రిమంగా అలువాటు చేసుకున్న యాసను గురించి, దానికి చేసిన అభ్యాసం గురించి ఆత్రుతంగా ఎదురు చూస్తున్న ఆంధ్రోల్లకు ఖబుర్లు చెప్పడం.
శభాష్ జోగయ్య గారూ! మీరు ఒక గాసిప్ పత్రికో చాన్నెలో పెట్టుకొని ఇలాంటి interesting tidbits సేకరించి సర్వ జనులకు వినోదం అందియ్యాలి.
తెలుగుభాష గుఱించి చెప్పేటప్పుడు ఎక్కడా తెగులు అనే పదాన్ని వాడకూడదని ఎవఱైనా ఒక కఠినచట్టం తెస్తే బావుణ్ణు.
రిప్లయితొలగించండి"ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో ఉన్న ఎనిమిది కోట్ల మంది తెలుగువారిలో"
రిప్లయితొలగించండి"మన రాష్ట్రంలోను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 10 కోట్ల మంది తెలుగువాళ్లలోనైనా"
Another gem of knowledge from the great scholar. As per 2011 census, there are 7,40,02,856 Telugu speakers in India. Out of this 6.39 crores are in AP.
ఏడున్నర కోట్లు పద్దెనిమిది ఎలా అయ్యాయి చెప్మా? అని అడగొద్దు. అతిశయోక్తి కూడా ఒక అలంకారమేనని సదరు "వ్యాస"కర్త వంగిమాధవులు వెనక్కి వేసుకొని రాగలరు.
తిమ్మిని బమ్మి చేయగల చేగొండి వారి సామర్త్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము.
Source: http://censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/parta.htm
Typical of Ts, అన్నీ అబద్దాలే, కోడి గుడ్డుకి బొచ్చు పీకే మార్గాలు వెతకడమే. 2001 సెన్సస్ తీసుకు వచ్చి 2011 సెన్సస్ గా చూపించాలి అని మీ ప్రయత్నం చూస్తే నవ్వు వస్తున్నది.
రిప్లయితొలగించండిఈ సారి కరెక్టు లెక్కలు తీసుకు రండి.
చేగొండి గారిది ఏమో కానీ, మీ ప్రయత్నం తన్నింది.
రిప్లయితొలగించండి"లిపికి భాషకి, మాండలీకానికి యాసకు, తేడా తెలియని ఈయన కూడా లెక్చరులిచ్చేటొడే!
రిప్లయితొలగించండిఅబ్బ చ్ఛా! మాకు తెలియదు మరి. లిపికి భాషకు సంబంధం ఉంటుందని మేము చెప్పాము మరి.హిందీ భాష కు ఏ లిపి వాడతారో మాకు తెలియదు మరి. నీ వయస్సు ఎంత బాబు? చేగొండి గారి కి లిపి, భాషలపై కొత్త విషయాలు చెప్పాలని ఉందా?ఆయన వయస్సు, అనుభవం ఎంతో తెలుసా? అసలు ఆయన చెప్పిన విషయం ఏమిటి? " అన్ని ఏకలిపి భాషల్లోనూ అసంఖ్యాక యాసలుంటాయి" అని. మరి మీరు ఇక్కడ అనవసరమైన సర్వలోక విదిత విషయాలను ఏదో కొత్త విషయాలు కనుక్కున్నట్టుగా చెప్పడం దేనికి?
.
"Another gem of knowledge from the great scholar. As per 2011 census, there are 7,40,02,856 Telugu speakers in India. Out of this 6.39 crores are in AP. ఏడున్నర కోట్లు పద్దెనిమిది ఎలా అయ్యాయి చెప్మా?"
బాబు నాన్న! తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా 17-18 కోట్లమంది వున్నారు అని సర్వసాధారణంగా వినే మాటని చేగొండి గారు ఆధారంగా తీసుకొని వ్యాసం యొక్క ప్రధాన థీమ్ పై దృష్టిపెట్టారు.మరి మీరేమో అసలు విషయాన్ని వదిలేసి కృష్ణమోహన్ గారు చెప్పినట్లు కోడి గుడ్డుకి బొచ్చు పీకే మార్గాలు వెతుకుతున్నారు. పర్వాలేదు కానీ మీరు కేసిఆర్ ప్రత్యేక తెలంగాణ పల్లవి అందుకోక ముందు జరిగిన సెన్సస్ లెక్కలు తెచ్చారు. 2011 census యొక్క disaggregated data ఇంకా జనబాహుళ్యం లోకి రాలేదు.According to 2001 census % of people in AP who claimed Telugu to be their mother language was 83.85% . According to provisional data of 2011 census AP's population is 8,46,65,533.Assuming the same % of people with Telugu as their mother tongue it comes to be over 7 crores in AP alone. To this add one crore of people from other states(most conservative estimate). "But this never includes people of Telugu origin but those who can't read or write తెలుగు". There are lakhs of such people in border districts of Orissa, Karnataka, Tamilnadu, Maharashtra and Chattisgarh. And then there are NRIs of Telugu origin and their descendants.
.
Many scholars usually refer to 17-18 crore Telugus. Here is one such example
"Members of the World Telugu Federation gathered here to celebrate the `Swarnotsavam', the golden jubilee of the formation of Andhra Pradesh state.....S. Venkataramiah, educationalist, said the Telugu speaking population of 17 crore is spread across several States, including Tamil Nadu, Karnataka, Maharashtra and Orissa. But, only 5 crore of them could read and write Telugu.He said the younger generation must be taught Telugu, even those outside Andhra Pradesh. Though 42 per cent of Chennai's population is composed of Telugus, there were only a few Telugu medium schools" http://www.hindu.com/2006/11/02/stories/2006110214280200.htm
.
అదంతా ఎందుకు?తెలుగు తల్లి ముద్దు బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారు కొన్ని సంవత్సరాలు క్రితమే ప్రాంతాల వారీగా లెక్క వేసి తెలుగు వారు 15 కోట్ల మంది ఉండవచ్చు అన్నారు. దీనికి సంబంధించిన వార్తాకథనం వెలికితీయడానికి ప్రయత్నిస్తాం.
ఇక్కడ సంఖ్యల గురించి చర్చించవలసిన అవసరం నాకైతే కనిపించడం లేదు. తెలుగు వారు పక్కరాష్ట్రాలలోను, దేశమంతటా, ప్రపంచమంతటా వ్యాపించి వుండడం మూలంగా, వారిలో చాలామంది భాషావినియోగం లేక తెలుగును మర్చిపోవడం మూలంగా మనకు కచ్చితమైన లెక్క ఎప్పటికీ తెలియదు.ఏదో గతం బాగా తెలిసిన పెద్దలు ఉజ్జాయింపుగా చెప్పిన లెక్కను మనం ఉపయోగించుకుంటాము.దానినో పెద్ద విషయం చేయనవసరం లేదు (అదే లేని బొచ్చును పీకనవసరం లేదు).ఇక్కడి చర్చలో అది అసలు విషయమే కాదు
Chaitanya, the problem with Ts is they always beat around the bush. This gottimukkala is one such person. I had respect on him till the other day, but after having seen his real face, there is no reason to consider him with any seriousness
రిప్లయితొలగించండిరెండు కోట్ల మంది వున్న తెలబానులను, నాలుగున్నర కోట్లు అని వూదర గొట్టారు కదా.
రిప్లయితొలగించండిKM గారూ, పదేళ్ళలో పదిన్నర కోట్లు పెరుగతయా, విడ్డూరంగా ఉంది.
రిప్లయితొలగించండిచైతన్య గారూ, అతి శ్రేష్టమయిన నిజమయిన లెక్కలుండగా, "సర్వ సాధారణంగా" వినిపించే పుక్కిటి పురాణాలెందుకు?
Trying to pass off someone as "గతం బాగా తెలిసిన పెద్దలు" is no substitution for subject matter knowledge. As far as I can see, the author is a banker, not a linguist.
"పెద్ద విషయం చేయనవసరం లేదు": Agreed if it is in a reasonable ballpark which is not the case here. Exaggerated accounts like this are a typical application of the "big lie" principle.
"చైతన్య గారూ, అతి శ్రేష్టమయిన నిజమయిన లెక్కలుండగా, "సర్వ సాధారణంగా" వినిపించే పుక్కిటి పురాణాలెందుకు?"
రిప్లయితొలగించండిమహాశయా!మీకు సులువైన భాషలో చెబితే అర్థం కాదా? దశాబ్ద కాలం క్రిందటి లెక్కలు శ్రేష్టమయినవి కావు . 2011 census లో ఆ సంఖ్య పది కోట్లకు దగ్గరగా చేరుకొని ఉంటుంది. అది కాకుండా తెలుగు మూలాలు ఉన్నవారు మన పక్క రాష్ట్రాలో ఎంతో మంది ఉన్నారు.వారి లెక్క census లెక్కలలోకి రాదు. వారిలో తెలుగు చదవలేని, వ్రాయలేని వారు కూడా ఉన్నారు.తెలుగు పేర్లను కూడా వదులుకొని ఆయా రాష్ట్రాలలో జీవిస్తున్న వారు ఉన్నారు. దీనికి తోడు బ్రిటిష్ పాలనా కాలం నుండి ఇతర దేశాలకు వలస పోయిన వారి సంఖ్య census లో కనిపించదు.
నాకు ముఖ్య విషయాన్ని వదిలేసి, చుట్టూ గిర గిర తిరుగుతూ బొచ్చు పీకే అలవాటు లేదు. నాతో మీరు బలవంతంగా పీకించవద్దు
"వారిలో తెలుగు చదవలేని, వ్రాయలేని వారు కూడా ఉన్నారు"
రిప్లయితొలగించండిజనాభా లెక్కలలో నిరక్షరాస్యులను కూడా లెక్కిస్తారు. భాషను మాట్లాడగలిగితే చాలు.
"తెలుగు మూలాలు ఉన్నవారు మన పక్క రాష్ట్రాలో ఎంతో మంది ఉన్నారు"
"మూలాలు" is irrelevant to this "article". Mr. Jogayya is bemoaning that those whose mother tongue is Telugu are giving up on the language.
ఈ "వ్యాసం" లో ముఖ్య విషయం ఏమిటో మీరే చెప్పండి. దాని మీదే నేను కామెంటుతాను, OK?
"జనాభా లెక్కలలో నిరక్షరాస్యులను కూడా లెక్కిస్తారు. భాషను మాట్లాడగలిగితే చాలు."
రిప్లయితొలగించండిమీ జ్ఞానాన్ని మా పైన రుద్దవద్దు. మా నోటిలో మీ మాటలు పెట్టవద్దు. దేశంలో అక్షరాసులు నిరక్షరాసులలో కూడా ఒక భాషకు మించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని లెక్కిస్తే మన దేశ జనాభా ౩౦౦ కోట్లు అయ్యి కూర్చుంటుంది.
పొరుగు రాష్ట్రాలలోని తెలుగు వారు విడిపోయి ఇప్పటికి ఎన్నో దశాబ్దాలు అవుతుంది. వారి పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా ఎంత మందో తెలుగు వారిగా గుర్తించబడని వాళ్ళు లక్షల్లో ఉన్నారు
.
"మూలాలు" is irrelevant to this "article". Mr. Jogayya is bemoaning that those whose mother tongue is Telugu are giving up on the language."
Why should it become irrelavant just because you say it is so. He counted everyone with Telugu roots . He said "మన రాష్ట్రంలోను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 10 కోట్ల మంది తెలుగువాళ్లలోనైనా రాయడం, చదవడం వచ్చిన వాళ్ల శాతం సంగతలా ఉంచి, ఇష్టంగా స్వచ్ఛంగా మాట్లాడే వాళ్లెంతమందో చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. కాబట్టి ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయి ఉంది. మృత భాషగా మిగిలి పోకూడదంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రవాసాంధ్రులు భాషాంతరీకరణం చెందకుండా మనవంతు సహకారం అందించాలి. ఈ విషయంలో తమిళ సోదరులను ఆదర్శంగా తీసుకోవాలి."
.
"ఈ "వ్యాసం" లో ముఖ్య విషయం ఏమిటో మీరే చెప్పండి. దాని మీదే నేను కామెంటుతాను, OK?"
మీరు కామెంటుకోండి లేక ఏమైనా చేసుకోండి. ముఖ్య విషయం మీకు కనిపించక పోతే వదిలేయండి. చదివే వాళ్ళను చదువుకోనివ్వండి. మీ కోసం చేగొండి గారు వచ్చే వారాలలో తెలుగు వాళ్ళ సంఖ్య మీద రాస్తానన్నారు. దానిని ఇక్కడ పోస్ట్ చేస్తాం. అప్పుడు సంఖ్యల గురించి చర్చిద్దాం
ఏది ఏమైనా గానీ నా facebook పోస్టులకు నేను LIKE కొట్టుకోను. నాను నేను జై చెప్పుకోను.
రిప్లయితొలగించండిఅసలు టాపిక్ వదిలేసి చెత్త ఎత్తుకోను.
ROFL