ఆంధ్రజ్యోతి, జూన్ 30 : సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశాలాంధ్ర మహాసభ అభిప్రాయపడింది. దీనిపై జూలై 5,6 తేదీలలో ఢిల్లీలో మీడియా వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు మహాసభ ప్రతినిధులు తెలియజేశారు. తెలుగుజాతి ఐక్యతను కాపాడాలనుకునే వారంతా ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు ఇందులో పాల్గొంటారని నిర్వాహకులు
తెలిపారు.