2, జూన్ 2011, గురువారం

ప్రత్యేక తెలంగాణాపై భాజపావి కుప్పిగంతులా లేదా అవకాశవాద రాజకీయాలా?

అవకాశవాద రాజకీయాలలో ఏ పార్టీ ఇతర పార్టీలకు తీసిపోదు. కాని తెలంగాణా విషయం వచ్చే సరికి భాజపా మార్కు అవకాశవాద రాజకీయాలకు సాటి మరేది ఉండదు. ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వస్తే తెలంగాణాను ఇస్తామని, అధికారంలో ఉండగా ఇవ్వమని స్పష్టంగా చెప్పింది భాజపానే. ఇతర పార్టీలు ఎన్నో చెప్పాయి, ప్రమాణాలు చేసాయి, కాని అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీలుస్తామని ఇతరులు అని ఉండరు.దశాబ్దాన్నర కాలంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి యత్నిస్తున్న భాజపామాత్రం పడిలేస్తూఎత్తులు వేస్తూనే ఉన్నది. నిజం చెప్పాలంటే భాజపాకి చిన్న రాష్ట్రాల ఏర్పాటు పై ఒక సిద్ధాంతం అంటూ లేదు.  మేము అధికారంలో ఉండగా మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పరిచాము అని ఎప్పుడు చెప్పుకోవడమే గాని ఆయా రాష్ట్రాలలో తమ పార్టీకి రాజకీయంగా లబ్ది జరుగుతున్న నమ్మకం లేక పొతే వారు చిన్న రాష్ట్రాల వాదనను తలకెక్కించుకునే వాళ్ళే కాదు. మరి ఒకప్పటి నిజాం హైదరాబాద్ లో భాగమైన, తెలంగాణా కన్నా బాగా వెనుకబడిన ఉత్తర కర్ణాటక కు ప్రత్యేక రాష్ట్ర హొదా  కోసం పోరాడరే? అక్కడ మాత్రం కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీలు, రాజ్యాంగ బద్ధ ప్రాంతీయ ప్రతిపత్తులు సరిపోతాయేం? సౌరాష్ట్ర, కచ్చ్, కొడగు లు చిన్న రాష్ట్రాల ఏర్పాటు వాదనకు అతీతమైనవా? 

ఈ కుప్పిగంతులు ఒకసారి చూడండి:

1997 :   కాకినాడలో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం 

2001 ( జూన్) :  ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. తెలంగాణాతో పార్టు ఏ చిన్న రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆ పార్టీ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి  కొత్తఢిల్లీలో తేల్చి చెప్పారు . 1997లో బిజెపి రాష్ట్ర కాకినాడలో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసిందని, అయితే అప్పటికీ ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవించాయని కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన వివరించారు. 

"Setting up a States Reorganisation Commission is bound to set off vociferous demands/agitations for the creation of these and many other States. We will, therefore, be sparking off pockets of unrest in a large number of places. It will not be possible, on the other hand, to accede to many of the demands on security or practical considerations," Mr. Advani said in his letter dated January 5, 2002, to Congress president Sonia Gandhi.The then Home Minister said it was perhaps "best if we avoid reopening the issue of creation of additional States." He said the Government was aware of the demands for the creation of Vidharba and Telangana, and pointed to the sporadic demands for the creation of Bodoland, Gorkhaland, Kamtapur, Bundelkhand, Harit Pradesh, Paschim Pradesh, Poorvanchal, Saurashtra and Kaushal.Mr. Advani said as regards the cases of Uttaranchal, Chhattisgarh and Jharkhand, they stood on a different footing where the parent State felt that a part thereof may be reconstituted into a separate State."There was a broad consensus across the board for the creation of these States,'' he said, and cautioned that in future the Government may consider demands for the reorganisation of any State only if such a broad consensus emerged and was backed by a resolution of the Legislature of the parent State.

2003 ( నవంబర్) : భారతీయ జనతాపార్టీ పత్రిక జనసందేశ్ లో ఒక వ్యాసం తెలంగాణా పల్లెలలో జనం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను సమర్ధించడం లేదు అని అన్నది


2004 (ఏప్రిల్ ) : తెలంగాణ ఊసు లేకుండా బిజెపి మేనిఫెస్టోను విడుదలచేశారు.ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగాఏర్పడవలసిన అవసరంలేదని బిజెపి రాష్ట్ర శాఖ తన ఎన్నికలప్రణాళికలో స్పష్టంచేసింది. నక్సల్స్‌ హింసతో భయభ్రాంతులైబిక్కుబిక్కుమంటున్న తెలంగాణ గ్రామాలు నేడు శాంతి కోసంగంపెడాశతో ఎదురు చూస్తున్నాయని పేర్కొంది.అందుకే తెలంగాణరాష్ట్రం ఏర్పాటు ఈ ఎన్నికల్లో ప్రధానాంశం కాదని బిజెపి భావిస్తోందనితెలిపింది. సోమవారం ఇక్కడి బిజెపి కార్యాలయంలో బిజెపి ఎన్నికలమేనిఫెస్టోను విడుదలచేసిన అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి అందులోని ప్రధానమైన అంశాలను వివరించారు.

post 2004: అధికారం పోయినప్పటి నుండి భాజపా ప్రత్యేక తెలంగాణా పాటను మళ్లీ అందుకున్నది. మొన్నటికి మొన్న సుష్మా స్వరాజ్ కరీంనగర్ లో గొంతుచించుకున్న వైనాన్ని చూశాం.


5 కామెంట్‌లు:

  1. అధికారంలో ఉన్నప్పుడు మరిచిపొయ్యి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోరికలు గుర్తుకు వచ్చుడు మామూలేగా!

    రిప్లయితొలగించండి
  2. భాజపా అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ విషయం దాటవేసిందనేది అందరికీ తెలిసిందే, కొత్త విషయమేముంది అందులో? అందుకు కారణం అప్పుడు ఎండీయేకి ఆక్సీజన్ ఇచ్చిన నక్కబాబు అన్నవిషయం మరిచి వేరే ఏదేదో రాస్తే ఏంలాభం?

    రిప్లయితొలగించండి
  3. ఓహో! నక్క బాబు గారి మాట మీదనే అద్వాని గారు హైదరాబాద్ తెలంగాణాలోనే ఉంది కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వనవసరం లేదని చెప్పారా? నేనింకా ఆయన సొంత తెలివితేటలు ఉపయోగించారనుకున్నాను. ఆయనకీ ఆమాత్రం తెలివి ఉందనుకున్నానే!

    రిప్లయితొలగించండి
  4. జార్ఖండ్ ని విడగోట్టాలంటే తన శవం మీదనుంచి చెయ్యాలి అని చెప్పిన లల్లు ప్రసాద్ ని ఒప్పించిన BJP .. తెలంగాణా విషయం వచ్చేసరికి తెలంగాణా కంటే చంద్ర బాబు ఎక్కువ ముఖ్యం అయ్యాడు.
    రేపు మళ్ళీ అధికారం లోకి వస్తే .. జగన్ ముఖ్యం అయ్యి తెలంగాణాని పక్కన పెడితే వీళ్లేం పీక్కోవాలి ???

    రిప్లయితొలగించండి
  5. మన సెంటిమెంటు బేవార్సుదైనపుడు కాంగ్రెస్, తెరాసలే కాదు, వైకాప, మజ్లిస్ బిజెపిలు కూడా ఫుట్‌బాల్ ఆడుకుంటాయి. వాళ్ళ మీద ఏద్చి ఏం లాభం? వాళ్ళ యాపారమే అది. :)

    రిప్లయితొలగించండి