ఆంధ్ర జ్యోతి, జూన్ 11 : ఈనెల 19న హైదరాబాద్ రహదారులపై వంటా వార్పు చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసన తెలపనున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. 'హైదరాబాద్ కుక్స్ ఆన్ రోడ్స్' కార్యక్రమంలో భాగంగా.. ఆరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు, తెలంగాణ వాదులు రాష్ట్ర రాజధానిని ముంచెత్తుతారని హెచ్చరించింది. మిలియన్ మార్చ్ స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది.జేఏసీ పిలుపు మేరకు రానున్న కాలంలో తెలంగాణ-ఆంధ్రా, తెలంగాణ- ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకోలు, సమ్మె, హైదరాబాద్ దిగ్బంధం వంటి పోరాట రూపాలను సంధించనున్నట్టు స్పష్టం చేసింది. రైలు రోకోలైనా.. రహదారుల దిగ్బంధమైనా ఇతర ప్రాంతాలకు రాకపోకలు లేకుండా చేయాలని, అవసరమైతే ఏకబిగిన మూడు, నాలుగు రోజులు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వంటా వార్పులో కనీసం 4-5 లక్షల పొయ్యిలు వెలిగేటట్లు చేయాలని చెప్పారు. అయితే, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్ల పక్కన వంటలు జరిగేలా చూడాలన్నారు.
వీరు రోడ్స్ పై కూర్చొంటే పాపం హైదరాబాద్ డాగ్స్ (కుక్కులు కాదు కుక్కలు) సంగతి ఏమి కాను?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి