12, జూన్ 2011, ఆదివారం

విద్యుత్ రంగంలో తెలంగాణాకు అన్యాయం జరిగిందా?

 "ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. "

ఇవి ఉద్యమాల పేరుతో వేర్పాటువాదులు అమాయక ప్రజలకు నూరిపోసే వాదాలు. పై మాటలు మోసపూరితమైన వాదాలతో వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తున్న ఒక బ్లాగ్ లో  కానవచ్చాయి. వారు కేసిఆర్ లేదా కేటిఆర్ వాగిన వాగుడుని గుడ్డిగా కాపీ చేసారనుకుంటా.

హైదరాబాద్ నగరం ఒక యూనిట్గా తీసుకుంటే, 31 -3-1956 నాటికి విద్యుత్ సౌకర్యం ఉన్న గ్రామాలు మరియు నగరాలు కలిపి జిల్లాలవారీగా

Mahbubnagar 0
Medak 1
Nizamabad 0
Adilabad 0
Karimnagar 2
Warangal 0
Nalgonda 1
Hyderabad 2
Khammam 4
Srikakulam 37
Visakhapatnam 45
East Godavari 107
West Godavari 73
Krishna 77
Guntur 33
Nellore 26
Chittor 63
Kadapa 16
Anatapur 39 
Kurnool  29 
From state electricity board's administrative report under rule no 59 APSEB supply rules 1958 ( జై ఆంధ్ర, జై తెలంగాణా,, దగాపడింది ఆంధ్రులే బై చలసాని శ్రీనివాస్ )

అదే పుస్తకం నుండి ప్రత్యేకవాదులకు మరిన్ని చేదు నిజాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విలీనం నాటికి దేదీప్యమానంగా వెలుగులు ఉండే తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రులు వలస వచ్చిచీకట్ల పాలు చేసారనే అనేక గోబెల్స్ ప్రచారాలు వాస్తవాలను మరుగున పడేస్తున్నాయి.అసలు వాస్తవాలు వేరే వున్నాయి 
  •  రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణా ప్రాంతం మొత్తం కలిసి పదకొండు గ్రామాలు కూడా విద్యుదీకరణ లేకుండా ఉంటే 1956 నాటికి చిత్తూర్ జిల్లాలో లేదా గోదావరి జిల్లాలో ఒక్క తాలుకాలోనే పదిహేను గ్రామాలు విద్యుదీకరణ అయి ఉన్నాయి. ఈనాడు రాష్ట్రంలో దాదాపుగా 100 % విద్యుదీకరణ జరిగింది. ఉద్యోగాలతో సహా ఎక్కువ తెలంగాణలోనే కల్పింపబడ్డాయి. జనవరి 2009 నాటికి కూడా రాష్ట్రంలో 7,52,285 ఇళ్ళు విద్యుత్ సౌకర్యం లేకుండా ఉంటే దాంట్లో 1.07 లక్షలు తూ.గో. జిల్లాలోనివే. విద్యుత్ సౌకర్యంలేని పల్లెలు దక్షిణ పంపిణీ కంపెని పరిథిలో 2306 ఉంటే ఉత్తర తెలంగాణా పంపిణీ కంపెనీ పరిధిలో 1359 ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఒక్కటికూడా లేదు.
  • తెలంగాణా ప్రాంత డిస్కం లకు ట్రాన్స్కో  విద్యుత్తును తక్కువ ధరకు అమ్ముతుంది. అయినా తెలంగాణా జిల్లాలలో అక్రమ వాడకం ఎక్కువ కాగా, బిల్లింగ్, మీటర్డ్ అమ్మకాలు తక్కువ. ఉదాహరణకు 2006 సంవత్సరంలో 'Current Theft cases in districts లో తెలంగాణా జిల్లాలే ముందు ఉన్నాయి.
  • రైతులకు ఉచిత/సబ్సిడీ విద్యుత్ సరఫరా ద్వారా ఎక్కువ లాభబడుతున్నది తెలంగాణా ప్రాంతమేనని అందరికి తెలుసు.31-3-2010 నాటికి వ్యవసాయ కనెక్షన్లు 27.34 లక్షలకు చేరుకొన్నాయి.వీటిలో 17 లక్షల వరకు తెలంగాణలో ఉన్నాయి.రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 2009కి వ్యవసాయానికి 46.10% ఖర్చవుతుంది. హైదరాబాద్ నుండి విడిపోయిన హైదరాబాద్-కర్నాటక ప్రాంతంలో రైతులకు విద్యుత్ రోజుకు ఎన్ని గంటలు ఇస్తున్నారో, ఆప్రాంతాలెంత వెనుక పడ్డాయో పరిశీలిస్తే మరింత దయనీయంగా ఉంది.
  • పారిశ్రామికంగా 1961లో  కోస్తాలో 58.5% విద్యుత్ వినియోగం అవుతూ ఉంటే తెలంగాణలో అది కేవలం 28.1%. నేడు అది తెలంగాణాలో 58.77 % ఉండగా కోస్తాలో 29.35 కి పడిపోయింది.రాయలసీమలో 15.6  నుండి 11.86 కి తగ్గింది.1961 నాటి భారత గణాంక వివరాల ప్రకారం చూస్తే కేవలం కృష్ణా జిల్లా వినియోగం ఆనాటి హైదరాబాద్ జిల్లా (రంగారెడ్డి, హైదరాబాద్) మొత్తం వినియోగం కంటే 45 % ఎక్కువ.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి