23, జూన్ 2011, గురువారం

ఏది రెండున్నర జిల్లాల భాష?


"రెండున్నర జిల్లాల భాషను మామీద రుద్దుతున్నదీ సీమాంధ్ర ప్రభుత్వం. మా భాష, సంస్కృతి నాశనమైపోతున్నాయి. సీమాంధ్రులకి మా భాషంటే చులకన. మీ భాష వేరే మా భాష వేరే" 

పైన ఉదహరించిన ఆరోపణ రెండున్నర జిల్లాల భాషను ఉద్దేశిస్తూ తెలంగాణవాదులు అత్యంత తరచుగా చేస్తుంటారు. నాకు అర్ఠమైనంతలో ఇక్కడ రెండున్నర జిల్లాలంటే ఒకటి గుంటూరు కాగా రెండోది కృష్ణా జిల్లా. మరి ఆ అరజిల్లా ఖమ్మమా, ప్రకాశమా, పశ్చిమగోదావరా అనేది నేను ఎంత బుర్ర బద్ధలుకొట్టుకున్నా, ఎంతోమంది బ్లాగ్మిత్రులు, స్వయంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మిత్రులని అడిగినా సమాధానం రాలేదు. ఈ వ్యాసముపై మిత్రులు నన్ను అడుగవచ్చు ఇప్పుడు నువ్వు చెప్పబోయే విషయాలకి ఆధారం ఏమిటని? నాకున్న ఏకైక అర్హత నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చిందీ తీరాంధ్ర కృష్ణా పశ్చిమతీర ప్రాంతములో కావటం. నేనే ప్రత్యక్ష సాక్షిని. కింద సంభాషణని ఒక్కసారి గమనించండి.

శీను: పిన్నాం...పిన్నాం...
పిన్ని: ఓయ్! ఎవుళ్ళు? 
శీను: నేను పిన్నాం..సుబ్బమ్మ చిన్న కొడుకుని..
పిన్ని: యాందబ్బాయా? 
శీను: మీ బర్లు ఎర్రెంకడి సేలోబడ్డయె... నిన్నే మందు కొట్టిందీ.....
పిన్ని: కిష్ణమ్మగోరో ఓ క్రిష్ణమ్మగోరూ...
కృష్ణమ్మ: యాంది బసమ్మా?
పిన్ని: బర్ర్లు వాఁవెనక సేలోబడ్డయ్యె కూస్త ఓ గూపేసి ఇటు తిరగెయ్యండె......
కృష్ణమ్మ: శీనుగా సావిట్లో కట్టుగొలుసెత్తుకురా.... మీ తాతని కేకేసురా పో. 

గమనించారుగా పై సంభాషణని. ఇది మీకు పుస్తకాలలో వ్రాసే ప్రామాణిక తెలుగులాగే అనిపించిందా?  ఎక్కడిదో ఏదో కృతక భాషను పట్టుకొచ్చి వాదిస్తున్నానంటారా? సరే మీరు (ముఖ్యంగా తెలంగాణవాదులు) గుంటూరు జిల్లా , రేపల్లె మండలం వచ్చి చూడండి. పైన చెప్పిన సంభాషణలు యదాతథంగా మీకు వినిపిస్తాయి. దాదాపు గుంటూరు జిల్లాలో తెనాలి నుంచి మొదలుపెట్టి కడలితీరం వరకు వినిపించేది, నడిచేది నేను పైన చెప్పిన భాషే. 

తెలంగాణవాదులారా ఇప్పుడు చెప్పండి ఏది రెండున్నర జిల్లాల భాష? మీరాడిపోసుకునే గుంటూరు జిల్లాలోనే పల్నాటి ప్రాంత భాష సౌందర్యము, వాడుక వేరు. ఇక్కడ డెల్టాలో వాడే భాష వేరు. తిరువూరు-నూజివీడు యాస వేరు, విజయవాడ యాస వేరు, దివిసీమ యాస వేరు. ఎవరు ఎక్కడి భాషను ఎవరిమీద రుద్దుతున్నారు? తెలిసినా చెప్పరు! 

9 కామెంట్‌లు:

  1. అసలే భావిలో కప్పగాళ్ళు, వాళ్ళ 10జిల్లాలే మ్యాపులో తప్ప తిరిగినోళ్ళు కాదు. ఏదో పనీపాటులేక సొల్లు వాగితే మీరు ప్రతి స్పందించకండి.
    బతుకమ్మ ఆడుతరా? పోతరాజు మీకున్నాడా? కట్ట మైసమ్మని కొలుస్తలేరే? బోనాలాడిండ్రా? మీ బిరియాని పేడలక్కుంటది(తెలబాన్ల నవ్వులు బేక్గ్రౌండ్లో), వలస వాదులు, మా బాస-గోస వేరు, మేం బర్రెలంటం, మీరు గేదెలంటారు, సీమోళ్ళు ఎనుములంటరు, పటాకులు అనాలె టపాకులు, టపాకాయలు అంటరేంది? మేము ఉర్దూలో జుబాన్ అంటము, మీరు నాలికంటరు గదెట్లా? కాబట్టి మాది మాగ్గావాలె - ఇవి వాళ్ళ అతిప్రధాన సమస్యలు! వాటిని కాలమే తీర్చగలదు.

    రిప్లయితొలగించండి
  2. స్వచ్చమైన తెలుగు మాట్లాడినా బాధ పడి పోయే బావురు కప్పల గురించి బాధ పడి మన సమయం వృధా చేసుకోవటం అనవసరం. పైన Snkr తో పూర్తిగా అంగీకరిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  3. ఆకాష్ :)

    వాళ్ళకేంకావాలో, ఎందుకేడుస్తున్నారో, ఏది ముఖ్యమో ఇటీవలే ఆవిర్భవించిన తెలిస్తేగాని ఏమీ చేయలేము. రోగం ఇదీ అని తేలితేగాని కాయకల్ప చికిత్సో, కేరళ తైల మర్ధనమో, ఆకుపసరుపోయడమో మరోటొ చేయొచ్చు. రోగలక్షణాలు ప్రతి 3నెలలకూ వూసరవెల్లిలా రంగులు మారిపోతుంటే ఏవైద్యుడైనా ఏం చేయగలడు?! ఇటీవలే ఆవిర్భవించిన తెలంగాణతల్లికైనా అర్థం కావాలంటే మరో 53ఏళ్ళు పడుతుందేమో, ఇక అసలే మానవమాత్రులం మనమెంత?

    జై తెలగాంధ్రసీమ!

    రిప్లయితొలగించండి
  4. తెలంగాణలో తెలుగువిద్యకి ఎక్కువ చరిత్ర లేదు. అక్కడ ప్రస్తుతం తెలిసిన తెలుగు రచనా నైపుణ్యాలు - ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అక్కడికి ఉద్యోగరీత్యా వలసవెళ్ళిన కోస్తా-సీమల తెలుగు మాష్టర్లు నేర్పినవే. అంతకుముందు తెలంగాణ అంతటా ఉర్దూ మీడియమే ఉండేది. తెలుగు మీడియ ‌లో బోధించే సత్తా ఉన్నవాళ్ళు తెలంగాణలో లేక అలా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

    చాలా తరాల పాటు తెలుగు అక్కడ పాలకుల చేత క్గరాఖండిగా నిషేధించబడ్డ భాష. తద్ద్వారా తెలంగాణలో తెలుగు ఒక లిపిలేని భాషగా మార్చబడింది. మాట్లాడుతున్న భాషని వ్రాతలో చూసుకోలేని పరిస్థితుల్లో జనం ఒక ప్రామాణికత అంటూ ఏమీ లేక ఎవఱిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూండడంతో అక్కడి తెలుగు భ్రష్టుపట్టిపోయింది. ఎంతగా అంటే చెప్పడానికి నాకు చాలా బాధేస్తుంది. దురదృష్టవశాత్తు తెలుగుభాషలోని ఒక్క పదం కూడా తన ఒరిజినల్ రూపంలో అక్కడ వినపడదు. అంతా అపభ్రంశమే. పరాయి పాలకులు అలవాటు చేసిన ఈ అపభ్రంశ రూపాల్నే వారు తమవిగా భావిస్తున్నారు. మహాకవి బమ్మెఱ పోతన తమ ప్రాంతీయుడని వారు చెబుతారు. కానీ పోతన ఈ అపభ్రంశరూపాల్ని ఎక్కడా వాడలేదు. ఈ కాలపు లెక్క ప్రకారం ఆయన కోస్తా-సీమల గ్రాంథికాన్నే వాడారు. బహుశా అప్పటికి తెలంగాణవారు ఆంధ్రా ఏరియా మనుషుల్లాగానే ఉన్నారు కావచ్చు. తరువాత ముస్లిముల అణచివేత మితిమీఱి భాష గుర్తుపట్టలేనంతగా మారిపోయింది కావచ్చు.

    ముఖ్యంగా తెలంగాణ ఊళ్ళపేర్లని అవేవో అరబిక్, పెర్షియన్ అన్నట్లుగా హత్య చేశారు. మేడిచర్ల మేడ్చల్ అయింది. ఏమిజాల యాన్జాల్ అయింది. పెదవేముల పెద్దేముల్ అయింది. గంగవరం గంగారం అయింది. కూకటిపల్లి కూకట్‌పల్లి. చీకటిపల్లి చిక్కడ్‌పల్లి. నారాయణగూడెం నారాయణగూడా.... ఇలా తెలుగుని నిలువునా పనిగట్టుకుని హత్య చేసిన పరాయి పాలకులకంటే సరైన తెలుగుని నేర్పిస్తున్న ఆంధ్రావారు వారికి శత్రువుల్లా కనిపించడం మిక్కిలి విచారకరం.

    ఇది ఉద్యమం పేరుతో చెలరేగుతున్న/ చెలామణి అవుతున్న ఒక సామూహిక మూర్ఖత్వం. ఎందుచేతనో ఈ మూర్ఖత్వంలో తెలంగాణవాళ్ళంతా పాల్గొంటారు, చదువుకున్నవాడు, లేనివాడు అనే తేడా లేదు. ఏమైనా చెబితే మమ్మల్ని కించపఱిచారంటారు. చెప్పినందుకు బ్లాగుల్లో పేరుపెట్టి మఱీ సంబోధిస్తూ బండబూతులు తిడతారు. ఏం నేర్చుకుంటారు వీళ్ళు ? ఎప్పటికి మానసికంగా బాగుపడతారు వీళ్ళు ? మాండలికాల ప్రాధాన్యం మాండలికాలకుంది. కావి అవి మనుషుల్ని కలపవు. అవి జనాన్ని ఒకఱి నుంచి ఒకఱిని డిస్కనెక్ట్ చేస్తాయి. అందఱమూ కలిసి మాట్లాడుకోవడానికి ఏదో ఒక మెఱుగైన మాండలికాన్ని ఎన్నుకోక తప్పదు. ఱేపెప్పుడైనా ఒక విదేశీయుడు తెలుగు నేర్చుకుంటానని వస్తే అతనికి ఏ మాండలికం నేర్పిస్తారు ? ఈ Practical wisdom రాష్ట్రంలో లోపించింది.

    నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాప్తిలో ఉన్న మీడియా భాష మూడు జిల్లాల భాష కూడా కాదు;. అది ఒకప్పటి కోస్తా బ్రాహ్మణుల కుల/ గృహ మాండలికం.

    రిప్లయితొలగించండి
  5. nerp.. nerpu.. baga nerpu...neeku baaga telusura abbai.. telugu gurinchi.. dani charitra gurinchi.. acha telugu padaala gurinchi.. ekkuva vegnanne nerchukunnav.. bhale bhale.. nerpu.. nerpu.. anta ikkadiki vachi nerpandi.. neeku telugu shabdadambarmu bagane undi.. ammo potana em rasado.. em bhasa rasado kooda neeku teluse..urla perlu ela marinayo kooda telusukunnav.. neku telivi chana ekkuva.. nee photo kooda bagundira abbai.. a tieeee.. kotu.. bootoo. anglandhra nagrikudila bagane kanipistunnav.. sprooooo... aha.. aha.. keep it up.. inka rayi..nerpu.. nuvvenni cheppina veellu bagupadaru.. nerchukoru.. ayina .. nuvvaite nee pani cheyi.. nerpu.. nerpu..

    రిప్లయితొలగించండి
  6. Snkr గారూ,
    మీరు చురకేశారంటే చురుకు తగ్గటానికి జీవితకాలం పడుతుంది. నా మీద చురకేయనని మాటిస్తేనే మళ్ళీ బ్లాగేది :) :).

    @తాడేపల్లి, ఆకాశరామన్న, సోపతి కామెంటినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @Tadepalli gaaru, glad to read your comment. Sorry, I am in a hurry to type in Telugu

    రిప్లయితొలగించండి
  8. accent and slang will be changed for every 80 miles of region.....I have reaD it some where...


    each and every slang will have it's own uniqueness...

    just becz of POLITICIANS and some FAKE INTELLECTUALS this kind of misunderstandings are being injected to the hearts and minds of T-ppl....


    I am from Gun tur...and I know the differences of slang with in our Guntur.....I found 4 types of slans....Palnadu slang....Tenali slang...Guntur city slang and Guntur rural slang......all 4 r different.....

    రిప్లయితొలగించండి
  9. chala baaga chepparu, nizam palanatho telanganaku pattina grahanaanni veeru goppaga bhavistunnaru,swayampaalananu jeerninchukoleka potunnaru,samskruthini marachi sherwani,biryani maa samskruthi ani cheppe nethaku jai kodutunnaru, chaduvukunnavadu inka moorkhuduga maari nagarikatha ardham marachi pothunnadu, veeru eppudu baagu padataaro wait cheyyalsinde

    రిప్లయితొలగించండి