20, జూన్ 2011, సోమవారం

నమస్తే తెలంగాణాది ఏ భాష?

తెలంగాణ ఉద్యమంలో నుంచి చాలా మంది తాలిబన్లు పుట్టుకొచ్చారు. తెలంగాణ సమాజంలోని ప్రతి వర్గంలో ముల్లా ఒమర్లను సృష్తించిన ఘనత విభజన ఉద్యమానికి ఉంది. అయితే ఎంతో కొంత సామాజిక స్పృహ, ప్రజాస్వామిక చైతన్యం ఉండాల్సిన కవులు, రచయితలు కూడా ఉద్యమ ఛాందసాన్ని, నిర్హేతుక వాదాలని, చిల్లర నినాదాల్ని ముందుకు తీసుకురావడం దురదృష్టం అనుకోవాలి.

 

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘అఖిల భారత తెలంగాణ రచయితల సమావేశం’ ఇటువంటి ధోరణులనే ప్రదర్శించింది. ఈ సమావేశం చేసిన తీర్మానాలను చూస్తే భాషా పండితులు, భాషా శాస్త్రఙ్ఞులకు కూడా తలతిరిగిపోతుంది. మచ్చుకి ఒకటి:


తెలుగు పాఠ్య పుస్తకాలు, మీడియాలో తెలంగాణ భాషనే వాడాలి.


జూకంటి జగన్నాథం, జూలూరి గౌరి శంకర్ అనే ఈ తెలంగాణ నిరంకుశవాదులు ఈ సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులట. వీరు జారి చేసిన ఫత్వా చూస్తే, ఈ విభజన కవులకు కనీస భాషా పరిఙ్ణానం కూడా లేదని అర్ధమవుతుంది.


పాఠ్య పుస్తకాలు ఎక్కడైనా శిష్ఠ వ్యావహారికంలో ఉంటాయి. అవి కోస్తా, రాయలసీమ లేక తెలంగాణ మాండలీకాల్లో ఉంటానికి వీల్లేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు, ఈ సాహితీ ముల్లాలు తెలంగాణ భాషనే పాఠ్య పుస్తకాల్లో పెట్టుకోవచ్చు.


అయితే ఇక్కడో తిరకాసు ఉంది. ఒక వేళ తెలంగాణ భాష (ఇది తెలుగు కాదని ఈ మేధావుల భావం) ని వాడాల్సి వస్తే, ఏ మాండలీకాన్ని, ఏ ప్రాంతపు (ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ) శిష్ట వ్యావహారికాన్ని వాడాలో, అందుకు సమర్ధింపు ఏమిటో కూడా ఈ లిటరరి టెర్రరిష్టులు సెలవివ్వాలి.
మీడియాలో కూడా ఏ భాష వాడాలో వీళ్ళే నిర్నయిస్తారట. పత్రికల్లో, టీవీల్లో, రేడియోల్లో భాషను ఏ ప్రభుత్వాలు, ఏ సాహిత్య పీఠాధిపతులూ జీవోలు, హుకుంల ద్వారా శాసించలేరు. అటువంటి చర్యలని కవులు, కళాకారులనే వారెవరూ హర్షించరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నిరంకుశ విధానాలు అమలు చెయడం సాధ్యం కాదు కూడా.


అయినా ఈ సోకాల్ద్ తెలంగాణ రచయితల సంఘ నాయకులు, తెలంగాణ గుందె చప్పుడు అని చెప్పుకునే నమస్తే తెలంగాణ పత్రికలోనే అందరూ వాడే తెలుగు ( వీరి ఉద్దేశంలో తెలంగాణ కాదు ) భాషనే వాడుతుంటే ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారో చెప్పాలి. కెసీఅర్ కు భయపడా?

http://www.visalandhra.org

3 కామెంట్‌లు:

  1. Tappu valladi kadu......tappu jarugutunnapudu adi tappu ani cheppakunda undipoina Kosta andhra, rayalaseema nayakuladi.
    Dec 9 varaku minnakundi poyaru, munde tama vadana yemito vivarincha ledu.....
    Eppudu telangana vallu chala dooram vellipoyaru.....telugu mahiniyula vigrahala vidhvansam, Telangana talli vigrahalu, Ma telugu talli patanu bahishkarinchatam, staniketarulani dhoosinchatam etc......

    రిప్లయితొలగించండి
  2. Valla vyuham yemitante....bhasha, sanskruti, aharapu alavatlu, veshadharana etc ila prati dantlo unna chinna vaividhyalanu ANTARALU ga chupistu, manasikamga common people madhya vibhajana tisuku ravatam!

    రిప్లయితొలగించండి
  3. Lakshyam rashtram kosam ainappudu, yenduku rashtram kavalanukuntunnaro samanya prajalaku (anni prantala varu) ardhamayyela sowmyam ga vivarinche prayatnam yeppudaina meeru chesara?
    Coastal andhra, rayala seema lo unna common people kuda dongalena???? Ika bida bikki lera?
    Asalu yevaraina telangana rashtram vaste, develop yela avutundi anna vision yevarikaina unda?
    Eee 60 yellu palinchidi telangana vallu kada, repu valle kada vachedi?
    Kali ki debba tagilite, mandu vadali kani kalu tiseyya kudadu.
    Oka vela tiyyali anukunna, patient ki clear ga explain chesi tiyyali....

    రిప్లయితొలగించండి