అసలు ప్రజా సమూహము ఒక జాతిగా గుర్తించబడాలంటే నాలుగు ప్రధాన కారణాలు ఉండాలి. ఆంత్రోపాలజీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం
- భాష
- భౌగోళిక అనుకూలత
- ఉమ్మడి శత్రువు
- మతం అనేవి ఏదైనా ప్రజా సమూహం జాతీయతను నిర్ణయిస్తాయి.
ఇందులో ప్రథమ స్థానం 'భాషది'. అన్ని విషయాలు తెలుగువారు ఒక జాతిగా ఉండటానికి, ఒకే జాతి అనడానికి కావాల్సిన అన్ని సరిపోతాయి. ఆదునిక జన్యు శాస్త్ర పరిశోదనలు తెలంగాణ-సీమాంద్ర-తీరాంధ్ర ప్రాతీయుల జాతి ఒకటే అని బల్లగుద్ది చెబుతున్నాయి. ఓ తెలంగాణావాద మిత్రులు అడిగారు " మీరు చెప్పిన ప్రకారం ఇంగ్లాండు, అమెరికా, ఆస్టేలియా కలిసి పోవాలి, బెంగాల్-బంగ్లాదేశ్ కలిసిపోవాలి అలాగే ఉత్తర భారతదేశం అంతా ఒకే రాష్ట్రంగావాలి" అని. ఇది పూర్తిగా నిర్హేతుక వాదం. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, న్యూజిలాండులలో శ్వేతజాతీయులు ఇప్పటికీ తమ పూర్వీకుల జాతి ఆంగ్లేయులనే చెప్పుకుంటారు. ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు ఇప్పటికీ పూర్తి స్వాతంత్రం లేదన్న సంగతి సదరు తెలంగాణవాద మిత్రులకి తెలియదో లేదా తెలిసీ నటిస్తున్నారో నాకు తెలియదు.
ఇక ఉత్తర భారతదేశం అంటె వీరికి కనబడుతున్నది కేవలం హిందీ మాత్రమే అయితే అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. భాషాప్రయుక్త రాష్ట్రాలను ఇంతకు ముందు విడదీశారు అని చెబుతున్న వీరికి ఉత్తరాఖండ్ (గడ్వాలి), జార్ఖండ్ (సంతాలి) ఛత్తీసుఘడ్ (ఛత్తీస్ఘరి) హర్యానా(హర్యాణవి) ప్రధాన భాషలని తెలియకపోతే తప్పెవరిది? హిందీని అధికార భాషగా ఎంచుకున్న లేదా రుద్దబడుతున్న రాష్ట్రాలలో స్థానిక భాషల దుస్థితి జగద్విదితం. ఇక్కడ తెలుగు రుద్దబడుతున్న గోండి, సవరల పరిస్థితైనా అంతే.
ఇక బెంగాలు సంగతి: బంగ్లా అన్నా బెంగాలి (బెంగాలీ అనేది ఆంగ్లీకరణ) అన్నా ఒక్కటే అని ఏ భాషలో చెబితే అర్థం అవుతుందో నాకర్థం కావటం లేదు. సామాజములో, సాంఘిక జీవనములో మార్పులు అత్యంత సహజమైన విషయం. ఒకే జాతి ప్రజలు ఒకే రాజ్యం (లేదా రాష్ట్రం)లో ఉండకపోవటానికి కారణం కేవలం రాజకీయాలు తప్పితే వేర్వేరు జాతులు కాదు. స్విట్జర్లాండులో జర్మనుభాష మాట్లాడే ఏ వ్యక్తి అయినా తన జాతి 'జర్మను' అనే చెబుతాడు. భారతదేశం భిన్నజాతుల మిశ్రమమేగాని ఒక జాతి కాదు అని భారత ప్రభుత్వ చరిత్ర పాఠ్యపుస్తకాలు ఘోషిస్తున్నాయి. 'జాతీయతకు' 'పౌరసత్వానికి' మధ్య ఉన్న తేడా తెలంగాణవాదుకు అర్థంకాకపోతే తప్పు నాది కాదు. జాతీయత, పౌరసత్వం ఎన్నటికీ ఒకటి కాలేవు. తెలింగ అంటే గోదావరీ (గోదావరికి మరో పేరు) పరీవాహక ప్రాంతం అని అర్థము. ఇప్పటి గోదావరి జిల్లాల ప్రజలుకూడా తెలంగాణ్యులే అవుతారని, మహబూబ్ నగర్, నల్లగొండ వారు తెలంగాణ్యులు కారనీ తెలియదు సదరు తెలంగాణవాదులకి.
ఏతావాతా తెలుగువారందరిదీ ఒకటే జాతి. వేరు జాతుల సిద్ధాంతం కేవలం అబద్ధాల పునాదిపై పేర్చిన మరో ఇటుక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి