8, జులై 2012, ఆదివారం

విభజనకు ప్రాతిపదిక ఏమిటి?

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ (25/5/2010) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్ 1969 నుంచి ఉన్నదే. ఈ అంశం సున్నితమైనదేకాని అత్యవసరమైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రగతి పథంలో అగ్రగామిగా ఉందనే విషయం నిర్వివాదం. 2003-09 సంవత్సరాల మధ్య జాతీయ జిడిపి వృద్ధిరేటు సగటున 8.5 శాతం ఉంటే రాష్ట్రంలో జిఎస్‌డిపి (స్థూల రాష్ట్ర ఉత్పత్తి) రేటు సగటున 9.17 శాతం ఉంది.

రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నవారిలో 60శాతం మందికి వ్యవసాయ రంగమే అవకాశం కల్పిస్తోంది. వ్యవసాయరంగంలో వృద్ధిరేటు గత ఐదేళ్లలో జాతీయ స్థాయిలో సగటున 3 శాతం కాగా, రాష్ట్రంలో 6.74 శాతం ఉండడం విశేషం. గత 53 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధిని నిష్పాక్షికంగా పరిశీలిస్తే దానిలో తెలంగాణదే అధిక భాగమనే విషయం స్పష్టమవుతుంది.

బి.పి. ఆర్.విఠల్ (రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి జరిగిన కృషిలో కీలక పాత్ర వహించిన మాజీ ఐఏఎస్ అధికారి) రాసిన విషయాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సమయానికి రెండు ప్రాంతాల స్థితిగతులు ఎలా వుండేవో అర్థమవుతాయి. మద్రాసు,హైదరాబాద్ రాష్ట్రాల్లోని తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలతో మన రాష్ట్రం ఏర్పాటైంది. పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తెలంగాణ ప్రాంతంలో ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధి చాలా తక్కువ. అయితే కేరళ, కర్ణాటకలుభాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పుడు వాటిలో కలిసిన ఆయా భాషలు మాట్లాడే ప్రాంతాలైన తిరువాన్కూర్-కొచ్చిన్, మైసూర్‌లు కొత్త రాష్ట్రాలలో ఎంతో అభివృద్ధి సాధించిన ప్రాంతాలుగా వచ్చి కలిశాయి.

navya.
ఆంధ్ర ప్రాంతంలోని ఏడు జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలు బాగా వెనకబడడంతో , ఒక సమగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించే సమయానికి తలసరి ఆదాయం, ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధి, తలసరి విద్యుత్ వినియోగం , వ్యవసాయక ఉత్పాదకత, అక్షరాస్యత, జనాభావృద్ధిరేటు, తలసరి మోటారు వాహనాలు, విద్యుదీకరించిన గ్రామాలు వంటి అన్ని ముఖ్య అంశాలలో రాష్ట్రం దేశ సగటు కంటే ఎంతో వెనుకబడి ఉంది.

జిల్లా స్థాయిలో ఉత్పత్తి వృద్ధిరేటు ఎంత ఉన్నదో 1994-95 నుంచి లెక్కలు వేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం 1994-95 నుంచి 2006-07 మధ్య రాష్ట్ర వృద్ది రేటు 6.68 శాతం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే తెలంగాణలోని పది జిల్లాలలో నిజామాబాద్ 6.3 శాతం వార్షిక వృద్ధిరేటుతో చాలావెనుక బడి వుండగా , గణనీయంగా అభివృద్ధి చెందిన జిల్లాలనుకుంటున్న గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వృద్ధిరేటు వరుసగా 4.81; 5.09 శాతం మాత్రమే ఉంది.

దీనిని బట్టి తెలంగాణలో అతి తక్కువ వృద్ధి రేటు కలిగిన జిల్లా కంటే ఆంధ్రప్రాంతంలోని జిల్లాల వృద్ధి రేటు చాలా తక్కువగా ఉన్నదనే విషయం తెలుస్తోంది. అంతేగాక అనేక దశాబ్దాలుగా కొనసాగిన అసమానతలు కూడా పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. కాని ఒకటి మాత్రం నిజం- తెలంగాణలోని పది జిల్లాలూ గణనీయంగా అభివృద్ధిని సాధించాయి. ఇక రాయలసీమ మొదటినుంచీ అనావృష్టి ప్రాంతమే. దేశంలోని అత్యల్ప వర్షప్రాంతం గల జిల్లాల్లో రాయలసీమలోని అనంతపురం జిల్లా రెండవది. ఒరిస్సా,ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గత యాభై మూడేళ్ళుగా వెనుకబడిన ప్రాంతాలు గానే మిగిలిపోయాయి.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో విస్త­ృత ప్ర్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ఆమోదయోగ్యమే అవుతుంది. అయితే ఆ నిర్ణయం మొదటి ఎస్సార్సీ నివేదిక ప్రకారం రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్లుగా సమర్థనీయంగా ఉండాలి. రాజ్యాంగంలోని 3వ అధికరణంప్రకారం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గల విశేషాధికారాలను ఎవరూ కాదనలేదు. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయం పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలి.

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజనుల అభిమతానికి అనుగుణంగా ఏర్పడ్డాయి. కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ సాంస్క­ృతిక నేపథ్యం, సమస్యలు చాలా భిన్నమైనవి. అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వెనుక హేతుబద్ధమైన కారణాలేమైనా ఉన్నాయా? ఉంటే, అవేమిటి?

వెనుకబాటు గురించి కొందరు తెలంగాణ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? అనే విషయాన్ని పాలనా నిపుణులతో పరిశీలింపచేయాలి. అదే నిజమైతే వెనుకబాటుకు కారణాలేమిటి? తెలంగాణ వెనుకబాటుతనం ఆంధ్రతో విలీనం వల్ల ఉత్పన్నమైనదా? 1956లో ఆంధ్రలో కలియడానికి ముందు తెలంగాణ ప్రాంతం సుసంపన్నంగా ఉన్నదా? ఉద్దేశపూర్వక విచక్షణ వల్ల ఆ వెనుకబాటు వచ్చిందా? లేక చారిత్రక కారణాలేమైనా ఉన్నాయా? రాష్ట్ర విభజనే ఆ వెనుకబాటుకు పరిష్కారమా?

ఆంధ్రలో కలవకపోతే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్నదనే విషయాన్ని ఎవరైనా నిరూపించగలరా? రాయలసీమ లోని నాలుగు జిల్లాలు, ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలు కూడా చాలా వెనుకబడినవే. తెలంగాణ కంటే కూడా ఈ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు.కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకొనేట్లయితే ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాల ఏర్పాటుకు కూడా అంగీకరించగలరా?

నిజానికి వెనుకబడిన ప్రాంతాలు లేదా జిల్లాలు లేని రాష్ట్రాలు దేశంలో ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులైన ఆంధ్ర నాయకులకు ప్రాంతీయతత్వం ఎప్పుడూ ఉండేది కాదు. మొత్తం రాష్ట్రానికి చెందిన భారీ పరిశ్రమలైనప్పటికీ, హైదరాబాద్ చుట్టుపక్కలగల రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే వాటిని నెలకొల్పడానికి వారు చేయూత నివ్వడమే అందుకు నిదర్శనం. వాటిలో కొన్నిటిని నిజానికి రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాల్లోను ఏర్పాటు చేయవచ్చు. హెచ్ ఎ ఎల్ యూనిట్లు ఉన్న ఒరిస్సాలో కోరాపుట్ ప్రాంతం, బిహెచ్ఇఎల్ యూనిట్లు ఉన్న హరిద్వార్ కంటేమన రాయలసీమ , మధ్య కోస్తా జిల్లాల్లో వ్యవస్థాపనా సౌకర్యాలు నిజానికి ఎక్కువే ఉన్నాయి.

కేంద్రప్రభుత్వరంగసంస్థలు రాష్ట్రంలో ఎక్కువే ఉన్నా అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీ కృత మయ్యాయి. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటి, నేషనల్ స్కూల్ ఆఫ్ లా వంటివన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంవారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి వారిని దోపిడీకి గురి చేశారనే తెలంగాణ నేతల వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. లేకపోగా మొత్తం రాష్ట్రానికి చెందిన భారీ పరిశ్రమలు,భారీ పెట్టుబడులు తెలంగాణ ప్రాంతానికే లభించాయనే సత్యం ఇక్కడ మరువకూడదు.

పైపెచ్చు ఆంధ్ర ప్రాంతంవారే హైదరాబాద్ చుట్టు పక్కల అనేక భారీ పరిశ్రమలు స్థాపించారనే విషయం కూడా విస్మరించకూడదు. అనేక రంగాలలో, అనేక ప్రాంతాలలో ఆంధ్రప్రాంతం వారు పరిశ్రమలు నెలకొల్పి ఆ ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయిందనీ, ఆంధ్రప్రాంతం వారు విశాలాంధ్ర కోసం చొరవ చూపారనే దుష్ప్రచారం కూడా ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. నిజానికి అది కూడా తెలంగాణ నేతలు చేస్తున్న పెద్ద తప్పుల్లో మరొకటి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో, ఆ ప్రాంతాల మనోవాంఛకు తగినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది గాని ఏ ఒక్కరివల్లనో కాదు. ఇది చారిత్రక సత్యం.

దేశ సుదీర్ఘ చరిత్రలో 1947 కి ముందు 150 సంవత్సరాలు మినహా తెలుగువారంతా ఒక్కటిగానే ఉన్నారు. పరాయి పాలనలో ముక్కలుచెక్కలు అయిన తెలుగు ప్రాంతాలను ఏకం చేయడానికి, తెలుగువారందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి 1900 ప్రాంతంలో హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర నిలయం ఏర్పాటైంది. కొమర్రాజు లక్ష్మణరావు వంటి మహనీయులు తెలుగు సంస్క­ృతి పునరుద్ధరణకు నడుం బిగించడంతో తర్వాత అది ఒక మహోద్యమంలా రూపుదిద్దుకుంది.

తెలంగాణకు చెందిన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, మందుముల నర్సింగరావు వంటి ఎందరో మహానుభావుల నాయకత్వంలో విశాలాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. తెలుగువారుకాకపోయినా తెలుగు ప్రాంతాలు సమైక్యం కావడానికి స్వామి రామానంద తీర్థ అందించిన తోడ్పాటును ఎలా విస్మరించగలం? విశాలాంధ్ర కోసం హైదరాబాద్ ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు బూర్గుల రామకృష్ణరావు.

తెలుగువారికి సమైక్య రాష్ట్రం కోసం ఇంతటి మహత్తరమైన కృషి తొలుత జరిగింది తెలంగాణలోనేనన్న చారిత్రక సత్యాన్ని ఎవరు తుడిచివేయగలరు? అంతే కాదు, హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదించిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందనే సత్యాన్ని కాదనగలమా?ఆంధ్రప్రదేశ్‌నువిభజించడానికి తర్వాత కాలంలో కొందరు ప్రయత్నంచినప్పుడు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ అటువంటి వేర్పాటువాదం ఎంత మాత్రం మంచిది కాదంటూ హితవు పలికిన ఘటన మరువ గలమా? ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిన తర్వాత రాష్ట్రం సర్వతో ముఖంగా అభివృద్ధి చెందింది.

పారిశ్రామికంగా, వ్యావసాయకంగా తెలంగాణ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా 974 కిలో మీటర్లు ఉన్న కోస్తా తీరం, ప్రపంచంలోనే అత్యధికంగా కోస్తాలో ఉన్న సహజవాయు నిక్షేపాలు రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు మరింతగా నడిపించాయి. ఒరిస్సా, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలతో పోల్చితే తెలంగాణలో ఉన్నదంటున్న వెనుకబాటు అతి స్వల్పమే. తెలంగాణకు మంచి భవిష్యత్తు సమైక్య అంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటుంది. ఏవైనా నిజమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు.

- అడుసుమిల్లి జయప్రకాశ్
విజయావాడ మాజీ శాసనసభ్యులు.

3, జులై 2012, మంగళవారం

సమైక్యంలోనే సమృద్ధి

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ (16/12/2010): అన్నం ఉడికిందో లేదో తెలియడానికి అంతా పట్టుకోనక్కరలేదు. అదే విధంగా ఆంధ్ర- తెలంగాణలు ఏ విషయంలో వెనుకబడ్డాయో, ఏ అంశంలో ముందంజ వేస్తున్నాయో తెలుసుకొనేందుకు అన్ని రంగాలనూ పరిశీలించనవసరం లేదు. ఆ అన్నాన్నే పట్ట్టుకొని చూసినా తేలిగ్గా అర్థమైపోతుంది. అభివృద్ధి గణాంకాల ను పరిశీలిస్తే గత మూడు దశాబ్దాలలో వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ, బియ్యం మిల్లింగ్ వంటి అంశాలలో సీమాంధ్ర కంటే తెలంగాణలోనే ఎంతో మెరుగైన పరిస్థితులున్నాయని విశదమవుతుంది.

రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 2010-11 సంవత్సరానికి గాను 210 లక్షల టన్నులుగా నిర్ణయించారు. దీనిలో వరి ఉత్పత్తి 148.85 లక్షల టన్నులు. తాజా అంచనా ప్రకారం వరి ఉత్పత్తి లక్ష్యం కంటే ఎక్కువ ఉండే సూచనలే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉత్పత్తిలో 40 శాతం దాకా తెలంగాణ నుంచి లభించడమే. వరి ధాన్యం ఒక నిత్యావసర వస్తువు మాత్రమే కాదు; వరి అనాది నుంచి మన సంస్కృతిలో ఒక భాగం.

దక్షిణాది ధాన్యాగారంగా మన రాష్ట్రం ప్రసిద్ధి కెక్కింది. పంటలను మన రైతులు 'సస్యలక్ష్మి'గా ఒక ఆరాధాన భావంతో కొలుస్తుంటారు. బియ్యం (అక్షింతలు) లేకుండా ఏ శుభ కార్యమూ జరగదన్నది అందరికీ తెలిసిందే. అటువంటి బియ్యం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు ఆంధ్ర ప్రాంతంలో అధికంగా ఉన్నా, తర్వాత ఆ ఘనత ను తెలంగాణ ప్రాంతం దక్కించుకుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందుకు ప్రధాన కారణం-తెలంగాణ ప్రాంతంలో నీటి పారుదల అభివృద్ధికి, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధికి ప్రభుత్వాలు నిర్విరామ కృషి చేయడమే.

ఆంధ్ర ప్రాంతం వలస పాలనలో ఉన్న సమయంలో గోదావరి డెల్టాలో డ్యామ్‌లు, రోడ్ల నిర్మాణం విరివిగా చేపట్టడంతో రవాణా, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగానే పెరిగాయన్నది వాస్తవ మే. 1858లో ధవళేశ్వరం, 1908లో కృష్ణా బ్యారేజ్‌ల నిర్మాణాల వల్ల ఆంధ్ర ప్రాంతం సస్యశ్యామలమైంది. 1923లో నిర్మించి నిజాంసాగర్ డ్యామ్ మినహా తెలంగాణలో నాడు సరైన నీటిపారుదల సౌకర్యాలే లేవు.

హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో సాగునీటి పారుదల ప్రాంతం 5.1 శాతం మాత్రమే ఉండగా, ఆంధ్ర ప్రాంతం లో 30.3 శాతం ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం విద్యు త్ వినియోగంతో సమైక్య రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా 18 శాతం మాత్రమే.

అంటే అప్ప ట్లో 5,46,317 టన్నుల వరి ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయ్యేది. తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా ఈ ఉత్పత్తి 2008-09 నాటికి 53,60,547 టన్నులకు అంటే 881 శాతం పెరిగింది. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిం దో చెప్పడానికి నిజానికి ఈ ఉదాహరణ చాలు.

తెలంగాణలో కరీంనగర్, నల్లగొండ జిల్లాలు వరి ఉత్పత్తిలో ముందంజ వేస్తున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల మధ్య ఉత్పత్తిలో అసమానతలకు కారణం నీటి పారుదల సౌకర్యంలో లోపమే. ఆంధ్ర ప్రాంతం వారు నదీ జలాలను తెలంగాణకు దక్కకుండా దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణవాదులు తరచుగా ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణలో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2008-09లో కరీంనగర్ జిల్లాలో 11,75,996 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా ఆదిలాబాద్ జిల్లాలో 1,98,382 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది.

గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదిలాబాద్ ఎగువున ఉండగా కరీంనగర్ దిగువున ఉంది. ఎక్కడైనా సరే నది దిగువ ప్రాంతంలోని వారికే తగినంత ప్రయోజనం కలుగుతుంది. కరీంనగర్‌లో ఉత్పత్తి ఎక్కువగా ఉన్నంత మాత్రాన అక్కడివారు ఆదిలాబాద్ నీటిని దోపిడీ చేస్తున్నారని అనగలమా? అలా కానప్పు డు దిగువున ఉన్న ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం నదీజలాలను దోపిడీ చేస్తున్నారని అనడంలో ఔచిత్యం ఏముంది?

1956 నుంచి వరి ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ అభివృద్ధి ఎక్కడ జరిగిందో విశదమవుతుంది. 1955-56లో కోస్తాంధ్ర లో వరి ఉత్పత్తి 21,61,560 టన్నులు కాగా రాయలసీమలో 3,41,620 టన్నులుగా ఉంది. అదే సమయంలో తెలంగాణలో 5,46,317 టన్నులు వరి మాత్రమే ఉత్పత్తయింది. 2008-09 నాటి కి ఈ ఉత్పత్తి కోస్తాంధ్రలో 80,65,910 టన్నులకు పెరగగా, రాయలసీమలో 8,14, 676 టన్నులకు పెరిగింది.

అదే సమయంలో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 53,60,547 టన్నులకు పెరిగిం ది. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే-వరి ఉత్పత్తి తెలంగాణలో 18 శాతం నుంచి 881 శాతానికి పెరిగిందని. ఈ పెరుగుదలకు వరి పండించే విస్తీర్ణం పెరగడం ప్రధాన కారణం. ఆ విస్తీర్ణం పెరగడానికి నీటి పారుదల సౌకర్యాలు విస్తరించడం అసలు కారణం.

అదే విధంగా వరి ధాన్యం సేకరణ కూడా తెలంగాణలో గణనీయంగా పెరిగింది. వివిధ ప్రభుత్వ సంస్థలు 2008-09లో తెలంగాణ ప్రాంతంలో చేసిన వరి సేకరణ 33,06,139 టన్నులుగా ఉంది. అంటే రాష్ట్రంలోని మొత్తం సేకరణ కంటే ఇది 40 శాతం ఎక్కువ. 2000-01లో కోస్తాంధ్రలో 53.7 శాతం వరి ధాన్య సేకరణ జరగగా, 2006-07 నాటికి అది 52.7 శాతానికి తగ్గింది. కాని అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో సేకరణ 44.9 శాతం నుంచి 46.5 శాతానికి పెరగడం గమనార్హం.

తెలంగాణలో వరి ఉత్పత్తే గాక మొత్తం ఆహార ధాన్యాల ఉత్ప త్తి కూడా గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడులో ఆహార ధాన్యాల ఉత్పత్తి కం టే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. పొరుగున ఉన్న తమిళనాట జనాభా దాదాపు ఏడు కోట్లు కాగా తెలంగాణ జనాభా దానిలో సగం మాత్రమే. అయినా ఆహార ధాన్యాల ఉత్పత్తి తెలంగాణలోనే ఎక్కువ.

ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 42 శాతం, జనాభాలో 40 శాతం ఉన్న తెలంగాణలో 2008-09లో ఆహార ధాన్యాల దిగుబడి రాష్ట్ర ఉత్పత్తిలో 40.4 శాతం ఉంది. అంటే విస్తీర్ణం, జనాభా శాతాలకు దాదాపు సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తెలంగాణ లో జరుగుతున్నదన్న మాట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ శాతం 1956లో 24.9 కాగా 2009 నాటికి 40.4కు పెరగడం. అంటే సమైక్యరాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కోస్తా, రాయ ల సీమల కంటే తెలంగాణలోనే ఆహారధాన్యాల ఉత్పత్తి, సాగునీటి విస్తీర్ణం బాగా పెరిగాయన్న మాట.

దేశంలో మొత్తం ఉత్పత్తయ్యే బియ్యంలో మన రాష్ట్రం వాటా 13 శాతం ఉంది. మొత్తం వరిసాగు చేసే విస్తీర్ణంలో 9 శాతమే మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం అంతకుమించి అధికం గా ఉంది. గత దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో వరి పండించే విస్తీ ర్ణం 21.61 లక్షల హెక్టార్లలో పెరగగా అందులో అధిక శాతం తెలంగాణ ప్రాంతానిదే కావడం గమనించవల్సిన విషయం.

1955-56లో మొత్తం సాగు నీటి ప్రాంతం సీమాంధ్రలో 33.3 శాతం కాగా తెలంగాణలో 17.9 శాతం మాత్రమే ఉండేది. కాని 2007-08 నాటికి ఈ విస్తీర్ణం సీమాంధ్రలో 42.7 శాతానికి, తెలంగాణలో 43.1 శాతానికి పెరిగింది. అంటే ఆ కాలానికి వృద్ధి శాతం సీమాంధ్రలో 40.8 శాతం కాగా తెలంగాణలో 140.8 శాతం ఉంది. వరి పంట విస్తీర్ణం కూడా 1955-56లో సీమాంధ్రలో 47.88 లక్షల ఎకరాలు కాగా తెలంగాణలో 19.39 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది.

అది 2005-06 నాటికి సీమాంధ్రలో 63.01 లక్షల ఎకరాలకు పెరగగా తెలంగాణలో 36.52 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఆ కాలానికి వరి పంట విస్తీర్ణంలో ఇలా రెట్టింపు పైగా వృద్ధి కనిపిస్తే వరి ఉత్పత్తిలో తెలంగాణ ప్రాంతంలో అనేక రెట్లు వృద్ధి కనిపిస్తోంది. అందుకే గత మూడు దశాబ్దాలలో సీమాంధ్ర కంటే తెలంగాణ నుంచే బియ్యం ఎగుమతులు కూడా అధికంగా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వివిధ ప్రభుత్వాలు తెలంగాణ లో నీటి పారుదలకు చేసిన వ్యయం 46 శాతం ఉండగా, ఆంధ్రలో 25 శాతం, రాయలసీమలో 25 శాతం వ్యయం జరిగింది. 'కాగ్' నివేదికల ప్రకారం చూస్తే 1956-2009 డిసెంబర్ మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులపై మొత్తం 64, 861.72 కోట్ల వ్యయం చేయగా ఇందులో 29,701.03 కోట్లు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు చేశారు. ముఖ్యంగా 2004-10 మధ్య నీటి పారుదల ప్రాజెక్టులకు మొత్తం 49,912.40 కోట్లు ఖర్చుకాగా దానిలో 23,221.75 కోట్లు అంటే తెలంగాణ ప్రాజెక్టులకు 48 శాతం ఖర్చు చేశారు.

ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం ఎక్కువగా ప్రయోజనం పొందింది తెలంగాణ ప్రాంతమే. ముఖ్యంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఆదర్శవంతమైన బాటలో పయనిస్తోంది. ఇందుకు ప్రధాన కార ణం ఇప్పటి దాకా వచ్చిన అన్ని ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడమే.

-అడుసుమిల్లి జయప్రకాశ్
మాజీ శాసనసభ్యులు

29, జూన్ 2012, శుక్రవారం

మహోన్నత నేత పీవీ

ఈనాడు దినపత్రిక(29/6/2012)



ఘననివాళులు అర్పించిన ప్రముఖులు

దివంగత భారత ప్రధాని పీవీ నర్సింహారావు 91వ జయంతి ఘనంగా జరిగింది. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో జరిగిన జయంతి ఉత్సవంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, బండారు దత్తాత్రేయ, కుటుంబ సభ్యులు పీవీ రాజేశ్వరరావు, పీవీ రంగారావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి బహుదా ప్రయోజనకరమైనాయని ప్రశంసించారు. ఆయనకు భారతరత్న ఇవ్వడంతో పాటు పాఠ్యాంశాల్లో పీవీ జీవిత చరిత్రను చేర్చాలని దత్తాత్రేయ అన్నారు. గురువారం పీవీఘాట్‌ వద్ద సర్వమత ప్రార్థనలు, ఉచిత వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఉచిత కంటి పరీక్షలు చేయించుకునే రోగులకు చుక్కల మందువేసి రోశయ్య శిబిరాన్ని ప్రారంభించారు.దేశానికి దశ, దిశ నిర్దేశించిన మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఆయన తనయుడు పీవీ రాజేశ్వరరావు అన్నారు. గురువారం గాంధీభవన్‌లో పీవీ చిత్రపటానికి ఆయనతో పాటు, పీసీసీ అధికార ప్రతినిధి కమలాకర్‌రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్‌ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.

తెలంగాణ పట్ల నిబద్ధత కలిగి ఉంటూనే.. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్‌ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ, తెలంగాణ పట్ల పీవీ నిజాయితీ, నిబద్ధత సాటిలేనివన్నారు. పీవీ ఎడమకాలి గోటికి, ఆయన చిత్తశుద్ధికి సరిపోనివారు.. వారు ఏ పార్టీ వారైనా.. ఏ ప్రజాసంఘాల వారైనా ప్రత్యేకరాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

28, జూన్ 2012, గురువారం

సమైక్యవాది కీ.శే. పి.వి.నరసింహారావు 91వ జయంతి సందర్భంగా 'విశాలాంధ్ర మహాసభ' శ్రద్ధాంజలి



 'విశాలాంధ్ర మహాసభ' ఈ నెల 28వ తేదీన కీ.శే. పి.వి.నరసింహారావు 91వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలతో  శ్రద్ధాంజలి ఘటించింది.ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు  భాషా కోవిదుడు,  దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి కీ.శే. పి.వి.నరసింహారావుకు 'విశాలాంధ్ర మహాసభ' నేతలు పరకాల ప్రభాకర్, సి. ఆంజనేయరెడ్డి,ఐపీఎస్(రిటైర్డ్), నలమోతు చక్రవర్తి, వి.లక్ష్మణరెడ్డి,కుమార్ యాదవ్ చౌదరి,సుంకర వెంకటేశ్వరరావు,కె .శ్రీనివాసరెడ్డి తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా 'విశాలాంధ్ర మహాసభ' నేత పరకాల ప్రభాకర్ ప్రసంగిస్తూ పి.వి.నరసింహారావు సమైక్యవాదియని, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వారు కృషి చేసారన్నారు. 1969, 1972లో జరిగిన వేర్పాటువాద ఉద్యమాలను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ ను ఐక్యంగా నిలబెట్టిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు  పి.వి.నరసింహారావు అని కొనియాడారు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పి.వి స్వాగతించారని, రాష్ట్రాల విభజన సమస్యను అఖిల భారత స్థాయిలో జాతీయ దృష్టితో పరిశీలించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని భావించేవారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనవాదులు పి.వి.నరసింహారావు మాటలను గుర్తు చేసుకొని విజ్ఞతతో వ్యవహరించాలని, రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాలని పరకాల ప్రభాకర్ విజ్ఞప్తి చేసారు


నలమోతు చక్రవర్తి,

10, జూన్ 2012, ఆదివారం

తెలంగాణ ఉద్యమం తెరాసకు తాకట్టా?

An article on Telengana agitation published in Andhra Bhoomi on 10/06/2012.
The link: http://www.andhrabhoomi.net/content/telangana-agitation-0

    రాజ్యం ఏర్పడిన నాటినుంచి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు వివిధ నాయకత్వాల క్రింద పోరాడుతునే ఉన్నారు. చరిత్రను నిర్మించడం, తిరగరాయడం చేస్తూనే ఉన్నారు. రాజ్యం ఉన్నంతవరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటాలు విభిన్న రూపాల్లో ఉండవచ్చు. ఒక ప్రాంతానికి పరిమితమైనా, ఇరు దేశాల మధ్య జరిగినా ఐక్య సంఘటనలు లేకుండా ఉద్యమాలు, పోరాటాలు విజయవంతమైన దాఖలాలు చరిత్రలో లేవు. ఈ చారిత్రక అంశాలు ఏవి పట్టని రాజకీయ, రాజకీయేతర శక్తులు తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి ఉప ఎన్నికలపై ఉప ఎన్నికల్ని సృష్టిస్తూ ప్రజల మాన, ప్రాణ, ఆస్తులను కొల్లగొట్టుతున్నాయి. దీనికి పరాకాష్టనే పరకాల ఉప ఎన్నిక.
    ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని, ఉద్యమ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 2004లోనే ప్రధాన శత్రువైన కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకొని 28 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్ని దక్కించుకుంది. కాని నీతి, నిజాయితి లేని (ఇంకేదైనా వాడచ్చు!) తెలంగాణ ముసుగులో ఎన్నికైన రాజకీయ నాయకులు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి చరిత్రను పునరావృతం చేసారు. దీన్ని నిలవరించడంలో కెసిఆర్ వేచిన ఏ పాచిక పారలేదు. తిరిగి 2009లో మరో శత్రువు టిడిపితో జత కట్టినా సగానికి సగం సీట్లను కోల్పోయి 12 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంటు స్థానాలకే పరిమితమైంది టిఆర్‌ఎస్. ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించని కెసిఆర్ ఇంకా ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధిస్తానని, పరకాల ఎన్నికలు చివరి రెఫరండమని చెబుతున్నాడు.
    తన రాజకీయ ఆధిపత్య ధోరణిని కాపాడుకోవడానికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన తొమ్మిది ఉప ఎన్నికలకు కారకుడైనాడు (పరకాలకు తప్ప!). తెలంగాణకోసం ప్రాణాలర్పిస్తామని కథలను చెప్పి గద్దెనెక్కిన జగ్గారెడ్డి, మందాడి, శార్వారాణి తదితరులు ఇప్పుడు టిఆర్‌ఎస్‌కే ప్రధాన శత్రువులయ్యారు. తన కవితా చాతుర్యంతో ఈటెలకు ముందు మీడియాల్లో కనపడిన మందాడి సత్యనారాయణరెడ్డి ఇప్పుడెక్కడున్నాడో కూడా తెలియడం లేదు. 2014లో కూడా అత్యధిక సభ్యుల్ని గెలిపించుకున్నా, టిఆర్‌ఎస్ పక్షాన గెలుపొందిన వారు గతంలో అమ్ముడుపోయిన వారిలాగా సంతలో అమ్ముపోరనే గ్యారంటీ ఏమి లేదు.
    బిజెపి పక్షాన గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 2009 దాకా టిఆర్‌ఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే! రాజకీయ కారణాలతో బిజెపిలోకి ఆయన వలస పోయాడు. గత ఉప ఎన్నికల్లో అతి తక్కువ మార్జిన్ ఓట్లతో ఆయన గెలుపొందాడు. ఈ సందర్భంగా గెలిచిన పార్టీ బిజెపి అయినా, వ్యక్తి మాత్రం మాజీ టిఆర్‌ఎస్ అభ్యర్థే! బహుశా ఆయన పట్ల సానుభూతి కూడా పనిచేసి ఉండవచ్చు! కాని ఓడిపోయిన ద్వేషంతో బిజెపిని మతతత్వంతో, ముస్లిం వ్యతిరేకతతో గెలిచిందని టిఆర్‌ఎస్ ప్రచారం చేస్తున్నది. ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అంశాలు అనేకం! ఒకటి, బిజెపి మతతత్వ పార్టీ అని భావిస్తే నిజామాబాద్‌లో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? బిజెపితో కలిసి జెఎసిలో ఎందుకు భాగస్వామి అయింది? రెండు, ఒక వ్యక్తి టిఆర్‌ఎస్‌తో ర్యాలీ అయితే లౌకిక వాది, బిజెపితో అయితే మతతత్వ వాది అవుతాడా? టిఆర్‌ఎస్‌కు నిజంగా లౌకిక వాదమే ఉంటే మధ్యమధ్యన చండీయాగాలెందుకు జరుగుతున్నాయి? ఈ యాగాలు దేన్ని సూచిస్తాయి?
    ఇక పరకాల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ది ఒంటెత్తు పోకడనే కావచ్చు! మేధావుల సమ్మేళనంగా చెప్పుకుంటున్న పొలిటికల్ జాక్ (పేరేమో పొలిటికల్ జాక్- కాని రాజకీయాలకు అతీతంగా అని చెపుతుంది) పాత్ర కుడితిలో పడ్డ బల్లిలాగా తయారైంది. కనీస విచక్షణ లేకుండానే టిఆర్‌ఎస్‌కు సరెండరైంది. దీనికి గల కారణాల్ని నాయకత్వం వహిస్తున్న కోదండరాం చెప్పాలి. జాక్‌లోని మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు టిఆర్‌ఎస్‌కే మద్దతు ఇవ్వాలని అంటే కాదన్నది ఎవరు? దీనికోసం ఇన్ని రకాల పిల్లిమొగ్గలు వేయాలా! నాటకాలాడాలా? ‘సర్వే’ పేరున జాక్ చేపట్టి టిఆర్‌ఎస్‌కే మెజారిటీ వస్తుందని భావించి మొగ్గుచూపడం ఉద్యమాన్ని రెండుగా చీల్చడమే అవుతుంది. ఒకవేళ పరకాల పరిణామాలు ఊహించిన దానికంటే భిన్నంగా వస్తే జవాబుదారీతనం ఎవరు వహిస్తారు? పొలిటికల్ జాకా, లేక టిఆర్‌ఎస్సా? లేదా ఇద్దరు కలిసి బిజెపి పైన దాడి చేస్తారా? టిఆర్‌ఎస్ గెలిస్తే మాత్రం, తానే నిజమైన ఉద్యమ రాజకీయ పార్టీ అని, మిగతావి కావని, ప్రజలు బుద్ధిచెప్పారని అంటుంది. జాక్ మాత్రం తన సహకారంతోడే టిఆర్‌ఎస్ గెలిచిందని, ఇది చేయనందుకే మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ ఓడిపోయిందని ప్రచారం చేయకున్నా అంతర్గతంగా మాత్రం భావిస్తుంది.
    అనుకోకుండా బిజెపి గెలిస్తే తిరిగి అదే మతతత్వ వాదనను ముందుకు తెచ్చి ముస్లిం వ్యతిరేక పార్టీగా బిజెపిని జాక్ నుంచే కాక, 2014 ఎన్నికల్లో కూడా శాశ్వతంగా టిఆర్‌ఎస్ దూరం ఉంచుతుంది. అంటే 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనే నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో ఉంటాయి. అంటే పరీక్ష తెలంగాణ వాదానికే కాకుండా తెలంగాణ ముసుగులో ప్రజలకు జరుగుతుంది. పరకాలలో ఒకవేళ జగన్ పార్టీ గెలిస్తే తెలంగాణలో మానుకోట పునరావృతం అవుతుందా? లేక జగన్‌తో టిఆర్‌ఎస్ జత కడుతుందా? ఇది అంత సులభంగా తేలని ప్రశే్న! కాని పూజించాలనుకుంటున్న మానుకోట ఉద్యమ రాళ్ళలో టిఆర్‌ఎస్‌వే కాక, కాంగీవి, బిజెపివి, సిపిఐవి, న్యూడెమోక్రసివి, టిడిపివి కూడా ఉన్నాయనే విషయాన్ని టిఆర్‌ఎస్ గుర్తించలేదు. పరకాల ఎన్నికలో తెలంగాణ భవిష్యత్తు ఎటూ తేలకపోగా, మరింత చిక్కుముడుల్లోకి వెళుతుందని జాక్ గ్రహించకపోవడం దాని ఉద్యమ అవగాహన రాహిత్యమే అవుతుంది. బిజెపికి తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా విద్యావంతుల్లో, యువకుల్లో పట్టు ఉంది. దానికో బలమైన విద్యార్థి సంఘం ఉంది. మంచో, చెడో ఓ జాతీయ భావం ఉంది. ఉద్దేశం ఏదైనా పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ వాదాన్ని గొంతు విప్పి చెప్పుతున్నది. గతంలో చేసిన తప్పిదాన్ని గుర్తించి, ఈసారి అధికారంలోకి వస్తే బిల్లును ప్రవేశపెడుతానని నిజాయితిగా చెపుతున్నది. కేంద్రంలో అధికారంలోకి రాకున్నా దాదాపు 100 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా మాత్రం ఉంటుంది. తిరిగి కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి (ఇప్పుడున్న పార్టీలు తారుమారైనా) పాలక పక్షంగా మారితే, టిఆర్‌ఎస్ ఎవరి మద్దతుతో తెలంగాణను సాధిస్తుందో తెలియదు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇదేమి ఉద్యమ పద్ధతి? ఐక్య పోరాటం? జాక్‌కు టిఆర్‌ఎస్‌ను ఒప్పించే శక్తి లేనప్పుడు తటస్థ వాదం బాగా పనిచేసేది. గెలుపు ఓటమిల గుణపాఠంతో టిఆర్‌ఎస్‌ను, బిజెపిని తన గుప్పిట్లో పెట్టుకొని ఉద్యమాన్ని నిజాయితితో, ధైర్యంగా నడపగలిగేది. ఈ మాత్రం ఆలోచన పొలిటికల్ జాక్ నాయకులకు లేదని అనుకోగలమా?
    పరకాల ఎన్నికల్లో నిర్ధ్వందంగా తేలేదేంటంటే, తెలంగాణ ఉద్యమానికి టిఆర్‌ఎస్సే కర్త, కర్మ, క్రియ కావాలనుకోవడం! దానికి జాక్ ఉత్ప్రేరకంగా పని చేయాలనుకోవడం! దీంతో నావను గట్టుకు చేర్చనూ వచ్చు! నదిలోనైనా ముంచవచ్చు! 1969నాటి చెన్నారెడ్డి, ఆమోసు, మల్లికార్జున్, స్వామినాథ్‌ల పాత్రలే తిరిగి పేర్లు మార్చుకొని నేడు తిరిగి కనపడుతున్నారు. అందుకే ఒకవైపు ఎన్నికలకు పోతూనే, దుష్ట కాంగ్రెస్‌ను దులుపుతూనే, మూనె్నళ్లల్లో తెలంగాణ వస్తుందని తిరిగి కెసిఆర్ చెట్టుకింది చిలుక జోస్యం చెప్పడం ప్రారంభించారు.
    తెలంగాణ ఉద్యమాన్ని గత 8 సంవత్సరాలుగా ఎన్నికల చుట్టూ తిప్పుతూ, పిల్లల ఉసురు పోసుకుంటున్న వైనాన్ని గుణపాఠంగా తీసుకొని పొలిటికల్ జాక్ ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఓ నిర్ణయాన్ని తీసుకోలేని దుస్థితిలో ఉండడం శోచనీయం. ఉద్యమాలే ఏ రాజకీయ పార్టీనైనా నిర్దేశిస్తాయని, ఎన్నికలు ఉద్యమాల్ని పక్కదారి పట్టించి, నీరుగారుస్తాయనే చారిత్రిక వాస్తవాల్ని, సంఘటనల్ని ఉటంకిస్తూ, యువతను, ఉద్యోగుల్ని, ప్రజల్ని జాక్ చైతన్యవంతం చేయాల్సింది పోయి, రాజకీయ పార్టీలకు ఏకతాటిపై నడుపుతూ, వాటికి దశ, దిశల్ని నిర్దేశిస్తూ, ఉద్యమాల్ని తన గుప్పిట్లో ఉంచుకోవాల్సిన ‘జాక్’ టిఆర్‌ఎస్ గుప్పిట్లోకి వెళ్ళడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమే! ఉద్యమం ముందుకు పోవడమేమోగాని, ఉద్యమాన్ని తిరిగి నలభై ఏండ్ల వెనక్కి తీసుకెళ్ళడం పరకాల చర్యతో ప్రారంభమైంది. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును తేల్చడమేమోగాని ముంచకుండా ఉంటే అదే చాలు!

    - జి.లచ్చయ్య

    5, జూన్ 2012, మంగళవారం

    పరకాల ఉపఎన్నిక లో MCPI పోటీకి 'విశాలాంధ్ర మహాసభ' సంఘీభావం

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం తెలుగు ప్రజలకు అత్యంత కీలకం, ఆవశ్యకమైన రాష్ట్ర సమగ్రత పరిరక్షణ విషయంలో దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా ద్వంద్వ వైఖరిని లేదా దాటవేత ధోరణిని అవలంభిస్తున్న ఈ తరుణంలో MCPI పార్టీ వరంగల్ జిల్లా పరకాల ఉపఎన్నికలో సమైక్యవాదానికి బాసటగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు ఆ పార్టీకి సంఘీభావం, అభినందన తెలుపటానికి 'విశాలాంధ్ర మహాసభ' 06/06/2012 (బుధవారం) ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో MCPI పార్టీ ప్రతినిధులు శ్రీ వెంకటరెడ్డి ప్రభుతులు, 'విశాలాంధ్ర మహాసభ' తరపున సంస్థ అధ్యక్షులు శ్రీ నలమోతు చక్రవర్తి, స్వాతంత్య్రసమరయోధురాలు శ్రీమతి శాఖమూరి సుగుణమ్మ, శ్రీ ఆంజనేయరెడ్డి, శ్రీ చేగొండి రామజోగయ్య, శ్రీ కుమార్ యాదవ్ చౌదరి, శ్రీ పీ రవితేజ, శ్రీ కే శ్రీనివాసరెడ్డి ఇంకా ఇతర సభ్యులు పాల్గొంటారు.

    Visalandhra.org :Andhra Pradesh Communists held the mantle of Telugu unity for many decades. During the armed uprising against Nizam, it is the Telugu brotherhood that brought together leaders like Puchalapalli Sundarayya and Ravi Narayan Reddy to fight against Nizam. Alas, several communists today have given up the original ideals. While CPI that runs “Visalandhra” wants to divide the state and CPM that stands for integration only pays a lip service. It is in this difficult environment, MCPI party for the last several years, has strongly stood for the geographical integrity of the state of Andhra Pradesh. In fact, late Sri B.N. Reddy and Sri Omkar, I understand, were staunch integrationists.

    It is indeed bold of MCPI to stand on a platform of integration in Warangal’s Parkal constituency. We express our gratitude to MCPI candidate Somidi Srinivas for taking a principled position on this issue.

    Our electoral politics are no longer won by principles and philosophies. Our elections are won via money, caste, creed, and religion. It is in this difficult electoral environment, we urge the integrationists in the Parkal constituency to support MCPI candidate and make our voices heard.

    Visalandhra Mahasabha is conducting a press meet in the Somajiguda Press Club at 11.00 AM on Wednesday, June 6th. Leaders of Visalandhra Mahasabha and MCPI will address the press during this meet. You all are welcome to participate in the event.

    24, మే 2012, గురువారం

    నీటిపారుదల రంగంలో తెలంగాణ వివక్షకు గురయ్యిందా?






    Our case for a united state - అభివృద్ధి సూచికలలో తెలంగాణ తీసిపోయిందా?

    'విశాలాంధ్ర మహాసభ' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను పరిరక్షించడానికి పాటుపడుతున్న సంస్థ, స్వలాభాపేక్ష లేని  కొంతమంది  వ్యక్తుల సమూహం.'రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం' అనే అంశం పై 'విశాలాంధ్ర మహాసభ' ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలలో మీడియా వర్క్ షాప్  మరియు  ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. అంతే కాక పుస్తకప్రచురణ, ప్రసార మాధ్యమాల ద్వారా మా వాదనను అందరికి వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని అడ్డంకులను అధిగమించి, వేర్పాటువాదుల అసత్య ప్రచారాలను ఎండగట్టి, రాష్ట్రసమైక్యతను కాపాడవలసిన అవసరం గురించి అన్ని ప్రాంతాల ప్రజలకు తెలియచెప్పాలనేదే మా సంకల్పం. అంతర్జాలంలో కూడా మా వాదనను పది మందికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మా ప్రదర్శనల్లోని కొన్ని చార్టుల సారాంశాన్ని పోస్ట్ చేయతలపెట్టినాము.

    నలమోతు చక్రవర్తి
    అధ్యక్షుడు, విశాలాంధ్ర మహాసభ


    ముందుగా ముఖ్యమైన ఆర్ధిక,సామాజిక సూచికలను చూద్దాం


    29, ఏప్రిల్ 2012, ఆదివారం

    ఉక్రోషాలు వద్దు!ఉభయతారక పరిష్కారం రాబోతుంది!

    ఆంధ్రప్రభ వ్యాసం: అడపా దడపా అన్య విషయాలపై కూడా రాస్తున్నా, ఈ శీర్షిక కింద గత అయిదారేళ్లుగా వారం వారం ప్రచురితమవుతున్న నా వ్యాసాల్లో ప్రతిబింబించిన అంతస్సూత్రం, ఒకవేళ ఈ రాష్ట్ర విభజన జరిగితే, యావత్‌ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ, ఇప్పటికే సగం చచ్చి ఉన్న తెలుగు భాషకి అలాగే యావద్భారత దేశ సమైక్యతకు తీరని నష్టం వాటిల్లుతుందన్నది మాత్రమే! ఈ చేదు ఆవేదనకి అప్పుడప్పుడు సభ్యత వీడని వ్యంగ్యం, అపహాస్యం దరిచేరని హాస్యం రంగరించడం తప్పనుకోవడం లేదు. ఈ వ్యాస పరంపరలో'విడిపోతే నష్టమెవరికి' అన్న శీర్షికన 4-4-12న ప్రచురితమైన వ్యాసంలోని అంశాలకు మళ్లీ ఉక్రోషం వచ్చిన చొల్లేటి శ్రీశైలం గుప్త -అదుపు చేసుకోలేని ఆగ్రహంతో రాసిన 'విడిపోతే లాభమెవరికి' అన్న వ్యాసానికి (18-4-12న) తగువిధంగా ప్రతిస్పందించడం, నా పవిత్ర పాత్రికేయ బాధ్యతగా అంగీకరిస్తున్నాను. అలానే, తన వ్యాసంలో వారు నాపై చేసిన ఆరోపణలకి (నిజానికి దూషణ లనాలి!) గతంలో లానే చొల్లేటికి స్వభాషీయునిగా గౌరవాభిమానాలు ప్రకటిస్తూనే, స్వీయ నిర్దేశిత సంయమనా ప్రమాణాలకి లోబడి తగు వివరణ లీయడం నా వ్యక్తిగత హక్కుగా కూడా భావిస్తున్నాను. అయితే స్థలాభావం దృష్ట్యాను, గతంలోనే పలుమార్లు ఆధారాలు, గణాంకాల సహితంగా తగు సమాధానాలిచ్చి ఉన్నందున, వాటిని మళ్లీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనే చర్చా సూత్రాన్ని కూడా పాటిస్తూ, నా జవాబుని క్లుప్తీకరిస్తున్న విషయం గ్రహించాలని ప్రార్థన -(నిజానికి చొల్లేటి వారి తాజా వ్యాసం ఇప్పటికే అభూత కల్పనలు, కల్పిత గణాంకాలు, అపోహలుగా నిరూపితమైన తేలిపోయిన అపస్వరాలతో కూడిన పాతపాట మాత్రమే).

    ముందుగా తన వ్యాసారంభంలోనే చొల్లేటి పట్టలేని ఉక్రోషంతో మూడు వ్యక్తిగత ఆరోపణలు (దూషణలు) చేశారు. నా వ్యాసాలలో తెలంగాణ ప్రాంతంపై అక్కసుతో అక్కరకురాని 'ప్రేలాపనలు' చేస్తున్నానని (2) సీమాంధ్ర పక్షపాతినని (3) ప్రత్యేక రాష్ట్ర వాదం సాధించిన అఖండ విజయాలను చూసి బెంబేలెత్తిపోయి సమైక్యవాదాన్ని వదిలేస్తూ ఒక్కో మెట్టు దిగుతున్నానని. ఈ అసత్యారోపణలకు చొల్లేటి కోసమేకాదు... అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకోసం సమాధానమీయాలనుకుంటున్నాను. నా వ్యాసాలలో నేను పదే పదే సహేతుకంగా ప్రస్తావించిన అంశం, తెలుగు జాతి, భాష  తెలంగాణాగా నేడు వ్యవహరింపబడుతున్న ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించి కాలక్రమేణా నదీ నదాల ప్రవాహాల వెంబడి ఇతర ప్రాంతాలకు విస్తరించిందని, ఆ విధంగా నేడు సీమాంధ్రులుగా పిలువబడుతున్న వాళ్లకి మూలపురుషులు తెలంగాణీయులేనన్నది -నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు పోతన వేమనాది సాహితీమూర్తులంతా ప్రాంతాలకు అతీతంగా మనకు ఆరాధనీయులని ఎన్నోసార్లు పేర్కొన్నాను. అంతేకాదు విభజనవాదం ఏ ప్రాంతంలో తలెత్తినా కాలకూట విషమని, ఆ ప్రాంతానికి ప్రజలకి కూడా చాలా చేటు చేస్తుందని, అన్ని ప్రాంతాలలోని విభజన వాదాన్ని సమంగా నిష్పక్షపాతంగా నిష్కర్షగా విమర్శించడం జరిగింది. విభజన వాదాన్నే గానీ, ఏ ప్రాంతపు ప్రజల్నీ కించపరచలేదు.

    బహుశా, మనోళ్లు ఎలానూ సాధించలేరు కనీసం అక్కడోళ్లైనా విభజన కోసం ఉద్యమిస్తే బాగుంటుందనే దింపుడు కళ్లాం ఆశతో ఉన్న చొల్లేటి లాంటి వారికి ఈ ధోరణి నచ్చడం లేదు. పైగా ఉక్రోషాన్ని రేపుతోందని అనుకుని ఊరుకుందాం.

    సకల జనుల సమ్మె అఖండ విజయం సాధించిందన్న చొల్లేటి వారి ప్రగల్భం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తమకు సకల సంకేతాలు ప్రసాదించిన ఆ సమ్మె(ట) దెబ్బకి విలవిల లాడిపోయింది -ప్రధానంగా తెలంగాణ ప్రజలే! పొరుగు రాష్ట్రాల ప్రజల్లోను, ఆ మాటకొస్తే యావద్భారత దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల్లో ప్రత్యేక తెలంగాణ వాదం పట్ల దేశం ఏమైపోయినా సరే 'మాది మాగ్గావాలే' అంటున్న విభజన వాదుల ప్రజాప్రతినిధుల మొండి చర్యల మూలంగా, చాలా వైముఖ్యం ఏర్పడిందన్నది వాస్తవం. మరి ఆ అఖండ విజయాన్ని గ్రహించి బెంబేలెత్తిపోయి ఒక్కో మెట్టు దిగుతున్నది కెసిఆర్‌ తో సహా విభజనవాదులే గానీ నాలాంటి రాజకీయేతర సమైక్యతావాదులు కాదని చొల్లేటి గ్రహిస్తే బాగుంటుంది. వారు గ్రహించితీరాల్సిన మరో ముఖ్యమైన అంశం విభజన కనుకూలంగా తనతో సహా కొందరు చెప్పే పరిపాలనా సౌలభ్యం -చిన్న రాష్ట్రాలు, పాత సంస్థానాల పునరుద్ధరణ సంస్కృతులలో స్వల్ప వ్యత్యాసాలు... ఇలాంటి ఏ ఒక్క కారణాన్ని వర్తింపజేసినా ఈ దేశాన్ని వందలాది రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది. తెలంగాణని కూడా ఎన్నో చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది!

    చొల్లేటి వారి పాత పాట లోని మరికొన్ని అపస్వరాలని కూడా క్లుప్తంగా పరిశీలిద్దాం. ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతం వాళ్లు జల దోపిడీ చేశారన్నారు (అందుకు కారణం ఈ ప్రాంతపు నేతల నిర్వాకం అని కూడా అన్నారనుకోండి!) విలీనం తర్వాత 1956 నుండి 2007 వరకు, ప్రణాళికా సంఘం యొక్క అధికారిక గణాంకాల ప్రకారం కోస్తాలో నీటి పారుదల కింద అదనంగా వచ్చిన భూమివృద్ధి శాతం 57, రాయలసీమలో 44 శాతం ఉంటే తెలంగాణాలో 91 శాతం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణాల్లో వృద్ధి కోస్తాలో 107 శాతం, రాయలసీమలో 15 శాతం ఉండేది. తెలంగాణలో 244 శాతం ఉంది. అలాగే పరిశ్రమల పురోగతి, ఉపాధి కల్పన, విద్యావ్యాప్తి సగటు ఆదాయం ఇలా ఏ పెరామీటరు (అభీష్ట పరిమాణం)లో చూసినా తెలంగాణాలో విలీనం తర్వాత బహుముఖీన అభివృద్ధి జరిగి ఉన్నది వాస్తవం. ఇది గ్రహించే కెసిఆర్‌తో సహా విభజనవాదులు వెనకబాటు తనం అన్న ప్రాతిపదికను ఎప్పుడో వదిలేశారు. చొల్లేటి వారే ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. వారు గ్రహించాల్సిన మరో అంశం. గోదావరి, కృష్ణా నదులు మన రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు. అవి అంతర్‌ రాష్ట్ర నదులు. ఇప్పటికే దిగువనున్న మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. మన అనైక్యత దాన్ని ఇంకా పెంపొందిస్తుంది. మనలో మనం తగు విధంగా జలపంపిణీ న్యాయంగా చేసుకోవాలి. వరదలతో నష్టపోయే దిగువ రాష్ట్రంగా మన హక్కుల్ని ఐక్యంగా సాధించుకోవాలి. ఆఖర్లో ఒకమాట - భద్రాచలం మాత్రమే కాదు.. రాయలసీమ, కోస్తాంధ్రలు కూడా నైజాం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఆంగ్లేయులకి ధారాదత్తం చేసే వరకు కలిసే ఉన్నాయి కదా. మరి కెసిఆర్‌ ఇతరులు రహస్యంగా రాజీపడుతున్న విధంగా 1956 అక్టోబర్‌ 31 నాటి సరిహద్దుల రాష్ట్రం కోరుకోవడమెందుకు? ఏది ఏమైనా, ఉద్యమం పేరుతో తెలుగు వైతాళికుల విగ్రహాలను విధ్వంసం చేయడాన్ని, ఉద్యమం ముసుగులో కుటుంబ ఆస్తుల్ని పెంచుకుంటున్నవారిని ఖండించలేకపోతున్న చొల్లేటి వారి నిస్సహాయతకు నా సానుభూతి ప్రకటిస్తూ ముగిస్తున్నా.

    -చేగొండి రామజోగయ్య,
    విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

    21, ఏప్రిల్ 2012, శనివారం

    శభాష్‌ కవితమ్మా!

    ఆంధ్రప్రభ వ్యాసం : సహజ ప్రవృత్తి, సంస్కారాలకి విరుద్ధంగా ఎవరైనా సరే తాత్కాలికంగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుడు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా, నెమ్మదిగా వాటి నుంచి వైదొలగుతూ, క్రమంగా (ఒక్కసారిగా సాధ్యం కాదు కదా!) మంచి కార్యక్రమాలకు మరలుతూంటే ఆ పరివర్తనా పరిణామాన్ని ప్రోత్సహించాలి, హర్షించాలి. శభాష్‌ అనాలి. అందుకే, పోయినవారంలో, తనలోని పరివర్తనా క్రమానికి నాందిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఆవరణలో మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని చట్టసభల ప్రాంగణాల్లో కూడా, మనరాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాల్ని సత్వరం నెలకొల్పాలన్న ఒక సముచిత డిమాండ్‌తో ఏకంగా 48 గంటల నిరాహారదీక్ష చేసిన కల్వకుంట్ల కవితమ్మను అభినందించాలి. శభాష్‌ తల్లీ అనాలని అనిపించింది.

    రాజకీయ (కొండొకచో ఆర్థికం కూడా!) వారసత్వాల్ని గాఢంగా కోరుకునే కుమార్తెలు పుట్టింటి ఇంటిపేరుతో చలామణి కావడం మనదేశంలో కొత్త కాదు. తప్పు అసలే కాదు! కాబట్టి మన తెలుగింటి ఆడపడుచు, కవిత వివాహానంతర రికార్డుల్లో సర్టిఫికెట్లతో అమెరికా వీసా పత్రాలలో ఇంకా ఇతర అపార ఆస్తుల పత్రాల్లో ఏ ఇంటిపేరు నమోదై ఉందో మనకనవసరం! ఆ రమణి కల్వకుంట్ల వంశంలో జన్మించిన ఒక మహోజ్వలమణి! అగధా సంగ్మా, సుప్రియా సూలె, ప్రియాదత్‌, కనిమొళి (వారందరూ ఇప్పటికే ఎంపిలు) వంటి దేశంలోని ఇతర మహిళా నేతల సరసన ఉండాల్సిన అర్హతలున్న గొప్పమహిళ. ఈమెకు కూడా వారికి లభించినంత పితృవాత్సల్యం, వారసత్వ బలం లభించడం ఒక నేతగా వెలిగేందుకు కొంతవరుకు తోడ్పడిన మాట వాస్తవమే కావచ్చు. అయితే జయలలిత, మమత, మాయావతిల స్థాయి స్వీయప్రతిభ చొరవ, చతురత తనకున్నాయని కవితమ్మ నిరూపించుకున్నారని మర్చిపోరాదు. అంతేకాదు, సహజ వాగ్ధాటి, వాదనా పటిమ, నాయకత్వ లక్షణాలు, శ్రమించేతత్వం, సొంత అనుచరణగణాల్ని ఏర్పరచుకునే నైపుణ్యం, తగు సమయం సందర్భం కోసం ఎదురు చూసే ఓర్మి కవితను ఇప్పటికే మన రాష్ట్రంలో ఒక అగ్రశ్రేణి అసామాన్య నేతగా నిలిపాయనడంలో అతిశయోక్తి లేదు. ఆమాటకొస్తే ఃనాన్న, అన్న కన్న మిన్నః అనిపించుకుని వారికీ సంతుష్టి, సంతోషాల్ని కలగజేస్తూండడం సామాన్యమైన విషయం కాదు. కవితే ఒకసారి చెప్పేరు, బాల్యంలో ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాస కాలంలో ఉన్నత విద్యాభ్యాస సమయంలో తాను అమెరికాలో ఉన్నట్లు, తనకు అన్ని ప్రాంతాల, వర్గాల తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయని, అవి ఇప్పటికీ చక్కగా కొనసాగుతున్నాయని. ఇకపోతే ప్రస్తావిత దీక్షా విరమణ సమయంలో కవిత, ఇతర ప్రాంతాల ప్రజల నుంచి తన కార్యక్రమానికి అపారంగా లభించిన ఆదరణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తాను జాతీయ స్థాయి సమస్యలపై పోరాటాలు చేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఉదాహరణకి జాతీయ ఉపాధి పథకంలో పనిదినాల్ని, వేతనాల్ని బాగా పెంచాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తానని అన్నారు. ఇకముందు తన కార్యకలాపాలు ఏదో ఒక ఉపప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబోనని చెప్పకనే చెప్పారు. ఇదంతా ఒక సత్పరిణామక్రమాన్ని స్పష్టంగా సూచిస్తోందని అర్థం చేసుకోకపోతే అది మన తప్పే అవుతుంది. అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలపై పోరాడతానంటే స్వాగతించక పోవడం మూర్ఖత్వం అవుతుంది. నిజానికి ముందే చెప్పినట్లు కవిత సహజ ప్రవృత్తి, సంస్కారం రీత్యా విభజన వాది కాదు.

    అరాచకవాది అసలే కాదు. అయినా ఆమె తన విశాల భావాల నుంచి తాత్కాలికంగా నైనా మరలడం తెలుగు ప్రజల దురదృష్టమనుకుందాం. నాన్న వద్దన్నప్పటికీ అమెరికాలో సుఖజీవనాన్ని వదలుకుని, తనకు తానే నిర్ణయించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చేసి, ప్రజాక్షేత్రంలోకి దూకేశానని తనే చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆయన్ని నిందించడం తగదు. కానైతే, ఆమె తనకు ఏ రాజకీయ పరమైన ఆకాంక్షలు లేవని, కేవలం తెలంగాణ ప్రజల సాంస్కృతికోద్ధరణకు మాత్రమే పాటు పడతానని కూడా ఎన్నోమార్లు వక్కాణించారు. (ఇప్పటికీ తనకు తెరాసతో సంబంధం లేదని కూడా చెబుతుంటారు.) కానీ ప్రస్తుతం చేసేవన్నీ రాజకీయ కార్యక్రమాలే! మొదట్లో, అంటే అమెరికా నుంచి తిరిగొచ్చేసిన కొత్తలో ఎంతో శ్రమించి మెదక్‌ జిల్లాలో ఇటీవల బయల్పడిన కొన్ని ప్రాచీన తెలుగు శాసనాల గురించి, ఉమ్మడి తెలుగు భాష విశిష్టత గురించి ప్రచారం చేశారు. తనే స్వయంప్రకటిత అధ్యక్షురాలిగా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి, దాన్ని అనతికాలంలో బాగా విస్తరించేరు. బతుకమ్మ పండుగ వైశిష్ట్యాన్ని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. కనిమొళినీ తీసుకోచ్చేరు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా తండ్రి తరఫున ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా, ఫలవంతంగా నిర్వహించిన ఘనత సాధించడంతో తృప్తి పడలేదు. పలు రాజకీయ కార్యక్రమాల్లో సంసారాన్ని కూడా విస్మరించి పాల్గొంటూ వచ్చారు. దూరదృష్టితో తన సొంత సంస్థ -జాగృతిని ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాంతమంతటా విస్తరించారు, పార్టీకి సమాంతరంగా జాగృతికిప్పుడు రాజధానిలో మాత్రమే కాదు, పలు పట్టణాలలో కార్యాలయాలు, వనరులు, నిధులతోబాటు మంచి కార్యకర్తల పటాలాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా నాన్న, అన్నల కన్న కొన్ని విషయాలలో నైనా మిన్న అని నిరూపించుకున్నారన్నమాటే కదా!

    ఃఅదుర్సు రభసః ఇంటర్‌ విద్యార్థుల పరీక్షా పత్రాలు ప్రాంతీయ మూల్యాంకనం, సినిమా షూటింగులకు ఆటంకాలు ఇటువంటి కొన్ని కార్యక్రమాలు మరీ ఃదూకుడుఃగా నిర్వహించి కొంత అప్రదిష్టని మూటకట్టుకున్నారని, ఉద్యమపరంగా కొన్ని చాలా లాభదాయకమైన చందాల దందాల ముడుపుల విభాగాల్ని సొంతం చేసుకున్నారని, ఇలాంటి కొన్ని విమర్శలు కవితమ్మపై విభజనవాద వర్గాల నుంచే వచ్చేయి. ఇంకా వస్తున్నాయి ఈ విమర్శల్లోని నిజానిజాల సంగతెలా ఉన్నా ఒకటిమాత్రం నిజంగా నిజం. తెరాస పార్టీ పరంగా జరిగిన అన్ని ఉద్యమ కార్యకలాపాల్లోనూ ప్రజలకు ఏర్పడిన విలాపాల్లోను) కవితమ్మ పాత్ర చాలా ఎక్కువగా ఉంటూ వచ్చింది. వంటావార్పూ కానీండి, రైల్‌రోకో, లేదా సకల జనుల సమ్మె కానీండి ఇతర పార్టీ నేతల కన్న, ఆ మాటకొస్తే నాన్న, అన్నల కన్న మిన్నగా ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా దూసుకుపోయేరు. పోరాట పట్టాలపై కూర్చున్నారు. ఎక్కువ రాజకీయ చతురత చూపారు. ఆవిధంగా అందరికన్న అధికంగా దృశ్యతః (విజిబిలిటీ) సాధించారు.

    ఇతర ప్రాంతాల ప్రజలనూ ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇంతటి అసామాన్య ప్రతిభగల ఒక తెలుగు యువతి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే దానికి నాందిగా వచ్చే ఎన్నికలలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే అది మనం హర్షించదగిన విషయమే. వచ్చే ఎన్నికల నాటికి దొరవారికే నియోజకవర్గాన్ని మార్చవలసిన అవసరమేర్పడి తానే నిజామాబాద్‌కే తరలిపోదామనుకుంటే చెప్పలేం గానీ, కుమార్తె ముచ్చట తీర్చడానికే ఆయన మొగ్గు చూపవచ్చు. లేదా కరుణానిధి కనిమొళికి ప్రసాదించినట్లు రాజ్యసభకి పంపించే అవకాశం ఎలానూ ఉంటుంది. ఏమైనా మన కవితమ్మ త్వరలో ఎంపీ కావడం, తర్వాత కేంద్రంలో మంత్రి పదవిని పొందడం దాదాపు ఖాయం, కాదంటే ఆమె భర్తకి, అన్నకి రాష్ట్రంలోనే వేరే పదవుల్ని చూడాల్సి ఉంటుంది దొరవారికి. తనది జాతీయ స్థాయి అన్న ఆత్మ విశ్వాసం ఉన్నందువల్ల, ఎలానూ అంతిమంగా విభజనేతర పరిష్కారమే రానున్నదన్న విజ్ఞత, అవగాహన ఉన్నందువల్లనే కల్వకుంట్ల కవితమ్మ తన పంథాని క్రమంగా మార్చుకుంటున్నారని, విస్తరించుకుంటున్నారని అర్థమవుతూనే ఉంది. మన తెలుగింటి ఆడపడుచుకి అభినందనలు చెబుదాం. శభాష్‌ కవితమ్మా! అందాం.

    ( దీనిని వ్యంగ్యం అనుకునేరు సుమా!)

    -చేగొండి రామజోగయ్య,
    విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

    19, ఏప్రిల్ 2012, గురువారం

    విశాలాంధ్రమహాసభ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం’ పుస్తకావిష్కరణ

    Eenadu 18/04/2012

    విశాలాంధ్ర దినపత్రిక : ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం” పుస్తకావిష్కరణ సభ మంగళవారం నగరంలో జరిగింది. తెలంగాణలో జరిగిన ఉద్యమ ఘట్టాలు, విశాలాంధ్ర దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ప్రచురించిన వార్తలు, కథనాలతో కూడిన విశాలాంధ్ర మహాసభ ముద్రించిన పుస్తకాన్ని స్వాతంత్య్ర సరమయోధులు నర్రా మాధవరావు ఆవిష్కరించారు. సభకు విశ్రాంత ఐపిఎస్‌ అధికారి సి. ఆంజనేయరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా మాధవరావు మాట్లాడుతూ, దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులు గతంలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విశాలాంధ్ర నుంచి తెలంగాణను వీడదీయవద్దని కోరారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుతూ ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేశామని ఆయన చెప్పారు. విశాలాంధ్ర మహాసభ ప్రధానకార్యదర్శి పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పోరాటాలు సాగాయని, అనంతరం ఆంధ్ర మహాసభ విశాలాంధ్రగా మారింద న్నారు. స్వాతంత్య్ర సమ యోధుడు మహబూబ్‌ అలీ మాట్లా డుతూ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం కమ్యూనిస్టులు పోరాటాలు జరిపా రని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న మాటల్లో నిజం లేదని అభిప్రాయపడ్డారు. విశా లాంధ్ర మహాసభ అధ్యక్షులు ఎన్‌. చక్రవర్తి, నాయకులు వి.లక్ష్మణరెడ్డి చేగొండి రామజోగయ్య పాల్గొన్నారు.


     

    Download E-Book here తెలంగాణలో విశాలాంధ్రోద్యమం

    15, ఏప్రిల్ 2012, ఆదివారం

    "తెలంగాణలో విశాలాంధ్రోద్యమం" - పుస్తకావిష్కరణ సభ



    "విశాలాంధ్ర మహాసభ" 17.04.2012 మంగళవారం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు, హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలో పుస్తకావిష్కరణ సభ నిర్వహించనున్నది. విభజనవాదులు గత కొంతకాలంగా, ఏకపక్షంగా దుష్ప్రచారం  చేస్తున్న చారిత్రక అసత్యాలను, సాంస్కృతిక వక్రీకరణలను ఖండించి, నిజానిజాలను, ప్రతివాదాన్ని తగు ఆధారాలతో సహా ప్రజల ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం సంకలనం కాబడింది. పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్రసమరయోధులు, నాటి విశాలాంధ్రోద్యమ భాగస్వామ్యులు  శ్రీ నర్రా మాధవరావు మరియు శ్రీమతి శాఖమూరి సుగుణమ్మ పాల్గొంటారు. "విశాలాంధ్ర మహాసభ" సంస్థ తరపున శ్రీయుతులు సి.ఆంజనేయరెడ్డి, పరకాల ప్రభాకర్, చేగొండి రామజోగయ్య, కుమార్ యాదవ్ చౌదరి, సుంకర వెంకటేశ్వరరావు, వి. లక్ష్మణరెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి ప్రభ్రుతులు పాల్గొంటారు.


     నలమోతు చక్రవర్తి
    అధ్యక్షుడు
    విశాలాంధ్ర మహాసభ 

    Visalandhra.org : ‘Telanganalo Visalandhrodyamam’ – Book Release Function

    Date: Tuesday, April 17th 2012

    Time: 11.00 AM

    Venue: Somajiguda Press Club, Hyderabad


    Andhra Pradesh was the first linguistic State that came into existence after India achieved independence. The State came into being as a result of collective sacrifices made by scores of our venerable leaders such as Amarajeevi Potti Sriramulu, Burgula Ramakrishna Rao, Konda Venkatapayya, Tanguturi Prakasam Pantulu, Suravaram Patap Reddy, Andhra Pitamaha Madapati Hanumanth Rao, Ravi Narayan Reddy, Ayyadevara Kaleswar Rao and many more.

    When the dream of a Telugu State was close to fruition, Nehru criticized Telugu’s desire for a linguistic state as bearing a “tint of imperialist expansionism”. A few opportunistic politicians of that era saw an opening to further their feudal politics. They have brought up the demand for a separate Telangana state that will be carved out of erstwhile Nizam ruled Hyderabad State. However, the demand which lacked intellectual honesty, never gained traction.

    Right from 1950s, the history of separatist movement is littered with half-truths and falsehoods. Also, ironically almost all the separatist leaders were once integrationists. Some of the prominent flip-floppers are the most respected leaders of the current separatist movement. For example, Konda Laxman Bapuji, the man that was in the forefront of the 1969 separatist movement was originally a staunch integrationist. K.V. Ranga Reddy, Marri Chenna Reddy as well as the current separatist movement leader K. Chandra Shekhar Rao also once strongly stood for integration. There are leaders from Kosta and Rayalaseema who were once integrationists that turned separatists. Former Deputy C.M. B.V. Subbar Reddy and Kakani Venkatratnam fall into that category. This goes on to show the opportunistic nature of the separatist leaders across all regions of the State.

    The research material unearthed by Visalandhra Mahasabha shows how the separatist leaders have changed colors and misled people over the past few decades with their false propaganda. Our team came up with an intelligent way of showcasing the hypocrisy of the separatist leaders. They extracted newspaper clips starting from 1950’s as well as quotes of the prominent separatist leaders from the Assembly proceedings. As a result, readers are presented with the original content from the last sixty years, that will take them by surprise.
    This book will be an eye opener for anyone that was led to believe that Andhra Pradesh State came into existence against the wishes of people of Nizam Telangana state. VMS offers ample evidence to prove that there was a groundswell support for a united Telugu State across Nizam Telangana, Coastal Andhra, and Rayalaseema in 1950s.

    As the separatists make an attempt to revive their movement by feeding false information to the young minds, this book will provide a perspective that is badly needed in the countering the divisive propaganda.

    After the book is released, a link to the soft copy of the book will be posted on this website.
    I request you to join us and show your solidarity for a United Andhra Pradesh State.

    Nalamotu Chakravarthy


    11, ఏప్రిల్ 2012, బుధవారం

    వన విహారమూ నేరమేనా?!

    ఆంధ్రప్రభ వ్యాసం : ఎంత అన్యాయం! మాట్లాడితే విమర్శలు! మౌనం వహిస్తే కూడా విమర్శల జడివాన! ఇవన్నీ ఓపిగ్గా దిగమింగుకుంటున్న దొరవారికి ఈ వారం ఇంకోసారి ఎదురవుతున్న విడ్డూరమైన విమర్శ. వారు సన్నిహిత కుటుంబీకులతో కలిసి మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ శివారులో, సొంత వ్యవసాయ క్షేత్రంలోని విలాస గృహంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, మీడియాకి దూరంగా దాదాపు అజ్ఞాతంలో ఉండాలన్న వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం! మరీ ఇంగితం లేకుండా చేస్తున్న విమర్శలేమంటే (1) తెలంగాణలో మళ్ళీ కొన్ని బలిదానాలు జరుగుతుంటే వారినేం పట్టించుకోకుండా సొంత తోటలో (కోటలో) తొంగోటమేంటి? (2) సొంత జిల్లాలో మతఘర్షణలు చెలరేగితే వాటిని అరికట్టడానికి ఒక నేతగా తమరికేబాధ్యతా లేదా? (3) అసలు ఇంత విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రం, ఇంకా అపారమైన కుటుంబ ఆస్తులు ఎలా వచ్చాయి? (4) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో రహస్య సంప్రదింపులు జరుగుతూ ఉంటాయని అంతిమంగా విభజనేతర పరిష్కారానికి క్రమంగా ఒప్పుకోవడానికి రాజకీయ ఆర్థిక కుటుంబ రక్షణ ప్యాకేజీ ఇప్పటి నిర్ణయమై పోయిందన్న లీకేజీ గుసగుసల్లో పసలేకపోలేదూ? (5) కేవలం కుమారుడు కుమార్తెలకు తప్ప, కనీసం, విజయశాంతి, హరీష్‌, వినోద్‌ వంటి వారికి కానీ, పార్టీలోని జిల్లా ప్రముఖులకు కానీ ఎందుకు 'ప్రవేశం' ఉండదు? ఇవండీ ఇప్పుడు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు-

    వ్యంగ్యం అనుకున్నా, నమ్మలేకపోయినా, ఏమీ చేయలేను కానీ ఆయన విశాల దేశ ప్రయోజనాల కోసం అంతిమంగా ఏదో ఒక విభజనేతర పరిష్కారాన్ని సాధించడానికి తోడ్పడతారని, ఆ క్రమంలో త్వరలో సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బృహత్తర బాధ్యతను స్వీకరించడానికి భయపడరన్న విశ్వాసం ఈ వ్యాసకర్తకుంది -అందుకేపైన పేర్కొన్న విడ్డూరమైన విమర్శలకు విలోమ క్రమంలో, దేశ కాలమాన పరిస్థితుల కనుగుణమైన సమాధానాలిచ్చే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను -తమకు తామే వివరణలు, సంజాయిషీలిచ్చుకోవడం దొరలకు నామోషీ కదా?

    (1) ఆయన నెహ్రూ జీ అంతటి ప్రజాకర్షక నేత. పండిట్‌ జీకి కూడా అప్పుడప్పుడు కుమార్తె ఇందిరతో కలిసి కొంతకాలం ప్రశాంతంగా ఏదో ఒక ప్రాంతంలో రాజకీయాలకు దూరంగా ఉండి, విశ్రాంతి తీసుకునే అలవాటుండేది -ప్రపంచాధినేతలలో కూడా చాలామంది ఈ పనే చేస్తుంటారు -మరి పన్నెండేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న (అంతిమ ధ్యేయం ఏమిటన్నది వదిలేయండి!) నిన్నా మొన్న సహజ అభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటుకి హాజరై ఏకంగా ముచ్చటగా మూడురోజులు పరిమిత లొల్లి చేసి, బాగా అలసిపోయిన అధినేత కొంత విశ్రాంతి కోరుకోవడం తప్పా? దానికి సొంత తోటని, కోటని ఎంచుకోవడం దొరవారి దోషమా? సన్నిహిత బంధువుల కన్న పార్టీ శ్రేణులకన్న సంతానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం భారతదేశ రాజకీయ నాయకులందరిలో ఉన్న గుణం -అయినా రాజ్‌ఠాక్రే వంటి మేనల్లుణ్ణి మరీ నెత్తికెక్కించుకోకూడదు. విజయశాంతి వంటి విలక్షణ, చంచల స్వభావురాలినీ అంతే! (2) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో సంప్రదింపులు జరుగుతాయని ఆరోపిస్తున్న వారి ఉద్దేశమేంటి? అటువంటి జాతీయ ప్రాముఖ్యం కల అంశాల్ని ఆంతరంగికంగా రహస్యంగా కాకుండా, బహిరంగంగా, అబిడ్స్‌ ప్రధాన తంతి తపాలా కార్యాలయానికొచ్చి పబ్లిక్‌ బూత్‌ నుంచి బిగ్గరగా మాట్లాడాలా? (3) ఇన్ని విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రాలు, అపార కుటుంబ ఆస్తులు, నౌకావ్యాపారాలు సొంత మీడియా ఎలా వచ్చేయని ప్రశ్నించే వాళ్లకి దేశ కాల మాన పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదని అనుకోవాలి.

    ఈ దేశంలో ఒక్క టర్మ్‌ సర్పంచిగా పనిచేసిన వాడే ఎంత సంపాదిస్తున్నాడు? పలుదఫాలు ఎమ్మెల్యేగా, ఎంపిగా, కొంతకాలం రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిగా, గత పుష్కరకాలంగా ఒక మహోద్యమ నేతగా వెలిగిన ఒక మహానేతను మీ వర్తమాన కుటుంబ ఆస్తుల విలువెంతో చెప్పమని అడగడం భావ్యంకాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాకపోతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడా శషభిషలనవసరం! (4) మొదటి రెండవ విమర్శలు కూడా అన్యాయమే -తెలంగాణలో బలిదానాలు, సొంత జిల్లాలో మతఘర్షణలు జరుగుతున్నప్పుడు తోటలో తొంగొటమేమిటనే వాళ్లకు, ఈ పరిణామాలు కలుగజేసిన ఆవేదనని మరిచిపోవడానికే, తన అసంతృప్తిని వెలిగక్కడానికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆవేదనల్ని మర్చిపోవడానికి ఎవరి వ్యక్తిగత అలవాట్లు వాళ్లకుంటాయి! ఆఖర్లో స్థలాభావం దృష్ట్యా దొరవారికి క్లుప్తంగా కొన్ని విజ్ఞప్తులు:

    -(1) పచ్చని వ్యవసాయ క్షేత్రాల్ని అభివృద్ధి పరచడాన్ని డబ్బు రంగు మార్చే ప్రక్రియగా విమర్శించే వాళ్లని పట్టించుకోవద్దు -అది ప్రకృతి పరిరక్షణ కోసం ఏమాత్రం సొమ్ము ఉన్నవాళ్లైనా చేయాల్సిన సత్కార్యం -(2) ప్రపంచంలో ఇప్పటికే నెలకొని ఉన్న క్లిష్టమైన సమస్య నీటికరవు -మీ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రారంభించిన బిందుసేద్య ప్రయోగాలు కొనసాగించండి (3) మీ విశాల దృక్పథానికి అనుగుణంగా మీ క్షేత్రాల్లో నూజివీడు మామిడి చెట్లు, మహబూబ్‌నగర్‌ ఫలవృక్షాలు, టెక్కలి టేకు చెట్లు, కోనసీమ కొబ్బరి చెట్లు, అదిలాబాద్‌ అరటి, జామ రకాలు, గుంటూరు మిర్చి, నెల్లూరు నేరేళ్లు ఇంకా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల చామంతి, గులాబీ, మల్లెల అంటులు, అన్నీ పెంచండి -అన్నట్టు ఆనపకాయ అన్నా సరే సొరకాయ అన్నా సరే, ఆ పాదులతో పాటు అన్ని కూరగాయలు, ఆకుకూరలు పండించండి -దొరవారికి దండాలతో ఉంటాను మరి.
    -చేగొండి రామజోగయ్య,
    విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు  

    6, ఏప్రిల్ 2012, శుక్రవారం

    విడిపోతే నష్టమెవరికి ?

    ఆంధ్రప్రభ వ్యాసం: ఆలస్యంగానైనా, నిజాలు తెలిస్తే అదిన్నూ పన్నెండేళ్లుగా, పుట్టెడు పచ్చి అబద్ధాల్ని గుక్కతిప్పుకోకుండా చెబుతూ వచ్చిన వారి పరంగానే జరిగితే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. ఇన్నాళ్లుగా అన్నేసి అబద్ధాలతో, సాంస్కృతిక చారిత్రక వక్రీకరణలతో మభ్యపెట్టి, మోసం చేసినందుకు కాస్తో కూస్తో కోపం రాకపోదు కానీ, ఇప్పటికైనా నిజాలు కక్కేరు, వినాశనాన్ని, మనకి అప్రతిష్ఠని నివారించారులే అనే ఆనందంలో అది మరుగున పడిపోతుంది! అయినా పరివర్తనని, పశ్చాత్తాపాన్ని, అంతిమంగా నిజాల ఒప్పుకోలుని సహృదయంతో స్వాగతించే సుగుణం తెలంగాణ ప్రజలకి ఉండదేమోనని అనుమానించడం సరైంది కాదు. కాబట్టి ఇన్నేళ్లుగా 'గోబెల్స్‌' మాదిరిగా ప్రతివాదం వినిపించనీయని, హింసాయుత ధోరణులనాశ్రయించి, ప్రయోగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదం పేరిట, ఏకపక్షంగా ప్రచారం చేసిన అసత్యాలు, అభూతకల్పనలు, చారిత్రక, సాంస్కృతిక వక్రీకరణలు, తప్పుడు గణాంకాలు, తమ దుష్ప్రభావాన్ని చాలావరకు కోల్పోయిన ఈ తరుణంలో, విభజనవాద వక్రచక్రాల మాయారథసారథి, ఆయన కుటుంబీకులు, అనుంగు అనుయాయులు, ఇతర విభజన వాదులందరూ తెలంగాణ ప్రజల ముందుకొచ్చి, నిజాయితీగా, పశ్చాత్తాప పూర్వకంగా ఒప్పుకోవాల్సిన నిజాల్ని, అంశాల్ని చర్చించుకుందాం. ఎంతైనా 'మనోళ్లే' కదా అన్న అభిమానంతో ఇటువంటి పశ్చాత్తాప ప్రకటన నిజాల ఒప్పుకోలు క్రమంలో, మరీ ప్రమాదం జరగకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని కిటుకుల్ని లేదా జాగ్రత్తల్ని కూడా సూచించుదాం. విభజన వాద సెల్‌టవర్‌ శిఖరాగ్రం నుంచి తమ అనివార్య అవరోహణా క్రమాన్ని, మెట్టుమెట్టుగా దిగే రీతిలోనే జరపాలి గానీ, ఒక్కసారిగా పైనుంచి సమైక్యంగా నేలపైకి దూకేయరాదని, దొరవారితో సహా, ప్రత్యేక రాష్ట్రవాదులుగా ప్రస్తుతానికి చలామణి అవుతున్న వాళ్లందరికీ తెలుసు! 'మాది మాగ్గావాలె' అని అరవడం మానకుండానే, ఏదోటి తేల్చండి అని సన్నాయి నొక్కులూ మంద్రస్వరంలో ఆలపిస్తున్నారందుకే?

    ఏమైనా ఇప్పటికే అధినేతతో సహా, వీర విభజనవాదులందరూ తాము గతంలో పదే పదే వల్లె వేసిన వితండ వాదాంశాలెన్నింటినో, వెనకబాటుతనం, ఒప్పందాల ఉల్లంఘనలు, నీళ్లు, ఉపాధి అవకాశాల దోపిడీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత, వంటివాటిని తమకు తామే పరిత్యజించేశారు, అవన్నీ అసమంజసమైనవిగా, నిర్ద్వంద్వంగా నిరూపితమైనందువల్ల ఇకపోతే మనజాతి, సంస్కృతి, రీతి వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు కూడా లేరన్నది పిచ్చివాదనగా తేలిపోయిందనీ గ్రహించేరు! రాష్ట్రానికి దేశానికి ఏం నష్టం జరిగినా మాకనవసరం, మాది మాగ్గావాలె అంతే, అనడం మొత్తం దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు ఏమాత్రం నచ్చడం లేదన్నదీ తెలుసుకున్నారు. 2009, డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన అమలు చేస్తే బాగుంటుందంటూనే, పోనీ ఏదోటి తేల్చండి అనీ అంటున్నారు. దీని భావమేమి తిరుమలేశ?! రాకపోతే పోనీలే, ఇవ్వలేకపోతే సరేలే, మా రాజకీయ మెడలకే ఉచ్చు చుట్టుకోకుండా ప్రజలకేం చెప్పుకోవాలన్నదే మన ఘనత వహించిన ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్య ఈ నేపథ్యంలో వాళ్లు పాటించాల్సిన అవరోహణా క్రమవ్యూహం ఎలా ఉంటే బాగుంటుందో, రాజకీయ అట్టుని ఎలా తిరగేయాలో సూచించుదాం పాపం!

    మేమైతే ఇప్పటికీ విభజన భక్తులమే! పదవులపై మోజులేని త్యాగరాజులమే (!?) కానీ విభజన జరిగితే, సంభవించే కష్టనష్టాల్ని మీకు, అంటే మా ప్రియమైన తెలంగాణ ప్రజలకు ముందుగా చెప్పడం మా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాం. ఇలాంటి ఉపోద్ఘాత సన్నాయి నొక్కులతో ప్రారంభించి, ఇంకా ఏం చెప్పాలంటే (1) మనం ముందుగా భారతీయులం, తర్వాతనే తెలంగాణీయులం, దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు మన కోరికకు ప్రతికూలంగా ఉన్నారు. ఇక్కడిస్తే అది అన్ని ఇతర రాష్ట్రాల విభజనకు దారితీస్తుందని తద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంతిమంగా దేశ సమైక్యతకే ముప్పు కలుగుతుందన్న భయాందోళనలు సర్వత్రా ఉన్నాయి. మనం మొండి పట్టుదల పట్టడం మంచిదికాదేమో, అలాంటి చెడ్డపేరు మా ప్రజలకి రావడం మాకిష్టం లేదు. అయినా మాదేముంది, మీరే సోచాయించండి? (2) అదలా ఉంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మనం చెబుతున్న ఏ ఒక్క కారణాన్ని- వెనుకబాటుతనం, చిన్న రాష్ట్రాల ఆవశ్యకత, యాస,సంస్కృతిలలో స్వల్ప భేదాలు, ఇలా ఏది వర్తింప చేసినా తెలంగాణను మరెన్నో చిట్టి రాష్ట్రాలుగా చేయవలసి వస్తుంది  (3) హైదరాబాద్‌ మన గుండెకాయ (నిజం చెప్పాలంటే ఈ నగరంలో 45 శాతం సీమాంధ్రలో మూలాలున్న వాళ్లు, 20 శాతం భాషాపరంగా మైనారిటీలు, మరో 20 శాతం మతపరంగా మైనారిటీలు ఉన్నారు. వీళ్లలో అందరూ కానీ, ఏ ఒక్కవర్గం కానీ సంఘటితమైతే మాలో ఏ ఒక్కరూ ఎన్నికలలో గెలవం. ఇతర జిల్లాల్లో కూడా కనీసం 20 శాతం తెలంగాణేతరులున్నారు. వాళ్లూ ఎన్నికల ఫలితాల్ని శాసించగలరు. కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణేతరులు, హైదరాబాద్‌ని కానీ ఏ ఇతర ప్రాంతాన్ని కానీ వీడిపోరు. అలాగే మనోళ్లు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. సోచాయించండి. (4) ఇంకో చేదు నిజం ఏమంటే హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక రాష్ట్రం వచ్చే అవకాశం లేనేలేదు. భాగ్యనగరం లేని దౌర్భాగ్యం మనకెందుకన్నా! అది మన గుండెకాయ కదా!! (5) మనకి మనమే 1954, నవంబర్‌ 1 నాటి సరిహద్దులతో కూడిన రాష్ట్రం కావాలని కమిటైపోయాం. భద్రాచలం డివిజన్‌, మునగాల పరగణా వదలుకోవాల్సిందే గదా! తిరుపతి, శ్రీశైలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు అటే ఉన్నాయి. భద్రాద్రి రాముణ్ణి కూడా వదలుకుందామా? (6) చిన్న రాష్ట్రం చిన్నబోతుంది. ఉన్న రాష్ట్రాన్ని ఉంచేసుకుంటే పోలా? (7) విభజన జరిగితే, సీమాంధ్రోళ్లు మహా అసాధ్యులు, నీళ్లలో, నిధుల్లో పెద్ద వాటా కొట్టేస్తారు, లాబీయింగు చేసేసి మనమే నష్టపోతాం -నీళ్లు పల్లమెరుగునన్నది తెలుసుకదా. ప్రపంచంలో ఏ నది అయినా దిగువ ప్రాంతాల్నే డెల్టాలుగా రూపొందిస్తుందని, అది ప్రకృతి సహజ సూత్రమని తెలుసుకదా. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా, దిగువ ప్రాంతాలకే కొన్ని ప్రత్యేక జల హక్కులుంటాయి. ఐనా మనమంతా సమష్టిగా కర్ణాటక మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాల వారి జలదోపిడీని ఎదుర్కోవాలి కానీ, దిగువన స్వభాషీయులతో పోటీ తగదు. (8) ఉద్యోగాల సంగతి ఆలోచించండి. రాష్ట్రం విడిపోతే ఇక్కడి ఉద్యోగులకి ఏదో ఒక రాష్ట్రంలో సర్వీసు ఎంచుకునే హక్కు ఉంటుంది.బలవంతంగా పంపించేయడం కుదరదు. ఇక్కడ ఇళ్లు, ఆస్తులు, పిల్లల చదువులు ఉన్నవాళ్లంతా సహజంగా ఇక్కడే ఉండిపోతారు. అంటే మనకి ఎక్కువ ఉద్యోగులు అక్కడ ఖాళీలు మనకు వాళ్లు పదవీ విరమణ చేసే వరకు ఖాళీలుండవు. ఆ కొత్త రాష్ట్రంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు, కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎన్నో నిధులు, కొత్త పరిశ్రమలు మనకేమో నిరుద్యోగం ప్రబలడం, అభివృద్ధి మందగించడం, పరిశ్రమలు తరలిపోవడం -జర సోచాయించాల్సిన విషయాలే కదా -విడిపోదామంటారా -బాగా సోచాయించండి. మాదేముంది ప్రజల నిర్ణయమే మాకు శిరోధార్యం.

    -చేగొండి రామజోగయ్య,
    విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

    28, మార్చి 2012, బుధవారం

    అయ్యో, అన్ని బుకాయింపులా?!

    ఆంధ్రప్రభ వ్యాసం: ఈ శీర్షిక కింద 29.2.12న ప్రచురితమైన 'విభజనవాదం విషతుల్యం' అన్న నా వ్యాసానికి, నిజానికి మళ్లీ ఆగ్రహించిన చొల్లేటి శ్రీశైలం గుప్త విభజన వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే (ఇది విధ్వంసంతో శాంతికి పోరాటం  అన్నట్లు లేదూ?) అనే నూరు శాతం విడ్డూరమైన మకుటంతో (21.3.12న) రాసిన వ్యాసంలో, ఎటువంటి తటపటాయింపులు లేకుండా చేసిన బుకాయింపులకు గతంలోలానే తొలుత సాటి తెలుగు వ్యక్తిగా గౌరవం ప్రకటిస్తూనే తగువిధంగా ప్రతిస్పందించడం, సరైన సమాధానాలు సహేతుకంగా ఇవ్వడం, నా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వోత్కర్ష అవుతుందేమోనని, ఆ వ్యాసంలో ప్రస్తావించలేదు కానీ, దానికో నేపథ్యముంది. ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీలోనూ లేని నేను, ఇటీవలి కాలంలో రాష్ట్ర సమైక్యతను పరిరక్షించే కృషిలో భాగంగా దేశ, రాష్ట్ర రాజధానుల లోను, రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాల్లోను సమైక్య సదస్సులు, నిజానిజాల ఆవిష్కరణ ప్రదర్శనలను నిర్వహించిన ఒక రాజకీయేతర సంస్థ, విశాలాంధ్ర మహాసభలో ఒక సామాన్య కార్యకర్తను. ఈ సంస్థ ఫిబ్రవరి 25న తిరుపతిలో ఒక సదస్సు నిర్వహించింది. పలువురు స్థానిక విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్న ఈ సమైక్య సదస్సులో నేను అప్పటికప్పుడు అడిగితే ఆశువున ప్రసంగించాల్సొచ్చింది. పలువురు వక్తలున్న కారణంగా కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే చేసిన ఆ క్లుప్త ప్రసంగంలో, తెలంగాణ ప్రాంతంలోనూ గణనీయ సంఖ్యలో ఉన్న సమైక్యవాదులు ప్రశంసార్హులని అలాగే, సీమాంధ్రలో కూడా కొద్దో గొప్పో ఉన్న విభజనవాదాన్ని కూడా తుదముట్టించాలని, సందర్భతోచితంగా సమైక్యవాద నిబద్ధతతో, పాత్రికేయ సహజమైన నిర్మొహమాటంతో చెప్పడం జరిగింది. అక్కడ క్లుప్తంగా చెప్పిన విషయాన్నే బాగా విస్తరించి వివరించి రాసిన వ్యాసం నాలుగు రోజుల తర్వాత ఈ శీర్షిక కింద ప్రచురితమైంది. విభజన వాదం విషతుల్యం అన్న మకుటంతో సీమాంధ్రలోని వేరు కుంపట్లనీ ఆర్పాలి అన్న మకుటంతో ఏ ప్రాంతంలో తలెత్తినా విభజనవాదం కాలకూట విషం లాంటిదన్న నిశ్చితాభిప్రాయాన్ని ఆ విధంగా పాఠకులతో పంచుకున్నానన్నమాట. చొల్లేటి వారికి మళ్లీ పట్టలేని కోపం వచ్చింది. ఇంకోసారి మండిపడ్డారు. గతంలో చేసిన విమర్శలనే మళ్లీ వండివార్చడం.

    వారి మంటకు కారణాలు ఊహించడానికి ప్రయత్నిద్దాం. 'మనోళ్ల' అంతిమ ధ్యేయం ప్రత్యేక రాష్ట్ర సాధన మాత్రం కాదన్న నిజం ఇప్పటికైనా అర్థమైకాబోలు, లేదా వీళ్ల నిర్వాకం ఎలా ఏడ్చినా పోనీ, అక్కడి ప్రజలైనా విసిగివేసారి, మా పీకలు మేమే కోసుకుంటాంలే, విభజనకు సహకరిస్తాంలే అంటే బాగుంటుంది, నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు వాళ్ల మూలంగానైనా సాకారమవుతుందేమోనన్న దింపుడు కళ్ళం మాదిరి పేరాశ శ్రీశైలం గుప్తకి గుప్తంగా ఉన్నందువల్ల, సీమాంధ్రలోని విభజనవాదాన్ని నా వ్యాసంలో అంత కఠినంగా విమర్శించడం నచ్చలేదని అనుకోవచ్చేమో!

    చొల్లేటివారు తన తాజా వ్యాసం మకుటంలోనే విభజనం వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటూ బుకాయింపు ప్రారంభించేరు. సమైక్య వాదం పలికేవారి నాలుకలు కోస్తాం, చేతులు నరికేస్తాం, ఈ ప్రాంతంలో తిరగనివ్వం వంటి బెదిరింపులతో కూడిన విభజన వాదంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, వారు ఘనంగా పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛ వగైరాలు ఎంత మేరకు, ఎలా ఉన్నాయో వారే చెప్పాలి! ఇంతకీ నా ప్రస్తావిత వ్యాసంలో ఉన్న కొన్ని అంశాల్ని చొల్లేటి వారు చీల్చి చెండాడి నిందించారు కాబట్టి, వాటిని దాదాపు యధాతథంగా మరోసారి చెప్పుకోవాల్సిన అవసరమేర్పడింది. నేను రాసిందేమిటంటే 'విభజన వాదం కాలకూట విషం --ఆ విషాన్ని ఏ ప్రాంతంలో తాగినా, కాకినాడలో కాచి వడబోసి తీపి కాజాలో కలిపితిన్నా --ఏ పాత్రలో తాగినా, కొద్దిగానే రుచిచూసినా ఆ ప్రాంతానికి, ప్రజలకి మాత్రమే కాదు మొత్తం దేశానికే చేటు చేస్తుంది. ఇది చొల్లేటి వారికి రుచించకపోవడం, ఎంత నిజమైనా చేదుగా ఉందనిపించడం సహజమే! ముందే చెప్పుకున్నాం కదా, అక్కడి ప్రజలనైనా మభ్యపెడితే, రాష్ట్ర విభజన సాధ్యం కావచ్చేమోనన్న పేరాశ కొందరికి ఉందని. నిస్పృహ నుంచి ఆగ్రహం పుట్టడం కూడా అసహజం కాదు. ఆయన మండిపడి చీల్చి చెండాడిన నా వ్యాసంలోని మరో వాక్యం --'ప్రత్యేక రాష్ట్ర వాద అసత్యాల పునాదులపై చారిత్రక సాంస్కృతిక వక్రీకరణల సున్నంతో వంకర టింకర రాళ్లు కల్తీ రాజకీయ పొత్తుల ఇసుక మిశ్రమంతో నిర్మితమైన ఒక (అయో)మయ సభ' న్యాయంగా ఈ వాక్యాల్ని వ్యాసం శీర్షికరీత్యా ఇరుప్రాంతాల్లోని విభజన వాదాల్ని అభివర్ణించినట్లు లేదా సమంగా విమర్శించినట్లు అర్థం చేసుకోవాలి. అయితే చొల్లేటివారు దీన్ని నేను తెలంగాణవాదానికి మాత్రమే అన్వయించుకుంటానంటే అది వారిష్టం. (గతంలో రాసిన కొన్ని వ్యాసాల్లో ఆయనే 'తెలంగాణ వాదాన్ని' 'వేర్పాటువాదం' అంటే, 'అలా కాదు చొల్లేటి సారూ, విభజన వాదమంటే గౌరవంగా ఉంటుందని' నేనే రాయాల్సి వచ్చిందిలెండి!)

    పేరు చెప్పకుండా ఫలానా వారిని శుక్రాచార్యుడన్నావు ఇంకొకరిని మయుడన్నావు. అన్న చొల్లేటి వారి ఊహాశక్తిని కించపరిచే లేదా ప్రశ్నించే సాహసం కలగడం లేదు కానీ, ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఒక గొప్ప విద్యావేత్త చుక్కారామయ్యలా, ఉన్నత స్థానాలలో, విదేశాలలో ఎంతోమంది శిష్యులున్న గొప్ప గురువు అని గతంలో ఒక వ్యాసంలో శ్లాఘించాను. అలానే ఆర్‌.విద్యాసాగర్‌రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను, కె.ఎల్‌.రావు అంతటి గొప్ప ఇంజనీర్‌ అంటారు. (ఇద్దరూ సీమాంధ్రులే అంటే ఏమీ చెప్పలేను కానీ హైదరాబాద్‌కి, తెలంగాణకి సేవలందించారని గుర్తు చేయగలను) అంతేకానీ, నేను కూడా కొన్ని వ్యాసాల్లో నిన్ను చాలా పౌరుషంగా వ్యక్తిగతంగా విమర్శించాను గదా, అందుకని కెసిఆర్‌తో సమానంగా నన్ను కూడా గుర్తించమని, అడిగితే మాత్రం అంగీకరించలేను. ఆయనెక్కడ, మీరెక్కడ? అయితే జయశంకర్‌, విద్యాసాగర్‌ల మేధోసంపత్తిలో నాకు ఆవగింజంతైనా లేదంటూ చొల్లేటి వారు చెప్పిన సత్యాన్ని వినమ్రంగా అంగీకరిస్తాను.

    సందర్భం ఎలానూ వచ్చింది కాబట్టి చొల్లేటి తన తాజా వ్యాసంలో చేసిన మరో బుకాయింపుని వారి మాటల్లోనే చూద్దాం. కెసిఆర్‌ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా, అశ్లీల పదాలు ఒక్కటికూడా ఉపయోగించలేదు అన్నారు. ఓ దేవుడా! టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో, ప్రింట్‌ మీడియాలో ఉన్న సాక్ష్యాల్ని కాదనే వారిని ఏమంటానులే గాని, నేనైతే దొరవారి దుర్భాషలను యధాతథంగా పేర్కొనే సంస్కారం లేనందువల్ల 'ల' గుణింతంలో తెలుగు ఉర్దూ మిశ్రమ తిట్లు అని రాసేవాణ్ణి. లేదా 'మై సన్స్‌' 'సన్స్‌ ఆఫ్‌ డాంకీ' అనే ఆంగ్ల పదాలకి ముతకానువాదాలు అని చెప్పేవాణ్ణి అని మాత్రం జ్ఞాపకంచేసి ఊరుకుంటాను. ఏమైనా కొందరి దుర్భాషలను 'తెలంగాణ యాస' అని సమర్థించడం ఈ ప్రాంతాన్ని అతి దారుణంగా అవమానించడమేనని గ్రహించాల్సిందిగా చొల్లేటి వారికి మనవి.

    తెలంగాణ ప్రజల సంస్కారం చాలా గొప్పది. వారు తీవ్ర అభ్యంతరం చెప్పిన మరో అంశం, కర్మకాలి ఒకవేళ విభజనంటూ జరిగితే అది ఏదో దేముడి ముందు ఒడుపుగా కొట్టిన కొబ్బరికాయలా రెండు చెక్కలే అవదు బలంగా నేలకేసి కొట్టిన గాజుగ్లాసులా పలు ముక్కలవుతుందని చెప్పడం ఎవరికీ నచ్చదని నిజం చెప్పకుండా ఉండలేం కదా. విభజన వాదులు చెప్పే ఏ ఒక్క కారణం వెనకబాటుతనం, చిన్న రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, ప్రత్యేక సంస్కృతి, యాసా భేదాలు వగైరా వగైరాల్లో ఏది వర్తింపచేసినా తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం.

    ఐదారు సంవత్సరాలుగా వారం వారం ఈ శీర్షిక కింద ప్రచురితమైన పలు వ్యాసాల్లో విభజన వాదంలోని అన్ని అంశాల్ని నేను సహేతుకంగా విశ్లేషణాత్మకంగా ఖండించడం దేశ సమగ్రత కోసమైనా విభజన వాదాన్ని వీడడం ఎంత అవసరమో వివరించడానికే. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ వ్యాసంలో కొన్ని ముఖ్యాంశాల్ని మాత్రమే ప్రస్తావించడానికి పరిమితమయ్యాను. ఎన్నో బుకాయింపులను ఇంకోసారి ఖండించే అవసరం లేదని భావిస్తున్నాను. సాటి తెలుగువాడిగా చొల్లేటినే కాదు, ఇంకా విభజన వాదాన్ని వీడలేకపోతున్న సాటి తెలుగువారందరికీ కూడా మాతృభాషాభిమాన పూరిత ప్రణామాలర్పిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.


    -చేగొండి రామజోగయ్య,
    విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

    7, మార్చి 2012, బుధవారం

    దొరవారూ, సీమాంధ్రకు వెళ్లరూ...!

    ఆంధ్ర ప్రభ వ్యాసం: పోయిన వారం వ్యాసంలో సీమాంధ్రలోని కోవూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో 'తెరాస' అభ్యర్థిని నిలుపుతానని అక్కడికి రోడ్డు మార్గాన ఎన్నికల ప్రచారానికి వెళ్తానని కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆనందించి, వారు కాని నిజంగా కాని పర్యటిస్తే సీమాంధ్ర ప్రజలు పూలమాలలతో స్వాగతించాలని, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రవ్వాలని ఆశీర్వదించాలని క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. అయితే, ఇదేదో ఈ వ్యాసకర్తకు కొత్తగా వచ్చిన ఆలోచన కాదని చెప్పడానికి మాత్రమే ప్రస్తావించాల్సొస్తోంది. ఇదే శీర్షిక కింద 25 నెలల క్రితమే 27.1.2010న 'కెసిఆర్‌ సీమాంధ్రలో పర్యటించాలి' అన్న మకుటంతో, ప్రచురితమైన నా వ్యాసంలో ఈ భావాన్ని వ్యక్తీకరించాను. (దీన్ని వంకర వ్యంగ్యంగా అపోహపడి కాబోలు, కొందరు 'వీర విభజనవాదులు' బెదిరింపు కాల్స్‌ చేయడం వేరే విషయం అనుకోండి!) ఇంతకీ ఈ వ్యాసం రాస్తున్న సమయానికి దొరవారి సీమాంధ్ర పర్యటన నిజంగా ఉంటుందో లేదో, కచ్చితంగా నిర్థారణ కాకపోవడం, నిరుత్సాహాన్ని కలిగిస్తున్నా, ఈ విషయం గురించి మరికొంత ఈ వారం చర్చించాలన్న కోరిక (దయ ఉంచి, దురద అనుకోవద్దు) కలిగింది.

    తారక రామారావు, కవితమ్మలు నిజాల్ని నిజాయితీగా ఒప్పుకోవాలన్న (తప్పనిసరైన తరుణం వరకు ఆగా?!) నైజాన్ని పితృదేవుని నుంచి పుణికి పుచ్చుకున్నామని ఒకసారి ఉద్ఘాటించారు. అందుకు అందరూ హర్షించదగ్గ నిదర్శనాలుగా కుమారరత్నం (మొదట్లో కాదని దబాయించినా) తను గుంటూరులో విద్యాభ్యాసం చేశానని, అమెరికా నుంచి అమాంతంగా తిరిగొచ్చేసి, ఉద్యమంలో దూకేసిన పిదప కూడా, సీమాంధ్ర మిత్రులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నానని ఒప్పుకున్నారు. కుమార్తె ఏమో, తనకు ఇప్పటికీ సోకాల్డ్‌ ఆంధ్రోళ్లతో, ఆమాటకొస్తే కనిమొళితో కూడా ప్రాంతేతర స్నేహ బాంధవ్యాలున్నాయని చెప్పి (వాణిజ్య సంబంధాల గురించేమీ చెప్పలేదు) ప్రచా(సా)రమాధ్యమాల సాక్షిగా తన నిజాయితీని ప్రదర్శించేరు. ఇవేమీ తప్పులు కావు గదా! కవితమ్మ ఇంకా ముందుకుపోయి, ఒక వారపత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో, తన తండ్రికి, అపారంగా ధూమపానం, పరిమితంగా మద్యంసేవించే అలవాటుండేదని, ఇప్పుడు సంపూర్ణంగా మానేశారని, 'నాన్న విల్‌ పవర్‌' కిది నిదర్శనమని సగర్వంగా పేర్కొన్నారు. మానేసిన విషయాన్ని నమ్మని వాళ్లెవరైనా ఉంటే అది వాళ్ల ఖర్మ! ఏమైనా, రాబోయే రోజుల్లో ఈ సూపర్‌ అన్నా చెల్లెళ్ల ఖర్మ! ఏమైనా రాబోయే రోజుల్లో ఈ సూపర్‌ అన్నా చెల్లెళ్ల నుంచి మరికొన్ని కుటుంబపరమైన ఉద్యమ సంబంధమైన నిజా నిజాల ఆవిష్కరణ, నిజాయితీల ప్రదర్శనలను ఆశించవచ్చు. అప్పటివరకు మనం సహనం వహిస్తే బాగుంటుంది. అంతేకానీ, ఈలోగానే విపరీత ఊహలకు, అనవసరపు అపోహలకు రెక్కలు తొడగరాదు. ఇక పెద్దాయన సంగతికొస్తే, 'తెలంగాణ ఇస్తనని' సోనియా నా చెవిలో ఎప్పుడూ చెప్పలేదులే అన్న దానితో ప్రారంభించి మరెన్నో నిజాలు, మనకు 'చెప్పేసే' శుభ సమయం కోసం వేచి ఉందాంలే కానీ, ప్రస్తుతానికి ఆయన సీమాంధ్ర పర్యటన అవసరం గురించి చర్చించుకోవడానికే పరిమితమవుదాం!

    దొరవారి కుటుంబ మూలాల ప్రస్తావన కాస్త పక్కన పెడదాం. అంటే బీహార్‌ టు విజయనగరం జిల్లా టు కరీంనగర్‌ జిల్లా టు, మెదక్‌ జిల్లాలో చింత మండక గ్రామం టు సిద్ధిపేట టౌన్‌ టు హైదరాబాద్‌ నగరానికి వలస ప్రస్థావనం, అలానే మెదక్‌ జిల్లాలో ఎకరాల విస్తీర్ణంలో నివాస గృహాలు, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వంటి ఇతర తెలంగాణ జిల్లాల్లో (ఎక్కడ పోటీ చేస్తే అక్కడ) అతిథి గృహాలు, హైదరాబాద్‌లో భవంతులు, గుజరాత్‌లో, గుర్గావ్‌లో వ్యాపారాలు, ఇలాంటి వాటి గురించి ప్రచారంలో ఉన్న ఊసులిప్పుడొద్దు, ఆయన ఒక ఉద్యమ కారుడు. ఒక గొప్ప పార్టీకి అధ్యక్షుడు. ఇంతవరకు ఎన్నికలలో అపజయం ఎదురవ్వని ప్రజాప్రతినిధి -ఇవన్నీ ఎందుకు? ఒక భారతీయపౌరుడు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉందా లేదా? 2000కి ముందు ఉన్న రాజ్యాంగమే ఇప్పుడూ ఉంది గదా! నిజానికి మంత్రిగా ఉన్నప్పుడు అరుదుగానైనా ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు. ఆంధ్రుల ఆదికవి నన్నయ నడయాడిన రాజమహేంద్రవరం వెళ్ళారు. కోటిలింగాల రేవుని చూసి తరించారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాఠాలు చెప్పారు. పల్నాడులో ప్రఖ్యాతి పొందిన 'నాగమ్మ' అసలు కరీంనగర్‌ నుంచి వలస వెళ్లిన భామ అన్నది ఈ సందర్భంలో గమనార్హం. ఓరుగల్లు పోతన పద్యాలే కాదు పల్నాటి శ్రీనాథుని పద్యాలు కూడా కెసిఆర్‌కి కంఠతా వచ్చు. వారిద్దరూ బావ బావమరదులని కూడా తెలుసు. సహజ వాగ్ధాటితో బాటు, మాతృభాషపై గట్టి పట్టు ఉన్న కెసిఆర్‌ని సీమాంధ్రలోని పార్టీ కార్యకర్తలు చాలా అభిమానించే వారు. విజన్‌ 2020 లో ఇంకా ఎన్నో పార్టీ పథకాల రూపకల్పనలో ఆయన పాత్ర గణనీయంగా ఉండేదని చాలామందికి తెలుసు. తెలుగు ప్రజల దురదృష్టవశాత్తు 1999లో ఆయనకి మంత్రిపదవి రాలేదు. ఆ అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. అంతే 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రజలకు దొరవారి దర్శన భాగ్యం బుల్లితెరకే పరిమితమై పోయింది! ఆయన పర్యటనలు లేక సీమాంధ్ర చిన్నబుచ్చుకుంటోంది, బోసి పోతోంది. ఆయన ప్రత్యక్ష దర్శనానికి ముఖం వాచి ఉంది. నిజానికి కెసిఆర్‌కి కూడా సీమాంధ్ర వెళ్లాలనే ఉంటుందనుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఒకేసారి తన ఇష్టదైవమైన వేంకటేశ్వరుని దర్శనార్థం, 2004 ఎన్నికలకు ముందు తిరుపతికి వెళ్లారు. 26 సీట్లు వచ్చాయి. 2008లో తెలుగుదేశం పార్టీలో పొత్తుకుదురిన సందర్భంలో, ఆ ఏడు విశాఖపట్నంలో జరిగిన మహానాడుకి రోడ్డు మార్గాన, మందీ మార్బలం, వాహన శ్రేణితో వెళ్తానని ఆనందంగా ప్రకటించారు. ఎందుకనో మనసు మార్చుకుని వెళ్లనేలేదు. సీమాంధ్రలో పర్యటిస్తానని 2009 ఎన్నికల సందర్భంగా కూడా మిత్రపక్షాలకు ప్రచారం చేస్తానని చెప్పారు కానీ వెళ్లలేదు. తను వెళ్లకపోయినా, కొడుకుని కూతుర్నీ పంపించక పోయినా, ఇతర తెలంగాణ వాదులను సీమాంధ్ర పర్యటనలు చేయవద్దని ఎప్పుడూ అనలేదు. వెళ్లమనే పరోక్షంగా ప్రోత్సహించేరు. వెళ్లినవాళ్లకీ ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వలేదు. ఉద్యమం బహు ఉద్ధృతంగా ఉన్నప్పుడు వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ తిరుపతిలో అంగరంగ వైభోగంగా వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం క్రితం హరీష్‌రావు శ్రీకాళహస్తిలో ఎంచక్కా రాహుకేతుపూజ చేసుకున్నారు (ఆయన రాహుకేతువులుగా పార్టీలో ఎవర్ని భావిస్తున్నారన్న విషయంలో ప్రచారంలో ఉన్న కథనాల ఊసుమనకొద్దులెండి!) తెలంగాణ వాదులుగా చలామణి అవుతున్న పలువురు గద్దర్‌ కొండాలక్ష్మణ్‌లతో సహా సీమాంధ్రలో సభలు పెట్టుకున్నారు. పోయిన శనివారం నాడు పొన్నం ప్రభాకర్‌ గుంటూరులో రాయపాటి ఇంటిని పావనం చేశారు. మధుయాష్కి గౌడ్‌ అదేరోజు (4.3.12న) గుంటూరులో ఉన్నారు. వివేక్‌ వంటి టిఎంపిలు కొందరికి సీమాంధ్రలో వ్యాపార సామ్రాజ్యాలున్నందున తరచుగా అక్కడికి వెళ్తూనే ఉంటారు. వి.హెచ్‌. విషయం వేరే చెప్పాలా? ఈ విషయాలపై కెసిఆర్‌ ఏ విధమైన విమర్శలు చేయలేదు. అభ్యంతరాలు చెప్పలేదు. ఆవిధంగా అఖిలాంధ్రపై తనకున్న ఆదరాన్ని పరోక్షంగా చాటుకుంటూనే ఉన్నారు. అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పే అవుతుంది కానీ, ఆయనది కాదు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన విజయశాంతిని ఎంపిని చేశారు. పదో చెల్లిగా ప్రకటించారన్న నిజం మర్చిపోతే ఎలా?

    కిరణ్‌, బాబు, చిరంజీవి, బొత్సలు తెలంగాణలో పర్యటిస్తున్నట్లే ఒక పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ సీమాంధ్రలో ఎందుకు పర్యటించకూడదు? ఒబామా కెన్యా వెళ్తే ఆ దేశ ప్రజలు ఎంత ఆనందించారో, స్వాగతించారో, సీమాంధ్రులు కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సాటి తెలుగువాడు, కెసిఆర్‌ని అదేవిధంగా అక్కున చేర్చుకుంటారు. అసలే తెలుగువాళ్లందరికీ 'తెగువ' ఎక్కువ. కెసిఆర్‌లో కూడా. పైగా ఆయన హనుమంతుని కన్న గొప్పవాడు. స్వీయ శక్తి సామర్థ్యాల గురించి ఎవరూ చెప్పనవసరం లేకుండానే తనకే బాగా తెలుసున్న మేధావి. అలా చేయాలనుకుంటే విడిపోతే మీకే మేలు అని చెప్పగలిగే వాక్చాతుర్యం ఉన్నదాయనకు. విభజనకు సహకరించమని అక్కడి ప్రజల్ని అభ్యర్థించి, ఇక్కడి వాళ్లకి, మనోళ్లు ఒప్పుకోవడంలేదు, ఏం చేస్తం మరి, ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాకుల అభిమతాన్నే ఆమోదించాలి, కదా ఊర్కొందాం అని నచ్చచెప్పగలిగే తెలివితేటలు, వాక్చాతుర్యం ఆయనకున్నాయి. సరే ఇవన్నీ ఎలాగున్నా ఆయన తరచుగా చెప్పేమాట, ప్రజాక్షేత్రమంటారే, అందులోకి అడుగిడి మాటలతో దున్నేసి ఆడ కూడా విభజన విత్తులు నాటివస్తాను. ఏమో, పంట పండావచ్చు -గుర్రం ఎగరావచ్చు. 'నా ప్రయత్నాన్ని అపార్థం చేసుకోవద్దు' అని ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలకు చెప్పుకోవచ్చు. కాబట్టి కెసిఆర్‌ తటపడాయించకండి. సీమాంధ్రలో త్వరగా పర్యటించండి -ఆఖర్లో కొందరి మనసుల్లో కదలాడే అనుమానాన్ని కూడా నివృత్తి చేయాలి. అక్కడికి కెసిఆర్‌ వెళ్లినప్పుడు ఒకవేళ సంస్కారం లేని మూర్ఖుడెవరైనా, 'మమ్మల్ని అలా తిట్టారు' 'ఇలా అన్నారు' అని ప్రశ్నిస్తే, 'అదేం కాదు సోదరా -తిట్టనే లేదు, మై సన్స్‌ అంటే నా పుత్రసమానులని అర్థం. అలానే సన్స్‌ ఆఫ్‌ డాంకీ అంటే నన్ను నేనే తిట్టుకున్నట్లు అని చెప్పేసి అందర్నీ నవ్వించగలిగే హాస్యసంభాషణా చతురత కెసిఆర్‌కి ఉంది. కాబట్టి ఆయన త్వరలో సీమాంధ్రలో పర్యటించి తీరాలి. తెలుగువారి చరిత్రలో ఒక మేలు మలుపుకి ఆద్యుడు కావాలి. దొరవారూ ప్లీజ్‌ వెళ్లరూ...

    - చేగొండి రామజోగయ్య ,
    విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు