23, నవంబర్ 2011, బుధవారం

విభజనుల బోషాణాల గుట్టు

ఆంధ్ర ప్రభ: ఇంతకాలంగా, తెలిసీ తెలియకుండా నిర్లిప్తంగా ఉండిపోయినందుకు మనందరం విస్తుపోయేలా విచారించేలా సిగ్గుపడేలా ఇటీవలి కాలంలో ఆధారాలతో సహా మనదేశంలోని, రాష్ట్రంలోని 'ఘనుల' నేతల అక్రమార్జన అధికార దుర్వినియోగ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి! లక్షల కోట్ల కుంభకోణాలు 2జి, కెజి బేసిన్‌ వంటి వాటితో బాటు ఎన్నో అక్రమాల అస్తిపంజరాలు ఒక్కోటీ రాజకీయ రక్షణ రహస్య బీరువాల నుంచి తొంగిచూస్తూ మనల్ని వెక్కిరిస్తున్నాయి. (మన రాష్ట్రానికే పరిమితమైనవి తెలుగులోనే వెక్కిరిస్తున్నాయి!) స్విస్‌, ఇతర విదేశీ బ్యాంకుల గోప్యతా లాకర్లలోని అపార ధనరాసుల, సిరుల గుట్లు మొత్తమంతా కాకపోయినా, బిట్లు బిట్లుగా, బహిర్గతమవుతున్నాయి.

ఇక్కడి అవినీతి, అధికార దుర్వినియోగ నల్లధనం తక్కువేం కాదు. దొంగ కంపెనీల ఓడలలో విదేశీయానం చేసి, అక్రమాల భూమి కూడా గుండ్రంగా ఉంటుందని నిరూపించే చందాన తిరిగి తిరిగి మన తీరానికే చేరుకుని, రంగు మార్చుకుని, దేశీ పారిశ్రామిక రాజకీయ చక్రవర్తుల కుటుంబ కర్మాగారాలకు, దురాశా కోశాగారాలకు ఈ ధనం చేరుకుంటున్న చోద్యాలూ చూస్తున్నాం -'హవాలా' తో దేశాన్ని దివాలా తీయించడానికి సంకోచించని సుగుణాభిరాముల లీలల్నీ వింటున్నాం -అలాంటి వాళ్లలో 'మనోళ్లూ' (పి.వి.గారి భావంలో 'తెలుగోళ్లు') ఉన్నారని తెలిసి సిగ్గుపడుతున్నాం -ఐతే, ఇదంతా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీల చర్యల వలన ఇప్పుడు కూడా మొద్దు నిద్రలోనే ఉండిపోతే కుదరదులే అనే అభిప్రాయంతోనో లేదా జడి విమర్శల దాడి గోలకు కొంచెం మెలకువ తెచ్చుకొన్న రాజ్యాంగ, నిఘా, పరిశోధనా దర్యాప్తు వ్యవస్థలు చేపట్టిన చర్యల వల్లనో సాధ్యమైంది. మన అదృష్టం కొద్దీ వైరి రాజకీయ వర్గాలు ఒకరిగుట్టు నొకరు రట్టు చేసుకోవటం వలన కూడా ఇది కొంతవరకు సుసాధ్యమైందని చెప్పవచ్చు -ఏమైతేనేం, మనం సంతోషించదగ్గ పరిణామాలు కొన్నైనా సంభవించాయి. కిలాడీ 'కల్మాడీ ఆటకట్టింది -'2జి రాజా' జైల్లో ఏడుపు బాజా వాయించుకుంటున్నాడు -కనిమొళి కటకటాలపాలైంది. రెండు రాష్ట్రాల్లో అక్రమాల గాలి స్తంభించింది. కొందరు ఐఏఎస్‌ అధికారులకూ, శ్రీకృష్ణ జన్మస్థాన ప్రవేశం ప్రాప్తించింది. మన హైకోర్టు పుణ్యాన మరుగున పడిపోతాయనుకున్న ఘనత వహించిన తెలుగునేతల ఘనకార్యాలు కొన్ని సిబిఐ విచారణ అరుగెక్కాయి. వీరి బండారం త్వరలో పబ్లిక్‌ రోడ్డున పడటం ఖాయంగా కనిపిస్తోంది.

సుఖ్‌రామ్‌కి శిక్ష వేశారు. అంబానీల చమురు వదలబోతోంది. ఈ నేపథ్యంలో విభజనోద్యమ తీరుతెన్నులను, ఈ ప్రాంతపు రాజకీయ ఉద్యోగవర్గాల నేతల అసలు ధ్యేయాల్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న తెలంగాణ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరముంది. ఏమాత్రం అనుమానం లేదు. భారతీయ ప్రజలందరి లానే 'మనోళ్లు' కూడా అందరు అక్రమార్కుల భరతం పట్టాలన్న అభిప్రాయంతోనే ఉన్నారు. ఐతే దేశంలోని రాష్ట్రంలోని, అన్ని కుంభకోణాలతో బాటు ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం పేరిట జరిగిన అక్రమార్జనల గుట్టు కూడా రట్టుకావాలని కోరుకుంటున్నారు. వీటిపైన కూడా మీడియా, న్యాయవ్యవస్థ, పరిశోధనా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని, నిజానిజాల నిగ్గు తేల్చాలని అభిలషిస్తున్నారు. నిజానికి ఉద్యమ క్రమంలో జరిగిన బలవంతపు చందాల దందాలు, ముడుపుల సొంతమూటలు, కుటుంబ సంపద విస్తరణల గురించి ప్రజలతోబాటు ప్రభుత్వ వ్యవస్థలకూ ఎంతోకొంత గత కొంతకాలంగా తెలుసు. ఈ విషయాలేవో కేవలం సమైక్య వాదులో లేక ఇతర ఉద్యమ వ్యతిరేకులో అక్కసుతో చేసిన ఉత్తుత్తి అభాండాలు కానేకావు. ఇతర గుడారాలలో వేరు కుంపట్లు పెట్టుకుని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీ కన్న ఎక్కువ క్రియాశీలంగా పాల్గొంటున్న విభజనవాదులే విశ్వసించి చేస్తున్న ఆరోపణలు. అధిక సంఖ్యాకులు నిజాలుగా భావిస్తున్న విమర్శలు.

ఆ మాటకొస్తే ప్రస్తుతానికి ఎందుకనో నిష్క్రియాయోగాన్ని ఆశ్రయించి ఉన్న ప్రభుత్వ నిఘా పరిశోధనా దర్యాప్తు సంస్థల వద్ద ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలిప్పటికే సమృద్ధిగా ఉన్నాయి -అందుకే ఈ అస్తిపంజరాలన్నిటినీ ప్రజలకు పారదర్శకంగా సంపూర్ణంగా చూపించాల్సిన అవసరముంది. ఆ విధమైన సమగ్ర పరిశోధనానంతర ప్రదర్శనార్హ అస్తిపంజరాలేమిటో, అంశాలేమిటో క్లుప్తంగా క్రోడీకరించి చెప్పుకుందామా -

(1) ఒక రాజకీయ పార్టీ 2004, 2009 ఎన్నికలలో వేర్వేరు పార్టీలతో జతకట్టి అందుకు మూల్యంగా కొన్ని వందల కోట్ల నగదు, లగ్జరీ వాహనాలు తీసుకున్నదని, కాని ఉద్దేశించబడిన అంటే పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి కొంతమేరకైనా ఈయకుండా, ఆ సొమ్మంతా కుటుంబ సంపదగా పరిగణించి అంతర్జాతీయ నౌకా వ్యాపారానికి సొంత పెట్టుబడిగా వాడారన్నది రాష్ట్రంలో చాలామందికి తెలిసిన రహస్యం! ఆ ఎన్నికలలో కుటుంబ సభ్యులు మినహా, ఇతర పార్టీ అభ్యర్థులు టిక్కెట్ల కొనుక్కోవటంతో బాటు ఎన్నికల ఖర్చులు స్వయంగా పెట్టుకోవాల్సి వచ్చిందని అందుకనే చాలామంది ఓడిపోయారని పార్టీ వాళ్లే చెపుతున్న సమాచారం.
(2) అమాయక ప్రజల నుండి ఓ మోస్తరుగా వచ్చిన స్వచ్ఛంద విరాళాలతో బాటు ఒక మీడియా మొఘల్‌, భూకబ్జాదారులు, తమ అక్రమాల రక్షణ కోసం సమకూర్చిన భారీ 'గుడ్‌విల్‌ మొత్తాలు', పారిశ్రామిక సినిమారంగాల నుండి బెదిరింపు దందాల ద్వారా వచ్చిన సొమ్ములు, బడుల రాబడులు, అన్ని కుటుంబ కోశాగారానికే చేరుకున్నాయన్నది మరో బహిరంగ రహస్యం.
(3) ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిపొంది, అక్కడ నిర్మించిన పార్టీ కార్యాలయ భవనం యాజమాన్యం ఎవరి పేరున ఉందో చెప్పనే చెప్పరు. 'ఎమ్మార్‌' దందాలో ముట్టిన అవినీతి సొమ్ములో కొంత ఆ భవన నిర్మాణానికి ఉపయోగించినందున ఆ పాపం దోషం పార్టీకి తాకిందని చాలామంది పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
(4) సొంత మీడియా ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన వందలాది కోట్లు ఎవరి నుండి ఏ దారిలో వచ్చాయా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తలచుకుంటే నిర్ధారించలేని విషయం కాదు, అలాగే పోలవరం ఇతర టెండర్ల వండర్ల గుట్లు తెలుసుకోవటం కూడా అసాధ్యం కాదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.
(5) రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో అందుకున్న సొమ్ముల గురించి కూడా దర్యాప్తు చేపట్టాలో లేక అదేదో ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా వదిలేయాలో ప్రభుత్వ సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలి.
(6) ఐతే విచారణ, పరిశోధన, అంతా ఒక కుటుంబానికే పరిమితం చేయటం కూడా న్యాయం కాదు. అక్రమార్కుల శేషం ఉండకూడదు కాబట్టి పలు ఐకాసలు కూడా ఎంత చెట్టుకంత గాలి అనే రీతిలో దండుకున్న ముడుపుల రహస్యముడులూ విప్పాలి -
(7) అలాగే ఉభయ ప్రాంతాల ఉద్యోగ సంఘాల నేతలు సందట్లో సడేమియా రీతిలో ఉద్యమ ఉద్వేగ కవచాల సాయంతో ఇప్పటికే నిర్ధారణౖన ఎసిబి కేసులను కాచుకోగల్గుతున్నారు. అక్రమంగా పొందిన ప్లాట్లనూ నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రం భవిష్యత్తుతో సంబంధం లేకుండా అక్రమార్కులందరిపైనా సత్వరం ఉన్న చట్టాలు, పాలనా నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, రాజకీయ ధ్యేయాలకోసం నిరంతరం పనిచేస్తూ ఉద్యోగ విధులను సంపూర్ణంగా త్యాగం చేస్తున్న వారినింకా విస్మరించకూడదు.
(8) విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పడానికి బదులు ప్రాంతీయ విద్వేషాలు నూరిపోస్తున్న ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులపై కూడా ఉన్న నిబంధనల కనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలి.
(9) అమాయకులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పిన వారిపైనా తగిన చర్యలుండాలి.
(10) చట్టాలు తెలిసిన లాయర్లు గాని, ఇంకెవరైనా గాని చట్టవ్యతిరేక పనులు చేసిన వారిని గుర్తించి చట్ట బద్ధ చర్యలు తీసుకోవాలి / అశ్లీల తవికలు రాసి ప్రచురించిన కవిశ్రేష్టులపై కూడా తగు చర్యలుండాలి. ఇందుకు కొత్త చట్టాలు చేయనవసరం లేదు. మొత్తానికి రాష్ట్రం కలిసుండాలా, విడిపోవాలా అన్నది వేరే సంగతి కాని చట్టాల్ని ఉల్లంఘించిన వారి నెవరినీ ఉపేక్షించరాదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అక్రమార్కుల అస్తిపంజరాలన్నీ వెలికితీయాలి. అక్రమార్జనలన్నీ స్వాధీనం చేసుకుని ప్రజలకోసం ఉపయోగించాలి.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి

22, నవంబర్ 2011, మంగళవారం

స్నేహపూరితమైన వాతావరణంలో ఎవరితోనైనా మేము చర్చకు సిద్ధం : విశాలాంధ్రమహాసభ

'ప్రచురణార్థం'  అంటూ ఎవరో  'తెలంగాణ నెటిజెన్స్ ఫోరం' పేరుతో నున్న ఈ  క్రింది లేఖను విశాలాంధ్రమహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ గారి ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేయడం జరిగింది.

 


దీనిని TNF నుండి చర్చకు రమ్మని అందిన ఆహ్వానంగా విశాలాంధ్రమహాసభ భావిస్తుంది.వారి లేఖకు మా ప్రత్యుత్తరాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము


తెలంగాణా నెటిజెన్స్ ఫోరం వారికి,

పరకాల ప్రభాకర్ వినమ్ర నమస్కారములు.

మీ బహిరంగ లేఖ చూసాను. చాల సంతోషం.


విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాలు, మా ప్రసంగాలు, రచనలూ, పత్రికా ప్రకటనలూ, మేము నిర్వహిస్తున్న సదస్సులను మీరు ఆసక్తితో గమనిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.


మేము ఎప్పుడూ ఎక్కడా తెలంగాణా ప్రజలకు, ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అటువంటి భావన మీకు కలిగి ఉంటే అది సరిఅయినది కాదు అని నేను స్పష్టంగా చెప్పగలను.


ఆ మాటకొస్తే మేము ఏ ప్రాంతానికి, ఏ ప్రాంత ప్రజలకీ వ్యతిరేకం కాదు. మేము విశాలాంధ్ర కొనసాగాలనే అభిమతం కలవాళ్ళం. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి చెప్పాలంటే మేము విభజన కోరే వారికి కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. మా వ్యతిరేకత కేవలం విభజన వాదం పట్ల మాత్రమే. విభజన వాదుల పట్ల ఏమాత్రం కాదు.


విభజన వాదం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్నదని మా అభిప్రాయం. విభజన వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు. అలాగే సమైక్య వాదం అన్ని ప్రాంతాలలోనూ ఉంది. సమైక్య వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు.


మేము సమైక్య వాదాన్ని బలపరిచే వాళ్ళం. విభజన వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళం. మాకు విభజన వాదుల పట్ల కించిత్తైనా అగౌరవం లేదు. వారి వాదన వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో, స్వార్ధ ప్రయోజనాలో ఉన్నాయని మేము అనుమానించడం లేదు. వారి వాదనతో మేము ఏకీభవించలేకపోతున్నాము.


అంతే.


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి గురించి మా దృక్పథం క్లుప్తం గా మీ ముందు ఉంచుతాను. రాష్ట్రం కలిసి ఉండాలా లేక విభజన జరగాలా అన్నదాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ రెండు వాదాలు వినపడ్డాయి. అంతకు ముందూ వినపడ్డాయి. 1956 లో ఉన్నాయి. 1969 లో ఉన్నాయి. 1972 లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఒకో సారి ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమయ్యింది. కాని అక్కడే దానికి వ్యతిరేకమైన భావన, అభిప్రాయం లేకపోలేదు. ఒకో సారి ఒకో ప్రాంతంలో ఉద్రేకాలు ఎక్కువగా మరో ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. గత అరవై సంవత్సరాల చరిత్ర మనకు తెలియ చేసేది అదే.


జరిగిన ఆందోళనలు ప్రాంతాల మధ్య జరిగిన వివాదాలు గా కాకుండా విభజన-సమైక్య వాదాల మధ్య జరిగిన, జరుగుతున్న భావజాల సంఘర్షణ గా చూడడం సరైనదని మా భావన.


ఈరోజు కూడా పరిస్థితి అదే. కోస్తా రాయల సీమలలో విభజనకు మద్దతు పలికే వారున్నారు. తెలంగాణలో ఉన్నారు. అలాగే ఆ రెండు ప్రాంతాలలో కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. తెలంగాణా లో కూడా కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక సారి ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమయ్యింది. మరొక సారి మరొక ప్రాంతంలో మరొక భావన బలంగా వ్యక్తమయ్యింది.


మా విశాలాంధ్ర మహాసభ లోనే అనేక మంది సభ్యులు తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వారితో పరిచయమయ్యే అవకాశం మీకు తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.


వారు గాని, నేను గాని పదే పదే చేసుకునే విజ్ఞప్తి ఏమిటంటే, ఐక్యం గా ఉండడానికి మా దగ్గర ఉన్న వాదన ఏమిటి, విడిపోవడానికి ఇవాళ వినిపిస్తున్న వాదన మాకు ఎందుకు అంగీకార యోగ్యం కాదు అనే మాట బహిరంగంగా పది మందికీ చెప్పుకునే అవకాశం మాకు కావాలని. మా మాటలు చెప్పుకోకుండా మమ్మల్ని అడ్డుకోవద్దని. మా అభిప్రాయాలతో మీరు ఏకీభవించక పోయినా మా మాటలు చెప్పుకునే హక్కును మమ్మల్ని అనుభవించనివ్వండి అని.


మా భావాలను ఎవరి మీద రుద్దే ఉదేశ్యం మాకు లేదు. ఎవరూ ఎవరి మీద తమ అభిప్రాయలు రుద్ద లేరు. అలా జరగ కూడదు కూడా. మా అభిప్రాయాలు వెల్లడి చేసిన తరువాత ఎవరి నిర్ణయాలు వారు చేసుకో వచ్చు. ఎవరి అభిప్రాయలు వారు ఏర్పరుచుకోవచ్చు. కాని మేము మా వాదన, అభిప్రాయం చెప్పడానికే వల్లకాదంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మా అభిప్రాయం.


మేము చేసేది అభ్యర్ధన. ఒక విజ్ఞప్తి. దానిని అలాగే చూడండి. అభిప్రాయాలను వ్యతిరేకించినా అవి వెల్లడి చేసుకునే స్వేచ్ఛను మీరు వ్యతిరేకించరనే విశ్వాసం మాకుంది.


మా అభిప్రాయాలు చెప్పుకునే వేదిక మాకు కల్పించడానికి మీరు ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీరు తీసుకున్న చొరవ మీలో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి కి అద్దం పడుతోంది.


మన సమావేశం ఎలా జరగాలి, సమావేశానికి ఎవరు సమన్వయకర్తగా వ్యవహరించాలి, దాని విధివిధానాలు ఎలా ఉండాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో జరగాలి అనే విషయాల మీద మనం మాట్లాడుకుని నిర్ణయించుకోవచ్చు.


ఈ విషయంలో మీరు మా విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ నలమోతు చక్రవర్తి గారితో సంప్రదింపులు జరిపితే ఉచితంగా ఉంటుందని నా భావన. వారు కూడా మీతో సంప్రతింపులు జరపడానికి చాల ఇష్ట పడతారు. వారికి మీరు contact@visalandhra.org ద్వారా వర్తమానం పంపవచ్చు.


మనం త్వరలోనే, ఇరువురికి సదుపాయంగా ఉండే చోట, రోజు, సమయానికి కలుసుకుని చక్కటి నాగరిక, స్నేహపూరితమైన వాతావరణం లో మన ఆలోచనలను పంచుకోవచ్చు.


ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను.



ఇట్లు,
భవదీయుడు,
పరకాల ప్రభాకర్

Bapuji’s Nellore Meet : Parakala Prabhakar

Parakala.org : Sri Konda Laxman Bapuji’s Sadbhavana Meet on Sunday, 20th November went off peacefully in Nellore. He was able to put forth his views on the division of the state without any disturbance. He not only argued for the need to create a separate Telangana State, but also said that the state should be divided into three. He batted for separate Rayalaseema also. He said he was in favour of smaller states, no matter how many.

Speakers in the meet expressed their views unhindered. Nobody barged into the meet. Nobody shouted slogans outside the venue. Nobody hurled abuses. Nobody tried to manhandle anybody.

Some prominent leaders who are for Visalandhra went to the venue, met Bapuji and other speakers. They greeted him, conveyed their respects to him, felicitated him with a shawl and left the venue.

Some of the speeches at the meet were less than dignified, if you go by the newspaper reports. 

Uncharacteristically, even Bapuji crossed his familiar line of argument. He said that only capitalists opposed the division of the state. Never mind. That’s what he wanted to say, and he said it. It was his wisdom. So be it.

The group that invited Bapuji and his companions is a pretty smallish one. It’s presence in Nellore is insignificant. The organisers were unfamiliar to the public life of Nellore. The strong and powerful players in the political and social scene of Nellore are strong integrationists. There were integrationists even during the 1972 Jai Andhra agitation. It is well known that during that phase Nellore was a hot bed of separatism. 

Separatism, however, is a very faint voice in Nellore now.

Notwithstanding the strong integrationist opinion, notwithstanding the anonymity of the organisers of the separatist meet, Bapuji’s meet went off peacefully.

What does this indicate?

It clearly shows that Visalandhra Vaadana is self-confident and secure. It is not afraid of anyone organising a meet to propagate a contrary view. It’s self-confidence is revealed by the fact that staunch integrationists met the visitors and showed their respect. It indicates that the integrationists are not against separatists as individuals but are only against separatism as an idea. They only disagree with the separatists on their vision of the future of Andhra Pradesh. Integrationists have shown that one can disagree without being disrespectful and undemocratic or disruptive.

Voices of integration are not loud and shrill. They are dignified. But they are clear.

Voices of separatism are loud, shrill, abusive and disruptive. They are a cacophony.

Nellore meet brought out this contrast into bold relief. The meet revealed the petty mindedness of separatists everywhere – in the Coastal area, in Rayalaseema and in the Telangana.

If Bapuji’s mission is Sadbhavana as he claims it is, it would have earned him respect if he had invited an integrationist to speak at his meeting. If he had given a public commitment that he would take an integrationist along with him and provide a platform for airing the argument, Bapuji would have lived up to the expectations of people who value spirit of tolerance in public life.

Has separatist pettiness polluted Bapuji’s Sadbhavana too?

21, నవంబర్ 2011, సోమవారం

ప్రత్యేకరాష్ట్ర నినాదం తెలంగాణా ప్రయోజనాలకు మంచిది కాదు : మాడపాటి

ఆంధ్రజనత దినపత్రిక, మార్చి 22,1969: వేర్పాటు ఆలోచనలకు స్వస్తి చెప్పి తెలంగాణ ప్రగతికై ఆంధ్రప్రాంత సోదరులతో కలిసి మెలిసి కృషిచేయవలసిందని తెలంగాణా ప్రజలకు తెలంగాణాలో విద్యాభివృద్ధికి, తెలుగు భాష,సంస్కృతిల పునర్జీవనానికి, మహిళల ప్రగతికి నిర్విరామంగా కృషి చేసిన తెలుగు పెద్ద ఆంధ్ర పితామహ శ్రీ మాడపాటి హనుమంతరావు పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శాసనమండలి మాజీ అధ్యక్షుడైన శ్రీ హనుమంతరావు తమ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు:

"తెలంగాణాలో ఇటీవల కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘటనలు నాకు చాలా బాధను , ఆందోళనను కలిగిస్తున్నవి. ప్రత్యేక తెలంగాణ  నినాదం తెలంగాణ ప్రజలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని నేను త్రికరణశుద్ధిగా విశ్వసిస్తున్నాను. తెలంగాణను విశాలాంధ్రలోని అంతర్భాగంగా భావించుకొని, చిరకాలంగా మనం మురిసిపోతూ వచ్చాము. మనం నిజాం పరిపాలనా కాలంలో కూడా సమస్త రాజకీయ, సాంఘిక, విద్య మహోద్యమాలను 'ఆంధ్ర పతాక' క్రిందనే నడుపుకుంటూ వచ్చాము. మనకు ఆంధ్రమహాసభ ఉన్నది.మన విద్య, సంస్కృతి సంస్థలన్నీ ఆంధ్రనామ శబ్దాంకితములు. ఆంధ్రతో కలిసిమెలిసి చేదోడువాదోడుగా వ్యవహరించడంలోనే తెలంగాణ శ్రేయస్సు గర్భితమై యున్నది. ఈ దశ లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రయోజనకరం కాదు. గిట్టుబాటు కాదు. రాజ్యాంగచట్టాన్ని సవరించకుండా 'ప్రత్యేక తెలంగాణాను' ఏర్పాటు చేయడం సైతం అసంభవమే. రాజ్యాంగ చట్టసవరణ అనేసరికి ఎన్నో క్రొత్త చిక్కులను ఎదుర్కోవలసి వస్తుంది.దీని ప్రభావం ఇతర ప్రాంతాలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ వాదం జాతీయ సమైక్యత సాధనకు ఏ మాత్రం దోహదం చేయజాలదు"


ఓ తెలుగోడి ఆవేదన .....

ఓ వైపు!..........
సలాం సలాం అని
గులాం గులాం చేస్తే
మారో మారో అని తెలుగోడి ప్రాణాలను హరిస్తే
పోరు బాటే మార్గమని
పోరు జెండా నెత్తుకుంటే
వల్లభుడె దిగి వచ్చి
నిజాం అంతు చూస్తే!.........


మరో వైపు!............
తెలుగు అన్నలందరిఫై
తెగబడి ఎగబడి
మద్రాసోడు మారణహోమం చేస్తుంటే
సహించలేక భరించలేక
మన పొట్టి అన్న
పట్టు బట్టి సాదించి తెలుగు అన్నలందరిని ఏకం చేస్తే!...


కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
కదం తొక్కి విత్తువేసి
ఆఫ్రికా ఖండము నుండి అమెరికా ఖండము వరకు
అలుపెరగకుండా లంగరు వేసి
ప్రపంచములో ప్రచండ వేగముతో దూసుకెళ్తున్న
తెలుగోడిని చూసి చీడపురుగు చిదంబరానికి కన్ను కుట్టింది
చిలవలు పలవలుగా మన మద్య చిచ్చు పెట్టింది ...


తమిళము, మళయాళము, గుజరాతూ బేషరతు గా కలిసుంటే
మన తెలుగు అన్నలెందుకు తగవు లాడుకోడము
ఆ చిదంబరానికి బుద్ధి చెబుదాము!!
మన తెలుగోడి సత్తా చూపెడదాము!!!


వేంసాని రమణ
ఖమ్మం జిల్లా(స్వస్థలం)
పోర్ట్స్మౌత్, ఒహిఒ అమెరికా నిస్తలం

మానవహక్కుల సంఘాల నేతలకు ఒక ప్రవాసాంధ్రుని బహిరంగ లేఖ

An open letter to human right activists
by Ramana Vemsani 



నేను తెలంగాణా లోని ఒక కుగ్రామము లో జన్మించాను, విద్యార్ధి దశ నుండి మన మానవ హక్కుల వారు చెప్పే మాటలకు ప్రభావితమయ్యానని చెప్పుకోటానికి సంతోషిస్తాను వారి ఆదర్శాలు, చెప్పే మాటలు చూసి నా చుట్టూ వున్నా పరిసర ప్రాంతాలలో మానవ హక్కులకి విఘాతము కలగ కుండా చూసేవాడిని అని చెప్పుకోటానికి గర్వ పడతాను. మన తెలంగాణా లో కుల భావము ఎక్కువే అన్న సంగతి మన తెలంగాణా లోని సోదరులు అందరికి తెల్సు అనే అనుకుంటున్నాను. మా ఇంట్లో అప్పటి వరకు వున్నా రెండు గ్లాస్ ల సిద్దాంతాన్ని వ్యతిరేకించి మా అమ్మ ను నాన్న ను ఒప్పించి వాళ్ళలో మార్పును తీసుకు రాగలిగాను మా తాత గారు కట్టించిన గుడి లో కి అందరికి ప్రవేశము కల్పించగలిగాను అలాగే మా వూర్లో వెనక బడిన వర్గ సోదరులు కాని దళిత సోదరులు కాని రాజకీయాలలో ముందు ఉండేలాగా ప్రోత్స హించ గలిగాను గ్రామములో స్కూల్ రావటము కొరకు మా నాన్న గారి చేత ౩ ఎకరములు భూమి ఇప్పించగాలిగాను అంటే ఈ మానవ హక్కుల ప్రభావము నా మీద ఎంత పనిచేసిందో మీకు అర్ధమైంది అనుకుంటాను.

M A ఉస్మానియా లో చేస్తున్నప్పుడు నా సోదరి వివాహము కొరకు బందు మిత్రులని ఆహ్వానించటానికి గుంటూరు దగ్గిర లోని గ్రామము కు ఒక రాత్రి వెళ్తుండగా ఒక్క కుదుపున మా బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి ప్రయాణికుల అందర్నీ నిద్ర లేపి అప్రమత్తము చెయ్యటము జరిగింది ఏమిటా అని బస్సు దిగితే మా ఎదురుగ ఒక బస్సు మంటల్లో కాలి పోవటము గమనించాను ఆ బస్సు లో ప్రయాణికులు అందరు ఆ జ్వాలల్లో కాలిపోతుంటే అది చూస్తున్న ప్రతి ఒక్క పౌరుడి దుఖాన్ని ఆపుకోలేక అలా తగులబెట్టిన వారిని కూడా మంటల్లో వేసి చంపాలని అంటున్న మాటలు విన్నాను. కాని మన మానవ హక్కుల సోదరులు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుందని చెప్పిన వాదనని కూడా కాదనలేకపోయాను. ఆ తర్వాత మన తెలంగాణా లోని కాకతీయ దుర్ఘటన జరిగినప్పుడు కూడా మన మానవ హక్కుల సోదరులు ఏదో తెలియక చేసిన పొరపాటు గా చెప్తే కూడా అంగీకరించాను .

కాని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో p hD చేసిన Dr పరకాల, ఈ సమాజము లో వేర్పాటు వాదము వద్దు అని, అంది వచ్చిన తన రాజకీయ బవిష్యత్తు కు విఘాతము కలగవచ్చేమో అన్న సందేహము కూడా లేకుండా మన ప్రజలకి తన వాదన లోని నిజాలు తెలియ చెయ్యటానికి ముందుకు వస్తే అతని మీద దాడి చెయ్యటము చూస్తే ఈ సమాజములో మానవ హక్కుల గురించి చర్చ జరగాల్సిన అవసరము ఎంత అయినా వున్నది అన్న విషయము మన మేధావులు అందరు గమనించాలని వేడుకుంటున్నాను. అతని విశాలాంధ్ర వాదన ను చూసి ఇంత మంది తెలంగాణా మేధావులు పారిపోవటము చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది. కొందరి ఆలోచనలు మనకు రుచించినా, రుచించక పోయినా అతనికి రక్షణ కల్పించ అవసరము కానీ, వాదనకు అవకాశము కానీ మనము దగ్గిర వుండి కల్పించాల్సిన ఆవశ్యకత మన మానవ హక్కుల సోదరులు అందరికీ ఉన్నదనే అనుకుంటున్నాను. మానవ హక్కుల కార్యకర్తలు ఎంత నిబద్దతతో పని చేస్తారో కూడా నిరూపించాల్సిన ఆవశ్యకత వచ్చింది, ఈ విషయము లో మన అమర్ చూపించిన మార్గము ఎంతైన అభినందనీయము మా సంధ్య అక్క కాని, మా విమల అక్క కాని, నా పాత P D S U మిత్రులు కాని, నా మిత్రుడు చక్రపాణి కాని ఈ విషయము లో స్పందిస్తే చూసి ఛాలా సంతోషిస్తాను అనటములో ఏ మాత్రమూ సందేహ పడను. ప్రతి ఒక్క పౌరుడు కు జీవించే హక్కు మరియు తమ అభిప్రాయాన్ని తెలియ చెప్పే హక్కు ఉంటుందని చెప్తూ వస్తున్న మన మానవ హక్కుల సోదరులు అవి ఒక్క బస్సు లలోని ప్రజలని, రైళ్లలోని ప్రజలని కాల్చి చంపే వారికి మాత్రమే అన్న విషయాన్ని అయినా స్పష్టము చేస్తే ఇంకా మరి సంతోషిస్తాను.

రమణ వేంసాని
ఖమ్మం జిల్లా (స్వస్థలం)
పోర్ట్స్మౌత్, ఒహిఒ అమెరికా నిస్తలం




20, నవంబర్ 2011, ఆదివారం

సద్భావన యాత్రకి సంఘీభావం.విశాలాంధ్రవాదాన్ని కూడా వినిపించనివ్వండి : VMS PressMeet (19.11.2011)

ఆంధ్రజ్యోతి: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచాలా లేక విభజించాలా అనే అంశంపై స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్ బాపూజీ నిర్వహించ తలపెట్టిన సద్భావన యాత్రకు పరకాల సంఘీభావం ప్రకటించారు.

అయితే, సద్భావన వేదిక నుంచి తమ వాదాన్ని వినిపించడానికి అవకాశం కల్పించాలని కోరారు. " రెండు విభిన్న వాదాల మధ్య సద్భావన ఉండాలి. విభజన, సమైక్యతా సమస్యను మేము ప్రాంతాల మధ్య వివాదంగా చూడటం లేదు. భావజాలాల మధ్య సంఘర్షణగానే పరిగణిస్తున్నాం'' అని వివరించారు.

సమైక్యవాదాన్ని వినిపించేవారికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. దీనిపై పౌరహక్కుల ఉద్యమకారులు ఎందుకు స్పందించరంటూ నిలదీశారు. తాను బతికున్నంత వరకు రాష్ట్రాన్ని చీల్చలేరని స్వాతంత్య్రసమరయోధుల సంస్థ అధ్యక్షుడు నర్రామాధవరావు స్పష్టం చేశారు.

1969లోనూ, ఇప్పుడు విభజనవాదం ఓడిపోవడానికి స్వార్థ ప్రయోజనాలు, ఐక్యత లేకపోవడమే కారణమని పాత్రికేయుడు రామజోగయ్య అన్నారు. తెలంగాణవాదం అభూతకల్పనలతో, అసత్యాలతో ముడిపడి ఉందన్నారు. సమైక్యవాదం వినిపించడమే నేరంగా మారిందని మరో ప్రతినిధి కుమార్‌చౌదరి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనపై మాట్లాడేముందు పాలమూరులో అమల్లో ఉన్న రెండుగ్లాసుల విధానంపై నోరువిప్పాలని న్యాయవాది రవితేజ నిలదీశారు.

ఈనాడు 20.11.2011

 సూర్య: విభజన వాదానికే కానీ విభజనవాదులకు తాము వ్యతిరేకం కాదని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేపడతానన్న సద్భావన యాత్ర కేవలం రెండు ప్రాంతాల మధ్యే కాకుండా రెండు విభిన్న వాదాల మధ్య కూడా ఉండాలని ఆయన సూచించారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో ఆంధ్రా ఉద్య మం మాదిరిగానే ఈ సారికూడా విభజన కోరుకున్న చోటే సమైక్యానికి మద్దతు ఉందన్న విషయం నేతలు గమనించాలన్నారు. తనపై జరిగినదాడిపై పౌరహ క్కుల రక్షణ ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

19, నవంబర్ 2011, శనివారం

వేర్పాటువాదుల సమైక్య వాక్కులు

  • జై తెలంగాణా నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రి గారు తక్షణ చర్యలు చేపట్టాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కే.సి.ఆర్ ( 26.02.1997)   
"ఎవరి ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో , రాయలసీమ లో ఉద్యమాల కోసం ఏదో సమితి అనేది పెడుతున్నారు. రాయలసీమ లో రాయలసీమ విమోచన సమితి, రాయలసీమ పోరాట సమితి, తెలంగాణ ప్రజా సమితి ఈ విధంగా అనేక పేర్లతో సమితి నాయకత్వాన ఉద్యమం చేపట్టే ఉద్యమకారుడు ఏదైనా ఉద్యోగం లభించినట్లయితే ఆ ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు కాని వారికి హోదా వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించరు. పలు నినాదాలు వస్తున్నాయి. ఇందాక హౌస్ లో దామోదరరెడ్డి గారు స్లోగన్ తో సహా జైతెలంగాణ అని కూర్చున్నారు. ఈ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రిగారు తక్షణ చర్యలు చేపట్టాలి."

    • జోనల్ సిస్టం రద్దు చేయాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కే.సి.ఆర్ ( 18.07.1996)
    " ఈ ఉద్యోగులుకు సంబంధించి అధ్యక్ష్యా! సిక్స్ పాయింట్ ఫార్ములాలు, తర్వాత జోనల్ సిస్టం లు పెట్టుకొని మనం కొంచెం దెబ్బతింటున్నాము అధ్యక్ష్యా! ఎక్కడైనా ప్రాజెక్టు కింద స్టాఫ్ మిగిలిపోతే వారిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసలుబాటు ఉండాలి అధ్యక్ష్యా! కానీ అటువంటి విధానం లేదు. కొన్ని మనకుగా మనం విధించుకున్న ఆంక్షల వల్ల, నిబంధనలవల్ల, జోనల్ సిస్టం వల్ల, సిక్స్ పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతున్నాము.........ప్రభుత్వం డైనమిక్ గా మువ్ కావాలని చెప్పి అవసరమైనప్పుడు నాయకులతో, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోగాని, ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ జోనల్ సిస్టం లను, మనకి అవరోధంగా ఉన్న విషయాలను తొలిగించుకొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్బంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష్యా!"


    • ఒకప్పుడు తెలంగాణవాదిని -ఇప్పుడు సమైక్యవాదిని : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నాగం జనార్ధనరెడ్డి (22.08.1988)
    "ఆనాడు దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ నాయకులు ఈ ఉద్యమంలో చేరి దాదాపు 350 మందిని పొట్టన పెట్టుకొని సాధించింది ఏమిటంటే ఈ సుధాకరరావుగారు కాని, లేక కీర్తిశేషులు రాజారాం గారు కాని,మదన్ మోహన్ గారు గానీ మంత్రులయ్యారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.కాని మేము మాత్రం రెండున్నర సంవత్సరాలు విద్యను పోగొట్టుకొని జైలుకు వెళ్లాం.లాఠీ దెబ్బలు తిన్నాం.దాని తర్వాత కూడా ఈ రోజు తెలంగాణ గురించి ఈ రకంగా చర్చ రావడం బాధాకరంగా ఉంది.....ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ప్రగతి ఉంటుందని విశ్వసిస్తున్నాను."

    • కోస్తా మహానుభావులే మాకు చదువు నేర్పారు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దేవేందర్ గౌడ్(17.05.2005)
    "మా పరిస్థితి ఎలా ఉండేదంటే మాకు చదువు నేర్పేవారే లేకుండా పోయారు. నిజానికి నేను చెబుతున్నాను. నిజమైన హృదయంతో చెబుతున్నాను. కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన మహానుభావులే మాకు చదువు నేర్పారు. నాకు తెలిసిన ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయనకు పాదాభివందనం చేయాలి. రెండు పూటలా తిండిలేకుండా ఉపాధ్యాయులు ఎక్కడినుంచో కాకినాడ, గుంటూరునుంచి ఇక్కడికి వచ్చి మాకు చదువులు నేర్పారు.ఇక్కడ ఉండే మహానుభావులు మాకు చదువు నేర్పలేదు. ఆ రోజు రాజకీయ నాయకత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళకు చదువు చెప్పాలని ఏనాడైనా మానవత్వంతో ఆలోచన చేసారా?అని అడుగుతున్నాను.కోస్టల్ ఏరియాకి వెళితే అక్కడ ఊరికిగాని కొన్ని ఊర్లకు కలిపిగాని మెమోరియల్ స్కూల్స్ ఉండటం మనకు అక్కడక్కడ కనపడతాయి. వాళ్ళ పెద్దల పేరుతో స్కూల్స్ పెట్టి అక్కడి ప్రజలకు చదువు నేర్పాలనే తపన అక్కడి రాజకీయ నాయకత్వానికి ఉంది. ఇక్కడి రాజకీయ నాయకత్వానికి ఏమి రోగం అధ్యక్షా?.."


    • ముసలివాళ్ళకి విడాకులు ఇప్పిస్తారా?: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కడియం శ్రీహరి(29.03.2005)
     నెహ్రూ చెప్పి ఉంటారు. నాకు తెలియదు ....1956 లో పెళ్లి జరిగితే అప్పుడున్న అత్త ఎవరు అధ్యక్షా? ఇప్పుడు 2003 లో ఉన్నాము . దాదాపు 47 సంవత్సరాలు జరిగిపోయింది. వాళ్ళే కదా అధ్యక్షా అత్తలు. 1956 లో నవదంపతులైనవారికి పిల్లలు పుట్టారు. మనవలూ పుట్టారు.ఇప్పుడు సమస్యలు విడాకులు అని వారు అంటున్నారు.కాంగ్రెస్స్ పార్టీ పాలసి ఏమిటి అధ్యక్షా? ముసలివారికి విడాకులు ఇప్పిస్తారా? ఆ ముసలివారికి రాజశేఖర రెడ్డి మామగా ఉంటారా?ఇది ఏమిటి అధ్యక్షా?


    TV 9 'వారధి' కార్యక్రమంలో నలమోతు చక్రవర్తి (16.11.2011)

    Part 1

    Part 2

    Part 3

    Part 4


    18, నవంబర్ 2011, శుక్రవారం

    ఇదేం ద్వంద్వ వైఖరి ?



    అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర గృహ మంత్రి హోదాలో ఆయన నరేంద్రకు వ్రాసిన లేఖ, అధికారం పోయిన తర్వాత భాజపా T వేర్పాటువాదాన్ని తలకెత్తుకున్న విధానాన్ని ఇప్పటికే ప్రస్తుతించాము . కమలనాథునికి (ఆయన అర్థాంగి పేరు శ్రీమతి కమల) వయస్సు పెరిగేకొద్దీ చంచలత్వం ఎక్కువయిపోయింది. అందుకే నెల రోజుల వ్యవధిలో ఒకే యాత్రలో రెండు మాటలు.


    12, నవంబర్ 2011, శనివారం

    భావవ్యక్తీకరణ స్వేఛ్చను అడ్డుకోవడం పిరికితనం : విశాలాంధ్ర మహాసభ ప్రెస్ మీట్





    Visalandhra.org : “We will do all we can to protect the right of the Separatists to express their views anywhere. Can the Separatists take this challenge to defend the right the Integrationists who want  their point of view to be heard?” questioned Dr Parakala Prabhakar, general secretary, Visalandhra Mahasabha.
    The occasion was the book release function organized by VMS at Basheerbagh Press Club today (November 12). The book “Think My Telangana Brothers” written by Venkataiah who hails from Nalgonda was released by veteran freedom fighter Sri Narra Madhava Rao.

    VMS on the occasion made a demand to the State Government to announce compensation to the farmers in the state whose crops suffered due to power shut-downs during the recent general strike.

    “While all other stake-holders including the government employees got relief, it is the farmer community which was denied any material help,” Nalamotu Chakravarthy, president, VMS said.

    Not to miss a chance to grab some cheap publicity, a few miscreants who claim to be Telangana Advocates JAC members stormed the Press Club premises and sought to disrupt the proceedings. However, the police dispersed them.

    “We are ready to discuss the pros and cons of the division of the state on any platform and we want the Separatists to engage in such a debate,” Dr Parakala said.

    He also expressed concern that some unsocial elements were trying to physically harm the author Venkataiah, as he exposed Prof Jayashankar’s propaganda concerning various issues in Telangana.

    Visalandhra Mahasabha today (November 12) held a book release function at the Basheerbagh Press Club.



    Kommineni.info :  విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎట్టకేలకు సమావేశం జరిగింది. కొందరు తెలంగాణ న్యాయవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా పోలీసులు అదుపు చేశారు.తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఫ్రొఫెసర్ జయశంకర్ చెప్పినవన్ని అబద్దాలు అని రుజువు చేసే విధంగా తెలంగాణలోని కొందరు సమైక్యవాదులు పుస్తకాలు రాశారని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో సైతం సమైక్యవాదులైన వాసుదేవరెడ్డి, నర్రా మాధవరావు, నల్లమోతు చక్రవర్తి వంటి వారు ఉన్నారని, వారు నిజాలు చెబితే తమను తెలంగాణ ప్రజలు నిలదీస్తారని చెప్పి తమ సభలకు అడ్డుపడాలని చూస్తున్నారని పరకాల వ్యాఖ్యానించారు. ఎవరి వాదనలు వారు చెప్పుకునే స్వేచ్చ ఉండాలని, అప్పుడు ప్రజలు ఎవరి వాదన నిజం అనుకుంటే ఆ వాదనను విశ్వసిస్తారని , అంతేకాని ఇలా అడ్డుకోవడానికి ప్రయత్నించడం పిరికి తనం అవుతుందని పరకాల వ్యాఖ్యానించారు. తెలంగాణ వాదం పేరుతో వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని,వాటిని తాము రుజువు చేస్తున్నామని భయపడే వారు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, నల్లమోతు చక్రవర్తి సవివరంగా అంకెలతో సహా ఆ విషయాలు తెలియ చేస్తే ఆయన పుస్తకావిష్కరణను అడ్డుకోవడానికి వారు యత్నించారని పరకాల విమర్శించారు. మొత్తం మీద ప్రెస్ క్లబ్, జర్నలిస్టుల సంఘం నేత అమర్ వంటి వారి సహకారంతో ఈ కార్యక్రమం నడవడం విశేషం. తాము వీరి వాదనలను ఒప్పుకుంటామా? లేదా? అన్నది వేరే విషయం అని, కాని విశాలాంధ్ర మహాసభ సమావేశం జరుపుకోవడం తప్పుకాదని అమర్ చెప్పారని, అందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ఆయన అన్నారు. 



    11, నవంబర్ 2011, శుక్రవారం

    ఆంధ్ర పితామహుడు 'మాడపాటి'

     నేడు మాడపాటి హనుమంతరావుగారి వర్ధంతి 
    ఆంధ్రప్రభ : తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో 'మేం ఆంధ్రులం' అని చెప్పగలిగిన ధైర్యశాలిగా మాడపాటి హనుమంతరావు కీర్తించబడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా ఐక్కుదూరు గ్రామంలో 1885 జనవరి 22వ తేదీన మాడపాటి హనుమంతరావు జన్మించారు. ఐదేళ్లకి తండ్రి మరణించడంతో హనుమంతరావు సూర్యాపేటలో ఉద్యోగం చేస్తున్న మేనమామ వద్ద పెరిగారు. నాటి నుంచి మాడపాటికి తెలంగాణాతో సంబంధం ఏర్పడింది. 1898లో ఉర్దూ మిడిల్‌ ఉత్తీర్ణులైన తర్వాత హనుమకొండలోని ఉన్నత పాఠశాలలో చేరి మద్రాసు విశ్వవిద్యాలయ మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1904లో ఆయనకు వరంగల్‌ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నెలకు రూ.40 వేతనంపై మీర్‌ మున్షీ (హెడ్‌ క్లర్క్‌) ఉద్యోగం లభించింది. ఎనిమిది ఏళ్ళు ఉద్యోగం చేసిన మాడపాటి ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ చేరుకొని నేరుగా స్వాతంత్య్ర ఉద్యమంవైపు కాకుండా సంఘ సేవకుడిగా కొనసాగాలని నిశ్చయించుకున్నారు. నాటి నైజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పటేల్‌, పట్వారీ, పోలీసుల జులం ఎక్కువగా ఉండేది. అన్నదాతల్ని అన్యాయమైన వసూళ్ళతో యమయాతనలు పెట్టేవారు. వెట్టిచాకిరీ చేయించుకునేవారు. వర్తకుల దగ్గర నిజాం ఎస్టేట్‌కు చెందిన ఉద్యోగులు సరకులు తీసుకుని డబ్బు యిచ్చేవారు కాదు. భూస్వాముల దౌర్జన్యాలకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో దొరల దోపిడీతో పాటు ఇతర భూస్వామ్య, పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి అనేక ప్రజా సంఘాలు వెలిసినాయి. ప్రజలు కళ్ళు తెరవడానికి గ్రంథాలయాలు, రైతుల ఇక్కట్లు పోగొట్టడానికి రైతు సంఘాలు, వ్యాపార పరిస్థితులు బాగు చెయ్యడానికి వర్తక సంఘాలు వెలిశాయి. ఈ సంఘాలు గ్రామ ప్రాంతాల చైతన్యానికి సంకేతాలుగా నిలిచాయి. తెలంగాణా వెనుకబాటుతనానికి కారకులైన నిజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుతోపాటు తెలుగుజాతిని జాగృతి చేయడానికి గ్రంథాలయోద్యమం, సంఘసంస్కరణ, స్త్రీ విద్యావ్యాప్తి, సాంఘికోద్యమం, ప్రజాసేవారంగంలో, స్త్రీల ప్రవేశం, విద్యాప్రచారం, సాహిత్య వికాసం వంటి అనేక ఉద్యమాలను ఏకకాలంలో నడిపించడంలో మాడపాటి హనుమంతరావు చేసిన కృషి మరువలేనిది. నిజాం రాష్ట్ర తెలుగు జాతిని మొదట మేల్కొలిపిన మాడపాటి 1921లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం కార్యదర్శిగా సారథ్యం వహించారు. నిజాం రాష్ట్ర పాలనలో తెలుగు భాష లేకుండా కొనసాగిస్తున్న రోజుల్లో తెలుగు భాషను కాపాడడమే కాక తెలుగుజాతిని ఐక్యం చేయడానికి గ్రంథాలయాలే పునాదిగా తలచి హనుమకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం, హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అభివృద్ధికై మాడపాటి విశేష కృషి చేశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌ సంస్థానంలో రాజభాష ఉర్దూ -విద్యాబోధన ఉర్దూలోనే జరిగేది. బాలికలకు తెలుగు భాషలో విద్యాబోధన (ఉన్నత పాఠశాల స్థాయిలో) జరిపించడానికి మాడపాటి ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాలకు పుణలోని థాకర్స్‌ భారత మహిళా విశ్వవిద్యాలయం వారి గుర్తింపు లభించింది. అణగారిన వర్గాల్లో జాగృతి, చైతన్యం కలిగించడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నిజాం పాలన క్రింద మగ్గుతున్న తెలుగు ప్రజల భాషా, సాంస్కృతిక గుర్తింపును చాటడానికి సమర్థ ఉపకరణంగా ఆయన జర్నలిజాన్ని ఉపయోగించుకున్నారు. న్యాయమైన పౌర, రాజకీయ హక్కులను గురించి ఆనాటి 'నీలగిరి' పత్రిక, 'గోల్కొండ', 'సుజాత', 'దేశబంధు', 'తెలంగాణా' పత్రికల్లో అనేకవ్యాసాలు ఆయన రాశారు. పిరదౌసి ఫార్సీ కవితను తెలుగులోకి అనువదించారు. ముషీర్‌ ఎ దక్కన్‌ అనే ఉర్దూ పత్రికకు చాలాకాలం సంపాదకీయాలు రాసేవారు. నాయకులను తయారు చేయడమే కాని, నాయకత్వానికి ఇష్టపడని మాడపాటి 1935 లో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 1946లో మాడపాటి హనుమంతరావు షష్టిపూర్తి ఉత్సవాలు తెలంగాణా అంతటా జరిగాయి. ఆ సందర్భంగా సన్మాన రూపంలో వసూలైన డబ్బుతో ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను స్థాపించి కొన్ని గ్రంథాలను ప్రచురించారు. అంతేకాక బంకించంద్ర ఛటర్జీ వ్రాసిన ఆనందమఠ్‌ ప్రసిద్ధ నవలను తెలుగులో ఆయన అనువదించారు. మాడవాటి తెలుగు, ఉర్దూ, పారశీక, ఇంగ్లీషు భాషలలో పండితులేకాక, మంచివక్త, రచయితగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత 1951లో హైదరాబాద్‌ నగర పురపాలక సంఘానికి మొదట మేయర్‌గా మాడపాటి ఎన్నికై నగరాభివృద్ధి కెంతో కృషి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌కు శాశ్వత సభ్యులుగా కొనసాగారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం హనుమంతరావుకు డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ మొదటి అధ్యక్షులుగా ఆరేళ్లు మాడపాటి కొనసాగారు. ఆంధ్రాభ్యుదయమే తమ జీవితంగా భావించిన మాడపాటికి భారత ప్రభుత్వం 1955 జనవరి 26న పద్మభూషణ్‌ బిరుదునిచ్చి సత్కరించింది. తెలంగాణాలో ఆంధ్రోద్యమంతోపాటు అనేక సాంఘిక, సామాజిక ఉద్యమాలకు సారథ్యం వహించి, ఆంధ్ర పితామహుడనే పేరు గాంచిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్‌ 11వ తేదీన 86వ ఏట తనువు చాలించారు.
    - డాక్టర్‌ నిమ్మాన దాస్‌

    కిం కర్తవ్యం? - మహాటీవీ చర్చా కార్యక్రమం (18.10.2011)

    చర్చాకార్యక్రమంలో పాల్గొన్న వారు : విశాలాంధ్రమహాసభ ప్రతినిధి శ్రీ పరకాల ప్రభాకర్, పౌరహక్కుల నేత  నేత శ్రీ హరగోపాల్

    (1)

    (2)

    (3)

    (4)

    (5)

    (6)

     
    (7)

    10, నవంబర్ 2011, గురువారం

    తెలుగు భాషా సముద్ధారకుడు సి.పి. బ్రౌన్

    213వ జయంతి సందర్భంగా

    ఆంధ్రభూమి సంపాదకీయ పేజి : తెలుగు భాషా సాహిత్యాలు అలనా పాలనా లేక నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన కాలంలో కారణ జన్ముడుగా అవతరించి, మిణుకు మిణుకుమంటున్న ఆంధ్ర సాహిత్యాన్ని స్నేహసిక్తం చేసి, ప్రజ్వలింప చేసిన సాహిత్య సముద్ధారకుడు సి.పి.బ్రౌన్. 1817నుండి మూడేళ్లపాటు ఉద్యోగ శిక్షణ పొందిన బ్రౌన్ 1820 ఆగస్టు 18, 20 తేదీల ప్రాంతంలో కడప కలెక్టర్ హన్‌బరీకి, రెండవ సహాయకుడిగా కడపలో కాలుమోపాడు.


    1820 ఆగస్టునుండి రెండేళ్లు కలెక్టరుకు సహాయకుడుగా పనిచేసిన తర్వాత 1822లో మచిలీపట్నంలో జిల్లా కోర్టు రిజిస్ట్రార్‌గా, రాజమండ్రిలో కలెక్టర్ మేజిస్ట్రేట్‌కు ప్రధాన సహాయకుడుగా పనిచేశాడు. 1826 జనవరి 10వ తేదీన జిల్లా కోర్టు రిజిస్టర్ (రిజిస్ట్రార్)గా చేరి 1829 ఫిబ్రవరి దాకా అసిస్టెంట్ జడ్జి, జాయింట్ క్రిమినల్ జడ్జిగా పనిచేశాడు. అప్పుడే కడపలో బంగళా మరియు తోట కొన్నాడు. పదేళ్లకి పైగా వాటిని తనస్వాధీనంలో ఉంచుకున్నాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి ఇచ్చిన లెక్కల మేరకు బ్రౌన్, బంగళా మరియు 15 ఎకరాల తోటను 3500 రూపాయ లకు కొన్నాడు. బంగళాలో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి తక్కిన భాగా న్ని పండిత మండలికి నివాసం కోసం ఇచ్చాడు. వివిధ ప్రాంతాలనుండి తెప్పించిన తాళపత్ర కావ్యాలను పరిశీలించి శుద్ధ ప్రతుల తయారీకి వారిని నియమించుకున్నాడు. వారి జీతభత్యాలను తన సొంత ఖర్చుతోటే భరించేవాడు. కడలో రెండు బడులను కూడా స్వంత పైకంతో నిర్వహించాడు.


    తాటాకుల్లో శిథిలమైపోతూ, కొన ఊపిరితో వున్న తెలుగు కావ్యాలను కాలగర్భంలో కలిసిపోకుండా పునరుద్ధరించిన మహనీయుడు బ్రౌన్. ఈ తెలుగు సాహిత్య పునరుత్థాన కార్యంలో బ్రౌన్ దొరకు సన్నిహితంగా కృషి చేసిన వారిలో అయోధ్యాపురం కృష్ణారెడ్డి, ధర్మపురం సుబ్బన్న, రావిపాటి గురుమూర్తి శాస్ర్తీ, వఠ్యం అద్వైత పరబ్రహ్మ శాస్ర్తీ, గరిమెళ్ల వెంకయ్య, జూలూరు అప్పయ్య, పాక బుచ్చయ్య శాస్ర్తీ మున్నగు వారు బ్రౌన్‌కు సహకరించారు. అత్యంత నిజాయతీపరుడు అయోధ్యా పురం కృష్ణారెడ్డి కూడా ఆయనకు అంతే సన్నిహితంగా మెలుగుతూ కడపలో బ్రౌన్ బంగళాలో నెలకొల్పిన గ్రంథాలయానికి ఆదర్శ గ్రంథపాలకునిగా వ్యవహరించాడు.


    1824లో మొదటిసారిగా, బ్రౌను వేమన పేరు విన్నాడు. వెంటనే వివిధ ప్రాంతాలనుండి 15 విభిన్న వ్రాత ప్రతులను తెప్పించుకున్నాడు. దాదాపు మూడువేల పద్యాలను సేకరించి వాటిలో 693 పద్యాలను నాలుగు భాగాలుగా విభజించి, ఇంగ్లీషులో అనువదించి 1829లో స్వయంగా ముద్రింపచేశాడు. నాలుగవ సంపుటంలోనివి అశ్లీలంగా ఉన్నందున వాటిని ప్రచురింపలేదని డాక్టర్ ఆరుద్ర రాశారు. ఈ విధంగా తెలుగు సాహిత్య కీర్తిని వేమన కీర్తితోపాటు విదేశాలకు విస్తరింపచేసిన మహాపురుషుడు సి.పి.బ్రౌన్. తెలుగు తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని కాగితాల కెక్కించి, శుద్ధ ప్రతులను తయారుచేయించి వ్యాఖ్యానాలు, పీఠికలు రాయించి అచ్చుకు సిద్ధపరచడం, కడపలోని బ్రౌన్ కళాశాలలో నాటి రోజుల్లో నిత్యం జరుగుతుండేది. తెలుగు ప్రబంధ మండలిలో ప్రత్యేక స్థానం ఆక్రమించిన వసుచరిత్రను పునరుద్ధరించి 1829, 30లో ములుపాట బుచ్చయ్యశాస్ర్తీ (కడప జిల్లా నందలూరు వాడు)చేత ప్రతిపదార్ధ వ్యాఖ్య సామాన్య పాఠకుడికి కూడా సులువుగా అర్ధమయ్యే రీతిగా వ్రాయించాడు. వసుచరిత్ర వ్యాఖ్యానానికి పీఠికా ప్రాయంగా, బ్రౌన్‌ను ప్రశంసిస్తూ పదిహేను పద్యాలు వ్రాశాడు.


    ఆనాడు రాజరాజ నరేంద్రుడు, నన్నయను పిలిచి తెలుగు భారతంను వ్రాయమని కోరినవిధంగా3‘‘సకల లక్షణ శాస్త్ర చక్రవర్తి శబ్ద శాసన సూత్ర సహిత వృత్తి లక్ష్య లక్షణ గురు లఘ వర్ణ గణవార్తికావృత్తి పద్వన్మతానువర్తి’’ అని బ్రౌన్ తదని వసుచరిత్ర విషయం చూడమన్నాడని చెప్పుకున్నాడు. బుచ్చయ్య వ్రాసిన అంకిత పద్యాలలో అత్యంత ప్రచులిత పద్యమిది.


    కం. నూర్లార్లు లెక్క సేయక
    పేర్లందించిన విబుధ జనుల బిలిపించుచువే
    మార్లర్థ మిచ్చు వితరణి
    చార్లిసు పిలిప్సు బ్రౌను సాహెబు కరుణన్


    అంకిత పాద్యల్లోని కవిత్వకైవారాలకు బ్రౌన్ ఉబ్బిపోలేదు. సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధంగా జూలూరు-అప్పయ్యశాస్ర్తీ చేత మరో వ్యాఖ్యానాన్ని (1832-34) వ్రాయించి దానినే ముద్రింప చేశాడు.


    బ్రౌన్ గుణపక్షపాతి. వ్యావహారిక భాషా వాదులలో అగ్రగణ్యుడు. 1825లో తెలుగు భారతాన్ని చదువ నారంభించానని, బ్రౌన్ తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నాడు. గ్రంథ పాఠాలను పూరించుకుంటూ, పాఠాంతరాలను గుర్తిస్తూ, అశ్వాసన విభజన గావించుకుంటూ పద్య సంఖ్య, మధ్యమధ్యలో కథకు అనుగుణంగా ఉపశీర్షికలు ఇచ్చుకుంటూ, శుద్ధ ప్రతిని రూపొందిస్తూ వచ్చాడు. ఈవిధంగా ఒక్కొక్క దశను దాటుకుంటూ, 18 పర్వాలకు శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చుపెట్టాడు. అప్పట్లో బ్రౌన్ నెల జీతం 500 రూపాయలు మాత్రమే.


    4జీవద్భాషను బోధించేవి పుస్తకాలు కావు నిత్యమూ, ప్రజా వ్యవహారంలో నుండే భాషే దానిని బోధిస్తుంది. న్యాయస్థానాలలో నేను పండితుడు మొదలుపామరుని వరకు సమస్తమైన వారితో మాట్లాడవలసి వచ్చేది. ముద్దాయి, సాక్షి, ఖైదీ, స్వదేశీయ న్యాయాధికారి, చదువురాని నౌకరు వీరందరూ, నాకు ఒక విధంగా ఉపాధ్యాయులే (బ్రౌన్ స్వీయ చరిత్ర-తెలుగు సేత నిడదవోలు వెంకటరావు భారతి, మే 1963, పుట 80) ప్రజల నాలుకపై పలుకుబళ్లను సామెతలను, చాటువులు కొల్లగా సేకరించాడు. 8 కథా కావ్యాలను, 41 ద్విపద కావ్యాలను సముద్ధరించాడు. 84 శతకాలను సేకరించాడు. వీటిలో పది శతకాలను ముద్రించాడు. బ్రౌన్‌కు నిఘంటు నిర్మాతగా అజరామరమైన పేరు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఐదు నిఘంటువులను కూర్చాడు. ఇంచుమించుగా సమస్త భారతీయ భాషలతో పరిచయమున్నవాడు బ్రౌన్. ఎన్నో లఘు రచనలు చేశాడు. మంత్రశాస్త్రం, శిల్ప శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం మున్నగు వాటి గురించి ఎన్నో వ్యాసాలు రచించాడు. ఛందోలంకార గ్రంథాలు రాశాడు. సంస్కృతంలో సౌందర్యలహరికి వ్యాఖ్యానం రాశాడు. ఆయన రచించిన తెలుగు వాచకాలకు అప్పట్లో విశేష ప్రచారం ఉండేది. బ్రౌన్, డేవిడ్ బ్రౌన్.. కాలే దంపతులకు రెండవ సంతానంగా 1798 నవంబర్ 10న కలత్తాలో జన్మించాడు. తండ్రి డేవిడ్ బ్రౌన్ కలత్తాలోని ఫోర్ట్ విలియమ్‌లో క్రైస్తవ మత ప్రచారకుడుగా ఉండేవాడు. అతడు బహుభాషా కోవిదుడు. తండ్రి చనిపోయేనాటికి బ్రౌన్ 14 ఏళ్లవాడు. తల్లి పిల్లలతో లండన్ వెళ్లగా బ్రౌన్ లండన్‌లోని హెయిల్‌బరీ కళాశాలలో చదువుకున్నాడు. వివిధ పదవులలో రాణించిన బ్రౌన్ చివరి దశలో లండన్ యూనివర్సిటీలో తెలుగు భాషాచార్యుడుగా పనిచేసి 1884 డిసెంబర్ 12న దివంగతుడయ్యాడు. బ్రౌన్ ఆంగ్లేయుడు. అవివాహితుడు. జీవితాంతం తెలుగు భాషా సాహిత్యాలు తన ఊపిరిగా జీవించిన యోగమూర్తి. ఆర్జించిన ప్రతి పైసాను, తెలుగు సాహిత్యోద్ధరణకు, పండిత పోషణకు, గ్రంథ ప్రచురణకు వినియోగించాడు. నిజానికి బ్రౌన్ తెలుగు సాహిత్య రంగంలో తొలి పరిశోధకుడుగా, గ్రంథ సంపాదకుడుగా కీర్తింపదగినవాడు బ్రౌన్. తెలుగునాట రవాణా సౌకర్యాలు, ముద్రణాలయాలు, అక్షర్యాత అంతంతమాత్రంగా ఉన్న కాలంలో తెలుగు వెలుగును దేశాంతర వ్యాప్తి కావించిన సాహిత్య యోగి బ్రౌన్. చాలా కాలం బ్రౌన్ అప్పులతో బతికాడు. ఒక ఆంగ్ల వ్యాపారి వద్ద అప్పులు తీసుకుని ప్రతి నెలా కంతులు చెల్లించేవాడు. తెలుగు సముద్ధరణ కోసం 60వేలు దాకా అప్పులు చేసి చివరకు అన్ని అప్పులు తీర్చినట్టు తన స్వీయ చరిత్రలో వెల్లడించాడు. బ్రౌన్ ఎన్నో త్యాగరాజ కృతులను సారంగపాణి పదాలను సేకరించాడు.


    బ్రౌన్ చేసిన సేవలను తెలుగువారు మరువలేదు. ఆ భాషా జీవి నివసించిన సాహిత్య యజ్ఞం జరిపిన స్థలంలో, ఆయన స్మృతి చిహ్నంగా కడపలో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం బ్రౌన్ గ్రంథాలయంలో 45,000 పైగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత, కన్నడ, ఉర్దు గ్రంథాలు అమూల్యమైన ఆంధ్ర పత్రిక ఉగాది సంచికలు ఉన్నాయి. దాదాపు 200 తాళపత్ర గ్రంథాలున్నాయి. బ్రౌన్ ట్రస్టు విజ్ఞప్తి మేరకు బ్రౌన్ గ్రంథాలయాన్ని 2006 నవంబర్‌లో కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించబడింది. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఏటా గ్రంథాలయ నిర్వహణకు రు.30 లక్షలు మంజూరు చేశారు. ప్రతి ఏటా సి.పి.బ్రౌన్ జయంత్యుత్సవాలను నవంబర్ 10న వైభవంగా నిర్వహిస్తూ పండితులను సత్కరిస్తున్నారు.

    -జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ

    8, నవంబర్ 2011, మంగళవారం

    కుహనా మేధావుల తప్పుడు రాతలు

    ప్రజల ఆకాంక్షల పేరుతో వల్లించే దుర్మార్గపు సిధ్ధాంతాలని, ప్రజా ఉద్యమాల పేరుతో జరిగే అవాంఛనీయ సంఘటనలని గంపగుత్తగా సమర్థించడం ద్వారా గుర్తింపు పొందాలనుకునే కుహనా మేధావుల కోవలోనే జ్వాలా నరసింహారావు ధోరణి ఉంది.

    ఆయన వ్యాసంలోని (ఆంధ్ర జ్యోతి నవంబరు 8) డొల్లతనాన్ని బయటపెట్టడానికి రెండే రెండు ఉదాహరణలు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణా అని ఆయన ఆవేశపడ్డారు. పౌర హక్కుల గురించి పెద్ద మాటలు మాట్లాడిన ఈయనకు, కనీసం తెలంగాణ ప్రాంత పౌరుల సంఖ్య ఎంతో కూడా తెలియదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్త్ర జనాభా 8.46 కోట్లు. అందులో కోస్తా ఆంధ్రలో 3.41 కోట్ల మంది, రాయలసీమలో 1.51 కోట్ల మంది, తెలంగాణాలో 3.52 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కోస్తా, రాయలసీమ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డవారి సంఖ్య చాలానే ఉంటుందనే విషయం అందరికి తెలుసు. అయినా జ్వాల గారు ఇంత నిస్సంకోచంగా సగటు తెలంగాణ రాజకీయ నాయకుడు మల్లే నాలుగున్నర కోట్ల ప్రజలని యధాలాపంగా ఎలా అంటారో సామాన్య పాఠకులకు వివరించాలి.

    ఇక రెండోది. టి ఆర్ ఎస్ మినహా మరే ఇతర పార్టీకి తెలంగాణాపై స్పష్టత లేదట. ఇంత గొప్ప సత్యం కనిపెట్టిన రాజకీయ విశ్లేషకుడుకి తెరాస వారు సన్మానం చేయాల్సిందే. ఇదెలా ఉందంటే ఈ దేశంలో ముస్లింలకు సంబంధించి మజ్లిస్ కీ, ముస్లిం లీగ్ కీ తప్ప, హిందువులకి సంబంధించి ఆర్ఎస్ఎస్ కీ, విశ్వ హిందూ పరిషత్ కీ తప్ప ఎవరికీ అవగాహన లేదని తీర్మానించడం లాంటిది. ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకొనే తెరాస నిజానికి మతతత్వ వాద పార్టీలకంటే ప్రజల మధ్య ఎక్కువ విషాన్ని చిమ్మింది. ఇది కూడా పౌర హక్కుల హననం కిందికి వస్తుందని ఇంత పెద్ద మేధావికి తెలియకపోవడం దురదృష్టం.

    7, నవంబర్ 2011, సోమవారం

    బూర్గుల విద్ర్రోహానికి హైదరాబాద్ నగర కాంగ్రెస్ చేయూత?

    విశాలాంధ్ర ఏర్పడాలని హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం

    రెండు రాష్ట్రాలయితే అభివృద్ధి దెబ్బతింటుందని, హైదరాబాద్ నగరం తన ప్రాధాన్యత కోల్పోతుందని, ఆరేళ్ళ దాక  విషయం తేల్చకుండా ఉంచవద్దని, వెంటనే విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ కార్యవర్గం అక్టోబర్ 27, 1955 న ఏకగ్రీవంగా తీర్మానించింది.

    వారి మాటలలోనే  
     "ఇప్పటి సంస్థానంలో కన్నడ,మరాఠి ప్రాంతాలు విడిపోయిన తరువాత చిన్న తెలంగాణ రాష్ట్రానికే ముఖ్య పట్టణంగా ఉంటే, హైదరాబాద్ నగరం ప్రతిపత్తి ప్రాముఖ్యం తగ్గడం మాత్రమేగాక, పౌరుల ఆర్థిక జీవనం బాగా దెబ్బతింటుంది. కాబట్టి, విశాలాంధ్ర సమస్యను ఆరేళ్ళ వరకూ తేల్చకుండా ఉంచక హైదరాబాద్ నగరాన్ని రాజధానికి, హైకోర్టుకు కేంద్రంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను ఇప్పుడే ఏకం చేయడానికి నిర్ణయించాలని ఈ కార్యవర్గంవారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు"



    ఆంధ్ర పత్రిక, అక్టోబర్ 29,1955






    6, నవంబర్ 2011, ఆదివారం

    'నేను మొదటినుంచీ విశాలాంధ్ర ఏర్పాటును కోరుకున్నాను' : బూర్గుల

    ఇంతకుముందే ఫజల్ అలీ నేతృత్వంలోని ఎస్సార్సీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన  తర్వాత  రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు 'విశాలాంధ్ర' ఏర్పాటు పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చదివాము ( http://visalandhra.blogspot.com/2011/11/blog-post_02.html )

    ఆ దిశలోనే హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు  అక్టోబర్ 28,1955న ఒక  ప్రకటనలో విశాలాంధ్ర తక్షణం ఏర్పడాలని, ఎస్సార్సీ సూచించినట్లుగా ఐదేళ్ళ వ్యవధి అనవసరమని అభిప్రాయపడ్డారు. 

    తాను మొదటినుండి విశాలాంధ్ర ఏర్పాటునే కాంక్షించానని చెబుతూ " హైదరాబాద్ను విడగొట్టిన తర్వాత తెలుగు ప్రాంతమంతా ఉండాలనే 1946 నుంచీ కూడా తాము అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు"

    ఆంధ్రపత్రిక, అక్టోబర్ ౩౦,1955