ఓ వైపు!..........
సలాం సలాం అని
గులాం గులాం చేస్తే
మారో మారో అని తెలుగోడి ప్రాణాలను హరిస్తే
పోరు బాటే మార్గమని
పోరు జెండా నెత్తుకుంటే
వల్లభుడె దిగి వచ్చి
నిజాం అంతు చూస్తే!.........
మరో వైపు!............
తెలుగు అన్నలందరిఫై
తెగబడి ఎగబడి
మద్రాసోడు మారణహోమం చేస్తుంటే
సహించలేక భరించలేక
మన పొట్టి అన్న
పట్టు బట్టి సాదించి తెలుగు అన్నలందరిని ఏకం చేస్తే!...
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
కదం తొక్కి విత్తువేసి
ఆఫ్రికా ఖండము నుండి అమెరికా ఖండము వరకు
అలుపెరగకుండా లంగరు వేసి
ప్రపంచములో ప్రచండ వేగముతో దూసుకెళ్తున్న
తెలుగోడిని చూసి చీడపురుగు చిదంబరానికి కన్ను కుట్టింది
చిలవలు పలవలుగా మన మద్య చిచ్చు పెట్టింది ...
తమిళము, మళయాళము, గుజరాతూ బేషరతు గా కలిసుంటే
మన తెలుగు అన్నలెందుకు తగవు లాడుకోడము
ఆ చిదంబరానికి బుద్ధి చెబుదాము!!
మన తెలుగోడి సత్తా చూపెడదాము!!!
వేంసాని రమణ
ఖమ్మం జిల్లా(స్వస్థలం)
పోర్ట్స్మౌత్, ఒహిఒ అమెరికా నిస్తలం
మదరాసు వాళ్ళు చేసిన మారణ హోమమేమితో రచయిత సెలవిస్తే విని తరించగలం.
రిప్లయితొలగించండిఖండ ఖండాంతరాలకు వ్యాపించి, ఆఫ్రికా (Kenya/Uganda), ఇంగ్లాండు (Leicester), అమెరికాలలో (Patel motels) దేశాలలో వందేళ్లుగా భారత జండా సత్తువ చాటి, మన దేశం నలు మూలలలోనూ (Tata, Ambani, Sarabhai etc.) నగారా మోగించిన గుజరాతీయులను విడిచి తెలుగు వాళ్ళ మీద పడ్డాదేమిటి చెప్మా పాపం చిదంబరం.
@Jai
రిప్లయితొలగించండిpaapam vadileyandi.pravaasaandhruniki T-alibaanula permission lekundaaa vedana chende sweccha ledanna niyamam teliyanattundi. yennenni maatalu anesaadu?Nalika kosi padeddaamante adi manaku andadu. adugupetta nivvamu, tiraganivvamu ane avakaasam ledu. aayana rashtraanni vadili petti chaanaallu ayinattundi. aa kootalu ikkada koosi vunte aayana intini gherao chesi padesevallamu. Telangana drohi ee saariki batikipoyaadu
>>> మద్రాసోడు మారణహోమం చేస్తుంటే
రిప్లయితొలగించండిప్రాసకు బానే కుదిరిందికాని సత్యానికి చాలా దూరంగా ఉంది.
రమణగారి ఆవేదన అర్ధవంతమే అయినా అతిశయోక్తులు వద్దని మనవి.
@Chaitanya:
రిప్లయితొలగించండిఈయన అబద్ధాలు రాయడానికి ఇతరుల దౌర్జన్యానికి సంబంధం ఏమిటి?
If his delusions on the so called Tamil atrocities & conspiracy theiries make him feel happy, so be it.