- జై తెలంగాణా నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రి గారు తక్షణ చర్యలు చేపట్టాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కే.సి.ఆర్ ( 26.02.1997)
"ఎవరి ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో , రాయలసీమ లో ఉద్యమాల కోసం ఏదో సమితి అనేది పెడుతున్నారు. రాయలసీమ లో రాయలసీమ విమోచన సమితి, రాయలసీమ పోరాట సమితి, తెలంగాణ ప్రజా సమితి ఈ విధంగా అనేక పేర్లతో సమితి నాయకత్వాన ఉద్యమం చేపట్టే ఉద్యమకారుడు ఏదైనా ఉద్యోగం లభించినట్లయితే ఆ ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు కాని వారికి హోదా వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించరు. పలు నినాదాలు వస్తున్నాయి. ఇందాక హౌస్ లో దామోదరరెడ్డి గారు స్లోగన్ తో సహా జైతెలంగాణ అని కూర్చున్నారు. ఈ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రిగారు తక్షణ చర్యలు చేపట్టాలి."
- జోనల్ సిస్టం రద్దు చేయాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కే.సి.ఆర్ ( 18.07.1996)
" ఈ ఉద్యోగులుకు సంబంధించి అధ్యక్ష్యా! సిక్స్ పాయింట్ ఫార్ములాలు, తర్వాత జోనల్ సిస్టం లు పెట్టుకొని మనం కొంచెం దెబ్బతింటున్నాము అధ్యక్ష్యా! ఎక్కడైనా ప్రాజెక్టు కింద స్టాఫ్ మిగిలిపోతే వారిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసలుబాటు ఉండాలి అధ్యక్ష్యా! కానీ అటువంటి విధానం లేదు. కొన్ని మనకుగా మనం విధించుకున్న ఆంక్షల వల్ల, నిబంధనలవల్ల, జోనల్ సిస్టం వల్ల, సిక్స్ పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతున్నాము.... .....ప్రభుత్వం డైనమిక్ గా మువ్ కావాలని చెప్పి అవసరమైనప్పుడు నాయకులతో, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోగాని, ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ జోనల్ సిస్టం లను, మనకి అవరోధంగా ఉన్న విషయాలను తొలిగించుకొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్బంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష్యా!"
- ఒకప్పుడు తెలంగాణవాదిని -ఇప్పుడు సమైక్యవాదిని : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నాగం జనార్ధనరెడ్డి (22.08.1988)
"ఆనాడు దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ నాయకులు ఈ ఉద్యమంలో చేరి దాదాపు 350 మందిని పొట్టన పెట్టుకొని సాధించింది ఏమిటంటే ఈ సుధాకరరావుగారు కాని, లేక కీర్తిశేషులు రాజారాం గారు కాని,మదన్ మోహన్ గారు గానీ మంత్రులయ్యారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.కాని మేము మాత్రం రెండున్నర సంవత్సరాలు విద్యను పోగొట్టుకొని జైలుకు వెళ్లాం.లాఠీ దెబ్బలు తిన్నాం.దాని తర్వాత కూడా ఈ రోజు తెలంగాణ గురించి ఈ రకంగా చర్చ రావడం బాధాకరంగా ఉంది.....ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ప్రగతి ఉంటుందని విశ్వసిస్తున్నాను."
- కోస్తా మహానుభావులే మాకు చదువు నేర్పారు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దేవేందర్ గౌడ్(17.05.2005)
"మా పరిస్థితి ఎలా ఉండేదంటే మాకు చదువు నేర్పేవారే లేకుండా పోయారు. నిజానికి నేను చెబుతున్నాను. నిజమైన హృదయంతో చెబుతున్నాను. కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన మహానుభావులే మాకు చదువు నేర్పారు. నాకు తెలిసిన ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయనకు పాదాభివందనం చేయాలి. రెండు పూటలా తిండిలేకుండా ఉపాధ్యాయులు ఎక్కడినుంచో కాకినాడ, గుంటూరునుంచి ఇక్కడికి వచ్చి మాకు చదువులు నేర్పారు.ఇక్కడ ఉండే మహానుభావులు మాకు చదువు నేర్పలేదు. ఆ రోజు రాజకీయ నాయకత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళకు చదువు చెప్పాలని ఏనాడైనా మానవత్వంతో ఆలోచన చేసారా?అని అడుగుతున్నాను.కోస్టల్ ఏరియాకి వెళితే అక్కడ ఊరికిగాని కొన్ని ఊర్లకు కలిపిగాని మెమోరియల్ స్కూల్స్ ఉండటం మనకు అక్కడక్కడ కనపడతాయి. వాళ్ళ పెద్దల పేరుతో స్కూల్స్ పెట్టి అక్కడి ప్రజలకు చదువు నేర్పాలనే తపన అక్కడి రాజకీయ నాయకత్వానికి ఉంది. ఇక్కడి రాజకీయ నాయకత్వానికి ఏమి రోగం అధ్యక్షా?.."
- ముసలివాళ్ళకి విడాకులు ఇప్పిస్తారా?: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కడియం శ్రీహరి(29.03.2005)
నెహ్రూ చెప్పి ఉంటారు. నాకు తెలియదు ....1956 లో పెళ్లి జరిగితే అప్పుడున్న అత్త ఎవరు అధ్యక్షా? ఇప్పుడు 2003 లో ఉన్నాము . దాదాపు 47 సంవత్సరాలు జరిగిపోయింది. వాళ్ళే కదా అధ్యక్షా అత్తలు. 1956 లో నవదంపతులైనవారికి పిల్లలు పుట్టారు. మనవలూ పుట్టారు.ఇప్పుడు సమస్యలు విడాకులు అని వారు అంటున్నారు.కాంగ్రెస్స్ పార్టీ పాలసి ఏమిటి అధ్యక్షా? ముసలివారికి విడాకులు ఇప్పిస్తారా? ఆ ముసలివారికి రాజశేఖర రెడ్డి మామగా ఉంటారా?ఇది ఏమిటి అధ్యక్షా?
శాసనసభ చర్చ వివరాలకు ‘ప్రాంతీయ ఉద్యమాలు పదవీరాజకీయాలు’ బై కొమ్మినేని శ్రీనివాసరావు చూడండి
రిప్లయితొలగించండివీలైతే ఆయా పేపర్ కటింగ్స్ అందుబాటులో ఉంటే సైట్లో పెట్ట గో్రతాను.
రిప్లయితొలగించండి