విశాలాంధ్ర ఏర్పడాలని హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం
రెండు రాష్ట్రాలయితే అభివృద్ధి దెబ్బతింటుందని, హైదరాబాద్ నగరం తన ప్రాధాన్యత కోల్పోతుందని, ఆరేళ్ళ దాక విషయం తేల్చకుండా ఉంచవద్దని, వెంటనే విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ కార్యవర్గం అక్టోబర్ 27, 1955 న ఏకగ్రీవంగా తీర్మానించింది.
వారి మాటలలోనే
"ఇప్పటి సంస్థానంలో కన్నడ,మరాఠి ప్రాంతాలు విడిపోయిన తరువాత చిన్న తెలంగాణ రాష్ట్రానికే ముఖ్య పట్టణంగా ఉంటే, హైదరాబాద్ నగరం ప్రతిపత్తి ప్రాముఖ్యం తగ్గడం మాత్రమేగాక, పౌరుల ఆర్థిక జీవనం బాగా దెబ్బతింటుంది. కాబట్టి, విశాలాంధ్ర సమస్యను ఆరేళ్ళ వరకూ తేల్చకుండా ఉంచక హైదరాబాద్ నగరాన్ని రాజధానికి, హైకోర్టుకు కేంద్రంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను ఇప్పుడే ఏకం చేయడానికి నిర్ణయించాలని ఈ కార్యవర్గంవారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు"
ఆంధ్ర పత్రిక, అక్టోబర్ 29,1955 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి