ప్రజల ఆకాంక్షల పేరుతో వల్లించే దుర్మార్గపు సిధ్ధాంతాలని, ప్రజా ఉద్యమాల పేరుతో జరిగే అవాంఛనీయ సంఘటనలని గంపగుత్తగా సమర్థించడం ద్వారా గుర్తింపు పొందాలనుకునే కుహనా మేధావుల కోవలోనే జ్వాలా నరసింహారావు ధోరణి ఉంది.
ఆయన వ్యాసంలోని (ఆంధ్ర జ్యోతి నవంబరు 8) డొల్లతనాన్ని బయటపెట్టడానికి రెండే రెండు ఉదాహరణలు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణా అని ఆయన ఆవేశపడ్డారు. పౌర హక్కుల గురించి పెద్ద మాటలు మాట్లాడిన ఈయనకు, కనీసం తెలంగాణ ప్రాంత పౌరుల సంఖ్య ఎంతో కూడా తెలియదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్త్ర జనాభా 8.46 కోట్లు. అందులో కోస్తా ఆంధ్రలో 3.41 కోట్ల మంది, రాయలసీమలో 1.51 కోట్ల మంది, తెలంగాణాలో 3.52 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కోస్తా, రాయలసీమ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డవారి సంఖ్య చాలానే ఉంటుందనే విషయం అందరికి తెలుసు. అయినా జ్వాల గారు ఇంత నిస్సంకోచంగా సగటు తెలంగాణ రాజకీయ నాయకుడు మల్లే నాలుగున్నర కోట్ల ప్రజలని యధాలాపంగా ఎలా అంటారో సామాన్య పాఠకులకు వివరించాలి.
ఇక రెండోది. టి ఆర్ ఎస్ మినహా మరే ఇతర పార్టీకి తెలంగాణాపై స్పష్టత లేదట. ఇంత గొప్ప సత్యం కనిపెట్టిన రాజకీయ విశ్లేషకుడుకి తెరాస వారు సన్మానం చేయాల్సిందే. ఇదెలా ఉందంటే ఈ దేశంలో ముస్లింలకు సంబంధించి మజ్లిస్ కీ, ముస్లిం లీగ్ కీ తప్ప, హిందువులకి సంబంధించి ఆర్ఎస్ఎస్ కీ, విశ్వ హిందూ పరిషత్ కీ తప్ప ఎవరికీ అవగాహన లేదని తీర్మానించడం లాంటిది. ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకొనే తెరాస నిజానికి మతతత్వ వాద పార్టీలకంటే ప్రజల మధ్య ఎక్కువ విషాన్ని చిమ్మింది. ఇది కూడా పౌర హక్కుల హననం కిందికి వస్తుందని ఇంత పెద్ద మేధావికి తెలియకపోవడం దురదృష్టం.
out of 3.5 crore telangana population, only 2 crore people may opt for separation,the concept is totally wrong. To be exact it formation of Coastal ans ceded state, not t-state,why they have not divided AP in 1972, why now? they wants to eat Hyderabad fruits, trouble the people of the other regions. They are talking about demerger!T- state was never there before!
రిప్లయితొలగించండిమద్రాస్ నుంచి అంధ్ర ఎందుకు విడిపోయింది అనే విషయమ్లో కారణాలు సమైక్య వాదులు తెరాసకి ధీటుగా-సరిగా చెప్పడం లేదు.Discrimination ఒక్కటే కాదు...ముఖ్య కారణం- తమిళులకి ఆంధ్రులకి భాషలో, సంస్కృతిలో పోలికే లేదు.తెలంగాణ వాదులకి ఏం మాయ రోగం వచ్చింది? రెండు ప్రాంతాల్లో ఉన్న భాష-వేషం-కులాలు ఒక్కటే! తెలంగాణ వాదుల నిఘంటువులో ఊత పదాలు-4.5 కోట్ల ప్రజలు. నీళ్ళు,ఉద్యోగాలు,భూములు,సంస్కృతి దోచేసారు.
రిప్లయితొలగించండితె.వాదుల నిస్సిగ్గుతనానికి తెలంగాణ ప్రజల అమాయకత్వం తోడవ్వటమూ, ప్రభుత్వాల నిర్లిప్తత, రాజకీయ పార్టీల అవకాశవాదం, సమైక్యవాదుల చేతగాని తనం ఈ పరిస్థితులకు కారణం అని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండినిజాం నవాబులు దారుణంగా తొక్కిపెట్టిన సుమారు 150 ఏళ్ల ' స్వతంత్ర' బానిసత్వ చరిత్ర తప్పితే ఇప్పుడు వేర్పాటువాదులు ప్రచారం చేసే ప్రత్యేక అస్తిత్వం,సంస్కృతి వగైరా మన్నూమషానాలకు ఇంకో వనరు, ప్రాతిపదికే లేదు. కాగా ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభ, అవిభక్త కమ్యూనిస్టు పార్టీ (నేటి అవకాశవాద పార్టీలు-గ్రూపుల లాంటిది కాదు), నాటి నిస్వార్థ హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు (నేటి స్వార్థపర అవినీతిమయ కాంగ్రెసు, దాన్నుండి పుట్టుకొచ్చిన వివిధ కంపుగొట్టే కుక్కగొడుగుల వంటిది కాదు) ల ఆధ్వర్యంలో చెలరేగిన మహోజ్వల సాంస్కృతిక, భాషాపర పునరుజ్జీవనోద్యమ, సాంఘిక ఆర్థిక విప్లవోద్యమం, ముక్కోటి ఆంధ్రుల్ని ఒక్కటిగా చేయాలని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నెలకొల్పాలను తెలుగుతల్లి బిడ్డలం, తెలంగాణ వీరులమంటూ అశేష తెలంగాణా కర్షక కార్మిక ప్రజలు చేసిన మహత్తర నిజాం వ్యతిరేక, ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాల సాంప్రదాయాలు, విజయాలే తెలంగాణా అసలు సంస్కృతి, ఆత్మగౌరవాలు.
రిప్లయితొలగించండి