22, నవంబర్ 2011, మంగళవారం

స్నేహపూరితమైన వాతావరణంలో ఎవరితోనైనా మేము చర్చకు సిద్ధం : విశాలాంధ్రమహాసభ

'ప్రచురణార్థం'  అంటూ ఎవరో  'తెలంగాణ నెటిజెన్స్ ఫోరం' పేరుతో నున్న ఈ  క్రింది లేఖను విశాలాంధ్రమహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ గారి ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేయడం జరిగింది.

 


దీనిని TNF నుండి చర్చకు రమ్మని అందిన ఆహ్వానంగా విశాలాంధ్రమహాసభ భావిస్తుంది.వారి లేఖకు మా ప్రత్యుత్తరాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము


తెలంగాణా నెటిజెన్స్ ఫోరం వారికి,

పరకాల ప్రభాకర్ వినమ్ర నమస్కారములు.

మీ బహిరంగ లేఖ చూసాను. చాల సంతోషం.


విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాలు, మా ప్రసంగాలు, రచనలూ, పత్రికా ప్రకటనలూ, మేము నిర్వహిస్తున్న సదస్సులను మీరు ఆసక్తితో గమనిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.


మేము ఎప్పుడూ ఎక్కడా తెలంగాణా ప్రజలకు, ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అటువంటి భావన మీకు కలిగి ఉంటే అది సరిఅయినది కాదు అని నేను స్పష్టంగా చెప్పగలను.


ఆ మాటకొస్తే మేము ఏ ప్రాంతానికి, ఏ ప్రాంత ప్రజలకీ వ్యతిరేకం కాదు. మేము విశాలాంధ్ర కొనసాగాలనే అభిమతం కలవాళ్ళం. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి చెప్పాలంటే మేము విభజన కోరే వారికి కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. మా వ్యతిరేకత కేవలం విభజన వాదం పట్ల మాత్రమే. విభజన వాదుల పట్ల ఏమాత్రం కాదు.


విభజన వాదం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్నదని మా అభిప్రాయం. విభజన వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు. అలాగే సమైక్య వాదం అన్ని ప్రాంతాలలోనూ ఉంది. సమైక్య వాదులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు.


మేము సమైక్య వాదాన్ని బలపరిచే వాళ్ళం. విభజన వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళం. మాకు విభజన వాదుల పట్ల కించిత్తైనా అగౌరవం లేదు. వారి వాదన వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో, స్వార్ధ ప్రయోజనాలో ఉన్నాయని మేము అనుమానించడం లేదు. వారి వాదనతో మేము ఏకీభవించలేకపోతున్నాము.


అంతే.


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి గురించి మా దృక్పథం క్లుప్తం గా మీ ముందు ఉంచుతాను. రాష్ట్రం కలిసి ఉండాలా లేక విభజన జరగాలా అన్నదాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ రెండు వాదాలు వినపడ్డాయి. అంతకు ముందూ వినపడ్డాయి. 1956 లో ఉన్నాయి. 1969 లో ఉన్నాయి. 1972 లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఒకో సారి ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమయ్యింది. కాని అక్కడే దానికి వ్యతిరేకమైన భావన, అభిప్రాయం లేకపోలేదు. ఒకో సారి ఒకో ప్రాంతంలో ఉద్రేకాలు ఎక్కువగా మరో ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. గత అరవై సంవత్సరాల చరిత్ర మనకు తెలియ చేసేది అదే.


జరిగిన ఆందోళనలు ప్రాంతాల మధ్య జరిగిన వివాదాలు గా కాకుండా విభజన-సమైక్య వాదాల మధ్య జరిగిన, జరుగుతున్న భావజాల సంఘర్షణ గా చూడడం సరైనదని మా భావన.


ఈరోజు కూడా పరిస్థితి అదే. కోస్తా రాయల సీమలలో విభజనకు మద్దతు పలికే వారున్నారు. తెలంగాణలో ఉన్నారు. అలాగే ఆ రెండు ప్రాంతాలలో కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. తెలంగాణా లో కూడా కలిసి ఉండాలి అనేవారు ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక సారి ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమయ్యింది. మరొక సారి మరొక ప్రాంతంలో మరొక భావన బలంగా వ్యక్తమయ్యింది.


మా విశాలాంధ్ర మహాసభ లోనే అనేక మంది సభ్యులు తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వారితో పరిచయమయ్యే అవకాశం మీకు తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.


వారు గాని, నేను గాని పదే పదే చేసుకునే విజ్ఞప్తి ఏమిటంటే, ఐక్యం గా ఉండడానికి మా దగ్గర ఉన్న వాదన ఏమిటి, విడిపోవడానికి ఇవాళ వినిపిస్తున్న వాదన మాకు ఎందుకు అంగీకార యోగ్యం కాదు అనే మాట బహిరంగంగా పది మందికీ చెప్పుకునే అవకాశం మాకు కావాలని. మా మాటలు చెప్పుకోకుండా మమ్మల్ని అడ్డుకోవద్దని. మా అభిప్రాయాలతో మీరు ఏకీభవించక పోయినా మా మాటలు చెప్పుకునే హక్కును మమ్మల్ని అనుభవించనివ్వండి అని.


మా భావాలను ఎవరి మీద రుద్దే ఉదేశ్యం మాకు లేదు. ఎవరూ ఎవరి మీద తమ అభిప్రాయలు రుద్ద లేరు. అలా జరగ కూడదు కూడా. మా అభిప్రాయాలు వెల్లడి చేసిన తరువాత ఎవరి నిర్ణయాలు వారు చేసుకో వచ్చు. ఎవరి అభిప్రాయలు వారు ఏర్పరుచుకోవచ్చు. కాని మేము మా వాదన, అభిప్రాయం చెప్పడానికే వల్లకాదంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మా అభిప్రాయం.


మేము చేసేది అభ్యర్ధన. ఒక విజ్ఞప్తి. దానిని అలాగే చూడండి. అభిప్రాయాలను వ్యతిరేకించినా అవి వెల్లడి చేసుకునే స్వేచ్ఛను మీరు వ్యతిరేకించరనే విశ్వాసం మాకుంది.


మా అభిప్రాయాలు చెప్పుకునే వేదిక మాకు కల్పించడానికి మీరు ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీరు తీసుకున్న చొరవ మీలో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి కి అద్దం పడుతోంది.


మన సమావేశం ఎలా జరగాలి, సమావేశానికి ఎవరు సమన్వయకర్తగా వ్యవహరించాలి, దాని విధివిధానాలు ఎలా ఉండాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో జరగాలి అనే విషయాల మీద మనం మాట్లాడుకుని నిర్ణయించుకోవచ్చు.


ఈ విషయంలో మీరు మా విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ నలమోతు చక్రవర్తి గారితో సంప్రదింపులు జరిపితే ఉచితంగా ఉంటుందని నా భావన. వారు కూడా మీతో సంప్రతింపులు జరపడానికి చాల ఇష్ట పడతారు. వారికి మీరు contact@visalandhra.org ద్వారా వర్తమానం పంపవచ్చు.


మనం త్వరలోనే, ఇరువురికి సదుపాయంగా ఉండే చోట, రోజు, సమయానికి కలుసుకుని చక్కటి నాగరిక, స్నేహపూరితమైన వాతావరణం లో మన ఆలోచనలను పంచుకోవచ్చు.


ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను.



ఇట్లు,
భవదీయుడు,
పరకాల ప్రభాకర్

11 కామెంట్‌లు:

  1. పరకలా గారు , గొరటి వెంకన్న మరియు దలిత కవులు అందరు విజయవాడ లొ సభ పెటుకుందము అంటె మీ అంధ్ర వాలు గడబడి చెసారు. ముందు మీవలని అదగండి ఎందుకు బూక్ చెసినా హల్ల్స్ ఇవ్వకుండ అపారు . జై అంధ్ర సభలు ఎందుకు అంధ్ర లొ జరగదం లెదు . ఆ తరువత మాకు చెప్పుదురు .
    ఎదుటి వాడికి చెప్పెందుకె నీతులు ఉన్నాయి

    రిప్లయితొలగించండి
  2. "ఎదుటి వాడికి చెప్పెందుకె నీతులు ఉన్నాయి "

    అడ్డంగా వాదించడంలో మనదేమీ పోదులెండి. వేర్పాటువాదులు పదేళ్ళుగా నోటికొచ్చినట్టు వాగుతూనే ఉన్నారు. ఉద్యమాలు పేరుతో అడ్డు అదుపు లేకుండా వసూళ్లు చేసుకున్నారు,ఎన్నో బందులు చేయించారు , ఎన్నో బస్సులు తగలేశారు. టీవీ చానల్స్ ను బెదిరించి ప్రసారాలు నిలిపివేయించి మరీ బ్లాక్మైలింగు పాల్పడ్డారు.గత రెండేళ్ళుగా ఎవరూ నోరెత్తినా వారిని నయానో బయానో బెదిరించి, ఇంటి ముందు ధర్నాకు దిగో, రాళ్ళూ వేసో నోర్లు మూయించారు, బుక్ రిలీజ్లను అడ్డుకున్నారు, ప్రముఖ బుక్ షాప్ వాళ్ళు బెదిరిపోయి పుస్తకాలు ప్రదర్శించడానికి కూడా భయపడేలా చేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సంఘటనలు ఒక్కొకోటి చేర్చి అనంతమైన లిస్టు తయారుచేయొచ్చు. సిగ్గు లేకుండా వీటినన్నిటిని సమర్ధించడానికి ఎన్నాళ్ళు విజయవాడ కథ చెబుతారు? ఆ సంఘటన ఎప్పుడు జరిగింది? రాష్ట్ర రాజధానిలో లక్ష సంఘటనలు జరిగిన తర్వాతా? ప్రజలు విడిపోయి విద్వేషాలు పెంచుకుంటే చూసి ఆనందించాలి గదా మనం?వేర్పాటువాదుల పదేళ్ళ విషప్రచారం ఫలితాలనిస్తుంది అని ఆనందిన్చాల్సింది పోయి ఎందుకు బాధ పడతారు? మీ బాధ చూసి గద్దరు, వీ హన్మంతరావు, కొండ లక్ష్మణ్ మొదలైన వారు అభద్రతాభావం తో పర్యటనలు ఆపుకొంటారు. ఇక్కడ చదువులు తగలబడుతున్నాయి అని అక్కడకు వెళ్ళిన విద్యార్థులు అభద్రతకు లోనవుతారు. ఇక్కడ తెరాసకు చెందని ప్రజాప్రతినిధులకు స్వేచ్చగా తిరిగేందుకు దిక్కులేదు కదా! ఎప్పుడు ఏ కిరాయిగూండా మూక దాడిచేస్తుందో అని రాష్ట్ర మంత్రలు రెండు నెలలు పాటు తమ జిల్లాల వైపు కన్నెత్తి చూడలేదు కదా! మీకు నీతులు చెప్పే వారు ఎవరండీ?దానికి ముల్లః ఒమర్ తాతలు దిగిరావాలి

    రిప్లయితొలగించండి
  3. కదా కబట్టీ ముక్=సుకొని కుసొండి.... .

    రిప్లయితొలగించండి
  4. "కదా కబట్టీ ముక్=సుకొని కుసొండి.... ."

    ఏం పాపం? అసత్యాలతో కూడిన మోసపూరిత వాదనలు ఇదివరకలా చెల్లుబాటు కావేమోనన్న దిగులా? ఎదుర్కొనే ధైర్యంలేదా? ఉద్యమకారులు వసూళ్లు చేసుకోవడానికే తప్ప దేనికీ పనికిరారా? అంత పనిమాలిన వాళ్ళు రోడ్లమీద పడడం దేనికి? వాళ్ళే మూసుకొని కూర్చుంటే బాగుంటుందేమో ఆలోచించండి.అయినా మూసుకోమని చెప్పడానికి నువ్వెవడివి నేనెవడిని? కచారగారిని చూడండి. ఆయనకు ఎవరైనా ఆ మాట చెబితేనే పాటిస్తున్నాడా?

    రిప్లయితొలగించండి
  5. "వారి వాదన వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో, స్వార్ధ ప్రయోజనాలో ఉన్నాయని మేము అనుమానించడం లేదు"

    Previous statements from Prabhakar (Chakravarthy is more open in his accusations).

    "Voices of separatism are loud, shrill, abusive and disruptive. They are a cacophony."

    "Telangana agitators succeeded in simplifying enough to engender hate"

    "We can identify several leaders whose love for Telangana is dubious. And yet they are in the forefront of the present agitation for a Separate Telangana State."

    "An agitation which feels insecure and knows it’s inner hollowness cannot muster that kind of courage and grace. Instead it tries to cover up and become dogmatic and rigid. It cannot face a simple and a very plain fact that goes against it’s grain. It tries to deceive the people. And in the process, deceives itself."

    రిప్లయితొలగించండి
  6. "వారి వాదన వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో, స్వార్ధ ప్రయోజనాలో ఉన్నాయని మేము అనుమానించడం లేదు"

    Look what Nalamotu Chakravarthy writes. This is just one example, his entire case is built on accusing Telanganavadis of falsehood, deceipt, hatred & mindlessness.

    "The separatist movement is not based on convictions. The movement is not run for the betterment of peoples’ lives. It is built for political fruits by opportunist politicians. To further their goal, they have spread hatred, and lies among people. People have just followed the leaders like sheep without questioning the veracity of their arguments."

    రిప్లయితొలగించండి
  7. "Look what Nalamotu Chakravarthy writes. This is just one example, his entire case is built on accusing Telanganavadis of falsehood, deceipt, hatred & mindlessness."

    And he proved it very well. Replace Telanganavadis with separatists. Telangaganavadis need not be separatists. Whenever you are in doubt think of Swargiya Raavi Narayanareddy.

    రిప్లయితొలగించండి
  8. "కచారగారిని చూడండి. ఆయనకు ఎవరైనా ఆ మాట చెబితేనే పాటిస్తున్నాడా?"

    ఇక్కడ మాటలను చదివారో ఏమో! కచార గారు పార్లమెంట్ లో "నుంచొని" మరీ అలజడి సృష్టిస్తున్నారట

    రిప్లయితొలగించండి
  9. @Chaitanya:

    Chakravarthy's case of అబద్ధాల పునాది పై తెలంగాణా వేర్పాటువాదం is premised on assumption that "విభజన వాదుల వాదన వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో, స్వార్ధ ప్రయోజనాలో ఉన్నాయి". This is diametrically opposite to Prabhakar's assertion.

    Please try to avoid raising Ravi Narayana Reddy to a saint status. He may be a great man but that does not mean he was right always.

    రిప్లయితొలగించండి
  10. "Chakravarthy's case of అబద్ధాల పునాది పై తెలంగాణా వేర్పాటువాదం is premised on assumption that "విభజన వాదుల వాదన వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో, స్వార్ధ ప్రయోజనాలో ఉన్నాయి"

    I am saying that he very well proved it in his book. How can you term it an assumption?

    I can't understand how Prabhakar gaari words are in contrast to Chakravarthy gaari's assertion that separatist arguments are not based on facts. Don't read too much between the lines.

    రిప్లయితొలగించండి
  11. Chakravarthy says "you are telling lies". Prabhakar says "I am not accusing you of telling lies".

    రిప్లయితొలగించండి